పెళ్లిళ్ల విషయంలో తల్లే విలనా? Is Mother A Villain in Marriages?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j9MpLzasgcU
Transcript:
(00:00) ఈ మధ్య తరచు వినబడుతున్న మాట ఏంటంటేనండి అంటే ముఖ్యంగా పిల్లల పెళ్లిల విషయంలో తల్లుల దోక్యం ఎక్కువగా ఉంటున్నది. పెళ్లిఅయిన తర్వాత కూడాను వీళ్ళ జోక్యం ఆగటం లేదు [నవ్వు] దీనివల్ల పెళ్లిఅయిన తర్వాత కూడాను ఆడపిల్ల అత్తగారి ఇంట్లో ఇమడ లేకపోతున్నది సర్దుకు లేకపోతున్నది చిరాగులు ఎక్కువైపోతున్నాయి అసలు అమ్మాయికి ఏం చేయాలో తెలియటం లేదు ఆ మెట్టిన ఇంట్లో అమ్మాయి మాటకి విలువఏమంటలేదు ఇటువంటి భావజాలాన్ని మనం ఎక్కువగా వింటున్నామఅండి.
(00:39) అంటే తల్లిని ఎక్కువగా విలన్స్ గా చిత్రీకరిస్తున్నారు. అసలు ఏం జరుగుతున్నది తల్లి నిజంగా విలనా తండ్రి కేవలం ఎస్ మనా గన్నీనా ఆయన మాటకి అసలు ఎందుకు విలువ అంటంలేదు ఇంకా ఎన్నో విషయాల మీదనే ఈ వీడియోలోనే విషయం ఉందండి కొద్దిగా సీరియస్ గా వర్క్ చేశాను మీరు కూడాను వినండి ఆ తర్వాత ఎటు మీరు మెసేజ్ రూపంలో పెడతారు కదా ఈ వీడియోల్లో వాటిని చూసి నేను కూడాను కొంత నేర్చుకుంటాను.
(01:12) ఇది ఒక విధంగా చాలా సున్నితమైన విషయం అండి కొంచెం బాలెన్స్డ్ గా ఆలోచించాలి మనం అందరి తల్లులు అలాగే ఉంటారు లేకపోతే అందరి తండ్రులు కూడాను బలహీనపడిపోయారు వాళ్ళ మాటని ఎక్కటంలేదు అసలు వాళ్ళ వ్యక్తిత్వానికి గౌరవం ఏమ ఉండటంలేదు అని ఎప్పుడు కూడాను మనం జనరలైజ్ చేయకూడదండి ఎందుకంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది కదా అయితే ఈ విషయం మొత్తాన్ని కూడాను సామాజిక మానసిక కోణాల్లో చూడటం మటకు చాలా మంచిది.
(01:45) ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో తల్లి డామినేషన్ ఉండొచ్చండి అదే సమయంలో తండ్రి అనేక కారణాల వల్ల తన బాధ్యతని విస్మరించవచ్చు. కదా అందుకని తల్లి అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది. అంతే కదా భర్త సరిగా లేకపోతే మరి కుటుంబ బాధ్యత అంతా కూడాను తల్లి మదర్స్ వస్తుంది కదండీ ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో భర్త పేరు మాత్రమే ఉంటాడు.
(02:13) ఇక్కడ ఒక వాస్తవాన్ని గమనించాలండి తల్లికి సంబంధించి అసలు పిల్లలు ఎదుగుతున్న క్రమంలో చదువులు ఎవరు చూస్తారు ఎక్కువగా తల్లి కదా [ఆశ్చర్యం] ఆహారాన్ని ఎవరు రెడీ చేస్తారు తల్లే కదా భర్త కూడాను రెడీ చేస్తుంది కదా పిల్లలతో టైం ఎవరు ఎక్కువ స్పెండ్ చేస్తారు తల్లే కదా ఎందుకంటే పొద్దున పోయిన భర్త మళ్ళీ ఎప్పుడో సాయంత్రం వస్తాడు ఒకోసారి రాత్రి కూడా అయితూ ఉంటుంది కదా అలాగే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువగా ఎవరితో ఉంటుంది పిల్లలకి తల్లితోనే కదా సో ఇక్కడ ఆహారము చదువులు టైము అటాచ్మెంట్ ఏదన్నా జ్వరం లాంటిది ఏదనా వస్తే అసలు
(02:58) తల్లి పడే కంగారు అంతా ఇంతా కాదు దీనికి పిల్లలు ఎటు ప్రత్యక్ష సాక్షులే కదా ఇన్ని పాత్రలని పోషిస్తూ ఉంటుందండి తల్లి నిజమే కదా ఇవన్నీ కూడా తల్లి పాత్రలే అంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో లో ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుగుతున్న క్రమంలో భావోద్వేగాలను భరించేది కూడా నువ్వు తల్లే కాబట్టి 20 25 సంవత్సరాల వరకు బాధ్యతలను భావోద్వేగాల పరంగా మోసిన వ్యక్తిగా తల్లి ఈ పెళ్లిళ్ల విషయంలో కూడాను ఎక్కువ జోక్యం చేసుకోవడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుందండి.
(03:38) అది ఆమె సహజమైన మానసిక ప్రవృత్తి అసలు ముందు మనం అందరం కూడాను ఈ విషయాన్ని ఒప్పుకోవాలి. అయితే అసలు తల్లి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నది బేసికల్‌గా ఒక మాట అనేస్తాం ప్రేమ ఉంటుందండి తల్లికి అతి ప్రేమ చూపెడుతుందండి అని అంటాం ప్రేమ ఒకటే కాదండి కొంచెం జాగ్రత్తగా ఆమె అంతరంగంలోకి పరకాయ ప్రవేశం చేసి గనుక చూడగలిగినట్లయితే మొట్టమొదటి విషయం నేను చెప్పేది ఏంటంటే ఆమె రక్షణ భావనతో ఉంటుందండి అంటే సంబంధా వీలైనంత వరకు కాపాడే దిశలో ఆలోచిస్తూ ఉంటుంది.
(04:17) నా కూతురు జీవితంలో కష్టం రాకూడదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుందండి. అందుకనే చూడండి పెళ్లి విషయంలో సంబంధాలు వచ్చేటప్పటికి అబ్బాయి జీవితం ఎంత కుటుంబం ఎలా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా అత్తగారు ఎలా ఉంటారు అని ఆలోచిస్తుందండి కారణం ఏంటంటే ఆ కాబోయే అత్తగారికి కూడాను ఈమెకున్న భావద్వేదాలు ఎటు ఉంటాయిగా ఈమెకున్న బాధ్యతలు ఎటు ఉంటాయిగా ఆమె వాళ్ళ కూతురుని ఎలాగ పెంచిందో కొడుకుని ఎలాగ పెంచిందో అని కొంచెం సీరియస్ గా ఆలోచిస్తుందండి ఎంత సీరియస్ గా పురుషుడు అంటే తండ్రి ఆలోచించకపోవచ్చు ఆ తల్లి విషయంలో ఆమెకి అది పెత్తనంగా అనిపించదండి
(05:02) అనిపించదు ఇదిఒక బాధ్యత అని అనుకుంటూ ఉంటుంది. రెండో విషయం ఏంటంటే మరి ఆమె కూడాను మరి ఒక జీవితం జీవించింది కదా పెళ్లి చేసుకొని మొదట భార్యగా ఉంది తర్వాత తల్లిగా మారింది కదా పిల్లలని కన్న తర్వాత కాబట్టి ఆమె జీవితం కూడాను ఆమె పిల్లలు పెళ్లికి వచ్చేటప్పటికీ కొన్ని అనుభవాలతో నిండి ఉంటుంది కదా కాబట్టి అనుభవాల ప్రభావం కూడా ఉంటుందండి వాళ్ళు ఎదుర్కున్న కష్టాలు మర్చిపోలేరు అట్లాగే అనుభవించిన కష్టాన్ని కూడా వాళ్ళు మర్చిపోలేరండి నేను అత్తగారి ఇంట్లో చాలా ఇబ్బంది పడ్డాను అసలు అడ్జస్ట్ కావడానికే నాకు
(05:47) చాలా టైం పట్టింది. అని ప్రతి తల్లి అనుకుంటుంది అలా అనుకునే తల్లి తన కూతురు విషయంలో కూడాను ఒక్కొక్కసారి పాపం మరి మాతృత్వం పెన్ను బిగేటప్పటికి అతిగా జోక్యం తీసుకునే అవకాశం ఉంటుందిగా అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఈ మహా తల్లి ఈ తల్లి అనే మహాతల్లి తన గతంతో ఎక్కువగా స్పందిస్తున్నదండి అమ్మాయికి ఆ పరిస్థితి ఉండవచ్చు రేపు పొద్దున ఉండకపోవచ్చు పెళ్లి అయితే అది వేరే సంగతి కానీ ఆమె గతం కారణంగా ఆ తల్లి తన కూతురు విషయంలో ఎక్కువగానే స్పందించడం అనేది ఒక సహజ ప్రక్రియగా మనం తీర్చుకోవాలి.
(06:30) మరో విషయం ఏంటంటే సాధారణంగా కూతురు తల్లితో ఎక్కువగా తన పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అందువల్ల కూతురికి నాకు ఏది మంచిదో అమ్మకే తెలుసు అని ఒక నమ్మకం ఏర్పడుతుందండి నమ్మకం ఏర్పడుతుంది. కొన్ని కొన్ని విషయాల్లో తల్లి అద్భుతమైన సలహాలు ఇచ్చింది అనుకోండి ఆ నమ్మకం ఆమెలో విశ్వాసంగా స్థిరపడిపోతుందండి. అక్కడి నుంచి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఆ కూతురి మీద తల్లి ప్రభావం పెరుగుతుంది.
(07:04) నిజం చెప్పాలంటే ఇది నియంత్రణ కాదండి కాపాడాలి అనే ఒక సహజ స్వభావం మా తల్లిదది అన్నమాట సో ఇంతవరకు బాగానే ఉంది కానీ మరి ఎక్కడ చూసినా తల్లిని విలన్ గా చిత్రీకరిస్తున్నారు కదండీ అని మీరు మళ్ళీ అనొచ్చండి నిజమే మరి అటువంటి తల్లులు కూడా ఉంటారు ఆ చిత్రీకరణ జరుగుతున్నది మనం కాదనడానికి వీలు లేదు ఈ విషయం గురించి మాట్లాడుకుందాం అండి అసలు సమస్య ఇక్కడే ఉంది [గొంతు సవరించుకోవడం] ఏంటంటే ఈ ప్రేమ గాని అటాచ్మెంట్ గాని భయం గాని ఆ మాటక వస్తే బాధ్యత గాని ఎట్టి పరిస్థితుల్లో అంటే తల్లి పరంగా నేను చెప్తున్నానండి అతిగా ఉండకూడదండి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇక్కడ
(07:48) గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి తల్లి కూడాను వీలైనంత వరకు అన్ని విషయాల్లోన కూడాను అంటే అన్ని విషయాల్లో కూడాను భర్తతో ఏకాంతంగా చెప్పాలండి చర్చించాలి అక్కడ దాపరికాలు పెట్టుకోకూడదు అంతేగన ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసి ఆయనకి ఏం చెప్పాలి ఆయన చెప్పిన వినిపించుకోకూడదు అని వినిపించుకోవడాని అనుకోకూడదండి వింటాడు వినడు తర్వాత సంగతి అండి కానీ అన్ని విషయాలు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి భర్త విన్నాడు అనుకోండి సంతోషం వినిపించుకోలేదు అనుకోండి సంక్షోభమే కదా ఇట్ ఇస్ యస్ సింపుల్ యస్ దట్ అప్పుడు మనం తల్లిని తప్పుపట్టడానికి వీలు లేదు
(08:33) సో ఇక్కడ సమస్య మనస్తత్వంతో కాదండి ముడిపడింది ఇద్దరి మధ్య ఉన్న ఒక ఇంబాలెన్స్ మీద అవగాహన రాహిత్యం మీద ఆధారపడుతుంది. అయితే కొన్ని కుటుంబాల్లో ప్రతి విషయాన్ని భార్యా భర్తలు చర్చించుకుంటారండి వాళ్ళ మధ్య అన్నయ్యత కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ అటువంటి కుటుంబాల్లో పిల్లలు కూడాను ప్రతి విషయంలో కూడాను తల్లిదండ్రుల మధ్య ఓపెన్ అయిపోతారు.
(09:00) అటువంటి కుటుంబాలు అరుదుగా ఉన్నాయి అనుకోండి సో ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తల్లి డామినేషన్ గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాంఅండి ఇప్పుడు అమ్మాయి చిన్నప్పటి నుంచి నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నాను అని తల్లి మాట వింటూ గనుక పెరిగితే వివాహం తర్వాత ఏం జరుగుతుందంటే ప్రతిదీ అమ్మకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతున్నదండి కదా ప్రతిదీ చెప్పాల్సిందే అంటే అమ్మ అంటే ఒక భరోసా అన్న భావన ఏర్పడింది.
(09:33) ఆ భరోసా కూడాను ఈ తల్లి స్థాయికి నుంచి ఇచ్చిన భరోసానే అంటే ఎక్కువగా పుట్టింటిని ఆశ్రయించటం జరుగుతున్నది అన్నమాట. అంటే పుట్టింటి మీద ఆధారపడటం జరుగుతున్నది. అంటే డెసిషన్ మేకింగ్ ఉండటం లేదు ఆ కూతురికి భర్తని గాని అత్తమామని గాని కన్విన్స్ చేసే కెపాసిటీ ఉండటంలేదు కోల్పోతుంది అది. అది క్రమక్రమంగా ఏమైతుందంటే పెళ్లి అయిన తర్వాత అమ్మాయి అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత అది భార్యా భర్తల విషయంగా ఉండదండి చివరికి రెండు కుటుంబాల విషయంగా మారిపోతుంది.
(10:10) ఇది ప్రమాదకరమైది అంటే వైవాహిక జీవితం అంటే గెలుపు ఓటం కాదండి ఇది ఒక విధమైన సర్దుబాటు కళ అంతే ఎప్పుడైతే భార్యా భర్తల మధ్య నో నో అనే అట్మాస్ఫియర్ ఏర్పడుతుందో అప్పుడు ప్రమాద హంటికలు మోగినట్టే పరాకాష్ట ఏంటంటే విడాకుల ఆలోచన మీరు గమనించారా అసలు విడాకులకి అసలు కారణం సమస్య కాదండి ఇక్కడ సమస్యని పరిష్కరించే అవకాశాన్ని అమ్మాయి కోల్పోవడం అంటే ఆ పరిజ్ఞానాన్ని తల్లిదండ్రులు ఆ పిల్లకి సరిగా అందించలేదు.
(10:52) ఇక్కడ మళ్ళీ తల్లిదండ్రులని మనం తప్పు పట్టబడాల్సి వస్తుంది. అయితే [గొంతు సవరించుకోవడం] తప్పంతా తల్లులదేనా కాదు కదా మరి తప్పంతా తండ్రులదేనా కాకపోవచ్చు కాదు కూడాను అంటే కొన్నిసార్లు తండ్రులు బాధ్యత తీసుకోరండి ఇందాక నేను చెప్పాను కదా అట్లాగే కొంతమంది తల్లులు అతిగా దోకం చేసుకుంటారు మరి దాన్ని కూడా మనం ఒప్పుకోవాలి కదా అయితే ఈ విధమైన వాతావరణంలో ఏమైతుందంటే కొన్నిసార్లు పిల్లలు స్వతంత్రంగా ఆలోచించలేని పరిస్థితికి కూడాను వస్తారు.
(11:32) సో చివరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక వ్యక్తి సమస్య కాదండి కుటుంబ సంస్కృతి సమస్య కుటుంబ సంస్కృతి సంస్కృతికి సంబంధించిన సమస్య అందుకనే నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఏదో మార్కెట్లో వస్తువులాగా అమ్మాయిల్ని అబ్బాయిలని వెతుక్కోవడం కాదండి మ్యారేజ్ బ్యూరోలో వెంటపడటం అంతకన్నా కాదండి మొదటి నుంచే కొన్ని కుటుంబాలతో అనుబంధాలు పెంచుకోవాలి పెంచుకుంటే కాబోయే అత్తగారు కాబోయే మామగారు కాబోయే భర్త మీద వీళ్ళక ఒక అవగాహన ఏర్పడుతుంది.
(12:08) కాబట్టి ఆ విధంగా చేసుకుంటే తప్ప వివాహాలు నిలబడమని నేను రకరకాలుగా చెప్పాను చాలా వీడియోల్లో ఒక్కటండి వివాహం అనేది ఛాన్స్ కాకూడదు ఎప్పుడు కూడాను ఛాయిస్ కావాలి ఇప్పుడు ప్రేమ పేరుతో నియంత్రణ పెరిగింది అనుకోండి బంధాలు బలహీన పడిపోతాయి కదా అది బాలెన్స్ ఉండాలని కదా నేను చెప్తున్నది పిల్లల్ని కాపాడడం తల్లిదండ్రుల బాధ్యతే కాదంటలేదు కానీ వారి జీవితాలని మన చేతుల్లోకి తీసుకోవడం అంటే మన చెప్పు చేతుల్లోకి తీసుకోవడం అనేది మటకు మూర్ఖత్వం అండి ఇప్పుడు మంచి తల్లి అంటే ప్రతి సమస్యలో కూతురి పక్షం వహించేది
(12:53) కాదండి భర్తని పక్కన పెట్టే కూతురికి స్వతంత్రంగా ఆలోచించే శక్తిని ఇచ్చేదే అసలు శిష్యలైన తల్లి అవసరమైతే తల్లి కూతురితో కూర్చోబెట్టి చర్చించొచ్చు మంచి చెడు చెప్పొచ్చు చెప్పాలి కూడా ఆ మాటక వస్తే అలాగే మంచి తండ్రి అంటే కేవలం సంపాదించేవాడే కాదండి సంపాదన మీద దృష్టి పెట్టేవాడే కాదు కుటుంబాన్ని పట్టించుకోవాలి. పిల్లల విషయంలో బ్యాలెన్స్డ్ గా మార్గదర్శనం చేయగలిగి ఉండాలి.
(13:28) ఒక్కటండి వివాహం విషయంలో ఎవరి మాట నెగ్గింది అన్నదానికి ప్రాముఖ్యత ఇవ్వకూడదండి అంటే వివాహం అనేది ఎవరి మాట నెగ్గింది అనే దానిపై ఉండదు ఇద్దరూ కలిసి అంటే తల్లిదండ్రులుగా నేను చెప్తున్నాను ఇద్దరూ కలిసి ఒకే మాట అనే స్థాయికి చేరుకున్నారా లేదా అన్న దాని మీదే ఆధారపడి ఉంటుందండి అందుకనే ఇందాక ఒక మాట అన్నాను కదా భార్య ప్రతి విషయాన్ని కూడాను ఏకాంతంగా రాత్రిపూట నిద్రపోయే టైంలో చర్చించాలండి ఆ రోజు ఏం జరిగింది అనేది చర్చించాలి ఓపికగా చర్చిస్తే కొద్ది రోజులకు భర్త వింటాడండి భర్త వినడు అన్న ఒక కంక్లూషన్ కి ఈ భార్య అంటే ఈ తల్లి వచ్చేయకూడదు
(14:08) వింటాడు ఎందుకు వినడు ఎందుకంటే బాహ్య ప్రపంచంలో అతనికి ఎన్నో పనులు ఉంటాయి కదండీ అలిసిపోయి ఉంటాడు. ఆ విషయాన్ని కూడా గమనించాలిగా లేకపోతే కొద్ది ప్రశాంతంగా ఉన్న టైంలో భార్య చర్చించాలండి భర్తతో కూడాను ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా అసలు పిల్లలతో అటాచ్మెంట్ ఆ తండ్రి కంటే తల్లితోనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అంటే వీళ్ళద్దరూ కూడాను జోడెడ్ల జోడెడ్లుగా మారి సంసారం అనే పొలాన్ని గనుక అద్భుతంగా దునినట్లయితే పిల్లలనే అద్భుతమైన పంట చేతికి వస్తుందండి.
(14:42) కదా ఇంకో విషయం కూడా ఉంది అదేంటంటే పేరెంట్స్ కి కూతురు ఎప్పుడూ కూతురేనండి కాదనడానికి వీలు లేదు కానీ ఒక విషయం మటుకు మనం విస్మరించకూడదు ఆ కూతురు పెళ్లిఅయిన తర్వాత భార్యగా ముందుకు మారుతుంది కదా ఆ తర్వాత తల్లిగా మారే క్రమంలో అన్న కూడాను ఇంకో కూతురు యొక్క బాధ్యతని మరి మోయాలన్న ఒక అద్భుతమైన స్పృహతో ఉండాలిగా అలా ఉండాలి అంటే మరి తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉంది ఉంటుందో మనం ఇంకా ఆలోచించాలి సీరియస్ గా ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూస్తే నేను తల్లిదండ్రులు ఒకటే మాట చెప్తున్నాను బాధ్యతల్లో ఉండు బంధాల్లో ఉండు కానీ బంధాలతో కట్టిపడే
(15:29) ఇప్పుడు ప్రతి బంధం కూడాను ఒక ఒక దశ వరకు మాత్రమే ఉంటుందండి ఆ టీనేజ్ వచ్చిన తర్వాత కూడా ఉండొచ్చు ఎందుకంటే పిల్లలు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు గా ముఖ్యంగా ంగా ఆడపిల్లలు పెళ్లిఅయిన తర్వాత కదా వాళ్ళకి స్వతంత్ర భావాలు వస్తాయి. కాబట్టి ప్రతిబంధం కూడాను ఒక దశ వరకు మాత్రమే ఉంటుందండి. అదే మనది ఇప్పుడు మన శరీరం కూడాను శాశ్వతంగా మనది కాదు కదా అలాంటప్పుడు పిల్లలు శాశ్వతంగా మనవాళ్ళ అయతారని మనం ఎలా అనుకుంటాంఅండి ఇక్కడ ఒక అద్భుతమైన వ్యక్తి పేరు సజెస్ట్ చేస్తాను ఖలీల్ జిబ్రాన్ ఈ ఖలీల్ జిబ్రాన్ యొక్క ఫిలాసఫీని ఇంటర్నెట్ లోకి వెళ్లి
(16:07) చదవండి ముఖ్యంగా తెలుగు వర్షన్ లో చదవండి నేను చెప్పేదానికంటే గొప్ప వర్షన్ వస్తుంది తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న అనుబంధం ఏంటి అని ఇప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులుగా కేవలం మీ హక్కు ఏంటంటే సరైన టైంలో అన్ని అందించడంలోనే ఉంటుందండి. అంతే తప్ప స్వాధీనం చేసుకోవడంలో ఉండదు. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని దెంచగలరు కానీ వాళ్ళ జీవితాల్లో మీరు జీవించలేరండి ఎందుకంటే మీరు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి పెళ్లి చేసేది పాతికేళ్ళ తర్వాతనే ఈ పాతికేళ్ళలో కాలం ఎంత మారిపోయింది ఆ కాలానికి వదినరుగా పిల్లలు ఉంటున్నారుగా ఆలోచన మీరు పట్టుకోవాలంటే చాలా కష్టం కదా
(16:49) కాబట్టి మీరు మీ పిల్లల్ని కేవలం పెంచగలరు కానీ వాళ్ళ జీవితాల్లో మటుకు జీవించలేరండి భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళ జీవితం అంటే వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా అది వాళ్ళదే కదండి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తానండి ఒక్కసారి ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారి ఇంటికి పంపించిన తర్వాత వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయండి అపార్థాలు చోపు చేసుకుంటాయి రానివ్వండి మీకు రాలేదా ఆలోచించండి ఒకసారి కాబట్టి వీలైనంత వరకు 90% 95% వాళ్ళనే పరీక్షించుకోమనే చెప్పండి చెప్పండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మా చిన్నబాబు అమ్మాయికి పెళ్లి చేసిన
(17:33) తర్వాత ఆ అప్పటికింతలో ఒక మాట అన్నాడు నేను పక్కన నుంచి విన్నాను ఏమన్నాడంటే నాన్న అబ్బాయికి ఏది ఇష్టమో కనిపెట్టి అదే వండు మెల్లమెల్లగా నీకు అలవాటు అవుతుంది అని చెప్పాడండి ఎందుకంటే ఆహారం చేసే అద్భుతం అంతా ఇంత కాదండి ఎప్పుడైతే ఈ పెళ్లికూతురు అనే భార్య వివాహం తర్వాత అద్భుతంగా వంట చేసి పెడుతుందో ఆ పెళ్లి కొడక నేనే భర్త దాసోహం అయిపోతాడండి [గొంతు సవరించుకోవడం] తర్వాత మా బాబాయి నాకు చాలా విషయాలు చెప్పాడు ఎలా ఉండాలి ఈ అమ్మాయి అనే దాని మీద అన్నమాట వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక వీడియో కూడా చేశను నేను కాబట్టి కొన్ని కొన్ని పిల్లలకి గనుక చెబితే అటాచ్మెంట్
(18:16) వచ్చేస్తుందండి వాళ్ళకి తల్లిదండ్రులుగా మరి మీ అనుభవం అనేది పిల్లలకి ఇలా చెప్పడంలో ఉండాలన్నమాట అలా చెబితే నీకు ఫోన్లు తగ్గిపోతాయి [నవ్వు] సో ఇదండీ వీడియోలోని సంగతి నువ్వు వినందుకు కృతజ్ఞతలు ఎక్కువ మందికి షేర్ చేయండి. తప్పకుండా పిల్లలు పెద్దలు కూడాను ఆలోచిస్తారండి పెద్దలు పిల్లలు కూడా వినిపించవలసిన విషయం ఇది.
(18:39) అలా ప్రెజెంట్ చేసేయకూడదు. అలాగే నా ఛానల్ కూడాను సబ్‌స్క్రైబ్ చేయండి. లేదు కిరణ్ గారు ఇంకా కొన్ని ఉన్నాయి మాకు అనుమానాలు మీతో మాట్లాడాలి అని అనుకుంటే మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ పోరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ యు టిహెచ్ ఐ స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓ ఆర్ యు ఆర్ఐ అని చెప్పేసి నా ఛానల్ ఓపెన్ అవుతుంది.
(19:07) బెల్ ఐకాన్ నొక్కుతారా లైక్ బటన్ నొక్కుతారా అన్నది మీ వ్యక్తిగతం అండి. నా వీడియోలు గనుక నచ్చితే నచ్చకపోతే ఎలా అని మీకే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే చివరి రిక్వెస్ట్ ఏంటంటే మంచి మెసేజ్‌ని మటకు కామెంట్ బాక్స్ లో పెట్టండి. [గొంతు సవరించుకోవడం] అసలు ఎప్పుడైనా నా వీడియో చూసినప్పుడు ఎవరెవరు ఏ మెసేజ్‌లు పెట్టారా అని ఈ మెసేజ్‌లే నాకు భరోసాని ఇస్తాయండి.
(19:29) సో ఇదండి ఈ వీడియోలో సంగతి నమస్కారం.
No comments:
Post a Comment