Tuesday, May 5, 2026

 నీ పయనపు బాటను నేనే 
నీ బాటకు గమ్యం నేనే 
నీ దారిని దీపం నేనే 
నిను వదలని తోడుని నేనే!

స్వార్థం కొంత తగ్గించి 
స్వారస్యం కాస్త పెంచి 
సహకారం ఎపుడూ ఉంచి 
సహనం ఓర్పు నేర్చి....

స్వతంత్రం  దేనిలోనో 
స్వేచ్ఛ ఎంతవరకో 
స్వలాభమ్  ఎంత మేరకో 
సంస్కారం ఏమిటో తెలిసి...

చిన్ని సవరణలు 
కొన్ని సర్దుబాట్లు 
మరింత మంచితనం 
చాలినంత  దయ కరుణ కలిగి...

నవ్వుతో  స్నేహంగా 
చూపుతో పరిచయం గా 
మాటతో పలకరింపుగా 
మంచితో కలుపుగోలుగా...

మార్చుకో నిన్ను నీవు 
నేర్చుకో కలిసి సాగడం 
చేర్చుకో మంచి గుణాలు 
నీతోనే  నేలేనా ఏళ్లుగా....

అంటున్న రేపటి వెలుగుకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

బృంద 🙏

No comments:

Post a Comment