Saturday, January 31, 2026

మీ మెదడుని నాశనం చేస్తున్న 5 అలవాట్లు! (వెంటనే ఆపేయండి) 🛑 Stop These 5 Habits Immediately!

మీ మెదడుని నాశనం చేస్తున్న 5 అలవాట్లు! (వెంటనే ఆపేయండి) 🛑 Stop These 5 Habits Immediately!

https://m.youtube.com/watch?v=whRlfDU6LAc#


https://www.youtube.com/watch?v=whRlfDU6LAc

Transcript:
(00:00) ప్రతిరోజు మన మెదడు బలహీన పడుతుంది. అవును మీరు విన్నది నిజమే ఒక పరిశోధన ప్రకారం 1980 తర్వాత పుట్టిన ప్రతి కొత్త తరంలోనూ తెలివితేటల స్థాయి ఏడు పాయింట్ల వరకు తగ్గుతూ వస్తుందట. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొత్త తరాలకు వైద్య సదుపాయాలు, చదువు, సాంకేతికత అన్ని పెరుగుతున్నాయి. అయినా సరే మన మెదడు ఎందుకు మందగిస్తుంది.
(00:21) దీనికి కారణం మనకు తెలియకుండా మన దైనందిన జీవితంలో చేసుకున్న కొన్ని అలవాట్లే. ఆ అలవాట్ల వల్లే మన మెదడు శక్తి తగ్గుతోంది. అవేంటో ఇప్పుడు సైన్స్ ప్రకారం చూద్దాం. ఈరోజు మనం తాగే నీళ్లుు మన మెదడుని బలహీన పరుస్తున్నాయి అని చెప్తే మీకు ఆశ్చర్యం అనిపించొచ్చు. నీళ్లే కాదు మరో ఐదు అలవాట్లు కూడా ఉన్నాయి. వాటి వల్లే మన మెదడు శక్తి తగ్గుతుంది.
(00:41) ఈ విషయంపై నార్వే దేశానికి చెందిన ఒక శాస్త్రవేత్త పరిశోధన చేశారు. అందులో 7300 మందికి తెలివితేటల పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాల్లో తేలింది ఏంటంటే 1980 తర్వాత పుట్టిన వారిలో తెలివి తేటల స్థాయి తగ్గుతూ వస్తుంది. అంతకు ముందు తరాల్లో మాత్రం ఇది పెరుగుతూ ఉండేది. మరి 1980 తర్వాత ఏం జరిగింది? దానికి జవాబు మన రోజువారి అలవాట్లే అందులో మొదటిది ఫోన్ లో అనవసరమైన విషయాలు చూస్తూ ఉండిపోవడం.
(01:05) మనం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాం వెంటనే ఫోన్ తీసి YouTube లోనూఇగ లోనూ చిన్న చిన్న వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తాం. అలా చూస్తూనే ఉంటాం. అలా చూడడం తప్పు కాదు. కానీ ఏం ఆలోచించకుండా అసలు ఏం చూస్తున్నామో కూడా తెలియకుండా గంటల తరబడి చూడడమే ప్రమాదం. మనకు ఆ వీడియో అవసరమా లేదా అది నవ్వు తెప్పించేదా ఏడిపించేదా అనే తేడా కూడా లేకుండా స్క్రోల్ చేస్తూనే ఉంటున్నాం.
(01:27) ఇలా ఏకాగ్రత లేకుండా చూడడం వల్ల మెదడు పై చెడు ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆలోచించే శక్తి అర్థం చేసుకునే గుణం పోతాయి. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మన మెదడు కూడా YouTube లాంటిదే. ఈరోజు మీ YouTube లో ఏదైతే ఆటలకు సంబంధించిన వీడియో చూసి లైక్ చేశారో మరుసటి రోజు మొత్తం మీకు అలాంటివే సజెస్ట్ అవుతాయి. మీకు కూడా అలాగే జరిగిందా? అయితే అవునని లేకపోతే లేదని తెలియజేయండి.
(01:49) మన మెథడ్ కూడా అలాగే పనిచేస్తుంది. మనం ఎలాంటి విషయాలు దానికి చూపిస్తామో అలాంటి ఆలోచనలే మనకు వస్తాయి. పనికిరాని వీడియోలు చూస్తే మెదళలో కూడా పనికిరాని ఆలోచనలు దీనివల్ల ఆలోచించే వేగం తగ్గిపోతుంది. 2025 లో జరిగిన అనేక పరిశోధనలు ఇదే విషయాన్ని నిర్ధారించాయి కూడా రీల్స్ షాట్స్ ఎక్కువగా చూసేవారి మెదడు శక్తి మిగతా వారితో పోలిస్తే చాలా తక్కువగా ఉందని సూటిగా రుజువైంది.
(02:12) కేవలం మూడు నెలల పాటు వరుసగా ఇలా ఏ ఆలోచన లేకుండా వీడియోలు చూస్తే ఇక అంతే సంగతి. మరి మీరు ఎన్నేళ్లుగా ఈ పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. దీన్ని ఆపడం ఎలా అనేది కదా ఇప్పుడు అసలైన ప్రశ్న. దీనికి పరిష్కారం చాలా సులభం. అదే తెలివిగా వాడుకోవడం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే YouTube మరియుఇగ లో కొత్త ఖాత తెరిచి కేవలం మీకు ఏదైనా కొత్త విషయం నేర్పించే వాళ్ళ పైన దృష్టి పెట్టండి.
(02:36) అప్పుడు మీరు చూసే ప్రతి వీడియో మీకు ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ మెదడు చురుగ్గా మారుతుంది. మీ ఆలోచించే శక్తి, తెలివి తేటలు వాటంతట అవి పెరుగుతాయి. అలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడుపై ఎలాంటి భారం పడదు. ఇప్పుడు రెండో అలవాటు గురించి మాట్లాడుకుందాం. అదే నీళ్లు. కనిజాలు లేని నీరు తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
(02:57) అవును మనం ప్రతిరోజు తాగే నీళ్లు మన మెదడును బలహీన పరుస్తున్నాయి. నేను సాధారణ నీటి గురించి చెప్పడం లేదు జీవన్ లేని నీటి గురించి చెబుతున్నాను. మన అందరి ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫయర్లు ఉంటాయి. ఇవి నీటిని జీవన్ లేనివిగా మారుస్తున్నాయి. సాధారణంగా నీటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం లాంటి ఖనిజాలు చాలా ఉంటాయి. ఇవి మన మెదడుకు చాలా మంచిది.
(03:17) కానీ మన దేశంలో తయారయ్యే చౌక రకం ప్యూరిఫయర్లు నీటిని వడపోసే క్రమంలో ఈ ఖనిజాల్ని కూడా తొలగిస్తున్నాయి. అసలు ఈ ఖనిజాలకు మెదడుకు ఉన్న స్నేహం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆ స్నేహం చాలా బలమైంది. ఎందుకంటే ఈ ఖనిజాలు మన మెదడులోని నాడుల మీద పనిచేస్తాయి. మన మెదడు అనేక నాడులతో తయారై ఉంటుంది. మన శరీరంలో జరిగే సంకేతాలన్నిటిని ఈ నాడులే చేరవేస్తాయి. మనం తాగే నీటిలో ఖనిజాలు ఉంటేనే ఈ నాడులు సరిగ్గా పనిచేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
(03:44) ఖనిజాలు లేని నీరు తాగడం వల్ల ఆలోచించే శక్తి జ్ఞాపక శక్తి రెండు నెమ్మదిగా తగ్గిపోతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఇలా శుద్ధి చేసిన నీటిని నిరంతరం తాగడం వల్ల మెదడు చురుకుదనం బాగా తగ్గిపోతుందని తేలింది. ఇక మన దేశంలో బాటిల్ నీళ్ల వ్యవహారం మరో స్థాయిలో ఉంది. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు 1520 రూపాయలు పెట్టి ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు కొంటాం.
(04:04) ఇవి చాలా శుద్ధమైన నీరు అని మన అభిప్రాయం. కానీ ఇది పచ్చి అబద్ధం. ఆ బాటిల్ మీద ఉన్న వివరాలు చదివితే ఆ నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చారు ఎక్కడా రాసి ఉండదు. అవి కొళాయి నీళ్ళా, భూగర్భ జలాల లేక హిమాలయాల నుంచి తెచ్చారా అన్నది అస్సలు ఉండదు. ఇదే కంపెనీలు ఎక్కువ ధర పెట్టి మరో కంపెనీ నీళ్ళను కూడా అమ్ముతాయి. ఒక్కో బాటిల్ 50 నుంచి 60 రూపాయ ఉంటుంది.
(04:25) దాని మీద స్పష్టంగా మినరల్ వాటర్ అని రాసి ఉంటుంది. అంటే ఆ బాటిల్స్ తయారు చేసే వాళ్ళకు కూడా తెలుసు మామూలు నీళ్లు మంచివి కాదని మంచి నీళ్ళను మాత్రం ఎక్కువ ధరకు అమ్ముతున్నారని కానీ సామాన్య ప్రజలకు ఈ విషయం అస్సలు తెలియదు. అందుకే మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో ఉన్న ఆర్ఓ ప్యూరిఫయర్ టిడిఎస్ స్థాయిని పరీక్షించండి.
(04:45) అది 80 నుంచి 150 మధ్యలో ఉంటే అంత బాగానే ఉన్నట్టు. మీ ప్యూరిఫయర్ నీటిని సరిగ్గా శుద్ధి చేసినట్టు లెక్క. ఒకవేళ అంతకంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటే మీ ఆర్ఓ యంత్రాన్ని మార్చాలి లేదా దాని సెట్టింగ్ సరి చేయాలి. రెండో విషయం బయట దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ కొనడం మానేయండి. ఇంటి నుంచే రాగి సీసాలో నీళ్లు తీసుకువెళ్ళండి. ఇక మూడో అలవాటు ఊపిరి పీల్చుకోవడం.
(05:06) సాధారణంగా గాలి కాలుష్యం అనగానే మనకు ఊపిరి తిత్తుల సమస్యలు గుర్తొస్తాయి. కానీ ఇది మెదడు మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మనం రోజు పీల్చే గాలి వల్ల కూడా మన మెదడు బలహీన పడుతుంది. ఈరోజు మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే ప్రపంచంలోనే అత్యంత కాలుష్యం ఉన్న 30 నగరాల జాబితాలు తీస్తే అందులో 22 మన భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో గాలి నాణ్యత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
(05:27) కాలుష్యం వల్ల ఊపరితిత్తులే కదా పాడవుతాయి మెదడుపై ప్రభావం ఎలా పడుతుంది అని మీరు అనొచ్చు. కానీ కచ్చితంగా పడుతుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం రుజువైంది. మనం కలుషితమైన గాలిని పీల్చినప్పుడు అందులో పిఎం 2.5 అనే అతి చిన్న రేణువులు ఉంటాయి. ఇవి ఎంత చిన్నగా ఉంటాయంటే ఇవి నేరుగా మన రక్తంలో కలిసిపోయేంత మెదడుకు చేరుకునే అంత.
(05:51) అక్కడ మెదడులో మంట పుట్టించి వాపు వచ్చేలా చేస్తాయి. దీనివల్ల జ్ఞాపక శక్తి ఆలోచించే సామర్థ్యం తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాల్లో పెరిగే పిల్లల తెలివితేటలు మిగతా వారితో పోలిస్తే చిన్నప్పటి నుంచే తక్కువగా ఉంటున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనికోసం మనం పెద్దగా ఆలోచించగలిగింది ఏమీ లేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు.
(06:09) మీ ఇళ్లల్లో ఎయిర్ ప్యూరిఫయర్స్ వాడుకోవచ్చు. ఇంటి లోపల ఇంటి చుట్టుపక్కల మొక్కలు పెంచుకోవచ్చు. దీనివల్ల కనీసం ఇంట్లో గాలైనా శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు ఒకవేళ మీరు బయటకు వెళ్ళాల్సి వస్తే మధ్యాహ్న సమయాన్ని ఎంచుకోండి. ఎందుకంటే మధ్యాహ్న వేళల్లో కాలుష్యం తక్కువగా ఉంటుంది. రాత్రిళ్లు తెల్లవారు జామున బయట తిరగడం తగ్గించండి.
(06:28) ఆ సమయాల్లోనే కాలుష్యం అత్యంత ఎక్కువ. ఇప్పుడు నాలుగో అలవాటు గురించి తెలుసుకుందాం. ఆహారంలో ప్లాస్టిక్ వేడి పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టడం లేదా అందులో వేడి చేయడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి. ఇప్పుడు మీ తెరపై ఒక వీడియో వస్తుంది జాగ్రత్తగా గమనించండి. అందులో కనిపిస్తున్న చిన్న చిన్న రేణువులు ప్లాస్టిక్ ముక్కలు ఇవి ఎక్కడున్నాయో తెలుసా ఒక మనిషి మెదళలు అవును మీరు విన్నది నిజమే కొంతమంది వైద్యులు చనిపోయిన వారిపై పరిశోధనలు చేసినప్పుడు వారి మెదళలు ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి.
(06:55) అవి కొంచెం కాదు ఒక చిన్న క్రెడిట్ కార్డు తయారు చేసేంత ప్లాస్టిక్ అది. ఇది చూసి అందరూ హవాక్ అయ్యారు. మరి ఈ ప్లాస్టిక్ కి ఎక్కడిది ఎలా చేరింది? ఇదే కదా మీ సందేహం. అది మనం తినే ఆహారం ద్వారానే వెళ్ళింది. దీనిపై హార్వర్డ్ సంస్థ ఒక ప్రయోగం చేసింది. కొంతమందికి ఒక వారం పాటు వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టిచ్చారు.
(07:14) ఆ తర్వాత వారి రక్తాన్ని పరీక్షించగా అందులో బిపిఏ అనే రసాయనం 10 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ రసాయనం మన మెదడును జ్ఞాపక శక్తిని ఆలోచించే శక్తిని దెబ్బతీస్తుంది. అంటే ప్లాస్టిక్ డబ్బాల్లో తినడం వల్ల మన మెదడు పాడవుతుందన్నమాట. అంతేకాకుండా బయట మనం టీ తాగే పేపర్ కప్పులు ఉంటాయి కదా వాటి లోపల కూడా ప్లాస్టిక్ పొరలు ఉంటాయి. వేడి టీ తాగినప్పుడు ఆ ప్లాస్టిక్ కరిగి మన నోట్లో నుంచి లోపలికి వెళ్తుంది.
(07:37) ఆన్లైన్ లో ఆహారం తెప్పించుకుంటాం కదా దాంట్లో కూడా ప్లాస్టిక్ ఫాయిల్స్ ఉంటాయి. అవి కూడా ప్రమాదకరమే అంటే మన చుట్టూ ఇంత ప్లాస్టిక్ మయంమ అయిపోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటంటే బయట తినకపోవడం. ఒకవేళ ఆగలేకపోతే కచ్చితంగా మీరు బాక్స్ తీసుకొని వెళ్లి పార్సెల్ తెచ్చుకోవడం. అది ఎలాగో కుదరదు కాబట్టి దర్జాగా ఇంట్లోనే వండుకొని తినండి.
(07:59) లేదు మేము ప్లాస్టికే తింటాం అంటే అది మీ వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఐదవ అలవాటు గురించి చూద్దాం. అదే ఒంటరిగా ఉండలేకపోవడం. మీరు ఒంటరిగా ఎంత సమయం గడుపుతారు అని అడిగితే చాలా సేపు ఉంటామ అని చెబుతారు కానీ నా ప్రశ్న ఏంటంటే చేతిలో ఫోన్ లేకుండా ఏ పరికరం లేకుండా ఎంతసేపు ఉంటారు. దీనికి మీ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే మనం ఖాళీగా అస్సలు కూర్చోలేం. 99% మంది పరిస్థితి ఇదే.
(08:20) అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో తేలింది ఏంటంటే 95% మంది కనీసం 10 నిమిషాలు కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నారు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఫోన్ లేకుండా ఒక గదిలో 10 నిమిషాలు ఉండమని చెప్పగా 95% మంది ఆ పని చేయలేక మధ్యలో వచ్చేశారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనం ఫోన్లకు ఎంతగా బానిసలుైపోయామో. ఒంటరిగా అసలు ఉండలేకపోతున్నాం అనేది రుజువైపోయింది.
(08:43) ఇలా ఒంటరిగా ఉండకపోవడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే మనం ప్రశాంతంగా నిశశబ్దంగా ఉన్నప్పుడే మన మెదడు మళ్ళీ కొత్త శక్తిని పుంజుకుంటుంది. అంతా రీసెట్ అవుతుంది. ఆ సమయం మనం ఇవ్వకపోతే జ్ఞాపక శక్తి తగ్గక ఇంకేమవుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టం అవుతుంది. దీనికి పరిష్కారం చాలా సులభం. ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. లేదా రోజుకు ఒక ఐదు 10 నిమిషాలు ఒంటరిగా గడపండి.
(09:06) ఆ సమయంలో పాటలు వినడం, ఫోన్ మాట్లాడడం చేయకూడదు. మొదట్లో ధ్యానం కష్టంగా అనిపించొచ్చు. ఏవేవో ఆలోచనలు రావచ్చు. కానీ ఒక 10 నిమిషాలు కేవలం 10 నిమిషాలు మీ మెదడుకు రెస్ట్ ఇవ్వకపోతే ఎంత దారుణం ఒక్కసారి ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
(09:25) నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.

No comments:

Post a Comment