Saturday, February 28, 2026

Manifestation పచ్చి అబద్ధం! మీ కోరికలు నిజం చేసే యోగుల రహస్యం ఇదే | Science of Sankalpa

Manifestation పచ్చి అబద్ధం! మీ కోరికలు నిజం చేసే యోగుల రహస్యం ఇదే | Science of Sankalpa

Author Name:Telugu Talks with VRS

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguTalkswithVRS

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PJnkERn1sKc



Transcript:
(00:00) కొన్నేళ్ల క్రితం నా పరిస్థితి కేవలం అయోమయం కాదు అంతకంటే ఘోరం నాకు ఏం కావాలో నాకు చాలా స్పష్టంగా తెలుసు కానీ నేను చేసే పనులు మాత్రం దానికి పూర్తి వ్యతిరేకం. నాకు ఏకాగ్రత కావాలి కానీ గంటలు సరబడి ఫోన్లో రీల్స్ చూస్తూ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకునేవాడిని. నాకు క్రమశిక్షణ కావాలి కానీ ప్రతి చిన్న పనిని రేపటికి వాయిదా వేసేవాడిని.
(00:26) అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ప్రతి రాత్రి పడుకునే ముందు కన్నీళ్ళతో నాకు నేనే ప్రామిస్ చేసుకునేవాడిని రేపటి నుంచి పక్కా మారుతాను అని కానీ ఆ రేపు ఎప్పుడూ రాలేదు. బహుశా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీలో చాలా మంది పరిస్థితి కూడా ఇదేనేమో ఈ సమస్య ఒక వయసుకు సంబంధించినది కాదు ఫ్రెండ్స్ చదువుకునే 15 ఏళ్ల కుర్రాడు ఇదే స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు.
(00:50) కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి కనీసం తన ఆరోగ్యం కోసం లేదా తనకంటూ ఒక గుర్తింపు కోసం అడుగు వేయాలనుకునే ఒక గృహిణి కూడా లోపల ఇదే సంఘర్షణ పడుతుంది. రిటైర్ అయిన 70 ఏళ్ల పెద్దాయన కూడా తన ఆరోగ్య సాధనలో ఇదే మనసుతో యుద్ధం చేస్తుంటాడు. ఏ వయసైనా ఏ వృత్తి అయినా మన గోల్స్ వేరైనా మనందరి పరిస్థితి ఒక్కటే కానీ ఫ్రెండ్స్ ఆ నిరాశ ఇక అక్కర్లేదు.
(01:17) ఎందుకంటే ఈ చక్రం నుంచి బయటపడే మార్గాన్ని మీతో పంచుకోబోతున్నాను. గుర్తుంచుకోండి ఇది ఏదోగ లో దొరికిన సాధారణ సమాచారం కాదు ఇది వేల ఏళ్ల క్రితమే మన యోగులు మనకు అందించిన ఒక సైకలాజికల్ ప్రాసెస్ దీన్ని కేవలం హిమాలయాల్లో ఉండే ఋషులు మాత్రమే వాడలేదు. దేశాన్ని నడిపించే నరేంద్ర మోదీ దగ్గర నుంచి టెక్నాలజీతో ప్రపంచాన్ని మార్చిన స్టీవ్ జాబ్స్ దాకా రాకెట్ల నగరేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి చరిత్ర సృష్టించిన ప్రతి విజేత దాకా వీళ్ళందరూ వాళ్ళకి తెలియకుండానే ఇదే సైకలాజికల్ ప్రాసెస్ ని వాడారు.
(01:49) పేర్లు వేరైనా ప్రాసెస్ ఒక్కటే ఆ ప్రక్రియ పేరే సంకల్పం. దయచేసి దీన్నేదో విల్ పవర్ అనో మనిఫెస్టేషన్ అనో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే విల్ పవర్ బ్యాటరీ లాంటిది అయిపోతుంది. మేనిఫెస్టేషన్ కేవలం ఒక ఆశ ఫలితం కోసం ఎదురుచూస్తుంది. కానీ సంకల్పం ఒక జనరేటర్ అది శక్తిని అడుక్కోదు శక్తిని పుట్టిస్తుంది. అయితే ఈ శక్తిని ఉపయోగించే ముందు అసలు నేను చేసిన తప్పుఏంటో మీకు తెలియాలి.
(02:19) మన పెద్దలు ఎప్పుడో చెప్పారు మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహ అంటే నీ బంధనానికైనా నీ మోక్షానికైనా కారణం నీ మనసు మాత్రమే. ఇక్కడ మోక్షం అంటే ఏదో సన్యాసం తీసుకుని అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు మనల్ని కిందకి లాగేస్తున్న ఈ పాత అలవాట్ల జైలు నుంచి విడుదల పొందడం మరి నా మనసు నన్ను విజయానికి దారి తీయకుండా పాత అలవాట్లలోనే ఎందుకు బంధించింది? ఎందుకంటే నా మనసు లోతుల్లో ఉన్న ఒక తప్పుడు కథను నాకు తెలియకుండానే నేను నమ్మాను.
(02:51) నేను ఎప్పుడూ డిస్ట్రాక్ట్ అయ్యేవాడిని నావల్ల ఏదీ కాదు ఇదే నా మనసులో రన్ అవుతున్న కథ. అప్పుడే నాకు చేదు నిజం అర్థమయింది. నా మెదడు నాకు తెలియకుండానే నన్ను బాధించి మరి నా పాత స్వీయ ప్రతిబింబాన్ని కాపాడుకుంటుంది. ఇక్కడ ఒక విశ్వ సత్యం చెప్పనా మన మెదడు లక్ష్యాల వెంటపడదు అది మన అస్తిత్వాన్ని కాపాడుతుంది.
(03:14) అందుకే నేను ఎన్ని గోల్స్ పెట్టుకున్నా నా నరాల వ్యవస్థ వాటిని సైలెంట్ గా నాశనం చేసేది. అప్పుడే నేను సంకల్పం అనే యోగుల టెక్నిక్ ని కనుగొన్నాను. నేను డిసిప్లిన్ గా మారాలి అని కోరుకోవడం మానేసాను. బదులుగా నేను డిసిప్లిన్ గా ఉన్నాను అని నా బ్రెయిన్ కి చెప్పుకోవడం మొదలు పెట్టాను. ఎందుకంటే యద్భావం తద్భవతి అంటే నువ్వు దేన్నైతే బలంగా నమ్ముతావో అదే నీ అస్తిత్వం అవుతుంది.
(03:38) నీ బ్రెయిన్ ఇక దానికి వ్యతిరేకంగా పని చేయదు. అందుకే దీన్ని ఒక కఠినమైన సాధనలా మార్చుకున్నాను. రోజుకి రెండు సార్లు ఆవేశంగా కాదు అరుపులతో కాదు ప్రశాంతంగా బలంగా నిలకడగా మొదటి వారం పెద్దగా ఏ అద్భుతము జరగలేదు. కానీ రెండవ వారం ఏదో చిన్న మార్పు గమనించాను. నేను ఫోన్ కోసం చేయి చాపినప్పుడు నా బ్రెయిన్ లో ఒక అలాం మోగినట్లు అనిపించింది. పని వాయిదా వేయాలనిపించినప్పుడు లోపల ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ వచ్చింది.
(04:08) మూడవ వారం వచ్చేసరికి నా ఏకాగ్రత పదునెక్కింది. నా ఎమోషన్స్ తగ్గుముఖం పట్టాయి. కోపం తగ్గింది. అన్నింటికంటే విచిత్రం ఏంటో తెలుసా నా చుట్టూ ఉన్న ప్రపంచం ఏమీ మారలేదు. ఆఫీస్ ఒత్తిడి సమస్యలు అన్ని అవ్వే కానీ నేను వాటికి బానిసలా రియాక్ట్ అవ్వడం లేదు. ఒక యజమానిలా స్పందిస్తున్నాను. అప్పుడే నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది.
(04:32) యథా దృష్టి తథా సృష్టి అంటే నీ లోపల ప్రశాంతత ఉంటే బయట ప్రపంచం కూడా ప్రశాంతంగానే కనిపిస్తుంది. సంకల్పం అంటే ఏదో ఆకర్షించడం కాదు. సంకల్పం అంటే మనం ఏదో ఒకటిగా మారడం ఒక్కసారి మీ అంతర్గత కథ గనుక మారితే మీ ప్రవర్తన ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇది మ్యాజిక్ కాదు ఇది లాజిక్ ఇది న్యూరోలాజికల్ సైన్స్ ఈరోజు ఇది ఎందుకు పని చేస్తుందో మీకు క్లియర్ గా చూపిస్తాను.
(05:00) అటు ప్రాచీన వేదాల్లోనూ ఇటు మోడర్న్ బ్రెయిన్ సైన్స్ లోనూ ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందో చూద్దాం. మీ మెదడు ఒక అద్భుతమైన యంత్రం కానీ అది చాలా పక్షపాతంతో పనిచేస్తుంది. ప్రతి సెకండ్ కి వేలాది సిగ్నల్స్ మీ మెదడును తాకుతాయి కానీ మీ బ్రెయిన్ వాటన్నింటిని మీకు చూపించదు ఎందుకు ఎందుకంటే మీ బ్రెయిన్ ద్వారం దగ్గర ఒక ఆటోమేటిక్ సెక్యూరిటీ స్క్రీనింగ్ సిస్టం ఉంటుంది.
(05:25) సైన్స్ భాషలో దీన్ని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం అంటారు. దీని డ్యూటీ చాలా సింపుల్. మీరు దేనిపై ద్యాస పెట్టారో లేదా మీకు ఏది ముఖ్యమో దాన్ని మాత్రమే ఇది మీ స్పృహలోకి రానిస్తుంది. మిగతా దాన్ని చెత్త బుట్టలో వేస్తుంది. ఉదాహరణకు మీరు ఒక ఎర్ర కారు కొనాలని మనసులో ఫిక్స్ అయ్యారు అనుకోండి అప్పటిదాకా కనిపించని ఎర్ర కార్లు సడన్ గా రోడ్డు మీద ఎక్కడ చూసినా మీకే కనిపిస్తాయి.
(05:51) నిన్నటివరకు అవి అక్కడ లేవా ఉన్నాయి కానీ మీ ఆర్ఏఎస్ వాటిని అనవసరమైన డేటా అని ఇగ్నోర్ చేసింది. ఎప్పుడైతే అది మీకు ముఖ్యం అని చెప్పారో సడన్ గా వాటిని హైలైట్ చేయడం మొదలు పెట్టింది. ఈ ఎర్రకారు లాజిక్ మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మీరు గనుక నావల్ల కాదు నేను ఫెయిల్యూర్ ని అని గట్టిగా నమ్మితే మీ మెదడు ఏం చేస్తుందో తెలుసా? మీరు చేసిన 100 మంచి పనులని అది తేలికగా తీసుకుంటుంది.
(06:18) కానీ మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక్క చిన్న తప్పుని మాత్రం కొండంత చేసి చూపిస్తుంది. వెంటనే మీ మెదడు మీతో అంటుంది. చూసావా నేను ముందే చెప్పలేదా నువ్వు దేనికి పనికి రావని అంతేకాదు మీరు నేను ఫెయిల్యూర్ ని అని గట్టిగా ఫిక్స్ అవ్వడం వల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఎవరైనా మీకు మంచి సలహా ఇచ్చినా మీ మెదడు దాన్ని అస్సలు తీసుకోదు. ఎందుకంటే దానికి కన్ఫర్మేషన్ బయాస్ అనే ఒక మొండి అలవాటు ఉంది.
(06:46) ఈ మనిషికి నా బాధ అర్థం కాదులే అని ఒక స్టాంప్ వేసి ఆ సలహాని పక్కన పడేస్తుంది. ఫలితంగా అవతలి వాళ్ళు సొల్యూషన్ ఇచ్చినా మీ బ్రెయిన్ దాన్ని కూడా ఒక సమస్య లాగే చూస్తుంది. అంటే బయట ప్రపంచం బాగానే ఉంది. కానీ దాన్ని చూసే మీ ఫిల్టర్ రాంగ్ గా ప్రోగ్రాం్ అయిపోయింది. సో ఫైనల్ గా గుర్తుంచుకోండి. మీ మెదడు మీకు కావాల్సిన దాని కోసం పని చేయదు.
(07:10) మీరు ఎవరు అని గట్టిగా నమ్ముతున్నారో ఆ నమ్మకాన్ని నిజం చేయడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇది కేవలం వేదాంతం మాత్రమే కాదు ఇది మీ మెదడు ఎలా పని చేస్తుందో చెప్పే సైకాలజీ న్యూరోసైన్స్ కలయిక కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఆటోమేటిక్ ఫిల్టర్ ను మనకి నచ్చినట్లు మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. చాలామంది నా బుద్ధి ఇంతే నా రాత ఇంతే అనుకుంటారు.
(07:35) అది పచ్చి అబద్ధం మీ మెదడు ఒక రాయి లాంటిది కాదు అది మారుతుండే మైనన్ లాంటిది. సైన్స్ లో దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. దీన్ని సింపుల్ గా అర్థం చేసుకోండి. ఒక దట్టమైన అడవిలో మీరు రోజు ఒకే దారిలో నడుస్తున్నారు అనుకోండి. ఏమవుతుంది? మొదట ఒక చిన్న కాలిబాట ఏర్పడుతుంది. మీరు నడిచే కొద్దీ అది ఒక క్లియర్ రోడ్డు లా మారిపోతుంది.
(08:00) సరిగ్గా మీ మెదడులో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఒక పనిని లేదా ఆలోచనని పదే పదే చేసినప్పుడు బ్రెయిన్ లోని న్యూరాన్స్ అన్నీ ఒకదానికొకటి బలంగా కనెక్ట్ అయిపోతాయి. న్యూరోసైన్స్ లో దీనికి ఒక గోల్డెన్ రూల్ ఉంది. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అంటే మీరు దేన్నైతే పదే పదే చేస్తారో లేదా పదే పదే ఆలోచిస్తారో దాన్ని మరింత తేలికగా చేయడానికి మీ బ్రెయిన్ ఒక హైవే వేసేస్తుంది.
(08:28) ఒక్కసారి ఆ హైవే పడ్డాక ఆ పని చేయడం మీకు తేలికగా అనిపించడమే కాదు మీ బ్రెయిన్ మీకు డోపైన్ అనే రివార్డ్ కూడా ఇస్తుంది. అది మీకు వావ్ నేను ఇది చేయగలిగాను మళ్ళీ చేద్దాం అనే ఒక కిక్ ని ఇస్తుంది. అప్పుడు ఆ కష్టమైన పని కూడా మీకు చాలా తేలికగా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్ ఉంది. మనం కొత్త అలవాట్లు మొదలు పెట్టినప్పుడు ఒకవైపు కొత్త దారిలో మనం చిన్న కాలిబాట వేస్తుంటే పక్కనే మన పాత అలవాట్ల ఎనిమిది లైన్ల హైవే ఇంకా బలంగానే ఉంటుంది.
(08:59) మీరు కొంచెం అలసిపోయినా డిస్ట్రాక్ట్ అయినా మీ బ్రెయిన్ ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఆ పాత హైవే మీదకి లాకెళ్ళిపోతుంది. ఎందుకు? ఎందుకంటే మనం కేవలం లక్ష్యాలను మార్చాలని చూస్తాం. కానీ ఆ హైవేని కంట్రోల్ చేసే డ్రైవర్ ని మార్చడం మర్చిపోతాం. అంటే మన సెల్ఫ్ ఇమేజ్ ని. ఉదాహరణకు మీరు రోజు ఉదయం 5దు గంటలకు లెవ్వాలని గాని కూర్చొని గంట సేపు చదవాలని గాని లేదా అరగంట ధ్యానం చేయాలని గాని గోల్ పెట్టుకుంటారు.
(09:28) కానీ మీ సెల్ఫ్ ఇమేజ్ ఇంకా నేను బద్ధకస్తుడిని లేదా నాకు ఏకాగ్రత కుదరదు అనే భావంతోనే ఉంటే మీరు ఎంత ప్రయత్నించినా ఆ డ్రైవర్ మిమ్మల్ని మళ్ళీ పాత నిద్రలోకి పాత ఫోన్ స్క్రోలింగ్ లోకి లాక్కెళ్ళిపోతాడు. అందుకే కొత్త దారిలో వెళ్ళడం కష్టంగా అనిపించి వారం తిరగకముందే మనం ఫెయిల్ అవుతాం. ఇదంతా వినడానికి సైన్స్ క్లాస్ లా అనిపించొచ్చు. కానీ ఫ్రెండ్స్ ఈ న్యూరోప్లాస్టిసిటీ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం అనేవి కేవలం పుస్తకాల్లో ఉండే థియరీలు కాదు.
(09:57) ఇవి నా జీవితాన్నే మార్చేసిన ప్రాక్టికల్ టూల్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నా సొంత YouTube జర్నీనే. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు వ్యూస్ వచ్చేవి కాదు. సబ్స్క్రైబర్స్ జీరో మరో పక్క నా రెగ్యులర్ జాబ్ చాలా హెక్టిక్ గా ఉండేది. రాత్రి ఇంటికి వచ్చాక కళ్ళు మూతలు పడుతున్న సరే YouTube కోసం కష్టపడేవాడిని కానీ ఎంత కష్టపడినా రిజల్ట్ జీరో మామూలుగా అయితే ఎవరైనా ఆ టైంలో ఏం చేస్తారు? ఈ ఉద్యోగం చాల్లే YouTube మనవల్ల కాదులే అని ఆపేస్తారు. కానీ నేను ఆ పని చేయలేదు.
(10:30) ఎందుకో తెలుసా? నేను నా సెల్ఫ్ ఇమేజ్ ని ముందే మార్చుకున్నాను. బయట ఫలితాలు ఎలా ఉన్నా సరే నేను ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ ని అని నా బ్రెయిన్ కి స్ట్రాంగ్ గా చెప్పుకున్నాను. అది పగటికల కాదు అది నా సంకల్పం. ఎప్పుడైతే ఈ ఐడెంటిటీ నాటుకుందో నా ఆర్ఏఎస్ ఒక పాజిటివ్ సర్చ్ ఇంజన్ లా పని చేయడం మొదలు పెట్టింది. సాధారణంగా వీడియో ఫెయిల్ అయితే డిప్రెషన్ వస్తుంది.
(10:54) కానీ నా ఆర్ఏఎస్ నాకు ఫెయిల్యూర్ ని చూపించలేదు. అది నాకోసం సమాధానాలను వెతకడం మొదలు పెట్టింది. వ్యూస్ రాలేదా అయితే థంబ్నెయిల్ మారుద్దాం హుక్ బాలేదా ఇంకాస్త ఎక్కువ టైం పెడదాం అని నా బ్రెయిన్ దారులు వెతకడం మొదలు పెట్టింది. ప్రతి వీడియో ఫ్లాప్ లోనూ నాకు సమస్య కనిపించలేదు. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో మాత్రమే కనిపించింది.
(11:18) ఫలితం బయట వారికి అడ్డంకులుగా కనిపించేవి నా బ్రెయిన్ కి అవకాశాల్లా కనిపించాయి. ఇక న్యూరోప్లాస్టిసిటీ అంటారా మొదట్లో స్క్రిప్ట్ రాయడం ఎడిటింగ్ చేయడం అన్ని నరకంలా అనిపించేవి. కానీ నేను క్రియేటర్ ని అనే భావనతో ఆ పనిని రిపీట్ చేస్తూనే ఉన్నాను. రోజులు గడిచే కొద్దీ నా బ్రెయిన్ లో కొత్త హైవేలు ఏర్పడ్డాయి. ఇప్పుడు గంటలు గంటలు పని చేసినా నాకు అలసట అనిపించదు.
(11:42) అదొక ఫ్లో స్టేట్ లా మారిపోయింది. ఇక్కడ ఒక చేదు నిజం చెప్పనా సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత నేను క్రియేటర్ కాలేదు. నేను క్రియేటర్లా ఆలోచించడం మొదలు పెట్టిన తర్వాతే సబ్స్క్రైబర్లు పెరిగారు. రిజల్ట్ అనేది చివరికి వస్తుంది. కానీ మార్పు అనేది ముందే మీ మనసులో జరగాలి. నేను నా మెదడును మార్చుకోగలిగాను. మరి మీరు మీరు మారాలని ఎంత ప్రయత్నిస్తున్న మీ లోపల బలంగా పాతుకుపోయిన ఆ పాత అలవాట్ల ఎనిమిది లైన్ల హైవే మిమ్మల్ని వెనక్కి లాగుతూనే ఉంది కదా కేవలం మోటివేషన్ తో దాన్ని ఆపలేము.
(12:16) ఆ పాత హైవేని పగలగొట్టడానికి ఒక బుల్డోజర్ కావాలి. అదే మన ఋషులు మనకు అందించిన బ్రహ్మాస్త్రం సంకల్పం ఇది కేవలం ఒక గోల్ కాదు అంతకంటే వెయిరెట్లు శక్తివంతమైనది. నిజానికి మోడర్న్ సైన్స్ ఈ లాజిక్ ని పట్టుకోవడానికి ముందే మన ఋషులు దీన్ని ఒక అద్భుతమైన జీవన విధానంగా మార్చేశారు. చాలామంది అనుకుంటారు సంకల్పం అంటే ఒక కోరిక అని అది చాలా పెద్ద తప్పు సంకల్పం వెనుక ఉన్న ఈ రెండు పరమ సత్యాలు తెలిస్తే మీరు మీ జీవితాన్ని చూసే విధానమే మారిపోతుంది.
(12:52) మొదటి సత్యం సృష్టి ప్రారంభమే ఒక సంకల్పం. ఛాందోగ్య ఉపనిషత్తు ప్రకారం ఈ విశ్వం బిగ్ బ్యాంగ్ తో పుట్టలేదు అది ఒక సంకల్పంతో పుట్టింది. సృష్టికి మూలమైన ఆ ప్రథమ నాదాన్నే వేదాలు ఇలా వర్ణించాయి. ఏకోహం బహుశ్యాం అంటే నేను ఒక్కడిని అనేక రూపాలుగా మారుతున్నాను అని అంటే దైవం చేసిన మొదటి ఆలోచనే సంకల్పం కాబట్టి మీరు సంకల్పం చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆ సృష్టికర్తను అనుకరిస్తున్నారు.
(13:24) రెండవ సత్యం సంకల్పం అంటే కోరిక కాదు అదొక సృష్టి సంస్కృతంలో సంకల్పం అనే పదం సం మరియు కల్ప ఈ రెండింటి నుంచి పుట్టింది. సమ్ అంటే సంపూర్ణంగా లేదా పక్కాగా. కల్ప అంటే సృష్టించడం లేదా ఊహించడం. దీని అసలు అర్థం ఏంటో తెలుసా? బయట ప్రపంచంలో ఫలితం రావడానికి ముందే దాన్ని మీ లోపల సంపూర్ణంగా సృష్టించుకోవడం. ఇది నాకు కావాలి పీస్ అని అడుక్కునే కోరిక కాదు.
(13:54) ఇది ఇలాగే జరిగి తీరుతుంది అని మీ బ్రెయిన్ లో మీరు గీసుకునే ఒక పక్కా బ్లూప్రింట్. గమనించారా? మన పూర్వీకులు ఏ పూజ చేసినా ముందు చేతిలో నీళ్లుు తులసి దళం పట్టుకుని సంకల్పం ఎందుకు వదులుతారో చాలా మంది అనుకున్నట్లు అది దేవుడికి మన కోరికను విన్నవించుకోవడమే కాదు దాని వెనక అద్భుతమైన న్యూరో సైన్స్ దాగుంది. కుడి చేతిలో నీటిని ఉంచుకొని ఎడమ చేతిని కింద ఆనించడం నేను మనసా వాచా, కర్మణా సిద్ధంగా ఉన్నాను అని చెప్పడానికి సంకేతం.
(14:28) అందులో ఉండే పంచభూతాల్లో ఒకటైన నీరు నా సంకల్పానికి సాక్షి అని సూచిస్తుంది. చేతిలో ఉన్న ఆ నీటిని రాగి పళ్ళెంలో వదిలిన మరుక్షణం ఇది ఇకపై కేవలం ఆలోచనగా కాదు ఒక క్రియ మొదలయింది అని మీ మెదడుకు ఒక స్పష్టమైన సిగ్నల్ పెడుతుంది. అంతేకాదు ఆ నీటి బిందువు రాగి పళ్ళంలో పడినప్పుడు వచ్చే ఆ టంగ్ అనే నాదం మీ మెదడులోని ఆర్ఏఎస్ కి ఒక శక్తివంతమైన మేలుకొలుపు.
(14:56) అంటే ఆ దైవశక్తిని అందుకోవడానికి మీ మనసుని శరీరాన్ని ఒకే లయలోకి తీసుకురావడం. ఒకసారి ఆ సంకల్పం మీ అచేతన మనసులో నాటుకుపోతే అది కేవలం ఒక ఆలోచనగా మిగిలిపోదు. మీ స్వభావంగా మొలకెత్తుతుంది. అప్పుడు మీరు ప్రయత్నించక్కర్లేదు. మీరే అలా మారిపోతారు. ఇక ఈ మధ్యకాలంలో మేనిఫెస్టేషన్ అని YouTube లో చాలా వీడియోలు చూసే ఉంటారు. మీరు కోరుకుంటే చాలు విశ్వం మీకు ఇచ్చేస్తుంది అని చెబుతారు.
(15:28) కానీ ప్రాక్టికల్ గా అవి ఎందుకు పని చేయడం లేదు? ఇక్కడ ఒక కఠినమైన నిజాన్ని ఒప్పుకోవాలి. మీరు నేను కోటీశ్వరుని నవ్వాలి అనో లేదా నా ఆరోగ్యం బలపడాలి నా మనసు స్థిరంగా శక్తివంతంగా మారాలి అనో ఊహించుకుంటూ అదే సమయంలో బద్ధకంగా ఉంటే మీ మెదడు మిమ్మల్ని అస్సలు నమ్మదు. ఎందుకంటే మీ మెదడు మీ మాటల కంటే మీ చేతలనే ఎక్కువగా నమ్ముతుంది.
(15:56) మీరు ఏ పని చేయకుండా కేవలం ఊహించుకుంటే బ్రెయిన్ దాన్ని ఒక పగటి కలలాగా తీసి పారేస్తుంది. ఇక్కడ కొంతమందికి ఒక డౌట్ రావచ్చు నా బ్రెయిన్ నమ్మకపోతే ఏంటి నేను బలంగా కోరుకుంటే ఈ యూనివర్స్ నాకు అన్నీ ఇస్తుంది కదా అని కానీ ఫ్రెండ్స్ విశ్వం మీకు అవకాశాలను మాత్రమే ఇస్తుంది. మీ చేత పని చేయించదు. మీ బ్రెయిన్ బద్ధకంతో సేఫ్టీ జోన్ లో ఉండిపోయి ఆ వచ్చిన అవకాశాలను చూడలేనప్పుడు ఆ విశ్వం కూడా మీకు ఏమి చేయలేదు.
(16:24) చాలా మంది మర్చిపోయే ఒక పచ్చి నిజం ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదంలో కూడా చివర ఉండేది యాక్షన్ మరి మీకు యాక్షన్ తీసుకోవాలని ఉన్నా మీ శరీరంలో ఆ బద్ధకం ఎందుకు వస్తుందో తెలుసా? ఇక్కడే మీరు ఒక పచ్చి నిజాన్ని తెలుసుకోవాలి. ఇది వింటే మీ బ్రెయిన్ కి ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టు అవుతుంది. మీ మెదడు గొప్పతనం కోసం డిజైన్ కాలేదు.
(16:49) అది మీ భద్రత కోసం డిజైన్ అయింది. గొప్పగా ఎదగడం అంటే కష్టపడాలి కొత్త పనులు చేయాలి. కానీ దాని వల్ల వచ్చే అనిశ్చితి రిస్క్ అంటే మీ మెదడుకి చాలా భయం. అందుకే రిస్క్ చేసి గొప్పదాన్ని సాధించడం కంటే ఏ పని చేయకుండా బద్ధకంగా అదే పాత స్థాయిలో సేఫ్ గా ఉండడానికి మీ మెదడు ఇష్టపడుతుంది. అర్థమైందా మీరు ఫెయిల్ అవ్వడం కాదు మీ మెదడే మిమ్మల్ని సగటు జీవితం అనే జైల్లో సేఫ్ గా బంధిస్తుంది.
(17:19) మరి ఈ బ్రెయిన్ ట్రాప్ ని ఆ మేనిఫెస్టేషన్ వైఫల్యాన్ని ఎలా బ్రేక్ చేయాలి? దీనికి మన భారతీయ తత్వశాస్త్రం ఎప్పుడో ఒక అద్భుతమైన బ్లూప్రింట్ ఇచ్చింది. అదే శక్తి త్రయం ఏ పని జరగాలన్నా ఈ మూడు శక్తులు ఒకే లైన్ లో ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా ఫలితం శూన్యం. మొదటిది ఇచ్ఛాశక్తి ఇది కేవలం నాకు కావాలి అనే కోరిక కాదు నిన్ను నిద్రపోనివ్వని ఒక బర్నింగ్ డిజైర్ ఇక్కడే నీ సంకల్పం పుడుతుంది.
(17:50) రెండవది జ్ఞానశక్తి బలమైన కోరిక ఉంటే సరిపోడు అది ఎలా సాధించాలో తెలిసి ఉండాలి. సరైన ప్లానింగ్ క్లారిటీ స్ట్రాటజీ ఇవే నీకు దిశను చూపిస్తాయి. మూడవది క్రియాశక్తి నీ దగ్గర మ్యాప్ ఉంది ఇంధనం ఉంది కానీ బండి కదిలితేనే కదా గమ్యం చేరేది. అదే యక్షన్ అడుగు ముందుకు వేయడం ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. కొంతమందికి విపరీతమైన కోరిక ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియక గందరగోళంలో ఉండిపోతారు.
(18:16) వీళ్ళు కేవలం కలలు కనేవాళ్ళు ఇంకొంతమందికి ప్లాన్ మొత్తం తెలుసు కానీ బద్ధకం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు. వీళ్ళు కేవలం ఆలోచించేవాళ్ళు. కానీ విజేతలు అలా కాదు. ఎప్పుడైతే మీ కోరికకు సరైన ప్లానింగ్ తోడై అది బలీయమైన యాక్షన్ గా మారుతుందో అప్పుడు సక్సెస్ అనేది ఛాయిస్ కాదు. అది ఒక అనివార్యమైన ఫలితం. ఇంతసేపు మనం చెప్పుకున్నది థియరీ అయితే ఇప్పుడు చేయబోయేది ప్రాక్టికల్ కేవలం వినడం మాత్రమే కాదు ఈ క్షణమే ఇక్కడే మనం ఈ ప్రాసెస్ ని మొదలు పెడదాం.
(18:50) మీ నరాల వ్యవస్థని రీవైర్ చేయడానికి ఇవిగో నాలుగు శక్తివంతమైన స్టెప్స్ మొదటి స్టెప్ మీ వెన్నముకను నిటారుగా ఉంచండి. గాలిని నెమ్మదిగా పీల్చుకుంటూ మీ దృష్టిని బయటి ప్రపంచం నుంచి మీ లోపలికి మళ్ళంచండి. మీ స్పృహ కాస్త పదునెక్కుతున్నట్లు భావించండి. రెండో స్టెప్ ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తారు. విశ్వాన్ని అడుక్కోకండి నాకు కావాలి అనకండి.
(19:16) నేను ఇది అని డిక్లేర్ చేయండి. మీకోసం కొన్ని పవర్ఫుల్ ఉదాహరణలు ఇస్తున్నాను. వీటిల్లో మీ మనసుకు దగ్గరగా అనిపించేదాన్ని ఎంచుకోండి. నాలో విజయాన్ని సాధించే శక్తి రోజు రోజుకి పెరుగుతుంది. నేను సంపదను కీర్తిని సృష్టించగలను. ఏ సవాలనైనా చిరునవ్వుతో ఎదుర్కోగల శక్తి నాలో ఉంది. నా సంకల్పం వజ్రం లాంటిది. నా శరీరం మనసు సంపూర్ణ ఆరోగ్యంతో శక్తివంతంగా మారుతున్నాయి.
(19:43) ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసుకోండి. అది చిన్నగా స్పష్టంగా ఇప్పుడే జరుగుతున్నట్లుగా ఉండాలి. మూడవ స్టెప్ ఇప్పుడు కళ్ళు మూసుకుని ఆ వాక్యాన్ని మీ మనసులో గట్టిగా మూడు సార్లు అనుకోండి. కేవలం పదాలు పలకడం కాదు ఆ ఎమోషన్ ని ఫీల్ అవ్వండి. ఆ మాట అంటున్నప్పుడు మీ వెన్నముకలో ఒక రకమైన విద్యుత్ ప్రవాహాన్ని గమనించండి. నాలుగవ స్టెప్ ఉదయం నిద్ర లేగానే రాత్రి నిద్రలోకి జారుకునే ముందు మీ బ్రెయిన్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేయండి.
(20:11) 21 రోజుల పాటు ఒక్క రోజు కూడా విడవకుండా ఇలాగే చేయండి. గుర్తుంచుకోండి ఇక్కడ మీరు విశ్వాన్ని రిక్వెస్ట్ చేయడం లేదు మీ నాడీ వ్యవస్థకు ఒక స్పష్టమైన కమాండ్ ఇస్తున్నారు. చివరిగా ఒక్క మాట భారతీయ సనాతన ధర్మం మీకు కేవలం కోరుకోవడం నేర్పలేదు. అది మీకు ఎదగడం నేర్పింది. అదే నిజమైన సంకల్పం. ఫ్రెండ్స్ సంకల్పం గొప్పదే కానీ అది ఫలించాలంటే మనసు పదునుగా ఉండాలి.
(20:41) సంకల్పం అనేది ఒక విత్తనం అయితే ఏకాగ్రత అనేది దానికి పోసే నీరు లాంటిది. మెమరీ ఫోకస్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కలిస్తేనే ఆ గ్రేట్ మెంటల్ పవర్ సాధ్యం. వీటిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మన యోగులు అందించిన అద్భుతమైన విద్యే త్రాటక. దీనిని ఎలా ప్రాక్టీస్ చేయాలి దాని వల్ల కలిగే లాభాలు ఏంటి అనే దానిపై మనం ఇదివరకే ఒక డీటెయిల్డ్ వీడియో చేశం.
(21:05) ఈ వీడియో పూర్తయిన వెంటనే ఖచ్చితంగా దాన్ని చూడండి. మీ సంకల్ప సాధన అక్కడి నుంచే సంపూర్ణం అవుతుంది. నమస్తే

No comments:

Post a Comment