మీడియా చూపించని అమెరికా అసలు నిజస్వరూపం! | An Unfiltered Documentary on Dark Secrets
https://youtu.be/stxmKFTo4ok?si=9-vLYBgXs8Oaeguh
https://www.youtube.com/watch?v=stxmKFTo4ok
Transcript:
(00:00) హిపోక్రసీ అంటే ద్వంద్వ ప్రమాణాలు ఈ పదానికి ఒక ముఖం అంటూ ఉంటే అది కచ్చితంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మ్యాప్ లాగే ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ మొదలు పెట్టే ముందు ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇది 100% అన్‌ఫిల్టర్ గా ఉండబోతుంది. అంటే దాపరికాలు లేకుండా ఈ వీడియోలో అమెరికాకు సంబంధించిన ఎలాంటి నిజాలు బయట పెట్టబోతున్నామ అంటే అవి మీరు ఏ YouTube దగ్గర విని ఉండరు.
(00:22) ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ లో చూసి ఉండరు. చిన్నప్పటి నుంచి మనం ఒకటే వింటూ పెరిగాం. అమెరికా అన్ని విషయాల్లోనూ ఇండియా కంటే బెటర్ అని ప్రపంచం ఒకవైపు ఉంటే అమెరికా మరోవైపు అని మన మైండ్ లో బలంగా నాడుకుపోయింది. ఈ ప్రపంచాన్ని టెర్రరిజం నుంచి కాపాడే బాధ్యత అమెరికాదే అని అదే ప్రపంచంలోకెల్ల ఓల్డెస్ట్ డెమోక్రసీ పురాతన ప్రజాస్వామ్యం అని మనం నమ్ముతున్నాం.
(00:43) జియోపాలిటిక్స్ తెలిసిన వాళ్ళు దాన్ని ల్యాండ్ ఆఫ్ ద ఫ్రీ అని గొప్పగా పిలుస్తారు. కానీ ఇక్కడో ప్రశ్న హాలీవుడ్ సినిమాల్లో చూపించే ఆ రంగుల వెలుగులు ఆకాశ హార్ణ్యాలు నిజంగా అమెరికా గొప్పదనానికి నిదర్శనమా? లేక అదంతా మన మెదళలో నింపిన ఒక బ్రమ మాత్రమేనా అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు చూపించని గ్రౌండ్ రియాలిటీ ఏంటి? వీటన్నిటికీ సమాధానాలు కాసేపట్లో మీకే తెలుస్తాయి.
(01:04) మన వీధిలో ఒక టిపికల్ అంకులు ఉంటారు గమనించారా చిన్న చిన్న విషయాలకి పక్కోళ్ళ పిల్లల్ని తెగతిస్తూ ఉంటాడు. కానీ అదే టైంలో వాళ్ళ సొంత మనవుడు స్కూల్ ఎగ్ కొట్టేసి సిగరెట్స్ తాగుతున్న వాళ్ళకి అస్సలు కనిపించదు. అమెరికా కూడా సరిగ్గా ఈ అంకుల్ లాంటిదే. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వీళ్ళు లెక్చర్లు ఇవ్వడం మొదలు పెడతారు.
(01:24) ఇండియాలో డెమోక్రసీ ప్రమాదంలో ఉంది. రష్యా ఉక్రైన్ పై దాడి చేస్తుంది. చైనా వ్యాపారం సరిగ్గా చేయట్లేదు. ఫలానా దేశంలో హ్యూమన్ రైట్స్ పోయాయి అంటూ ఆ టిపికల్ అంకుల్ లాగా ప్రపంచానికి జ్ఞానబోధ చేస్తుంది అమెరికా. కానీ ఒక్కసారి వాళ్ళ దేశంలోకి తొంగి చూస్తే అక్కడ హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ వార్ ఆన్ టెర్రర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే పక్క దేశాలను తిట్టడం కాదు కదా అసలు నోరు తెరిచే అర్హత కూడా అమెరికాకు లేదని అర్థంవుతుంది.
(01:49) నేను ముందే చెప్పాను ఈ వీడియో కొంచెం ఘాటుగా ఉండొచ్చు. నా ఉద్దేశం ఒక్కటే మీడియా చూపించని అమెరికాను మీకు చూపించడం పెద్ద పెద్ద మాటలు చెప్పి వాటిని పాటించని అమెరికా అసలు రంగు బయట పెట్టడం. నేను యాంటీ అమెరికా కాదు నేను యాంటీ హిపోక్రసీ నాకు ద్వందవ వైకరి అంటే సమస్య. ఈ హిపోక్రసీని బయట పెట్టడానికి వాళ్ళ ఎలక్షన్ ని ప్రెసిడెంట్ మాటల్ని బ్యూరోక్రాట్స్ నిర్ణయాల్ని లోతుగా స్టడీ చేశం.
(02:14) అక్కడిదాకా వచ్చారంటే ఐ ప్రామిస్ ఈ వీడియో ఎండింగ్ కల్ల అమెరికా వైపు చూసే మీ చూపు పూర్తిగా మారుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. హ్యూమన్ రైట్స్ విషయానికి వస్తే అమెరికా ప్రపంచానికి కాంట్రాక్టర్ లా ఫీల్ అవుతుంది. ఏదైనా ఒక దేశం ఏ కారణం చేతనైనా వాళ్ళ పౌరుల హక్కులను అణచివేస్తే అమెరికా వెంటనే పోడియం మీదకి ఎక్కి లెక్చర్లు ఇస్తుంది.
(02:35) మేము ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్ ని ఖండిస్తున్నాం అని పెద్ద పెద్దగా అరుస్తుంది. కానీ అదే హ్యూమన్ రైట్స్ వయలేషన్ అమెరికా లోపల జరుగుతున్నప్పుడు మాత్రం వాళ్ళ నోట్లో వెలక్కాయ పడ్డట్టు అసలు నోట్లో ఏదో పెట్టుకున్నట్టు మీకు తెలుసా ఒక్క మాట కూడా మాట్లాడదు అమెరికా. హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్ పబ్లిక్ చేస్తుంది. కానీ ఇతరులు జాతకాలు రాసే అమెరికా తన సొంత రిపోర్ట్ ని మాత్రం ఎప్పుడూ బయట పెట్టదు.
(02:56) మరి ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికాలో అసలు హ్యూమన్ రైట్స్ పరిస్థితి ఏంటి ఆ నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు. నేను మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నేను అమెరికా మీద ఉన్న కోపాన్ని అసహనాన్ని వెళ్ళగతున్నట్టు అని మీకు అనిపించొచ్చు. అవును నిజమే వాళ్ళు చేసిన పనులకి ఆ మాత్రం కోపం రావడం సహజమే కదా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎమోషన్స్ కాదు.
(03:16) పక్కా నంబర్స్ మరియు స్టాటిస్టిక్స్ వీటితో ప్రూవ్ చేస్తాను. ఈ ప్రదేశాన్ని జాగ్రత్తగా చూడండి. దీని పేరు గ్వాంటనామో బే ఇది అమెరికా జైల్ కానీ ఇది అమెరికాలో లేదు క్యూబా దేశంలో ఉంది. ఒక అమెరికన్ జైల్ క్యూబాలో ఎందుకుంది ఆ రీజన్ తెలిస్తే మీ మైండ్ పగిలిపోద్ది. అసలు ఈ జైల్ లోపల ఏం జరుగుతుందో అంటే 21వ శతాబ్దంలో కూడా ఇలాంటి నరకం భూమి మీద ఉందా అని ముక్కున వేలేసుకుంటారు మీరు.
(03:40) 2002 లో అమెరికా ఈ జైల్ ను కట్టింది. వారాన్ టెర్రర్ లో పట్టుబడ్డ టెర్రరిస్టులను ఉంచడానికి దీన్ని కట్టామని అప్పట్లో అమెరికా చెప్పింది. ఈ జైలు కట్టి దాదాపు 22 ఏళ్ళ అయింది. ఇప్పటిదాకా ఇక్కడ 780 మందిని బంధించారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఇందులో 86% మంది ఖైదీలకు ఆల్ ఖైదాతో కానీ ఏ టెర్రరిస్ట్ గ్రూప్ తో కానీ సంబంధం లేదని స్వయంగా అమెరికానే ఒప్పుకుంది.
(04:03) అంటే అక్కడ ఉన్న ప్రతి ఎనిమిది మందిలో ఏడుగురు అమాయకులే. 780 మందిలో కేవలం ఏడుగురికి మాత్రమే శిక్ష పడింది. మిగతా వాళ్ళకి కనీసం కోర్ట్ ట్రైల్ కూడా జరగలేదు. నేరం చేశారో లేదో తెలియదు ఆ ఖైదీలకు 180 గంటలు అంటే దాదాపుగా ఏడు రోజుల పాటు నిద్రపోనివ్వరు. వాటర్ బోర్డింగ్ పేరుతో మంచులో ముంచి ఊపిరాడకుండా చేస్తారు. కరెంట్ షాక్‌లు ఇస్తారు.
(04:23) కాళ్ళు చేతులు విరగగొట్టి గంటలు తరబడి నిలబెడతారు. అందుకే ఈ ప్లేస్ ని హెల్ ఆన్ ఎర్త్ అంటే భూమి మీద నరకం అని పిలుస్తారు. ఇతని పేరు మొహమ్మద్ ఉల్ సలాహి 9/1 అటాక్ అనుమానంతో ఇతన్ని 14 ఏళ్ళు నరకంలో ఉంచారు. బయటిక వచ్చాక ఇతను గ్వాంటనామా డైరీస్ అనే బుక్ రాశడు. అందులో అక్కడ జరిగే ఇన్‌హ్యూమన్ టార్చర్ గురించి కళ్ళకు కట్టినట్టు వివరించాడు. చివరకు అమెరికా గూఢచారి సంస్థ సిఐఏ కూడా తమ టార్చర్ రిపోర్ట్ లో ఇదంతా నిజమేనని ఒప్పుకుంది. ఇక్కడ మూడు ప్రశ్నలు వస్తాయి.
(04:50) ఒకటి ఈ ఖైదీలని టార్చర్ చేయడం వల్ల అమెరికాకు ఏం లాభం? రెండవది అమెరికా జైల్ అమెరికాలో కాకుండా క్యూబాలో ఎందుకు ఉంది? మూడవది ఇంత సీక్రెట్ గా ఉంచాలనుకున్నప్పుడు సిఐఏ స్వయంగా ఆ రిపోర్ట్ ని ఎందుకు బయట పెట్టింది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడే అర్హత అమెరికాకు ఉందో లేదో మీకే అర్థమవుతుంది.
(05:09) మొదటి ప్రశ్న ఈ టార్చర్ వల్ల లాభం ఏంటి? టెర్రరిస్టులకు బుద్ధి చెప్పడానికే అని అమెరికా పైకి చెప్తుంది. కానీ అది జస్ట్ కలరింగ్ మాత్రమే. లోతుగా చూస్తే ఇదొక పక్కా ప్లాండ్ సైకలాజికల్ ఆపరేషన్ ఎలా అంటే ఈ జైల్ ద్వారా అమెరికా ప్రపంచానికి సైలెంట్ గా ఒక మెసేజ్ ఇచ్చింది. మాతో పెట్టుకుంటే ప్రపంచంలో ఎక్కడ మీరు సేఫ్ కాదు అని.
(05:30) ఈ జైల్ డిజైన్ వెనుక ఒక గ్లోబల్ సైకలాజికల్ డామినెన్స్ ప్లాన్ ఉంది. ఖైదీలకు ఆరెంజ్ కలర్ బట్టలు వేయడం, కళ్ళకు నల్లటి గంతలు కట్టడం, జంతువుల్లా బోన్లో ఉంచడం ఇదంతా ప్రపంచాన్ని భయపెట్టడానికి అమెరికా ఆడుతున్న సైకలాజికల్ గేమ్. దీన్ని ఇంకాస్త లోతుగా చూస్తే ఇది కేవలం మిలిటరీ ఆపరేషన్ మాత్రమే కాదు ఒక ఎకనామిక్ ఆపరేషన్ కూడా ఈ జైలును చూపించి చూసారా ఇంకా టెర్రరిస్టులు ఉన్నారు.
(05:52) వాళ్ళని చంపాలి యుద్ధాలు చేయాలి అని అమెరికా నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే యుద్ధాలు జరిగితేనే కదా అమెరికా ప్రభుత్వానికి అక్కడ వెపన్స్ తయారు చేసే కంపెనీలకు లాభాలు వస్తాయి. యుద్ధాల బిజినెస్ గురించి నేను ఆల్రెడీ ఒక 40 నిమిషాలు డాక్యుమెంటరీ చేశాను అది చూడండి. సింపుల్ గా చెప్పాలంటే గ్వాంటినోమా బే జైల్ ని నడపడం వెనుక అసలు ఉద్దేశం టెర్రరిస్టులను శిక్షించడం కాదు.
(06:12) అమెరికా తన సాఫ్ట్ పవర్ ని బిజినెస్ ని పెంచుకోవడం. ఇప్పుడు మన రెండో ప్రశ్న అమెరికా జైలు క్యూబాలో ఎందుకుఉంది? దీని వెనుక ఒక పెద్ద లీగల్ లూప్ హోల్ ఉంది. ఒకవేళ ఈ జైల్ అమెరికాలో ఉండుంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఖైదీలకు ఫెయిల్ ట్రైల్ కల్పించాలి. టార్చర్ చేయకూడదు. లాయర్ ని ఇప్పించాలి. సొంత చట్టాల నుంచే తప్పించుకోవడానికి అమెరికా ఈ జైలుని క్యూబాలో కట్టింది.
(06:35) మరి క్యూబా చట్టాల ప్రకారం వాళ్ళని వదిలేయచ్చు కదా అనుకుంటున్నారా అక్కడే ఉంది ట్విస్ట్ ఈ జైలు క్యూబాలో ఉన్న దాని కంట్రోల్ క్యూబా చేతిలో లేదు. 1903 లో అమెరికా ఈ ప్రాంతాన్ని లీజ్ కి తీసుకుంది. ఆ అగ్రీమెంట్ ప్రకారం రెండు దేశాలు ఒప్పుకుంటేనే లీజ్ రద్దవుతుంది. క్యూబా ఎప్పటి నుంచో దీన్ని రద్దు చేయాలని అనుకుంటున్న అమెరికా ఒప్పుకోవట్లేదు.
(06:54) దీనివల్ల అక్కడ అమెరికా చట్టాలు పని చేయవు. క్యూబా చట్టాలు పనిచేయవు. అమెరికా కోర్ట్లు కానీ ఇంటర్నేషనల్ కోర్ట్లు కానీ అక్కడ జరిగే టార్చర్ ని ప్రశ్నించలేవు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం చట్టానికి దొరక్కుండా ఉండడానికే తన శత్రు దేశమైన క్యూబాలు అమెరికా ఈ జైలు నడుపుతోంది. ఇక మూడో ప్రశ్న సిఐఏ ఎందుకు టార్చర్ రిపోర్ట్ ని బయట పెట్టింది.
(07:13) ఇదంతా పర్సెప్షన్ మేనేజ్మెంట్ గేమ్ మేము ఎంత నిజాయితీపరులమో చూడండి. మా తప్పుల్ని మేమే ఒప్పుకుంటాం. అని ప్రపంచాన్ని నమ్మించడానికి వేసిన డ్రామా ఇది. బరాక్ ఒబామా ఈ జైల్ ని మూసేస్తానని హామె ఇచ్చారు. కానీ అది కేవలం ఓట్ల కోసమే. ఆ జైల్ ఈరోజుకి అలాగే ఉంది. బారక్ ఒబామా చాలా ఏళ్ల క్రితమే గ్వాంటజనోమా బేని మూసేస్తామని అది తమ నేషనల్ సెక్యూరిటీకి మంచిది కాదని స్టేట్మెంట్ ఇచ్చారు.
(07:37) కానీ అది కేవలం ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అమెరికా యొక్క ఈ చీకటి కోణాన్ని ఎందుకు దాచిపెడుతుందో మీకు అర్థమవుతుంది. అమెరికాలో ఒక పదం చాలా పాపులర్. అదే ప్రిజన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వినడానికి వెరైటీగా ఉంది కదా ఇది ఒక సిస్టం. ఇందులో అమెరికా ప్రభుత్వం జైల్లో ఉన్న ఖైదీలను ప్రైవేట్ కంపెనీలకు అద్దికి ఇస్తుంది.
(07:59) అవును మీరు విన్నది నిజమే ఈ ఖైదీలను అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పత్తి అరడానికి కన్స్ట్రక్షన్ సైట్స్ లో కూలీలుగా పని చేయడానికి పంపిస్తుందన్నమాట. మరి వీరికి ఇచ్చే కూలి ఎంతో తెలుసా గంటకు 0.04 04 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో కేవలం గంటకుమ రూపాయలు కొన్ని చోట్లయితే ఫ్రీగా పని చేయించుకుంటారు. అంటే ఒక ఖైదీ రోజుకి 20 గంటలు కష్టపడిన అతనికి దక్కేది మహా అయితే 60 రూపాయ లేదా సున్నాగగు ని అడిగితే అమెరికాలో 1865 లోనే బానిసత్వం రద్దయిందని చెప్తుంది.
(08:28) కానీ ఈ ప్రిజన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చూస్తూంటే ఇది మోడర్న్ స్లేవర్లేగా అనిపిస్తుంది. కదా అందుకే ఈ బిజినెస్ కోసం అమెరికాలో అరెస్టులు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఉన్న మొత్తం ఖైదీల్లో 21% మంది అమెరికా జైలలోనే ఉన్నారు. అంటే ప్రపంచంలో ప్రతి ఐదుగురు ఖైదీల్లో ఒకరు అమెరికన్. ఇక ఇండియా జనాభా 140 కోట్లు కానీ జైల్లో ఉన్నది 5 లక్షల మంది.
(08:50) అదే అమెరికా జనాభా కేవలం 31 కోట్లు కానీ అక్కడ జైల్లో ఉన్నది 17 లక్షల మంది. జైల్లో అంతమంది ఉన్నారంటే వాళ్ళ చట్టాలు స్ట్రిక్ట్ ఏమో అనుకోకండి. వాళ్ళ చట్టాలు మనిషి రంగు చూసి పనిచేస్తాయి. ఉదాహరణకు ఒక డ్రగ్ కేసు లో ఒక నల్ల జాతీయుడిని ఒక తెల్ల జాతీయుడిని అరెస్ట్ చేస్తే ఇద్దరిది ఒకే నేరమైన ఆ నల్ల జాతీయుడికి ఐదు రెట్లు ఎక్కువ శిక్ష పడుతుంది.
(09:12) ఒక్కసారి ఊహించండి మన ఇండియన్ గవర్నమెంట్ కనుక అలాంటి జైలు కట్టి ఇలా జనాలతో వెట్టి చాకిరి చేయించుకుంటే అమెరికా ఊరుకుంటుందా వెంటనే హ్యూమన్ రైట్స్ ఎమర్జెన్సీ డిక్టేటర్షిప్ అంటూ ప్రపంచం మొత్తం గగ్గోలు పెట్టి లవ్ బోతి ఇవ్వబోమంటుంది. వాళ్ళు చేస్తే మాత్రం సంసారం మనం చేస్తే మాత్రం అది చెప్పకూడదు అనుకోండి ఇక నేషనల్ సెక్యూరిటీ వాళ్ళు నీతి అది ఇది అని మీద పడిపోతూ ఉంటారు.
(09:34) ఇప్పటిదాకా విని మీరు షాక్ అయ్యారా అయితే నెక్స్ట్ చాప్టర్ వింటే మైండ్ బ్లాక్ అయిపోద్దండోయ్ ప్రపంచంలో ఎక్కడ పాలిటిక్స్ మాట్లాడినా డెమోక్రసీ అనే పదం కనిపిస్తుంది వినిపిస్తుంది. అమెరికా తన్ని తాను డెమోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటుంది. ఓల్డెస్ట్ డెమోక్రసీ అనే గర్వంతో ఇండియా లాంటి దేశాలపై ట్రోల్స్ చేస్తుంది.
(09:53) అమెరికా ఎప్పుడు ఫ్రీ అండ్ ఫెయర్ ఎలక్షన్స్ గురించి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటుంది. ఇండియాలో మైనారిటీ రైట్స్ బాలేదు డెమోక్రసీ స్టాండర్డ్స్ బాలేదు అని క్లాసులు పీకుతూ ఉంటుంది. పేపర్ మీద చూస్తే అమెరికా ఓల్డెస్ట్ డెమోక్రసీ కావచ్చు. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. జార్జ్ బుష్ మరియు ఆల్గోర్ మధ్య గట్టి పోటీ నడుస్తుంది.
(10:14) అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరో డిసైడ్ చేసే అధికారం ఒక్క స్టేట్ చేతిలో ఉంది. అదే ఫ్లోరిడా ఈ ఫ్లోరిడాలో దాదాపు 60 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. కానీ గెలుపు ఓటముల మధ్య తేడా ఎంతో తెలుసా కేవలం 537 ఓట్లు అంటే ఆల్గోరికి ఇంకో 537 ఓట్లు పడి ఉంటే ఆయనే ప్రెసిడెంట్ అయ్యేవారు. కానీ అక్కడే ఒక పెద్ద పొలిటికల్ గేమ్ జరిగింది. అప్పట్లో ఇక్కడ పంచ్ కార్డ్ బ్యాలెట్స్ ఉండేవి.
(10:37) అంటే ఓటరు తనకు నచ్చిన కాండిడేట్ పేరు దగ్గర పేపర్ కి రంద్రం చేయాలి. కానీ ఫ్లోరిడాలో మిషన్ లో పాతబడిపోవడం వల్ల పేపర్ మందంగా ఉండడం వల్ల హోల్స్ సరిగ్గా పడలేదు. దాంతో మిషన్ ఆ ఓట్ ను ఇన్కంప్లీటెడ్ అని రిజెక్ట్ చేసింది. ఇది యాదృచ్చికమో కాదో తెలియదు కానీ ఈ టెక్నికల్ ఎర్రర్స్ ఎక్కువగా బ్లాక్ మరియు లాటినో ఓటర్లు ఉన్న ఏరియాలోనే జరిగాయి.
(10:58) అమెరికాలో ఎప్పటి నుంచో వీరి ఓట్లను అణచివేసే కుట్ర ఉంది. సరిగ్గా ఈ ఎలక్షన్ లోనే వాళ్ళ ఓట్లు ఎక్కువగా రిజెక్ట్ అయ్యాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఫ్లోరిడా ఎలక్షన్ కమిషన్ వేల మంది పేర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగించింది. కారణం వాళ్ళు ఫెలన్స్ అంటే నేరస్తులట. అమెరికాలో సీరియస్ క్రైమ్ చేసిన వాళ్ళకి ఓటు హక్కు ఉండదు.
(11:19) వీళ్ళు ఆ రూల్ అడ్డు పెట్టుకొని వేల మందిని లిస్ట్ నుంచి లేపేశారు. కానీ తర్వాత క్రాస్ వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే అందులో 90% మంది అమాయకులే. ఎక్కడితో అయిపోలేదండోయ్ దీన్ని డెమోక్రసీ డెత్ అని ఎందుకు అంటారో ఇప్పుడు చెప్తా. మార్జిన్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఆల్గోర్ ఓట్లని రీకౌంటింగ్ చేయమని డిమాండ్ చేశారు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఇది చాలా బేసిక్ హక్కు కానీ బుష్ టీం ఏమని వాదించిందంటే రీకౌంటింగ్ చేస్తే గందరగోళం వస్తుంది సిస్టం అన్స్టేబుల్ అవుతుందని చెప్పింది.
(11:48) చివరికి ఈ గొడవ సుప్రీం కోర్టు కి ఎక్కింది. అక్కడ ప్రజాస్వామ్యం సిగ్గుపడే తీర్పు వచ్చిందండోయ్ కోర్టులో తొమ్మిది మంది జడ్జ్‌లు ఉన్నారు. అందులో ఐదుగురు కన్జర్వేటివ్స్ అంటే బుష్ పార్టీ సపోర్టర్స్ నలుగురు లిబరస్ అంటే డెమోక్రటిక్ సపోర్టర్స్ అంటే ప్రజలు కాదు ఈ తొమ్మిది మందే తదుపరి ప్రెసిడెంట్ ఎవరో డిసైడ్ చేయబోతున్నారు అన్నమాట మెజారిటీ బుష్ వైపు ఉంది కాబట్టి ఆ తీర్పు ఎలా ఏడుస్తుందో 100% మనకు అర్థమైపోయి ఉంటుంది.
(12:10) సరిగ్గా అదే జరిగింది కూడా ఆ తొమ్మిది మంది జడ్జిల్లో ఐదుగురు రీకౌంటింగ్ జరగకూడదు అన్నారు. నలుగురు జరగాలి అన్నారు. అంటే 10 కోట్ల మంది జనం ఓట్లు వేసిన ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఈ ఐదుగురు జడ్జులు డిసైడ్ చేశారన్నమాట. ప్రెసిడెంట్ ఎవరు? ఇందులో ఆంటోని స్కాలియా అనే జడ్జ్ ఒక విచిత్రమైన లాజిక్ చెప్పాడు. అదేంటంటే మనం ఓట్లను రీకౌంటింగ్ చేస్తే జార్జ్ బిష్ యొక్క లెజిటిమసీ దెబ్బ తింటుందట.
(12:36) అంటే నిజం బయటపడితే ప్రెసిడెంట్ పరువు పోతుందట. అందుకే నిజాన్ని బయటికే రానివ్వద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. చివరకు డిసెంబర్ 2000లో సుప్రీం కోర్ట్ రీకౌంటింగ్ ని ఆపేసింది. జార్జ్ బుష్ గెలిచినట్టు ప్రకటన ఇచ్చేసింది. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది ఇప్పుడు ఫ్లోరిడా గవర్నర్ గా ఉన్నది ఎవరు అనుకుంటున్నారు సాక్షాత్తు జార్జ్ బుష్ సొంత తమ్ముడు జెఫ్ బుష్ పోనీ ఎలక్షన్ కండక్ట్ చేసిన సెక్రెటరీ క్యాథరిన్ హ్యారీస్ సంగతి చూద్దామా ఆవిడ అక్కడే బుష్ కి క్యాంపెయినింగ్ చేస్తుంది.
(13:01) మన భాషలో చెప్పాలంటే పిచ్ మనదే బ్యాటింగ్ మనదే అంపైర్ కూడా మనోడే అందుకే అంటారు 2000 సంవత్సరంలో అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నుకోబడలేదు. సుప్రీం కోర్ట్ ద్వారా ఎంపిక చేయబడ్డాడు. ఒక ఓల్డెస్ట్ డెమోక్రసీకి ఇంతకంటే అవమానం ఎక్కడైనా ఉంటుందా? సరే ఇదంతా 25 ఏళ్ల క్రితం మాట అనుకుందాం. కానీ ఈరోజుకి అమెరికాలో ఒక లీగల్ చీటింగ్ జరుగుతోంది.
(13:21) దాని పేరే జర్రీ మాండరింగ్. ఎలక్షన్ లో చీటింగ్ రెండు రకాలు. ఒకటి ఇల్లీగల్ అంటే బ్యాలెట్ బాక్స్ లో దొంగతనం. రెండు లీగల్ చట్టం సపోర్ట్ తో చేసే మోసం అమెరికాలో రెండో రకం చాలా బాగా నడుస్తుంది. బ్యాలెట్ బాక్స్ులను ఎత్తుకెళ్లే రిస్క్ లేకుండా సిస్టమ్స్ ని మేనేజ్ చేయడం అక్కడ ప్రతి 10 ఏళ్లకు జనాభా లెక్కల తర్వాత రాజకీయ నాయకులే స్వయంగా తమకు నచ్చినట్టు నియోజక వర్గాల గీతలు మార్చుకుంటారు.
(13:45) ఉదాహరణకు ఒక ఏరియాలో 60% మంది డెమోక్రట్స్ 40% మంది రిపబ్లికన్స్ ఉన్నారనుకుందాం. కామన్ సెన్స్ ప్రకారం 60 సీట్లు డెమోక్రట్స్ కి రావాలి. కానీ అక్కడ బోర్డర్స్ ని ఎంత తెలివిగా గీస్తారంటే ఆ 40% ఓట్లు ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లో చెల చేస్తారు. దీన్నే టెక్నికల్ గా జర్రీ మాండరింగ్ అంటారన్నమాట. నమ్మట్లేదా 2022 లో టెక్సాస్ ఎలక్షన్ చూద్దాం.
(14:07) అక్కడ రిపబ్లికన్స్ కి 55% డెమోక్రాట్స్ కి 44% ఓట్లు వచ్చాయి. అంటే ఓట్ల షేర్లో పెద్ద తేడా లేదు. కానీ సీట్ల విషయానికి వస్తే రిపబ్లికన్స్ కి 22 సీట్లు వస్తే డెమోక్రట్స్ కి కేవలం 13 వచ్చాయి. అదే అమెరికా మార్క్ డెమోక్రసీ అన్నమాట. ఫ్లోరిడాలో జరిగిన డర్టీ మనిపులేషన్ చూడండి 2020 లో అక్కడ 16 రిపబ్లికన్ సీట్లు 11 డెమోక్రాట్ సీట్లు ఉండేవి.
(14:30) కానీ 2022 వచ్చేసరికి మ్యాజిక్ చేసినట్టు రిపబ్లికన్ సీట్లు 20 అయిపోయాయి. డెమోక్రాట్ సీట్లు ఎనిమిదికి పడిపోయాయి. ఇదంతా ఆ జర్రీ మాండరింగ్ మహిమే. మరి అపోజిషన్ పార్టీ ఎందుకు దీనిపై గొడవ చేయట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు. ఆన్సర్ చాలా సింపుల్. ఈ గీతలు గీసే అధికారం ఆయా రాష్ట్రాల చేతిలో ఉంటుంది. రిపబ్లికన్స్ పవర్ లో ఉన్న స్టేట్స్ లో వాళ్ళు గీస్తారు.
(14:50) డెమోక్రాట్స్ పవర్ లో ఉన్న స్టేట్స్ లో వీళ్ళు గీసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే దొంగ దొంగని తిట్టినట్టు అందుకే ఎవరికి వాళ్ళు సైలెంట్ గా గమ్మును ఉండిపోతారున్నమాట. టెక్నికల్ గా మీకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా మీరు ఓటు వేయలేరు. అలా చేస్తారు వాళ్ళు. 2020 తర్వాత 26 రాష్ట్రాల్లో కొత్త చట్టాలు తెచ్చారు.
(15:09) పోలింగ్ బూతులను తగ్గించేసి జనం నాలుగు నుంచిఐదు గంటలు లైన్ లో నిలబడేలా చేశారు. ఇది ముఖ్యంగా బ్లాక్ మరియు హిస్పానిక్ ప్రజలు ఉండే ఏరియాల్లో టార్గెట్ గా జరుగుతుంది. జార్జియా రాష్ట్రంలో అయితే మరీ దారుణం. అక్కడ ఓటు వేయడానికి ఐదు గంటలు ఎండలో నిలబడ్డ వ్యక్తికి ఎవరైనా మంచి నీళ్లు బాటలు ఇస్తే అది నేరం. ఇద్దరిని జైల్లో వేస్తారు. అంటే అక్కడ నీళ్ళ ఇవ్వడం క్రైమ్ అన్నమాట.
(15:29) కానీ ఓట్లు దొంగలించడం మాత్రం ఫుల్ లీగల్ అందుకే అంటారు అద్దాల మేడలో ఉండేవాళ్ళు ఇతరుల ఇళ్లపై రాళ్లుు విసరకూడదు అని ఓట్లు రీకౌంటింగ్ ఆపేసి సుప్రీం కోర్టు ప్రెసిడెంట్ ని సెలెక్ట్ చేసే దేశం మ్యాప్ లో గీతలు గీసి గెలిచే దేశం నీళ్ళ ఇస్తే అరెస్ట్ చేసే దేశం మాకు డెమోక్రసీ గురించి క్లాసులు పీకడం ఆపితే మంచిది. మీది ఓల్డెస్ట్ డెమోక్రసీ కావచ్చు కానీ కచ్చితంగా ప్యూర్ మాత్రం అస్సలు కాదు సంకర జాతి ఆ జ్ఞానం మీ దగ్గరే ఉంచుకోండి మాకు అక్కర్లేదు.
(15:59) 1818 లో ఫ్రాంకెన్‌స్టైన్ అనే నవల వచ్చింది. అందులో ఒక సైంటిస్ట్ ఒక రాక్షసుని తయారు చేస్తాడు. చివరకు ఆ రాక్షసుడే ఆ సైంటిస్ట్ ని నాశనం చేస్తాడు. దీన్నే ఫ్రాంకెన్స్టెన్ పారడాక్స్ అంటారు. ఇది ఇప్పుడు అమెరికాకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అమెరికా ఏ మాన్స్టర్ ని అయితే క్రియేట్ చేసిందో అది వాళ్ళనే ఎలా కాటేసింది. దీని కథ 2001లో మొదలైంది. 9/1 అటాక్ తర్వాత జార్జ్ బుష్ ఒక మాట అన్నారు.
(16:20) మీరు మాతో అయినా ఉండండి లేదా టెర్రరిస్టులతో అయినా ఉండండి. ఆ మాన్స్టర్ ని పుట్టించింది ఎవరో కాదు అమెరికానే 1979 లో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ని పూర్తిగా ఆక్రమిస్తారేమోనని భయపడ్డ అమెరికా ఆపరేషన్ సైక్లోన్ అనే సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసింది.
(16:39) అప్పట్లో సోవియట్ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ముజాహిదీన్ గ్రూప్ కి సిఐఏ ద్వారా డబ్బులు, వెపన్స్, ట్రైనింగ్ పొందాయి. అప్పుడు వాళ్ళను ఫ్రీడమ్ ఫైటర్స్ అని గొప్పగా మార్కెటింగ్ చేసింది. యుద్ధం ముగిసాక ఆ ముజాహిదీన్లే తాలిబాబన్లుగా అల్కైదలుగా మారారు. అమెరికా పెంచి పోషించిన అల్కైదా ఫౌండర్ ఒసామా బిన్ లాడెన్ చివరకు అమెరికా మీద అటాక్ చేశాడు. అంటే ఈరోజు అమెరికా భయపడుతున్న టెర్రర్ ని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో పుట్టించింది అమెరికానే.
(17:04) టెర్రరిజం ఎంత ప్రమాదమో తెలిసినా అమెరికా దాన్ని ఎందుకు ఆపదో తెలుసా? ఎందుకంటే టెర్రరిజం ఉంటేనే యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాలు జరిగితేనే వీళ్ళు ఆయుధాలు అమ్ముకోవచ్చు. ఆయుధాలు అమ్ముకుంటేనే వాళ్ళక కూడు దొరుకుతుంది. అందుకే 9/1 తర్వాత వార్ ఆన్ టెర్రర్ అని కొత్త పదం తెచ్చింది. గమనించారా గత 20 ఏళ్లలో టెర్రరిజం తగ్గకపోగా పెరిగింది. ముజాహిదీన్ నుంచి తాలిబాన్ తర్వాత ఐఎస్ఐఎస్ఐ, ఐఎస్ఐఎస్ఐ కే, బోకోహరం ఇలా ఒకదాని తర్వాత ఒకటి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి.
(17:32) అమెరికా డిఫెన్స్ బడ్జెట్ తగ్గుతున్నప్పుడల్లా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట కొత్త టెర్రర్ గ్రూప్ పుట్టుకొస్తుంది. ఇదొక సీక్రెట్ పాటర్న్ అన్నమాట. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లని లేపేస్తామని వెళ్ళారు 20 ఏళ్ళ ఉన్నారు లక్షల కోట్లు తగలేశారు. కానీ రిజల్ట్ 2021లో మళ్ళీ తాలిబాన్లే పవర్ లోకి వచ్చారు. యుద్ధాన్ని 20 ఏళ్ల సాగదీత తప్ప సాధించింది మాత్రం సున్నా వేరే దేశాలయితే ఈ యుద్ధాల వల్ల ఎకనామీ నాశనం అయపోయేది.
(17:54) కానీ అమెరికాకు మాత్రం యుద్ధాలే ప్రాఫిటబుల్ బిజినెస్. ప్రపంచం మొత్తాన్ని యుద్ధంలోకి నెట్టి మళ్ళీ వీళ్ళే నోబెల్ శాంతి బహుమతి అడుగుతారు. మొన్నటికి మొన్న డొనాల్డ్ ట్రంప్ నేను యుద్ధాలు ఆపాను. నాకు ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు అని తెగ బాధపడ్డాడు. ప్రపంచానికి నిప్పు పెట్టి ఫైర్ ఇంజన్ పంపడం అంటే ఇదే అన్నమాట.
(18:14) 2009లో బరక్ ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. కానీ విచిత్రం ఏంటంటే అదే ఒబామా తన పాలసీలో ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, లిబియా, యమెన్, సోమాలియా ఇలా ఏడు దేశాలపై ఒకే ఏడాదిలో 26వ000 బాంబులు విసిరాడు. అందులో వేల మంది అమాయకులు చచ్చిపోయారు. వీళ్ళు బాంబులు వేసి ఎలాంటి శాంతిని స్థాపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకడి మెడ మీద కత్తి పెట్టి నోరు మూయించడాన్ని శాంతి అన్నారు అది భయం అదే పని వేరే దేశం చేస్తే మిలిటరీ డిక్టేటర్షిప్ అని అరాచకం అని పేర్లు పెడతారు.
(18:44) కానీ అమెరికా చేస్తే మాత్రం అది నేషనల్ సెక్యూరిటీ మరియు గ్లోబల్ పీస్ ఇదంతా ఒక బిజినెస్ సైకిల్ ఒక రెస్టారెంట్ నడవాలంటే కస్టమర్లు రోజు రావడం ఎంత అవసరమో అమెరికా డిఫెన్స్ కంపెనీలు బతకాలంటే మార్కెట్లో యుద్ధాలు జరగాలన్నది కూడా అంతే కామన్. అందుకే ఒక యుద్ధం ఆగిపోగానే ఇంకో శత్రువుని వెతుక్కుంటారు. కోల్డ్ వార్ అయిపోగానే తాలిబాన్ వచ్చారు.
(19:06) తాలిబాన్ వాళ్ళు అవ్వగానే ఐఎస్ఐఎస్ వచ్చింది. ఈ సైకిల్ నిన్న నడిచింది ఇవాళ నడుస్తోంది. అమెరికా లాభం ఉన్నంత కాలం రేపు కూడా నడుస్తూనే ఉంటుంది. ఇప్పటిదాకా మనం చూసిన ఎగ్జాంపుల్స్ అన్నిటి వెనుక ఒకే ఒక్క పాటర్న్ ఉంది. అమెరికా మాట విన్నంత కాలం అంతా బాగుంటుంది సుమా. కానీ ఎవరైనా సొంత దేశం కోసం నిలబడితే చాలు. అమెరికా లోపల ఉన్న మోరల్ కాంపాస్ నిద్ర లేస్తుంది.
(19:26) వెంటనే ఫ్రీడమ డెమోక్రసీ అంటూ లెక్చర్లు మొదలవుతాయి. వీళ్ళేమో ల్ాండ్ ఆఫ్ ద ఫియర్ అంటారు. కానీ ప్రపంచంలో అత్యధిక ఖైదీలు ఉన్నది మాత్రం వాళ్ళ ఇంట్లోనే హ్యూమన్ రైట్స్ అంటారు కానీ గ్వాంటనమో బే టార్చర్ సెంటర్లు నడుస్తాయి. దాన్ని నడిపేది వీళ్ళే. ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు కానీ ఓట్లు లెక్క పెట్టకుండా కోర్ట్‌ల ద్వారా ప్రెసిడెంట్లు నిలబడిపోతారు.
(19:48) వార్ ఆన్ టెర్రర్ అంటారు కానీ ప్రపంచానికి టెర్రరిజాన్ని ఎక్స్పోర్ట్ చేసేది వీళ్లే పీస్ పేరుతో యుద్ధాలు ఫ్రీడమ పేరుతో అనిచివేత డెమోక్రసీ పేరుతో డిక్టేటర్షిప్ ఇక్కడ సమస్య అమెరికా దగ్గర పవర్ ఉండడం కాదు ఆ పవర్ ని నిజం అని ప్రపంచాన్ని నమ్మించడం. ఇతరులు చేస్తే తప్పు అమెరికా చేస్తే రైట్ రైట్ ఒక భారతీయుడిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే.
(20:10) అమెరికాకు హ్యూమన్ రైట్స్, డెమోక్రసీ, పీస్ అనేవి విలువలు కాదు వ్యాపారం వ్యాపారపు టూల్స్ మాత్రమే. తమ ఫారెన్ పాలసీ కోసం ఆయుధాలు అమ్ముకోవడం కోసం వాడే ఆయుధాలు అవి. మీడియా హాలీవుడ్ ఎన్జీఓల ద్వారా ఆ పర్సెప్షన్ ని మన మెదడులోకి చొప్పించారు. ఈ డాక్యుమెంటరీ చూసాక ఆ ల్యాండ్ ఆఫ్ ఫ్రీ వెనుక ఉన్న అసలు రంగులు ఏంటో మీరే కామెంట్ చేయండి.
(20:31) వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment