Unknown Facts About HORMONES & HUMAN BODY || స్త్రీ, పురుషుల సుఖానికి కారణం || Think Telugu Podcast
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=suDmlaYSz5Y
Transcript:
(00:01) [సంగీతం] జరుగుతున్నది జగన్నాటకం కాదు జరుగుతున్నది హార్మోన్స్ నాటకం హార్మోన్స్ రెచ్చిపోయినప్పుడు వచ్చేదే కామం కానీ ఆ కామానికి మనం పెట్టుకున్న పేరు ప్రేమ అలాగే హార్మోన్స్ అలసిపోయినప్పుడు వచ్చేది విరక్తి ఆ విరక్తి పేరే బ్రేకప్ అండ్ డివోర్స్ సో మనల్ని నడిపిస్తుంది భగవంతుడు కాదు బాడీలోని హార్మోన్స్ సింపుల్ గా చెప్పాలంటే హార్మోన్స్ తో సంబంధం లేకుండా మీ జీవితంలో ఒక్క క్షణం సాగదు సో హార్మోన్ అనే పదానికి గ్రీకు భాషలో అర్థం చలనం కలిగించడం 1958 వరకు మనకు తెలిసిన హార్మోన్స్ కేవలం 20 మాత్రమే బట్ సరిగ్గా
(00:47) టోటల్ ఎన్ని అనేవి మాత్రం ఎవరికీ తెలియదు 80 ఉండొచ్చు 100 ఉండొచ్చు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తవి తెలుస్తూనే ఉన్నాయి ఇవి శరీరంలో అనేక చోట్ల నుంచి పుడతాయి బట్ అవి పుట్టించే గ్రంధులు సైజులో చిన్నవైనా మన హ్యాపీనెస్ వెల్ఫేర్ మొత్తం వీటి మీద ఆధారపడి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పిట్యుటరీ గ్లాండ్ నేనే తీసుకుంటే ఇది మన మెదడులో నేరుగా కళ్ళ వెనుక లోతులో ఉంటుంది అది ఉడికిన చిక్కుడు గింజ అంత మాత్రమే ఉంటుంది బట్ దీని ప్రభావం మాత్రం సూటిగా అంతు లేకుండా ఉంటుంది రాబర్ట్ వార్డ్లో అనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇప్పటివరకు బ్రతికి బట్టకట్టిన మనుషుల్లో అందరికంటే ఎత్తైన
(01:28) వాడు ఎందుకంటే అతని పిట్యుటరీ గ్లాండ్ లో ఏదో తేడా వచ్చింది హార్మోన్ తయారీ ఆగలేదు దాంతో అతను ఎత్తు పెరగడం కూడా ఆగలేదు తన హైట్ వల్ల అతను సిగ్గరి అయిపోయాడు 12 ఏళ్లకు ఆరు అడుగుల 11 అంగుళాలు ఎత్తు పెరిగాడు దాంతో రాబర్ట్ స్కూల్ మానేయాల్సి వచ్చింది దీనంతటికీ కారణం అతని మెదడులోని చిక్కుడు గింజ తెచ్చిన చిక్కు ఊరిలో అందరికన్నా ఎత్తు పెరిగాడు అతని షూ సైజు పెరిగిపోయింది 20 ఏళ్ల వయసులో అతని నడక కష్టమైపోయింది దాంతో కాళ్ళు నిలకడగా ఉండడానికి స్ట్రాప్స్ వేయాల్సి వచ్చింది కానీ అవి రాసుకుపోయి ఇన్ఫెక్షన్ అయ్యి చివరికి సెప్టిక్ కి దారి తీసి నరకయాతన
(02:10) పడుతూ 22 ఏళ్ల వయసులో నిద్రలోనే చనిపోయాడు చనిపోయే నాటికి అతని హైట్ 8 ft 11 ఇంచెస్ ఇది తెలుసుకున్న సైంటిస్టులు బిత్తర పోయారు ఎందుకంటే అంత చిన్న గ్లాండ్ సరిగ్గా పని చేయనందుకు అతను పెరుగుతూనే పోయాడు అందుకే పిట్యుటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అంటారు ఎందుకు ఎందుకంటే మీరు సెక్స్ చేస్తున్నప్పుడు మీ ఆనందానికి కారణం ఈ చిక్కుడు గింజే అలాగే మీరు తీవ్రంగా వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ గ్రంధి బ్లడ్ లో ఎండార్ఫిన్ ని రిలీజ్ చేస్తుంది అందుకే రన్నింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆనందం వస్తుంది దీన్నే రన్నర్ సహా అంటారు అలాగే మీరు తింటున్నప్పుడు కూడా ఈ కెమికల్ రిలీజ్
(02:51) అయ్యి ఒక ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ గ్రంధికి గంజాయి రకం మందుతో కూడా సంబంధం ఉంది అలాగే పెరుగుదల హార్మోన్ ఆర్టిజోల్ ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ ఆక్సిటోసిన్ అడ్రినల్ ఇంకా మరెన్నో హార్మోన్స్ ని సిద్ధం చేస్తుంది అలాగే మీకు హగ్ హార్మోన్ గురించి తెలుసా అదే ఆక్సిటోసిన్ గురించి దీని పనితీరు చాలా విచిత్రంగా అంతే క్రమ పద్ధతిలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ పుడుతున్న టైం లో తల్లి గర్భాశయం కదిలే తీరును పెంచుతుంది అండ్ తల్లిలో చనుబాలు తయారవ్వడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది అలాగే మనం ఎదుటి మనిషి ముఖాలను గుర్తించడంలో ప్రేమ రిలేషన్ వంటి భావాలు
(03:32) పుట్టించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది సో దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి సైంటిస్టులు ఎలుకలకి ఆక్సిటోసిన్ ఇచ్చారు అప్పుడు ఒక భయంకరమైన విషయం బయటపడింది ఎలుకలు తమవి కాని పిల్లల కోసం కూడా కొంత ప్లేస్ ఏర్పాటు చేసి వాటిని బుజ్జగించడం మొదలు పెట్టాయి నేను ఇప్పుడు చెప్పే లోతైన విషయం మీకు అర్థమవుతుందా మీ పిల్లలపై ప్రేమను చూపించడం వాళ్ళ కోసం కష్టపడి డబ్బు సంపాదించడం అనేది కేవలం మీలో పుట్టే ఆక్సిటోస్ అనే హార్మోన్ వల్ల అది ఏ మాత్రం కొంచెం ఎక్కువైతే మీ మదర్ నిన్నే కాదు మీ పక్కింటి పిల్లోడిని కూడా అదే విధంగా చూస్తుంది అంటే మన కుళ్ళు మన ప్రేమ మన
(04:11) ఆప్యాయతలు మన స్వార్ధాలు కేవలం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఒక క్రమ పద్ధతిలో ఉండడం వల్లే సో తప్పు మనిషిది కాదు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ది ఇంకా చెప్పాలంటే ఒక కాళ్ళు చేతులు లేని వాడికి మీరు కొంత దయ చూపి కొంత మనీ సైన్ చేశారు అనుకుందాం ఇక ఇక్కడ తన ఆనందం కోసం మీరు హెల్ప్ చేయలేదు కేవలం మీ ఆనందం కోసమే హెల్ప్ చేశారు అది ఎలా అంటే అతని దీన పరిస్థితి చూడగానే మీ జాలి హృదయం గాయపడింది ఆ గాయపడినప్పుడు మీలో ఆనందం పుట్టించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కి గండిపడి బాధ పుట్టించే హార్మోన్ రిలీజ్ అయింది సో ఇప్పుడు మీరు ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి ఆక్సిటోసిన్ రిలీజ్
(04:53) అవ్వడానికి మీరు అతనికి సాయం చేస్తారు సో మీరు సాయం చేసింది అది పక్కోడికి కాదు మీలో ఆనందం ఆనందాన్ని కలిగించే హార్మోన్స్ కోసం మీకు మీరే సాయం చేసుకుంటున్నారు సేమ్ లవ్ అండ్ సెక్స్ కూడా ఇంతే మీరు ఎప్పుడూ ఎవరిని లవ్ చేయరు అలాగే సెక్స్ కూడా చేయరు మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరే సెక్స్ చేసుకుంటారు మీ పార్ట్నర్ అనేవాళ్ళు కేవలం ఒక సాధనం మాత్రమే సో జరుగుతున్నది జగన్నాటకం కాదు జరుగుతున్నది హార్మోన్స్ నాటకం
No comments:
Post a Comment