Friday, March 20, 2026

రమణ మహర్షి చెప్పిన కుక్క పిల్లల కథ! | Best Story for Mental Peace | Satyagrahi

రమణ మహర్షి చెప్పిన కుక్క పిల్లల కథ! | Best Story for Mental Peace | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nvjfxnZ1-h4



Transcript:
(00:00) మీరు ఎప్పుడైనా గమనించారా మీరు ఎవరితోనూ గొడవ పడరు ఎవరిని ఒక్క మాట అనరు. చాలా సందర్భాల్లో సైలెంట్ గా నోరు మోసుకొని పక్కకు వచ్చేస్తారు. నేను మంచోడిని నేను సైలెంట్ గా ఉన్నాను కదా మరి నా లైఫ్ ఎందుకు మారట్లేదు. నా తలరాతి ఎందుకు ఇలాగే ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? నిజం చెప్పనా మీరు నోరు మూసుకొని ఉండొచ్చు కానీ మీ మనసు నోరు మూసుకోలేదు.
(00:21) బయట మీరు ఎంత సైలెంట్ గా ఉన్నారో లోపల అంతకంటే ఎక్కువగా వైలెంట్ గా ఉన్నారు. మీ సమస్య మీ మాటల్లో లేదు. మీ మౌనంలో దాగి ఉన్న అలజడిలో ఉంది. అసలు మనం చేస్తున్న ఆ పెద్ద తప్పుఏంటి? మన మౌనం మనల్ని ఎలా మోసం చేస్తుంది? ఈ వీడియో పూర్తయ్యేలోపు [సంగీతం] మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఇక డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే అసలు సమస్య గురించి మాట్లాడుకుందాం.
(00:42) మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. అదేంటంటే మౌనం అంటే నోరు మూసుకోవడం అని ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు బాస్ మన మీద అరిచినప్పుడు లేదా ఇంట్లో గొడవ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం పంటి బిగును కోపాన్ని ఆపుకుంటాం. ఒక్క మాట కూడా మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనం ఏమనుకుంటాం అంటే అమ్మయ్యా నేను గొడవ పడలేదు నేను చాలా గొప్పగా ప్రవర్తించాను.
(01:03) ఐ యామ్ వెరీ పీస్ ఫుల్ పర్సన్ అనుకుంటాం. కానీ నిజంగా ఇక్కడ ప్రశాంతత ఉందా ఒకసారి మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఆ సమయంలో మీ మెదల్లో ఏం జరుగుతుంది? బయట ప్రపంచానికి మీరు ఒక రాయిలా ఒక విగ్రహంలా కామన్ గా కనిపిస్తున్నారు కానీ లోపల ఒక మహాభారత యుద్ధమే జరుగుతుంటుంది. వాడు నన్ను అలా అంటాడా అసలు వాడికి ఎంత ధైర్యం నేను కూడా రియాక్ట్ అయిపోయి నాలుగు మాటలు అంటుంటే బాగుండేదని చెప్పేసి నెక్స్ట్ టైం కనిపించని చెప్తా అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలు వందల ఆలోచనలు ఒకదానితో ఒకటి గుద్దుకుంటూ మీ మెదడుని ఒక యుద్ధభూమిలా మార్చేస్తాయి.
(01:36) దీన్నే మనం ఓవర్ థింకింగ్ అంటాం. అంటే మనం ఫిజికల్ గా సైలెంట్ గా ఉన్న మెంటల్ గా మాత్రం విపరీతమైన నాయిస్ లో ఉన్నాం. రమణ మహర్షి గారు దీని గురించి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పారు. ఒక కుక్క పిల్ల కదన్నమాట. ఒకసారి ఊహించుకోండి మీ దగ్గర ఒక పెద్ద గంప ఉంది. ఆ గంప కింద నాలుగు అల్లరి చేసే కుక్క పిల్లలని పెట్టి మూసేయడానికి ట్రై చేస్తున్నారు.
(01:54) మీరు ఎంత గట్టిగా గంపని కిందకు నొక్కి పెడితే లోపల ఉన్న కుక్క పిల్లలు అంత గట్టిగా బయటికి రావడానికి తన్నుకుంటున్నాయి అరుస్తున్నాయి. గంపని ఎగరేయడానికి చూస్తున్నాయి. మన ఆలోచనలు కూడా అంతే మీరు ఎప్పుడైతే నేను సైలెంట్ గా ఉండాలి నేను కోప్పడకూడదు నేను ఆలోచించకూడదు అని మీ మనసుని అనే గంపని బలవంతంగా నొక్కి పెడతారో లోపల ఉన్న ఆలోచనలు అనే కుక్క పిల్లలు కూడా మరింత వైలుగా తయారవుతాయి.
(02:17) బయటకి చూడటానికి మీరు గంపను గట్టిగా పట్టుకొని కూర్చున్నట్లు ఉంటారు కానీ లోపల మాత్రం గందరగోళం. సో ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మనం మౌనం అనే దేన్నైతే అనుకుంటున్నామో అది నిజమైన మౌనం కాదు అది అణచివేత. మన ఎమోషన్స్ ని మన కోపాన్ని మన బాధని లోపలికి కుక్కి అణచి పెడుతున్నాం. ఇలా అణచిపెట్టిన ప్రతీది ఏదో ఒక రోజు బద్దలావ్వల్సిందే కదా.
(02:40) చాలా మంది జీవితాల్లో ప్రశాంతత లేకపోవడానికి వాళ్ళు ఎంత మంచివాళ్ళుగా ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ లో గ్రోత్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే. మనం బయట ప్రపంచాన్ని జయించడానికి చూస్తున్నాం కానీ లోపల జరుగుతున్న ఈ యుద్ధాన్ని ఆపలేకపోతున్నాం. ఇదే ప్రధాన సమస్య సరే ఈ సమస్య ఎందుకు వస్తుంది మనం ఎందుకు ఇలా తయారయ్యాం దీనికి కారణం మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మాటలు మన సోషల్ మీడియా కండిషనింగ్ మంచి వాళ్ళంటే గొడవ పడకూడదు కోపం తెచ్చుకోకూడదు ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే భరించాలి ఇలాంటి మాటలు విని విని మనం ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం మానేసాం సప్రెస్ చేయడం అలవాటు చేసుకున్నాం. కానీ దీని వల్ల జరిగే
(03:13) డ్ామేజ్ అంతా అంతా కాదు మీరు ఎప్పుడైతే బయట సైలెంట్ గా ఉండి లోపల రగలిపోతూ ఉంటారో మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా మీ బ్రెయిన్ కి అది ఒక ఎమర్జెన్సీ సిచువేషన్ లాగా సిగ్నల్ ఇస్తుంది. మీరు నిజంగా పులిని చూసినప్పుడు బాడీలో ఎలాంటి స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతాయో మీరు ఆఫీస్ లో బాస్ తిట్టినప్పుడు నోరు మూసుకొని లోపల తిట్టుకున్నప్పుడు కూడా అవే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
(03:34) సో దీని రిజల్ట్ ఏంటి బీపి పెరుగుతుంది యంజైటీ మొదలవుతుంది గుండె దడవ వస్తుంది తిన్నది [సంగీతం] అరగదు నిద్ర పట్టదు ఎందుకంటే పగలు జరిగిన విషయాన్ని నీ మెథడ్ రాత్రి కూడా రిపీట్ చేస్తూనే ఉంటుంది. ఆ రోజు అలా ఎందుకు జరిగింది నేను ఎందుకు ఇలా అయిపోయాను అని చెప్పేసి ప్రశ్నలు మిమ్మల్ని తొడిచేస్తూనే ఉంటాయి. ఇది ఇక్కడితో ఆగదు.
(03:52) ఈ మెంటల్ నాయిస్ వల్ల మీరు చేసే పని మీద శ్రద్ధ పూర్తిగా పోతుంది. ఇంకో విషయం ఏంటంటే మీ లోపల దాచుకున్న ఎమోషన్స్ అన్నీ ఒక ప్రెజర్ కుక్కర్ లాంటివి. మీరు విజిల్ కాకుండా ఆపుతున్నారు కానీ వంట మాత్రం ఆపలేదు. అప్పుడు ఏమవుతుంది ఏదో ఒక రోజు సంబంధం లేని చిన్న విషయానికి కూడా మీరు బ్లాస్ట్ అయిపోతారు. భార్య మీదో పిల్లల మీదో లేదా ఫ్రెండ్స్ మీదో లేనిపోని కోపాన్ని చూపిస్తారు.
(04:12) ఆ తర్వాత నేను ఎందుకు ఇంత ఓపడ్డాను అని చెప్పేసి మళ్ళీ మీరే బాధపడతారు. ఈ సమస్య ఎందుకు ప్రమాదకరం అంటే ఇది మన వర్తమానాన్ని చంపేస్తుంది. మీరు ఫిజికల్ గా ఇక్కడ ఉన్నారు ఆ రూమ్లో ఉన్నారు ఈ పని చేస్తున్నారు కానీ మీ మనసు మాత్రం ఎక్కడో గతంలో జరిగిన అవమానాల చుట్టూనో లేదో భవిష్యత్తులో జరగబోయే భయాల చుట్టూనో తిరుగుతూ ఉంటుంది.
(04:31) మనిషి ఎప్పుడైతే ఇప్పుడు అనే టైం లో ఉండడో అప్పుడు అతని ఎఫిషియన్సీ జీరో అయిపోతుంది. సో మీ క్రియేటివిటీ చచ్చిపోతుంది. మీలో ఉన్న ఆనందం ఆవిరైపోతుంది. కేవలం బాడీ మాత్రమే ఒక రోబలా పనులు చేసుకుంటూ పోతుంది. మనం బతుకుతున్నాం అని అనుకుంటాం కానీ నిజానికి మనం బతకట్లేదు. జస్ట్ గడుపుతున్నాం. కేవలం బయట సైలెన్స్ ని మెయింటైన్ చేస్తూ లోపల మనశశాంతిని బలి చేసుకుంటున్నాం కాబట్టి సమస్య వస్తుంది.
(04:53) మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం అనుకుంటాం కానీ నిజానికి మన మైండ్ మనల్ని ఆడేసుకుంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ నరకం నుంచి బయట పడటం ఎలా? రమణ మహర్షి గారు చెప్పినట్లు కుక్క పిల్ల గంపని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? మొదటి విషయం మౌనం అంటే నోరు మూయడం కాదు మనసుని మూయటం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మరి మన మనసుని ఎలా మూయాలి బలవంతంగానా కాదు.
(05:14) బలవంతం కాకపోతే ఇది ఇంకా ఎక్కువ అవుతుందని ఇందాకే చెప్పుకున్నాం కదా సొల్యూషన్ ఏంటంటే విట్నెస్ కాన్షియస్ సింపుల్ గా చెప్పాలంటే మీ ఆలోచనని మీరు ఓన్ చేసుకోవద్దు. మీ మెదడులో వచ్చే ప్రతి ఆలోచన మీరు కాదు. ఆకాశంలో మేఘాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఆకాశం వాటిని పట్టుకోదు. వాటిని ఆపదు వాటితో అసలు గొడవే పడదు. జస్ట్ అలా చూస్తూ ఉంటుంది.
(05:35) మేఘాలు నల్లగా ఉన్న తెల్లగా ఉన్నా ఆకాశానికి ఏమి కాదు అది ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. మీరు కూడా ఆకాశం లాంటి వాళ్ళు మీ ఆలోచనలు మేఘాలు లాంటివి. మీకు కోపం వచ్చిందనుకోండి సాధారణంగా మనం ఏం చేస్తాం కోపం వస్తే కోపంతో రగిలిపోతాం. అలా కాకుండా ఓహో నా మెదడులో ఇప్పుడు కోపం అనే ఆలోచన వచ్చింది. సో ప్రేక్షకుడి లాగా ఒక కెమెరా లాగా చూడటం మొదలు పెట్టండి.
(05:54) దీనిని నిరీక్షణ లేదా గమనించడం అంటాం. మీరు ఎప్పుడైతే మీ ఆలోచనని గమనించడం మొదలు పెడతారో అప్పుడు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆలోచనకి బలం తగ్గుతుంది. ఉదాహరణకి మీకు ఎవరి మీదో విపరీతమైన ద్వేషం వచ్చింది అనుకుందాం. వెంటనే రియాక్ట్ అవ్వకుండా లోపల గొడవ పడకుండా జస్ట్ కళ్ళు మూసుకొని ఆ కోపం ఎక్కడ పుట్టింది అది నా శరీరంలో ఎలాంటి మార్పులు చేస్తుందో నా గుండె వేగం పెరిగిందా నా చేతులు వనుగుతున్నాయా అలా జస్ట్ గమనించండి.
(06:20) మీరు దాన్ని జడ్జ్ చేయొద్దు. కోపం రాకూడదు అని అనగానే వస్తే రానివ్వండి. కుక్క పిల్లలు గంప కింద నుంచి బయటకి వస్తే రానివ్వండి. అవి అరుస్తుంటే అరవనివ్వండి. మీరు వాటిని పట్టుకోవద్దు. మీరు వాటిని కొట్టొద్దు. జస్ట్ దూరం నుంచి నిలబడి చూడండి. కాసేపటికి అవి అలసిపోయి సైలెంట్ అయిపోతాయి. ఇదే సీక్రెట్. మీరు ఆలోచనలతో యుద్ధం చేయడం ఆపేసిన మరుక్షణం ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాయి. నేను వేరు, నా ఆలోచన వేరు.
(06:44) ఈ ఒక్క సూత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ భయాలు ఆందోళనలు ఇవన్నీ కేవలం ట్రాఫిక్ జామ్ లో హారన్ల శబ్దం లాంటివి మీరు ఆ ట్రాఫిక్ మధ్యలో నిలబడి అందరితో గొడవ పడితే మీకే నష్టం అదే మీరు ఒక ఎత్తైన బిల్డింగ్ ఎక్కి పైనుంచి ఆ ట్రాఫిక్ ని చూస్తే ఆ శబ్దం మీకు వినిపిస్తుంది కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు.
(07:05) సో ఈ రోజు నుంచి ఒక కొత్త అలవాటు చేసుకోండి. ఏదైనా ఆలోచన మిమ్మల్ని బాధ పెడుతుంటే దాంతో ఫైట్ చేయకండి దానికి సాక్షిగా మారండి. ఓహో నా మైండ్ ఇప్పుడు ఇలా ఆలోచిస్తుందా ఇంట్రెస్టింగ్ అనుకోండి. ఎప్పుడైతే మీరు ఆ ఆలోచన సీరియస్ గా తీసుకోవడం మానేస్తారో అప్పుడు నిజమైన నిశబ్దం మీ లోపల మొదలవుతుంది. బయట ప్రపంచం ఎంత గంధరగోలంగా ఉన్నా మీ లోపల మాత్రం ఒక ప్రశాంతవంతమైన సరోవర్లా ఉంటుంది.
(07:29) సో ఇప్పుడు మీ తలరాత మారడం మొదలవుతుంది. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా మరి దీన్ని ప్రాక్టికల్ గా మన డైలీ లైఫ్ లో ఎలా అప్లై చేయాలి? సో రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచే మన లైఫ్ ని ఎలా బెటర్ చేసుకోవాలి అంటే మాత్రం దీనికి ఒక పవర్ఫుల్ ఛాలెంజ్ చెప్తున్నాను రెడీగా ఉన్నారా? దీని పేరు జీరో ఫోన్ జీరో టాక్.
(07:47) రోజులో 24 గంటలు ఉన్నాయి కదా అందులో కేవలం ఒక గంట జస్ట్ వన్ అవర్ మీ కోసం కేటాయించుకోండి. అది ఉదయం లేవు అని అయితే ఇంకా బెస్ట్ లేదా రాత్రి పడుకునే ముందు అయితే పర్లేదు. ఒక రోజులో ఒక గంటలో మీరు రెండు రూల్స్ పాటించాలి. సో మీ ఫోన్ ముట్టుకోకూడదు. సో ఎవరితోనూ మాట్లాడుకోకూడదు. ఈ రెండు గనుక మీరు పాటించారు అనుకోండి మరి ఆ గంట ఏం చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఏం చేయకూడదు అదే అసలైన టాస్క్ అన్నమాట ఖాళీగా కూర్చోండి కిటికీలో నుంచి బయట చెట్లను చూడండి లేదా ఆకాశాన్ని చూడండి లేదా కళ్ళు మూసుకొని కూర్చోండి మొదటి ఐదు 10 నిమిషాలు నరకంలా అనిపిస్తుంది. చెయ్యి ఫోన్ కోసం
(08:17) లాగుతుంది. మెదడులో 100 ఆలోచనలు దాడి చేస్తాయి. అరే ఆ పని ఉంది కదా ఈ పని [సంగీతం] ఉంది కదా టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి మైండ్ మిమ్మల్ని రెచ్చగొడుతుంది. ఇక్కడే మీరు గెలవాలి. ఆ ఆలోచనను గమనించండి. వాడితో గొడవ పడకండి పర్లేదు ఆలోచనలు వస్తున్నాయి కదా రానివ్వో నేను మాత్రం కదలని చెప్పేసి మొండిగా కూర్చోండి.
(08:36) కుక్క పిల్లలు అరుస్తున్నాయి అరవనివ్వండి మీరు మాత్రం వాటిని పట్టించుకోకుండా మీ శ్వాసను గమనించండి. గాలి లోపల ఎలా వెళ్తుంది బయటికి ఎలా వస్తుంది అని చెప్పేసి రోజులు గడిచే కొద్దీ ఒక గంట ప్రాక్టీస్ మీ బ్రెయిన్ ని ఎంత షార్ప్ గా మారుస్తుందంటే మిగతా 23 గంటలు మీరు చేసే పనిలో అద్భుతమైన ఫోకస్ వస్తుంది. అనవసరమైన విషయాలకు రియాక్ట్ అవ్వడం మానేస్తారు.
(08:55) ఎవరైనా మిమ్మల్ని తిట్టినా సరే మీరు నవ్వుతూనే స్వీకరించే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే మీ లోపల ఉన్న స్పేస్ ని మీరు కనుక్కున్నారు. మరొక విషయం మౌనం అంటే పిరికితనం కాదు అది ఒక శక్తి. మీరు ఎప్పుడైతే అనవసరమైన మాటలు తగ్గించి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతారో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడితే జనం వింటారు. సైలెంట్ గా ఉండి పనులు చేసి చూపించే వాడిని చూస్తే లోకానికి భయం అలాగే గౌరవం కూడా కాబట్టి ఈ రోజు నుంచే కాదు ఈ క్షణం నుంచే అనవసరమైన ఆలోచనల చెత్తని క్లీన్ చేయడం స్టార్ట్ చేయండి.
(09:27) మీ మనసు అనే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. బయట సైలెంట్ గా ఉండి లోపల ఏడవద్దు. లోపల సైలెంట్ గా ఉండి బయట విజ్రూపించండి. మీ పనిలో మీ సౌండ్ వినిపించాలి. మీ మాటల్లో కాదు గుర్తుంచుకోండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. దాని ఆలోచనలతో నాశనం చేసుకోమాకండి లేదా అవగాహనతో అద్భుతంగా మార్చుకోండి. సో ఈరోజు ఒక కొత్త ఆరంభం గతం కథ ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను శక్తివంతంగా ఉన్నాను అని బలంగా నమ్మండి.
(09:53) చివరగా మిమ్మల్ని ఆలోచింపచేసి ఒక ప్రశ్న అన్నమాట. మీరు మీ ఫోన్ ని రోజుకి ఎన్ని సార్లు ఛార్జింగ్ పెడతారు? కనీసం ఒక్కసారైనా పెడతారు కదా మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన సూపర్ కంప్యూటర్ అయిన మీ మైండ్ ని చివరిసారిగా ఎప్పుడు ఛార్జింగ్ పెట్టారు అంటే చివరిసారిగా ఎప్పుడు మీరు ఏ ఆలోచన లేకుండా కేవలం మీతో మీరు ప్రశాంతంగా గడిపారు దీనికి సమాధానం మీ మనస్సాక్షికి [సంగీతం] చెప్పుకోండి అలాగే కింద కామెంట్స్ లో కూడా తెలియజేయండి.
(10:20) నేను ఈ రోజు నుంచే నా మైండ్ ని చార్జ్ చేయడం మొదలు పెడతాను అని చెప్పేసి మీరు మారితే మీ ప్రపంచం మారుతుంది. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోస్ ని పెంచేసి పెట్టాను వాటిని కూడా చూడండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్.
(10:50) ఓం ఓం

No comments:

Post a Comment