🙏🕉️ హరిఃఓం 🕉️🙏
పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(279వ రోజు):--
చిన్మయ ఉవాచ :-
--బ్రహ్మచారులు--
సమాజానికి సేవ చేయండి. మిగిలిన విషయాలు వేటినీ పట్టించు కోవద్దు. సమాజసేవ లోనే మీకు తృప్తి కలగాలి. మీరు చేసిన పనినీ, మీరు చేసిన సేవనూ మీరు విశ్లేషిస్తే, ఇంకా బాగా ఎలా పనిచేయాలో, ఇంకా బాగా ఎలా సేవ చెయ్యాలో, మిమ్మల్ని మీరు ఇంకా బాగా ఎలా బాగు పరుచుకోవాలో మీకే తెలుస్తుంది అంతే !
ఇతరులకు బోధించిన ఆదర్శ జీవన విధానంలోనే మీరు కూడా జీవిస్తే తప్ప, మీ మాటల వల్ల ఇతరు లపై ప్రభావం ఉండదు. అలా జీవించక పోతే, మీ మాటలకు విలువే ఉండదు. అవి ఒట్టి చప్పుళ్ళు మాత్రమే ! అందుకే, సాధనలో సక్రమంగా జీవించడం అలవరచుకోవాలి. బాహ్య ప్రపంచం తో మీకున్న అనుబంధాలూ, బాహ్య ప్రపంచానికి చెందిన విషయాల్లో మీ స్పందనలూ నీతివంతంగా, మంచి విగా ఉండేటట్లు జాగ్రత్తపడండి. అప్పుడే మీ మాటలకు తగిన విలువ ఉంటుంది.
ఇక వెళ్లి, సందేశాన్ని అందరికీ అందించండి. మరో విద్యార్ధి బృందం రాబోతోంది ; వారికి శిక్షణ మొదలు పెడతాం. వారికి మిమ్మల్ని చూపించి, "ఎంత మంచిపని చేస్తు న్నారో చూడండి, మీరు కూడా అలా చెయ్యాలి" అని మేం చెప్పగలగాలి.
ఇకనుండి భగవంతుడే మీకు చేయూత నిస్తాడు ; మీ అర్హతను బట్టి మీకు దక్కాల్సినది మీకు దక్కేలా చేస్తాడు. దెబ్బలే మీకు తగినవైతే, మిమ్మల్ని తన్నాలనే ప్రేరణ ప్రజలకు కలుగుతుంది! పట్టరానంత ప్రేరణ కలుగుతుంది ! మీరు మంచివారైతే, అదే జనానికి మిమ్మల్ని అమితంగా పొగడాలని పిస్తుంది. ఇదంతా ఆధార పడేది మీ పైనే ! సంస్థ చేయ గలిగినదేమీ లేదు. మీరెక్కడకు వెళ్లినా ఆసరాగా ఉండటానికి సంస్థ కు వీలు కాదు. భారమంతా మీదే. దివ్య జీవనం ఎలా గడపాలో మీకు బోధించ బడింది. ఆవిధంగా జీవించ టానికి ఇకమీదట ప్రయత్నించండి.
మీరు సమాజానికి ఎంత ఇవ్వగలరో దానిని బట్టే మీ ఎదుగు దల ఉంటుంది ; దానిని అనుసరిం చే సమాజపు స్పందన కూడా ఉంటుంది. సమాజం ఇచ్చిన దానిని మీరు వెంటనే తిరిగి ఇచ్చివేయాలి. ఈ ఆట ఇలానే కొనసాగాలి. అందు చేత, మీవద్ద ఏమీ ఉంచుకోకండి. అంతా వచ్చిన చోటికే పోవాలి - కాని అది జరగాల్సినది సమాజానికి ఉపయోగ పడే సృజనాత్మకమైన రీతిలో.
మహా సమాధికి నెల రోజుల ముందు స్వామీజీ తన లక్ష్యం గురించి ఆఖరిసారి వ్రాశారు. తన తదనంతరం చిన్మయమిషన్ సభ్యులు ఎలా కొనసాగాలో స్పష్టంగా నిర్దేశిస్తూ స్వామీజీ వ్రాసిన వ్యాసం ఆగస్టు 16, 1993 న తపోవన్ ప్రసాద్ సంపాదకునికి చేరింది.
చిన్మయ ఉవాచ :-
--చిన్మయ సంస్థల ధ్యేయం--
భగవంతుడు తనకు తానుగా ఏదీ చేయడు. అతడు అకర్ముడు. ప్రపంచాన్ని బాగు చేయటానికి మానవులే శ్రమించాలి. కాని, మనుష్యు లకు తమంత తాము ఏదీ చేసే శక్తిలేదు. వారికి భగవంతుని ఆశీర్వచనం కావాలి ; ప్రకృతి అండ దండలు కావాలి.
మనం ఈనాడు చేస్తున్న చాలా పనులు సంస్థ లేకుండా సాధ్యం కావు. సమాజానికి దీవెనలందించ డాని కైనా, ఉత్తమ విలువలు వ్యాపింప జేయటానికైనా, సంస్థ ఆధారం అవసరం. వేదకాలంలో సంస్థలు లేవు ; మతవ్యవస్థ ఏర్పాటు చేయటం గురించి మన వేదాలు ప్రస్తావించ లేదు. ఆధ్యాత్మి కత, ధార్మికత ఏర్పాటు చేయడం సాధ్యం కాదనీ, ఆధ్యాత్మిక వికాసం వ్యక్తి హృదయం లోనే పూర్తి స్వతంత్రం తో స్వేచ్ఛగా జరగాలనీ వేదర్షులకు తెలుసు.
కాని, జనసంఖ్య పెరిగి సమాజం లో సమస్యలు ఎక్కువౌతున్న కొద్దీ, మతం సమాజపు అవసరాలకు స్పందించడం మానివేసింది. పురాణ కాలంలో దేవాలయాలు మతానికి కేంద్ర స్థానంగా ఉండేవి. ఆ రోజుల్లో అవి చాలా తక్కువగానే ఉండేవి : బదరీ నాథ్, వారణాసి, రామేశ్వరం, ద్వారక ... క్రీస్తు పూర్వం 500 లో మత సంస్థల ఆవశ్యకత హఠాత్తుగా పెరిగింది. ఆ రోజుల్లో భారతదేశపు మతానికి క్రమబద్దత నిచ్చిన మొదటి వ్యక్తి బుద్ధుడు. తన కార్యకర్తల సాయంతో అతడు స్థాపించిన మతకేంద్రాలను విహారా లనేవారు. తర్వాతి ఆరేడు శతాబ్దాలు బౌద్ధమతం వర్ధిల్లింది ; అటుపిమ్మట క్రమంగా క్షీనించ సాగింది. భారత దేశపు ఆధ్యాత్మిక వాతావరణం అస్తవ్యస్త మైంది. హిందూ మతం క్షీణించింది; బౌద్ధ మతం క్షీణించింది; వాటితోపాటు ధార్మిక విలువలూ క్షీణించాయి.
🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
🌺 సరళ 🌺
No comments:
Post a Comment