పెద్దపుల్లేరు గ్రామంలో మాతాజీగారి సత్సంగ భాషణం - 1
Author Name: ప్రణవ ఆశ్రమము
Youtube Channel Url:https://www.youtube.com/@pranava_ashramam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WcGoNIuCI_A
Transcript:
(00:00) శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శ్రీ గురుభ్యో నమః మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారములు చాలా సంతోషం మిమ్మల్నిందరినీ ఇలా చూడటం నేను పెడుపులేరులో ఉన్నది 81 నుంచి నుంచి 87 వరకు సిక్స్ ఇయర్స్ ఉన్నాను ఇక్కడ ఈ సిక్స్ ఇయర్స్ అంటే సిక్స్త్ నుంచిటెన్త్ క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను 86 లోటెన్త్ అయిపోయింది 87 లో మ్యారేజ్ అయిపోయింది అది కూడా
(00:48) చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను మ్యారేజ్ చేసుకోవాలని అనుకోలేదు ఈ ఊరిలో జనమందరూ కలిసి నాకు చక్కగా కొన్ని అంటగట్టి వాటి నుంచి నన్ను జాగ్రత్తగా పెళ్లి వైపుకి లాక్కెళ్ళిన మహాత్ములు ఈ ఊళలో చాలామంది ఉన్నారు. వైరాగ్యం కూడా నాకు ఈ ఊరిలోనే వచ్చింది కాబట్టి ఈ ఊరంటే నాకు అభిమానం ఏవండీ వైరాగ్యం ఆ వయసులోనే వచ్చింది నాకు ఎవరో చదువుకోలేదు వాళ్ళ లెటర్స్ రాయమంటే నేను రాసి ఇస్తే ఆ లెటర్ కింద ఇక్కడున్న రాజకీయాలతోటి నా పేరు రాస్తే నా స్నేహితులు వాళ్ళు తల్లిదండ్రులు కూడా నన్ను గాసిప్స్ మాట్లాడుకుంటే
(01:32) ఈ ఊళలో నాకు వచ్చిన వైరాగ్యంతోటి నేను ఈ సన్యాసం తీసుకున్నాను కాబట్టి ఈ ఊరు నాకు ముందు సన్యాసం వైపు నడిపించింది కాబట్టి ఆ కృతజ్ఞత ఈ ఊరి మీద నాకు ఉండిపోయింది. చాలా సంతోషము ఎందుకనింటే ఒక సన్యాసం సామాన్యం కాదు అది జన్మ జన్మల నుంచి వస్తుంది అది గురు కృప ఉండాలి వైరాగ్యం కావాలి ఎన్నో పరీక్షలు పెడతారు సన్యాసానికి పుట్టినే తీసుకునేది కాదు సన్యాసం దయానంద పరంపరలో సరస్వతీ సాంప్రదాయంలో తీసుకున్నామ అని అంటే ఆ సాంప్రదాయంలో సంప్రదాయంలో 33 సంవత్సరాలు నన్ను పరీక్షిస్తే కానీ నాకు ఈ సన్యాసం ఇవ్వలేదు
(02:18) ఆరు సంవత్సరాలు ఈ ఊళలో నా గురించి ఏం తెలుస్తుందండి ఆరు సంవత్సరాలు ఇక్కడ ఉంటే నా గురించి ఏం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసు ఈ జన్మ మానవ జన్మ ఉత్తమమైన మైన జన్మని అటువంటి ఉత్తమమైన జన్మని మనం ఎలా గడుపుతున్నాము ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే చిన్న జ్ఞానం మాత్రం ఉండదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటాం అంటే అందరం బ్రతికినంతసేపు అనేక రకాలుగా బ్రతికి చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి చేరుకుంటామా అనుకుంటారు.
(03:01) చేరుకుంటామా అండి మనందరం భగవంతుడి దగ్గరికి ఒకవేళ చేరుకుంటే ఉండగలుగుతామా ఎందుకని ఇక్కడే పావు గంట పూజలో స్థిరంగా ఉండలేకపోతున్నాం గుడికి వెళ్తే కూడా కరెక్ట్ గా ఉండలేము మనం మరి చనిపోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి ఎలా చేరుకోగలుగుతాం ఇది మనం గుర్తించాలి గుర్తిస్తే మనిషి మనీషిగా జీవించటము మహాత్ములు అవ్వడము దైవత్వంలో చేరుకోవడము అనే స్టేజ్లు ఉన్నాయని కూడా మనకు తెలియదు.
(03:40) అలా మూడు రకాలుగా మనిషి ఎదుగుదల కావాలి. అయితే నాకు తెలిసున్నంతవరకు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను పెద్దపిల్లేరులో ఇంత స్పిరిచువల్ అనేది ఇప్పుడు చూస్తున్నాను చాలా సంతోషం వచ్చింది నాకు ఎందుకనింటే ఇంత మహా కార్యం ఇంత మహత్ కార్యం ఈ గ్రామంలో జరగడం అనేది మీ అందరి అదృష్టం కూడా అంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళందరూ కూడా నా క్లాస్మేట్స్ కూడా ఉన్నారు శివమాల వేసుకుని క్లాస్మేట్స్ ఉన్నారు.
(04:19) ఫస్ట్ టైం కాకినాడ వచ్చి ఆశ్రమం వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపించింది. సరిగ్గా ప్రతిష్ట రోజు నాకు అమెరికా ప్రయాణం కానీ వాళ్ళందరూ అడిగేటప్పటికీ ఆ ప్రయాణం వాయిదా వేసుకుని 17వ తారీకుకి మళ్ళీ మార్చుకుని రావాల్సి వచ్చింది. అది కూడా ఉమాదేవి కోరిక. నా జీవితంలో నాకున్న ఫ్రెండ్స్ లో నాకున్న ఫ్రెండ్స్ ఎవ్వరు నన్ను అర్థం చేసుకోలేదు తన ఒక్కతే అర్థం చేసుకుంది ఆ రోజు ఆ కష్టంలో తను ఒక్కత్తే నిలబడింది.
(04:50) అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన ఒక్కత్తే ఉంది నిజమైన స్నేహం ఏమి ఆశించని స్నేహం ఆ స్నేహం అందుకే ఇన్ని సంవత్సరాలయనా తను నా క్లాస్మేట్ కాదు ఎప్పుడో ఫిఫ్త్ క్లాస్ లో ఒక వన్ ఇయర్ ఎక్కడో చదువుకున్నాం తప్పించి నా క్లాస్మేట్ ఏం కాదు కానీ ఏ గాసిప్స్ లేకుండా నన్ను నన్నుగా యదార్థంగా అర్థం చేసుకుని ఆ స్నేహం అప్పటినుంచి ఇప్పటివరకు కంటిన్యూ అవుతుంది.
(05:21) తన అత్తూరు ఫ్యామిలీలో అందరూ నాకు చుట్టాలు అయ్యారు. అంటే నా గురించి తను ఎంత గొప్పగా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ ఈరోజు నా ఫ్యామిలీ అయి ఉన్నారు. అనిఅంటే నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను. ఎందుకనింటే మన సుఖాల్లో చాలామంది ఉంటారండి మన కష్టంలో ఎవరూ ఉండరు. మీ అందరికీ ఆ విషయం తెలుసు. తలలో మాట వేసి మనం పాపం మూట కట్టుకుంటాం.
(05:51) ఎంత పాపం మూట కట్టుకుంటాం అంటే నీకు తెలియని విషయాన్ని తెలిసున్నట్టు మాట్లాడితే ఆ పాపం మనం మోయాల్సి ఉంటుంది పాపం చాలా సునిషితంగా ఉంటుంది. సూక్ష్మత అది అందుకే అనేక అనారోగ్యాలు లేకపోతే మనతో పాటుగా ఆ పాపం మన పిల్లలకు పంచుతాం ఇవన్నీ తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలే అవుతాయి 84 లక్షల జీవరాశుల నుంచి కొద్ది కొద్దిగా పుణ్యాన్ని పోగు చేసుకని ఉత్తమమైన జన్మ మానవ జన్మ మీరందరూ తీసుకున్న తర్వాత ఆ జన్మ జ్ఞాన ప్రధానమైన జన్మ అటువంటి జ్ఞాన ప్రధానమైన జన్మలో మనం ఉంటూ మనం ఏం చేయాలి అనే చిన్న ఆలోచన మనకు రావాలి.
(06:40) మనం ఏం చేయాలి అన్నప్పుడు మనమందరం ఏముందండి చక్కగా ఇద్దరు పిల్లలని కన్నాం వాళ్ళ పెళ్ళలు చేశం వాళ్ళందరినీ చదివించుకున్నాం మంచి పొజిషన్ లో ఉన్నారు ఇప్పుడు బాగుంది మనమంతా బోళ్ళ భోగాల్లో ఉంటాం తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి దేనికి లోటు లేదు అయినా లోపల ఎక్కడో అసంతృప్తి ఉంటుంది. నిజమా కాదా ఉంటుంది ఎందుకుంది అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీలో ఉండే ఆత్మ అది వచ్చిన పనిఏంటి అంటే అనేక జన్మల్లో లేని అవకాశము ఒక మానవ జన్మలో జ్ఞానంతో ఉంది కాబట్టి
(07:27) లోపల నుంచి ఆత్మ ఘోష ఉంటుంది అది మీరందరూ అర్థం చేసుకునేంత స్థితిలో మనం ఉండం కాబట్టి మనసు దాన్ని మూస్తుంది కాబట్టి మనసు మాట వింటాం కానీ ఆత్మ యొక్క ఘోష వినం మనం అందుకని మనసు ప్రశాంతంగా లేదు గుడికి వెళ్తాము దైవం పుస్తకం చదువుకుంటాము లేదా ఏదో వింటాము లేకోతే పూజ కార్యక్రమంలో కూర్చుంటాము కానీ ఎంతసేపు మనసు మీకు అక్కడ పూజ దగ్గర నిలబడుతుంది.
(08:01) భగవంతుడు 24 గంటల సమయం మనక ఇచ్చాడు. ఆ 24 గంటల సమయంలో తిరిగి భగవంతుడికి ఎంతసేపు ఇస్తాము ఎంతసేపు ఇస్తారమ్మా భగవంతుడికి మీరు టైము చెప్పట్లేదు ఆ 10 నిమిషాలు 10 నిమిషాలు లేకోతే పూజ చేస్తే అరగంట లేకపోతే గంట ఐదు నిమిషాలు ఏదో మొత్తం మీద ఇస్తారు కానీ భగవంతుడి దగ్గర మనసు ఎంతసేపు నిలబడుతుంది ఎంతసేపు నిలకడగా ఉంటుంది గమనించారా ఎప్పుడైనా గమనించరు భగవంతుడు అంటే కష్టాలు వచ్చినప్పుడు
(08:45) ఆదుకోవడానికి మనక ఇష్టమైనప్పుడు దండం పెట్టడానికి ఏదో మొత్తం మీద కోరికల కోసం అనేక రకాలుగా భగవంతుడు అనడమే తప్పించి భగవంతుడు అన్ని ఇచ్చిన భగవంతుడికి నేనేమ ఇవ్వాలి అని ఎప్పుడైనా ఆలోచిస్తామా ఆలోచించం ఏమఇస్తామండి అన్ని ఆయనే ఇచ్చాడు కదా మళ్ళీ తిరిగి మనం ఏమ ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది. అని ఆయన ఇస్తే మనమేం భగవంతుడికి ఇవ్వగలుగుతాం అని అన్నప్పుడు ఇప్పుడు ఈ ఊర్లో ఈ గుడి నిర్మాణం ఎవరైతే పూనుకున్నారో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే దానికి ధనం కానీ లేకతే ఏదో ఒకటి
(09:30) సహకరిస్తున్నారో వారందరూ కూడా ఆ భగవత్ కార్యంలో పాలు పంచుకున్నారా పంచుకోలేదా తప్పనిసరిగా పాలు పంచుకున్నారు ఇదే పని ఇదే టైము వాళ్ళ వ్యాపారాలకో లేకపోతే ఇంటికో లేకోతే ఇంకో దానికో ఇంకో దానికో వాళ్ళు ఇవ్వకుండా మన ఊర్లో శివాలయం లేదు కాబట్టి శివాలయాన్ని తీసుకురావాలి అని ఒక కృషి చేసి ఉంటారు. అది ఎవరెవరు ఎంత కృషి చేశారు అనేది కాదు కానీ ఆ సహృదయం ఉంటే తప్పించి దైవం అంటే కేవలం దండం పెట్టేయడమే కాదు లోక కళ్యాణార్థం
(10:16) ఊరికి మంచి జరగాలని ఒక నిర్మాణం ఇప్పుడు హుత్రికులు చూశాను నేను అంటే చూస్తే మాకు అర్థమవుతుంది మంత్రం శాస్త్రం తెలుస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్న పూజా విధానాన్ని బట్టి అహుత్రికులు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అర్థంయపోతుంది. ఎంత బాగా ఆ మంత్రం తోటి మీరు ఎనిమిదవ తారీకు నుంచి మొదలుపెట్టి 12వ తారీకు వరకు ఇక్కడ మంత్ర శక్తి హోమము దానికి సంబంధించిన దేవతార్చన ఆవాహనము అన్నింటిని అన్నింటిని మీ అందరి సమక్షంలోకి తీసుకొస్తారు అది సూక్ష్మతతోటి తెలుసుకోగలిగే స్థితి మీకు ఉంటే ఆ సూక్ష్మతలో మీరు దాన్ని పట్టుకోగలుగుతారు.
(11:00) లేకపోతే ఇక్కడ కూర్చుని అక్కడ అక్కడ పూజ జరుగుతూ ఉంటుంది అక్కడ మంత్రం జరుగుతూఉంటుంది ఇక్కడ మనం కబుర్లు చెప్పేసుకుంటూ ఉంటాం. ఎందువల్ల మనసు ఆగదు మనసు ఆగదు ఆ కబుర్లు చెప్పేసుకుంటాం సెల్ ఫోన్లో మాట్లాడేసుకుంటూ ఉంటాం ఎక్కడున్నారంటే మా ఊర్లో ఇంత గొప్పగా జరుగుతుందండి మేమందరం ఇంత గొప్పగా ఉన్నాం అంటారు కానీ నువ్వు ఏమ అందుకున్నావ్ అక్కడ మనం ఏమ అందుకున్నాం నేను యాక్చువల్ గా ఆర అయితే క్లోజ్ చేసేస్తాను.
(11:31) ఎందుకని ఈ రోజంతా మూడు నాలుగు క్లాసులు ఉంటాయి. సిక్స్ అయ్యేటప్పటికీ ఈ నోరు మూతపడకపోతే గనుక మళ్ళీ కష్టం ఓంకారం మాది కాబట్టి ఓంకారానికి చాలా కష్టం అవుతుంది కాబట్టిసిక్స్ కి క్లోజ్ చేసేయడం ఎక్కడైనా ఈ టైం కి నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది నేను చెప్పాను ఉమాదేవితోటి రాత్రి ఎనిమిది దాటేకి రమ్మన్నారఅంటే నేను నిద్రపోతాను స్టేజ్ మీద మీ ఇష్టం తర్వాత అని చెప్పాను కానీ మాకు కూడా మన ఊరు అనేటప్పటికీ ఎన్ని ఎగజంప్షన్లు అంటే మన ఊరు అంటే అభిమానం ఒకటి ఉంటుంది ఆ అభిమానం అనేది ఎక్కడికి పోదు ఆ అభిమానం తోటి ఎంత హుషారు ఎంత ఉత్సాహం వస్తుంది కదండీ
(12:16) అలాగే మీరు పుట్టినప్పటి నుంచి అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకేం తెలీదు కానీ ఎవరు మీకు ఆహారాన్ని లేకపోతే ఎవరు మీకు అమ్మ పట్లో ఉండగా అమ్మ సప్లై చేయలేదు ఎవరు చూశారు పోషణ అమ్మ ఆహారం తీసుకుంటే దాన్ని రక్తం కింద మార్చి మీకు సప్లై చేసింది ఎవరు ఎవరమ్మా భగవంతుడు కదండీ అక్కడి నుంచి మీరు బయటికి రావడానికి మార్గాన్ని సుగమం చేసింది కూడా భగవంతుడే నువ్వు అడ్డం పడిపోతే నీకు మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఆ డాక్టర్ కూడా దైవం లాగా నిన్ను బయటకి తీసింది డాక్టరే అంటే దైవంతో సమానం
(13:05) అక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయితే నువ్వు మరణించేంతవరకు అన్ని విషయాల్లో అన్నింటికీ తోడుగా ఉండేది దైవమా కాదా మనం గుర్తించకపోవచ్చు గాక నువ్వు గుర్తించకపోవచ్చు కానీ నీకు ఆపద వచ్చినా ఏమవచ్చినా ఫస్ట్ నువ్వు భగవంతుడికి దండం పెడతావ్ కదండీ మరి అటువంటి దైవం 24 గంటల సమయం నాకు ఇస్తే 24 గంటల్లో నేను తిరిగి ఎంతసేపు భగవంతుడికి ఇవ్వగలుగుతాను అని ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసుకుంటామా పోనీ పూజ చేసేటప్పుడైనా ఇప్పుడు నేను పూజ చేస్తున్నాను కాబట్టి
(13:50) నేను నా భగవంతుడు అని నువ్వు నిర్ణయించుకోగలుగుతావా అన్నింటికీ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నింటికీ టైం ఇస్తారు తీరా భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటే మాత్రమే ఉంటారు. మిగతా టైం అంతా మరేం చేస్తాం మనం అంటే ఏం చేస్తామో మనకి తెలియదు చేతిలో ప్రపంచం సెల్ ఫోన్ అనే ప్రపంచం వచ్చింది మనల్ని మనం మర్చిపోయేటంతా మనుషులు అనేక రకాలుగా పక్కకు వెళ్ళిపోయారు.
(14:26) పూర్వం సమయం ఉండేది ఇప్పుడు ఎవ్వరికీ సమయం లేదు ఎలా గడుస్తుంది సమయం అంటే ఏమో ఎలా గడుస్తుందో ఈ ఊరి నుంచే వెళ్ళాను నేను ఇక్కడేటెన్త్ క్లాస్ చదివాము మళ్ళీ కాకినాడ వెళ్ళిన తర్వాత ఇంటర్ చదువుకొని డిగ్రీలు చదువుకుని మళ్ళీ బిఈడిలు చేసి ఉద్యోగం చేసి అన్నీ చేస్తూ వాళ్ళు చెప్పిన అంటే 87 లో వెళితే ఇప్పటికీ 38 సంవత్సరాలు మధ్యలో రమేష్ చనిపోయినప్పుడు ఒక్కసారి వచ్చారు నేను ఈ 38 సంవత్సరాల్లో మీరు చూస్తున్న ప్రభావతి ఇప్పుడు సుమిత్రానంద సరస్వతి అయిందంటే ఎన్ని రకాలుగా కృషి చేస్తే అయి ఉంటుంది మీ ఊరు అమ్మాయే కదా
(15:12) మీ ఊరు అమ్మాయే కదా జర్మనీ నేను క్లాసులు చెప్పట్లేదండి జర్మనీ యూనివర్సిటీ రీసెర్చ్ కోసం పిలిస్తే వెళ్ళాను ఓంకారం మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాసా వాళ్ళు ఒకటి చెప్పారు సూర్య కిరణాల నుంచి ఓంకారం వస్తుంది అని తెలియజేశారు నాసా వాళ్ళు తెలియజేస్తే నేను సబ్మిట్ చేశాను ఒకటి ఒక ప్రోగ్రాం తయారు చేసి అప్పటికే అమెరికాలో చాలామంది ప్రొఫెసర్స్ కి డాక్టర్స్ కి నేను ఓంకారం మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి క్లాసెస్ చెప్తున్నాను కాబట్టి ఆ ప్రూఫ్లతో సహా మేము సబ్మిట్ చేశం నాసాలో భారతదేశంలో
(15:57) మునులు ఋషులు ఎంతోమంది ఎప్పుడో కృషి చేసి తపస్సు చేసి ఓంకారం ఎక్కడెక్కడి నుంచి వస్తుందో అన్ని తెలియజేసి ఉన్నారు. ఇప్పుడు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు సూర్య కిరణాల నుంచి ఓంకారం వస్తుందంటే ప్రపంచ దేశాలన్నీ అబ్బా అన్నారు ఈ పిల్లలకంటే తెలియదు కాబట్టి అది నాసా వాళ్ళు కనిపెట్టారు అంటున్నారు నాకు చాలా బాధేసింది ఎందుకని మన భారతదేశంలో అంతకుముందు 20 సంవత్సరాల నుంచి నేను రీసెర్చ్ చేస్తున్నాను దాని మీద ఆరుఏడు సంవత్సరాల నుంచి నాసా వాళ్ళ సూర్య కిరణాల నుంచి ఓంకారం వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు నాసా వాళ్ళు కనిపెట్టారు
(16:37) అంటున్నారు నాసా వాళ్ళు ఎందుకు కనిపెడతారు ండి మన భారతదేశం సంస్కృతి సంప్రదాయం అంటే కట్టు బొట్టు కాదు మునులు ఋషులు ఎంతో కృషి చేసి వాళ్ళు ఎంతో తపస్సు చేసి తపించి మనకు అందించిన సంపద ఏంటంటే ఆంతర వికాసము శారీరక ఆరోగ్యము మానసిక శాంతి ఇవి మనకు అందించారు. మళ్ళీ చెప్తాను మీరు అప్పుడే మర్చిపోతారు అందుకే నేను ఆ బాధ ఆంతర వికాసము శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఇది వాళ్ళు తపస్సు చేసి అందించిన సంపద అది కానీ మనక ఎవ్వరికైనా సరే ఇది సంపద అని
(17:24) తెలుస్తుందా రూపాయి కాయితాల సంపద అని తెలుస్తుందా ఇది మీరు గుర్తించాలి గుర్తిస్తే ఇంతటి మహాద్భాగ్యం మనకి భారతదేశంలో పుట్టడం మీరందరూ ఇక్కడ పుట్టడం అనేది ఎన్నో జన్మల పుణ్యం ఎంతో పుణ్యం ఉంటే కానీ భారతదేశంలో పుట్టం మనం అనే విషయం కూడా మనకి గుర్తుకు రావట్లేదు ఎంత పుణ్యం ఉంటే మీరు భారతదేశంలో పుడతారండి ఇది మనం గుర్తించాల్సిన విషయం కానీ గుర్తించం ఎక్కడ గుర్తించం మనం కాబట్టి సరే సెల్ ఫోన్లో ప్రపంచ దేశాల్లో అది కనిపెట్టారు ఇది కనిపెట్టారు అనిఅంటే మన భారతదేశంలో మునులు ఋషులు ఋషి అంటే కృషీవరుడు మీరు కృషి చేసిన ఋషులే
(18:12) అవుతారు ముని అంటే మననశీలురు ఎంతటి మననశీలురు అంటే వాళ్ళు తపించి తపించి ఒకే విషయం మీద ఏకాగ్రతతో కేంద్రీకరించి కనుక్కున్న విషయాల్ని రెండు తరాలు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన తల్లిదండ్రులు వాళ్ళు షూటు బూటు చూసి మా పిల్లలు ఇలా సూటు బూటు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మిమ్మల్నిందరినీ కాన్వెంట్లో చదివిస్తే మీరందరూ మీ పిల్లల్ని నారాయణ చైతన్యలో చదివించి మొత్తం మీద అన్ని పక్కకు తోసేసారు.
(18:48) కానీ ఈ మధ్య కాలంలో మార్పు ఏంటంటే కనీసం ఇలా గుళ్ళు నిర్మాణాలు అన్ని చేసి ఆ బలాన్ని తీసుకొస్తున్నారు దానికి మనం చాలా సంతోషించాల్సిన విషయం. కాబట్టి ఇంతటి మహద్భాగ్యం మనకు ఉందని తెలియట్లేదు మేము సబ్మిట్ చేసినప్పుడు నాసా వాళ్ళు పిలిసి నన్ను ప్రూఫ్లు చూపించమన్నారు. మేము ప్రాజెక్ట్ తయారు చేసి ప్రూఫ్లు చూపించి ఎంతమంది ఓంకారం మీద రీసెర్చ్ చేస్తున్నారో అన్ని సబ్మిట్ చేస్తే అప్పుడు నాసా పిలిచారు నన్ను నాసాలోకి కొన్ని రకాల లోపలికి ఎవ్వరిని వెళ్ళనివ్వరు అలా వెళ్ళనిచ్చి నాకు మొత్తం అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి ఉన్నారు
(19:29) మరి ఈ పెద్ద పుల్లేరు నుంచి వెళ్ళిన అమ్మాయి నాసా వరకు వెళ్ళింది కదా మరి ఎలా వెళ్ళగలిగింది అది నా గొప్ప కాదు నా గొప్ప కాదు అది ఈ భూమి యొక్క బలం అది అంటాను నేను ఈ భూమి యొక్క బలం అది ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద నిర్మాణం జరుగుతోంది అనిఅంటే ఈ భూమి యొక్క బలం అది ఎవరెవరు సంకల్పం చేశారో ఈ భూమి నుంచి ఎంతమంది మహాత్ములు కృషి చేసి ఉంటారు ఒక గుడి నిర్మాణం సామాన్యమైన విషయం కాదు ఎందుకనింటే ఇంతటి కార్యక్రమం అంతా కూడా పుత్రికులు చేసేది భూమి నుంచి ఆ శక్తిని తీసుకురావడానికి ఆ నిర్మాణంలో అనేక రకాలుగా ఉద్దీపన
(20:15) చేయటానికి గ్రామ అభివృద్ధికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా అటువంటి సత్కార్యం జరుగుతున్నప్పుడు మనవంతు మనం సహకరించాల్సి ఉంటుంది అలాగే అలాగే తెలుసుకోవలసి ఉంటుంది. ఏం తెలుసుకోవాలి అనింటే మన ఇంట్లో దేవుడు ఉండగా మళ్ళీ గుడిలో దేవుడు ఎందుకు అని తెలుసుకోవాలా తెలుసుకోవద్దా కదండీ మన ఇంట్లో దేవుడు ఉన్నాడు సర్వాంతర్యామి జగతే ఈసది యుక్త సేవనం అష్టమూర్తి బృద్దేవ పూజనం అన్నాడు భగవాన్ రమణ మహర్షి భగవంతుడు ఎనిమిది రూపాలు అలరాతున్నాడు ఐదు పంచభూతాలు
(21:00) ఆరు సూర్యుడు చంద్రుడు ఏడు చంద్రుడు ఏడింటిని గుర్తించేది ఎవరు మీరు కదండీ అంటే మనల్ని ఎక్కడ పెట్టారు ఆ అష్టమూర్తుల్లో పెట్టారు ఎందుకని మీరు ఉంటేనే మీ జ్ఞానం మీ ప్రజ్ఞ మీ ప్రజ్ఞ ఆ ఏడింటిని గుర్తించగలుగుతోంది ఏ ప్రాణి గుర్తించగలుగుతోందిఅండి మనం గుర్తించ గుంచగలుగుతున్నాం ఇది గాలి ఇది నీరు ఇది భూమి ఇది ఆకాశము ఇది అగ్ని ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని మనం గుర్తిస్తున్నామా గుర్తించట్లేదా అందుకని ఆ ఏడింట్లో ఎనిమిదో కింద నువ్వు ఉన్నావు అన్నాడు కానీ నేను అంత
(21:46) గొప్పదాన్ని అని మీరు గుర్తించగలిగితే గొప్పవాళ్ళు అవుతారు లేదండి ఆ పక్కింటోళ్ళు ఈ పక్కంటోళ్ళు వెదవసోదలు అన్నీ చెప్పుకుని ఇలాగంట అలాగంట అని చెవులు కోరుకుంటే గనుక ఇంత పాపం మూటకట్టుకుొని మోకాళ్ళ నెప్పులు నడుము పోట్లు అనేక రకాల ఒళ్ళు నెప్పులు వస్తున్నాయి అంటే బాగా గాసిప్స్ మాట్లాడుకుంటున్నారు అని అర్థం మీకు తెలియదు సైన్స్ ఉంది చాలా స్వార్థం పెరిగితే ఒళ్ళెప్పులు వస్తాయండి ఈ విషయం అర్థం అవ్వట్లేదు జనాలకి శాస్త్రం చెప్తోంది నేను చెప్పట్లేదండి నేను చెప్తే నన్ను తిడతారు మీరందరూ నేను ఇలా జరగగానే మీరు 100 మాటలు మాట్లాడుకుంటారు నాకు తెలుసు అయినా మాకేం
(22:24) పట్టదు కదండీ ఇంకా డౌట్ ఉండిపోతుంది ఇంకా డౌట్ డౌట్ ఉండిపోతుంది బోల్డ్ రకాల డౌట్లు ఉంటాయి మీ అందరికీ కానీ నేను ఒకటే చెప్తున్నాను అలాంటి అష్టమూర్తుల్లో మీరైనా ఒకరు అన్నప్పుడు మరి నేనేం చేయాలి ఒండుకు తినేయాలా ఇంకా అయిపోయిందని కాలక్షేపం చేయాలా ఊళలో బాగుంది నాలుగు రోజులు 12వ తారీకు వరకు మంచి హడావడిగా ఉంటారు 13వ తారీకు నుంచి ఇదంతా కళ్ళతప్పిపోతూ ఉంటుంది.
(22:56) మరి మనం ఏం చేస్తాం అప్పుడు అంటే ఈ ఐదు రోజులు ఆరు రోజులు కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన అవిస్ దాని నుంచి వచ్చిన శక్తి మిమ్మల్ని ఇంకా ముందుకు నడపాలి అనిఅంటే నేను పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి ఏం పట్టుకోవాలి మీరు ఇక్కడ ఆ మంత్రశక్తి హోమము అలాగే ప్రతిష్టలో ఎంతో మంది దేవతలను ఆహ్వానిస్తారు కాబట్టి ఆ ప్రతిష్ట యొక్క ఒక బలం ఇదంతా కలిపి ఒక అవిస్ అన్నారు ఈ గ్రామానికి ఒక అవిస్సు అందుకని ఒక ప్రతిష్టకి ఒక ఎతి కావాలన్నారు.
(23:38) ఎందుకు యతి ఎందుకండి అంటే సన్యాసం అంటే సామాన్యం కాదు త్యాగానికి ప్రతీక సన్యాసం మీరు చూసిన టీవీల్లో సోషల్ మీడియాలో సన్యాసంలో నేను చెప్పలేను కానీ రియల్గా సన్యాసం అంటే కనుక చాలా పరీక్షలు పెడితే తప్పించి సన్యాసం కుదరదు అయితే మనమందరం కూడా చాలా స్పీడ్ గా దూరం వెళ్ళిపోయాం ఎంత దూరం వెళ్ళిపోయాం అంటే మన పెద్దలు మన తల్లిదండ్రులను చూడండి మీ తాతలు ముత్తాతలను చూడండి వాళ్ళు చదువుకోలేదు కానీ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు పన్ను లేదు కల్జోడు లేదు మనకలా స్టీల్ రాడ్లు లేవు పడిపోతే పొలంలో పడిపోయినా లేసి వాడే నడిసి వచ్చేసేవారు మరి మనము
(24:26) ఇది గమనిస్తే తెలుస్తుంది కదండీ చదువుకున్నాము మన పిల్లల్ని డాక్టర్స్ యాక్టర్స్ చేస్తున్నాము అందరికీ డబ్బులు ఉంటున్నాయి అన్ని ఉంటున్నాయి కార్లు ఉంటున్నాయి ఇళ్లు ఉంటుంది లేకపోతే ఫెసిలిటీస్ ఉంటున్నాయి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు అమెరికాలో వెళ్తున్నారు అన్ని చేస్తున్నారు కానీ నీకు మాత్రం మనశశాంతి లేదు లేదా నీకు మాత్రం ఆరోగ్యం లేదు ఎందుకు లేదు ఇది గమనించాలి ఎందుకు ఎందుకు లేదు మనకి ఇది గమనిస్తే మన జీవన విధానంలో బోల్డ్ మార్పులు వచ్చినయి నువ్వు ఇప్పుడు ఆ పాత కాలంలోకి నువ్వు వెళ్ళలేవు అలాని మోడరన్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు
(25:07) కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళఎవ్వరు చదువుకోకపోయినా వాళ్ళందరూ పిల్లల్ని 10 మంది 14 మంది పిల్లలు ఉండేవారు మినిమం మినిమంలో ఐదుగురు అన్న ఉండేవారు వాళ్ళు ఎవరూ బాధపడలేదు మనకి లింగులు ఇటుకమంటూ ఇద్దరు పిల్లలు లేకోతే ఒక పిల్లలు కానీ ఎంత కష్టం అవుతోంది ఇది గమనించాలి మీరెవ్వరు మీ తల్లిదండ్రులని ఎదిరించలేదు మీ పిల్లలు మిమ్మల్ని ఎదిరించకుండా ఉంటారా మాట్లాడట్లేదు ఎదిరించకుండా ఉంటారా ఉండరు మీరు కాలం మారిపోయింది అంటున్నారు కాలం మారిందా మనుషులు మారా కాలం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వర్షాకాలం వేసవ కాలం
(25:53) సీతాకాలం అదే కాలం కాలం మారిందా మనుషులు మారారమ్మా మనుషులే మారారు కాలం మారదు కాలం ఎప్పుడూ అలాగే ఉంటుంది మనం ప్రకృతి పాడు చేస్తే అదేమనా కొద్దిగా అటు ఇటు అవ్వాలేమో కానీ మూడు కాలాలు ఎప్పుడూ ఒక్కటే ఉంటాయి కానీ మనం మారాం అనే విషయం తెలియాలి మోడర్న్ అయ్యాం ఎన్నో తెచ్చుకున్నాం కానీ ప్రశాంతతని కోల్పోయాం అనే ఒక్క విషయం తెలిస్తే మరి మనం ఇంత డెవలప్ అయి ఏది పోగొట్టుకున్నాం మన పెద్దలు ఋషులు మనులు మునులు అందరూ ఇచ్చిన శాంతిని పోగొట్టుకున్నాం అది సంపద అని
(26:37) తెలియట్లేదు వాళ్ళ ఇచ్చిన సంపద సంపద అంటే సంస్కృతి సంప్రదాయం అంటే మన సంపద అది కట్టుబట్టు కాదు అది మన సంపద అని మనకు తెలియాలి మీకు తెలియని ఒక విషయం ఉంది ఇక్కడ ఇక్కడ మా తాతగారు వాళ్ళ నలుగురు అన్నదమ్ములు ఒకాయన ఆకువీళలో ఆ రోజుల్లో బారిస్టర్ చదివి లండన్ వెళ్లి లా చదివి ఆకువీళలో లాయరు రెండో ఆయన నారాయణరాజు గారు ఆయన సన్యాసి మూడు మా తాతగారు నాలుగు టీచర్ నలుగురు అన్నదమ్ములు కూడా నలుగురిలో
(27:21) సన్యాసం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ ఆయన వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు కూడా అగస్త్య మహాముని బృగు మహర్షి చేసిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయోగం చేశారు. అదేం ప్రయోగం అంటే శివుడు అంటే నిరాకార నిర్గుణ స్థితి మీరు శివాలయం కడుతున్నారు కాబట్టి చెప్తున్నాను నేను నిరాకార నిర్గుణ స్థితి అది అలాగే ఆ స్థితిని తత్వం అది ఆ తత్వము తెలియజేయడానికి అంటే సాధనలో చాలా డీప్ కు వెళితే కనుక శివ తత్వములో నిరాకార నిర్గుణ స్థితిలోకి
(28:07) చేరుకోవడానికి అనేక రకాల సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు బయటికి అంతగా తెలియలేదు కానీ వాళ్ళు ఒక ప్రయోగం చేశారు పంచభూతాల శక్తిని బయటకి తీసుకొస్తే దాని నుంచి వచ్చే రేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రేసెస్ మనసు యొక్క వేగాన్ని తగ్గించడము హృదయ వికాసము పూర్వజన్మ వాసన పైకి లెగడము అనేది ఒక ప్రయోగం చేశారు. కానీ అది చేసుకుంటూ వచ్చారు మా నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఫెయిల్యూర్ అయ్యారు.
(28:44) ఫెయిల్యూర్ అయ్యారు ఆయన ఇంకా నాన్నగారి ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు భీమవరంలో అన్ని చోట్ల వాళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు ఆ ఫెయిల్యూర్ అయ్యి ఏం చేయాలో తెలియక ఆ ఫెయిల్యూర్ లో ఆయన ఎంతోమంది యోగులని కలిస్తే దీనికి ఒక స్త్రీ శక్తి కావాలని చెప్పారు అప్పుడు మళ్ళీ మొక్కుకుని అప్పుడు శ్రీశైలం వెళ్లి అమ్మగారు ప్రెగ్నెంట్ తో ఉండగా సిక్స్ మంత్స్ అప్పుడు ఎవరు గుడికి తీసుకెళ్లరు కానీ ఆయన తీసుకెళ్ళారు తీసుకెళ్లి సిక్స్ మంత్స్ అప్పుడు జెండర్ మారుతుందని ఆయన తెలుసుకుని తీసుకువెళ్లి మొక్కుకొని ఈ శరీరాన్ని తీసుకొచ్చారు.
(29:30) ఈ విషయం ఎవరికీ తెలిీదు తీసుకొచ్చి చిన్నప్పటి నుంచి చెప్పారు నువ్వు సన్యాసివ అవుతావు అని చిన్నప్పటి నుంచి రాళ్ళు సెలెక్షన్ శివలింగాల యొక్క సెలెక్షన్ అలాగే యోగులతోటి యోగ విద్యలు వేదం నేర్పించారు నేను అందుకే ఫిఫ్త్ క్లాస్ వరకు పాలకొల్లో ఉన్నాం మేము పూలపల్లిలో ఉండేవాళ్ళము అక్కడ ఆయన చేసినవన్నీ చేశారు కానీ అమ్మ ఒప్పుకోలేదు చాలా చాలా గొడవ పెట్టి ఉన్న ఒక్క ఆడపిల్ల సన్యాసం అవ్వడం ఆడికి నచ్చలేదు ఇద్దరు చాలా గొడవలు పడ్డారు ఆ గొడవల్లో ఆయన యక్సెప్ట్ చేయలేకపోయారు ఈలోగా ఏదో బిజినెస్ లో కూడా కొంచెం దెబ్బ తిన్నారు అన్నీ కలిపి ఆయన డ్రింక్ కి
(30:14) అలవాటు పడ్డారు. అక్కడి నుంచి మా తాతగారు తీసుకొచ్చేసి ఈ ఊరు తీసుకొచ్చారు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నప్పుడు మళ్ళీ మా నాన్న వచ్చి నాకు ఈ బిడ్డ కావాలి మిగతా పిల్లలందరినీ ఉంచేసుకో ఈ ఒక్క బిడ్డ నాకు కావాలని అడిగితే ఆవిడ ఇవ్వనన్నారు. అందుకు మా తాతగారి దగ్గర నుంచి బయటిక వచ్చే ఆవిడి ఆస్తి ఏం వద్దు నాకు అని చెప్పి అంటే పుట్టింటి వాళ్ళు గొడవ పెడితే మళ్ళీ పుట్టింటికి కూడా వెళ్ళడం మానేసి టైలరింగ్ చేసి మమ్మల్ని పెంచారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అందరికీ ఒక డౌట్ ఉంది వీళ్ళ అమ్మ పెంచితే వీళ్ళ నాన్న సంగతి చెప్తుంది టీవీలో అని మీకేం
(30:54) తెలుస్తుంది మాకు తెలుస్తుంది కానీ కదండీ మాకు తెలుస్తుంది ఆయన చెప్పినా సరే నేను కూడా వినలేదు ఎందుకని ఆ టైం లో తల్లిమా మాటే వింటాం మనం కానీ ఒకటి చెప్పాను వివాహం అనేది నాకు చిన్నప్పటి నుంచి లేదు వివాహం చేసుకోవాలని నేను చేసుకోను కానీ నేను సేవ చేయాలి రీసెర్చ్ చేయాలి అన్నది నా చిన్నప్పటి నుంచి ఉన్న గోలు ఆ అవేర్నెస్ నాకు ఉంది అప్పటినుంచి ఉంది ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు అలా తీసుకొచ్చారు కాబట్టి ఉంది వాళ్ళ పుణ్యం అది అది వాళ్ళ పుణ్యం అలా వచ్చాము అలా రాకపోతే ఇలా రామండి మీరు మీరు ఇది గుర్తు పెట్టుకోవాలి మీకు తెలిసున్న చిన్న బుర్రలో మీకున్న నాలెడ్జ్
(31:36) తో మీరు మాట్లాడుకోవడం తప్పించి చరిత్ర తెలియదు ఎవరికీ కూడా తెలుసుకోవాలని కూడా అనుకోరు ఈ కంటితో చూసింది మాత్రమే మనం మాట్లాడుకుంటాం. అలా వచ్చిన మేము మొత్తం మీద గ్రామం పుణ్యం అంటూ వివాహం చేసుకోవలసి వచ్చింది అది అమ్మ బాధపడతారు అని చెప్పి చేసుకున్న నాకేం నష్టం జరగలేదు చాలా మంచివాళ్ళు వచ్చారు నా రీసెర్చ్ కి నా చదువుకి అన్నింటికీ సహకరించారు అది దైవం నిర్ణయం కదండీ మేము వెదవలం అయితే అప్పుడే ఇబ్బంది పడదుం ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ ఇక్కడ ఎవరైతే గాసిప్స్ మాటడో వాళ్ళందరూ కూడా అదే వెదవలం అయితే అప్పుడే మాకు ఇబ్బంది కలుగును కదా
(32:20) మాకు దైవబలం ఎక్కడి నుంచి వస్తుందండి ఈరోజు నేను కట్టిన శివాలయం ఆ ప్రయోగం నాలుగు తరాల కృషి ఐదవ తరం పెట్టాను నేను మీకు తెలీదు ఆయన దాని గురించి చాలా మదనపడి ఆ యోగ విద్యలు కొన్ని ఫెయిల్యూర్ అయితే పిచ్చివాళ్ళు అవుతారు మనుషులు ఎప్పుడైతే నాకు నాకు వివాహం జరిగిందో ఈ అమ్మాయి ద్వారా అవ్వదని చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ ఒక ఆడపిల్లని కన్నాడు ఎంతటి శక్తి ఉంటే కనాలండి 60వ సంవత్సరంలో అది కూడా ఫెయిల్యూర్ అది కూడా ఫెయిల్యూర్ అయింది చనిపోతూ ఆయన ఒకటే చెప్పారు నీ 50వ సంవత్సరంలో
(33:06) నువ్వు సన్యాసి అవుతావు నిర్మాణాలు మొదలవుతాయి అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు మా గురువుగారు తత్వేదానంద సరస్వతి దయానంద పరంపరలో వాళ్ళందరూ ఎంతో కృషి చేస్తే నా ఈ జ్ఞానం గురువులు ఎంతో మంది కృషి చేశారండి అలాగే ప్రతి ఒక్కళ్ళ ఆశీర్వాదం నాకు ఈ ఊరి నుంచి కూడా నాకు ఎంతో ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఈరోజు మీ దగ్గర ఇలా నేను కూర్చోగలిగాను చాలా సంతోషం అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు అయితే ఒకటే బాధ
(33:52) అనిపిస్తుంది ఏంటంటే మాకు లాగా మీరందరూ దైవాన్ని తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి అనిఅంటే మీరు చేయాల్సింది ఏమీ లేదు మీ 24 గంటల సమయంలో కనీసం మీకోసం ఒక గంట ఉంచుకోండి 23 గంటలు మీకు ఉన్నాయి నాకు ఖాళీ లేదు అనడానికి లేదు ఆడవాళ్ళకి ఖాళీ లేకపోవడం అనేది ఉండదండి ఎందుకనింటే టెక్నాలజీ అంతా ఆడవాళ్ళకే ఉపయోగపడుతుంది.
(34:26) వాషింగ్ మిషన్ మిక్సీలు లేకపోతే గ్రైండర్లు అన్నీ ఆడవాళ్ళకే ఉపయోగపడుతుంది మగవాళ్ళకి మహా అయితే ఒక కారు ఒక బండి వచ్చిందేమో ఒక సెల్ ఫోన్ వచ్చిందేమో కానీ అంతకంటే పెద్దగా డెవలప్మెంట్ లేదు వాళ్ళకి టోటల్ డెవలప్మెంట్ అంతా ఆడవాళ్ళ దగ్గరే ఉంది ఎంత ఖాళీ ఉండాలండి ఎంత ఖాళీ ఉండాలి అమ్మ అమ్మమ్మని చూస్తే దంచి ఇసిరి అంతమంది పిల్లలని పెంచి పోషించి ఏవో చేశారు ఎంతటి సౌకర్యాలు వచ్చినయి మనకి అప్పుడు 24 గంటల సమయంలో ఒక గంట మనకోసం కేటాయించుకుంటే గనుక మీ ఇష్టం ఆ గంటలో పూజ చేస్తారా జపం చేస్తారా ధ్యానం చేస్తారా పుస్తకం చదువుకుంటారా ఏం చేస్తారో ప్రపంచాన్ని పక్కన పెట్టి
(35:10) నేను నా దైవం అని మీరు ఉండగలిగితే ఉండగలిగితే మీకే అర్థంవుతుంది మీలో మార్పు అది నేను చెప్పానని కాదు మీరు చూసుకోవచ్చు ఎవరో చెప్పారని కాదు ఇప్పుడు 40 రోజులు దీక్ష చేస్తారు దీక్ష చేసినప్పుడు వాళ్ళకి ఎంత శక్తి వస్తుందో వాళ్ళకే తెలుస్తుంది. ఈ వస్త్రం తీసేసాక పక్కక వెళ్ళిపోతే నేనేం చెప్పలేను కానీ వస్త్రం ఒంటి మీద ఉన్నంతవరకు ఆ శక్తి ఏంటో వాళ్ళకే తెలుస్తుంది.
(35:43) ఈ ఉపాసనలు లేకపోతే దీక్షలు లేకపోతే జపాలు ధ్యానాలు పూజలు అన్నీ కూడా మన పెద్దలు మన జీవన విధానంలో మనం అంతర వికాసం కోసం నిర్మాణం చేయబడిన మన సంస్కృతి అటువంటి గొప్ప సంస్కృతిలో మీరు పుట్టారు అనే విషయం గుర్తిస్తే గుర్తిస్తే మనలో మార్పు చాలా స్పీడ్ గా వస్తుంది. ఎందుకని మీ కళ్ళు ఎదురుగుండా ఉన్నాం మేము వేరే ఎక్కడి నుంచో వస్తే వాళ్ళఏదో అనుకోవచ్చు గాక కానీ ఆ మార్పుని మనం అంగీకరించాల్సి ఉంటుంది విసుగ అనిపించాలమ్మ ఇన్ని సంవత్సరాల నుంచి పొద్దున వండుకోవడం
(36:29) మధ్యాహ్నం వండుకోవడం సాయంత్రం వండుకోవడం రాత్రి పడుకోవడం మళ్ళీ లేగడం ఇదేనా జీవితం ఇంకేదైనా ఉందా అనిఅంటే ఇంకా కొత్తగా ఏమి అనిపించదు అందుకే బోరు కొట్టి అటు యాత్రలు ఇటు యాత్రలు లేతే అటు పరిగెట్టా ఇటు పరిగెట్ట ఇవన్నీ చేస్తాం మనం మనసు వేగం అలా కాకుండా మనమందరం ఏ ధ్యాస్తో ఉంటాం జాసే ధ్యానం అన్నారు ఏ ధ్యాస్తో ఉంటారు రోజంతా రోజంతా మీరు ఏ ధ్యాస్తో ఉంటే అదే మీ ఆలోచన అయిపోతుంది.
(37:08) అదే మీ ఆలోచన అయిపోతుంది. నేను ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒక ఊళలో ఒక వజ్రాల వ్యాపారి ఉన్నాడు అతనికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్ని చక్కగా చదివించాడు ఉద్యోగాలు వేయించాడు పెళ్లి చేశాడు అందరినీ బాగా చూసుకున్నాడు అతనికి 60 సంవత్సరాలు వచ్చింది వస్తే అతనికి ఇంకా అర్థమయింది 60 సంవత్సరాలు వచ్చినయి కాబట్టి ఆస్తి పంచాలనుకున్నాడు ఆస్తి పంచాలనుకని ఆ నలుగురు కొడుకుల్ని పిలిచి తనకున్న ఆస్తి ఐదు వాటాలు వేశడు నలుగురు కొడుకులకి నాలుగు తనకి తన భార్యకి ఒక వాట వేసి నలుగురు కొడుకులకి చెప్పాడు మిమ్మల్ని చదివించాను ఉద్యోగాలు వేయించాను
(37:52) ఇదిగో నేను సంపాదించిన ఆస్తి ఇలా ఐదు వాటాలు వేశను ఈ నలుగురు సమానంగా పంచాను ఐదో వాట నాది ఏదైతే ఉందో అది మీ అమ్మ నేను తిన్న తర్వాత ఏదనా మిగిలితే మీరు నలుగురు సమానంగా పంచుకోండి మేము చనిపోయిన తర్వాత అని చెప్పాడు మంచి తండ్రా కాదా మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా మంచి తండ్రినా చాలా మంచి తండ్రి అలా ఉంచుకోండి చెప్తాను నేను అయితే అలా చెప్పాడు ఇంకో 10 ఏళ్ళు గడిసింది భార్య చనిపోయింది భార్య చనిపోయింది చనిపోతే ఇతనికి 70 ఏళ్ళ వచ్చినయి అనారోగ్యం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు వెళ్తే డాక్టర్ అన్నాడు నీకు ఇంకా రెండు నెలలు బతుకుతావు ముందు మాట
(38:37) పడిపోతుంది తర్వాత కాలు చేయ పడిపోతుంది తుంది తర్వాత ప్రాణం పోతుంది కాబట్టి నువ్వు ఎవరినైనా పిలిపించుకోవాలి పిల్లల్ని చూడాలంటే కనుక పిలిపించేసుకోమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేసాడు కబురు పంపాడు కబురు పంపి అప్పుడైతే నేను చాలా సద్దుకుని చక్కగా అన్ని జాగ్రత్తగా చూసుకుని మీకు సమానంగా పెంచాను పంచాను ఇప్పుడు సడన్ గా చెప్పాడు డాక్టర్ నేను చనిపోతాను అని చెప్పి కాబట్టి అన్ని బాకీలు బయట ఉండిపోయినయి కొన్ని వజ్రాలు బయట ఉన్నాయి మీరు ఉండి వసూలు చేసుకోండి అని చెప్పి ఇంకా తన దగ్గర ఇప్పటివరకు ఉన్నదంతా కూడా తను ఉండే నలుగురికి మళ్ళీ సమానంగా పంచాడు
(39:15) ఆ పిల్ల పిల్లలు అనుకున్నారు మాకు ఇచ్చిన వాట పెంచలేకపోయాం ఈ ముసలోడు ఈ 10 సంవత్సరాల్లో ఎంత బాగా పెంచాడు అనుకున్నారు. అనుకని నలుగురు తీసుకున్నారు ఇంకా బయట బాకీలు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయి ఇవన్నీ నేను ఒక్కొక్కటి చెప్తాను మీరు వసూలు చేసుకోమని చెప్పారు. చెప్పాడు నాలుగు రోజులు పోయేటప్పటికి మాట పడిపోయింది.
(39:38) పిల్లలు డాక్టర్ దగ్గరికి వెళ్లి మా నాన్నకి ఎలా అయినా మాట తెప్పించాలి మీరు రండి అని చెప్పి తీసుకొచ్చాడు తీసుకొస్తే అతను ఏదో మొత్తమే ట్రై చేశాడు రావట్లేదు ఏదో పెద్ద డాక్టర్ని తీసుకొచ్చారు తీసుకొస్తే రాదయ్యా మాట మాట రాదు సరి కదా ఇంకా 24 గంటల్లో మీ నాన్న చచ్చిపోతాడు అని చెప్పాడు డాక్టర్ గారు మా నాన్న మాట పోతే మేము చూడలేం గాలి కొట్టయినా మీరు మాట తెప్పించాలి అన్నారు కుదరదు బాబు ఇంకా 24 గంటల్లో మీ నాన్న చచ్చిపోతాడు అని చెప్పాడు అయితే ఇప్పుడు 24 గంటలో చచ్చిపో ఈయనకి మాట పోయింది కానీ చెవులు వినపడుతున్నాయి ఇతని అతనికి కంగారు వచ్చింది కంగారు వచ్చి సైగ చేస్తున్నాడు
(40:18) ఏమని అక్కడ ఉన్నాయి డబ్బులు ఇక్కడఉన్నాయి డబ్బులు తీసుకోండి తవ్వుకోండి అని చెప్తున్నాడు సైగ చేసి వాళ్ళు తవ్వుకుంటున్నారు అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి డబ్బులు దొరుకుతున్నాయి వాళ్ళు పంచుకుంటున్నారు బానే ఉంది ఇదంతా ఆ చుట్టుపక్కల ఈ చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంది వాళ్ళందరూ వస్తున్నారు చూడటానికి వస్తే వీళ్ళేమో ఏడుస్తున్నారు మా నాన్న ఇలా అయిపోయాడు అని చెప్పి ఏడుస్తుంటే వాళ్ళ బాబు ఇంచక్క నలుగురు ఉద్యోగాలు మానేసి ఎంత ప్రేమ మీ నాన్న మీద నలుగురు ఇక్కడే ఉండిపోయారు ఏదో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు వెళ్ళిపోవడం కాదు అందరూ ఎంత బాగా ఉండిపోయారు ఎంత మంచి పిల్లలు ఎంత మంచి
(40:53) పిల్లలు అని అడుగుతున్నారు మీరేమంటారు మీరేమంటారు ఆ దేనికోసం మీకు తెలిసిపోయింది కదండీ అంటున్నారు అందరూ అంటే అన్నారు మళ్ళీ తినగా ఉంటారా డాక్టర్ ఏం చెప్పాడు అంటే 24 గంటలు గడిస్తే గొప్ప అన్నారు అన్నాడు మరి మీరు తిన్నగా ఉంటారా ఏం చెప్తారు సలహ ఇంత పెద్ద ఇల్లు ఇందులో చచ్చిపోయాడు అంటే మళ్ళీ మీరు అద్దికించుకోవడానికి ఉండదు అద్దిపోతుంది ఆరు నెలలో సంవత్సరమో ఖాళీగా ఉంచాలి కాబట్టి మీరు ఏం చేయాలి మీ నాన్నని మీకు తెలుసు బాగా బయట పడుకోబెట్టేయాలి కదండీ అని ఎవరు ఇచ్చారు సలహా చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడానికి వచ్చి ఇచ్చే
(41:40) సలహాలన్నీ ఇలాగే ఉంటాయి చూడడానికి వచ్చి సలహా అలా ఇచ్చారు ఇస్తే ఊరుకుంటారండి కొడుకులు మరి మళ్ళీ సంవత్సరం అద్దిపోతుంది కదా ఇల్లు పాడైపోతుంది కాబట్టి ఏం చేయాలి ఈ తండ్రిని ఎదురుగుండా గొడ్లసాలలో పడుకోబెట్టేసారు. పడుకోబెట్టేసి అక్కడ పడుకోబెట్టారు చుట్టూ కూర్చున్నారు మాట పోయింది చూపు కూడా సరిగ్గా రావట్లేదు చుట్టూ కూర్చున్నారు కూర్చుంటే పాపం వీడు కళ్ళు తెరిసి చూస్తే సాయంత్రం అయిపోయింది చుట్టూ కూర్చున్నారు వాడు చెప్తున్నాడు వద్దు లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి సరే నాన్న వెళ్ళిపోమంటున్నాడు నువ్వు వెళ్ళ అంటే నువ్వు వెళ్ళు అంటున్నారు కానీ
(42:15) ఒక్కళ్ళు వెళ్ళట్లేదు ఎందుకు తెలుసు బాగా తెలుసు కదండి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అనుకుంటున్నారు కానీ ఒక్కళ్ళు కదలట్లేదు మొద్దం మీద చుట్టూ కూర్చున్నారు ఏం చెప్తాడా అని చెప్పి తెల్లారిపోయింది వీడు చావట్లేదు కానీ మరి మనకి పొట్టలో కాఫీయో టీయో పడకపోతే కుదురు ఉండదు కదండీ కుదురు ఉండదు అప్పుడు అనుకుంటున్నారు అందరూ వెళ్ళిపోతే ఎలాగా ఒకళ్ళ వెళ్లి కాఫీ పెట్టి పట్టుకురండి అంటే అబ్బే మేము వెళ్ళమంటే మేము వెళ్ళామ అనుకుంటున్నారు.
(42:47) అయితే మొత్తం మీద ఒక ఒప్పందానికి వచ్చారు ఏంటది వెళ్తే నలుగురం వెళ్దాం లేకతే కాఫీ మానేద్దాం అని ఎలా కుదురుతుందండి కాఫీ మానేస్తే తొమ్మిది అయింది కానీ కష్టం కదండీ సరే వాళ్ళ ఒప్పందం బాగుంది నలుగురు కలిసి లోపలికి వెళ్తారు పర్వాలేదు బానే ఉన్నాడు కదా పోలే అని నలుగురు కలిసి లోపలికి వెళ్ళారు వెళ్లి కాస్త మొహాలు కడుక్కొని స్నానాలు చేసి కాఫీ తాగి బయటికి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న చచ్చిపోయి ఉన్నాడు చచ్చిపోతే చచ్చిపోయాడు వేలు ఇలా చూపిస్తూ చచ్చిపోయాడు అరెరరే ఇంతసేపు తెల్లవార్లు నిద్ర లేకుండా కాపలా కాసాం తొమ్మిదింటి వరకు కాఫీ తాగకుండా
(43:22) కాపలా కాసాం లోపలికి వెళ్ళేటప్పటికి ఏదో చెప్పబోయాడు అంటే ఏం పర్వాలేదు వేలు ఎటు చూపిస్తున్నాడు సూరు వంక కనపడుతోంది అది గొడ్లసాలు కదా సూర్వంక కనపడుతుంది ఓ వజ్రాలన్నీ సూర్లో దాసేసి ఉంటాడు అనుకని సూరంతా తవ్వేసారు ఎక్కడ దొరకలేదు అప్పుడు ఏమనుకున్నారంటే ఈ సూరు కింద ఏమనా దాసి ఉంటాడు అనుకని సూరు కింద అంతా తవ్వారు ఎక్కడా దొరకలేదు ఈలోగా జనాలు తెలిసిపోతుంది కదండీ ఆ నోట ఈ నోట అందరూ గబగబ చనిపోయాడు అంటే చనిపోయాడు అని వచ్చేసారు.
(43:54) ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వీళ్ళేమో అయ్యో వాళ్ళు వచ్చేటప్పటికి మరి ఇవన్నీ వేషాలు కుదరవు కాబట్టి నలుగురు కలిసి ఆ శవం మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళు అంటున్నారు ఇంత మంచి పిల్లలు ఉద్యోగాలు మానేసి రాత్రి తెల్లవారులు కూడా కూర్చున్నారంట ఎంచక్క ఇంకా ఏడవకుండ అమ్మ పోయేవాడు ఎలాగో పోతాడు నెక్స్ట్ కార్యక్రమం చూడండి అంటున్నారు అని వీళ్ళు చూడట్లేదు ఎందుకని వీళ్ళకి తేలలేదు ఆ వేలు అటు చూపించాడు ఏం చెప్పాడో వీళ్ళకి తేలలేదు శవాన్ని తీసేస్తే ఎలాగండి కాబట్టి వీళ్ళు గుసగుసలాడుకుంటున్నారు వాళ్ళు అంటున్నారు రేపు పొద్దుటి మళ్ళీ మంగళవారం పొద్దు వచ్చేస్తుంది మళ్ళీ దహనం
(44:29) కుదరదు కాబట్టి తొందరగా కానిచ్చేయండి అంటున్నారు. వీళ్ళు మా నాన్న అని ఏడుస్తున్నారే కానీ లోపల లోపల గుసగుసలు ఆడుకుంటున్నారు అప్పుడు అందులో పెద్దవాడికి ఒక ఐడియా వచ్చింది. ఇంక డాక్టర్ కూడా కుదరదు కాబట్టి ఇలాంటి విషయాలు ఊళలో సాధువులు బాగా చెప్తారు వాళ్ళు దివ్యదృష్టితో చూసి వాళ్ళు ఇందుకే పనికొస్తారు మరి కాబట్టి ఊళలో సాధువు గారిని తీసుకొద్దాం ఆయన చెప్తాడు అని చెప్పి వెళ్లి ఊళలో సాధువు గారిని తీసుకొచ్చారు తీసుకొచ్చి మా నాన్న అంటే మాకు చాలా పిచ్చ అండి ఇంత కష్టపడి కాపలా కాసాం నలుగురు ఉద్యోగాలు మానేసి కూర్చున్నాము అయినా సరే కరెక్ట్ గా
(45:04) అప్పుడే కాఫీకి వెళ్ళాం ఏదో చెప్పాలనుకుని చచ్చిపోయాడు అదేంటో మీరు చెప్తే మేము ఈ శవా దహనం చేస్తామ అన్నారు. ఆయన చక్కగా కళ్ళు మూసుకుని దివ్య దృష్టితో చూశడు అక్కడన్న పాలేరుని కేకేసి ఒరే నాయనా నువ్వు ఎన్నింటికి వచ్చావ అంటే నువ్వు చూసావ అంటే నేనేం చూడలేదు అన్నాడు ఆయన కళ్ళు మూసుకుని చూసి ఆయన ఒకటి చెప్పాడు ఈ పాలేరు ఆ పాక అంతా ఊడిసి ఆ చీపిరి ఎండలోకి గెట్టెట్టాడు మీ నాన్న పుల్లలు ఇరిగిపోతాయిరా ఎండలో పెడితే చీపిరి కాబట్టి లోపల పెట్టు అని చెప్పబోతూ వేలు ఇలా చూపించి చచ్చిపోయాడు అన్నాడు కదండీ అయ్యా ఇంత వజ్రాల వ్యాపారి చీపురు కట్ట
(45:46) కోసం చెప్పడానికి చెప్పలేక సచ్చాడు కదండీ ఎత్తేయండి అంటే ఎత్తేయండి అనుకున్నారు ఈ కథ ఏం చెప్తుందండి మనకి వాడు కాబట్టి అలా చేశడు నేనైతే అలా చేస్తానా అని అనుకుంటున్నారు కదా కదండీ ఏ జాసతో ఉన్నారో ఆ జాసతో చచ్చిపోతామా చచ్చిపోమా ఏనా కొత్తగా చచ్చిపోతామా అండి మరి దైవజాస లేదు కదా దైవజాస లేనప్పుడు మనం మరణించేటప్పుడు ఎలాంటి ఆలోచన ఉంటుందో ఎలాంటి భావం ఉంటుందో అలాంటి జన్మ తీసుకుంటామ అని తెలుసా మీకు అటువంటి జన్మ తీసుకుంటాం మనం మరి అలాంటి జన్మ తీసుకునేటప్పుడు
(46:32) ఈ బతికున్నంతవరకు నీకు ఏ జాస్ ఉందో ఆ జాస్తో ఉంటావా కొత్తగా దైవజాస వస్తుందా అండి మనకి ఎటువంటి ధ్యాస ఉంది మన జీవితంలో మనకి అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే ఈశ్వరార్పితం నిశ్చయాకృతం చిత్తశోధకం ముక్తి సాధకం అన్నాడు భగవాన్ ఈశ్వరుడికి నిన్ను నువ్వు సమర్పించుకుని సమర్పించుకున్న తర్వాత కూడా చిత్తాన్ని నువ్వు శోధిస్తే అప్పుడు నీకు ముక్తి అన్నాడు మరి మీ అందరికీ ముక్తి కావాలా వద్దా అందరికీ కావాలి మరి 60 ఏళ్ళ వచ్చినా తలకు రంగేసుకుని చక్కగా సిలుకు చీర కట్టుకొని పట్టు చీర
(47:15) కట్టుకొని పెళ్లిళ్లు పేరెంటాళ్ళు చావుల్లో కూడా భోజనాలు చక్కగా తిరుగుతూ ఉంటే ముక్తి వస్తుందా అండి ముక్తి వస్తుందా అద్దం ప్రతిబింబం అన్నారు అర్థం చెప్తోంది ఏం చెప్తోంది నువ్వు ఒళ్ళిపోతున్నావు నువ్వు ఎండిపోతున్నావు నీ తల నెరిసిపోతోంది కాబట్టి నువ్వు జాగ్రత్త పడమని అర్థం చెప్తుందా చెప్పట్లేదా చెప్తుందా చెప్పట్లేదా అబ్బే రంగు వేసుకోవడానికి అర్థం ఉపయోగపడుతుంది కానీ అర్థం చెప్పే మాట మనం వింటామా అండి కదా మా ఇంట్లో పెద్ద దిక్కు నేనేనండి పెళ్లికి వెళ్ళకపోతే ఎలాగా అని అడుగుతారు నువ్వు పెళ్లి చేసుకున్నావ్ ఆయన తిట్టకుండా
(48:00) లేకోతే ఆయన నిన్ను తిట్టకుండా ఒక్కరోజు కూడా లేరు నీ పిల్లలకు పెళ్లి చేసావు వాళ్ళు కాపురాలు చేయకుండా డ చక్కగా విడాకులు కోర్ట్లకి ఎక్కకుండా లేరు మరి నువ్వేం పెళ్లి చేస్తావండి మళ్ళీ గమనించాలి కొంచెం అందుకే కదండీ పూర్వం అయితే కనుక నాకు తెలిసి ఈ ఊళలో కూడా పెద్దలు కుటుంబంలో పెద్ద ఎవరో ఒకళ్ళు పెళ్లికి వెళ్ళేవారు అది కూడా కుటుంబాన్ని పోషించిన మగవాళ్ళు పెద్దలు చక్కగా మగవాళ్ళు వెళ్ళేవారు ఆడవాళ్ళు వెళ్ళడం కూడా నాకు తెలియదు నాకు తెలియదు అలాగా వాళ్ళు వెళ్ళేవారు వాళ్ళు చక్కగా కుటుంబం అంతా పోషణ చేసి మంచి హృదయంతో భూమి పుత్రులుగా ఉండేవారు కాబట్టి వాళ్ళు
(48:38) ఆశీర్వదింతే మీరందరూ గట్టిగా ఉన్నారు. మనం ఆశీర్వదింతే చూసారా పిల్లలు అస్సల ఎవ్వడు గట్టిగా లేడు మీకు తెలియట్లేదా ఈ విషయం మీకు తెలియట్లేదా మనం ఆశీర్వదింతే పాపం పిల్లలు అస్సలు గట్టిగా ఉండట్లేదు కదా మరి మనం పెళ్లిళ్లు పనికొస్తాం అంటారా ఇంకా చాలా కష్టంఅండి ఈ ఊళలో చాలా మెత్తగా చెప్తున్నాను నేను ఇంకా గట్టిగా చెప్పట్లేదు చెప్తే కొడతారు ఇంకా కాబట్టి చెప్పట్లేదు గమనించాల్సిన విషయం ఆశీర్వదించాలంటే ఎంతో సహృదయం కావాలి లి హృదయ స్పందన ఉండాలి అంతేగానీ వెళ్ళినప్పటి నుంచి వీడు ఎంత సంపాదించాడు వాళ్ళేం పెట్టారు వీళ్ళేం పెట్టారు ఇవన్నీ మాట్లాడుకుంటూ నీకు మోకాళ్ళ
(49:23) నెప్పులు స్టేజ్ ఎక్కలేవు నిన్ను మళ్ళీ ఇంకొక్ళ ఎక్కించాలి అయినా సరే ఫోటో తీయించుకుని నువ్వు పెళ్లికి వెళ్ళావ అంటే ఏమని చెప్పాలండి మరి ఇంకేం మోక్షము అందరికీ మోక్షం కావాలని అడుగుతున్నారు మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది నాకు అనిపిస్తుంది జనం ఎంత గట్ ఉన్నాయండి చక్కగా అన్ని పెళ్లిళ్లు పేరెంటాలు సెల్ ఫోన్లు చీర్లు నగలు భీమవరం కళకళలు ఆడిపోతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత చూను నేను మధ్యలో క్లాసులకి బోళ్ళు సత్సంగాలకి భీమవరం వస్తాను ఈ ఊరు రాలేదు కానీ వచ్చినప్పుడల్లా సంవత్సరం సంవత్సరం మార్పు ఇదంతా ఎవరు పోషిస్తున్నారు మీరు కాకపోతే
(50:02) ఇన్ని చేసేసి సరిగ్గా మోక్షం కావాలని అడుగుతారండి ఎంత గట్స్ ఉన్నాయి నాకు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత జన్మ ఇంత జన్మని మనం ఎలా నడుపుకుంటున్నాము ఇంత ఉత్తమమైన జ్ఞాన ప్రధానమైన జన్మ ఆత్మ శక్తి మీలో అనంతమైన శక్తి ఆ శక్తితో అలరారుతూ ఉన్న నేను నేనేం చేయాలి 50 60 వచ్చిన ఇంకా నాకు ఆ జ్ఞానోదయం ఎందుకు అవ్వట్లేదు కాబట్టి నోటితో భగవంతుడు అనడం కాదు నా జీవితాన్ని భగవంతుడి వైపుకి జర్నీ చేయించ
(50:48) అంటే బలి చెప్పారండి మీరు సన్యాసి కాబట్టి మరి మాకు బోల్డ్ బాధ్యతలు ఉన్నాయి బోళ్ళ బంధాలు ఉన్నాయి అని అంటే పిల్లలు పెళ్లిళ్లు అయిపోయాక కూడా మీకు ఏంటండి బాధ్యత అసలు నాకు తెలియకూడతాను అవ్వకపోతే బాధ్యత ఉందంటే అర్థం ఎవరు కాదని అనరు అట్లీస్ట్ గృహస్తు ధర్మం అయినా మనకు తెలిస్తే మన బాధ్యత ఏంటో మనకు తెలుస్తుంది ఆ గృహస్తు ధర్మ రేపు చెప్పుకుందాం చక్కగా మీరందరూ ఈలోగా నేను చెప్పిన విషయాలు ఆలోచించండి ఆలోచించి మీరు రేపు గృహస్తు ధర్మాన్ని కానీ మీరేం చెప్పమంటే నేను అసలు అడుగుతాను ఏంటో ఈ ఊరు వచ్చేటప్పటికి నాకు ఆనందం ఎక్కువైపోయి మీరు ఏం చెప్పమంటారు
(51:26) అని కూడా నేను అడగలేదు. ఎవరు అడిగితే ఏం చెప్పమంటే అదే చెప్తాను అసలు ఇది నా రోలు మీరు ఎనీ సబ్జెక్ట్ ఏం అడిగినా సరే చెప్పడానికి నేను రెడీగా ఉంటాను రేపు పోన నేను గృహస్ ధర్మం అంటే చెప్పమంటే చెప్తాను లేదా మీరు ఏమన్నా అడిగితే చెప్తాను ఈలోగా మీరందరూ చక్కగా ఆలోచించి దైవం వైపుకి ప్రయాణం చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం
No comments:
Post a Comment