మీ పిల్లలు కోపంగా ఉండడం… మీ వల్ల కూడా కావచ్చు | Shiva Chandana
Author Name:Shiva Chandana
Youtube Channel Url:https://www.youtube.com/@ShivaChandana27
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-33vu7BHi_k
Transcript:
(00:12) హలో నేను చందన ఈరోజు ఒక టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. మాకు కోపం రావడానికి కారణం మీరే అని ఒక్కొకసారి పిల్లలు అంటూ ఉంటారున్నమాట. ఇది విన్నప్పుడు సహజంగా ఏ పేరెంట్ కైనా చాలా బాధ కలుగుతుంది. అంటే వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు నన్ను రీజన్ అంటున్నారు. వాళ్ళు చూయించే నెగిటివ్ ఎమోషన్ కి లేదా వాళ్ళు చూయించే ఎక్స్ట్రీమ్ యాంగర్ కి లేదా ఫ్రస్ట్రేషన్ కి నేను కారణం అని వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తున్నారు.
(00:40) ఎవరు వాళ్ళు నా పిల్లలు నా పిల్లలు నన్ను బ్లేమ్ చేసే పొజిషన్ లో నేను ఉన్నాను అని అనగానే ప్రతి పేరెంట్ కూడా ఎలా ఫీల్ అవుతారంటే చాలా బాధగా డిప్రెస్డ్ గా ఫీల్ అవుతుంటారు అన్నమాట. సహజంగా మనం అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తికి మామూలు పాజిటివ్ ఎమోషన్స్ ఎలా వస్తాయో అలాగే నెగిటివ్ ఎమోషన్స్ కూడా వస్తాయి. అందుకు టీనేజర్స్ కానీ పిల్లలు కానీ ఎక్సెప్షన్ కాదన్నమాట.
(01:07) సహజంగా ఏమనుకుంటామ అంటే పిల్లలు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు చేర్ఫుల్ గా ఉంటారు అలా అనుకుంటూ ఉంటాం. బట్ అలా కాదు పిల్లలకు కూడా కోపం విసుగు చిరాకు ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి అవి వచ్చినప్పుడు వాటికి కారణం పేరెంట్స్ కూడా అవుతుంటారన్నమాట. ఇలా అయ్యాము అని తెలిసిన వెంటనే ఇలా వాళ్ళు బ్లేమ్ చేసిన వెంటనే మా పిల్లలు మా కోపానికి మీరు కారణం అని పేరెంట్స్ తో చెప్పిన వెంటనే సహజంగా పేరెంట్స్ ఏమనుకుంటారంటే వీళ్ళకి నా పట్ల రెస్పెక్ట్ లేదు ఇంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారు పెద్దలంటే గౌరవం లేదు ఇలా అందరి ముందు మాట్లాడతారా
(01:44) ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు ఇలా ఆలోచిస్తుంటారు అన్నమాట బస్ ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే గనుక చాలా సిచువేషన్స్ లో పిల్లలు పిల్లలు కోపంగా ఉండడానికి కారణం వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము అని వాళ్ళు నమ్మటం ఎక్కువ కేసెస్ లో ఇదే అవుతుందన్నమాట అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎవరు కన్సిడర్ చేయట్లేదు నాకు ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇక్కడ దొరకట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారున్నమాట అలా ఫీల్ అయినప్పుడు దాన్ని వాళ్ళు కోపంగా బయటికి ప్రెసెంట్ చేస్తూ ఉంటారు కోపంగా చూయిస్తూ ఉంటారు.
(02:21) దాన్ని వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేయాలో వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఆ కోపంలో నాకు ఇప్పుడు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది అని పేరెంట్స్ అడిగినప్పుడు నీకు ఎందుకు ఇంత కోపంగా ఉంది అని అడిగినప్పుడు నా కోపానికి కారణం నువ్వే అని కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు. ఇలా చెప్పినప్పుడు ఏంటంటే పేరెంట్స్ నేను ఏం చేయలేదు కదా వీళ్ళకి ఎందుకు ఇంత కోపం వస్తుంది అని అనుకుంటూ ఉంటారన్నమాట.
(02:43) ఇక్కడ చాలాసార్లు ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ వెంటనే దాన్ని డిస్కస్ చేయాలని చూస్తారు. వెంటనే వాళ్ళు ఎక్కడ తప్పుగా పేరెంట్స్ ని అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారు ఇలా వాళ్ళని వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము అనే ఉద్దేశంతో వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తారు లేదా వాళ్ళ బిహేవియర్ ని కోపం వచ్చేసి కొంతమంది అయితే కరెక్ట్ చేస్తూ ఉంటారు.
(03:09) కొంతమంది అలా కాదు ఇలా మేము చెప్పాము ఇది ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు లేదా అడ్వైస్ ఇస్తారు. ఈ మూడు సిచువేషన్స్ లో మీరు అడ్వైస్ ఇచ్చినా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసినా లేకపోతే కోపం చూయించి కరెక్ట్ చేయాలని చూసినా ఈ మూడు కేసెస్ లో కూడా మీకు నెగిటివ్ రియాక్షన్ే వస్తుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ అనేది రాదన్నమాట ఎందుకు రాదు అని మనం అర్థం చేసుకుంటే సహజంగా పిల్లలు ఎప్పుడు ఎస్పెషల్లీ టీనేజర్స్ కానీ నార్మల్ ఎవరైనా కూడా వాళ్ళు ఏం కోరుకుంటారంటే నేను చెప్పేది ఎదుటి వాళ్ళు బాగా వినాలి అని కోరుకుంటారు.
(03:44) ఆ వినకపోనప్పుడు వీళ్ళు నన్ను వినట్లేదు నాకు ప్రాపర్ ఇంపార్టెన్స్ దొరకట్లేదు నాకు ప్రాపర్ ఐడెంటిటీ ఇక్కడ లేదు అని బాధపడుతూ ఉంటారున్నమాట ఇలా పిల్లలు ఫీల్ అవుతున్నారు అని పేరెంట్ ఐడెంటిఫై చేసినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళని పూర్తిగా మాట్లాడనివ్వడం వాళ్ళు మాట్లాడినంత సేపు మీరు వింటూ ఉన్నప్పుడు ఏంటంటే ఓకే నా ఫీలింగ్స్ ఇక్కడ వాల్యూడ్ నేను ఇక్కడ మాట్లాడితే దాన్ని కన్సిడర్ చేస్తారు.
(04:12) నేను మాట్లాడిన దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అని అనుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గే అవకాశం ఉంటుందన్నమాట అలా కాకుండా మీరు వెంటనే వాళ్ళు చెప్పిన వెంటనే నాకు కోపం వస్తుంది మీ మీద అని చెప్పిన వెంటనే మీరు ఎందుకు కోపం తెచ్చుకోకూడదు లేదా కోపం రావడం ఎలా తప్పు అనే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంకా ట్రిగ్గర్ అవుతుంటారు మీ నుంచి దూరం జరుగుతూ ఉంటారున్నమాట అలా కాకుండా వాళ్ళు ఏం కోరుకుంటారు ఉన్నారు ఆ టైంలో అనే దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు ఏంటంటే బెటర్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్
(04:46) ఆఫ్ ద పేరెంట్స్ చేయకూడంది ఏంటంటే వెంటనే రియాక్ట్ అయిపోతుంటారు. అంటే కోపంగా గాని లేదా ఓకే నీ నీకు కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చింది మాకు ఎక్స్ప్లెయిన్ చెయ్. నీకు ఎందుకు ఇలా అనిపించింది? మాకు చెప్పు అని వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. లేదా నువ్వు ఇలా కోపం తెచ్చుకోవచ్చా? అలా అంటూ ఉంటారన్నమాట.
(05:10) మీరు ఎలా రియాక్ట్ అయినా కూడా మీ రియాక్షన్ పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గా ఉన్నా న్యూట్రల్ గా ఉన్నా వాళ్ళకి వెంటనే మీ నుంచి వచ్చే రెస్పాన్స్ నెగిటివ్ గానే కమ్యూనికేట్ అవుతుంది అనే విషయాన్ని ఫస్ట్ పేరెంట్ అర్థం చేసుకోవాలి. సో మరి ఏం చేసినా నెగిటివ్ గానే అవుతుంది కదా మరి ఏం చేయాలి మేము వాళ్ళు కోపంగా మా గురించి కోపం తెచ్చుకుంటున్నారు మేము ఏం చెప్పినా ఇరిటేట్ అవుతున్నారు అలాని మేము చెప్పడం మానేయాలా అనే డౌట్ పేరెంట్స్ కి వస్తూ ఉంటుంది.
(05:39) మీరు చెప్పడం మానేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వాళ్ళని మాట్లాడనివ్వడం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సిచువేషన్ లో నాకు వాళ్ళ ఫాదర్ తోనో మదర్ తోనో ఆ కిడ్ మాట్లాడుతూ నాకు ఈ విషయంలో బాగా కోపం వచ్చింది మీ మీద అని ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు లేదా చెప్పినప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఏ విషయంలో కోపం వచ్చిందని వాళ్ళు అంటున్నారు అది వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అయ్యింది అది ఎలా అర్థం చేసుకొని వాళ్ళు కోపం అని అన్నారు అన్నది మనం ఫస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారన్నమాట అలా ఎక్స్ప్లయన్ చేసినప్పుడు మనం వింటూ ఉంటే గనుక ఆ
(06:16) ఎక్స్ప్లనేషన్ ప్రాసెస్ లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే వాళ్ళకి కొంత క్లారిటీ వస్తుంది వాళ్ళకే కాదు మనకు కూడా వాళ్ళు ఎక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు ఎక్కడ మిస్ కమ్యూనికేషన్ జరిగింది అనే విషయం పట్ల ఇద్దరికీ పేరెంట్ కి కిడ్ కి ఇద్దరికీ కొంత క్లారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడటం అంతా అయిపోయాక దాన్ని డీల్ చేయడం ఈజీ అవుతుంది.
(06:38) అలా కాకుండా వాళ్ళు ఎమోషనల్ వాళ్ళు ఎమోషనల్ గా రియాక్ట్ అయిన వెంటనే మీరు కూడా ఎమోషనల్ గా ఎందుకు రియాక్ట్ అయ్యారు అని క్వశ్చన్ చేసిన మీరు ఎమోషన్ రేస్ చేసి వాళ్ళతో బిహేవ్ చేసినా వెంటనే ఏమవుతారంటే పిల్లలు కౌంటర్ అవుతారు. అలా కాకుండా వాళ్ళు ఏ విషయంలో కోపం తెచ్చుకున్నారు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలన్నమాట. పేరెంటింగ్ లో ఈ ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది.
(07:05) ఏ విషయంని పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ప్రాపర్ గా మనం గనక ఐడెంటిఫై చేస్తే ఒక కేర్ గివర్ గా లేదా పేరెంట్ గా మనం చాలా వరకు సమస్యని ఈజీగా డీల్ చేయగలుగుతాం అన్నమాట. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఈ యాంగర్ అనేది ఏదైతే ఉందో పేరెంట్స్ మీద యాంగర్ చూయించడం అనేది రిపీటెడ్ గా జరుగుతూ ఉంటుంది. అలా రిపీటెడ్ గా జరిగినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిహేవియర్ బిహేవియరల్ పాటర్న్ గా ఈ యాంగర్ ని చూపిస్తున్నారు అనే విషయాన్ని మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట.
(07:37) వన్స్ ఇది బిహేవియరల్ పాటర్న్ అయింది అని మీరు అనిపించినప్పుడు ప్రాపర్ గైడెన్స్ అండ్ హెల్ప్ తీసుకున్నప్పుడు దీన్ని బెటర్ గా డీల్ చేయగలుగుతారు అలా కాకుండా దీన్ని రిపీటెడ్ గా పిల్లలు బిహేవ్ చేస్తున్నా కూడా మనం ఇందాక డీల్ చేసినట్టు మాట్లాడి ఎక్స్ప్లైన్ చేయించి చూద్దాము అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్ కూడా ఒక్కొక్కసారి దాటిపోయి ఉంటారు అన్నమాట అలా కాకుండా మీ పిల్లలు ఏ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ కోపాన్ని ప్రాపర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే స్టేజ్ లో ఉన్నారా లేకపోతే వాళ్ళకి ఎందుకు కోపం వస్తుందో కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారా అనేది మనం
(08:11) ఐడెంటిఫై చేస్తే ఇది బిహేవియరల్ స్టేజ్ దాకా వెళ్ళిందా లేదంటే వాళ్ళు ఆ క్షణానికి లేదా ఆ ఇన్సిడెంట్ కి వాళ్ళు ఎమోషనల్ అయి ఇట్లా మాట్లాడుతున్నారా అనే విషయం క్లారిటీ వస్తుందన్నమాట. ఇలా క్లారిటీ వచ్చినప్పుడు మనం దేని దాన్ని సపరేట్ చేసుకొని డీల్ చేయగలుగుతాం. ఒకవేళ బిహేవియరల్ ఇష్యూ గా అయింది వీళ్ళ కోపం అనేది రిపీటెడ్ గా చాలా ఇన్సిడెంట్స్ కి ఇరిటేట్ అవుతున్నారు కోపం తెచ్చుకుంటున్నారు అనుకున్నప్పుడు ప్రాపర్ హెల్ప్ తీసుకున్నప్పుడు ప్రాపర్ గైడెన్స్ అండ్ హెల్ప్ తీసుకుంటే దీని పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరూ కూడా ఈజీగా డీల్
(08:44) చేయగలుగుతారు రిలేషన్షిప్ బెటర్ గా హ్యాండిల్ అవుతుంది. థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment