మౌనం వెనుక ఉన్న మహాశక్తి! | The Power of Silence | Seetakanth Talkie
Author Name:SEETAKANTH TALKIE
Youtube Channel Url:https://www.youtube.com/@SEETAKANTHTALKIE
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mWO_pO_DcNE
Transcript:
(00:00) ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటో తెలుసా మాట్లాడకపోవటం గురించి అంటే మౌనం గురించి మౌనం యొక్క విలువ గురించి ఆ మౌనం ఇచ్చే శక్తి గురించి సృష్టిలో అత్యంత సులభమైన పని ఏంటో తెలుసా ఎవరైనా మనల్ని ఏమైనా అనగానే కోపంతో గొంతు పెగిల్చి మాట్లాడటం బుర్రలోకి ఏది వస్తే అది అనేయటం సృష్టిలో అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా మనసులో సముద్రంంతా అగ్ని పర్వతం బద్దలు అవుతున్న సరే పెదాలు బిగించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఒక ఫేమస్ సైకాలజిస్ట్ లావోజా ఏమన్నాడో తెలుసా సైలెన్స్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ గ్రేట్ స్ట్రెంత్ మౌనం అనేది ఎవరు జయించలేని ఒక
(00:35) మహా శక్తి కానీ అది ఎలా సాధ్యం అది అర్థం అవ్వాలంటే మీరు సముద్రం లోతుల్లోకి వెళ్ళాలి. పైకి అలలతో ఎంతో అల్లకల్లోలంగా ఎంతో భయంకరమైన శబ్దంతో ఉన్నా సరే సముద్రం అడుగున ఒక ప్రశాంతమైన సుశాలమైన నిశశబ్దం ఉంటుంది. ఆ నిశబ్దం సముద్ర బలహీనత కాదు అది దాని లోతు మీ మౌనం కూడా అంతే ఎవరైనా మిమ్మల్ని విమర్శించినప్పుడు మీరు మాట్లాడకుండా ఉంటే అది మీ చేతగానితనం కాదు అదిఒక నిగ్రహం అది మీ బలం అది మీ లోతు మన పెద్దలు అంటారు పారే ఏరు వాగే నోరు వాటంతట అవి ఆగవు అని ఉదృతంగా సాగే నదిని అలా వదిలేస్తే వరదలై ఊరినే ముంచేస్తుంది.
(01:10) అదే ఆ ఉదృతికి అడ్డంగా ఒక ఆనకట్ట కడితే అది ఎన్నో ఊళ్లకు కరెంట్ ఇస్తుంది వేలాది ఎకరాలకు నీరందిస్తుంది. సరిగ్గా మన నోరు కూడా అంతే వాగే నోటికి మౌనం అనే ఆనకట్ట వేయగలిగితే అది పగిలిపోయే బంధాల్ని నిలబెడుతుంది మీ వ్యక్తిత్వానికి ఒక బొరువుని ఇస్తుంది మీకు ఒక పరువుని ఇస్తుంది మీకు ఒక కీర్తిని ఇస్తుంది. అసలు నోరు తెరిచి వాదించడం మానేసి మౌనంగా ఉంటే జీవితంలో బంధాలు ఎలా నిలబడతాయో ముఖ్యంగా పరువు కోసం ప్రాణాలు ఇచ్చే ఒక పల్లెటూరి కుటుంబం ఆ మౌనం వల్ల ఎలా గెలిచిందో ఒక కథ ద్వారా చెప్తాను వినండి.
(01:43) అది ఒక పల్లెటూరు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే ఒక పెద్ద వ్యవసాయ కుటుంబంలో జరిగిన కథ ఆ ఇంటి పెద్ద కోడలు పేరు జానకి ఇంటి బాధ్యతలతో పాటు పొలం పనులు వ్యవసాయం అన్నీ ఆమె చేతుల మీదగానే జరుగుతాయి. అత్తమామల్ని దేవుళ్లుగా చూసుకుంటుంది ఊళలో వాళ్ళందరికీ కూడా జానకి అంటే ఎంతో గౌరవం ఎందుకంటే ఆమె తీసుకునేది బాధ్యత చలాయించే పెత్తనం కాదని వాళ్ళందరికీ తెలుసు కానీ ఆ గౌరవం ఆ ఇంపార్టెన్స్ చూసిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన చిన్న కోడలు స్వాతికి విపరీతమైన అసూయ కలిగింది.
(02:13) నేను ఈ ఇంటి కోడల్నే కదా నా మీద ఈవిడ పెత్తనం ఏంటి అని లోలోపల రగిలిపోయేది. ఎలాగైనా పెద్ద కోడల్ని చెడ్డదానిగా మిగిల్చాలని ఆ ఇంట్లో ఆమె స్థానాన్ని తాను లాగేసుకోవాలని లేని పోని పథకాలు వేసేది. ఎన్నో సార్లు జానకి చేసే పనులని చెడగొట్టాలని చూసింది. అవన్నీ ఎవరు చేస్తున్నారో తెలియకపోయినా జానకి తన తెలివి తేటలతో ఆ సమస్యలని ఎప్పటికప్పుడు సైలెంట్ గా అధికమించేది.
(02:36) ఆ పల్లెటూరులో ఆ కుటుంబానికి 50 ఏళ్ల పరువు ఉంది. ఆ ఊరి సర్పంచ్ అయిన వాళ్ళ మామగారు ప్రతి ఏట తొలకరి జల్లులు పడగానే ఊర్లో రైతులందరికీ స్వచ్ఛమైన విత్తనాలు పంపిణీ చేసే గొప్ప సాంప్రదాయం ఆ కుటుంబాన్ని ఆ విత్తనాల నాణ్యత మీదే ఆ ఊరి రైతుల బతుకంతా ఆధారపడి ఉంటుంది. ఆ విత్తనాల పంపిణీ బాధ్యత మామగారు జానకి అప్పగించారు. ఇక్కడే స్వాతి ఒక భయంకరమైన ప్లాన్ వేసింది.
(02:59) రేపు ఉదయం రైతులందరికీ విత్తనాలు పంచాలి అనగా రాత్రికి రాత్రే ఆ మంచి విత్తనాల బస్తాల్లో తను పక్క ఊరు నుంచి రహస్యంగా తెచ్చిన పురుగు పట్టిన పనికి రాని నకిలి విత్తనాలను కలిపేయాలి అనుకుంది. ఆ విత్తనాలు గనుక ఊర్లో వాళ్ళందరూ నాటితే పంటలు నాశనం అయపోతాయి. పల్లెటూరు జనం కోపంతో వాళ్ళ ఇంటిమీద పడతారు 50 ఏళ్ల పొరువు మట్టిలో కలిసిపోతుంది.
(03:22) అప్పుడు బాధ్యత సరిగ్గా చూసుకోలేదు అని జానకిని మామగారు జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి తరిమ వేస్తారు. ఇది స్వాతి వేసిన ప్లాన్ రాత్రిరెండు గంటల సమయం అందరూ పడుకున్నాక స్వాతి మెల్లగా గోడౌన్లోకి వెళ్లి ఆ నకిలి విత్తనాలని కలుపుతుంది. సరిగ్గా అప్పుడే లైట్ ఆన్ అయింది గుమ్మం దగ్గర జానకి నిలబడి ఉంది. స్వాతికి గుండె ఆగిపోయినంత పనింది.
(03:43) ఇన్నాళ్ళు ఆ ఇంట్లో జరిగిన సమస్యలన్నింటికీ కారణం జానకి ఆ క్షణంలో అర్థంయపోయింది. స్వాతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మరుసటి రోజు ఉదయం గోడౌన్లో పక్కన పడేసి ఉన్న నకిలి బస్తాలు చూసి మామగారు రగిలిపోయాడు. ఎవరు చేశారు ఈ ద్రోహం వందల మంది రైతుల కడుపు కొట్టి మన 50 ఏళ్ల పరువు తీయాలని చూసిన ఆ పాపిష్టి వాడు ఎవడు వాడిని ఊరి మధ్యలో అందరి ముందు రచ్చబండ కట్టేస్తాను అని ఇల్లంతా దద్దరిల్లేలా అరుస్తున్నాడు.
(04:05) హాల్లో అందరూ నిలబడి ఉన్నారు పల్లెటూరులో పొరువు అంటే ప్రాణం కంటే ఎక్కువ ఇప్పుడు జానకి నోరు తెరిచి ఒక్క మాట చెప్తే చాలు స్వాతిని రచ్చబండ దగ్గర నిలబెట్టి ఊరు నుంచి గెంటేస్తారు. స్వాతి పని ఇంకా అయిపోయినట్టే స్వాతికి కూడా అర్థమయింది ఇక ఆ ఇంట్లో తనకి స్థానం ఉండదని ఇన్నాళ్ళుగా కుటుంబానికి ఇంత నష్టం చేయాలని చూస్తున్న ఆ చిన్న కోడల గురించి అందరి ముందు చెప్పాలని జానకి అడుగు ముందుకువేసింది.
(04:27) మామయ్య ఇదంతా చేసింది అని చెప్పబోయి ఆగిపోయింది. ఒక్క క్షణం ఆలోచించింది స్వాతి వైపు చూసింది మౌనంగా ఉండిపోయింది. పక్క ఊరిలో గిట్టని వాళ్ళు ఎవరో మన పరువు తీయాలని ఈ బస్తాలు తీసుకొచ్చి పెట్టారు మామయ్య కానీ సమయానికి నేను చూశాను కాబట్టి వాటిని పక్కన పడేసాను మన విత్తనాలకు ఏమీ కాలేదు అందుకే ఎప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్పి ఊరుకుంది.
(04:48) ఆ మాట వినగానే మామగారు నువ్వు ముందే తెలుసుకున్నావు కాబట్టి మన పరువు నిలబడింది తల్లి లేదంటే ఈ ఊర్లో మనం తలఎత్తుకొని తిరిగేవాళ్ళం కాదు అని జానకిని పొగిడారు. కానీ స్వాతికి ఏమి అర్థం కాలేదు. తనని ఇంట్లో నుంచి గెంటేసే అవకాశం వచ్చిన జానకి ఎందుకు సైలెంట్ గా ఉండిపోయింది అనే డౌట్ తో జానకి ఒంటరిగా ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి జానకిని అడిగింది.
(05:08) ఎందుకక్క నన్ను కాపాడావు పల్లెటూర్లో పరువు ఎంత సెన్సిటివ్ విషయమో నీకు తెలుసు నిజం చెప్తే నీ స్థానం పెరిగేది కదా అని అడిగింది. అప్పుడు జానకి ఎంతో ప్రశాంతంగా ఇచ్చిన సమాధానం వింటే నీకు కళ్ళెంటో నీళ్లుు రావచ్చు. స్వాతి ఇన్నాళ్ళు నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టావు నిన్ను అసలు క్షమించకూడదు. ఈరోజు నేను నోరు తెరిచి ఒక్క మాట చెప్పానంటే ఈ ఊరు జనం నిన్ను రచ్చబండ దగ్గర నిలబెడతారు ఆ తర్వాత మామయ్య నీకు విడాకులు ఇప్పించి బయటకు గెంటేస్తాడు నా కోపం చల్లారేది నేను గెలిచేదాన్ని కానీ అప్పుడే ఆలోచించాను నీ గురించి చెప్తే నీ జీవితంతో పాటు నాకు తమ్ముడు లాంటి నా మరిది జీవితం కూడా
(05:40) రోడ్డున పడిపోతుంది. ఒక ఆడదానిగా ఇంకో ఆడదాని సంసారాన్ని నేను ఎలా కోల్చగలను స్వాతి నిజానికి నువ్వు చాలా మంచిదానివి కేవలం నా మీద అసూయతో ఆ మాయలో పడి అలా చేశవు ఆ ఒక్క అసూయను పక్కన పెడితే నువ్వు నాకంటే మంచి కోడలు అవుతావ్ నా బిడ్డ నీ స్థానంలో ఉండి ఇలాగే ఏదైనా తప్పు చేస్తే కడుపులో పెట్టుకొని బుద్ధి చెప్తాను కానీ నడి రోడ్డు మీదకి గెంటైన కదా నువ్వు నా తోడి కోడలవి కాదు నా సొంత చెల్లెల లాంటి దానివి అని చెప్పింది అంతే ఆ క్షణంలో స్వాతిలోని అసూయ అహంకారం అన్ని కరిగిపోయి కన్నెళ్ళ రూపంలో బయటిక వచ్చాయి జానకి కాళ్ళమీ మీద పడిపోయి క్షమించమని
(06:12) ఏడ్చేసింది. ఆ రోజు నుంచి స్వాతి పూర్తిగా మారిపోయింది. జానకిని తోటి కోడలుగానే కాకుండా ఒక కన్న తల్లిలా చూసుకోవడం మొదలు పెట్టింది. ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు జానకి మౌనంగా ఉండకుండా తన మాటలతో నెగ్గాలని నిజం చెప్పేసి ఉంటే ఏమయ్యేది? పల్లెటూరి రచ్చబండ ముందు తన చిన్న కోడలి మీద ఆమె గెలిచేదేమో కానీ ఆమె కుటుంబం మాత్రం ఓడిపోయేది.
(06:31) తను సైలెంట్ గా ఉండిపోయింది కాబట్టి ఈరోజు తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది ఒక కోడలి మనసుని శాశ్వతంగా గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ ఏం అర్థమైంది ఒక వాదనలో గెలవడం కన్నా ఒకరి మనసుని గెలవటం అతి పెద్ద గెలుపు అని ఒక సినిమాలో పవర్ఫుల్ డైలాగ్ ఉంది అది మీ అందరికీ తెలుసు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అని జానకి తెలుసు తన శత్రువుల దగ్గర ఆమె నెగ్గాలి కానీ ఇది తన తోడికోడల విషయం తన కుటుంబ విషయం తన సొంత విషయం ఇక్కడ తాను ఒక మెట్టు తగ్గి మౌనంగా ఉంటే పోయేదేమీ లేకపోగా ఆ తగ్గుదలే ఆ మౌనమే తన కుటుంబాన్ని నిలబెట్టింది తన తోడికోడని
(07:06) మనసును గెలుచుకుంది. చాలామంది అనుకుంటారు మౌనం అంటే మాటలు రాక నోరు మూసుకొని కూర్చోవడం అని కానీ అది తప్పు మౌనం అనేది ఒక ఛాయిస్ మీ దగ్గర చెప్పటానికి మాట ఉంది లాజిక్ ఉంది ఎదుటివాడిని ఓడించడానికి వాదన ఉంది. కానీ మీరు కాన్షియస్ గా డిసైడ్ అవుతున్నారు ఇప్పుడు కాదు ఇక్కడ కాదు ఈ వ్యక్తితో కాదు అని అది బలహీనత అస్సలు కాదు అదిఒక సర్జికల్ ప్రెసిషన్ సమాజంలో కూడా చాలా మంది పనికిమాలిన విషయాల మీద తమ అహంకారం కోసం మీ మీద గొడవకు వస్తుంటారు మిమ్మల్ని రచ్చగొడుతుంటారు అప్పుడు మీరు కూడా వాళ్ళతో సమానంగా అరుస్తూ వాదనకు దిగితే ఏమవుతుంది సరిగ్గా ఇక్కడే మార్క్
(07:40) ట్వెన్ గారు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు. అదేంటంటే నెవర్ ఆర్గ్యూ విత్ ఏ ఫూల్ ఆన్ లుకర్స్ మే నాట్ బి ఏబుల్ టు టెల్ ద డిఫరెన్స్ మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకు చూసేవాళ్ళకు ఇద్దరిలో ఎవరు మూర్ఖుడో తెలియదు అని మీరు ఒక మూర్ఖుడితో వాదించడం మొదలు పెడితే మీరు కూడా వాడి స్థాయికి దిగజారిపోయినట్టే మీరు వాడికి ఇస్తున్న అతి పెద్ద ఆయుధం మీ మాట కానీ ఎదుటివాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఒక్కసారి మీరు చిరునవ్వు నవ్వి మౌనంగా ఉండి చూడండి ఆ మౌనానికి వాళ్ళ దగ్గర సమాధానమే ఉండదు.
(08:09) జూడో అనే మార్షల్ ఆర్ట్ లో ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది. ఎదుటివాడు మీ మీదకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాడిని తిరిగి కొట్టకూడదు జస్ట్ పక్కకు తప్పుకొని వాడి శక్తిని వాడి మీదే తిప్పి కొట్టాలి అని మన జీవితంలో మౌనం కూడా అదే పని చేస్తుంది. ఎవడైనా మీ మీద విమర్శలు చేస్తున్నప్పుడు మీరు సైలెంట్ గా ఉంటే వాడి ఆవేశమే వాడికి ఆయుధంగా మారి వాడిని ఓడిస్తుంది.
(08:28) అలా అని మౌనం ప్రతి చోట సొల్యూషన్ కాదు మీ కళ్ళెదుట ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా మీ వాళ్ళకు ఒక ఆపద వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ప్రశ్నించాలి గొంతు విప్పాలి. అన్యాయం జరుగుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా తప్పే కానీ మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక ఆయుధమంత పదును ఉండాలంటే మిగతా అనవసరమైన ప్రతి చోట మీరు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి.
(08:47) ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో వాదించే వాడి మాటని ఎవర పట్టించుకోరు. కానీ పనికి మాలిన వాదనల్లో మౌనంగా ఉండేవాడు రేపు అవసరమైనప్పుడు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడితే ఆ మాటకు 100 రెట్లు బలం ఉంటుంది. అప్పుడే మీ మౌనానికి మీ మాటకి రెండిటికీ విలువ పెరుగుతుంది. లేనిపోని విషయాల మీద వాదించే బదులు ఖాళీ సమయాల్లో కాసేపు కళ్ళు మూసుకొని ఒక హనుమాన్ చాలీసానో ఒక లలిత సహస్రనామమో చదివి చూడండి మీ బ్రెయిన్ కి ఎంత స్టెబిలిటీ వస్తుందో ఆ మౌనం మీకు ఎంత పవర్ ని ఇస్తుందో మీకు అర్థమవుతుంది.
(09:17) మౌనం అంటే చేతగానితనం కాదు ఎదుటివాడి ఆవేశాన్ని వాడి ఉచ్చుని మన నిగ్రహంతో మన మౌనంతో ఎలా తిప్పి కొట్టొచ్చో ఒక భయంకరమైన శత్రు స్థావరంలో ఆచరించి చూపించారు. ఇప్పుడు అదేంటో ఎక్కడ జరిగిందో చెప్పుకుందాం కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన రామాయణంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది. చాలామంది దాన్ని హనుమంతుడు లంకని కాల్చాడు అని మాత్రమే గుర్తుంచుకుంటారు.
(09:37) కానీ ఆ లంకను కాల్చడానికి ముందు అక్కడ జరిగిన ఒక భయంకరమైన నిశశబ్దం గురించి ఆ మౌనం వెనక ఉన్న అతి పెద్ద రాజనీతి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా ఆ సందర్భం అర్థం చేసుకోండి హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్ళాడు రాముడి దూతగా ఒంటరిగా శత్రువుల రాజధానిలో అడుగుపెట్టాడు సీతమ్మను చూశాడు ఆ తర్వాత ఆయన రావణుడి సైన్యానికి పట్టుబడ్డాడు బందీగా రావణుని సభలోకి తీసుకురాబడ్డాడు.
(10:01) ఒక్కసారి ఆ సభలో ఉన్న వాళ్ళు ఎవరో ఊహించుకోండి ఒకవైపు సాక్షాత్తు రావణుడు అంటే లంకేశ్వరుడు దశగ్రీవుడు మహా పండితుడు అజయుడు ఇంకా ఆయన పక్కన కూర్చున్న వాళ్ళు ఇంద్రుడినే గెలిచిన మేఘనాధుడు ఇంద్రజిత్ అంటాం మనం ఇక తమ్ముడు పర్వతం లాంటి కుంభకర్ణుడు ఒక్కొక్కరు ఒక మహా సైన్యానికి సమానం ఇంకోవైపు హనుమంతుడు ఆ భయంకరమైన రావణుని సభలో ఒంటరిగా నిలబడ్డ దూత రావణుడు హనుమంతుడిని చూశడు జగతాళిగా నవ్వాడు నువ్వు ఎవడవి ఈ లంకలోకి ఎలా వచ్చావు అంటూ అత్యంత దారుణంగా పురుషమైన పదాలతో కించపరుస్తూ మాట్లాడుతున్నాడు.
(10:36) అక్కడ సభలో ఉన్నది ఎంత గొప్ప వాళ్ళయినా సరే హనుమంతుడికి వాళ్ళని ఎదుర్కునే శక్తి ఉంది కానీ ఆయన మౌనంగా ఉన్నాడు ఎందుకు అలాగే రావణుడు కూడా హనుమంతుడిని వెంటనే చంపమని ఆజ్ఞాపించొచ్చు కానీ అలా చేయలేదు ఎందుకు చేయలేదు ఇక్కడే ఒక లాజిక్ ఉంది. తన శత్రువు పంపిన వాడిని పైగా తన చెరపట్టిన సీతమ్మ దాకా వెళ్ళిన వాడిని ఎలాగైనా చంపేయాలి.
(10:57) కానీ సభలో ఉన్న ధర్మం తెలిసిన వాళ్ళు దూతను చంపటం ధర్మం కాదు అంటున్నారు కానీ రావణాసుడు సామాన్యుడు కాదు మహా తెలివైనవాడు తన సభలోకి వచ్చినవాడు ఒక దూత రాజనీతి ప్రకారం ఒక దూతను చంపటం ధర్మ విరుద్ధం అని ఆయనకి తెలుసు అందుకే రావణాసుడు ఒక భయంకరమైన ట్రాప్ వేశడు హనుమంతుడిని తన మాటలతో దారుణంగా రెచ్చగొడితే ఆ ఆవేశంలో హనుమంతుడు అదుపు తప్పి తిరిగి దాడికి దిగుతాడు ఎప్పుడైతే హనుమంతుడు ఆవేశపడి దాడి చేస్తాడో అప్పుడు తన దూత కాకుండా పోతాడు ఒక శత్రువు అవుతాడు అప్పుడు రాజనీతి అడ్డు రాదు హనుమంతుడిని సులువుగా చంపేయొచ్చు ఇది రావణాసుడి ప్లాన్ కానీ హనుమంతుడు ఆ ఉచ్చులో పడలేదు.
(11:31) హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు మాటలకి అధిపతి ఆయన ఎవరితో ఎంత మాట్లాడాలి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఆయనకు తెలిసినంతగా ఈ క్రియేషన్ లో ఇంకెవరికీ తెలియదు. తన స్వామి రాముడి దగ్గర ఎంత వినయంగా మాట్లాడాలో తెలుసు తల్లి సీతమ్మ దగ్గర ఎంత బాధ్యతగా మాట్లాడాలో తెలుసు అలాగే అహంకారి అయిన రావణాసుడి దగ్గర ఎంత మౌనంగా ఉండాలో కూడా తెలుసు.
(11:54) అందుకే రావణుడు గంటల తరబడి రచ్చగొడుతున్న ఆవేశపడేలా మాట్లాడుతున్న సరే హనుమంతుడు కోపం తెచ్చుకోలేదు అసలు నోరు విప్పలేదు. ఆయన మౌనమే రావణుడి ప్లాన్ కి అతి పెద్ద సమాధానం ఇచ్చింది రావణుడి ఎత్తుగడని చిత్తు చేసింది. మౌనంగా ఉండటం అంటే భయపడటం కాదు తన దగ్గర మాటలు లేక కాదు ఆయన చివరగా ఫైనల్ గా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు. కళ్ళు తెరిచి రావణుడి కళ్ళలోకి సూటిగా చూసి అత్యంత ప్రశాంతంగా ఒక్కటే మాట చెప్పాడు.
(12:22) నేను రాముడి దూతని సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం మాత్రమే వచ్చాను నా రాముడు వస్తాడు నిన్ను సంహరిస్తాడు తన సీతమ్మని తీసుకెళ్తాడు అని మాత్రమే చెప్పాడు. ఆ మాటలో ఎంత పవర్ ఉందో ఆలోచించండి చుట్టూ రాక్షస మోకలు మహా మహా వీరులు అజయుడైన రావణుడు ఆ సభలో బందీగా ఉండి కూడా హనుమంతుడి గొంతులో భయం లేదు బెరుకు లేదు అంత ధైర్యంగా నిలబడి ఆ మాట చెప్పాడంటే తన రాముడి మీద ఆయనకు ఎంత అపారమైన నమ్మకం ఆ నమ్మకమే ఆయన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునే నిగ్రహాన్ని ఇచ్చింది ఆ మౌనాన్ని ఇచ్చింది.
(12:56) హనుమంతుడి ఆ నిశశబ్దం ఆ ఒక్క మాట రాముడి శక్తి సామర్థ్యాలు ఏంటో రావణుడికి కళ్ళకు కట్టినట్లు తెలిసేలా చేశయి. అప్పటిదాకా రెచ్చిపోయిన రావణుడి అహంకారపు లోతుల్లో మొదటిసారి ఒక భయం పుట్టింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఆవేశంలో ఉన్న వాడి దగ్గర మనం నోరు తెరిచి వాదించడం కాదు. మౌనంగా ఉంటేనే వాడి మైండ్ బ్లాక్ అవుతుంది.
(13:16) ఒక్కోసారి మనం మాట్లాడే 100 మాటల కంటే మనం పాటించే మౌనమే మన శక్తిని ఎదుటి వాళ్ళకి 100 రేట్లు ఎక్కువగా తెలిసేలా చేస్తుంది. యుద్ధంలో బాణం వదలటం గొప్ప కాదు ఎప్పుడు వదలాలో ఎప్పుడు వదలకుండా ఆపుకోవాలో తెలుసుకోవడమే అసలైన విద్య. ముగించే ముందు ఒక మాట ఒక ప్రశ్నని మీకు వదిలి పెడుతున్నాను ఆ రోజు నేను ఆ ఒక్క మాట అనకుండా ఉండి ఉంటే నా జీవితం నా బంధం ఇంకోలా ఉండేదేమో అని మీరు ఇప్పటికీ బాధపడుతున్న ఒక విషయం ఉంటే దాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకోండి ఆ రోజు మీరు కోపంతో ఆ మాట మాట్లాడి సాధించింది ఏంటి నిజంగా ఆ మాట మాట్లాడకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది చాలాసార్లు నోరు తెరిచి మాట్లాడకుండా
(13:51) ఉండటమే ఆ క్షణంలో మీరు చేయగలిగే ఒక అత్యుత్తమమైన పని అహంకారంతో ఎదురొచ్చే మూర్ఖులతో వాదనలకు దిక్కండి మీ మౌనంతో మీ నిగ్రహంతో వాళ్ళని జయించడం నేర్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను తుఫాన్ రాకముందు సముద్రం ఎంతో ప్రశాంతంగా మౌనంగా ఉంటుంది. అది దాని బలహీనత కాదు అది దాని సంసిద్ధత దాని రెడీనెస్ మీ మౌనం మీ చేతగానితనం కాదు.
(14:14) అది మీరు ఇంకా డిస్కవర్ చేయని మీ దగ్గర ఉన్న అతి పెద్ద ఆయుధం అది ఎవరూ జయించలేని మీ మహా శక్తి ఈ ఎపిసోడ్ మీ గుండెను తాకి ఉంటే ఈ రోజు నుంచి మీరు ఎవరి ముందు మీ మౌనాన్ని బ్రహ్మాస్త్రంలో వాడాలి అని డిసైడ్ అయ్యారో కింద కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఆవేశపడి వాదించి బంధాలని పాడు చేసుకుంటున్న మీ ప్రతి స్నేహితుడికి ఈ పాడ్కాస్ట్ ని షేర్ చేసి వాళ్ళలో ఒక రియాలిటీ చెక్ తీసుకురండి మరొక అద్భుతమైన ఎపిసోడ్ తో మళ్ళీ కలుస్తాను మర్చిపోకండి మీ మాటల్ని ఆదా చేసుకోండి మీ నిగ్రహాన్ని ఆయుధంగా మార్చుకోండి.
(14:44) జై హనుమాన్ జై శ్రీరామ్
No comments:
Post a Comment