మధువనపు లోగిలిలో
రంగుల హరివిల్లు
మకరందము దాచిన విరులకు
అనురాగపు విరిజల్లు
అందమైన అతిథిలా
అందరికీ హితుడిలా
అలరించి ఆడించు
అనుంగు స్నేహితుడు
సడిలేని సందడితో
ఎడతెగని కబుర్లతో
హడావిడిగా తిరిగి
పండుగ తెచ్చే ప్రియుడు
తోటలో ఎగిరే చిన్ని
రంగుల రెక్కల చిలుక
మాటరాని మౌనాన
మురిపించె మొలక.
లోకమే చూడకుండా
దాగి వేచిన క్షణాలు
నేటి స్వేచ్చా జీవితానికి
దాటివచ్చిన కష్టాలు..
దహించు బాధలనైనా
సహించు నేర్పులకవి
కట్టెదుట నిలిచిన
కమనీయ తార్కాణాలు
వేకువకై వేచిన సిరినవ్వులకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
బృంద 🙏
No comments:
Post a Comment