[3/19, 10:41] +91 90006 79873: 193f8;ఉగాది..
🍀🌺🍀🍀🌺🩺🍀🌺🍀🌺🍀🍇M.A.195.
*మన ఆరోగ్యం…!
```
విషదోషాలకు విరుగుడు : ```
*ఉగాది పచ్చడి* ```
➖➖➖✍️
-డా. జి విపూర్ణచందు.
```
*అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్*
*భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్”* -(ధర్మసింధు)
```
“సంవత్సరం మొదటి రోజు ప్రొద్దున్నే వేపపూవు, పంచదార,చింతపండు, నెయ్యి కలిపిన ప్రసాదాన్ని తింటే ఆ ఏడాదంతా సౌఖ్యదాయకంగా ఉంటుంది” అంటుంది ఈ ఆర్యోక్తి.
ప్రొద్దున్నే తలంటుకుని,కొత్త సంవత్సరం అంతా శుభం కలగాలని ప్రార్థించుకుని, పరగడుపున ఈ వేపపూత ప్రసాదాన్ని తిని, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణాలు చేయాలని ధర్మసింధు గ్రంథం చెప్తోంది. తెలుగు భాషా సంస్కృతుల ప్రాభవాన్ని చాటే పండుగ ఇది. అందుకని ధ్వజారోహణం అనే పదానికి తెలుగు జెండా ఎగరేయటం అని భాష్యం చెప్పుకోవాలి.
తీపి కోసం బెల్లం లేదా పంచదారని, పులుపు కోసం చింతపండు లేదా ఇంకేదైనా పుల్లని ద్రవ్యాన్ని, ఉప్పదనం కోసం సైంధవ లవణాన్ని, కారం కోసం మిరియాల పొడిని, వగరు కోసం లేత మామిడి వడపిందెల్ని, చేదు కోసం వేపపువ్వుని కలిపి ఈ పచ్చడిని తయారు చేసుకుంటున్నాం. నెయ్యి కూడా కొద్దిగా కలపాలంటూన్నారీ శ్లోకంలో! నెయ్యి చేరిస్తే, ఏ ఆహార పదార్ధమైనా సౌమ్యంగా పనిచేస్తుంది.
గాదులు నిండితే ఉగాదులు పండుతాయి. ఉగాదులు అన్ని జాతులకూ అన్ని భాషా జాతీయులకూ ఉన్నాయి. కానీ, తెలుగు ఉగాది వాటికి భిన్నమైంది. ఇది తెలుగు భాషా సంస్కృతుల పండుగ. అంతే కాదు, ఇది ఆరోగ్యాన్ని ప్రబోధించే పండుగ కూడా!
అన్ని పండుగల్లోనూ తీపి, కారం ఇష్టంగా వండుకు తింటాం. ఉగాది నాడు కావాలని వగరు, చేదు తెచ్చుకుని తింటాం. వగరూ చేదు రుచుల(bitter Tonics)మహత్తుని తెలియజేసే పండుగ ఉగాది. చేదు రుచి ప్రాధాన్యతని గుర్తింపచేయటమే మనవారి ఆంతర్యం. తమిళులు మాత్రం మామిడికాయ పచ్చడి అంటారు. మనం వేపపూల పచ్చడి అంటాం. ఆరు రుచులూ తగు నిష్పత్తుల్లో ఉంటేనే అది షడ్రసోపేతమైన భోజనం. ఆరు రుచులూ లేకుండా కేవలం పులుపు, కేవలం కారం, కేవలం తీపి ఇలా తినవద్దని ఈ ఉగాది ప్రసాదం మనకు సూచిస్తోంది.
జీవిత మహాభారతానికి ఆదిపర్వం #ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు వస్తుంది. ఆరోజే ధర్మరాజు పట్టాభిషిక్తు డైనాడని ప్రతీతి. ప్రపంచ యుద్ధం తరువాత పునరుజ్జీవం పొందిన ప్రపంచ శాంతికి సంకేతం ఉగాది!
పాశ్చాత్యులకు జనవరి 1న ఉగాది. ముందురోజు అర్ధరాత్రి నుండే మందు ఏరులై ప్రవహించే పండుగ అది. దిశా గమనం, దిశానిర్దేశనం చేసుకోకుండా కేవలం సంబరాలు చేసుకునే పండుగ జనవరి ఒకటి. ఉత్తర భారతీయులకు హోలీ ఉగాది లాంటిది. జీవితం రంగులమయంగా ఉండాలనే ఆకాంక్షతో కులమతాలకు అతీతంగా ఆనందంగా జరుపుకుంటారు. మహరాష్ట్రీయులు గూఢీ పాడవా పేరుతో ఉగాదినిని ఇంటిముందు ఇంద్రుడి జెండా నిలిపి సగర్వంగా జరుపుకుంటారు. ఒరియా వారు వీధుల్లో మంచినీటి కుండలు పెట్టి, వారి ఉగాదిని మహా బిషుబ సంక్రాంతి పేరుతో జుపుకుంటారు. అస్సామీయులు తమ ఉగాదిని బిహూ పండుగ అంటారు. పశువుల్ని పూజించి జరుపుకుంటారు. తమిళులు తమ ఉగాది రోజున పుత్తాంటు పేరుతో దీపం వెలిగించి చీకట్లను పారద్రోలాలని ప్రార్ధిస్తారు. మళయాళీలు ‘బిసు’ పండుగని దీపావళి లాగా దీపాలు వెలిగించి జరుపుకుంటారు. ఇలా ప్రతీ జాతీ తమతమ క్యాలెండర్లలో మొదటి రోజుని శుభకామనలతో పవిత్రంగా జరుపుకుంటారు.
తెలుగు వారు ఒకింత కొత్త పుంతను తొక్కి ఉగాదిని జరుపుకుంటారు. తక్కిన దసరా, సంక్రాంతి లాంటి పండుగలకు భిన్నంగా తెలుగు భాషా సంస్కృతుల పండుగలా దీన్ని జరుపుకుంటాం. తెలుగుతల్లికి సారె పెట్టి కట్టుకుని ఉగాది జరుపుకుంటాం మనం.
ఉగాది రోజున మనం జీవన గమనానికి దిశా నిర్దేశం చేసుకుంటాం. లోకం పోకడ ఎలా ఉండబోతోందో పంచాంగ శ్రవణం ద్వారా ఒక అవగాహన కల్పించుకుంటాం. చాలా మంది అనుకునేట్టు ఇది ఒక మూఢ నమ్మకం కాదు. ప్రపంచం తీరుతెన్నుల్ని అవగతం చేసుకునే ఒక చిన్న ప్రయత్నం ఇది. వానలు ఎలా కురుస్తాయి... కరువు సూచనలు ఉన్నాయా... ఏ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది,.. వేటి రేట్లు పెరిగే అవకాశం ఉంది,.. రాజకీయ పరిణమాలు ఎలా ఉండబోతున్నాయి,.. ఉప్పెనలు, ఉపద్రవాలు వచ్చే సూచనలున్నాయా... గ్రహణాలూ, ముఖ్య సంఘటనలూ ఏవి ఎప్పుడు జరగబోతున్నాయి...లాంటి విషయాల్ని ముందుగా తెలుసుకోవటానికి సామాన్యుడు చేసే ప్రయత్నం ఇది. తెలుగువారు ఉగాది రోజున వాటిని తెలుసుకుని తగ్గట్టుగా ఈ ఏడాది కాలానికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకో గలుగుతారు. భాషాసంస్కృతులను గౌరవించటం, దిశా నిర్దేశం చేసుకోవటంతో పాటు, ఆరోగ్య పరిరక్షణ కోసం కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు.
గత 3,4 దశాబ్దాల కాలంలో, మీదు మిక్కిలి కొత్త మిలీనియం సంవత్సరంలో మన జీవిత విధానంలో పెనుమార్పులు చేరుకున్నాయి. విదేశీ వ్యామోహం కట్టలు తెంచు కుంది, ఆహారపు అలవాట్లన్నీ మన భౌగౌళిక పరిస్థితులకు వ్యతిరేకంగా వేలంవెర్రిగా సాగుతున్నాయి. ఏ ఆహార ద్రవ్యాన్ని కొనాలన్నా కల్తీలతో, విష రసాయనాలతో కూడినవే దొరుకుతున్నాయి. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఆహార అలవాట్లలో తీపి పులుపు ఉప్పు రుచుల వాడకం విపరీతమైంది. మజ్జిగ తాగడం మానేశారు. బూడిద గుమ్మడిని దిష్టి బొమ్మగా తప్ప అదొక కూరగాయ అనే సంగతి మరిచిపోయారు.
వగరు, చేదు రుచుల్ని తినటం వదిలేశారు. ఈ కొత్త పోకడలకు తోడు అధిక ఉష్ణోగ్రత దగ్గర వేయించే వేపుడు వంటకాలు, నూనె పదార్ధాలను అపరిమితంగా తింటున్నారు. అనాలోచితంగా విషాల కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడ్తున్నారు.
ఇది తెలుగువారికే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అలవాటే! ఇలా ప్రవర్తించటం మనకు కొత్త కాదనుకుంటాను. 2000 యేళ్ళ క్రితం చరకుడు, సుశ్రుతుడు సమస్త వ్యాధులకూ గ్రామ్యాహారాలే కారణం అన్నారు. గ్రామ్యాహారాలంటే పైన మనం చెప్పుకున్న నాగరిక ఆహార పదార్ధాలు. వాటిని వదులుకోవాలని చెప్పాడు. చరక సుశ్రుతాదులు చెప్పిన పద్ధతిలో ఆయుర్వేద మార్గంలో భోజనం చేస్తున్నది మనమే! అంతేకాదు, అన్నం సంస్కృత పదం అంటారు గానీ, దేశంలో తమ ప్రధాన ఆహారాన్ని ఏ భాష వారూ అన్నం అనటం లేదు. రోటీలు సాపాటులే అందరికీ! అన్నం తింటున్నది తెలుగువారే! అది గ్రామ్యాహారం కాకుండా ఆరోగ్య దాయకంగా ఉండాలనేది ఉగాది ప్రబోధం. మనం స్వీటు షాపుకు వెళ్ళినప్పుడు కొద్దిగా రుచి చూసి కొంటాం. ఉగాది పచ్చడిని మన ఆహారం ఇలా ఆరు రుచులతో సమృద్ధిగా ఉండాలని రుచి చూపించి ప్రబోధిస్తోంది ఉగాది.
ఆహారంలో సహజంగా ఉండే విషదోషాలకు విరుగుడుగా పనిచేసేందుకు వగరు, చేదు రుచులను తింటూ ఉండాలని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరురుచుల కలయికతోనే మన ఆహార పదార్ధాలు తయా రౌతాయి. ఆరురుచూలూ ఉన్న భోజనాన్ని షడ్రసోపేత భోజనం అంటారు. నిజానికి మనం షడ్రసోపేతమైన భోజనం చేస్తున్నామా అని ఎవరికివారు ప్రశ్నించుకోవాలి. ఎవరి ఆహారంలో వగరు రుచి, చేదు రుచీ ఉండవో వారి శరీరాలు రోగాలకు తలుపులు తెరిచి నిల్చున్నట్టే లెక్క.
ఆరోగ్యదాయకమైన చేదు మనకు కాకర, ఆగాకర, మెంతుల్లాంటి ద్రవ్యాల ద్వారా, వగరు మజ్జిగ, పసుపు,ధనియాలు ఇంకా కొన్ని ఆకు కూరలద్వారా లభిస్తుంది. మనం వీటిని తక్కువగా వాడి, పులుపు ఎక్కువగా వాడుతున్నాం. పులుపు పెరిగే కొద్దీ ఉప్పు, కారం, తీపి కూడా పెరుగుతాయి. వీటితోనే సరిపోతోంది. ఇంక వగరు చేదు తినే ఉత్సాహం మనకు ఉండట్లేదు. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేందుకే ఉగాది నాడు వగరుగా ఉండే మామిడి వడపిందెల్ని, చేదుగా ఉండే వేపపూతనీ, తీపి, పులుపు, ఉప్పు, కారంతో పాటు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాం.
తీపికోసం చెరుకు రసం, బెల్లం, పంచదార, పటికబెల్లం వీటిలో దేన్నైనా కలుపుకోవచ్చు. ఉప్పు తగినంత వేసుకుని కారం కోసం పచ్చి మిరపకాయ ముక్కలు లేదా ఎర్ర కారం కాకుండా మిరియాల పొడిని వేసుకుని, వడ పిందెలు అంటే బాగా లేత మామిడి పసరు పిందెల ముక్కల్ని, వేపపూవునీ కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. తెలుగు భాషను పూజించుకుని, పంచాంగానికి దణ్ణం పెట్టి, వేపపూవు ప్రసాదం తినటం ఉగాది నాడు ప్రొద్దున్నే మనం విధిగా జరుపుకునే ఆచారం. ఇందులో కులాల ప్రస్తావన మతం ప్రస్తావన లేదు. అందరి పండగ ఇది. అందరి కోసం, అందరి ఆరోగ్యం కోసం, అందరి సంక్షేమం కోసం జరుపుకుంటున్న పండుగ!
ఉగాది పచ్చడిని ఉగాది రోజున మాత్రమే ఒక చెంచాడు తినటం వలన ఉపయోగం ఏమీ లేదు. దీన్ని సంవత్సరం పొడవునా తినాలనేది దీనిలోని అంతఃసూత్రం. రోజూ కనీసం వేప పూవునైనా కారప్పొడిగా చేసుకుని అన్నంలో మొదటి ముద్దగా తినటం వలన చేదు మనకు చేసి పెట్టే ఉపకారం నెరవేరుతుంది.
వేపపూల కారప్పొడిని ఇలా చేసుకోవచ్చు...
1 చెంచా ఇంగువ, 2 చెంచాల అల్లం ముద్ద, 4 చెంచాల మిరియాల పొడి, 8 చెంచాల జీలకర్ర, 16 చెంచాల పసుపు,32 చెంచాల ధనియాలపొడి, అంతే కొలతలో అంటే 32 చెంచాలు ఎండించిన వేపపూల పొడి, వీటికి తగినంత ఉప్పు చేర్చిన కారప్పొడి రుచిగా ఉంటుంది. శరీరంలో విషదోషాలను పోగొడుతుంది. టానిక్కులా శక్తిదాయకంగా ఉంటుంది. జీర్ణశక్తిని పదిలం చేస్తుంది.
ఏడాది పొడవునా తినవలసిన, తినదగిన ఒక మంచి ఔషధం. దీన్ని ‘వేప వేసవారం’ అంటారు. చేదురుచి ప్రాధాన్యతని గుర్తించగలిగితే ఉగాదులన్నీ మనకు ఉషస్సులే!
ఉగాది మార్గదర్శనం చేసే ఒక ప్రత్యేక పండుగ. మన మనసుల్లో నిర్మలమైన భావనలు పెందించు కోవటమే ఉగాది ప్రత్యేకత. భాష, సంస్కృతి, ఆరోగ్యం ఈ మూడింటి త్రివేణీ బంధమే ఉగాది!✍️```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
[3/19, 10:46] +91 90006 79873: *"ఆత్మిక ఉగాది: జీవన నవ్యత్వానికి సరికొత్త ఏడాదికి స్వాగతం.. యుగ + ఆది = యుగాది నూతన యుగం" "*
*"సాధారణంగా ఉగాది అంటే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ, పిండివంటలతో జరుపుకునే పండుగ. కానీ, "ఆత్మిక ఉగాది" అనే వినూత్న కోణాన్ని ఆవిష్కరించారు.."*
*"బాహ్య అలంకరణల కంటే అంతరంగ శుద్ధికి, పాత అలవాట్లను వీడి నూతన సంస్కారాలను అలవర్చుకోవడానికి ఈ ఉగాది ఒక వేదిక అని ఇక్కడ 🔱శివ🕉పరమాత్మ✴️ అద్భుతంగా తెలియజేశారు.."*
*"ఆనందాల పండుగ - నూతన దృక్పథం.."*
*"ఈ 🔱శివ🕉 పరమాత్ముని✴️ సందేశం✨ ప్రకారం, ఉగాది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, అది మన మనస్తత్వంలో రావాల్సిన మార్పుకు సూచిక. "యుగ + ఆది = నూతన యుగం" అనే ఆధ్యాత్మిక అర్థాన్ని ఇక్కడ ప్రస్తావించారు.."*
*"కలియుగపు చీకటి అంతమై, సత్యయుగపు వెలుగులు ప్రసరించే సంధి కాలాన్ని (సంగమ యుగం) ఈ ఉగాది ప్రతిబింబిస్తుంది.."*
*"మనలోని పాత, వ్యర్థ సంస్కారాలను వదిలి, దైవీ గుణాలతో నూతన జీవితాన్ని ప్రారంభించడమే నిజమైన ఉగాది అని తెలియజేస్తుంది.."*
*"ఉగాది పచ్చడి:*
*"జీవన సమతుల్యత ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన జీవితంలోని వివిధ పరిస్థితులకు సంకేతాలు:*
*"తీపి (బెల్లం): సంతోషం మరియు ఆనందం.."*
*"పులుపు (చింతపండు): జీవితంలోని సవాళ్లు.."*
*"చేదు (వేపపువ్వు): కష్టాలు మరియు ఇబ్బందులు.."*
*"ఉప్పు: జీవితంపై ఆసక్తి.."*
*"వగరు (మామిడి): కొత్త అనుభవాలు.."*
*"కారం (మిరపకాయ): కోపం మరియు ఆవేశాలు.."*
*"ఈ రుచులన్నింటినీ సమానంగా స్వీకరించినట్లే, జీవితంలో వచ్చే సుఖదుఃఖాలను, జయాపజయాలను సమభావంతో (Balance of Mind) స్వీకరించాలనే గొప్ప తత్వాన్ని ఈ 🔱శివ🕉పరమాత్ముని✴️ సందేశం✨ బోధిస్తుంది.."*
*"అంతర్గత శుద్ధీకరణ :*
*"కేవలం ఇళ్లను శుభ్రం చేసుకోవడం, తోరణాలు కట్టడం వంటి బాహ్య ఆచారాలకే పరిమితం కాకుండా, మన మనస్సును కూడా వ్యర్థ ఆలోచనల నుండి శుద్ధి చేసుకోవాలని ఈ🔱శివ🕉️పరమాత్ముని✴️సందేశం✨నొక్కి చెబుతుంది.."*
*"ఓంకార🕉️ జపం సాధన ద్వారా ఆత్మను పవిత్రం చేసుకోవడం, పాత సంస్కారాలనే చెత్తను తొలగించి శాంతి, ప్రేమ, శివ🔱శక్తి✨అనే సుగంధాలను నింపుకోవడమే నిజమైన పండుగ.."*
*"ఈ సమయం మానవులు పరివర్తనకు శుభ సమయం.."*
*"ప్రకృతిలో వచ్చే మార్పుల వలె మన జీవితాల్లో కూడా ఒక సకారాత్మక మార్పు రావాలి. ఈ "ఆత్మిక ఉగాది" ద్వారా, ప్రతి ఒక్కరూ తమలోని దైవీ గుణాలను మేల్కొల్పుకుని, విశ్వ పరివర్తనలో భాగస్వాములు కావాలని ఒక అద్భుతమైన పిలుపునిచ్చారు.."*
*"సరికొత్త సంకల్పాలతో, స్వపరివర్తనతో జరుపుకునే ఈ ఉగాది మనందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని కోరుకుంటూ ఈ 🔱శివ🕉పరమాత్ముని✴️మహా వాక్యాలు ✨ఒక ప్రేరణాత్మక సందేశాన్ని మనకు అందిస్తున్నాయి.."*
No comments:
Post a Comment