వేమన పద్యరహస్యం || మలముతిత్తి ||కుట్టు కాశే || vemana padyalu with bhavam
https://youtu.be/Uh2zhxS-ffM?si=pLMQX_mpHY19d5zO
https://www.youtube.com/watch?v=Uh2zhxS-ffM
Transcript:
(00:01) ఆడవారి చొంగ కడుపులోకి చచ్చేటట్టు వాళ్ళ పెదవులను కొరుకుతారు కొరికి వారి చొంగ తాగుతారు. ఎందుకట్లా చేస్తారు ఈ నరులు ఎందుకట్లా చేస్తారు ఈ మనుషులు అది కడుపులోకి మలంగా మారి చేరుతుంది అని వేమని అంటాడు. శివుని కొడుకు గణపతి పెళ్లి చేసుకోలేదు. ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకోలేదు. ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఆ వేమల పద్యాల్లోని ఆంతర్యాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
(00:29) నీద్రశోకి స్వాగతం దీఘ్నద్రశోకిస్వాగతం పెదవి కొరుకుదురిల నధరామృతంబని చొంగ కడుపులోన జచ్చునటుల మలము తిత్తి మీద మనసిట్లు పుట్టెనో విశ్వదాభిరామ వినురవేమ సతుల మాయ చూచి చాలించి భైరవు పెద్ద కడుపువాడు పెండ్లి మానే కుట్టుకాశగట్టి భువినాంజనేయుండు విశ్వదా భిరామ వినరవేమ ఇందాక నేను చెప్పినటువంటి రెండు పద్యాలు ఇవే మొదటి పద్యం పెదవి కొరుకుదురిల నధరామృతంబని చొంగ కడుపులోన జొచ్చునటుల మలము తిత్తి మీద మనసిట్లు పుట్టెనో విశ్వదాభిరామ వినురవేమ వేమల గారు తన పద్యాల్లో పచ్చి నిజాలను ఎంత మొహమాటం లేకుండా చెబుతారో ఈ పద్యం దానికి ఒక మచ్చుతరహ బాహ్య సౌందర్యం పట్ల మనుషులకు
(01:24) ఉండే మోహాన్ని బ్రహ్మను ఆయన ఈ పద్యంలో చాలా ఘా కాటుగా విమర్శిస్తాడు. పెదవి కొరుకుదురిల నధరామృతంబని లోకంలో మనుషులు పెదవుల మీద ఉండేటటువంటి అధరామృతం అని భ్రమపడి వాటిని ముద్దు పెట్టుకుంటారు లేదా కొరుకుతారు. చొంగ కడుపులోన జొచ్చునట్టులా అన్నాడు. నిజానికి అక్కడ ఉండేది కేవలం చొంగ అంటే లాలాజలం మాత్రమే అది చివరికి కడుపులోకి పోతుంది.
(01:52) మలము తిత్తి మీద మనసెట్లు పుట్టెను అసలు ఈ మానవ శరీరం అంటేనే మలమూత్రాలతో నిండిన ఒక సంచి తిత్తి అన్నాడు మేమన అటువంటి అశుద్ధమైన శరీరం మీద ఆ బాహ్య రూపం మీద మనుషులకు అంతటి మోహం ప్రేమ ఎట్లా కలుగుతుందో కదా విశ్వదాభిరామ విడర వేమ అంటాడు. ఇక్కడ వేమన చాలా ప్రాక్టికల్ గా మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఎవరిని తక్కువ చేయడం కాదు.
(02:20) మనుషులు కేవలం చర్మం రంగును రూపాన్ని చూసి అది శాశ్వతం అని భ్రమపడి ఆ మాయలో పడిపోతుంటారు. ఆ మాయలో పడిపోవడం వద్దు అని గుర్తు చేయడమే వేమన గారి ఉద్దేశం. భ్రమ వాస్తవం మనం ఏదో అమృతం అనుకుంటాం కానీ అది కేవలం శరీరంలోని ఒక ద్రవం మాత్రమే. శరీరం పట్ల అతిగా ఉండే మోహాన్ని తగ్గించుకొని అంతరాత్మను లేదా దైవాన్ని గుర్తించమని వేమన గారి సందేశం. మలము తిత్తి అని వాడడం వినడానికి కొంచెం కఠినంగా అనిపించిన మానవ శరీరం యొక్క భౌతిక సత్యాన్ని ఆయన కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
(02:56) వేమన గారు ఎప్పుడూ పైపైన మెరుగులను చూసి మోసపోవద్దని లోపల ఉన్న అసలైన సత్యాన్ని వెతకమని ఈ పద్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. వేమల పద్యంలోని సారాంశం శరీర భౌతిక తత్వాన్ని దానిపై మనకు ఉండే మితిమీరిన మోహాన్ని ప్రశ్నిస్తుంది. దీనిని వివరించడానికి పురాతన గాథల్లోని బిల్వమంగలుడు అద్భుతంగా ఈ పద్యానికి సరిపోలుతుంది అతని కథను విందాం.
(03:21) బిల్వమంగలుడు అనే పండితుడు చింతామణి అనే వేష్య పైన విపరీతమైన వ్యామోహం తోటి ఉండేవాడు. ఒకరోజు తండ్రి యొక్క శ్రాద్ధ కర్మ అంటే అతను చనిపోతే అతనికి చేయాల్సినటువంటి కర్మ ఆ రోజు ఉంటుంది. అది దాన్ని కూడా వదిలేసి భారి వర్షంలో నదిని దాటి ఆ వేష్య కోసం ఆవిడ దగ్గరికి వెళ్తాడు. నదిని దాటడానికి ఆయన ఆ నదిలో కొట్టుకుపోతున్నటువంటి ఒక వస్తువును చూసి దాన్ని ఆసరా చేసుకొని ఈదుతాడు.
(03:48) నిజానికి అతను పట్టుకున్నది ఒక శేవాన్ని ఆమె ఇంటి గోడ ఎక్కడానికి ఆ గోడ మీద పాకుతున్నటువంటి పామును తాడు అనుకొని ఆ పామును పట్టుకొని గోడ ఎక్కుతాడు. అతని పిచ్చిని చూసినటువంటి చింతామణి అసహించుకొని ఛి మాంసపు ముద్దలైన ఈ అవయవాల మీద చర్మం మీద నీకున్న శ్రద్ధలో సగం ఆ దేవుడి మీద పెడితే నీకు మోక్షం వచ్చేది కదా అని గద్దిస్తుంది అని కోపం వస్తుంది ఆయనను తిట్టిపోస్తుంది.
(04:19) ఆ క్షణమే అతనికి జ్ఞానోదయం అవుతుంది. వేమన చెప్పినటువంటి మలము తిత్తి అనే నిజాన్ని చింతామణి మాటలు విల్వమంగనుడికి గుర్తు చేస్తాయి. బాహ్య సౌందర్యం వెనుక ఉన్నటువంటి అసహ్యకరమైన నిజాన్ని గ్రహించినప్పుడే మనిషిలో వైరాగ్యం లేదా నిజమైన జ్ఞానం కలుగుతుందని ఈ కథ మరియు పద్యం ఈ రెండు మనకు ఇదే విషయాన్ని తెలియపరుస్తాయి.
(04:45) నేటి కాలంలో ఈ భావజాలం ఎలా ఉపయోగపడుతుంది అంటే సోషల్ మీడియాలో ఫిల్టర్ల వెనుక ఉండే కృత్రిమ అందాన్ని చూసి మోసపోకూడదు అని నేర్పుతుంది. శరీరం లోపల ఏం జరుగుతుందో అంటే అనారోగ్యాలు మలినాలు తెలిస్తే జంక్ ఫుడ్ మానేసి ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి అనే విషయాన్ని కూడా ఈ పద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. యవ్వనం అందం శాశ్వతం కావని గుర్తించడం వల్ల అహంకారం అనేది తగ్గిపోతుంది.
(05:13) రూపం కంటే గుణం గొప్పది అని తెలిస్తే శారీరక రూపాల వల్ల వచ్చేటటువంటి అనారోగ్య భావాలు పోతాయి. కేవలం శారీరక ఆకర్షణతో మొదలయ్యే బంధాలు ఎక్కువ కాలం నిలవవని మనసుల కలయక ముఖ్యమని ఈ పద్యం చెబుతుంది. ఎదుటివారిని కేవలం ఒక శరీరం లాగా చూడడం మానేస్తే నేరాలు తగ్గిపోతాయి. మనిషిని వారి మేధస్సు ప్రవర్తనను బట్టి గౌరవించడం మనం అలవాటు చేసుకోవడం ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు.
(05:42) మోహం నుండి విముక్తి వస్తువులు లేదా వ్యక్తులపై ఉండేటటువంటి విపరీతమైన అడిక్షన్ నుంచి బయట పడవచ్చు ఈ కథ మరియు పద్యం ద్వారా మన లోపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఇతరుల విమర్శలకు కుంగిపోము. లాభ నష్టాలు సుఖ దుఃఖాలు ఈ శరీరానికే కానీ ఆత్మకు కావు అని గ్రహిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. సౌందర్య సాధనాల వెనుక వేల కోట్ల ఖర్చు చేసే బదులు సహజమైన జీవనశైలికి ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఈ కథ ఈ పద్యం యొక్క భావం ద్వారా మనకు ఏర్పడుతుంది.
(06:19) కేవలం ప్రదర్శన కోసం చేసే వృద్ధా ఖర్చులు తగ్గుతాయి. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. అందరి శరీరాలు రక్తమాంసాలతో కూడినవే అని తెలిస్తే కుల మత భేదాలు హెచ్చుతగులు నశిస్తాయి. ఈ శరీరం ఎలాగ మట్టిలో కలిసేదే అని తెలిస్తే ఉన్నప్పుడే పది మందికి సహాయం చేయాలి అనే ఆలోచన వస్తుంది. బయట వెతికే ఆనందం కంటే మనసులో వెతికే శాంతి గొప్పదని అర్థమవుతుంది.
(06:50) లోకాన్ని త్యజించడం కాదు లోకం యొక్క అసలు స్వరూపాన్ని అర్థం చేసుకోవడమే వైరాగ్యం. వెదవల మీద ఉండేది అమృతం కాదు జ్ఞానం నుంచి వచ్చే సత్యమే అమృతం అని తెలుస్తుంది. శరీరం ఒక తిత్తి అంటే ఒక సంచి అది మాత్రమే అని తెలిస్తే మరణాన్ని ధైర్యంగా స్వీకరించగలుగుతాం. బిల్వమంగలుడి లాగా తప్పుడు దారిలో ఉన్నటువంటి శక్తిని సరైన దారిలోకి మల్లించడానికి ఇది స్ఫూర్తినిస్తుంది.
(07:17) వేమన గారు ఈ పద్యాన్ని కేవలం అసహ్యం కలిగించడానికి చెప్పలేదు. మన కళ్ళకు కట్టిన మోహం అనే పొరను తొలగించడానికి ఈ పద్యాన్ని చెప్పారు. నేటి గ్లామర్ ప్రపంచంలో ఈ సందేశం ఒక రియాలిటీ చెక్ లాంటిది. సతుల మాయ చూచి చాలించి భైరవు పెద్ద కడుపువాడు పెండ్లి మానే కుట్టు కాశిగట్టి భూవినాంజనేయుండు విశ్వదాభిరామ వినురవేమ.
(07:45) ఈ పద్యంలో వేమన గారు వైరాగ్యం మరియు బ్రహ్మచర్యం యొక్క గొప్పతనాన్ని చాలా చాకచక్యంగా వివరిస్తారు. లౌకిక బంధాలు ముఖ్యంగా స్త్రీ మాయ అంటే ఇక్కడ కేవలం స్త్రీ అని కాదు సంసార బంధం అని కూడా అర్థం సాక్షాత్తు దైవ స్వరూపులే ఆ బంధాలకు దూరంగా ఉన్నారని గుర్తు చేస్తాడు. సతుల మాయ చూచి చాలించి భైరవుడు స్త్రీల వల్ల కలిగే వ్యామోహాన్ని ఆకర్షణను గమనించినటువంటి పరమశివుడు భైరవుడి రూపంలో వాటికి దూరంగా ఉన్నాడు.
(08:17) పెద్ద కడుపువాడు పెండ్లి మానే పెద్ద బొజ్జం ఉన్నవాడు ఎవరు వినాయకుడు కూడా సంసార బంధాల కంటే జ్ఞానానికే ప్రాధాన్యత ఇచ్చి పెళ్లికి దూరంగా ఉన్నాడు. కొన్ని పురాణ గాథల ప్రకారం మనకు ఈ విషయం తెలుస్తుంది. కుట్టుకాశ గట్టె భువి ఆంజనేయుండు హనుమంతుడు ఈ లోకంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మొలతాడు అంటే కాశే కట్టుకొని రామసేవకే అంకితమవుతాడు. కేవలం మొల వరకే ఆంజనేయ స్వామికి వస్త్రాలు ఉంటాయి.
(08:48) దాన్నే ఇక్కడ కుట్టు కాశ కట్టే భువిన ఆంజనేయుండు అన్నాడు వేమ వేమల పద్యంలోని అంశాలను పురాణ కథలతో పోల్చి చూసుకుంటే ఒక కథ ప్రకారం వినాయకుడు తన తల్లి పార్వతీ దేవి కంటే అందమైన గుణవంతురాలైన స్త్రీని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ లోకమంతా వెతికిన తల్లిని మించినటువంటి వ్యక్తి ఆయనకు కనిపించదు. అంటే దీని అంతరార్థం ఏంటంటే బాహ్య సౌందర్యం కంటే మాతృత్వం జ్ఞానం గొప్పవని గ్రహించి ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయారు.
(09:20) ఇది వేమన చెప్పినటువంటి మాయను జయించడం అనే భావానికి సరిగ్గా సరిపోతుంది. హనుమంతుడు లంకలో సీతమ్మను వెతికేటప్పుడు రావణుని అంతఃపురంలో నిద్రిస్తున్న ఎంతో మంది స్త్రీలను చూస్తాడు. కానీ ఆయన మనసు చెలించదు. నా దృష్టి కేవలం మాతృమూర్తి అయిన సీతమ్మ వెతుకులాట పైనే ఉంది అని నిరూపిస్తాడు. తన శక్తిని సంసార బంధాల్లో వృధా చేయకుండా రామ కార్యానికి ఆయన వెచిస్తాడు.
(09:48) అంటే అదే లక్ష్యంగా ఆయన ఉంటాడు. హనుమంతుడిలా మన లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టాలి. పక్కదారి పట్టించే ఆకర్షణల మీద దృష్టి పెట్టకూడదు. అనవసరమైన భావోద్వేగాల బంధాల్లో చిక్కుకోకుండా మన శక్తిని కెరీర్ వైపు మల్లించాలి. వినాయకునిలా ఏది ముఖ్యం అంటే జ్ఞానమా వినోదమా అనేది తెలుచుకోవాలి. ఆత్మ నిగ్రహం వ్యక్తిత్వ క్రమశిక్షణ మనసు చెప్పినట్లు మనం వినడం కాదు మన అదుపులో మనసు ఉండాలి.
(10:19) బ్రహ్మచర్యం అంటే క్రమశిక్షణ. నేటి కాలంలో బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోవడం కాదు ఇంద్రియ నిగ్రహంతో ఉండడం సాలీనత హనుమంతుని కాసే అంటే సింపుల్ డ్రెస్సింగ్ నేటి షో ఆఫ్ సంస్కృతికి వ్యతిరేకంగా సాదా సీద జీవనాన్ని మనకు సూచిస్తుంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. శారీరక ఆకర్షణల కంటే మానసిక వికాసం గొప్పదని తెలుసుకోవాలి. మానసిక దృఢత్వం కలిగి ఉండాలి.
(10:48) భావోద్వేగ స్థిరత్వం కలిగి ఉండాలి. బంధాలు తెగిపోయినప్పుడు లేదా విఫలమైనప్పుడు కుంగిపోకుండా స్థిరంగా ఉండాలి. ఒంటరిగా ఉండడం శాపం కాదు అది మనల్ని మనం తెలుసుకునే అవకాశం అని గ్రహించాలి. సంతోషం కోసం ఇతరుల మీద సతుల మాయ అనేటటువంటి వేమన మాటలాగా ఇతరుల మీద ఆధారపడకూడదు. కనిపించే ప్రతి అందం వెనుక ఉన్న నిజాన్ని విశ్లేషించే తెలివితేటలను కలిగి ఉండాలి.
(11:17) హనుమంతుడిలా సమాజ హితం కోసం పాటుపడాలి. ఎదుటివారిని కేవలం ఒక వస్తువులా కాకుండా గౌరవ భావంతో చూడాలి. అవినీతి అనైతిక పనులకు దారి తీసేటటువంటి మాయలకు లొంగిపోకూడదు. సెలబ్రిటీల కంటే హనుమంతుడు వినాయకుడు వంటివారి గుణాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఏ బంధం మనకు మేలు చేస్తుంది ఏది మనల్ని వెనక్కి లాగుతుందో నిర్ణయించుకోవాలి. అనవసర బంధాల పట్ల వృధ అయ్యే సమయాన్ని నైపుణ్యాలు పెంచుకోవడానికి వాడుకోవాలి.
(11:51) బయట వెతికే అమృతం కంటే మన లోపల ఉండే ప్రశాంతతే గొప్పదని గుర్తించాలి. సినిమా ప్రపంచం చూపే ప్రేమ మాయలో పడకుండా జీవిత వాస్తవాలను గౌరవించాలి. వేమన గారు ఈ పద్యంలో గొప్ప దేవుళ్ల ఉదాహరణలు ఇచ్చింది మనల్ని భయపెట్టడానికి కాదు మనలో ఉన్న హనుమంతుడి లాంటి బలాన్ని గుర్తు చేయడానికి ఇలా వేమనగారు నిగూడమైనటువంటి భావాలను అలతి అలతి తెలుగు పదాలలో అందరికీ అర్థమయ్యేంత విధంగా గొప్ప భావాన్ని అందులో ఇమిడ్చి మనకు అందించారు.
(12:28) ఇంత అద్భుతమైన పద్యాలను ఇంత అద్భుతమైనటువంటి పురాణ గాధల్ని ఇంత అద్భుతమైనటువంటి మన సాహిత్యాన్ని గౌరవించుకుంటూ వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరిచి మీకు ఇంకా ఎలాంటి విషయాల పైన వీడియోలు కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యోస్మి శుభం భుయాత్ [సంగీతం]
No comments:
Post a Comment