Monday, June 15, 2026

ఒక మనిషి ప్రాణం పోతున్నా... జనాలు ఎందుకు చూస్తూ ఉంటారు? || shocking psychology of bystander effect

ఒక మనిషి ప్రాణం పోతున్నా... జనాలు ఎందుకు చూస్తూ ఉంటారు? || shocking psychology of bystander effect

Author Name:Psychologyintelugu

Youtube Channel Url:https://www.youtube.com/@Psychologyintelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=zTh18GDBCKA



Transcript:
(00:00) ఒక వ్యక్తి రోడ్డు పై పడిపోయి ఉన్నాడు చుట్టూ చాలామంది చూస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా అతనికి సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అందరూ చుట్టూ చూస్తున్న వాళ్ళు చెడ్డవాళ్ళా లేకపోతే మన బ్రెయిన్ ఏదైనా సైకలాజికల్ మెకానిజం ప్లే చేస్తుందా మనము చూస్తూనే ఉంటాం రోడ్డు మీద ఏదైనా యక్సిడెంట్ జరిగినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు చూస్తూ ఉంటారు వీడియోస్ తీస్తూ ఉంటారు కానీ సహాయం చేయడానికి ముందుకు రారు.
(00:30) నిజం ఏంటి అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలామంది ఉన్నారనుకోండి అప్పుడు సహాయం అందే అవకాశం చాలా తక్కువ అలా కాకుండా ఎవరైనా ఒక్కోళ్ళు ఆ ప్రమాదం జరిగిన సిచువేషన్ చూశారు వాళ్ళు సహాయం చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ ఎందుకు ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ప్రపంచాన్నే షాక్ కి గురి చేసిన సైకాలజీలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిన బై స్టాండర్డ్ ఎఫెక్ట్ గురించి ఈరోజు వీడియోలో మనం ఎందుకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు క్రౌడ్ అంతా చూస్తూ ఉంటారు వీడియోస్ తీస్తూ ఉంటారు కానీ సహాయం చేయరు.
(01:03) అలాంటి సిచువేషన్ లో మనం ఉంటే మనం సహాయం తొందరగా పొందడానికి ఏం చేయాలి అన్న విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఇది తెలియాలి అంటే ఫస్ట్ మనకు బై స్టాండర్డ్ ఎఫెక్ట్ గురించి తెలియాలి. బై స్టాండర్డ్ ఎఫెక్ట్ అంటే ఒక ప్రమాదం జరిగింది ఒక యక్సిడెంట్ జరిగింది చుట్టూ చాలామంది ఉన్నారు అయినా కానీ ఎవ్వరూ పట్టించుకోకుండా అలా చూస్తూ ఉండిపోవడం ఇది ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని ఫస్ట్ తెలుసుకుందాం.
(01:31) బై స్టాండర్డ్ ఎఫెక్ట్ ప్రకారం ఎప్పుడైతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలామంది ఉన్నారనుకోండి అప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే నేను కాకపోయినా ఎవరో ఒకళ్ళు చేస్తారు ఎవరో ఒకళ్ళు అంబులెన్స్ కి ఫోన్ చేస్తారు ఎవరో ఒకళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు ఎవరో ఒకళ్ళు నీళ్ళ ఇస్తారు ఎవరో ఒకరు ఏదో ఒక సహాయం చేస్తారు అని అనుకుంటారు. అలా అనుకొని చాలా మంది చూస్తూ ఉంటారు.
(01:51) ఎవరు ముందుకు రారు. అలా కాకుండా ఎవరైనా ఒక పర్సనే ఉన్నాడనుకోండి ప్రమాదం జరిగినప్పుడు ఆ పర్సన్ ఎట్లా అంటే నేనే ఉన్నాను నేనే చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచానికి షాక్ కి గురి చేసిన సంఘటన 1964 లో జరిగింది. 1964 లో అమెరికాలో ఒక యువతి ఇంటి దగ్గర ఆమె మీద దాడి జరిగింది. ఆమె అరవడం స్టార్ట్ చేసింది చుట్టూ ఉన్నవాళ్ళు అవన్నీ విన్నారు కానీ ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
(02:22) అట్లాంటి స్టేజ్లో ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చారో ఎప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళని అడిగారో అందరూ కూడా మేము విన్నాం మేము విన్నామ అని అన్నారు కానీ ఎవ్వరు మీరు ఎందుకు సహాయం చేయలేదు ఆ పర్సన్ కి వచ్చి ఆ యువతికి వచ్చి అని అడిగినప్పుడు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తారులే అని అనుకున్నాము అని అన్నారు. ఇక్కడి నుంచే బై స్టాండర్డ్ ఎఫెక్ట్ మీద పరిశోధనలు స్టార్ట్ అయ్యాయి.
(02:42) ఈ బైస్టాండర్డ్ ఎఫెక్ట్ మీద పరిశోధనలు చేసే కొద్ది సైకాలజిస్ట్లే చాలా షాక్ కి గురి అయ్యే ఎన్నో విషయాలు తెలిసాయి ఈరోజు వీడియోలో అవన్నీ మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే బై స్టాండర్డ్ ఎఫెక్ట్ కి రీజన్ నేను కాకపోయినా ఇంకెవరైనా సహాయం చేస్తారు అని అనిపించడం ఆ యువతి కేసులో కూడా చాలా మందికి అడిగినప్పుడు కూడా ఎవరైనా వేరేవాళ్ళు చేసి ఉంటారులే అనుకొని మేము లైట్ తీసుకున్నాం అనే అన్నారు.
(03:09) బై స్టాండర్డ్ ఎఫెక్ట్ కి పెద్ద కారణం ఏంటి అంటే డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత అందరిలో పంచబడినప్పుడు వ్యక్తిగత బాధ్యత తగ్గిపోతుంది. అంటే అందరికీ చెప్పారనుకోండి ఏదైనా వర్క్ ఎవ్వరు సీరియస్ గా తీసుకోరు అదే ఒక్కోళ్ళకి పిలిచి చెప్తే వాళ్ళు దాన్ని కంప్లీట్ చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది.
(03:31) ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ చెప్పిన తర్వాత ఎవరైనా వచ్చి బోర్డ్ క్లీన్ చేయండి అని అంటే ఎవరైనా ముందుకి ఫాస్ట్ గా వచ్చి బోర్డ్ క్లీన్ చేసే పాసిబిలిటీ తగ్గిపోతుంది ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు వాడు చేయాలి వీడు చేయాలి ఎవరో ఒకళ్ళు వెళ్తారేమో నేను లేస్తే ఇంకొక వాళ్ళు లేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఇట్లా అని అసలు ఎవరే లెవ్వరు ఎవరే చేయడానికి పాసిబిలిటీ లేదు అలా కాకుండా టీచర్ ఒక పర్టికులర్ వ్యక్తిని రాహుల్ వచ్చి బోర్డు క్లీన్ చెయ్ అని చెప్తే అతను వెంటనే స్పందించి వచ్చి బోర్డు క్లీన్ చేసే పాసిబిలిటీ చాలా చాలా ఎక్కువ దీన్నే డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అని అంటారు అంటే
(04:04) రెస్పాన్సిబిలిటీ అందరిలో పంచబడినప్పుడు ఎవ్వరూ చేయరు. సేమ్ ఎమర్జెన్సీ సిచువేషన్ లో కూడా ఇదే జరుగుతుంది. అందరూ ఉన్నారు కాబట్టి ఎవరో ఒకళ్ళు చేస్తారులే అని అనుకుంటారు దానివల్ల సహాయం తొందరగా అందదు. ఇంకొక రీజన్ ఏంటి అంటే ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్ ఇది మరో ఆసక్తికరమైన సైకలాజికల్ కాన్సెప్ట్ మనం ఇతరుల రియాక్షన్ చూసి ఇది అంత సీరియస్ విషయం కాదేమో అని అనుకుంటాం అంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ చూస్తున్నారు అనుకోండి మనం ఏమనుకుంటాం అందరూ చూస్తున్నారు నేను వాళ్ళలో ఒక పార్ట్ నేను చూస్తున్నాను ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి
(04:38) యాక్షన్ తీసుకుంటారు కదా ఏం ఎమర్జెన్సీ లేదు కాబట్టి అందరూ చూస్తున్నారేమో అని అనుకుంటారు అంటే వేరే వాళ్ళ రియాక్షన్ ని బట్టి వీళ్ళ వీళ్ళు అది ఎమర్జెన్సీనా కాదా అన్నది డిసైడ్ చేస్తారు ఇది చాలా ప్రమాదకరం ఫస్ట్ అయితే యక్సిడెంట్ జరిగింది ఎవ్వరు సహాయం చేయట్లేదు దానికి తోడు అందరూ చూస్తున్నారు కదా అంత ఇంపార్టెంట్ కాదేమో అని అనుకొని వీళ్ళు కూడా సహాయం చేయకపోవడం దీనివల్ల ఏమవుతుంది అని అనేసి అంటే సహాయం తొందరగా అందకుండా అందరూ కూడా ఎవ్వరు కూడా ముందుకు రారు చేయడానికి ఇంకొక రీసన్ ఏంటి అంటే ఇవాల్యూషన్ అప్రిహెన్సేషన్ దీని ప్రకారం
(05:11) ఎవరైనా వచ్చి సహాయం చేయాలి అన్న ఆలోచన ఉన్నా వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేనేమన్నా తప్పు చేస్తే ఇంతమంది ఉన్నారు నన్నుఏమన్నా జడ్జ్ చేస్తే నేను తప్పు చేసి ఏమన్నా జరిగితే మళ్ళీ ఇంతమంది ఉంటారు వాళ్ళు నేను చేసిన తప్పు అందరికీ చెప్పగలుగుతారు వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలిగిన వాళ్ళు చేయరన్నమాట ఏదనా తప్పు జరిగితే అన్న భయంతోటి ఇంకొకటి చాలా డిస్టర్బింగ్ అనిపిస్తుంది ఈ విషయం కానీ నిజం అదేంటి అంటే ఇప్పటిలో సోషల్ మీడియా ఎఫెక్ట్ ఈ ఇన్సిడెంట్స్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనిషికి నేను ఏదనా సహాయం చేయాలి అన్న
(05:46) ఆలోచన కన్నా జస్ట్ సింపుల్ గా ఒక ఫోన్ తీసి వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. కనీసం ఆ ప్రమాదం జరిగిన వ్యక్తికి ఆ ఫోన్ ఇవ్వడమో వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకు ఫోన్ చేసుకుంటారు అన్న ఆలోచన కూడా చేయకుండా ఫోన్ అడుగుతున్న ఇవ్వకుండా వీడియో రికార్డింగ్స్ అనేవి చేస్తున్నారు. ఇది మనం చూసినప్పుడు ఎక్కడనా సోషల్ మీడియాలో చూసినప్పుడు కానీ మనకు చాలా కోపం వస్తుంది.
(06:09) కానీ ఇది ఎందుకు జరుగుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా మంది ఏమనుకుంటారు అని అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అబ్జర్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళు కేవలం అబ్జర్వ్ చేస్తారు ఇలా జరుగుతుంది దీన్ని నేను రికార్డ్ చేయాలి ఇది ఎందుకు లాక్ ఆఫ్ ఎంపతీ వల్ల ఇది ఇట్లాంటి సిట్యువేషన్స్ చూస్తూ ఉండడం ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తూ ఉండడం వల్ల ఇవన్నీ నార్మల్ అన్న స్టేజ్ కి వెళ్ళిపోయి ఏదైనా మనకు బయట కనిపించినప్పుడు నేను కూడా రికార్డ్ చేయాలి అన్న అన్న క్యూరియాసిటీతోనే
(06:38) రికార్డ్ చేస్తున్నారు తప్ప అక్కడ పర్సన్ ఎంత భయంకరమైన సిచువేషన్ లో ఉన్నాడు ఎంత తొందరగా పర్సన్ కి హెల్ప్ కావాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా ఎవరు అప్లై చేయకుండా రికార్డింగ్స్ అనేవి చేస్తున్నారు. ఇది డసెన్సిటైజేషన్ వల్ల కూడా జరుగుతుంది అంటే ఇట్లాంటి సిచువేషన్స్ చూసి చూసి అసలు సెన్సిటివ్ ఉన్నెస్ే తగ్గిపోతుంది అన్నమాట అంటే ఆ దాని యొక్క తీవ్రత కూడా అర్థం కావట్లేదు ఇంకొకటి ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఎంపతీ తగ్గిపోవడం ఈ రెండిటి వల్ల మనుషులు వీడియో రికార్డింగ్ చేయడానికి పాల్పడుతున్నారు.
(07:13) మరి ఇలాంటి సిచువేషన్ లో ఏం చేయాలి మనం ఎలా మారాలి అంటే ఫస్ట్ బాధ్యత తీసుకోవాలి ఎవరో ఒకళ్ళు చేస్తారు అన్నదాన్ని కాకుండా మనమే ముందుండి చేయాలి. మనము ఎమర్జెన్సీ సిచువేషన్ లో వాటర్ ఇవ్వడం ఆ పర్సన్ కి ఫోన్ ఇవ్వడం వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేయడం ఇది కూడా చాలా పెద్ద సహాయమే యంబులెన్స్ కి కాల్ చేయడం పోలీస్ వాళ్ళకి కాల్ చేయడం ఇవి కూడా చాలా మేజర్ ఎఫెక్ట్ ని చూపిస్తాయి.
(07:36) ఇంకొకటి ఏంటి అంటే అవేర్నెస్ ఈ విషయం సైకలాజికల్ గా ఇట్లా జరుగుతుంది మనకి అని తెలిసిన అవేర్నెస్ కలిగినప్పుడు చాలా మంది దాన్ని ఎదుర్కోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి ఎందుకంటే ఎవరైనా ఒక్కోళ్ళకి సహాయం అందినా ఎవరు ఆ సిచువేషన్ లో ఉంటారు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఎవరికైనా సిచువేషన్ అలా ఉంది అని అన్నప్పుడు ఏం చేయాలో అన్నదైనా తెలుస్తుంది.
(08:02) ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ ఇట్లాంటి సిచువేషన్ లో మనం ఉంటే ఏం చేయాలి మనం ఇట్లాంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము ఎవరైనా యంబులెన్స్ కి కాల్ చేయండి ఎవరైనా పోలీస్ వాళ్ళకి కాల్ చేయండి ఎవరైనా ఫోన్ ఇవ్వండి అలా కాకుండా మనం పర్టికులర్ గా మీరు బ్లూ షర్ట్ అయినా కాల్ చేయండి యంబులెన్స్ కి మీరు రెడ్ షర్ట్ వేసుకున్నారు కదా మీరు పోలీస్ వాళ్ళకి కాల్ చేయండి అని పర్టికులర్ గా చెప్పాలి మీరు ఇట్లా పర్టిక్యులర్ గా చెప్పినప్పుడు వాళ్ళకి ఒక ఆక్వర్డ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది అంటే అందరిలో లో ఈ పర్సన్ ప్రమాదానికి గురైన పర్సన్ నన్ను మెన్షన్
(08:34) చేసింది నేను వెంటనే చేయాలి అన్న సెన్స్ తోటి వాళ్ళు వెంటనే రియాక్ట్ అవుతారు. అలా కాకుండా మీరు అందరికీ చెప్పారనుకోండి మళ్ళీ బాధ్యత పంచబడుతుంది. వ్యక్తిగత బాధ్యత తగ్గిపోతుంది. అలా కాకుండా మీరు స్పెసిఫిక్ గా చెప్పాలి. ఇంకొకటి ఏంటి అంటే అట్లాంటి సిచువేషన్ లో ఆ ఎక్కువ శాతం మనము అవేర్ గా ఉండాలన్నమాట. అరే ఈ సిచువేషన్ ఉంది ఈ సిచువేషన్ లో నేను ఇప్పుడు కాన్షియస్ గా ఉండాలి అని అనుకోవాలి.
(09:01) ఇది చాలా పాసిబుల్ కాదు మనం అట్లాంటి సిచువేషన్ లో చాలా పానిక్ కి గురి అవుతాం. కానీ మనం ఎప్పుడూ కూడా ఎమర్జెన్సీ సిచువేషన్స్ కి ఎక్కువగా ప్రిపేర్డ్ గా ఉండాలి సైకలాజికల్ గా దీనివల్ల ఏమవుతుంది అనింటే మనం ముందే ప్రిపేర్డ్ గా ఉంటే అట్లాంటి సిచువేషన్ వచ్చినప్పుడు మనం కొంచెం అలర్ట్ గా ఉంటాం ఇది ఇంకొక పాసిబిలిటీ ఇది ఎక్కువ పాసిబుల్ కాకపోవచ్చు ఎందుకంటే ఆ తీవ్రతాన్ని బట్టి ఉంటుంది ఇది ప్రాక్టికల్ కాకపోవచ్చు కానీ ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇంకొకటి కంక్లూజన్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు అని అంటే అంటే మనం
(09:34) దాన్ని వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని చేయాలి. ఎందుకు అంటే ఏ సిచువేషన్ లో మనము కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా ఉంటారు అన్నది తెలియదు. ప్రమాదానికి గురైన వ్యక్తికి కూడా ఫ్యామిలీ అనేది ఉంటుంది అని పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం చేసే చిన్న సహాయం మనకి ఏదో ఒక విధంగా తిరిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి.
(09:54) అండ్ మనం ఈ పాటర్న్ ని మార్చగలం బై స్టాండర్డ్ ఎఫెక్ట్ ని మనం మార్చగలం దాన్ని కేవలం అవేర్నెస్ తోనే మనం మార్చగలం. కాబట్టి ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఎవరో ఒకరి ప్రాణం ఎప్పుడో ఒకసారి సేవ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి ఇట్లాంటి సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు లైక్ చేస్తే చాలా కొత్తమందికి రీచ్ అవుతుంది అండ్ వీడియోని తప్పకుండా షేర్ చేయండి సో దట్ ఎవరైనా సహాయంలో ఉన్న వాళ్ళకి సహాయం అందుతుంది. మీకు ఎలాంటి టాపిక్ మీద వీడియో
(10:29) కావాలన్నది డెఫినెట్ గా కామెంట్ చేయడం చేయండి నేను ట్రై చేయడానికి ట్రై చేస్తాను

No comments:

Post a Comment