బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్య లాబః
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LXmmEpRHtps
Transcript:
(00:00) ఉపనిషత్తుల్లో రాజా హించోర్ కథ ఉంది. ఒకరోజు అడవిలో శికారు చేస్తూ దారి తప్పి పక్క రాజ్యంలో ప్రవేశిస్తాడు రాజా హించోర్ అప్పటికీ అతను రాకుమారుడే పక్క రాజ్యం రాజు ఆహ్వానం మేరకు ఆ రాత్రి అక్కడే బస చేస్తాడు. అతిరూపవతి అయిన ఆ రాజు కుమార్తెను చూసి వివాహం ఆడతాను అంటాడు. ఆ రాకుమారి ఒక బ్రహ్మజ్ఞాని నేను నిన్ను వివాహం చేసుకుంటాను కానీ 10 రోజులు తర్వాత రమ్మని చెప్తుంది.
(00:40) దానికి రాకుమారుడు చాలా సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఈ 10 రోజుల్లో బ్రహ్మజ్ఞాని అయిన ఆ రాకుమారి కొన్ని కందమూలాలు సేవించి రోజుకు కనీసం 10 15 సార్లు విరోచనాలు అయ్యేలా చేసుకుంటుంది. దీంతో తన శరీరమంతా సుష్కించి ఒక అస్తి పంజరం లాగా తయారవుతుంది. తను విసర్జించిన మలాన్ని సుందరమైన ఆకర్షణీయమైన బ్యాగుల్లో నింపి ఒక గదిలో భద్రపరచమని చెప్తుంది.
(01:22) 10 రోజుల తర్వాత రాకుమారుడు ఖుషీ ఖుషీగా ఈ రాకుమారిని వివాహం ఆడదామని వస్తాడు. మహల్లో ప్రవేశించగానే దాసీని ఇలా అడుగుతాడు. ఎక్కడ రాకుమారి రాకుమారి మంచంపై పడుకుందని చెప్తుంది దాసి ఆ రాకుమారిని చూసి ఇతను షాక్ కి గురవుతాడు. ఎవరిమె ఎముకలు తప్ప ఏమీ కనిపించడం లేదు ఆ రాకుమారివి నీవేనా అని అడుగుతాడు. ఆ నేనే ఆ రాకుమారిని ఏమైంది ఇలా అయిపోయావు అంటాడు రాకుమారుడు నేను ఎప్పటిలానే ఉన్నాను. ఇక నా సౌందర్యం
(02:08) విషయం అంటారా అదిగో ఆ పక్కగదిలో భద్రంగా దాచి పెట్టాము వెళ్లి చూడండి అంటుంది. పక్కగదిలోకి వెళ్లి చూసిన రాకుమారుడికి కనువిప్పు కలుగుతుంది. పూర్తి వైరాగ్యం వచ్చేస్తుంది. వచ్చి రాకుమారికి పాదక్రాంతుడు అవుతాడు. రాకుమారి అతనికి ఉపదేశం చేస్తుంది. ఆ తర్వాత అతనికి ఇంకా వైరాగ్యం ఎక్కువై పూర్తి ప్రపంచాన్ని రాజ్యాన్ని వదిలి సన్యాసం తీసుకుంటాడు.
(02:48) నేను దేనికి ఆకర్షితం అవుతున్నాను రక్తమాంసాలతో మలమూత్రాలతో నిండిన ఈ దేహానికా లేదా దేహ ప్రదర్శన దేహ ఆకర్షణ మనుషులందరిమీ కూడా దీని పరిమితిలోనే బంధింపబడి ఉన్నారు. బైబిల్ మహా వాక్యం చెబుతుంది నేను మీతో చెప్పునది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపు తో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును అటువంటిది పోర్నోగ్రఫీ చూడ్డం శరీర వాంఛల్ని కలిగించే సినిమాలు చూడడం వల్ల
(03:34) ఎంతమంది స్త్రీలపైన మోహం కలుగుతుంది. మన పూర్వీకులు ఇంతమందిని చూడాలంటే వాళ్ళకి కొన్ని జన్మలు పడుతుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కి అది పోర్నోగ్రఫీ ద్వారా చాలా తేలికైపోయింది. బ్రహ్మచర్యాన్ని పాటించేవారు ఒక నియమాన్ని పెట్టుకుంటారు. స్త్రీని తల్లిగా చెల్లిగా చూస్తారు. అయినప్పటికీ అందులో ఎంతో కొంత ఎంజాయ్ మెంటాలిటీ అనేది ఉంటుంది.
(04:14) ఎవరైతే ఈ పోర్నోగ్రఫీ చూస్తారో వాళ్ళ కంటికి స్త్రీలు షుగర్ క్యాండీస్ లాగా కనిపిస్తారు. అసలు వాళ్ళని గౌరవించడం పక్కన పెట్టండి. పోర్నోగ్రఫీ మనిషిని పశువుగా మారుస్తుంది. ఎందుకంటే జంతువుల్ని చూడండి ఆకలేస్తే తింటాయి. ఆడ జంతువు కనబడితే కామాన్ని తీర్చుకుంటాయి. అయితే మనుషులు అన్నాక కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాని అర్థం అసలు స్త్రీలను చూడకూడదు అని కాదు సహజంగా ఎవరైనా చూస్తారు.
(04:56) ఎందుకు చూస్తారు అంటే అది వాళ్ళ శారీరక అందం కోసం అయితే ఏమి అందంరా బాబు అనుకోవడం ఆ విషయాన్ని అక్కడే వదిలేయడం సుందరకాండలో హనుమ మండోదరి అందం గురించి చెప్తాడు. ఇంత అందగత్తిని ఇంట్లో పెట్టుకొని అడవుల్లో బ్రతుకుతున్న సీతాదేవిని తీసుకొచ్చాడు అని ఎందుకంటే ఆయన అవసరాన్ని బట్టి చూడాల్సి వచ్చింది. సరే ఈవిడ కూడా బాగుంది కానీ ఈవిడ సీతమ్మ కాదు అని ఆయన పని ఆయన చూసుకున్నాడు.
(05:34) అంతేగాని అదే పట్టుకొని వేలాడలేదు. అందుకనే కామం మహాశత్రువు ఆదిమధ్యంతం దుఃఖాన్ని ఇస్తుంది. దీనిపై విజయం సాధించాలి అంటారు యోగులు తీరని కామం కాస్త క్రోధంగా మారుతుంది. అది జీవితాన్ని నాశనం చేస్తుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ అతని సైకాలజీ అంతా సప్రెషన్ గురించే మాట్లాడుతుంది. కామాన్ని అనగదొక్కడం సప్రెషన్ వల్లే అన్ని మానసిక రోగాలు సమస్యలు [గురకలు] ఉత్పన్నం అవుతున్నాయి అనేది ఆయన సిద్ధాంతం కానీ సప్రెషన్ కంటే లోతైన విషయాలు
(06:21) ఉన్నాయి. ఇవి ఫ్రాయిడ్ కి తెలియదు కేవలం సప్రెషన్ గురించి అధ్యయనం చేశాడు. కానీ సబ్లిమేషన్ ఉదాీకరణ గురించి అతనికి ఏమాత్రం తెలియదు. వికారాలని అనుచుకోవడానికి సన్యాసులు లంగోట కట్టుకుంటారు. ఇంకొందరు శరీరాన్ని హింసించుకుంటారు. కానీ సప్రెషన్ వల్ల అనగదొక్కడం వల్ల కామవికారం అదుపులోకి రాదు. దాన్ని జయించాలంటే దాని స్వభావాన్ని తెలుసుకోవాలి.
(07:00) అది ఎప్పుడు ఎలా ప్రకటితం అవుతుందో తెలుసుకోవాలి. అందుకనే కామం ఆదిమధ్యాంతం దుఃఖం ఇస్తుంది. దీని అర్థం ఏంటి? ఆది అనగా ఎప్పుడూ ఎక్కడ ఎలా మొదలవుతుందో ఇక మనసుని కుదురుగా ఉండనివ్వదు. బుద్ధి అటూ ఇటు పరిగెడుతుంది. ప్రశాంతత కోల్పోతుంది. రాత్రింబవళ్ళు వారి గురించే ఆలోచన. స్వప్నాలు మెడిటేషన్ లో కూడా వారి ముఖమే కనిపిస్తుంది.
(07:41) కాబట్టి సప్రెషన్ చేయడం వల్ల అది ఇంకా ఎక్కువగా దాడి చేస్తుంది. అందుకనే దాని స్వభావాన్ని తెలుసుకోవాలి. మనిషి శరీరంలో ఉన్న వీర్య శక్తి అదోగామి అంటే కింది వైపుకి పయనించినట్లయితే ఇంకో శరీరానికి జన్మనిస్తుంది. ఊర్ధ్వగామి పైకి ప్రవహించినట్లయితే ఈ జీవశక్తి ఓజస్సుగా మారుతుంది. ఈ శక్తి అనునిత్యం శరీరంలో తయారవుతూ ఉంటుంది. సత్య త్రేతా యుగాల్లో ఇంద్రియ శక్తి శరీరంలోనే అబ్జర్బ్ అవుతుందని చెప్తారు.
(08:25) అందుకనే అక్కడ దేవతలందరూ శక్తిమంతులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నారు. పురుషుల్లో ఉన్న ఈ వైటల్ ఫోర్స్ లైఫ్ ఫోర్స్ దీన్నే కుండలిని శక్తి అంటారు. కుండలిని అనేది స్థూలమైనది కాదు. అలా అని అది ఆ వీర్య రసం కూడా కాదు కుండలిని సూక్ష్మ శక్తి ఈ శక్తి ఊర్ధ్వగామి అవ్వడానికి వేరే మార్గం అయితే లేదు కానీ సూక్ష్మ మార్గంలోనే పైకి ప్రవహిస్తుంది.
(09:03) అందుకనే దీన్ని ఎప్పుడూ సప్రెషన్ చేయకూడదు.
No comments:
Post a Comment