Monday, June 29, 2026

 *ధ్యానసాధనకు ప్రధానంగా ప్రతిబంధకంగా ఉండేది సోమరితనం, ధ్యానసాధన రేపు చేద్దాం తర్వాత చేద్దాం అని వాయిదా వేస్తూ ఉండడమే సోమరితనం, ఎట్టి పరిస్థితుల్లో కూడా బద్ధకం సోమరితనం ఉండరాదు, అది తమోగుణం. నేను చాల గొప్పవాడిని, నేను నీకంటే సీనియర్ ను, నువ్వు నాకు చెప్పేదేమిటి అని విర్రవీగుతూ అహంకారంతో ఉండే వాళ్ళ స్థితి రజోగుణ స్థితి. ఒక మంచి లక్ష్యం పెట్టుకొని దానిని పట్టుదలగా సాధన చేస్తూ మధ్యలోనే జారవిడుచుకోవటం దీనినే యోగభ్రష్టత్వం అంటారు, పట్టిన పట్టు జారవిడుచుకోవటం వలన యోగభ్రష్టత్వం పొంది ఈ జన్మ ను వృధా చేసుకుంటారు. సోమరితనం, అహంకారం, పట్టిన పట్టు విడవటం ఈ మూడు ధ్యానసాధనలో ఉండే ప్రాధమిక ప్రతిబంధకాలు. - బ్రహ్మర్షి పత్రీజీ*

No comments:

Post a Comment