Thursday, December 11, 2025

 Pasupula Pullarao...8919291603... ఈ జ్ఞానం, ఆ విజ్ఞానం, రకరకాల కౌన్సెలింగ్ ల వెంట ఎందుకు ఉరుకులు పరుగులు... అన్ని రకాల జ్ఞానం, విజ్ఞానం సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం కదా... ధ్యానం ధ్యాన సాధన మీద నమ్మకం లేదా లేకా...
     ఒక పక్క గురువు గారు ధ్యానం సర్వరోగ నివారిణి, సకల సమస్యల పరిష్కారిణి, సత్య ఙ్ఞాన ప్రకాశిని, ఆత్మ జ్ఞాన ప్రభోధిని అని చెప్పారు కదా...
     కంటి, పంటి, ఒక్కొక్క అవయవాలకు ఒక్కొక్క ద్యానాలు లేవు గాక లేవు ఉండవు గాక ఉండవు.. ధ్యానానికి పట్టిన తుప్పే అజ్ఞాన ధ్యాన ప్రచారాలు... చక్ర ధ్యానాలు, ఆరా, మూడో కన్ను, నాడీమండలం శుద్ది ధ్యానాలు లేనే లేవు గాక లేవు... ఎందుకంటే ఒకే ఒక్క సరైన సాధన ద్వారా పైవన్నీ పొందవచ్చు.
     తన కోపమే తన శత్రువు, తన శంతమే తనకు రక్ష... దయ చుట్టంబు అవును.. కోప తాపాలు తగ్గించడానికి సరైన సాధన చేయాలి... అపుడే అద్భుతమైన అమోఘమైన ప్రేమ తత్వం కృతజ్ఞతా భావం క్షమా గుణం కల్గియుంటారు.
     కొద్దిసేపు సరైన సాధన ద్వారా మాత్రమే అపూర్వమైన అమోఘమైన అనంతమైన విశ్వ శక్తిని పొందడం ద్వారా సంకల్పాలు(పాజిటివ్ ఆలోచనలు) ద్వారా అనందంగా జీవించడానికి అనువైన రాజ మార్గం.

No comments:

Post a Comment