Saturday, June 13, 2026

 ✍️బీ.పీ సమస్య వున్నప్పుడు ఎలాంటి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? 

👉బి. పి చాలా ముఖ్యమైన వ్యాధేకాదు. ఈ బి.పి ఎక్కువ, తక్కువలని రెండు రకాలు. ఎక్కువగా చూపించే బి.పిని హైబి.పి అంటారు. ఇదే ప్రపంచమంతటా, ముఖ్యంగా మన దేశంలో ప్రబలుతున్న ప్రజారోగ్య సమస్య.

👉 ఒకసారి ఇది మనకుందని గుర్తించబడ్డాక దాన్ని అదుపులో ఉంచుకొని, దానివల్ల మరే సమస్యలు రాకుండా మనని మనం కాపాడుకుంటూ ఆనందంగా జీవించవచ్చు.

👉పెద్దవయస్సులో వచ్చే బి.పి ఇప్పుడు చిన్న వాళ్ళకీ వస్తోంది. 

👉ఈమధ్య జరిగిన పరిశోధనల్లో తేలిందేమంటే స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా పట్టణాల్లో, పల్లెల్లో అంతటా పెరుగుతున్న వ్యాధి హై బి. పి.

👉 హైబి.పి 'ఉందని తేలిందనుకోండి, భయపడకండి. దాన్ని మీరు అదుపులో ఉంచుకొని సాధారణ జీవితం గడపవచ్చు.

👉అసామాన్యంగా పెరుగుతున్న బి.పిని తగ్గించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. 

👉మంచి మందు, పూర్తి అవగాహన, మార్చుకున్న అలవాట్లు, ఆహారం ఈ మూడింటి సంపూర్ణ సహకారంలో హైబి.పి లేకుండా చిరకాలం జీవించవచ్చు. 

👉బ్లడ్ ప్రెషర్ అంటే ప్రవహిస్తున్న రక్తం రక్తవాహికల గోడలపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చి ప్రవహిస్తున్నదో తెలుసుకోవడం అన్నమాట.

👉సాధారణంగా ప్రసరణలో శరీరంలో ప్రతికణాన్నీ రక్తం తగినంత స్థితిలో చేరగలిగితే చాలు. ఎక్కువ ఒత్తిడి అక్కరలేదు. ఎప్పుడైనా తాత్కాలికంగానో, పూర్తిగానో ఒత్తిడి ఎక్కువ అయితేనే హైబి.పి వ్యాధి అని అంటాం. 

👉దీన్ని పాదరసంతో మిల్లీమీటర్లలో ఒక పరికరం ద్వారా కొలుస్తారు.ఒక సాధారణ వ్యక్తిలో మామూలు వయస్సులో ఇది 120/80 ఎమ్ఎమ్ హెచ్ ఉంటుంది.

👉పైన ఉన్న 120 హృదయం ముడుచుకున్నప్పుడు, 80 అన్నది గుండె విచ్చుకున్నప్పుడు సూచిస్తుంది. 

👉దీనికీ కొంచెం హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాని 140/90దాకా వచ్చిందనుకోండి, దాన్ని హైబి.పి అని అనుకోవాలి.

👉బి.పి పెరుగుదల ఒక్కొక్కప్పుడు తాత్కాలికంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక సిగరెట్టు కాల్చిన వెంటనే, ఒక లాటరీ తగిలిందని తెలిసిన క్షణంలో, ఒక కారు ప్రమాదాన్నో, భయంకరమైన సన్నివేశం సినిమాల్లోనో, టీ.వీలోనో చూసినప్పుడు బి.పి పెరుగుతుంది.

👉కాని ఆ స్థితి ప్రభావం తగ్గిన కొద్ది నిమిషాల తర్వాత మామూలు స్థితికి బి.పి వచ్చేస్తుంది. కాని మీలో ఉంటున్న ఆగని ఉద్రేకం, తెలియని మానసిక ఒత్తిడి, అలు పెరుగని ఆరాటంవంటివాటివల్ల ఈ పెరిగిన బి.పి తగ్గకుండా ఉంటే లేదా పెరుగుతూవుంటే అది మీ రక్తవాహికల గోడలని (Blood vessel walls) గుండెకి అనుసంధానించ బడ్డ రక్తవాహికలని గుండె, తల, కళ్ళు, వీటిని క్రమంగా పాడుచేసి ఉపద్రవాలకి కారణమవుతుంది.

👉దీన్ని హైపర్ టెన్షన్ (Hypertension) అంటారు. ఈ హైబి.పి మూడువిధాలుగా ఉంటుంది.

1. ఏ కారణంలేకుండా బి.పి పెరగటాన్ని ప్రైమరీ హైపర్టెన్షన్ (Primary Hyper tension) అంటారు. మనలో 90 శాతం మంది ఈ కోవకి చెందినవాళ్ళే. జీవనవిధానంలో విశృంఖలంగా ఉండటం ఆహారంలో వింత వింత అలవాట్లు, వయస్సు, వాళ్ళ తల్లిదండ్రులలో బి.పి ఉండటం ద్వారా ఇది వస్తుంది. దీని Essential Hyper tension అని కూడా అంటారు.

2. కొన్ని కారణాలవల్ల నిలకడగా బి.పి పెరుగుతుంటే సెకండరీ హైపర్టెన్షన్ (Secondary Hyperten sion) అని అంటారు. ఆ కారణాలని తగ్గిస్తే ఈ వ్యాధి తగ్గిపోతుంది. తలకి దెబ్బ తగలటం, మూత్ర పిండాల వ్యాధులు లాంటివి. గర్భిణీ కాలంలో కూడా తాత్కాలికంగా బి.పి పెరుగుతుంది. ఈ స్థితి చికిత్స చేయబడితే ఈ హైబి.పి కూడా తగ్గిపోతుంది. ఒక్కొ క్కప్పుడు కిడ్నీవ్యాధి, హార్మోన్ల హెచ్చుతగ్గులు తగ్గక పోతే ఈ హైబి.పి కూడా చిక్కులు తెస్తుంది.

3. Isolated Systolic Hypertension (ISH) అని మరొకటి ఉంది. ఇది పెద్దవాళ్ళలో వస్తుంది. వీళ్ళలో గుండె కొట్టుకుంటున్నప్పుడు బి.పి పెరుగుతుంది. మనలో ఉండే మూడు ప్రధానశక్తులు, వాటి కదలిక లలో వచ్చిన మార్పులవల్ల గుండె, దానినుండి వచ్చే రక్తవాహికల క్రియలో మార్పుచెంది ఈ స్థితి వస్తుందని ఆయుర్వేద ఆచార్యులు ప్రతిపాదించారు.

👉ముఖ్యంగా వాతశక్తి, అందులోనూ వ్యానవాతంలో వచ్చే హెచ్చు మార్పుల వల్ల ఈ హైబి.పి లక్షణాలు వస్తాయి. అందుకే వ్యాధికి కాక వ్యాధికారణమైన ఈ వ్యానశక్తికి చికిత్సచేసి హైబి.పిని తగ్గించమంటుంది ఆయుర్వేదం. 

👉శరీరంలో శక్తినిచ్చే శక్తిసాధనం పిత్తం. జీవకణాలకి శక్తిని అందించే వాహనం రక్తం. అందువల్ల పిత్తశక్తి దూషించబడ్డా హై బి.పి రావచ్చు. అందువల్ల వాత, పిత్త ప్రవృతి కలిగినవారు ఆ శక్తులు హెచ్చుతగ్గులు అయినప్పుడు ఈ హైబి.పికి లోనవుతారు.

👉ఆపుకోలేని ఉద్రేకం, తీవ్రమైన కోపం, తొందరగా చికాకుపడటం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, తెగని ఆలో చనలు, ప్రతిదానికీ భయపడటం- ఇవి హార్మోన్లలో హెచ్చు తగ్గులకి కారణమై (Mal-adaptation of Endocrine) ఈ హైబి.పి వంటి స్థితికి కారణమవుతుంది.

👉అధిక వ్యాయామం చేయడం, అధిక కొవ్వుపదార్థాలు తినడం, రాత్రి పెరుగు, జీర్ణం కాని బరువైన ఆహారం తీసుకోవడం మంచిది కాదు.

👉 మీ బి.పి సిస్టాలిక్ కనుక 160 కన్నా పెరుగుతోందనుకోండి మీకు పక్ష వాతం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.

👉మీ డయస్టాలిక్ కనుక 95 ఎమ్ఎమన్నా ఎక్కువ ఉంటే, మీకు Coronary artery disease అనే గుండె జబ్బురావచ్చు.

👉మీ బి.పి 160/95 కన్నా ఎక్కువగా ఉంటూ తగ్గకుండా ఉంటే, మీకు గుండెజబ్బు రావచ్చు.

✍️ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి :

👉బరువు పెరగకుండా చూసుకోండి.

👉రోజూ నడవటం అలవాటుచేసుకోండి..

👉శరీరంలో పొటాషియం తగ్గకుండా చూసుకోండి.

👉షుగరు వ్యాధి ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.

👉 ఉప్పు తగ్గించండి.

👉కూరల్లో నిమ్మరసం, అల్లం, మిరియాలు చేర్చండి.

👉మాంసం, గుడ్లు తగ్గించండి.

👉ఆహారంలో వెల్లుల్లి బి.పిని తగ్గిస్తుంది.

👉ద్రాక్ష, పుచ్చకాయ మంచి ఆహారం. 

👉సరస్వతి, అశ్వ గంధ, అర్జున, శంఖపుష్పి వంటివాటితో చేసినటు వంటి మందులు వాడండి.
*మందులు కావాలి అనుకున్న వారు 9291617007 నెంబర్ కు కాల్ చేసి నచో పోస్ట్ లో పంపించబడును.*
*🌿*ఎల్లప్పుడూ మీ* *ఆయురారోగ్యాలను కోరుకునే*
 *☘️ప్రీతి ఆయుర్వేద☘️*ప్రభుత్వ ఆయుష్ చే గుర్తింపు*పొందిన సంస్థ*

No comments:

Post a Comment