Invisible Gurus & Yogic Attainment The Truth No One Tells You | 108 Years Baba With Ravi Sastry
Author Name:Sree Niravi Tv
Youtube Channel Url:https://www.youtube.com/@sreeniravitv
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gtDDkRZtNrs
Transcript:
(00:21) ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మన అదృష్టం సంత సదానందగిరి మహారాజ్ వారితో సజ్జన సాంగత్యం చేసే భాగ్యం మనకు కలిగింది. వారు రుద్రప్రయాగ నివాసి వారు హిమాలయ వాసి వారు మన తెలుగు ప్రాంతంలో అనేక ఉపన్యాసాలు అనేక ఇంటర్వ్యూలు ఇవ్వటం వల్ల అందరికీ తెలిసినటువంటి సుపరిచితులు ఆధ్యాత్మిక మార్గం పరంగాను యోగ మార్గం పరంగానూ ఇతిహాసాల పరంగాను అమోఘమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు వారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది నమస్కారం
(01:01) గురుభ్యో నమః స్వామీజీ ఆ మనకి చాలామంది మంది చెప్తూ ఉంటారు మన చేతుల్లోనే అంతా ఉంది అనేసి ఆకుపంచర్ వాళ్ళయతే చేతుల్లోనే నీకు ఎండింగ్ పాయింట్స్ ఉన్నాయి అనేసి మనక ముద్రా శాస్త్రం వచ్చేసరికి ముద్రల్లోనే అంతా ఉంది అంటారు. ప్రాణాయామం వచ్చేసరికి ప్రాణాయామంలోనే ఉంది అంటారు. ప్రాణాయామానికి ముద్రలకి ఈ రెండిటికీ లింక్ చేస్తే ఆ ఏ ముద్ర ద్వారా ఏ ప్రాణ చలనం అనేది బాగా జరుగుతుంది దీనికి కొంతమంది ఇప్పుడు మనం చూసినట్లయితే ధ్యాన ముద్ర అని ఇట్లా కూర్చుంటారు కొంతమంది జ్ఞాన ముద్ర అని కూర్చుంటారు కొంతమంది వచ్చేసరికి సుషుమ్న ముద్ర యోని ముద్ర ఇటువంటివన్నీ ఇప్పుడు
(01:46) ప్రాచూర్యంలో ఉన్నాయి. సో వీటన్నిటికీ ఉన్నటువంటి మూలం ఏంటి ఈ ముద్రకి ప్రాణ చలనానికి మన యోగత్వ సాధనకి ఉన్నటువంటి లింక్ ఏంటి? వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విగ్నం కురుమే దేవా సర్వకార్యేషు సర్వదా గం గణపతయే నమః మాణిక్యవీణం ముపలాలయంతిం మదాలసాం మంజులవాగ్విలాసాం మాతంగ కన్యాం మనసా స్మరామి ఐయం సరస్వత్యే నమః జ్ఞానానందమయం దేవం నిర్మల స్పటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవ గురుం ఉపాస్మహే గురుభ్యో నమః మా గురుదేవులైనటువంటి మహతి హిమాలయ గిరిజీ
(02:31) మహారాజు వారి పాద పద్మములను మనసులో స్మరించుకొని నిరవి వీక్షక ప్రేక్షక మహర్షులందరికీ శుభములు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రాణాయామము ముద్రా రహస్యము బయటికి చూస్తే ప్రాణాయామం వేరు అనిపిస్తుంది. యోగం వేరు అనిపిస్తుంది ముద్రలు వేరు అనిపిస్తుంది. కానీ వీటి మూడిటికీ అంతర్లీనంగా లింకు కారణం మానవ దేహం పంచభూతాలతో తయారైింది.
(03:03) ఈ దేహంలో పంచ ప్రాణాలు పంచ ఉపప్రాణాలుగా పని చేస్తూ ఉంటుంది. కోశాల పరంగా చూస్తే ముందు అన్నమయ కోశము రెండవది ప్రాణమయ కోశం మూడవది మనోమయ కోశం ఏ అన్నము తింటున్నామో ఆ అన్నము ప్రాణాలకు శక్తిని ఇస్తూ మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని సాత్వికాహారం తింటారు. ఇంకా యోగానికి ఈ ముద్రలకు ఎట్లా కనెక్షన్ అంటే శరీరంలో ఉండే సర్వనాడ వ్యవస్థ ఇది వీళ్ళ కొసలకు వచ్చి టర్న్ అయితా ఉంటుంది.
(03:40) రెండవది మన పూర్వీకులు ఎంతో ఆలోచించి పంచభూతాలకు వీటి ఐదింటిని రెప్రజెంటివ్ గా చెప్పారు. ఇది అగ్ని ఇది వాయువు ఇది ఆకాశం ఇది భూమి ఇది జలం ఇప్పుడు యోగా చేసే వాళ్ళకు యోగా ఎక్కువ చేస్తుంటే శరీరం ఉష్ణమైతుంది. ఆ ఉష్ణమైనప్పుడు ఫలానా ముద్రలో మీరు కూర్చోండి అని అంటారు. ఆ కూర్చోవడం మూలంగా అతని శరీరంలో శీతల పర్సెంటేజ్ పెరుగుతుంది.
(04:12) అన్నిటికన్నా తమాషా రహస్యం ఏంటి అంటే ఈ అగ్ని అనేది ఈ మిగతా నాలుగింటిలో కూడా కొంచెం కొంచెం అగ్ని ఉంటుంది. ఆ అగ్ని తగ్గినప్పుడు ఈ అగ్ని అగ్నిని అందిస్తుంది. ఒకవేళ అగ్ని పెరిగిపోతే ఆ అగ్నిని రిసీవ్ చేసుకుంటుంది. అందుకని బొటను వేలు సర్వ ప్రాధాన్యత సంచరించుకొనింది. మానవులు కూడా ఎవరైనా విక్టరీ అంటే ఇట్లా చూపిస్తారు శక్తివంతమైనది.
(04:41) సో ఎప్పుడైతే ఇప్పుడు మనలో జల సంబంధమైన సమస్యలు ఉంటాయో ఆ జలస్థానంలోని అగ్ని తగ్గుతుందో ఆ అగ్నికి అగ్నిని అందించేదానికి ఈ ముద్ర పెడతాం. వాటర్ పర్సెంటేజ్ బాగా పెరిగినప్పుడు మనిషిలో శీతలత్వం అనేది సహజంగా కలుగుతుంది. జలుబు ఇటువంటివన్నీ బయటికి వస్తాయి. ఒకవేళ అతని ఒళ్ళు ఉష్ణం ఎక్కువ అయినప్పుడు ఆ ఉష్ణాన్ని ఈ అగ్ని అనేది గ్రహిస్తుంది.
(05:11) లేదు అక్కడ ఉష్ణశక్తి ఉండాల్సినంత లేదు 98.4 4 సెంటగ్రేడ్ అనేది మన శరీర యొక్క ఉష్ణోగ్రత ఆ ఉగ్నోషకత ఏమాత్రం తగ్గినా మానవుడు జేసియరాం ఉష్ణోగ్రత పెరిగినా మానవుడు జేసియరా సో ఆ ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువలను సమానం చేసే శక్తి ఈ ముద్రకు ఉంటుంది. ఆ విధంగా ఈ ముద్ర వాడబడుతుంది. సో అదే మానవుడు తను ఎముకలకు సంబంధించిన ఏ సమస్యలతోన ఉండి పర్టికులర్ భంగమలో ఒక గురువుగారు చెప్తారు ఈ పోస్చర్ లోనే నువ్వు కూర్చో మకరాసనం సిద్ధాసనం ఏదో ఒకటి చెప్తారు.
(05:54) ఆ ఆసనంలో కూర్చున్నప్పుడు ఎముకల మీద ప్రెషర్ వస్తుంది. ఆ ఎముకల ప్రెషర్ తగ్గేదానికి ఎముకలకు భూమికి లింకు ఇది జలము రక్తానికి లింకు ఆకాశ తత్వం మనలో ఉన్న స్పేస్ గ్యాప్ కు చనం ఇది వాయువు మనకు తెలిసిందే శరీరంలోని 72 నాడులలోకి ప్రవేశ 72వేల నాడులలోకి ప్రవేశించే వాయు చలనం ప్రాణాయామం ఈ ప్రాణాయామంలో కూడా మనకు సూర్యనాడి చంద్రనాడి అనేటివి ఉంటాయి అప్పుడు వీటిలో హెచ్చు తగ్గులు జరిగినప్పుడు ఆయా ముద్రలు వేయటం మూలంగా ఉష్ణాన్ని తగ్గించడం ఉష్ణాన్ని పెంచడం శీతలత్వాన్ని పెంచడం శీతలత్వాన్ని తగ్గించడం
(06:39) అందుకని వేరే వేరే ముద్రలలో మానవులు కూర్చుంటారు. అన్నిటికన్నా ఎక్కువ జ్ఞాన ముద్ర అని చెప్తారు ఈ ముద్రలో కూర్చుంటాం సహజంగా కూర్చున్నప్పుడు ఏమైతుంది వాయుతత్వము అగ్ని తత్వమే బాగా పని చేస్తాను. మిగతా మూడు ఐడియల్ గా ఉన్నాయి అందుకని దీని ముద్ర పెట్టుకొని కూర్చుంటారు. ఇంకా అన్నిటికన్నా ఈ ఏలుని ఇక్కడికి తీసుకొని వచ్చి దీని మీద ప్రెషర్ చూపించడం అనేది కలుగుతుంది.
(07:08) అంటే శరీరంలో ఎక్కడైనా అతనికి వాయు ప్రకోపాలు వాతము అని అంటారు. ఆ వాతము అనేది ఉన్నప్పుడు ఈ వాతం ఎక్కడెక్కడ కదిలి ఒక చోట స్టాగ్నేట్ అవుతుందో అక్కడ మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు ఇవి కలుగుతూ ఉంటాయి. ఈ ముద్ర వేయడం మూలంగా దానికి ఉపశమనము అనేది కలుగుతుంది. అన్నిటికన్నా మానవుడు తన ప్రాణ శక్తిని పెంచుకోవాలనే ప్రయత్నంలోనే ఉంటాడు.
(07:38) జలతత్వాన్ని భూతత్వాన్ని అగ్నితత్వంతో కలిపి ఈ రెండు వేళ్ళు నిలబెట్టటం దీని మూలంగా అమోగమైనటువంటి ప్రాణశక్తి శరీరంలో బాగా ఉంటుంది. ప్రాణాయామం అద్భుతంగా చేసుకోగలం. ఈ విధంగా యోగ ముద్రలకు ప్రాణాయామానికి ముద్రలకు లింక్ ఉంది తెలియక ఈ ముద్రలే వేస్తాము అనేది కాదు ఒక పర్టికులర్ ఆసనంలో పర్టికులర్ దానికి అవసరమైనటువంటిది ఆ గురువులు నిర్దేశించి చెప్తారు.
(08:11) ఈ ఆసనంలో వజ్రాసనంలో కూర్చో వజ్రసనంలో కూర్చున్నప్పుడు ఈ ఐదేళ్ళు మోకాళ్ళ మీద పెట్టి కూర్చుంటాం. ఐదు ఏళ్ళు దేనికి సపరేట్ గా చేసి పెట్టి కూర్చుంటాము. అంటే ఇప్పుడు పంచభూతాలు బ్యాలెన్సింగ్ గా ఉంటాయి. మ్ అందుకని ఈ ముద్రలో వజ్రసనంలో ఆ విధంగా కూర్చున్నప్పుడు ఆ బెనిఫిట్ సో వజ్రాసనంలో కూర్చొని కూడా ప్రాణాయామ సాధన చేస్తారు.
(08:39) అప్పుడు కూడా ఈ శీతోషణాలను సమం చేసి సూర్య చంద్ర నాడులలో కాకుండా శుషుణంలోకి గాలిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పేసి వజ్రాసనంలో కూర్చొని ప్రాణాయామం చేసేటప్పుడు పంచభూతాలను సమస్థానంలో పెట్టేదానికి మోకాళ్ళ మీద చేతులు ఇట్లా పెట్ట ఇంకా సుషుమ్ననే యక్టివేట్ చేయాలా అనుకున్నప్పుడు ఈ సుషుమ్న ముద్ర అనేది పెట్టబడుతుంది ఇది ఇట్లా పెట్టే కంటే కూడా ఈ అగ్నిని అగ్నితో జలాన్ని జలంతో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ మనకు మణిపూరక చక్రం అనేది అగ్ని అగ్నిస్థానం స్వాధిష్టానము అనేది జలస్థానం ఇలా పెట్టి కూర్చున్నప్పుడు
(09:24) ఈ నాభిలోకి మనము బొట్టన వేళ్ళను పెడుతున్నాం. చిటికిన వేళ్ళు ఆటోమేటిక్ గా లింగస్థానం దగ్గర ఉంటుంది అది స్వాధిష్టాన చక్రం ఈ రెండు ఎడమది ఇడానాడి ఇది పింగళ నాడి సూర్య చంద్ర నాడులు అంటాం. ఈ రెండు నాడులు మొదలయ్యేది మూలాధారం దగ్గర సో ఇప్పుడు ఒక్క ఈ సింపుల్ ముద్ర పెట్టడంతో ఈ రెండు కలుసుకునేసిన ఈడాపింగడం ఇప్పుడు పని చేయాల్సింది సుషుమన అందుకని తొందరగా సుషుమన యక్టివేట్ అయ్యేదానికి ఈ ముద్ర పేపర్ తెలియక ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు అది చాలా ఎక్కువ సమయానికి బెనిఫిట్ ఇస్తుంది.
(10:07) కనీసం అంటేఒకటిన్నర గంట కూర్చోగలిగితే ఇదే ముద్రలో ఎక్కడైనా పెట్టి వచ్చే ఫలితం ఇక్కడ పెట్టినప్పుడు 30 మినిట్స్ లోపలనే మీకు ఈ మూడు చక్రాలను దాటుకొని యక్టివేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఈ నాభి చక్రం అనేది అగ్నిస్థానం అగ్నిలో అగ్ని కీలలు ఎప్పుడూ పైకే ఉంటాయి. అగ్ని మండాల అంటే ఏమ అవసరం అనాహతం అవసరం ఈ అనాహతం అంటే వాయు తత్వం ఈ వాయుతత్వం విశుద్ధికి వచ్చేసరికి ఆకాశ తత్వం ఆకాశ తత్వంలో నుంచి వాయువు వస్తుంది.
(10:43) వాయువులో నుంచి వాయువు కారణంగా అగ్ని ప్రకోపిస్తాంది. సో ఇక్కడి నుంచి మన డెవలప్మెంట్ అద్భుతంగా ముందుకు సాగుతుంది అందుకనే సుషుమం ముద్ర ఇట్లా పెట్టమని గురువులు చెప్తుంటారు. ఇట్లా ముద్రలకు యోగశాస్త్రానికి యోగం అంటే ఆసనాలు కావచ్చు ప్రాణాయామము కావచ్చు వీటన్నిటికీ కలిపి చేసుకునే విధానాలు కూడా కొంతమంది గురువులు బోధిస్తారు. ఇప్పుడు కేవలం ముద్రలే పెట్టి బెనిఫిట్ పొందవచ్చు ఏ ముద్ర పెట్టినా మినిమం అంటే 45 50 నిమిషాల సేపు పెట్టగలగాలి.
(11:22) ప్రెషర్ ఉండకూడదు టచ్ అయి అవ్వనట్లుగా ఉండాలి ఏ ముద్ర పెట్టినా గాని ఆ విధంగా పెట్టినప్పుడు ఆ బెనిఫిట్ వస్తుంది. ఒకేసారి చేయలేము అనుకున్నప్పుడు త్రిసంధ్యా కాలాలు బ్రహ్మ ముహూర్తంలో ఒకసారి ఈ బ్రహ్మ ముహూర్తంలో కూడా మనకు అనేక విధాలు చెప్తారు.మూడున్నర నుంచి బ్రహ్మ ముహూర్తం మొదలవుతుందని కొంతమంది చెప్తారు.
(11:48) సూర్యోదయానికి రెండు గడియల ముందు అంటే 24 24 48 నిమిషాలు సూర్యోదయం తర్వాత 48 నిమిషాలు బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే ఈనాటి మానవులు పాపంమూడు గంటలకే నిద్రలేదు. వాళ్ళకు ఈ శక్తి కావాలనే కోరిక ఉంటుంది. ఈ సమయం చెప్పినప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. సో ఇది కూడా ఎక్కువ ప్రచారంలో ఉంది. ఈ 48 నిమిషాలు సూర్యోదయానికి పూర్వం సూర్యోదయం తర్వాత 48 నిమిషాలు అనేది మానవుడికి సాధన చేసుకునే అద్భుతం.
(12:30) తర్వాత మధ్యాహ్న సంధ్య మనం గాయత్రిలో మూడు సంధ్యలకు ఎట్లైతే గాయత్రి చేసుకుంటామో ఈ ముద్రలు కూడా ఆ సమయంలో పెట్టుకోవాలి. అందుకే గాయత్రి ఉపాసన సంపూర్ణంగా చేసేవాళ్ళకు కూడా 24 ముద్రలు నేర్పిస్తారు. సముఖం విశృతం చేయవ విపులం చేయవ అని చెప్పేసి 24 రకాల ముద్రలు ఆఖరి ముద్గల ముద్ర అనేది వస్తుంది. ఇది ఎందుకు పెడతారు అంటే ఈ ట్విస్టింగ్ జరుగుతుంది.
(12:58) ప్రెజర్ ఆ పాయింట్ల దగ్గర ప్రెజరింగ్ ఏర్పడి మీరు ఇంతకుముందు ఆరంభంలో అన్నారు ఆకుపంచర్ అని ఆకు ప్రెజర్ అని అక్కడ ఆ ప్రెజర్ ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ పోయి మెదుడు కందజేస్తుంది. మెదుడు మధ్యలో మీకు పీనరీ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ మిగతా శరీరంలోని అన్ని గ్లాండ్స్ ను యక్టివేట్ చేస్తా ఉంటుంది. సో అది యక్టివేట్ అవుతుంది అది ఎంత యక్టివ్ గా ఉంటే శరీరంలోని అన్ని గ్రంధులు ప్రధానంగా వాతపిత్త కపంులు ఈ మూడు సమాన స్థితికి వస్తాయి.
(13:37) ఈ మూడు ఎప్పుడు సమానంగా ఉంటుందో మన భారతదేశపు ఆయుర్వేదం మొత్తం డిపెండ్ అయింది ఈ మూడు శక్తుల మీద వాతము పిత్తము కపం వాతము కింద ఉంటుంది పిత్తం ఇక్కడ ఉంటుంది కపం ఇక్కడ ఉంటుంది. మూడు శరీర అంగభాగాలు సో ఈ ముద్రల ద్వారాను ఆ యోగాసనాల ద్వారాను ప్రాణాయామం ద్వారాను వీటన్నిటిని కలిపి చేసే విధానాలు కూడా పూర్వకాలంలో ఉండేది ఆ ఉండేదానికి సూచన గాయత్రిలో మనకు చెప్పే ఈ ముద్రల విశేషత అక్కడ కుర్మ ముద్ర మస్య ముద్ర ఇవన్నీ అంటారు.
(14:14) సో ఆయా ట్విస్టింగ్లు జరుగుతాయి అన్నమాట ఆ ముద్రలు వేసినప్పుడు అంత అద్భుతంగా మన పూర్వీకులు ఆలోచించి అందుకే అంతా చెప్పి ఆఖరిన అంతా నీ చేతుల్లో ఉంది అన్నారు ఈ చేతుల్లోనే ఉంది. ఈ చేతలలో చేతనను కలిపితే నడవడిక మారుతుంది. అయితే బాబా ఇప్పుడు యోగం లోకి వచ్చినప్పుడు యోగంలో ఇప్పుడు క్రియాయోగం అనేది ఇప్పుడు బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది.
(14:46) అలాగే క్రియాయోగం అనేది మహావతర బాబాజీ మళ్ళీ పునరుద్ధరణ చేసి మళ్ళీ అందించడం లహరీ మహాశయులకి 1850 నుంచి మళ్ళీ ఈ పరంపర అనేది మళ్ళీ చాలా బాగా ప్రాచూర్యంలోకి రావడం అనేది జరిగింది. ఇలా ఒక యోగి ఎందుకు మళ్ళీ ఆ విద్యను పునరుద్ధరించాడు అలా క్రియాయోగం పైన ఎందుకు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు ఓ అర్జున ఈ విద్య నేను సూర్యుడికి బోధించాను అర్జునుడు అడుగుతాడు ఎప్పటి సూర్యుడు నువ్వు ఇప్పటివాడు నీకు జన్మలు గుర్తులేవు నాకు జన్మలు గుర్తున్నాయి రాబోయే జన్మలు కూడా నాకు గుర్తున్నాయి ఎందుకంటే ఆయన సర్వనాటక
(15:29) సూత్రధారి జగన్నాటక సూత్రం ఎలాగైతే అది ప్రక్షిప్తం అయిపోయిందో సూర్యుడు నుంచి వివతుడు వివసతుడు నుంచి ఇక్షవాకు ఇక్షవాకు నుంచి కుక్షి వికుక్షి వరకు వచ్చి అది లుప్తమ అయిపోయింది ఆ విద్య ఒకప్పుడు యోగ విద్యలన్నీ కూడా రాజవిద్యలు రాజుల చేతుల్లో ఉంటది మీకు తెలిసి ఉంటుంది గొప్ప గొప్ప యోగేశ్వరులు మ్ జనక మహారాజు దగ్గరికి వచ్చేవాళ్ళు జనకుడు రాజు క్షత్రియుడు ఉమ్ ఆయన దగ్గరికి వీళ్ళు వచ్చి విద్య నేర్చుకునేవాళ్ళు అంటే రాజవిద్యగా ఉండేది ఇప్పుడు చెప్తున్న రాజవిద్య యోగం వేరే అది సంసారం పాటించేదానికి చెప్తున్నటువంటి రాజవిద్యా
(16:14) యోగం యోగం అంతా కూడా శాస్త్రం అంతా కూడా ఒకప్పుడు క్షత్రియుల చేతుల్లోనే ఉండేది. అట్లా ఆ వివస్వతుడికి చెప్పినది ఎప్పుడైతే లోకంలో లుప్తం అయిపోయిందో దాన్ని మళ్ళీ అర్జునుడు ఎట్లైతే బయటకి తీసుకొని వచ్చినాడో ఈ క్రియాయోగం అనేది క్రియా అవతారు మహావతారు బాబా 5000 ఏళ్ల కింద తాను కనిపెట్టి పర్ఫెక్ట్ గా చేసి ఈరోజుకు ఉన్నాడు అనేదానికి అనేక రుజువులు ఉన్నాయి పర్ఫెక్ట్ గా చేయగలిగింది ఆయన పర్ఫెక్ట్ గా మొట్టమొదట బోధించింది లాహిరి మహర్షుల వారికి లాహిర దగ్గర యుక్తేశ్వర్ అనే ఆయన ఉండేవారు యుక్తేశ్వరగిరి యుక్తేశ్వరగిరి గారి దగ్గర
(17:01) నారాయణగిరి అనే ఆయన ఉండేవారు. ఈ నారాయణగిరికి యుక్తేశ్వరి చెప్పాడు నేను బోధించాను కదా ఆయన ముఖయోగి ఆత్మకథ రాసినాడు పరమహంస యోగానంద ఆయన లాగా నువ్వు కూడా దీన్ని లోకంలోకి ప్రచారంలోకి తీసుకొని రా అనేసి చెప్తే నాకు గురుసేవ తప్ప రెండవది అక్కర్లేదు అని ఆ మహానుభావుడు గురుసేవలోనే ఉండిపోయాడు. ఇంకొక ఆయన ఉండేవారు ఆయనకు కూడా ప్రచార అనుమతి దొరికింది.
(17:33) ఈయన చేస్తున్న ఈ అసాధారణ గురు శిష్య సేవా సంబంధాన్ని మెచ్చుకొని యుక్తేశ్వర్ మహారాజు ఆయన్నను ప్రభూజీ ప్రభూజీ అని పిలిచేవారు అసలు పేరు నారాయణగిరి చాలా మందికి తెలీదు అందరూ ప్రభూజీనే అంటారు. ఆ ప్రభుజీ గారి దగ్గర ఉత్తమంగా తీసుకున్న మహానుభావుడు శంకరగిరి శంకరానాదగిరి ఇప్పుడు ఆయన శిష్య పరంపరలో ప్రఖ్యాతంగా రామమూర్తి గారు అనేది వారు ఉన్నారు వారు యోగబోధన చేస్తున్నారు.
(18:08) యోగదా సత్సంగు అనే పేరు మీద బ్రాంచిలో అనుకుంటాను అక్కడ హెడ్ ఆఫీస్ గా ఉండుకొని వైఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు కేవలం ఈ యోగయోగి ఆత్మకథ రాసిన వాళ్ళ పరంపరగా వాళ్ళు చెప్పుకొని రాను ఇక్కడ ఈ రెండు పరంపరలు డివైడ్ అయింది. ఈ మధ్యలోనే యుక్తేశ్వర్తో పాటు నేను ఇంతకుముందు చెప్పాను నారాయణ గురుజీతో పాటే ఇంకొక ఆయన ఉండేవారు ప్రజ్ఞానంద ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ పూరి పూరి ఆశ్రమం ఆ అవు ఆయన ఇంకొక బ్రాంచ్ పెట్టుకున్నాను ఇట్లా అది అనేక బ్రాంచ్లు అయిపోయినాయి సో నిజంగా గురు పరంపర నుంచి వస్తున్నది నాకు తెలిసి నేను అందరినీ చూశాను ఆ దాంట్లో రాంచి వాళ్ళతో తిరిగాను
(18:54) ఇంకొకళ్ళతోన తిరిగాను ఆ తర్వాత తర్వాత రామమూర్తి గారితోన తిరిగాను. రామమూర్తి గారు తన పరంపర చెప్పినప్పుడు నాకు ఇది పరమ అద్భుతము సరిైన లైన్ ఇప్పుడు లైన్ తీసుకుంటే మీరు కచ్చితంగా ఎక్కడి నుంచి వస్తుంది మహావతార్ బాబాజీ ఆయన తర్వాత లాహిరి మహర్షి యుక్తేశ్వర్ యుక్తేశ్వర్ తర్వాత ప్రభుజీ ప్రభుజీ తర్వాత శంకరానంద శంకరానందగిరి శంకరానంద తర్వాత ఇప్పుడు ఈ మహానుభావుడు ఉన్నాడు ఈయన ఇంకా ఎవరిని తయారు చేస్తున్నాడో నాకు తెలియదు ఇంకా ఆ పరంపర పోకూడదు అది అలాగే ఉండాలి ఎప్పుడో ఒకసారి మాటల సందర్భంలో ఆ మహానుభావుడితో నేను విన్నవించుకున్నాను రామమూర్తి గారి మీరు మీ తర్వాత తదనంతరం ఒక
(19:39) శిష్యుడికి ఇది అప్ప చెప్పండి అని ఆయన మరి ఎక్కడ ఎప్పుడు చేస్తారో మనకు తెలియని సంగతి ఈ క్రియాయోగము ఎందుకంత ప్రాచూర్యం పొందింది అంటే ప్రాచూర్యంలోకి వచ్చేదానికి మూల కారణం మట్టుకు ఒక యోగి ఆత్మకథ అది లేకపోతే ఆ పుస్తకము క్రియాయోగం ఉంది అన్న సంగతే లోకంలో ఎవరికీ తెలిదు మహావతార బాబు గారు ఉన్నారన్న సంగతి తెలియదు.
(20:06) అది చదివిన తర్వాత మహావతారది ఎంతమంది అయితే చేశారో మహావతార్ బాబా దర్శనం పొందారు. ఆయన ఎప్పుడో వేల సంవత్సరాల మనిషి అయినప్పటికిని ఆయన ప్రత్యక్ష దర్శనము యుక్తేశ్వర్ది ఎంత పక్కగా కళ్ళతో చూసగలిగారో అంతే పక్కగా ఇప్పటి వాళ్ళలో కూడా కొంతమంది ఆ సాధన కరెక్ట్ గా చేస్తున్నవాళ్ళు చేసుకోగలుగుతున్నారు మీరు అన్నట్లుగానే ఈ యోగాల కుండలి యోగం ఉంది హటయోగం ఉంది నాద యోగం ఉంది లయ యోగం ఉంది ఎవరు దేన్ని పట్టుకొని గురు గురు పరంపరలో తప్పకుండా గురువు చెప్పింది చెప్పినట్లు చేస్తే ఎవరైనా చేరుకునేది అక్కడ అయితే ఇప్పుడు ఒక గురువుతో ఇప్పుడు
(20:52) చాలామంది ఇప్పుడు మహావతార బాబాజీతో మాట్లాడాలని అనుకుంటారు ఒక జిజ్ఞాస ఉంటుంది ఒక నిదర్శనం కావాలి అనేసి లేదా ఒక మహాయోగితో మాట్లాడాలనిపించింది సూక్ష్మ యోగులతో మాట్లాడాలనిపిస్తుంది. దానికి ఎట్లా సాధన చేస్తే సూక్ష్మ యోగుల్ని దర్శనం పొందొచ్చు ఎలా వారితో కమ్యూనికేట్ అవ్వచ్చు? హిమాలయాలలో మేము కలిసిన అనేకమంది యోగులలో ఒకానొక మహానుభావుడు జటాధారి బాబా అని ఉండేవారు ఆయన కూడా క్రియాయోగ చేసేవారు మీ గురువుగారు ఎవరు ఏ పరంపర మీది అంటే పరంపర చెప్పలేదు ఆయన మూల గురువు గురువును పట్టుకుంటే అన్ని అయిపోతుంది ప్రభువు అనేవాడు ఆయన
(21:39) ఆయన చెప్పిన దాని ప్రకారము ఈ బ్రహ్మమహూర్త సమయం లో స్నానం చేసి నిష్కల్మష హృదయంతో ఒక నేతి దీపం వెలిగించి కేవలం మహాతార్ భావాలు ఊహించుకుంటూ ప్రాణాయామం సక్రమమైన పద్ధతిలో క్రియాయోగ పద్ధతిలో ప్రాణాయామం మామూలు ప్రాణాయామానికి బహిర్ప్రాణాయామం మనం చేస్తున్నాం వాళ్ళు అంతః ప్రాణాయామం చేస్తారు కేచరి ముద్ర వేసి కేచరి ముద్ర వేసి మీరు ప్రతిరోజు 45 నిమిషాలు చేయగలుగుతూ ఉంటాయి విత ఇన్ 40 డేస్ లో చాలామందికి బాబా వచ్చిన అనుభూతి వాళ్ళ రూమ్లో ఒక అద్భుతమైన పరిమళాలు రావడం
(22:25) పెట్టుకున్న డిమ్ లైట్ కాస్త మహా ప్రకాశంగా మారడం లాంటి సూచనలు అనేకమందికి కనపడ్డాయి మీ సినీ ఇండస్ట్రీలో రజనీకాంత్ లౌకికంలో ఉన్నప్పటికిని ఈ క్రియాయోగ సాధన చేసి మహావతార్ బాబా ప్రత్యక్ష దర్శనం పొందాడు అనేసి ఆయన నోటి ద్వారా ఆయనే చెప్పాడు. సో మహావతార్ బాబా దర్శనం ఈ విధంగా సాధ్యమని మాకు జటాదారి బాబా చెప్పాడు. కేచరి ముద్ర పూర్వజన్మ సూకృతం ఉండి పూర్వజన్మలో కూడా వాళ్ళు క్రియాయోగం చేసిన వాళ్ళకు సహజంగానే పడుతుంది.
(23:08) లేదు అర్ధకేచరి పెట్టి చేసినా మనకు ఆ ఫలితం వస్తుంది. 50 నిమిషాలు కదలకుండా ఏకాగ్రతగా దీపాన్నే చూస్తూ ఆ ప్రాణాయామం చేయడం మహావతార్ బాబాయే నమః అనుకోవడం అయితే ఒక యోగి మనకి దర్శనం ఇచ్చినప్పుడు ఆ యోగితో ఎలా సంభాషించాలి ఇప్పుడు చూడండి లహరీ మహాశయులకు మహావతార బాబాజీ పండిత శ్రీరామ శర్మాచార్య గారికి దాదా దాదా గురుదేవులు ఆ అలాగే ఇప్పుడు అదృశ్య గురువులందరూ దృశ్యమానంలోకి వచ్చి ఇలాంటి మహానుభావుల్ని కొంతమందిని ఎంచుకొని
(23:53) ఉద్ధరిస్తున్నారు ఎంతోమంది వాళ్ళ వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నారు. సో ఒక సొసైటీలు ఏర్పడుతున్నాయి. అలాంటి అదృశ్య గురువులు ఎవరిని ఎంచుకుంటారు ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళని ఎందుకు కేటాయించుకొని వాళ్ళతోనే ఈ పనులు ఎందుకు చేయిస్తారు ఇప్పుడు అందరికీ ఒకసారి కనిపించి చెప్పేసేయొచ్చు కదా మహాతర బాబాజీ బయటికి వచ్చేసి నేను 2000 సంవత్సరాలు ఉన్నానని బయటికి చెప్పేస్తే అయిపోయింది కదా ఇదే మాటను బహుశా 1935 లో అనుకుంటాను రమణ మహర్షి గారిని సాక్షాత్ పరమహంస యోగానంద కలిసి మ్ ఈ విద్య కొందరికే ఎందుకు అందరికీ చెప్పించేసి అందరినీ తరింప
(24:40) చేయొచ్చు కదా అని అడిగారు. అప్పుడు రమణ మహర్షి గారు ఒక్కొక్క మనిషి స్టేజ్ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది. వాని బాడీ థింకింగ్ వేరే ఉంటుంది. చావుకు పెళ్లికి ఒకే మంత్రాలు చదవలేము. సో ఎవరి ట్యూనింగ్ కు మన లైఫ్ వేవ్ లెంత్ కలుస్తుందో వాళ్ళతోనే అనుసంధానం కావాల తప్ప ఇతరులతో అయనానికి లేదు రెండవది అతనిలో తీసుకుంటున్న వాడిలో పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
(25:11) దాని గురించిన కొంచెం నాలెడ్జ్ ముందుగానే ఉండాలి. ఇవి అన్నీ కలిసినప్పుడు కలుస్తాయని పరమహంస యోగానందుతోనే రమణ మహర్షి వారు చెప్పినట్లుగా నేను ఒకచోట చదివి ఉన్నాను. ఇట్ ఇస్ 1935 ఆ ప్రాంతంలో అప్పటికి నేను చాలా చిన్నవాడిని అయినప్పటికిని తర్వాత పుస్తక జ్ఞానంలో ఈ విషయం తెలిసివచ్చింది. సో అందరి వేరు లెంత్ ఒక లైన్లో ఉండదు.
(25:41) వాని కర్మలను పట్టి వాటి రుణానుబంధాలను పట్టి వాళ్ళ వాళ్ళ మార్గాలు వాళ్ళకు ఉంటాయి. ఈ మార్గంలోకి రావటం జన్మ జన్మల పుణ్యపు లింకు ఉంటే తప్ప కరగదు. ఉమ్ ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా అంటుంటాం ఊరికేవాడికి కలిగిపోయింది అని ఊరికే కలగదు రమణ మహర్షి ఎగ్జాంపుల్ 14 ఏళ్ల పిల్లవాడికి అరుణాచలం అన్న ఒక్క శబ్దం వినపడడంతో ఎప్పటికప్పుడు అంత వైరాగ్యం వచ్చేసి అక్కడికి పారిపోయారు.
(26:11) నిశ్చలంగా నిలబడిపోయాను. కారణం ఆ పూర్వజన్మ సంస్కారాలు వాసనాలు అవి అట్లా ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఈ పక్వమై బయటికి వస్తున్నాయి అని తెలిసినప్పుడు పైనున్న గురుదేవులు వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటారు. అక్కడ మనం మాట్లాడుకుంటున్నట్టు ఇట్లా శబ్దాలు ఉండవు వాళ్ళు నోరు తెరిచి మాట్లాడరు వీళ్ళు చెవులు రెక్కించి వినడం అనేది ఉండదు.
(26:36) మైండ్ టు మైండ్ వెళ్ళిపోతుంది వాళ్ళు నిలబడే ఉంటారు మన ఎదురుగా మనము ఉంటాము మాటలు జరిగిపోతా అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో చెప్తారు మీకు ఏ అనుమానాలు ఉన్నాయో వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళు మీకు క్లియర్ చేస్తా ఉంటారు మౌన వ్యాఖ్యా ప్రకట పరబ్రహ్మ తత్వం బడియా పాట మీకు తెలియంది కాదు మమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు కొంతమంది మనం సాధన చేస్తూ వెళ్తూ ఉంటే ఈ కోసాల్లో ఒక్కొక్క కోసం దాటుకుంటూ కారణ ఆయన శరీరం దాటిన తర్వాత మహాకారణ శరీరంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఒక విశాలత్వం అనేది ఒక మానవ శరీరానికి కానీ ఈ యొక్క ఆలోచనా విధానంలో కానీ వస్తుంది.
(27:24) అప్పుడు ఆటోమేటిక్ గా గురువు తను ఇంజెక్ట్ చేయాలనుకున్నటువంటి జ్ఞానాన్ని మహాకారణం ద్వారా ఈ శరీరంలోకి చేసి వాళ్ళ చైతన్యం ద్వారా పనులు చేస్తారు అంటారు అది ఎంతవరకు నిజం మహాకారణానికి ఒక్కసారి చేరిపోయినాక ఇంకా అక్కడ రెండవది లేదు మహాకారణంలోకి చేరిపోయినాక రెండవది అంటూ లేదు మ్ ఒక నీటి చుక్క కింద పడతాంది వర్షపు చినుకు మ్ పైన ఉంది అది కింద చూసింది సముద్రం అనింది ఇప్పుడు అది సముద్రం దానికి నేను నీటి చుక్క వచ్చింది వచ్చింది అందులో పడిపోయింది.
(28:04) ఇప్పుడు నీటి చుక్క అని లేదు సముద్రము అని లేదు ఉన్నది ఒకటే దానికి పేరు లేదు. ఈ రెండుగా ఉన్నప్పుడు పైన ఉన్నప్పుడు ఇది నీటి చుక్క కింద ఉన్నది సముద్రం దాంట్లో కలిసిపోయినా సముద్రంలో నుంచి అల పైకి వస్తుంది అరతో కొన్ని నురుగులు నీటి బిందువులు పైకి వస్తాయి మళ్ళీ కలిసిపోతాయి నేను అలా అన్న సంగతి దానికి తెలియదు నేను సముద్రం అన్న సంగతి సముద్రానికి తెలియదు మనం పిలుచుకుంటున్నాం నీటి బిందువు అల సముద్రము నొరక ఈ పేర్లు మనం పెట్టుకుంటున్నాం అన్ని ఎక్కడి నుంచి ఉన్నాయి సముద్రంలోనే సూర్యుని వేడికి నీళ్లు ఆవిర అయతాయి ఆవిరి పైకిపోయి
(28:49) మేఘాల్లో నుంచి మళ్ళీ వర్షం అయతాంది వర్షం మళ్ళీ దాంట్లోనే కలుస్తాం అందుకే మన పూర్వీకులు పూర్ణమదః పూర్ణమిద పూర్ణ పూర్ణ సముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యత ఏమీ లేదు అది పూర్ణమే నేను పూర్ణమే నేను అసంపూర్ణంగా ఎందుకు మారినాయను అంటే మాయలో చిక్కుబడి ఇది నేను అనుకొని మేనును చూపిస్తూ ఉండడంతో మాయ మొదలైతాంది లోపల ఉన్నది ఇది పూర్ణమే అది పూర్ణమ ఇప్పుడు మనకి శారీరక శక్తి అంటే ఒక ఏడుఎనిమిది గంటలు పని చేసిన తర్వాత కొంసేపు రెస్ట్ తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది జాబ్ ఎంప్లాయిస్
(29:34) అది శారీరక ధర్మం శరీరం కోరుకుంటుంది కోరుకుంటుంది దానికే నిద్ర అని పేరు పెట్టారు కొంత నిద్ర పోవాలనిపిస్తుంది. అదే మానసిక స్థైర్యము ధైర్యము ఉన్నవాడు ఇంకా ఎక్కువ పని చేయగలుగుతాడు ఇంకా యక్టివ్ గా ఉండగలుగుతాడు. అలాగే మానసిక శక్తిని దాటి ఆత్మశక్తికి వెళ్ళినప్పుడు వాడు ఏమి చేయగలిగినా గాని ఎంతో ధైర్యంగా శక్తివంతంగా ఉంటుంది.
(30:00) ఈ శారీరక శక్తిలోనే చాలామంది కూలి పనులు ఇంత చేసుకుంటే కొంతమంది మానసికంగా ఉన్నవాళ్ళు కొంత డెవలప్మెంట్ విజన్ కెరియర్ లోకి వెళ్ళిపోతారు. ఈ ఆత్మ శక్తిని శారీరక శక్తిలోకి లాక్కొని రావటం ఎలా? ఆత్మ శక్తిని శారీరకంలోకి దింపడం ఎలా? దింపితే వాడు మహానుభావుడు అవుతాడు కదా ఈ కనెక్షన్ ఎన్లైట్మెంట్ అంటే మన శరీరము మనసు బుద్ధి ఆత్మని కలెక్ట్ చేసి ఒక అక్కడి నుంచి ఈ శక్తిని ట్రాన్స్ఫర్ చేయడం ఎలా అనేది ఎలా ఇది ఎలా పాసిబుల్ అవుతుంది ఎలా ఆలోచన చాలా అద్భుతము మీకు ఉదాహరణ చెప్పాల అంటే ఓ రెండు మూడు కిలోమీటర్లు పొడుగ్గా ఉండే ఒక రైలు పట్టాలను చూడండి మీరు
(30:45) దూరం ఇక్కడి నుంచి చూస్తే మీకు ఆ రెండు పట్టాలు కలిసినట్లు ఉంటాయి. ఈరెండు కిలోమీటర్లు మళలా వెళ్లి చూడండి మళ్ళీ 2 కిలోమీటర్లు ముందర కలిసినట్లే ఉంటాయి. ఇది రెండు ఎప్పటికీ కలవవు ఆత్మ శక్తిని శరీరానికి వాడలేము శరీరంతో ఆత్మకు శక్తిని కలిగించలేము. ఆత్మ స్వయం శక్తివంతం ఆ ఆత్మ అనేది పంచభూతాత్మకమైన ఈ శరీరంలోకి ప్రవేశించి పంచ ప్రాణాలను డెప్యూట్ చేస్తుంది.
(31:19) ప్రాణం ఆడను మొదలు పెట్టినాక మనసు క్రియేట్ అయితుంది. ఈ మనసు ఎందుకు క్రియేట్ అవుతుంది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కంట్రోల్ చేస్తది అందుకే దాన్ని 11వ ఇంద్రియము ఇంద్రుడు అన్నారు ఇంద్రుడితో పోల్చాడు చంద్రుడితో పోల్చాడు మనసో చంద్రమా అజాయత చంద్రమా మనసో అజాయత అంటున్నారుగా అంటే ఈ చంద్రుడికి ఈ మనసుకు ఎందుకు సంబంధం అంటే చంద్రుడు కారణంగానే సముద్రంలో ఆటుపూట్లు కలుగుతున్నాయని సైంటిస్టులు చెప్తున్నారు అందరూ చెప్ చెప్తాన్నారు సో పంచభూతాలకు చంద్రుడికి కనెక్షన్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలను పట్టుకొని చూసి చెప్తున్నటువంటిది ఒక మనసు
(32:06) సో ఈ మనసు వేరే శరీరము వేరే ఆత్మ వేరే ప్రాణాలు వేరే ఒక్క ఆత్మ ఈ మూడింటిని కవర్ చేస్తారు ప్రాణాలను మనసును ఇంద్రియాలను కానీ మనం ఏమనుకుంటున్నాం ఇంద ఇంద్రియాలు నా మనసుతో పని చేస్తున్నాయి నా మనసు ప్రకారమే నేను చేస్తున్నాను అనుకునే అహం వస్తా అందుకే మనోబుద్ధి చిత్తహంకారాలు అని చెప్పారు. ఈ చిత్తము అనేది ఒక విధంగా చూస్తే మనసుకు ఆత్మకు అతి దగ్గరగా ఉన్న పదార్థం.
(32:40) పూర్వజన్మ వాసనలంతా ఈ ఆత్మకు కూడా కొంచెం అంటుకొని 60 70 ఏళ్ళు ఒక కట్టెలో ఉంది అంటే సహవాస దోషం ఏర్పడినట్ల ఆ ఆత్మకు ఇది అంటుకుంటుంది ఆత్మ ఎప్పుడూ శుద్ధం ఆత్మ మలినాత్మ అనేది లేదు ఆత్మ పరిపూర్ణ శుద్ధం ఆ ఆత్మ వీటిని ప్రేరేపించి చెప్పి చేయొచ్చు సాక్షిభూతంగా ఉంటుందే తప్ప నిశ్చయాత్మకమైన బుద్ధిని బాగా ప్రేరేపిస్తుంది.
(33:11) సో అందుకే మన గురువులందరూ అంటారు ది ప్రచోదయ ది ప్రచోదయ అమ్మ మా బుద్ధిని ఇంకా ప్రచోదయం చేయ సూర్య భగవానుడా ప్రచోదయం చెయ అని మాట్లాడు ప్రాణాయామము అంటే కూడా అంతే ధ్యానము అంటే కూడా అంతే ధీయాత్ ప్రయాణం ధ్యానం బుద్ధితో ప్రయాణించు మనసుతో ప్రయాణించవు మనసు 24 గంటలు సంకల్ప వికల్పాల చక్కరతోనే ఉంటుంది దాని గోల విడిచిపెట్టినప్పుడు బుద్ధితో నిశ్చయాత్మకమైన బుద్ధితో ఆలోచించినప్పుడు నీ పనులు జరుగుతాయని ధ్యానము అనేది మన వాళ్ళు పెట్టారు.
(33:50) ధి ధీతోయానము ధ్యానము ది ప్రచోధనము అనేది మనకి గాయత్రి మంత్రంతో వస్తుంది. దీనికి సూర్యుడికి లింక్ ఉంటుంది. సూర్యుడి యొక్క ధ్యానాన్ని సన్ మెడిటేషన్ అని సూర్యుడితో అనుసంధానం అయ్యే విద్య ఉంది కదా దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? భూమి మీదకి వస్తుంది అంటే సూర్యుడి నుంచి మనం చంద్ర కళలు చంద్రకాంతి అంటున్నాం చంద్రుడు స్వయం ప్రకాశ గ్రహం కాదు సూర్యుడు నుంచి కిరణాలు వస్తూ ఉంటాయి.
(34:22) అమ్మవారి దేవీ భాగవతంలో మీకు షోడశ కళలు అనేది షోడశదల పద్మాలుగా ఉంటాయి. తిధులు అని కూడా అంటారు కళలు అని కూడా అంటారు. ఈ తిధులు ఈ కళలు సూర్యుడి నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వచ్చి చంద్రునికి చేరుతూ అమావాస్య నుంచి పౌర్ణమిని చేస్తాయి. ఒక్కొక్క కళ రిటర్న్ పోయి మళ్ళీ సూర్యునిలో కలిసిపోతూ ఉన్నప్పుడు మళ్ళీ అమావాస్య రావడం జరుగుతా ఉంటుంది.
(34:53) ఇది ఒక సైకిల్ చంద్రునిలో కేవలం ఒక్క నిత్యాకళను మాత్రమే ఉంటుంది. మిగతా 15 కలలు రాకపోకలు చేస్తూ ఉంటుంది. సో ప్రధాన సోర్స్ ఆ ప్రత్యక్షంగా కలుపుతున్న సూర్యనారాయణుడు అందుకే మన పూర్వీకులు సూర్యుని సూర్యనారాయణునిగా చేశారు నారాయణ తత్వం పోషకత్వం సూర్యుని ద్వారానే మనకు పోషకత్వం భూమిమీద మొక్కలు మొలవాలన్నా ఎండాల అన్నా అన్నిటికీ కారణభూతుడు వర్షం రావాలన్నా సూర్యుడు సో సమస్తానికి మూల కారణం సూర్యుడి నుంచి వస్తాడు.
(35:30) సూర్యుని అందుకే సహస్ర కిరణులు అన్నాడు సహస్రం అంటే కేవలం వెయి కాదు అనంతం సంస్కృతంలో దీనికి రెండు అర్థాలు సహస్రం అంటేవెయి సహస్ర శీష పురుష సహస్ర సహస్రపాత అని అంటాడు అక్కడ వెయి తలలేవెయి కాళ్ళే అని కాదు అనంతమైన తలలు అనంతమైన కాళ్ళు అనంతమైన చేతులతో ఉన్నవాడు అన్నాడు అట్లా సూర్యునికి ఉన్న ఆ అనేక కోట్ల కిరణాలను ఏ ఏ కిరణంలో లో ఏ ఏ శక్తి దాగుందో మానవుడికి ఇంతవరకు పరిపూర్ణంగా తెలియదు.
(36:06) తెలిసినటివి కొన్ని ఆ కొన్నింటినే పట్టుకొని మనం సాధించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అయితే మీరు ఎందనక చెప్పారు ఇంద్రుడు అగ్ని గురించి మనకి వేదం మొత్తంలో చూస్తే ఇంద్రుడు అగ్ని వరుణుడు కిందే చెప్తారు. వేదంలో చాలా వరకు శివుడు విష్ణువు బ్రహ్మ గురించి ఎక్కడ ప్రస్తావన రాదు అలాగే మనకి ప్రస్తావన ఉంది చాలా తక్కువ ఉన్నది ఇంద్రుడు ప్రధాన దేవత ఇంద్రుడు వాళ్ళు కనిపెట్టారు మనసే ఇంద్రుడు కాబట్టి మనసుకు అంత ప్రాముఖ్యత ఇచ్చి మనసుకు ఇంద్రునితో పోల్చారు.
(36:45) ఇంద్ర మనసు ఇంద్రియాలకు అధిపతి అయితే ఇప్పుడు ఇక్కడన్న నా సందేహం ఏంటంటే మామూలుగా ఇంద్రుని వరుణుని అగ్ని ఇవి ఉన్నాయి కదా మామూలుగా లౌకికంలోకి వచ్చేసరికి అగ్నిని ఆగ్నేయ మూలానికి అధిపతి చేశడు వరుణని వరుణ దేవత కింద మామూలుగా అష్టదిక్కుల్లో ఒకరి కింద చెప్పారు మనకి శివుణని వీళ్ళని గురించి చెప్పినప్పుడు ఆ శివుడు చాలా గొప్పవాడు విష్ణువు చాలా గొప్పవాడు బ్రహ్మ చాలా గొప్పవాడు అమ్మవారు గొప్పది అని చెబుతారు నాకున్న సందేహం ఏంది అంటే దేవతలకందరికీ రాజైన ఇంద్రుడు కదా గొప్పవాడు వీళ్ళందరినీ ఎందుకు ఆ పరమాత్మ స్వరూపులుగా చూపిస్తారు అంటే
(37:31) పరబ్రహ్మం అనంగానే ఉంది ఇప్పుడు మనకి శంకర పరంపరలో కూడా మనం చెప్పినప్పుడు పంచాయితనంలో కూడా ఇంద్రుడు ఎందుకు లేడు ఇంద్రుడు ఉండాలి కదా పంచాయితనంలో కూడా ఇప్పుడు ఇప్పుడు ఆ ఇంద్రుడు అంతే అంత గొప్పవాడు అయినప్పుడు పంచాయతనంలో కూడా ఉండాలి కదా అలాగే ఇంద్రుడు ఎందుకు లేడు ఇంద్రుడినేమో మళ్ళీ సినిమాటిక్ గా వీటిని చూస్తే పెద్ద ఏదో వస్తున్నాడు అధికారకాంక్షాపరుడుగా శ్రీ వ్యామోహుడుగా చూపిస్తారు చూపిస్తారు ఇట్లా వేదం మొత్తం ఘోషించిన ఇంద్రుని దేవతలకు రాజైన ఇంద్రుడిని పంచాయతనంలో ఎందుకు లేడు వీళ్ళందరికంటే గొప్పవాడైనటువంటి ఇంద్రుని శివుడు విష్ణువు కంటే ఎందుకు గొప్పగా
(38:13) చూపించాడు లేదు వేదమంతా ఘోషించిన ఇంద్ర అగ్ని వరుణుల్ని మామూలుగా వచ్చేసరికి భౌతికంలోకి వచ్చేసరికి పూజా విధానంలోకి వచ్చేసరికి ఒక దిక్కుల అధిదేవతలుగా చేశారు ఇది ఇఏమిటి అసలుకి ఇది అసలుకి ఎలా చూడాలి అసలుకి అబ్బబ్బా అద్భుతమైన ప్రశ్న మీకు అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పాలా అంటే ఇప్పుడు మన దేశం ఉంది రాష్ట్రపతి ఉన్నాడు. రాష్ట్రపతి ప్రథమ పౌరుడు సర్వం సహా అధికారి కోర్టు మరణ శిక్ష వేసిన వాడిని కూడా క్యాన్సల్ చేసేంత అధికారం ఆయనకు ఉంది.
(38:52) అంటే మనకు సర్వం సహా ఎట్లైతే భారతదేశానికి హెడ్ అయితే ఉన్నాడో అట్లా ఒక పరబ్రహ్మం ఉంది. సో ఇప్పుడు ఈ ఒక్క రాష్ట్రపతి దేశాన్ని అంతా పాలిస్తాండా ఆయన కిందే 28 రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు ఒక బ్యాచ్ ఆయన కింద మళ్ళీ ఆ గవర్నర్ల కింద కలెక్టర్లు ఒక బ్యాచ్ కలెక్టర్ల కింద విఆర్ఓలు డిఆర్ఓలు అనేది ఒక బ్యాచ్ వీళ్ళ ద్వారా పరిపాలన ఆయన చేస్తాన్నాడు.
(39:25) మమ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పక్క కచ్చు సింధు శాఖ దగ్గర నుంచి ఆ పక్క మేఘాలయ వరకు ఇంత పెద్ద భారతదేశానికి ప్రథమ పౌరుడు ప్రథమ నాయకుడు ఆయన ఒక్కడే చేయడం లేదు కదా ప్రతి ఒక్కళ్ళు నా ఇల్లు బాగలేదండి రిపేర్ చేయని రాష్ట్రపతి దగ్గరికి పోవడంలే విఆర్ఓ దగ్గరికి పోతే అయిపోతాను. సో ఇట్లా ఈ బ్రాంచెస్ పెట్టినప్పుడు ఆయా దేవతా సమూహాలు అనేటివి ఆయనకు అవసరమైనయి.
(39:59) వీటిలో అతి ముఖ్యమైనది పంచభూతాలు అంటే పంచభూతాలలో ఇంకా ముఖ్యత ప్రాముఖ్యత అగ్ని వరుణులకు అంటే నీళ్లు అగ్ని మానవుడికి సైన్స్ మామూలుగా చూడండి అత్యంత ముఖ్యంగా మానవుడికి ఉపయోగపడుతున్నటి ఏంటివి ఈ రెండే వాడు ఎలాగో భూమిమీద ఉన్నాడు ఆకాశం నుంచి వస్తున్న గాలిని పీల్చుకుంటున్నాడు. కానీ వాడు స్నానం చేసేకి వంట వండుకునేకి ప్రతిదానికి నీళ్లు కావాలి వంట వండాల అంటే అగ్ని కావాలి బాడీలో కూడా అగ్ని ఒక స్థాయిలో ఉండాలి ఇంతకుముందే చెప్పాను.
(40:35) సో ఈ రెండిటికీ అతిక ప్రాధాన్యత ఇచ్చారు అత్తు ఈ రెండు ఎక్కడఉన్నాయి శరీరంలో 72% జలం అగ్ని తత్వానికి 6% అని ఇచ్చి ఉన్నారు. పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఈ రెండు మెయిన్ ఈ రెండిటి ద్వారానే ఇంద్రియాలు పని చేస్తాం ఇంద్రియాలకు అధిపతి మనసు అనబడే ఇంద్రుడు వీళ్ళందరూ ఎవరు ఆ హెడ్ కు కింద ఉన్నవాడు ఆ హెడ్ మరి సృష్టి చేయాల అనుకున్నప్పుడు బ్రహ్మ ఆ సృష్టిని రక్షించి పోషించాల అంటే విష్ణు పోషకుడికి ఎక్కువ డ్యూటీ మేనేజ్మెంట్ పడుతుంది
(41:19) సో విష్ణు తత్వం మెల్లగా ప్రచారంలోకి రాను మొదలు పెట్టింది. అట్లాగనే శివతత్వం ఒక పదార్థం తయారు చేసామ అది ఎంత కాలం అట్లే ఉంది దాన్ని పాడు చేసి మళ్ళీ నలిపేసి కొత్తది చేసుకోవాలి ఈ చేసే క్రియ చేసేవాడు పరమేశ్వరుడు పరమేశ్వరుడికి ఆఖరికి ఎటువంటి శక్తి ఉంది అంటే అందరూ సృష్టి స్థితిలయలనే మూడు ఉంటే తిరోధాన అనుగ్రహము అనే రెండు అడిషనల్ శక్తులు కలిగినవాడు శివుడు అందుకే ఆయనకు ఐదు ముఖాలు చూపించి సజోజాతం వామదేవం అఘోరం ఈశానం తత్పురుషం అని పెడతాన్నారు.
(41:56) అంటే మొదటి మూడు సృష్టి స్థితి లయలు అయితే మొత్తాన్ని లోపలికి తీసుకోవడం అనేది ఆయన ద్వారా జరుగుతుంది మొత్తాన్ని మళ్ళీ బయటికి తీయడం అనేది కూడా ఆయన ద్వారానే అయితుంది. ఎట్లైతే ఊర్ణ నాభి అంటారు లేకపోతే మకోడ సాలెప్పుడు అది ఎక్కడి నుంచో బయట నుంచి పదార్థాన్ని తెచ్చి ఇల్లు కట్టుకుంది తన లోపల నుంచే పదార్థాన్ని తీసి ఇల్లు కట్టుకుంటుంది.
(42:26) ఇష్టం లేకుంటే తనే మింగేసి వెళ్ళిపోయి ఇంకో చోటకి మళ్ళా గూడు కట్టుకుంటుంది. సాలెపురుగు సాలేడు గూడు అది బయట నుంచి ఎక్కడి నుంచో పోత చిలకలు పిచుకలు ఏ జంతువు అయినా ఇంకో చోట నుంచి తెచ్చి గూడు కట్టుకుంటాడు. చాలెప్పుడు తనలో నుంచే తీసి కట్టుకుంటుంది అవసరం లేదన్నప్పుడే తనలోకి తీసుకుంటాం ఈ తత్వం శివుడికి సో ఈ తత్వాన్ని గ్రహించిన మన పూర్వీకులు మెల్లమెల్లగా విష్ణువుకు శివుడికి ప్రాధాన్యత ఇచ్చారు.
(43:03) ఎందుకంటే వాడు ప్రత్యక్ష పోషకుడు ప్రత్యక్ష భక్షకుడు పునర్సృష్టి ప్రధా వీళ్ళద్దరికీ మెయిన్ వచ్చింది. ఇంద్రునికి ఎందుకు రాలేదు ఎందుకంటే వాళ్ళు కనిపెట్టారు మనసుకు కనుక అధికారం ఎక్కువ ఇస్తే ఆత్మను సర్వనాశనం చేసేది మనసే ఈ ఆత్మ అంటే జీవుడి లోక వచ్చినప్పుడు దీని పేరు జీవాత్మ బయట ఉంటే ఇదే పరమాత్మ పరమాత్మను కూడా నాశనం చేసే శక్తి దీనికే ఉంది ఈ మనసుకు ఈ మనసు ఈ మనసుతో ఆలోచించే బుద్ధితో ఉన్నవాడు దేవునికి కూడా పంగనామాలు పెడతాడు అనేసి మన దాంట్లో ఉంది సామెత ఎవరో ఎవరో ఒక ఆవిడ ఉండేదంట ఆమె పెళ్లి అయింది సంతానం లేదు ఆర్థికంగా ఇబ్బందులు
(43:49) దేవుడు ఆమెను టెస్ట్ చేసేదానికి ఆమె ఎదురుగా ప్రత్యక్షమై ఏదో ఒకే ఒక వరం కోరుకు నీకు ఆరోగ్యం కావాలనా సంతానం కావాలనా ఐశ్వర్యం కావాలనా కోరుకో అన్నాడండి మనసు ఏం చేసింది వెంటనే ఆలోచించి ఒక మహా సంకల్పం చెప్పింది నా మనవడిని బంగారు ఉయ్యాలతో ఊంచేటట్లు నాకు వరమే అని అడిగింది. మునిమనవడిని బంగారు ఉయ్యాలలో ఊచాల అంటే ఈమెకు దీర్ఘాయుషు కోరుకునింది.
(44:24) బంగారు ఉయ్యాల అంటే సంపదా కోరుకునింది. మునిమనవడు కలగాలంటే తనకు సంతతి కలిగితే కొడుకు కొడుకుకు కొడుకు కొడుకుకు కొడుకు సంతానము కోరుకునింది. సో మనసు ఇటువంటి చంచల స్వభావి కాబట్టి ఆయనను ఎక్కడ ఉంచాలనో సకల దేవతలకు అధిపతిగా చేసి అక్కడ కూర్చోబెట్టింది. నువ్వు సక్రమంగా పరిపాలించి ఈ ఇంద్రియాలన్నిటిని నీ అదుపులో పెట్టుకో అని సూర్యుడు ఇంత దేవతలలో ఒక భాగమే అంటే నీ కళ్ళను సరిగ్గా వాడుకునేటట్లు చేయి ఇంద్ర అని చెప్పేదానికి ఇంద్రుని పెట్టారు.
(45:05) ఈ మనసు ఆ కళ్ళనే ప్రేరేపించి ఇంకా చూడు ఇంకా చూడు ఇంకా వేను అశ్వని దేవతలు ఇక్కడ అగ్ని ఇక్కడ వీళ్ళందరూ అక్కడ ఇంద్రసభలో దేవతలు వరుణుడు వాయువు వీళ్ళందరి మీద ఆధిపత్యం ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడికి ఒక స్థాయి ఇస్తూ అక్కడే నిలబెట్టారు తప్ప ఉన్నత స్థానం ఈ ఇస్తే ఆయన సర్వనాశనం చేస్తాడని తెలుసు కాబట్టి ఆయనకి ఎక్కడ స్థానం ఇయాలో అక్కడ ఇచ్చారు.
(45:37) అయితే ఇంకొక వేదం గురించి తెలుస్తున్నప్పుడు మామూలుగా రామాయణంలో కానీ వింటున్నప్పుడు ఆంజనేయ స్వామిని మనకి శివ స్వరూపంగా చూస్తారు. కొంతమంది వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువులు కూడా ఆంజనేయ స్వామి శివ స్వరూపం కాబట్టి మేము ఆరాధించము అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆంజనేయ స్వామి శివ స్వరూపం ఎందుకు అవుతాడు అలాగే రాముడు విష్ణు స్వరూపం అని క్లియర్ ఆన్య స్వామి శివ స్వరూపం ఎలా అయ్యాడు దీని వెనక ఏంటి శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాః శివస్య హృదయో విష్ణు విష్ణు హృదయస్య శివః అని మన పూర్వీకులు ఎప్పుడూ చెప్పారు.
(46:23) పైకి రెండు ఆకారాలుగా కనపడుతున్నాయి కానీ క్రియలు వేరుగా కనపడుతున్నాయి కానీ వారు వేరు కాని ఒకటి ఇప్పుడు ఇచ్చా శక్తి, క్రియాశక్తి, జ్ఞాన శక్తి అని మూడు ఉంటాయి. ఇప్పుడు ఏదనా పని చేయాలంటే ఈ చెయి ఉంటే చేత్తో పని చేస్తున్నాం పని చేసేటప్పుడు శక్తిని వాడుకుంటాం. శక్తి ఉంది. చెయి లేకపోతే శక్తి లేదు శక్తి ఉండి చెయి లేకపోతే పని జరగదు పని జరగదు.
(46:57) సో ఈ రెండు అవినాభావ సంబంధం వాగర్తవివ ప్రభుత్వ వాగర్త ప్రతిపత్తయే జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరు అంటారు. వాక్కుకు అర్థానికి తేడా ఎక్కడ ఉంది అది గుడి అంటే గుడి కనపడుతుంది వాక్కు అర్థము తేడా లేదు శబ్దానికి అర్థానికి తేడా లేదు రెండు ఒకటే ఆ విధంగా శివకేశవులు ఇద్దరూ ఒకటే వాళ్ళు ఏకత్వాన్ని చూపించి పూజించండి అని చెప్పేదానికే రామ అని పేరు పెట్టాడు వశిష్ట మహర్షి రామ అని పేరు వచ్చింది అంటే వైష్ణవ భక్తులందరికీ ఓం నమో నారాయణాయ అనే అష్ట అష్టాక్షరి మహా గొప్ప మంత్రం వాడు ఔం నమో నారాయణాయ దాంట్లో రా తీసేయండి నా ఆయనాయ
(47:43) మ్ ఆయణాలే లేవు అన్న విపరీతార్థం వస్తుంది. అంతటి అష్టాక్షర మహామంత్రంలో రా అనేది ప్రాణాక్షరం అట్లాగనే నమఃశివాయ శైవ భక్తులందరికీ ఉత్కృష్ట మంత్రం దాంట్లో నుంచి మా తీసేయండి నాశివాయ మహా గొప్పదైన పంజాక్షరీ మంత్రములు మ అనేది ప్రాణాక్షరం ఆ రపితే రా మ అయింది రా అంటే అగ్నితత్వం అది అక్కడ అట్లా ఈ రాములవారి దగ్గరికి హనుమంతుడు ఉండడం హనుమంతుడు శివ స్వరూపం అనేదానికి వెనకల రెండు కథలు చెప్తారు ఒక కథ నేను వినింది తిరుపతి కళావేదిక అని
(48:32) ఉంటుంది ఈ జనాలంతా మాడబీదుల దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళకు కాలక్షేపం చేసేదానికి తిరుపతి దేవస్థానం వారు నిత్య కార్యక్రమాలు పెట్టి ఉంటారు అక్కడ అక్కడ చాలా ఏళ్ల కింద ఒక మహాతల్లి హరికథ చెప్తూ ఈ హనుమత్ జననం గురించిన రహస్య కథలు రెండు చెప్పింది అందులో ఒకటి అంజనాదేవి తపస్సు చేసింది సాక్షాత్ పరమశివుని కోసం పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల కోరుకో నాకు నీలాంటివాడు కొడుక్గా కావాలి నీ శక్తితో నాకు సంతానం కావాలా అని శివ పరమాత్మ నవ్వి నా శక్తిని పార్వతీదేవే భడించలేకపోయి
(49:16) గంగా నదిలో వదిలి పెడితే కొన్ని నెలలు ఆ గంగా నదిలో ఆ వీజశక్తి శరవణాలకు తగిలి ఆరు భాగాలై సుబ్రహ్మణ్య స్వామిగా కాగలిగింది షన్మాత్రకలు పెంచగలిగారు. నా తేజస్ శక్తిని పార్వతీ గర్భమే భరించలేదు నా శక్తి నీకు ఇవ్మంటావు ఇది నేను ఇవ్వను అన్నాడు నాకు ఇస్తే ఈ వరమే లేకుంటే లేదు అని ఆయన వెళ్ళిపోయాడు పోయినాక ఆలోచించాడు. జగత్ సర్వం దైవాదీనం తద్దైవం మంత్రాదీనం తద్ మంత్రం సాధకాదీనం కాబట్టి దేవుడు తపస్సు చేసిన వాళ్ళకు వరం ఇచ్చి తీరాల మరి నేను ఇయ్యకుండా పోయానే ఇంతకైనా మంచిది ఇస్తాను నా శక్తిని ఆమె
(50:02) పెట్టుకుంటే పెట్టుకుంటుంది లేదంటే లేదు అని చెప్పి అగ్నిదేవుడిని రమ్మని చెప్పి పిలుస్తారు. అగ్నిదేవుడు వచ్చి స్వామి ఏం కార్యము అంటే నువ్వు వెళ్లి నాలో కొంచెం శక్తి నీ చేతికి ఇస్తాను తీసుకెళ్లి అంజనా దేవికి అంటాడు. అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. ఆయన కైలాసం వదిలి బయటికి రాంగానే ఆ శివతేజస్సు సాక్షాత్తు అగ్నిదేవుే మండించేంతగా మారిపోతుంది.
(50:28) ఆ మంట భరించలేక తనకు సహాయకుడైనటువంటి వరుణదేవుడు వాయుదేవుని పిలుస్తాడు. అగ్నికి స్నేహితుడు వాయువు ఆ వాయుదేవుడు వచ్చి ఏం నాయనా అంత కష్టపడుతున్నావ్ ఏం నన్ను పిలిచావా ఈ సూర్య భగవానుడు శివ పరమాత్మ నాకు ఈ ఉద్యోగం పెట్టాడు. నేను అంజనా దగ్గరికి పోయిన లోపల భస్మం అయిపోయేటట్టు ఉన్నాను అంటే ఏం పర్వాలేదు నాకుఇయ అని ఆ శివ తేజస్సును వాయు పరమాత్మ తీసుకొని హిమాలయాల అంతా కొన్ని నెలలు తిరుగుతాడు వేగంగా ఆ హిమాలయాల చల్లదనానికి ఆ శివశక్తి వేగము వేడి తగ్గుతాయి.
(51:08) దాన్ని తీసుకొని వచ్చి అంజనాదేవికి అర్పిస్తాడు వాయుదేవుడు ఇందుకే ఆయన పేరు వాయుదేవుడు అయింది. వాయు పుత్రుడు అని అంటున్నాను అనిల పుత్రుడు అనల పుత్రుడు అని కూడా అంజనం హనుమంతుల వారి నామాలలో వస్తుంది. అనల పుత్రః అనిల పుత్రః అంటే ఒక్క శివశక్తి అగ్నిదేవుడి ద్వారా వాయువు వాయు ద్వారా అంజనాదేవికి చేరింది. ప్రధానం శివశక్తి అది ఒక కథ అంటే సాక్షాత్ శివుడే శివాంశనే హనుమంతుడు అనేదానికి ఒక కథ ఇంకా రెండవ కథ ప్రకారం చూస్తే ఒకానొకప్పుడు ఒక దుష్ట రాక్షసుడు
(51:53) ఉండేవాడు ఆయన అనేక వేల ఏండ్లు తపస్సు చేసినాక బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మ్ అయితే అప్పుడు ఆ రాక్షసుడు ఆలోచించాడు మేము ఎటువంటి వరాలు అడిగినా దాంట్లోని లోపాన్ని పట్టుకొని విష్ణుమూర్తి చంపేస్తున్నాడు. ఇట్లా కాక విష్ణుమూర్తికి కూడా దొరకని లాంటి వరం అడగాలా అని కొంతకాలం నాకు టైమి మల్లారా అప్పుడు నేను ఆలోచించి వరం అడుగుతాను ఆ రాక్షసుడు అనేక దినాలు ఆలోచించాడు భస్మాసురుడు నెత్తిన చెయి పెట్టాల అంటే మోహిని రూపంగా వచ్చి చెయి నెత్తిన పెట్టి ఇచ్చేసాడు చంపాడు ఇంట్లో సావకూడదు బయట సావకూడదు ఆకాశంలో సావకూడదు భూమిమీద సావకూడదు దేవతల చేత
(52:39) మనుషుల చేత జంతువుల చేత ఆయుధాల చేత చావకూడదు అని ఒకడు వరం అడిగాడు కానీ విష్ణుమూర్తి ఆ వరాలు ఎక్కడా దెబ్బ తినకుండా నరసింహ అవతారం ఎత్తి అట్లా మనిషి కాదు జంతువు కాదు ఇంట్లో కాదు బయట కాదు గడప ఆకాశము కాదు భూమి కాదు తొడలు ఆయుధాలు కానీ ఆయుధాలు గోట్లు తో చంపేసాడు ఇట్లా ఎట్లా చేస్తా చంపుతాడు ఇంకా ఏం చేస్తే బాగుంటది అని ఆలోచించి బ్రహ్మ మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చాడు నయం రా వరం కోరుకో అప్పుడు ఆయన అన్నాడంట నా చేతిలో ఖడ్గం ఉంది ఆ ఖడ్గంతో నాకు గాయం అయితే నేను చావాలి లేకుంటే చావ్
(53:25) ఉన్నాడు కదా మన విష్ణు పరమాత్మ దీన్ని ఏదో ఒకటి చేస్తాడులే అని బ్రహ్మ వరం ఇచ్చిపోయాడు కానీ బ్రహ్మ అటు పోంగానే వీడఏం చేశడు జలతర్పణ రూపంగా జలధార రూపకంగా ఇంకా నా జీవితంలో నేను కత్తిని మాత్రం పట్టుకుందును గాక నాకున్న తపస్శక్తితో ఏ ఆయుధమైనా నేను పుట్టించుకోగలను ఒక్క కత్తిని మాత్రం నేను ఎప్పుడూ వాడకుందును గాక అని తనకు తానే జలతర్పణం వదులుకున్నాడు.
(53:54) ఇంక వాడు ఎట్లా చస్తాడు వాడి చేతిలో కత్తి ఉండాలి ఆ కత్తి ఎప్పుడు ఇంకోళ్ళని కొట్టేక పనికి వస్తుంది కానీ వాడి మీద వాడికి పడదు. వాడు చావడం లే ఇంద్రుడు పోయాడు వరుణుడు పోయాడు అగ్నిదేవుడు పోయాడు వాయుదేవుడు పోయాడు అందరూ పోయారు ఓడిపోయారు ఆఖరికి సదాశివ త్రిపురాస సంహారకర్త వాడు ఇట్లా చేస్తున్నాడురా అంటే శివుడు కూడా యుద్ధానికి పోయాడు పాశుపతాశ్రం కూడా వాడి మీద పని చేయాలి.
(54:21) అప్పుడు మళ్ళీ దేవతలందరూ ఒక సమావేశం పెట్టుకొని విష్ణుమూర్తిని అడిగారు ఇంకా నువ్వు ఒక్కడే గతి విష్ణుమూర్తి నేను ఆలోచించిని అసలు బ్రహ్మ నువ్వు ఏం వరం ఇచ్చావు అప్పుడు శివ పరమాత్మ నవ్వాడంట సాక్షాత్తు నేనే ఓడిపోయి కూర్చున్నా ఈ బ్రహ్మ మామూలు వరం అన్నాడు గానీ ఇది ప్రమాదకరమైన వరము నువ్వు కూడా చంపలేవు విష్ణు అన్నాడు ఎక్కడో ఒక చోట ఉంటుందిలే నేను ఆలోచించను అని ఈయన చంపలేవని ఆయన వాళ్ళ మధ్య కూడా కొంచెం పోరాటం వచ్చింది పౌరుషాలు వచ్చాయి.
(54:59) నువ్వు చంపలేకపోతే ఏం చేస్తావు అని శివుడు విష్ణువుని అడిగాడు నేను ఒక జన్మ నీకు ఊరిగం చేస్తాను ఒకవేళ నేను చంపి వస్తే నువ్వు ఏం చేస్తావ్ నేను కూడా నీకు ఒక జన్మ ఊరిగం చేస్తాను అన్నాడు. సరే ఇప్పుడు ఇంద విష్ణుమూర్తి ఆలోచించుకున్నాడు వాడిని చంపే ఉపాయం పోయాడు ఒక వారంప రోజులు యుద్ధం చేశాడు అలసిపోయినట్లు నశించి మధుకైటబులను చంపిన టెక్నిక్ వాడాడు ఒకప్పుడు మధుకైటబులు మా అంతటి వాళ్ళు లేరు అంటే వాళ్ళని చంపలేకపోయి మీకు నేను వరం ఇస్తాను అన్నాడు విష్ణు వాళ్ళు అహంకారంతో నువ్వేంది మాకు వరం ఇచ్చేది నేనే వరం ఇస్తాను నువ్వు కోరుకో
(55:44) అన్నాడు వాళ్ళఏంకో విష్ణుమూర్తి ఏమన్నాడు నా చేతిలో చావండి అన్నాడు. ఇప్పుడు అంతా నీళ్లు ఉన్నాయి వరం ఇచ్చేసాం చావాలా అంతా నీళ్లే ఉన్నాయి నీళ్లు లేని చోట మమ్మల్ని చంపు అన్నారు. విష్ణుమూర్తి తన ఊరువులను పెంచి వాళ్ళఇద్దరిని పట్టి చంపేసాడు. వాళ్ళ మీద పడింది కాబట్టి దీని పేరు మేధిని అనే పేరు వచ్చింది భూమాత అట్లా తెలివి ఉపయోగించేంతలో విష్ణుమూర్తి అంత గొప్పవాడు లేడు.
(56:14) మ్ ఆయనకు బలం ఎక్కడి నుంచి వస్తుందిఅంటే శివ పరమాత్మ దగ్గర నుంచి వస్తా ఉంటుంది. సో ఈయన యుద్ధం చేసి ఒరే అలిసిపోయానురా ఏ మీ పాశుపతాస్త్రం వేస్తే వజ్రాయుధం వేస్తే వారుణాస్త్రం వేస్తే యమపాష వేస్తే ఏది పని చేయడం లేదు కానీ నేను ఇంతవరకు నా దగ్గర ఉన్న అసలైన ఆయుధాలు వాడలేదు అన్నాడు ఇంకా ఏముండే నీ దగ్గర బోడి అన్నాడు ఇదో ఇది సుదర్శనము అని చెప్పి తీశడు వాడు వెంటనే ఇది మహాదర్శనము అని ఇంత పెద్ద చక్రం బయట తీశరు మహా సుదర్శన ఇది పంచజన్యము అంటే ఇది దశజన్యము అని ఇంత పెద్ద శంకు తీశడు.
(56:58) ఇది కౌమోదకి గదా అనిఅంటే గనుక ఇది మహామోదకి అని ఇంత పెద్ద గద తీశడు. ఈ లైన్ లోకి వస్తున్నాడు అనుకున్నాడు. ఇది షార్జరం అనే ధనుస్సు రా అన్నాడు ఇది మహా షార్జరం అని వాడు ఇంత పెద్దది తీశడు. ఇక లాస్ట్ ఇది నందకమ అనే కత్తి రా అన్నాడు వీడి ఆవేశంలో ఇది మహానందకము అని వాడు కొంత పెద్ద కత్తి పట్టుకున్నాడు. కత్తి ఇట్లా పైకి పట్టుకోగానే విష్ణుమూర్తి ఇక్కడ జంపు కొట్టాడు.
(57:25) ఆ బరువుకు తల మీద చిన్న గీత పడింది వానికి వాని కత్తితో వాడు చచ్చిపోయాడు. విష్ణుమూర్తికి జయహో అని అందరూ వస్తున్నాడు శివ పరమాత్మ నవ్వుకుంటా కూర్చున్నాడు. ఏమయ్యా మరి పంద్యం ఏమంటే నువ్వు రామావతారం ఎత్తు నేను హనుమంతుడై వస్తాను అని అన్నాడంట నేను ఇట్లా చెప్పాను గానీ ఆ తల్లి ఒకటిన్నర గంట అద్భుతంగా ఆ వేదిక మీద ఈ హరికథను మహా గొప్పగా చెప్పింది నాకు ఆ సంవత్సరం గుర్తులేదు ఆ తల్లి పేరు గుర్తులేదు.
(58:00) దేవస్థానం వాళ్ళని ఎంక్వయరీ చేస్తే ఎప్పుడు చెప్పింది తెలుస్తుంది. ఆమె చెప్పిందంటే ఊరికే కల్పిత కథ కాదు ఎక్కడో దీనికి ఆధారం ఉంది. అట్లా ప్రతి కథ వెనకల ఇట్లాంటి ఆధారాలు ఉంది కాబట్టి హనుమంతుల వారికి చెప్తున్నట్లే అనిల పుత్రః అనుల పుత్రః అని నామధేయాలలో ఉన్నట్లే హనుమతే రుద్రాత్మకాయ హూంపట్ట అని కూడా ఉంటుంది. రుద్రుని శరీరాన్ని కాయముగా దొరి తరించిన ఓ హనుమంతుడా అని దానికి అర్థం సో ఈ కథ ప్రకారం శివ పరమాత్మ వచ్చాడు.
(58:38) ఇంకా ఎక్కడ విష్ణుమూర్తి రాక్షస సంహారం చేయాల అన్నా ఆయనకు అవసరమైన మహా బలశక్తిని అందించేది శివ పరమాత్మ అందుకే ఆంజనేయ స్వామి పంచముఖాలతో ఉంటాడు నారసింహ తల ఒకటి ఉంటుంది ఐదు ముఖాలు పంచముఖ ఆంజనేయుడు ఆ హయగ్రీవ తల ఒకటి ఉంటుంది గుర్రం తల తర్వాత సూకర పంది తల ఒకటి ఉంటుంది. కదా గరుద్మంతుని తలం ఒకటి ఉంటుంది ఆంజనేయుడు ఐదు ఐదు ముఖాలు సో ఈయన వరాహవతారం ఎత్తి భూమిని పైకెత్తాల అంటే ఆ శక్తి శివుడిది సో హనుమంతుని ముఖంలో ఆ ముఖం అది సూకర ముఖం మ్
(59:24) అట్లాగనే హయగ్రీవుడు అనే రాక్షసుడు నా లాంటి వాడితోనే నేను చావాల అని కోరుకుంటాడు విష్ణుమూర్తితో యుద్ధం చేస్తూ అలసిపోయి ధనస్సు ఇట్లా పెట్టి పడుకున్నప్పుడు వింటి నాది తెగిపోయి తల ఎగిరిపోతే అమ్మవారి ఆజ్ఞ మేరకు దేవతలంతా గుర్రపు తల అతికిస్తారు ఈయన హయగ్రీవుడై ఆ హయగ్రీవ రాక్షసుని చంపుతాడు. విష్ణుమూర్తిలో మళ్ళీ హయగ్రీవుడు అంతటి రాక్షసుని చంపే శక్తి ప్రచోదయము హనుమంతుని యొక్క ఈ హయగ్రీవ తలకు సూచన.
(1:00:00) హిరణ్య కశ్పు లాంటి వాడిని చంపాల అంటే ఆ నారసింహ శక్తి వెనకల శివ శక్తి అంటే సర్వ లోకాలను మోసే విష్ణుమూర్తినే మోయగలిగిన శక్తి గరుత్మంతుడుది సో ఆ శక్తికి ప్రధాన మూల ప్రేరకం వెనకల శివ పరమాత్మ అనేదానికే ఆంజనేయ స్వామి యొక్క పంచముఖ తత్వాన్ని పోల్చి చెప్తారు. చాలా అద్భుతం బాబాజీ చాలా అద్భుతంగా ఈ యొక్క గురు కటాక్షం గురుదేవ్కి జై చాలా అద్భుతంగా అద్భుతమైన జ్ఞానాన్ని ఈరోజు ఒక విందు భోజనం లాగా అందించారు చాలా చాలా సంతోషం ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం మరొక్కసారి
(1:00:45) మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం
No comments:
Post a Comment