Saturday, February 28, 2026

*****అయమాత్మ బ్రహ్మ

అయమాత్మ బ్రహ్మ

ప్రతి జీవరాశిలోనూ ఉన్న చైతన్య శక్తకూ డా ఆ పరమాత్మేనని అవి తన కంటే వేరు కాదని తాను అందరిలో ఉన్నానని అవి తనలో ఉన్నవని నామరూపొలకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఆ పరబ్రహ్మ సర్వేసర్వత్రా నిండి ఉన్నట్టుగా తీవ సాధన వల్ల “అయామాత్మ బ్రహ్మ” అను మహా వాక్యము అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఇది సమాధి అని ఇది సంసారమని ప్రత్యేకత పోయి సహజంగా నిర్వికల్పంలోనే ఉటాడు. ఎందుచేతంటే భ్రాంతి వల్ల బుద్దిచే తెచ్చుకున్న మానసిక సంసారం విడిబడుతుంది. ఇక సంసారధ్యాస ఉండదు. పాలలో నుండి వచ్చిన వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. అది మళ్లీ పాలలో కలవదు. అదేవిధంగా తాను నిర్వికల్ప సమాధి ఆ తరువాత సాధనాబలంతో సహజ సమాధి స్థితిని పొందిన యోగి పూర్ణుడవటం మూలంగా సంసారంలో కలవడు. తీవ సాధన వలన రెండవ వాడులేడు. ఎకమే వాకద్వతీయం బ్రహ్మ ఉన్నది ఒక్కడే అది తాననే నిత్యనిరంతరం అనుభవంతో ఉండటం వలన పూర్ణుడవుతాడు.

  అయితే చంద్రుడు చంద్రుని యొక్క వెన్నెలకు భేదంలేదు. చంద్రుడు సత్తు, వెన్నెలచిత్తు. సత్తు లేకుండా చిత్తులేదు. అ రెండూ అభేదము. తాను పూర్ణస్థితిలో ఉన్నప్పటికి ఇంకనూ శరీరము ఉంది కాబట్టి, దానికున్నవి హిత కర్మలాచరించాలి కాబట్టి, తనను ఆశ్రయించిన ముముక్షువులు తరించుటకై తత్త్వబోధ చేయాలి కాబట్టి పూర్ణుడైనప్పటికి శుక్ల చతుర్దశి చందుడివలె వ్యవహరిస్తాడు. ఇక అతను చేయవలసిన కర్మలేవీ ఉండవు. శారీర ధర్మాన్ని బట్టి ఏమి కర్మలు చేసినా చేయనట్లే లెక్క. అందుచే ఆగామి కర్మ ఫలితాలు అతనికి ఉండవు. కర్మ ఫలమంతా నిశేషమవుతుంది. తనవద్దకు వచ్చిన వారిపై జ్ఞానదృష్టి పసరించడం వలన ఆ వచ్చిన వారికి శీతలము, శాంతము చిక్కుతాయి. అటువంటి మహాయోగి యొక్క కృపా వీక్షణాలచే వారి పాపసముదాయము కూడా పటాపంచలవుతాయి. వారుద్దరింపబడుతారు. అటువంటి యోగి ఎల్లప్పుడు నిశ్చల సమాధిలో ఆనంద సముద్రంలో ఈదుతూ ఉంటాడు. లోక వ్యవాహారార్థం బలవంతంగా బయటికి వస్తాడు. ఒక్కొక్కసారి తానులొనే తాను మాట్లాడుకు ౦టాడు. నవ్వుకు ౦టాడు. శరీరము మీద ఈగలు మొదలైనవి వాలినా శరీర సృహ ఉండదు కొందరికి వారి సాధనానుసారంగా ఘనసత్కారాలు జరిగినా ఉప్పాంగరు. అవమానాలు జరిగినా కృంగిపోరు. అతినిర్మల హృదయుడై, సహనపరుడై ఉంటాడు. అతని వద్ద బద్దవైర జంతువులుకూ డా మైత్రితో మెలగుతాయి. తీవ సాధన వల్ల కొన్ని సిద్దులు పొందినప్పటికి అవి ఎన్నటికి ప్రదర్శించడు. ఈ స్థితిలో సప్త భూమికలలో విశద పరచినటుల ఒక భూమికను దాటి మరో భూమికి చేరుకుంటాడు.


నేను అద్వితీయుడను, నాశరహితుడను, విశ్వరూపుడను,
మంగళాకరుడను, శాశ్వతుడను, అనంతుడను, అచ్యుతడను, అవినాశిని, నిత్యుడను, ముక్తుడను, పరిశుద్దుడను, నిర్వికారుడను, నిర్గణుడను, స్వయం ప్రకాశకుడను, నిరాకారుడను, జ్ఞాన స్వరూపుడను, తత్త్వ స్వతూపుడను, అచలుడను, అమృత స్వరూపుడను, అవాజ్ఞానస గోచరుడను, అఖిన్నుతనుఅని ఎల్లవేళల అనునంధానవు చేనుకొనుచు ఆనందసాగరములో వోలలాడుతాడు ఆత్మారాముడై వలయును. 

అటువంటి అవధూత ఆశా పాశములు లేనివాడై, పరిశుద్దుడై, అంతటను నముభావముతో మునిగిన వాడై విదేహ కైవల్యము పొందుచున్నాడు. నియతి ప్రకారముశరీరము త్యజించగానేఆ అవధూత పునర్జన్మ కలుగచేయు బీజాలు, వాసనలు అన్నీ దగ్ధమయ్యాయి కాబట్టి పునర్జన్మ లేదు. ఆయన పరమాత్మలో కలసిపోతాడు ఎ విధంగానంటే ఘుటాకాశము అనంతాకాశము ఒకటే కదా! ఘటము భంగమవగానే ఘటాకాసము అనంతాకాశములో కలిసిపోతుంది. ఇక అక్కడావరణ లేదు. దానినే పునర్ణన్మ లేని మోక్షము అంటాం.

ఎన్నో పూర్వ జన్మలలో చేసిన పుణ్యమును వెచ్చించి మానవ శరీరము తీసుకొని సాధించవలసిన గమ్యము ఇదే. అలా చేయకపోతే జన్మపరంపరలలో చిక్కుకొని పతనమవుతాడు.


Reference book - జ్ఞాన దీపిక , page no 134, 135, 136



No comments:

Post a Comment