నిను చూసే సమయం లేదు
నీకోసం నిరీక్ష లేదు
నలువైపులా చీకటి తోనే
నగరికి రోజు మొదలు....
గడియారపు ముళ్లతోటే
వడి ఆపని పరుగులు
విడిగా తమకోసం వెచ్చింప
ఘడియ కూడా లేదు..
మణికట్టు చూసుకుంటూ
ముగించాలి పనులు
మనసు పెట్టి చేయాలన్నా
అసలు దొరకని వీలు.
గూటిలోని గువ్వకన్నా
ముందుగానే మెలకువలు
వాహనాల సవ్వడిలో
వినిపించని కువకువలు
తూరుపు ఎరుపైనా
గగనము వెలిగినా
భువికి నుదుట బొట్టులాగా
రవి వచ్చాకే వేకువలు
మన జీవన గతులు మారినా
తన రాకను గమనించకపోయినా
ఎన్నడూ క్షణము ఆలసించక
ఏతెంచు మిత్రుడే రక్ష మనకు!
🌸🌸సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment