Thursday, June 25, 2026

నా అంతిమ నమస్కారం... My Last Greeting...

నా అంతిమ నమస్కారం... My Last Greeting...

Author Name:maruthi kiran Poruri

Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bZpHAat2AHY



Transcript:
(00:01) నిన్న అంటే 2362026 అండి ఒక మంచి మనిషి మరణానికి వెళ్ళాను ఒక గంట గంటన్నర ఉన్నానండి సందర్భానికి తగినట్టుగా సందర్భానికి ఏమాత్రం పొంతన లేని మాటలు కూడాను చాలా మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను దాదాపు గంటన్నర అలా నిశిద్ధంగా ఉండిపోయాను. ఎందుకు ఉండిపోయానో నాకు తెలియదు ఏ ఆలోచనలు లేవు ఎందుకంటే నండి లైబ్రరీకి వెళ్ళినప్పుడు నిశశబ్ధంగా ఉండాలి మరణానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఉండాలండి ఇది ఎందుకో నేను పాటిస్తూ ఉంటాను అది కూడా
(00:46) మీ మధ్యనే సరే నా వంతుగా ఏదో చేశాను ఇంటికి తిరిగి వస్తూ కార్లో కూడాను అలా నిశశబ్ధంగా ఉన్నాను తడక్కున ఒక ఆలోచన మిగిలింది ండి [నవ్వు] నెదలటమే తడవుగా నా పక్కన నాకు పంపించబడ్డ డ్రైవర్ ఉన్నాడు విక్రం అని మంచివాడు విక్రంతో అన్నాను విక్రం కొన్ని మాటలు మనం చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేకపోతామ అయ్యా అంతలో మరణం సమీపించుక వచ్చేస్తుంది.
(01:23) చివరి క్షణంలో కూడా నోరు పేగలదు కదా మరి అప్పుడు ఏం చేయాలి అని అన్నానండి ఊరికనే ఎందుకంటే కొంతమంది డ్రైవర్లతో నేను ఏం చేస్తానుఅంటే సరదాగా మాట్లాడుతూ ఉంటాను. అతను అన్నాడు నవ్వుతూ సార్ మీరు భలే ఉన్నారు ఇన్ని వీడియోలు చేస్తూ ఉంటారు కదా నన్ను అడిగితే నేనేం చెప్పనండి అని అన్నాడు నిజాయితిగా అన్నాడండి నిజాయితిగా అన్నాడు సరే ఒక 20 సెకండ్ల తర్వాత నేనే అన్నా చెప్పాలనుకున్నవన్నీ స్పృహ ఉన్నప్పుడే ఓ లేఖలాగా రాస్తే సరిపోతుంది కదయ్యా అని అన్నా అనగానే ఒకసారి ఇట్లా చూసి మళ్ళీ డ్రైవింగ్ లో మునిగిపోయాడు రాయాలనుకుంటున్నారా సార్ అన్నాడు నేను
(02:08) అన్నా ఎందుకు వచ్చిందో ఆలోచన తెలియదయ్యా నీతో ఎందుకు పంచుకుంటున్నానో తెలియదు చూస్తాను సాయంత్రం ఇంటికి వెళ్లి ఆ చూస్తాను అని అన్నాను అతను కూడా ఏం మాట్లాడలేదండి సరే నేను ఇంటికి వచ్చి ఫోన్ చేసి నిద్రపోయి సాయంత్రం ఆరున్నరఏడు ఇంటికి కొంచెం ఫ్రెష్ గా ఉన్నాను అన్నమాట కానీ ఆలోచన మనం వదలలేదు వదలకుండా ఏం చేసిందంటే కదా పరిగెత్తి తించింది అలా రాస్తూ పోయాను అలా రాస్తూ పోయాను పర్వాలేదు బాగానే వచ్చింది అన్న సంతృప్తి తర్వాత నేను ఏం చేశనంటే మరసటి రోజు కూడాను దాన్ని మళ్ళీ ఒకసారి చదువుకున్న తర్వాత మళ్ళీ వేరే ఆలోచనలు వచ్చాయి.
(02:49) వెంటనే మళ్ళీ రాయటం మొదలు పెట్టాను చివరికి పూర్తి అయిపోయిందండి. ఒకసారి చూసుకున్న తర్వాత నాకు అనిపించింది పర్వాలేదే బాగానే వచ్చిందే అని సో దీన్ని నేను ఏం చేస్తానంటే యధార్థతంగా మీ ముందు చదివేస్తానండి. రాయగా వినండి ఎందుకంటే భావగర్భితమైన కొన్ని భావాలు ఉంటాయి చూసారా అవి ఏదో అలాగా చెప్పేస్తే ఆ భావాలకు న్యాయం చేసినట్టు ఉండదండి అందువల్ల చదివేస్తే ఆ పదజాలం ఎప్పుడూ కూడాను మిస్ కాదు మీరు కూడాను కొంచెం సీరియస్ గా వింటారు వీలైతే కనెక్ట్ అయితారు కూడా అంతేనండి సో ఇక చదివేస్తాను మీరు హాయిగా వినండి సమాజానికి సంపద ఇవ్వకపోయినా పర్వాలేదు
(03:31) అందరూ ఇవ్వలేరు ఎవరో తప్ప కనీసం నిజాయితీగా ఒప్పుకోలుగా ఓ సందేశం ఇస్తే తప్పేముంది అని అనిపించి ఆలోచన చేశాను. అది మీ ముందు ఉంచుతున్నాను. ఒక్కొక్కళ జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా ఈ స్క్రిప్ట్ ను ఎవరికి తగ్గట్టుగా వారు మార్చుకోవచ్చు. వినండి నా జీవితాన్ని స్పుర్శించి ప్రభావితం చేసిన అందరికీ నా అంతిమ నమస్కారం నా ఆఖరి చూపు కోసం మీరందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు అలాగే రాలేని వారికి కూడాను నా ముందు మీరు నిలబడి ఉన్నారు కానీ నేను మాట్లాడలేను మీ చేతులు పట్టుకొని కృతజ్ఞత చెప్పలేను
(04:19) తల వెనక ఒక దీపం పెట్టబడి రెండు బొటన వేళ్ళు కట్ట కట్టబడి నా మీద గుడ్డ కప్పబడి ఉన్నాను. అచేతనంగా ఉన్నాను. అందుకే ఈ వ్రాత ఒక జీవితాన్ని జీవించాను కానీ ఒప్పుల కంటే తప్పులే ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ ఈ తప్పుల తోడుకల జీవితాన్ని నాతో భరించారు. ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలను ఈ నాలుగు మాటలు తప్ప నా అదృష్టం ఏంటంటే [గొంతు సవరించుకోవడం] ప్రయాణం పోయే ముందు నేను స్పృహతోనే ఉన్నాను భగవంతుడు దయవల్ల అందువల్ల ఈ మాటలు నేను రాయలేనప్పటికీ నా కుమారుడికి చెప్పగలిగాను.
(05:04) వాడు వ్రాశడు నా కోరికగా ప్రింట్ చేయించి అందరికీ ఇవ్వమన్నాను. మీ అందరి చేతిలో ఇవి ఉండే ఉంటాయి. చివరి క్షణంలో నాకు ఏమనిపించిందంటే ఇంకా అస్త దయతో ఉంటే బాగుండేది కదా అని దాచుకుందామని విపరీతంగా ప్రయత్నించాను. కానీ ఇంకొన్ని [గొంతు సవరించుకోవడం] దానాలు చేసిఉంటే బాగుండేది కదా అని మిత్రులు డాక్టర్లు చెప్పారు నడక వ్యాయామం చేస్తూ ఉండండి అని చేయలేదు దయచేసి మీరు మటుకు చేయండి ఎంతో మందితో వాదనలు చేశాను చేయకుండా నిశశబ్దంగా ఉండాల్సిందే కొన్నిసార్లు లేని భూమిని కల్పించి గొప్పలు చెప్పాను
(05:49) అలా ఆత్మ చేసుకున్నాను ఎందుకో అవన్నీ తలుచుకుంటూ ఉంటే సిగ్గుతో కూర్చించుకుపోయాను కొంతమందికి అసలు సారీలు థాంక్స్లు కూడా చెప్పలేదు. చెప్పింటే ఈపాటికి నాకు మనశశాంతిగా ఉండేది చివరి రోజుల్లో పదే పదే అనుకున్నా 82 ఏళ్ళు ఎలా గడిచిపోయాయా అని సమాధానం దొరకలేదు అలా వచ్చేసాయి అంతే సమాధానం దొరకడం కష్టమేమో మీరు ఆలోచించండి ఎందుకంటే మీకు ఇంకా సమయం ఉంది కదా అయితే మొదటి నుంచి ఒక్కటి నమ్ముతూ వచ్చాను.
(06:33) మనందరం కలిసి కిందటి జన్మల్లో కొన్ని కార్యక్రమాలను మొదలుపెట్టి జీవితకాలం అయిపోయిన కారణంగా అసంపూర్ణంగా అసంతృప్తిగా ముగించాం. అదే వాసనలతో మళ్ళీ ఈ కార్యక్రమాలను ఈ జన్మలో కొంతవరకు ముందుకు తీసుకెళ్ళాం. ఇంకా చేయవలసింది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మనందరం మళ్ళీ రాబోయే జన్మల్లో కలుస్తాము కలుద్దాం కూడా అని భారతీయుడిగా నేను ఈ కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతాను.
(07:13) ఇంకొకటి చేయలేకపోయాను కొంతమంది అభాగ్యులు నిజంగా అవసరంతో ఉన్నారు. నా ఎరికలో ఉన్నారు వారికి ఏదనా చేయాలని ఉంది కానీ మరణం ముంచుకొచ్చింది. వైపు ఉన్నప్పుడే చేసిఉంటే బాగుండేదని అనిపించింది. మీరు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోండి. నాలా వాపోకండి పుస్తకాలు చదివే అలవాటు ఉంది కొంత కాబట్టి ఈ మాత్రం రాయగలిగాను మీరు మటుకు పుస్తకాలు చదువుతూనే ఉండండి ఒక్క మంచి పని అయితే చేశాను అనిపించింది.
(07:50) ఎవ్వరిని ముఖ్యంగా పిల్లలను ఇబ్బంది పెట్టకూడదని నా ఆరోగ్యం కోసం నా భార్య ఆరోగ్యం కోసం దాచుకుంటూ వచ్చాను. ఇది నా భార్యకు తెలియకుండా చేశాను. ఇలా ఎందుకు చేశానో కూడా చెబుతాను. ఓ జ్ఞాని నాకు ఒక మాట చెప్పారు అది నేను సంపాదిస్తున్న వయసులోనే అదేంటంటే నేను డబ్బు దాచుకునే విషయంలో నా భార్య దగ్గరే కాదు నా తల్లి దగ్గర కూడాను దాపరింగా ఉంటాను అని అలా ఎందుకు అన్నాడో ఆయన నాకు ఆ వయసులో అర్థం కాలేదు తర్వాత తర్వాత తెలిసింది అందులో గొప్ప మర్మం దాగుని
(08:38) మీరు ఆలోచించండి మన డబ్బే మనకు చివరికి ఆఖరికి రావాలి [గొంతు సవరించుకోవడం] మరొక్క మాట కారణం లేకుండా మన జీవితంలో ఏది జరగదు కారణం లేకుండా మన జీవితంలో ఏ జీవి ప్రవేశించదు చివరికి మన పెంపు కుక్క కూడాను ఏది ఏమైనా ఎవరీ బీయింగ్స్ లైఫ్ ఇస్ ప్రీ డిటర్మైineడ్ అండ్ వెల్ డిటర్మైన్డ్ తెలుగులో చెప్పాలి అంటే ప్రతి జీవి జీవితము ముందుగా నిర్ణయించబడిన అదియు బాగుగా నిర్ణయించబడిన గొప్ప వాస్తవం ఆ వాస్తవాన్ని విశ్వంలో నుంచి వచ్చిన ఆ జీవి మళ్ళీ మరణం ద్వారా విశ్వంలోకి పోయే ముందే
(09:25) అనుభవిస్తుంది. అనుభవించి తీరాలి కూడా ఇది విశ్వ సూత్రం అలాగా ఇప్పుడు నేను తర్వాత అందరూ మిత్రులారా ఇది ఆవేశంతో మటుకు రాయటం లేదు ఎక్కువ భాగం పశ్చాత్తాపంతోనే రాశాను ఏది ఏమైనా నా జీవితం అయితే అసంపూర్తిగా అసంపూర్ణంగా ముగిసింది. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది చేయలేకపోయాను ఇదొక్క మాట మీరందరూ భోజనం చేసి మీరు వెళ్ళండి.
(10:09) 12వ రోజున తప్పకుండా రండి నాకు ఇష్టమైన అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసిన వంకాయ కూర దోసకాయ పప్పును చేయమని చెప్పాను ఇంతకుముందే చేస్తారు కూడా మనవాళ్ళు సో 12వ రోజున తప్పక రండి ఫోటోలో నుంచే మిమ్మల్ని పలకరిస్తాను. ఎంత రాసినా ఇంకా రాయాలనిపిస్తున్నది. ఇంకొంచెం టైం తీసుకుంటాను ఏమనుకోవద్దు అందరం వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కొద్దో గొప్పో ఇచ్చిపోతూ ఉంటాం.
(10:45) ఇవ్వాలి కూడా ఎందుకంటే తీసుకున్నాంగా ఎన్నో మైళ్లు ప్రవహించిన నది ఎన్నో మలుపులు తిరిగిన నది రాళ్లను దాటుకుంటూ ముళ్ళకంపలను చీరుకుంటూ వెళ్ళిన నది ఎన్నో మరణాలను ఆత్మహత్యలను చూసిన నది ఆ కంపును కూడాను భరించిన నది హారతులను కూడాను అందుకున్న నది ఎన్నో కేరింతలను చూసిన నది చివరికి అనంతమైన సముద్రంలో నిశశబ్దంగా లేనమవుతూ తనతో మోసుకొచ్చిన ఒండ్రు మట్టిని తన సందేశంగా వదిలి వెళ్ళిపోతుంది.
(11:27) మళ్ళీ నీటి పొరలోకి పోయి భూమిమీదకి వచ్చి తన వారసత్వపు నదిని మళ్ళీ కలిసి మానవాళకి సేవ చేస్తుంది. మళ్ళీ జన్మ తీసుకున్న మనము అంతే అందుకే భావకులు కవులు జీవితాన్ని జీవనదితో పోల్చారు. ఇప్పుడు మరణం ముందు నేను చేస్తున్న ప్రయోగాన్ని ఎంతో మంది చేశారు గతంలో అలా వాళ్ళు వాళ్ళ వడపోతను ప్రపంచానికి అందించారు.
(12:00) మీకు స్ఫూర్తి రావాలని కొంతమంది మేధావుల మాటలను ఇక్కడ ఇస్తున్నాను దయచేసి ఆలకించండి. లియోనార్డో డామిన్సీ గొప్ప పెయింటర్ ఆయన ఏమన్నాడంటే నా పని చేరవలసిన స్థాయికి చేరలేదు అందువల్ల నేను దేవుని మానవాళని నిరాశ పరిచాను ఎంత గొప్ప వ్యక్తికైనా సంపూర్ణ సంతృప్తి అరుదే అన్నది ఈయన భావం అండి అలాగే థామస్ అల్వా ఎడిసన్ శాస్త్రవేత్త ఆయన ఏమన్నాడంటే అక్కడ ఎంతో అందంగా ఉంది.
(12:41) మరణం తర్వాత ప్రయాణాన్ని భయంతో కాక ఆనందంతో చూసిన దృక్పదం తో ఆయన రాసిన మాటలు అన్నమాట అట్లాగే లూట్ విత్ ఓన్ బితోవెన్ సిఫని వాయిద్యకారుడు ఆయన ఏమన్నాడఅంటే మిత్రులారా చప్పట్లు కొట్టండి ఈ నాటకం ముగిసింది. అని ఆయన జీవితాన్ని ఒక రంగస్థల ప్రదర్శనగా చూశాడు. అట్లాగే ఓల్డ్ టైర్ ఫ్రెంచ్ రైటర్ ఫిలాసఫర్ హిస్టోరియన్ ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు కొత్త శత్రువులను సంపాదించుకునే సమయం కాదు ఎంత గొప్ప మాట అండి చివరి క్షణాల్లో పశ్చాత్తాపం ఉన్నా చమత్కారం వేడని
(13:27) వ్యక్తిత్వం ఆయనది అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కవి రచయిత ముఖ్యంగా గీతాంజలి రచయిత ఆయన ఏమన్నాడంటే సూర్యుడు మొదటి రోజు నన్ను అడిగాడు నువ్వు ఎవరు అని చివరి రోజు కూడాను అదే ప్రశ్న వేశడు. జీవితం మొత్తం గడిచిన మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం అనేది చాలా గొప్ప సాధన. ఇదండి ఆయన భావం అలాగే విన్స్టన్ చర్చ్ గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఏమన్నాడంటే ఐ యమ బోర్డ్ విత్ ఇట్ ఆల్ ఇవన్నీ చూసి నాకు విసుగు వచ్చింది అని అట్లాగే గొప్ప తాత్వేత్త సోక్రటీస్ ఆయన
(14:15) ఏమన్నా అంటే ఏయ్ క్రిటో మనం అస్క్లెప్పియస్ కి ఒక కోడిని బాటి ఉన్నాం అది చెల్లించడం మర్చిపోవద్దు. అంటే క్రిటో అని ఆయనకి తెలిసిన వ్యక్తి అనుకుంటానండి. అస్లపియస్ అని అతని దగ్గర ఈయనఏదో కోడిని అప్పు తీసుకున్నాడు మరి ఇవ్వాలి కదా ఆ భావంతో రాసిన మాట అన్నమాట అంటే రుణగ్రస్తులు కావద్దు అన్న సందేశం ఈయన మాటలో ఇమిడి ఉందండి.
(14:44) ఇవన్నీ కూడా వాళ్ళందరి ఆఖరి మాటలుగా నేను సేకరించానండి. అలాగే జూలియస్ సీజర్ రోమన్ జనరల్ అండ్ స్టేట్స్మెన్ ఆయన్ని వెన్నపోటు పడిచినప్పుడు అంటే కత్తితో పొడిచినప్పుడు వెనక్కి తిరిగి చూసి నువ్వు కూడా నా కొట్టస్ అన్నాడు అంటే శత్రువు చేసిన ద్రోహం కంటే స్నేహితుడు చేసిన ద్రోహమే ఎక్కువ బాధ కలిగిస్తుంది అని అట్లాగే ఆస్కార్ వైల్డ్ గొప్ప రచయితండే ఆయన ఏమన్నాడంటే ఆ ఘోర కాగితం పోవాలి లేదా నేను పోవాలి అని అంటే బహుశా ఆయన మాటల్లో అంతరార్థం ఏంటంటే మానవుల మధ్య ఉన్న అసమానతల గురించి ఆలోచించి ఉంటాడేమో అని
(15:31) అనిపిస్తున్నది. అట్లాగే మరీ యంటియో నెట్టి చిత్రంలో ఉంది పేరు మరీ యంటియో నెట్టి ఈమె ఫ్రాన్స్ రాణి అండి అంటే క్వీన్ ఆఫ్ ఫ్రాన్స్ అన్నమాట ఆమె మనం విల్ థియేటర్ మూవీసింది అన్నమాట అప్పుడు ఆమె అన్న మాటలు ఏంటంటే [గొంతు సవరించుకోవడం] క్షమించండి సార్ నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని అంటే అసలు ఏం జరిగిందంటే ఉరి శిక్షకు ముందు అనుకోకుండా ఒకరి కాలికి తన కాలి తగిలిందండి కాలు తగిలిందండి అప్పుడు చెప్పిన మాటలు అన్నమాట క్షమించండి సార్ నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని ఎంత హిమిలిటీ అండి
(16:15) అట్లాగే సర్ ఐజాక్ న్యూటన్ సైంటిస్ట్ ఆయన ఏమన్నాడంటే చివరి రోజుల్లో నేను సముద్ర తీరలో ఆడుకుంటున్న ఒక బాలుడిలా మాత్రమే ఉన్నాను సత్య సముద్రం నా ముందే విస్తరించి ఉంది అని దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పారండి అదేంటంటే కొంతమంది సముద్ర గర్భంలో ముత్యపు చిప్పలు ఏరుకోవచ్చునేమో కానీ నేను మటుకు వడ్డున గులకరాళ్లు ఏరుకునే పసివాడిని అని దానికి కొంచెం దగ్గరగా ఉందండి ఈ మాట అట్లాగే అంతేనండి సో నాకు ఏమనిపిస్తున్నది అంటే గొప్ప శాస్త్రవేత్తలో కూడాను ఎప్పుడు ఒక ఫిలాసఫర్ దాగి ఉంటాడండి కదా ఇంకొకటి ఏంటంటే చివరి
(17:03) [గొంతు సవరించుకోవడం] మాటలు మరణిస్తున్న వ్యక్తి చెప్పే సందేశం కాదు అంటే చివరి మాటలు ఎప్పుడూ కూడా అతను జీవితాంతం చేసిన సాధనకు ఆలోచనలకు విశ్వాసాలకు ప్రతిధ్వని అందుకే మన చివరి మాటలు మారాలంటే ముందుగా మన ఆలోచన దృక్పదం మారాలి. ఇలా ముగించానండి చివర్లో సో జాగ్రత్త మిత్రులారా ఉంటా మరి ప్రేమతో కృతజ్ఞతతో వినమ్రతతో మీ ఓ సాధారణ మనిషి ఇదండి నేను రాసుకున్న స్క్రిప్ట్ స్క్రిప్ట్ దీన్నే నేను యధార్థంగా చదివేసాను అన్నమాట
(17:49) ఇది సో ఆలోచన చేయండి తప్పులుఎన్నో చేస్తు స్తూ ఉంటాం కదా మనం కొంతమందిని అకారణంగా బాధ పెడుతూ ఉంటాం తెలియదు బాధపెట్టి తర్వాత వాపోతూ ఉంటాం ఇవన్నీ మన జీవితంలో జరిగేవే కానీ ఒక్కసారి తుదిశ్వాస తీసుకున్న తర్వాత మనక ఏం తెలియదు. కానీ స్పృహ ఉన్నప్పుడు మనకు ఏదో చెప్పాలి అని అనిపిస్తుంది కాళ్ళు చేతులు సహకరించవు సహకరించిన కూడాను వృద్ధాంతం వల్ల మనల్ని వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళే వెసులుపట్టు కూడాను మన పిల్లలకు ఉండకపోవచ్చు కాబట్టి కలంక వచ్చే ప్రయత్నం చేయండి మీరు కూడాను ఇదఒక సున్నితమైన భావన అండి ఎందుకో నాకు అనిపించింది చేయాలని అందుకనే చేశనండి
(18:30) [నవ్వు] అది మిమ్మల్ని బాధ పెట్టి ఉంటాను క్షమించాలి కూడా సో ఇదండి వీడియోలో సంగతి విన్నంత కృతజ్ఞతలు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి నా ఫోన్ నెంబర్ 9491063089 తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. కొంతమంది ఆలోచిస్తారండి ఎందుకంటే ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడు కూడాను మనిషి తన గురించి ఎప్పుడు ఆలోచించడు కదా కాబట్టి ఈ నా వీడియో కాసేపు ఒక్క రెండు నిమిషాలు ఇదే కదా జీవితం అని కొంతమంది వ్యక్తులు వాళ్ళ గురించి ఆలోచిస్తారేమో ఎవరు చెప్పగలరు.
(19:06) కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. బెల్ ఐకాన్ లైక్ బటన్ అంటారా మీరు ఎటు నొక్కుతారో నాకు తెలుసు. పోతే మంచి మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్ లో దాన్ని చూడన నేను చాలా నేర్చుకుంటానండి సదండి నమస్కారం ఉమ్

No comments:

Post a Comment