Wednesday, April 22, 2026

“కారు కొంటున్నారా? మీ కారులోనే విషం మీ ప్రాణాలు తీస్తుంది!” జాగ్రత్త తీసుకోకపోతే

“కారు కొంటున్నారా? మీ కారులోనే విషం మీ ప్రాణాలు తీస్తుంది!” జాగ్రత్త తీసుకోకపోతే

Author Name:RAM TV

Youtube Channel Url:https://www.youtube.com/@Villageram9909

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NpTrxoPi2Fs



Transcript:
(00:00) కారు ఉంటే సౌకర్యం కానీ అదే కారు నీకు క్యాన్సర్ ని కూడా ఇస్తుందని తెలుసా మన కారులో మనం ఎలాంటి గాలిని పీల్చుతున్నామో తెలుసా బ్లడ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ని ఇచ్చే విష వాయువుని మనం పీల్చుతున్నాం. ఇక్కడ మీరు కారుని చూస్తే నడి ఎండలో పార్క్ చేశం. బయట 40°ల దాకా టెంపరేచర్ ఉంది. కానీ కారు లోపల సుమారుగా 60°ల టెంపరేచర్ ఉంది.
(00:24) ఎండ నుండి శరీరాన్ని కూల్ చేసుకోవడానికి అందరూ చేసే కామన్ మిస్టేక్. అతి పెద్ద ప్రమాదకరమైన విషయం ఇప్పుడు జరుగుతుంది. 60°ల టెంపరేచర్ ఉన్న కారులోకి డోరు ఓపెన్ చేసి వెంటనే కారు లోపలికి ఎక్కేస్తున్నాం. అలాగే మరికొన్ని సమయాల్లో చాలామందికి తొందరగా ఇంజన్ ఆన్ చేసి ఏసీ వేయరా బాబు ఎండను తట్టుకోలేకపోతున్నామ అంటూ హడావిడి చేస్తుంటారు. ఇక్కడ అంతే కాకుండా కీ పెట్టిన వెంటనే స్టార్ట్ చేయడం ఇది మామూలు సమయాల్లో కూడా స్టార్ట్ చేయకూడదు.
(00:49) కీ పెట్టిన తర్వాత ఐదు నుంచి 10 సెకండ్లు లాగాలి ఎప్పుడు కార్ స్టార్ట్ చేసినా సరే ఎంత ప్రమాదంలోకి మనము మన కుటుంబాన్ని నెడుతున్నామో తెలుసా కాసేపు ఎండకు తట్టుకోలేక చల్లదనం కోసం పరిగెడితే భయంకరమైన ప్రమాదాన్ని ఫ్యూచర్ లో ఎదుర్కోవాలి. ఇంత ఎండలో పార్క్ చేస్తున్న కారులోకి హడావిడిగా ఎక్కొద్దు. 60డిగ్రీల టెంపరేచర్ ఉంది. కనీసం ఈ కారులోకి ఎక్కాలి అనుకున్నప్పుడు కొద్దిగా సేపు సహనం ఓర్పుతో రెండు నిమిషాలు కనీసం ఈ నాలుగు డోర్లు నాలుగు డోర్లకు ఉన్న గ్లాసులు ఓపెన్ చేసి మనం ఎదురు చూడాలి అప్పుడే ప్రమాదం తప్పిందా కాదు ఇక్కడే ఇంకో అతి పెద్ద ప్రమాదం ఉంది. మరి రెండు నిమిషాలు
(01:27) ఎదురు చూసాం కదా అని హడావిడిగా కారెక్కి స్టార్ట్ చేసి వెంటనే ఏసి అస్సలు ఆన్ చేయొద్దు. మనం లోపలికి ఎక్కగానే నాలుగు డోర్లకు ఉన్న నాలుగు గ్లాసులు దించే ఉంచాలి. నెక్స్ట్ ఫ్యాన్ మోడ్ అవుట్డోర్ లో ఉందా ఇన్డోర్ లో ఉందా 100కి 100% కార్లలో ఫ్యాన్ మోడ్ ఇన్డోర్ లోనే ఉంటుంది ఏసి ఆన్ చేయగానే తొందరగా చల్లబడాలి దాని కారణంగానే ఇండోర్ లో ఉంచుతారు.
(01:50) కానీ ఇక్కడ మనం కారు ఎక్కిన వెంటనే అవుట్డోర్ లో పెట్టుకోవాలి. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే ఫ్యాన్ మోడ్ ఆన్ చేయాలి. ఇక్కడ చూశారు కదా ఇండోర్ సింబల్, అవుట్డోర్ సింబల్ రెండు కనబడుతున్నాయి. మనం అవుట్ డోర్ లోనే పెట్టుకోవాలి. తర్వాత ఇంజన్ ఆన్ చేయగానే ఫ్యాన్ మోడ్ ఆన్ చేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు అలాగే ట్రావెల్ చేయాలి గ్లాసులన్నీ దించుకొని అలా ఐదు నిమిషాల సమయం గడిచిన తర్వాత ఏసి ఆన్ చేసుకొని ఇలాంటి జాగ్రత్త తీసుకోకపోతే డైరెక్ట్ గా కారు ఎక్కేస్తే ఆ విషవాయువు మన శరీరంలోకి వెళ్లి బోన్ నారో దగ్గర ఉన్న రక్తకణాలను దెబ్బతీసి బ్లడ్ క్యాన్సర్ వస్తుంది అలాగే
(02:21) ఊపిరితిత్తుల్లోకి వెళ్లి లంగ్ క్యాన్సర్ వస్తుంది. చాలామంది కార్లు అంటే 100కు 100% మంది మర్చిపోతారు ఈ విషయాన్ని ఎప్పుడు ఇండోర్ మోడ్ లోనే ఉంచుతారు. కనీసం ప్రతి 15 నిమిషాలకు ఒకసారైనా ఒక ఐదు నిమిషాల పాటు అవుట్డోర్ మోడ్ లో పెట్టండి లేదు అంటే లోపలే మనం దగ్గినా తుమ్మినా పిత్తినా మనం పీల్చి వదిలిన గాని లోపలే సర్క్యులేట్ అవుతుంది తొందరగా చల్లబడుతుంది అనుకుంటున్నాం కానీ చాలా ప్రమాదకరంగా మారుతుంది చాలామందికి కారు పడదు కారు ఎక్కగానే వాంతులు అవుతాయి కారణం ఎప్పుడు కూడా లోపల ఉన్న గాలి లోపలే తిరుగుతుంది ఇండోర్ మోడ్లో ఉంటుంది.
(02:55) ఒక్కసారి మీరు ట్రై చేయండి అలాంటి వారిని మీ కారు ఎక్కించుకొని అవుట్డోర్ మోడ్ లో పెట్టేసి ఫ్యాన్ మోడ్ ఏసి ఆన్ చేసి తీసుకెళ్ళండి చాలా వరకు వాంతులు అయ్యే అవకాశం ఉండి తప్పించుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం చాలా మందికి తెలియని విషయం తెలిసినా పట్టించుకొని విషయం అందుకే మీరు కూడా వేరే వారి కారులు ఎక్కేటప్పుడు చెప్పవలసిన జాగ్రత్తలు ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ఈ అద్భుతమైన మెసేజ్ ని షేర్ చేయండి.
(03:19) మీ చుట్టాలు కానీ స్నేహితులకు కానీ మీరు ఎక్కడైనా కారు ఎక్కేటప్పుడు ఎండలో ఈ విధంగా కారు తీస్తున్నప్పుడు వాళ్ళకి ఇలాంటి జాగ్రత్త చర్యలు చెప్పండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటంలో మీ వంతు సహాయం సహకారం చేయండి. వీడియో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక్కసారి ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై హింద్.

No comments:

Post a Comment