Monday, March 23, 2026

*పెళ్లైన అమ్మాయిల* *జీవితాలను నాశనం చేసే కారణాలు” కొన్ని ఉదాహరణతో ఈ రోజు ప్రత్యేక విశ్లేషణ*"

 🙏🔥🔥🔥🔥🙏

*పెళ్లైన అమ్మాయిల* *జీవితాలను నాశనం చేసే కారణాలు” కొన్ని ఉదాహరణతో ఈ రోజు ప్రత్యేక విశ్లేషణ*"
         🌹🌹🌹
    *MAZUMDAR*
     *BANGALORE*
          🙏🇮🇳🇮🇳🙏

🚩1). *"తల్లి రిమోట్ కంట్రోల్" ప్రభావం  ఈ కాలంలో*,
*ఇది కొంతవరకు నిజం వివాహం*
 *తర్వాత కూడా ప్రతి నిర్ణయం తల్లిదండ్రుల* 
*గారాభం చే! "తల్లిదండ్రుల" చేతిలో ఉంటే*?   *కొత్త కుటుంబంతో అనుబంధం సరిగా ఏర్పడదు*
"*ఉదాహరణలు*:

🩸*ఉదాహరణ: 1: చిన్న గొడవ వచ్చినప్పుడు వెంటనే తల్లికి ఫోన్ చేసి చెప్పడం → సమస్య పెద్దది అవుతుంది*.

💧*ఉదాహరణ 2: భర్తతో మాట్లాడకుండా తల్లి చెప్పినట్లే నిర్ణయాలు తీసుకోవడం*.

🚩2). *పుట్టింటి మీద అధిక మోహం*
*వివాహం తర్వాత కొత్త కుటుంబాన్ని అంగీకరించకపోతే అసంతృప్తి పెరుగుతుంది*.
*ఉదాహరణలు*:
*🩸ఉదాహరణ* 1: “*మా ఇంట్లో* ఇలా ఉండేది*, మీ ఇంట్లో* *ఎందుకు లేదు?” అని పోల్చడం*

💧*ఉదాహరణ 2: ప్రతి చిన్న విషయానికీ పుట్టింటి విధానాన్ని ప్రమాణంగా పెట్టడం*.

🚩3. )"*ఇతరుల సలహాలపై జీవితం నడపడం*
"*వివాహ జీవితం"* *వ్యక్తిగతమైనది*. *బయటివాళ్ల సలహాలతో నడిస్తే! ఇంటిలో సమస్యలు పెరుగుతాయి*.
*ఉదాహరణలు*:

🩸*ఉదాహరణ* 1: *స్నేహితురాలు చెప్పిన మాట విని భర్తపై అనుమానం పెట్టడం*.

💧*ఉదాహరణ 2*: *బంధువుల మాటలతో గొడవలు పెరగడం*.

🚩4)"*అత్త, మావ, లను శత్రువులుగా చూడటం*
*అత్తమామలతో* *సంబంధం బాగోలేకపోతే "కుటుంబ వాతావరణం" కఠినమవుతుంది*.
*ఉదాహరణలు*:

🩸*ఉదాహరణ* 1: *వారితో మాట్లాడకుండా పూర్తిగా దూరంగా ఉండడం*.

💧*ఉదాహరణ 2: వారి సూచనలను ఎప్పుడూ తప్పుగా భావించడం*.

🚩5). "*భర్తపై నమ్మకం లేకపోవడం*
*వివాహంలో ప్రధాన బలం నమ్మకం*.
*ఉదాహరణలు*:

🩸*ఉదాహరణ 1: భర్త చెప్పిన విషయాన్ని నమ్మకుండా ఇతరుల మాటలు నమ్మడం*
.
💧*ఉదాహరణ 2: ప్రతి చర్యను* *అనుమానంతో చూడడం*.

🚩6.) "*విన్న మాటల తో గొడవలు పెట్టటం సంపూర్ణ సమాచారం*
  *లేకుండా నిర్ణయాలు* *తీసుకోవడం ప్రమాదకరం*.
*ఉదాహరణలు*:

🩸*ఉదాహరణ* 1: *ఎవరో చెప్పిన మాట విని వెంటనే గొడవ పెట్టడం*.

🦜*ఉదాహరణ 2: నిజం తెలుసుకోకుండా అపార్థాలు చేసుకోవడం*.

🚩7). *పుట్టింట్లో భర్తను అవమానించడం*
*ఇది నిజంగా ప్రమాదకరం*. *"దంపతుల గౌరవం" బయట కాపాడాలి*.
*ఉదాహరణలు*:

🩸*ఉదాహరణ* 1: *బంధువుల ముందు భర్త సంపాదనను తక్కువగా చూపడం*.

💧*ఉదాహరణ* 2: *కుటుంబ విషయాలను బయట చెప్పడం*.

🚩8.) "*ఇతరుల ముందు* *అవమానకరంగా మాట్లాడటం*
*పబ్లిక్ అవమానం* *సంబంధాన్ని బలహీనపరుస్తుంది*.
*ఉదాహరణలు*:

*🩸ఉదాహరణ* 1: *స్నేహితుల ముందు వ్యంగ్యంగా మాట్లాడటం*

💧*ఉదాహరణ 2: చిన్న విషయానికి కూడా తక్కువ చేసి మాట్లాడటం*.

⛱️"*మరికొన్ని కోణాల్లో కారణాలు విశ్లేషణ*

🧤1)"*కుటుంబ* 
*ఒత్తిళ్లు* & *త్యాగాలు*:  "*పెళ్లి తర్వాత అమ్మాయిలు భర్త కుటుంబం కోసం తమ ఇష్టాలను, వారి "కెరియర్" త్యాగం చేయాలని ఒత్తిళ్లకు లోనవుతారు*

🧤2)"*గృహహింస* &  
*దుర్వినియోగం*:
"*శారీరక మానసిక మరియు ఆర్థిక నియంత్రణ (Financial Controlling)"మహిళల జీవితాలను దెబ్బతీస్తాయి*.

🧤3)"*కట్నవేధింపులు*:
"*కట్నం కోసం వేధించటం, అదనపు కట్నం కోసం* *వేధించటం లేదా డిమాండ్ చేయటం*, 
*ఇది తరచుగా విషాదకర పరిణామాలకు దారితీస్తుంది*

🧤4)"*నమ్మక ద్రోహం*:-
*తన భాగస్వామి వేరే స్త్రీ సంబంధం కలిగి ఉండటం, లేదా నమ్మకాన్ని వమ్ము చేయటం*

🧤5)"*కమ్యూనికేషన్స్* 
*లేదా Empathy*:-
*భార్యాభర్తల ఇరువురి మధ్య, సరియైన అవగాహన లోపం*.
*ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు లేకపోవడం*

🧤6)"*సొంత గుర్తింపు కోల్పోవడం*:""*అత్తమామల, భర్త మాట వింటూ తనకంటూ సొంత నిర్ణయాలు తీసుకొని వెసులుబాటు లేక ఆత్మవిశ్వాసం దెబ్బతినటం*

🧤7)"*అతిగా  అనుమానించటం*:
"*(Jealousy*) 
"*భర్త లేదా భార్యలో ఎవరికివారు అతిగా అనుమానించటం బంధం మధ్య ఇరువురి మధ్య సరియైన అవగాహన దృష్టి లేక పోవటం*

🧤8)"*డ్రెస్సింగ్ విషయమై!*": *పెండ్లి తరువాత పూర్తిగా విభిన్న రీతిలో, వస్త్రధారణ చేయవలసి వస్తోంది*.

🧤9)"*ఉద్యోగం విషయంలో భేదాభిప్రాయములు*:"*పెండ్లి అయ్యాక అత్తింటి ఒత్తిళ్లకు గురై ప్రతి ఉద్యోగాలకు దూరంగా ఉండవలసి వస్తోంది*.  *తన ఇష్టాలు త్యాగాలు చేయటం*, 
*ఆమె వంతు అవుతుంది* ‌

🚩"*గమనిక"*: *రేపు* 
*భార్య పెండ్లి అయిన పిదప తన జీవితంలో*, 
*ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా! సవ్యంగా, సాఫీగా, సాగిపోవుటకు,సమస్యలు, అతిగ మించుటకు, తీసుకో వలసిన*
*చిట్కాలు, సూచనలు,సలహాలు, ఏమిటి? తెలుసుకుందాం!*
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment