Sunday, April 26, 2026

మన నిజస్వరూపం శరీరం కాదు , మనం చిదానంద స్వరూపమైన శివత్వం.

 *మన నిజస్వరూపం శరీరం కాదు , మనం చిదానంద స్వరూపమైన శివత్వం.* 


నిర్వాణ షట్కం శంకరాచార్యులు గురువుగా మనకి అందించిన అహం బ్రహ్మాస్మి మొత్తం ఈ శ్లోకంలో ఉంది ఇది విన్నవారికి బ్రెయిన్ లో త్వరగా గామా కిరణాలు రిలీజ్ అయ్యి సమాధి స్థితిలోకి వెళ్లినట్లు ఎన్నో శాస్త్రీయ సైన్స్ ఆధారాలు చెబుతున్నాయి...

1
మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే ।
న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥
2.
న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః ।
న వాక్ పాణి పాదం న చోపస్థ పాయుః
చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥
3.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః ।
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥
4.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః ।
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥
5.
న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ ।
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోఽహం శివోఽహం ॥
6.
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం ।
న చాసంగతం నైవ ముక్తిర్న మేయః
చిదానంద రూపః శివోఽహం 

అద్వైత వేదాంత తత్వాన్ని అత్యంత సులభంగా చెప్పే మహత్తరమైన స్తోత్రం. ఇది ఆరు శ్లోకాలతో ఉంటుంది. ఇందులో మన నిజస్వరూపం శరీరం కాదు, మనసు కాదు, భావాలు కాదు . మనం పరమాత్మస్వరూపమైన చైతన్యం అని బోధించబడింది.

శంకరాచార్యుల నిర్వాణ షట్కం జగద్గురువులు సులభ వివరణ

మనం శరీరం, మనసు, భావాలు, పాపం, పుణ్యం ఇవన్నీ కాదు. మనం శుద్ధ చైతన్యము  శివస్వరూపము అని తెలియజేస్తుంది.

నిర్వాణ షట్కం యొక్క ప్రధాన సందేశం

1. మనం శరీరం కాదు

మనకు శరీరం ఉంది కానీ మనం శరీరం కాదు. శరీరం మారుతుంది — చిన్నప్పటి నుంచి పెద్దవాళ్లం అవుతాం. కానీ మనలోని చైతన్యం మాత్రం మారదు.

2. మనం మనసు కూడా కాదు

మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఆనందం, కోపం, బాధ, భయం — ఇవన్నీ వస్తూ పోతుంటాయి. కాబట్టి మనం మనసు కాదు.

3. మనం ఇంద్రియాలు కాదు

కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవి ప్రపంచాన్ని తెలుసుకునే సాధనాలు మాత్రమే. ఇవి మనకు చెందినవి కానీ మన నిజస్వరూపం కాదు.

4. మనకు పాపం–పుణ్యం కూడా అంటవు

నిర్వాణ షట్కం ప్రకారం నిజమైన ఆత్మకు పాపం, పుణ్యం, జననం, మరణం లాంటివి వర్తించవు. అవి శరీరం మరియు జీవితం సంబంధిత అనుభవాలు మాత్రమే.

5. మన నిజస్వరూపం – శివస్వరూపం

“చిదానంద రూపః శివోఽహం శివోఽహం”

“నేను శుద్ధమైన చైతన్యానంద స్వరూపుడిని ,నేను శివుడిని.”

ఇక్కడ శివుడు అంటే ఒక దేవత మాత్రమే కాదు; అనంతమైన పరమ చైతన్యం అనే అర్థంలో వాడారు.

నిర్వాణ షట్కం యొక్క ఆధ్యాత్మిక మహిమ

ఈ స్తోత్రాన్ని చదివితే లేదా ధ్యానం చేస్తే:

మనసు ప్రశాంతం అవుతుంది

అహంకారం తగ్గుతుంది

ఆత్మస్వరూపంపై అవగాహన పెరుగుతుంది

భయం, బాధ తగ్గుతాయి

అద్వైత తత్వం అర్థమవుతుంది

అందుకే చాలా మంది యోగులు, ఆధ్యాత్మిక గురువులు ఈ శ్లోకాలను ధ్యానం సమయంలో జపిస్తారు.

నిర్వాణ షట్కం మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది:
మన నిజస్వరూపం శరీరం కాదు, మనసు కాదు.

మన అసలు స్వభావం
చైతన్యం – ఆనందం – శివత్వం.

అందుకే శంకరాచార్యులు చివరగా

“చిదానంద రూపః శివోఽహం శివోఽహం”
అంటే
“నేను శుద్ధ చైతన్యానంద స్వరూపుడిని.”

(అక్షర దోషాలు ఉంటే షమఅర్హురాలుని)

No comments:

Post a Comment