Friday, March 20, 2026

బ్రహ్మ ముహూర్తంలో ఈ పని చేస్తే… మహాత్ముల జననం? నిజం ఏంటి!..

బ్రహ్మ ముహూర్తంలో ఈ పని చేస్తే… మహాత్ముల జననం? నిజం ఏంటి!..

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Riy-UyKPAe8



Transcript:
(00:00) ఈరోజు మన టాపిక్ బ్రహ్మ ముహూర్తం బ్రహ్మ ముహూర్తంలో ధ్యానానికి మాత్రమేనా లేకపోతే సృష్టి కార్యానికి కూడానా ఈరోజు మనం తెలుసుకుందామా బ్రహ్మ ముహూర్తం అంటే దేవతల సమయం అంటారు. ధ్యానం చేయడానికి అత్యుత్తమ సమయం కూడా అంటారు. యోగులు ఋషులు అందరూ ఈ సమయంలోనే ధ్యానం చేస్తారు. కానీ ఇంకోవైపు ఈ మాట కూడా వినిపిస్తుంది.
(00:28) గృహస్తులు ఈ సమయంలో సృష్టి కార్యం చేస్తారు అండి అంటే భార్యా భర్తలు ఈ సమయాన సహజీవనం చేస్తారు అని ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బ్రహ్మ ముహూర్తం అనేది ధ్యానానికి మాత్రమేనా లేక సృష్టి కార్యానికి కూడా కరెక్టేనా నిజమేనా లేకపోతే మనం ఏమన్నా తప్పుగా అర్థం చేసుకున్నామా తెలుసుకుందామా అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? సాధారణంగా సూర్యోదయానికి ఒక గంట 36 నిమిషాల ముందు ఉండే టైం ని బ్రహ్మ ముహూర్తం అంటాం.
(01:01) ఈ టైంలో ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది. గాలి శుభ్రంగా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఆలోచనలే ఉండవు మెదడు చాలా స్పష్టంగా పనిచేస్తుంది. అందుకే యోగులు ఋషులు ఈ సమయంలో ధ్యానం జపం యోగ సాధన కోసం ఉపయోగిస్తారు. కానీ ఈ సమయానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ప్రకృతిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో మన భారతీయ సంస్కృతిలో గృహస్థాశ్రమం కూడా చాలా ముఖ్యమైనది.
(01:34) గృహస్తుడు అంటే ఎవడు కుటుంబాన్ని పోషించేవాడు సమాజానికి సహాయం చేసేవాడు సంతానం ద్వారా ఈ సృష్టిని కొనసాగించేవాడు. అంటే గృహస్తుడు కూడా ఒక విధంగా ఈ సృష్టి కార్యక్రమంలో ఒక భాగమే కదా భార్యా భర్తల సహజీవనాన్ని ఎప్పుడూ మనం తప్పుగా చూడకూడదు అది కూడా ఒక పవిత్రమైన కార్యమే కానీ అది ఇప్పుడు ఆనందం కోసం మారిపోయింది. ఒకప్పుడు అది సృష్టి కోసం మాత్రమే ఉండేది.
(02:01) ఆ మన పురాతన గ్రంథాల్లో కొన్ని చోట్ల ఇలా చెప్తారు శరీరం మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో సృష్టి కార్యం జరిగితే పుట్టే సంతానం కూడా మహాత్ములై పుడతారు అని ఎందుకు అంటే ఆ టైంలో మనసు చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది. శరీరం విశ్రాంతిగా ఉంటుంది హార్మోన్స్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అందుకే ఈ టైం ని సూచిస్తారు దీని అర్థం ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో తప్పకుండా ఈ పని చేయాలని కాదు ఆ మనం అనుకుంటాం కదా చాలామంది నాకు పుట్టబోయే పిల్లలు చాలా మంచివాళ్ళై ఉండాలి అని అందుకోసం ఇలా చెప్తారు.
(02:43) బ్రహ్మ ముహూర్తం ఎందుకు ఇచ్చారంటే మనిషి తన చైతన్యాన్ని పైకి తీసుకెళ్ళడానికి ఈ సమయంలో ధ్యానం చేస్తే మనసు తొందరగా స్థిరపడుతుంది ఆలోచనలు ఉండవు ఆత్మ చైతన్యం పెరుగుతుంది. అందుకు యోగులు ఈ టైం ని కేటాయించారు మనకు ఒక గృహస్తుడు మరియు యోగి మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఆ యోగి యొక్క లక్ష్యం వేరేగా ఉంటుంది. గృహస్తుని లక్ష్యం వేరేగా ఉంటుంది.
(03:12) యోగి తన శక్తినంతా స్పిరిచువాలిటీ లోకి మారుస్తాడు. కానీ గృహస్తుడు కుటుంబం కోసం బాధ్యతలు సంతానం సమాజం ఇలా తన శక్తిని వినియోగించాలి. ఇలా అన్ని విషయాలు చూసుకోవాలి. అందుకే గృహస్తుడి జీవితంలో కూడా కొన్ని సహజమైన కార్యాలు ఉంటాయి. ఆ మనిషి శరీరంలో మన శక్తిని కామం నుంచి ధ్యానం వైపు మార్చాలి. అదే బ్రహ్మచర్యం యొక్క అసలు అర్థం. గృహస్తుడు ఎప్పుడూ రెండు విషయాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
(03:41) మొదటిది సహజీవనం ఒక పవిత్రమైన విషయం. అది కేవలం కోరిక కోసం కాకుండా సంయమనంతో ఉండాలి. రెండవది బ్రహ్మ ముహూర్తం వంటి పవిత్ర సమయాన్ని ఎక్కువగా ధ్యానం జపం సాధన కోసం ఉపయోగించాలి. అప్పుడు మన జీవితమే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మర్ దగ్గర ఒక మంచి విత్తనం ఉంది. అతడు దాన్ని రెండు విధాలుగా యూస్ చేయొచ్చు. ఒకటి విత్తనాన్ని తినేయొచ్చు సెకండ్ భూమిలో పెట్టి పెద్ద చెట్టుగా పెంచొచ్చు.
(04:15) అదేవిధంగా మన బాడీలో కూడా ఉన్న శక్తిని భోగానికి ఉపయోగించొచ్చు స్పిరిచువాలిటీ గా కూడా చేంజ్ చేయొచ్చు అది ఎంచుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది కదా కాబట్టి బ్రహ్మ ముహూర్తం అనేది అంత పవిత్రమైన టైం ఈ సమయంలో మనం సృష్టి కార్యం చేస్తామా లేదా ధ్యానం జపం యోగం చేస్తామా అనేది ఎంచుకోవడం మన చేతిలోనే ఉంటుంది.
(04:41) సృష్టి కార్యం కోసం అయితే ఓకే కానీ భోగం కోసం ఎప్పుడూ యూస్ చేయకూడదు

No comments:

Post a Comment