Friday, April 17, 2026

 🌻🍀🍁🍁🍀🌻🍀🌻🍁

*_నీ కష్టార్జిత సొమ్ముతోనే దానము చేయుము_*

*స్వయముగా, న్యాయముగా శ్రమపడి సంపాదించి, మంచివారికి దానముచేసిన మాత్రమే మనకు పూర్తిగా దాన ఫలితము కలుగును,*

*తల్లిదండ్రాదులు బంధుమిత్రుల సొమ్ముతోగాని, ఇతరు లిచ్చిన సొమ్ముతోగాని, వడ్డీవ్యాపారముతో ఆర్జించిన సొమ్ముతో గాని, అద్దెలు వలనగాని, అధిక లాభమువేసికొని వ్యాపారము చేసిగాని -సంపాదించి దాన ధర్మాది పుణ్యకార్యములను చేసినచో దాతకు పూర్తిగా పుణ్యము రాదు....*

శ్లో. *రాగాద్యుపగతే చిత్తే,* 
     *వంచయిత్వా పరంధనమ్* 
     *యదర్ష్యతే తస్య దానా*,
     *ద్యస్యార్థాస్తస్య తత్ఫలమ్||*

తా|| *రాగద్వేషాది గుణములతో ఇతరులను మోసగించి సంపాదించిన ధనమును పుణ్యకార్యములకు ఉపయో గించినచో వానివలన వచ్చిన పుణ్యము ధనమునకు కర్త యైన వారికే చేరును, దానము చేసిన వానికి పుణ్యము రాదు*, 

{ *గృహస్థ ధర్మావళి - యోగ వాసిష్ఠము* }

🌻🍀🍁🍁🍀🌻🍀🌻🍁

No comments:

Post a Comment