Socrates Explained: Why “I Know Nothing” Is Ultimate Intelligence || Suresh Podcast
Author Name:Think Telugu Podcast
Youtube Channel Url:https://www.youtube.com/@ThinkTeluguPodcast
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6JZwm6Ragzg
Transcript:
(00:05) ఇది ఏ ఏ కాలం సో చిన్న పిల్లాడికి కూడా మానవజాతి జ్ఞానంఅంతా మునివేలపై అందుబాటులో ఉంది. సో ఇలాంటి కాలంలో ఎవరైనా ఏదైనా అడిగితే నాకు తెలియదు అని చెప్పడం ఒక మూర్ఖత్వంగా ఒక సిగ్గుపడాల్సిన విషయంగా సొసైటీ బోధిస్తుంది. అది అప్పుడే కాదు అది ఏ కాలంలో అయినా నాకు అన్నీ తెలుసు అనే వాన్నని ఒక జీనియస్ గా నాకేం తెలియదు అనే వాడిని ఒక దద్దముగా ట్రీట్ చేస్తుంది.
(00:33) కానీ రెండున్నర ఏళ్ల సంవత్సరాల క్రితం మాసిపోయిన గడ్డంతో చిరిగిపోయిన చొక్కాతో వీధుల్లో తిరిగిన ఒక కురు వృద్ధుడు నాకేం తెలియదు అన్నందుకు ఫిలాసఫీ అతన్ని రెస్పెక్ట్ చేసింది. చరిత్ర అతనికి కిరీటం పెట్టింది. అతన్ని అమరుండు చేసింది. ఎందుకు? సోక్రటీస్ కాలంలో ఏయన్స్ లో సోఫిస్ట్లు ఉండేవారు వాళ్ళు మనీ తీసుకొని ఎవరికీ ఏ విషయం గురించియనా నేర్పేవారు ఎందుకంటే వాళ్ళకన్నీ తెలుసు జస్టిస్ గురించి సక్సెస్ గురించి లైఫ్ గురించి అండ్ డెమోక్రసీ గురించి ఇలా ప్రతిదీ తెలుసు వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో నిండిన వ్యక్తులు సరిగ్గా ఆ టైం లో
(01:13) సోక్రటీస్ వచ్చి ఐ డోంట్ నో అన్నాడు. ఈ మాట వినడానికి చాలా వినమ్రంగా ఉండొచ్చు బట్ రియాలిటీలో అది ఒక ప్రోవకేటివ్ స్టేట్మెంట్ ఎందుకంటే అతను అక్కడితో ఆగలేదు నాకే కాదు మీకు కూడా ఏం తెలియదు అన్నాడు తమకు అన్నీ తెలుసు అని నమ్మిన వాళ్ళకు తమ అజ్ఞానాన్ని వారి ముఖానే చూపించిన వ్యక్తి ఎంత ప్రమాదకారి అవుతాడో ఆలోచించు.
(01:40) ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో డైలాగ్స్ అనే బుక్ లో సోక్రటీస్ మెనో అనే స్టూడెంట్ మధ్య జరిగిన ఒక కన్వర్జేషన్ ఉంటుంది. మెనో అనేవాడు ఒక యువ సైనిక నాయకుడు అతను ఆ కాలపు అత్యంత ప్రసిద్ధి చెందిన సోఫిస్ట్ జార్జియస్ దగ్గర చదివాడు. ఇప్పుడు అతను సోక్రటీస్ ని ఒక ప్రశ్న అడుగుతాడు. మనం సక్సెస్ ని ఎక్సలెన్స్ ని నేర్పించవచ్చా? ఈ ప్రశ్నకి సోక్రటీస్ డైరెక్ట్ గా సమాధానం ఇవ్వడు.
(02:08) దానికి బదులు మెనోని అసలు సక్సెస్ అంటే ఏంటో ముందు మనకు తెలుసా అన్నాడు. బెజోస్ లో కోట్లు సంపాదించడం సక్సెస్ నా లేదా మదర్ తెరసాలా బేదవాళ్ళకు జీవితమంతా సేవ చేయడం సక్సెస్ నా ఈ రెండు ప్రశ్నలు సక్సెస్ అనే ఒకే మాటని అడుగుతున్నాయి. కానీ వాటి డైరెక్షన్ పూర్తి ఆపోజిట్ గా ఉన్నాయి. ఇక్కడ మెనో సక్సెస్ ని డిఫైన్ చేసినప్పుడు ఎలా ఉందంటే పవర్ కంట్రోల్ మనీ గెట్టింగ్ వాట్ యు వాంట్ సో మెనో తనకి తెలుసు అని అస్ూమ్ చేసుకొని ప్రశ్న వేశడు.
(02:38) కానీ అతని అజంప్షన్ లోనే అతని అసలైన అజ్ఞానం తాగుంది. బట్ అజంప్షన్ వేరే నాలెడ్జ్ వేరే అది తెలియకపోతే నువ్వు ఎప్పటికీ ఏది తెలుసుకోలేవు. ఇప్పుడు అసలు ప్రశ్న దగ్గరికి వద్దాం. సోక్రటీస్ అజ్ఞానాన్ని మనం ఎందుకు గౌరవించాలి? అతనికి వేలాది పేజుల డైలాగ్స్ ఉన్నాయి వాటిలో పదే పదే నాకు తెలియదు అని చెప్తాడు కానీ ఒక్కసారి మాత్రం నిజంగా నాకు తెలుసు అని చెప్పాడు.
(03:05) అదేంటంటే ఒపీనియన్ కి నాలెడ్జ్ కి మధ్య తేడా ఉంటుందని ఇది చాలా చిన్న మాటలా ఉండొచ్చు కానీ ఫిలాసఫీకి ఇదిఒక పునాది రాయి ఎందుకంటే మనకి చాలా ఒపీనియన్స్ ఉంటాయి దేశం గురించి దేవుడి గురించి ధర్మం గురించి లైఫ్ గురించి ఇలా చాలా ఉంటాయి. ఆ ఒపీనియన్స్ మనకు చాలా నమ్మకంగా అనిపిస్తాయి. అవి మన ఐడెంటిటీతో ముడిపడి ఉంటాయి.
(03:30) కానీ అవి లాజికల్ గా ఎగ్జామిన్ చేసినవి కావు క్రాస్ కోచింగ్ చేసినవి కావు అండ్ టెస్ట్ చేసిన నాలెడ్జ్ కాదు. సో సోక్రటీస్ ఈ రెండింటి మధ్య తేడా చూపించాడు. ఒపీనియన్ నాలెడ్జ్ అని నమ్మడమే అత్యంత ప్రమాదకరమైన అజ్ఞానం అని చెప్పాడు. అండ్ సిరో ఏమన్నాడంటే సోక్రటీస్ ఫిలాసఫీని స్వర్గం నుండి భూమికి దింపాడు అన్నాడు. అంటే ఏంటంటే అతనికి ముందున్న ఫిలాసఫర్స్ కాస్మాలజీ గురించి నాచురల్ వాల్డ్ గురించి అండ్ ఆటమ్స్ గురించి ఆలోచించారు.
(03:59) బట్ సోక్రటీస్ మాత్రం ఆ ప్రశ్నలు వేయడానికి ముందు ఒక ప్రశ్న అడుగు నువ్వు ఎలా జీవించాలి నీకేం తెలుసు ఏం తెలియదు న్యాయం అంటే ఏంటి మంచి అంటే ఏంటి ఎక్సెట్రా ఎందుకంటే ఈ ప్రశ్నలు కాస్మాలజీ కంటే తక్కువఏం కాదు ఇవి నీ రోజు వారి జీవితాన్ని నిర్ణయిస్తాయి. ఈ ప్రశ్నల్ని గాలికి వదిలేయకుండా సైంటిఫిక్ ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పాడు.
(04:24) ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనందరి దగ్గర ఇప్పుడు ఏ ఏ ఉంది. దాంతో ప్రతోడు ఒక ఫిలాసఫర్ ప్రతోడు ఒక అపర మేధావి. YouTube లో ఇన్స్టాలో మనం రెండు మాటలు చెప్పి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో స్లో ఎలివేషన్స్ తో మన ముడ్డి కింద జాకీ వేసుకొని మనల్ని మనమే లేపుకొని హీరోలా ఫీల్ అవుతున్నాం. దాని ఫలితం మనకి అన్ని తెలుసు అనే ఇల్యూజన్ లో బ్రతుకుతున్నాం.
(04:47) బట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీకు అన్నీ తెలుసా కనీసం నీ గురించి నీకు తెలుసా తెలుసు అని నటించడం సులభం తెలియదు అని ఒప్పుకోవడానికి చాలా సాహసం కావాలి కానీ ఆ సాహసం లేనిదే అసలైన జ్ఞానం పొందలేము అందుకే సోక్రటీస్ రెండున్నర వేల సంవత్సరాల తర్వాత కూడా మనకు అవసరం అవుతున్నాడు. అతను సమాధానాలు ఇచ్చినందుకు కాదు ప్రశ్నించడం మానవుని అత్యున్నత గుణం అని నిరూపించినందుకు అండ్ నాకే కాదు నీకు కూడా ఏమి తెలియదు అని నిరూపించినందుకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు తెలియదు అని చెప్పడం నీలిజం కాదు సోమరితనం అసలే కాదు అది ఒక యాక్టివ్ లివింగ్ ఇగ్నోరెన్స్
(05:27) ప్రతి సమాధానాన్ని మళ్ళీ ప్రశ్నించే శక్తి అంటే చివరిగా ఒక మాట అజ్ఞానం సుఖంగా ఉండొచ్చు కానీ అంత మాత్రాన మనం మనం మూర్ఖత్వాన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం లేదు.
No comments:
Post a Comment