Friday, April 17, 2026

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

              *క్షమార్పణ*
              ➖➖➖✍️
```
*ఒక్కొక్కసారి మనం మనకు తెలియకుండానే, బాగా కావలసిన వారితో కూడా వాదిస్తాం..
వాళ్ళను  బాధపెడతాం, లేదా మనం బాధపడతాం .....

*ఈ సందర్భాన్ని తేలిక పరచేది ఒక్కటే! అదే ‘క్షమాపణ’ అన్న పదం ..!

*ఇది మనం తరచూ వినే పదమే అయినా క్షమించండి ( sorry ) అనే పదం వాడటానికి ఇష్టపడం. 

*Sorry చెప్పామంటే మనం తప్పు చేసామని కాదు .. ‘బంధం నిలుపుకోడానికి ప్రయత్నిస్తున్నామని గ్రహించాలి’.... 

*మీ మనసు బాధించి ఉంటే క్షమించండి అని అన్నామనుకోండి, ఎదుటివాడు చాలా ఫ్రీ అయిపోతాడు.. వాతావరణం తేలికవుతుంది..

*క్షమాగుణమనేది మనలో ఉన్న వివేకానికి, జ్ఞానానికి ప్రతిరూపమన్నది మరువరాదు.......  

*క్షమించినవాడు, ఎదుటివాడి దృష్ఠిలో దైవమే... 

*క్షమాగుణం కలిగిన వారికి అందరూ మిత్రులే..... 
        
*మనుషుల్ని గెలవడం గొప్ప కాదు.. మనసుల్ని గెలవడమే గొప్ప...       
      
*ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేము.
   
*మనిషిని పరిచయం చేసుకోవటం లో గొప్పతనం ఏమీ లేదు! వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటం లోనే మన గొప్పతనం ఉంది.....
    
మనిషికి కావలసింది నేర్పు!
మనసుకు కావలసింది ఓర్పు! 
జీవితానికి కావలసింది కూర్పు!
బాధలలో కావలసింది ఓదార్పు!
ప్రతి జీవితానికి కావలసింది మార్పు!
       
నీ బలం ఎవరికిీ తెలియక పోయినా పర్వాలేదు. బ్రతకే యొచ్చు.
కానీ! నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. బ్రతకనివ్వరు.
    
నీలో ఎన్ని లోపాలున్నా బలహీనతలున్నా నిన్ను నీవు ఎలా ప్రేమిస్తావో అలాగే ఎదుటి వారి లోపాలనూ బలహీనతలను అర్థం చేసుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు,అందరూ నీవారవుతారు.
  
*ప్రశ్న ఏదైనా సరే
*ప్రేమతో బదులు ఇస్తే_
*మనం గడిపే ప్రతిరోజు_
*అందంగా ఉంటుంది.
*కాకి,కోయిలా రెండు అరుస్తాయి.
*కాని కాకిది గోల అంటారు.
*కోకిలది పాట అంటారు.
*ఆలోచించాలి ఎందుకో ?
*బదులు ఇచ్చే విధానంతోనే
*సగం ప్రపంచాన్నిగెలిచేయోచ్చు.
*అలాగే..
*మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించే వారుంటారు!
*కాని మనం ఒకమాట గుర్తుపెట్టుకోవాలి!
 *ఆటలో... గోలచేసేది ప్రేక్షకులే కాని ఆటగాళ్లు కాదు!✍️*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment