🏹 ఇతిహాసం నుంచి మైథాలజీ వరకు :
వారు మన పూర్వీకుల్ని వెక్కిరించడం ఎలాగో నేర్పించారు ! మన దేవాలయాలను కూల్చేశారు, తిరిగి నిర్మించుకున్నాం..! మన బంగారాన్ని దోచుకున్నారు, మనం తిరిగి సంపాదించుకున్నాం..!
కానీ, వారు మన చరిత్రను దొంగిలించి దానికి మైథాలజీ అని పేరు పెట్టినప్పుడు, మనమేమీ చేయలేదు. అదే దూషణ మనం కూడా మళ్లీ మళ్లీ పలికాం. @పిల్లలకు కూడా నేర్పించాం.,
మీ రక్తంలో సనాతనం ఉంటే, చివరి లైన్ వరకు చదవండి..! చదివించండి..!
మరల ఎప్పుడూ మీ ఇతిహాసాన్ని Myth లేదా Mythology అని పిలవకండి.
మనం మన పూర్వీకులతో పాటు నడిచిన కాలం :
భారతంలో ఒక కాలం ఉండేది — అప్పుడు చరిత్రకు, భక్తికి మధ్య దూరం అసలు లేదు. ఎందుకంటే మన చరిత్రే మన భక్తి, మన భక్తియే మన చరిత్ర..!
అయోధ్యలో ఒక చిన్నబిడ్డ “రాముడు పుట్టాడు” అని నమ్మేవాడు కాదు — అతనికి అది తెలిసేది. తాతయ్య అతనికి చూపిన 'ఆ పుట్టిన ప్రదేశాన్ని' ,అతని తాతయ్యకు చూపినట్లే..,
ద్వారకాలో ఒక మత్స్యకారుడు “కృష్ణుడు ఒక పౌరాణిక వ్యక్తి” అని అనుకునేవాడు కాదు — తన పట్టణం యాదవులదని,
ఆశ్రమాలు, మహళ్లు సముద్రంలో మునిగిపోయాయని తెలిసేది..!
కురుక్షేత్ర రైతులకు తాము దున్నే భూమి పాండవులూ – కౌరవుల రక్తంతో తడిసిన నేల అని తెలిసేది..! వాళ్లు పుస్తకాల్లో చదవలేదు— భూమి తానే చెప్పేది..!
మొదటి పెద్ద గాయం –
తుర్కీ దూకుడువాళ్లు, ఆ తరువాత మొఘల్ దండయాత్రలు వచ్చాయి. వాళ్ళు దేవాలయాలు మాత్రమే కాదు, మన జ్ఞాపకాల రికార్డులను దెబ్బతీశారు..!
నలందా గ్రంథాలయాలు నెలలతరబడి కాలిపోయాయి. అనేక అమూల్య గ్రంథాలు బూడిద అయ్యాయి.
విక్రమశిలా వంటి విద్యా కేంద్రాలు ధ్వంస మయ్యాయి, వేలాది పండితులు హతమయ్యారు.
రాజుల పరంపరలను వివరించే తామ్రశాసనాలు కరిగించి నాణేలు చేశారు.
దేవాలయాల్లో శతాబ్దాల నుండి ఉన్న గ్రంథాలు కాల్చివేశారు.
దేవాలయాలపై మసీదులు నిర్మించారు — ఇది కేవలం భూభాగాన్ని ఆక్రమించడం కాదు, మన భౌగోళిక గుర్తింపును మార్చడం.
పట్టణాల పేర్లు మార్చేశారు — తరాలు మారేకొద్దీ పాత పేర్లు మరిచిపోవాలనే ఉద్దేశంతో, ఐనా., మనం నిలిచాం..!
గ్రంథాలు పోయినా, మౌఖిక సంప్రదాయం బ్రతికి ఉంది. రామలీలలు చేసాం, కృష్ణుడి భజనలు పాడాము. వేదాలు, ఉపనిషత్తులు పిల్లలకి నేర్పించాం.
దండయాత్రలు జయరిగాయి — కానీ, జ్ఞాపకాలను తుడిచివేయలేకపోయింది.
రెండో పెద్ద గాయం – వలసదారుల కాలం..!
తరువాత బ్రిటిష్ వచ్చారు. వారు “అల్లాహు అక్బర్” అంటూ రాలేదు — వాణిజ్యం పేరిట, మర్యాద, దౌత్యం, లెక్కచూపే పాలనతో అందమైన శవపేటికలతో వచ్చారు.
వారికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది:
“ఈ ప్రజలు ఇంకా తమ పూర్వజులతో కలిసే నడుస్తున్నారు. వారి బలం వారి గతంలో ఉంది" అని..!
ఈ బంధాన్ని తెంచితే, ఆలోచనలను మార్చితే, వారి మీద శాశ్వతంగా రాజ్యం చేయవచ్చనే అభిప్రాయం కలిగింది..!
భారత్ పైన అలా ప్రారంభమైంది అత్యంత ప్రమాదకరమైన దాడి. భూభాగంపై కాదు, సత్యంపై ! ధర్మంపై..!
ఎలా “ఇతిహాసం” “మైథాలజీ” అయింది..!?
విలియం జోన్స్, మ్యాక్స్ ముల్లర్, మోనీర్ విలియమ్స్‌లను పంపించారు — వాళ్లు “పండితులు” కాదు — వలస పాలకుల లక్ష్యాన్ని అమలు చేసే సాధనాలు తయారు చేసే వలస కార్మికులు..!
మన గ్రంథాలు అనువదించారు — కానీ, ప్రతి లైన్లో సందేహం నాటారు :
• రాముడు—పౌరాణిక రాజు…
• కృష్ణుడు—కథల్లో వచ్చిన వీరుడు…
• వేదాలు—ఆదిమ గిరిజన గీతాలు…
ఈ మాటలు పాఠ్యపుస్తకాల్లో రాసారు — ఆ మాటలు తెల్ల చీమల్లా మన స్వాభిమానాన్ని తినేయసాగాయి..!
ఈ విషం ఎంచుకొని పూయబడింది :
• బైబిల్ — చరిత్ర
• ఖురాన్ — దేవవాక్యం
• రామాయణం ? — “మైథాలజీ”
• మహాభారతం ? — “లెజెండ్”
ఇది ప్రమాదవశాత్తు కాదు— వ్యూహం..!
రాముడు మిథ్య అయితే, క్రీస్తు ఎలా సత్యం !?
కృష్ణుడు కథ అయితే, అల్లాహ్ ఎలా సమాధానం !?
ఈలోపల ఈ విషం మనంతటమనమే మింగేశాం !
బ్రిటిష్ 1947లో వెళ్లిపోయారు. కానీ, వారు విషాన్ని వెంట తీసుకెళ్లలేదు — దయతో మనకు వదిలేసి వెళ్లారు - "పాశ్చాత్య సంస్కృతి" అన్న ట్యాగ్ తగిలించి..!
ఆ సమయానికే మనం దానిని ఆబగా లోపలికి తీసేసుకున్నాం..!
కొత్త రకమైన హిందువు పుట్టాడు — సెక్యులర్, ఆధునిక, తెల్ల చర్మంతో కాదు, కానీ, తెల్ల మనసుతో..!
అతను గోవర్ధనాన్ని ఎత్తడం చూసి నవ్వుకున్నాడు — కానీ నోహా' పడవను అస్సలు ప్రశ్నించలేదు..!? 🤔
ద్వారకాను “లెజెండ్” అన్నాడు — కానీ యేసు పునరుత్థానం మీద ఒక్క అనుమానం కూడా పెట్టలేదు..!
రామాయణాన్ని “మైథాలజీ” అన్నాడు —
కానీ బైబిల్ కథలను “భక్తి” అన్నాడు.. 🤔
భారతీయులకు స్వాతంత్రం వచ్చింది ! కానీ, శాశ్వతంగా బానిసలుగా మిగిలిపోయారు..!
డబుల్ స్టాండర్డ్లు :
ఒకసారి ఊహించండి…,
• భారత పాఠ్యపుస్తకాల్లో ఖురాన్‌ను “ఇస్లామిక్ మైథాలజీ” అని రాస్తే ? —
దాడులు, ఫత్వాలు, అల్లర్లు.
• పాశ్చాత్యంలో యేసు కథను “క్రైస్తవ మైథాలజీ” అని పత్రిక రాస్తే? — చర్చిలు గర్జిస్తాయి.
కానీ “హిందూ మైథాలజీ” ? అది “సాధారణం”. టీవీ యాంకర్లు చెబుతారు. మనమూ చెబుతాం..! మన పూర్వజులను హేళన చేయడం మనకే సహజమైపోయింది..!
ప్రతి సారి మీరు “మైథాలజీ” అనేప్పుడు —
అయోధ్య జ్ఞాపకాన్ని మట్టిలో కలుపుతున్నట్లు.
ప్రతి సారి “లెజెండ్” అనేప్పుడు — కురుక్షేత్రను పొగమంచులో దాచుతున్నట్లు.
ప్రతి సారి రామసేతును “సహజ నిర్మాణం” అంటున్నప్పుడు — మీ సివిలైజేషన్ను మీరు త్రోవలో విడిచేస్తున్నారు..!
బ్రిటిష్ మన భూమిని మాత్రమే కాదు — మన మనసును గెలుచుకున్నారు.
మరియు ఇప్పుడు వారి అబద్ధాలను కాపాడేవాళ్ళు — విదేశీలు కాదు, మనమే..!
ఇంకా సనాతనం నిలిచేవుంది — ఎందుకంటే మనం గుర్తుంచుకున్నాం ! మనం మర్చిపోయిన రోజు., అది చనిపోతుంది..!
శత్రువు ఇచ్చిన పదాలు వాడకండి., మన గ్రంథాలను తక్కువ చేసి మీ పిల్లలకు నేర్పకండి !
“మైథాలజీ” కాదు— “ఇతిహాసం” అనండి.
మన సివిలైజేషన్ సర్వ నాశనం అయ్యేది - బయటివారు దేవాలయాలను కూల్చినప్పుడు కాదు — అంతరంగంలో మనమే జ్ఞాపకాలను కాల్చినప్పుడు జరుగుతుంది.
ఈ నిజం మిమ్మల్ని కదిలించిందా ? ఐతే, మీ దగ్గరే ఆగిపోనీయకండి. పంచండి. ముందుకు పంపండి..!
మీ ప్రతీ షేర్ — శతాబ్దాల అబద్ధాల మీద ఒక పిడికిలి దెబ్బ..! ✊
No comments:
Post a Comment