ఎమోషనల్ బ్యాలెన్స్ రహస్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సత్యం || Vamsi Kiran sir ||
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=20ek6k4eWVw
Transcript:
(00:03) [సంగీతం] నిశ్చలత్వాన్ని ఎలా సాధన చేయాలి మనం నిశ్చలంగా ఉన్న పక్కవాడు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి మన సాధన తీవ్రత పెరిగినప్పుడు ప్రాపంచక జీవితంలో నుంచి డిస్కనెక్ట్ అవుతుంది దాన్ని ఎలా దాటాలి ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీకు చెప్తాం చివరిదాకా చూడండి నిశ్చలత్వపు సాధన పితామహ పత్రి గారికి ఈ ప్రపంచంలో నిశ్చలత్వాన్ని బోధించిన అందరి మాస్టర్స్ కి నిశ్చల జీవితంలో ఉండి నిశ్చల తత్వంలో ఉండి తమ జీవితాన్ని అద్భుతంగా గడిపిన దివ్యమైన యోగులందరికీ నమస్కారాలు ఆత్మ ప్రణామాలు
(00:51) సో ఈరోజు మనం నిశ్చలత్వ సాధన అంటే ఏంటి అసలు నిత్యలత్వం అంటే ఏంటి అదంతా మనం తెలుసుకుందాం ముందుగా నిశ్చలత్వం అంటే ఏంటి ఇది చెప్పాలంటే నాకు ఈ ప్రాసెస్ ఇదంతా స్టడీ చేసి దీన్ని మొదలు పెట్టడానికి నాకు ఒక కథ ఇన్స్పైర్ అయింది. ఆ కథ ఏంటంటే ఒక ఊర్లో ఒక ఋషి ఉంటాడు ఆయన మోక్షం తీసుకునే సాధన అదే నిశ్చలత్వంగా ఉంటూ ఎటువంటి ఎమోషన్ బ్యాలెన్స్ లేకుండా నిశ్చలంగా ఉంటూ ఎటువంటి కదలెక్క లేకుండా ఎటువంటి అంటే అవసరమైనప్పుడు ఉంటాయి తన కంట్రోల్ లో తను ఉంటూ తన కంట్రోల్ లో తను ఉంటూ మళ్లా నోట్ చేసుకునే పాయింట్ తన మనసు తన ఆధీనంలో ఉంచుకుంటూ సాధన చేస్తూ ఉన్నాడు
(01:36) ఇలా నిశ్చలంగా కూర్చున్నాడు అన్నమాట కూర్చున్నప్పుడు ఆ అడవిలో ఒక జింక పరిగెట్టుక వస్తది ఆ జింక ఆయన ముందు నుంచి ఇలా చిన్నమని దూకి అటు వెళ్ళిపోతుంది. ఆయన వెనకే ఒక వేటగాడు వస్తాడు వేటగాడు వచ్చి ఈయన వెనక చూస్తాడు అయ్యా జంకటిపోయింది అంటాడు ఈయన మాట్లాడడు ఎందుకంటే నిశ్చలత్వంలో ఉన్నాడు కదా బాగా మౌన సాధనలో ఉన్నాడు అప్పుడు ఆయన ఏమంటాడు అలా నిశ్చలంగా నిశ్చలంగానే ఉంటాడు ఏమాత్రం ఆన్సర్ ఇవ్వడు అలా నిశ్చలంగానే ఉంటాడు అది శిల్పమా అన్నట్లు ఉంటాడు అన్నమాట కానీ ఆయన తెలియకుండానే ఒక చిన్న మిస్టేక్ జరిగింది ఏంటంటే ఆయన కళ్ళు ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి
(02:10) అంతే అటు చూస్తాడు అన్నమాట అంటే జంకి వెళ్ళిన వైపు కళ్ళని ఇలా టర్న్ చేస్తాడు ఒక నానో సెకండ్లో సో ఆ వేటగాడు అటు వెళ్ళిపోయి ఆ జింకని చంపి మొత్తం మీద వెళ్ళిపోతాడు ఆ జింకని పట్టుకొని సరే మొత్తం మీద ఇతని సాధన పూర్తి అవుతది కొంత కాలం తర్వాత ఇతనికి మోక్షం వస్తది పైలోకాలకి వెళ్తాడు పైలోకాలకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే ఆ నీకు మోక్షం ఇవ్వాలంటే అప్పుడే కుదరదు అంటారు ఎందుకండీ అంటే ఆయన స్కాన్ చేస్తారన్నమాట పైలోకాల్లో స్కాన్ చేస్తారు వాళ్ళని నీ నిశ్చలత్వం అద్భుతంగా ఉంది నువ్వు చేసిన సాధనలు అద్భుతంగా ఉన్నాయి కానీ నీ దగ్గర
(02:46) నీ అకౌంట్ లో ఒక జింక చావుకి కారణకుడు అయ్యావ అని ఉందండి అంటారు. అనగానే షాప్ గా అంటాడు అదేంటి నిన్న పుట్టుబుద్దరిగాక ఏ జంతువుని చంపలేదు ఆ నేను ఎలా కారణం అయ్యాను అని అంటాడు మీరు ఆరోజు వేటగాడు వచ్చినప్పుడు మీరు ఇట్టా అన్నారు ఇట్టా అని ఎందుకు అన్నారు అని అడుగుతారు అంటే నీ కళ్ళు నీ మాట వినట్లేదా అంటారు. అంటే చూడండి ఇది సాధనలో పరాకాష్ట స్థితికి వెళ్ళిన వాళ్ళకి మామూలు వాళ్ళకి కాదు మాట్లాడితే మనం రోజు బోలు అంటాం ఇట్టా ఇట్టా అంటానే ఉంటాం మనకే ఆ కాన్సెప్ట్ కాదు అంటే నేను ఇది ఒక కథను ఇన్స్పైర్ గా తీసుకున్నాను అన్నమాట ఈ సాధన
(03:20) స్టార్ట్ చేయడానికి ఇందులో అతను ఏం చెప్తాడంటే నువ్వు నీ కళ్ళు నీ మాట ఎందుకు వినలేదు అంటాడు అయ్యో నేను నేను అనుకోకుండా అన్నానండి అనుకోకుండా ఎందుకు అన్నావ్ అంటే నేను ఇంకా పరిపక్తకు రాలేదు నాయనా ఫస్ట్ అన్నిట్లో వచ్చావ్ ఒక చిన్న మార్కుతో నీకు ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారు మళ్ళీ ఇంకొక్కసారి పోయి అని పంపిస్తారు ఇదండి అర్థమైంది కదా అంటే ఇక మన సంగతి ఏంటి రోజుక ఒకసారి గంగా వెర్రలుఎత్తుతుంటాం నేలకు తలకాయ బాదలు పడేసుకుంటాం అరుపుస్తుంటాం కోపంతో చింపేసుకుంటాం అంటే ఈ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉండకూడదా అంటే ఉండాలి నిశ్చలత్వంలో ఉండాలి
(03:59) నువ్వు అనుకుంటే ఉండాలి నువ్వు అనుకుంటేనే అరవాలి నువ్వు అనుకుంటేనే కత్తి దూయాలి నువ్వు అనుకుంటేనే అగ్నిలా మండాలి నువ్వు అనుకుంటేనే శీతలంలా మారిపోవాలి నువ్వు అనుకుంటేనే ప్రేమ పుట్టాలి నువ్వు అనుకుంటేనే నోరు మాట్లాడాలి నువ్వు అనుకుంటేనే కళ్ళు చూడాలి అంతఎందుకు నీ పంచేంద్రియాలు నువ్వు అనుకుంటే కదలాలి. ఇది పంచేంద్రియ గోపాలుడు అంటారు మీరు ఎప్పుడైనా చూసారా లేదో మది నెల్లూరులో సాయితపోనం ఉంది అందులో నేను పెట్టాను అది అది ఒక కృష్ణుడు ఇలా ఫ్లూట్ వత్తంటాడు ఐదు గోవులు ఉంటాయి చుట్టూత కూర్చొని ఉంటాయి అన్నమాట ఈ ఐదు గోవులు అంటే పంచేంద్రియాలు
(04:33) ఫ్లూట్ వదడం అంటే శ్వాస ఎప్పుడైతే నీ శ్వాస మీద నియంత్రణ నీ మనసు మీద నీకు నియంత్రణ వచ్చిందో అప్పుడు ఆ గోవులన్నీ నీ మాట అంటాయి పంచేంద్రియాలు నీ మాట అంటే అని దాని అర్థం సో మనం కూడా అది సాధన చేయాలి మిత్రులారా ఈ రోజు కాప ఏదో రోజు మనం నిచ్చులత్వంలోకి చేరుకోవాలి. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ రకరకాల పేర్లు దీనికి ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంటలెక్చువల్ ఇంటెలిజెన్స ఎన్నన్నో పేర్లు ఉన్నాయి కానీ అన్నిటికీ తెలుగులో చక్కటి పేరు ఉంది నిశ్చలత్వం ఎంత అర్థమైన పేరేండి ఇది నాకు భగవద్గీతలో కృష్ణుడు వాడతాడు ఈ పదాన్ని వాయు ప్రసారము లేని చోట దీపం వలె యోగి నిశ్చలంగా
(05:09) ఉండవలెను అంటాడు. వాయు ప్రసారం లేని చోట దీపం వలె అంటే గాలి లేని చోట దీపం ఎలా ఉంటదండి ఇలా గీత కొట్టినట్టు ఉంటది అటు ఇలా ఇలా రపరప అండ ఇలా ఉంటది అన్నమాట వాయు ప్రసారం లేని చోట దీపం వలే యోగి ఇలా నిశ్చలంగా ఉండవలెను అంటాడు కదా అలాగా మనము నిశ్చలంగా ఉండాలి అంటే నిశ్చలంగా ఉండడం అంటే ఏంటండి ఏం చేయకూడదా ఎప్పుడు ఎలాగా ఉండాలంటే కాదు కాదు నీ ఇన్నర్ నిశ్చలంగా ఉండి ఔటర్ నువ్వు అన్ని యాక్టివిటీస్ చేయాలి.
(05:38) ఔటర్ లో నువ్వు నార్మల్ గా ఉండాలి ఔటర్ లో నువ్వు అసలు ఎలా ఉండాలో అలా ఉండాలి అంటే అక్కడ సిచువేషన్ ఏదో అందులో ఉండాలి కానీ నువ్వు మాత్రం నిశ్చలంగా ఉండాలి. నిశ్చలత్వం రావాలి అంటే ఆల్రెడీ ధ్యానం చేస్తున్న వాళ్ళు ఫస్ట్ మెట్టు నిశ్చలత్వంలోకి ఎంటర్ అవుతారు కానీ కళ్ళు తెరిసిన తర్వాత కళ్ళు మూసినప్పుడు ఇదిగో శ్వాసను గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ అనేక ఆలోచనలు వస్తా పోతా ఉంటే నిశ్చలత్వంలోకి వస్తాం బాగుంది ఆ తర్వాత తర్వాత తర్వాత ఏమవుతది అందుకని మనం నిశ్చలత్వ సాధన కచ్చితంగా ప్రతిరోజు చేయాలి చేయడానికి నేను మీకు ఏడు పాయింట్స్ చెప్తా ముఖ్యంగా ఈరోజు చెప్పబోయే పాయింట్స్ లో
(06:11) నిశ్చలత్వాన్ని ఎలా సాధన చేయాలి మనం మనం నిశ్చలంగా ఉన్న పక్కవాడు డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి మన నిశ్చలత్వాన్ని మనం నిరంతరం ఎలా కాపాడుకోవాలి అది పట్టుకోవడం ఒక ఎత్తు అయితే కాపాడుకోవడం రెండో ఎత్తుతో అన్నిటికన్నా ఇంకొక ముఖ్యమైనది మన సాధన తీవ్రత పెరిగినప్పుడు ప్రాపంచిక జీవితంలో నుంచి డిస్కనెక్ట్ అవుతాం ఇది కూడా ఉందండి అంటే మీరు నిశ్చలత్వ సాధన చేసే కొద్దిగా ప్రాపంచిక జీవితం ఆసక్తి తగ్గిపోద్ది దాన్ని ఎలా దాటాలి ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాల కి ముగ్గురు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు రెండు నిమిషాలకి
(06:47) ముగ్గురు ఇక మీరు ఊహించండి ఎంతమంది చనిపోతున్నారు మనం ఊహించినంత మంది ఆత్మహత్యం చేసుకుంటున్నారు ఇందులో 80% చిన్న పిల్లలు టీనేజర్స్ అంటే ఎంత బాధాకరం అండి ఇది కనుక ఇదన్నిటికి కారణం ఏంటంటే ఆ నిశ్చలత్వం లేకపోవడమే అందుక నిశ్చలత్వం సాధన చేయడానికి నేను ఏడు మార్గాలు చెప్తాను మీకు మార్గాలు ఒకటి నెంబర్ వన్ ప్రకృతిలో నిశ్చలత్వాన్ని గమనించండి ప్రతిరోజు మీ యొక్క దినచర్యలో ప్రథమ భాగం ఏంటంటే ఒక్క 20 నిమిషాలు ాలు ప్రకృతిలో ఉన్న నిశ్చలత్వాన్ని గమనించాలి.
(07:17) ప్రకృతిలో నిశ్చలత్వం అంటే ఏంటి చెప్తాను మీరు పొద్దున్నే లేసి డాబా మీద కూర్చోండి డాబా మీద ఆ ప్రకృతిని గమనిస్తూ కూర్చోండి ఆ పక్షులు ఎగురుతా ఉంటాయి తర్వాత చెట్లు కదులుతా ఉంటాయి అన్ని నిశ్చలంగానే ఉన్నాయి అడవి లేదు ఏ కంగారు లేదు వాటి పనే చేస్తున్నాయి చాలా నిశ్చలంగా ఉంటది అన్నమాట నిశ్చలత్వానికి రెండు ప్రకృతిని గమనించాలి మీకు రెండు పోస్టర్స్ చెప్తాను ఇప్పుడు రెండు పిక్చర్స్ చెప్తాను పిక్చర్ నెంబర్ వన్ అందులో ఒక పక్షి చాలా ప్రశాంతంగా హాయిగా కూర్చునింది ఒక పక్షి వెన్నెల పండు వెన్నెల లేకపోతే చాలా పీస్ ఆఫ్ సైలెన్స్ అక్కడ ఇంత డిస్టర్బెన్స్ కూడా లేదు అది
(07:55) పక్షి ఇలా కూర్చుని ఉంది ఓకే అండి అది ఒకటి రెండో పిక్చర్ లో ఒక పక్షి పోరు అనే పెద్ద జలపాతం పడుతుంది దాని పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మ మీద చిన్న పక్షి గూడు కట్టుకుంది ఆ గూట్లో తన పిల్లలతో ఒక పక్షి ఉంది ఆ గాలికి ఆ హోల్ చప్పటికి ఇలా ఊగుతా ఉంది ఆ తుప్పర దాని మీద పడుతుంది అయినా అది ఇలా నిశ్చలంగా కళ్ళు మూసుకొని ఉంది.
(08:19) ఈ రెండిట్లో ఏది నిశ్చలత్వంలో ఉందో చెప్పగలరా మీరు అంటే మనం సాధారణంగా మొదటి పిక్చర్ లోనే సైలెన్స్ ఉందండి మొదటి పిక్చర్ లో గందరగోళం లేదండి ప్రశాంతంగా ఉందండి సో అందులో అదే నిశ్చలత్వం అంటారు కాదు కాదు రెండోది నిశ్చలత్వం అంటే సరికాని పరిస్థితుల్లో కూడా గంధరగోళాల మధ్య కూడా భయంకరమైన సౌండ్స్ మధ్యలో కూడా మీ నిశ్చలత్వంలో ఉండడమే నిశ్చలత్వ సాధన అర్థమైందా అండి ఇది ప్రకృతి నుంచి నేర్చుకోవాలి.
(08:47) అంటే అక్కడ ఏమైనా జరుగుతుంటాయి ప్రకృతిలో రకరకాలు జరుగుతుంటాయి. కానీ దేని పనిలో అది నిశ్చలంగా ఉంది ఇది మీరు రోజు చేయాల రోజు చేయాలంటే దానికి ఏం చేయాలంటే ఈఎస్పి అని ఒక సాధన ఉంది ఈఎస్పి ఎక్స్ట్రా సెన్సింగ్ పవర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలంటే పొద్దున్నే లేసి పంచేంద్రియాలు ఐదు మీకు ఐదుటికి పని చెప్పాలి.
(09:11) ఫస్ట్ చుట్టూతో ఉన్న ప్రకృతిని చుట్టూత ఏముంది అక్కడ ఏముంది ఇక్కడ ఏముంది ఆ అన్ని గమనిస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి బాగా లోతుగా చూస్తూ ఉండాలి అందుకని ఏం చేయాలంటే మీరు నిశ్చలత్వ సాధన చేయాలంటే ప్రతిరోజు మీరు పొద్దున్నే లేసి మీకు ఎంతవరకు దృశ్యాలు కనబడతాయి ప్రకృతి దృశ్యాలు మనుషుల వైపు ఆ ఎళ్ల వైపు చూడకండి ప్రకృతి వైపు మీరు చూడాలి ఒక ఐదు నిమిషాల పాటు నిచ్చనంగా అన్నిటిని అలా గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ ఉండాలి మీరాబాయి లాగా మీరా మిరప అయింది చూసారా చిన్న తుమ్మిరి పట్టుకొని అలౌకికంగా టింటది ఆమె ఎంత అలౌకికంగానో అది సాధన చేయాలి మీరు
(09:46) ఈరోజు నిశ్చలత్వ సాధనలో మొట్టమొదటిది ప్రకృతిలో నిశ్చలత్వాన్ని గమనించండి రూల్ నెంబర్ వన్ రూల్ నెంబర్ టూ నో ఆర్ ఎస్ నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పడం నేర్చుకోండి. రూల్ నెంబర్ టు నో ఆర్ ఎస్ నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పాలి. దీన్ని ఏమని చెప్తాం అంటే మనం చాలామంది అండి నేను ఆర్థిక సమస్యల్లో ఉన్నవాళ్ళు గాని ఆర్థికంగా ఇబ్బందులు పడ్డ వాళ్ళు గాని లేకపోతే మానసికంగా గాని కుటుంబంలో బాధలు గాని లేకపోతే రకరకాలు ఏదైనా గాని ఇతరుల చేతిలో మోసపోయిన వాళ్ళు అనుకుందాం కాసేపు వాళ్ళందరినీ నేను స్టడీ చేస్తే నా దగ్గర బోల్డ్ కేసులు వస్తుంటాయి కదా వాళ్ళందరూ
(10:22) మొహమాటంలో చెప్పిన కేసులే ఉంటాయి మొహమాటంలో అందుకనే ఈ లోకం ఎలా ఉంటది అంటే అవతల వాళ్ళని మొహమాట పెట్టి వాళ్ళ పనాలు చేసుకునే లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీ ఇంటికి వాడు వస్తాడు. నేను ఇదిగో ఫలానా చోట ఇది తీసుకున్నాను ఇదిగో నువ్వు కూడా తీసుకో అసలు ఎంత వస్తాయి అనుకున్నావ్ అది అనుకున్నావ్ ఇది అనుకున్నావ్ ఇది ఇడ కట్టేయ్ నువ్వు జస్ట్ ఒ లక్ష పెట్టు నీకు 10 లక్షలు వచ్చేస్తాయి ఇదిగో నేను మొన్నే కట్టాను నాకు ఎంత వచ్చిందో చూడని ఒత్తిడి చేస్తారు.
(10:49) అంటే మీకు ఒక మొహటం పెట్టేస్తారుఅన్నమాట ఒక ఒత్తిడిలోకి పెట్టేస్తారు. మీరు ఎమోషన్ లో ఉంటారన్నమాట. ఎమోషన్స్ అందరం పెట్టారు సర్ అంతే అక్కడి నుంచి అందులో ఏరుకుంటారు ఇలాగ ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కుటుంబ పరంగా ఎన్ని బాధలో మనకి ఇన్నీ పోవాలంటే ఫస్ట్ నిశ్చలత్వంలో రావాలి అవతలోడు ఏమన్నా చెప్పనే నువ్వు ఎందుకు బురకట్ట అనాలా చెప్పనే చెప్పు నాయనా చెప్పు అంటే మొహమాటము మొహమాటం అనేది తీసేయాలి అది అంత సులువు కాదు ఎదుటి వ్యక్తిని మనం గౌరవిస్తాం కాబట్టి వాళ్ళకి పెద్దవాళ్ళ లేకపోతే కుటుంబ సభ్యులో లేకపోతే ఇంకోటి ఇంకోటో అనుకుంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే
(11:22) దానికి నికి నో చెప్పాలి లేదా ఎస్ చెప్పాలి కానీ మీరు చెప్పలేరు. వాళ్ళ మొహోటంతో నో చెప్తారు లేదా వాళ్ళ మొహోటంతో ఎస్ అని చెప్తారు కదా అందుకని మీరు ఏం చేయాలంటే నో ఎస్ నిశ్చలంగా ఉన్నప్పుడు చెప్పాలి మరి ఇప్పుడు నిశ్చలంగా లేరు కదా వాళ్ళ మైండ్ లో మీరు ఉన్నారు మిత్రులారా గుర్తుపెట్టుకోండి మరలా చెప్తున్నాను ఈ ప్రపంచం మొత్తం వాళ్ళ మైండ్లో మరొక ఇరికించుకునే ప్రపంచంలో ఉన్నాము మిమ్మల్ని మరొకడు వాడి మైండ్ లో ఇరికించుకున్నాడు.
(11:48) నిజంగా జన్మిన వాడు ఎవడైనా సరే ఎస్ ఆర్ నో అని చెప్పడానికి టైం ఇస్తాడు శ్రీరామచంద్రుడు స్వయంగా సీతమ్మకి వెళ్లి విరిచాను కాబట్టి పెళ్లి చేసుకుంటాను అనలేదు నువ్వు నో ఆర్ ఎస్ రేపు వద్దని చెప్పు కొంత టైం తీసుకొని చెప్పు అన్నాడు రియల్ మాస్టర్ ఎప్పుడు టైం ఇస్తాడు నేను ఒకటికి నాలుగు సార్లు అడుగుతా తెలుసా ఒక్కొక్కనే నువ్వు ఓకేనా నువ్వు నీవు ఏమి ఇబ్బంది పట్టలేదు కదా నువ్వు ఎటువంటి ఎమోషన్లో ఒప్పుకోవట్లేదు కదా నువ్వు వస్తాను అన్నావు కదా ఈ ప్రోగ్రాం చేస్తాను అన్నావు కదా ఆర్ యు ఓకే అని మూడు సార్లు అడుగుతాను ఆర్ యు ఓకే వాళ్ళ వాళ్ళు ఎస్ అంటారు అంటే అప్పుడు ఓకే
(12:20) అప్పుడు చేయాలన్నమాట సో మీరు అలాంటి ఎమోషనల్ ఇంబాలెన్స్ చే మైండ్ ఎమోషనల్ మైండ్ ని మన ఎమోషన్ క్యాప్చర్ చేసే వాళ్ళ దగ్గర ఎలా బయటపడాలంటే నో గాని ఎస్ గాని చెప్పకూడదు. టేక్ యువర్ ఓన్ టైం వాయిదా పద్ధతి వాడాలి ఇక్కడ అర్థమవుతుందా మీకు ఎప్పుడు మీరు వాయిదా వాడతారు ఆ రేపు చెప్తానండి కచ్చితంగా చేసేద్దాం అని వాళ్ళకి ఆశ కలిపించి రేపు చెప్తానండి అన్నారా రేపు ఒక్క రోజు ఒక్క రోజు టైం ఉన్నాను కానీ వాళ్ళు అమ్మాయి ఒకే ఒప్పుకుందలే ఒక రోజు టైం ఇద్దాంలేని వాళ్ళు సర ఓకే అంటారు రెండో రోజు మీకు నిశ్చలత్వం వచ్చేస్తది.
(12:56) రెండో రోజు మీరు ఎస్ చెప్పాలో నో చెప్పాలో డిసైడ్ చేసుకోండి. అది ఏ విషయాలు అయినా వ్యాపారం అమనయి వ్యవహారాలు అవన చిట్లు అవని ఫైనాన్స్ లో ఉన్న ఎక్సట్రా ఎక్సెట్రా ఎంతమంది బలి అయిపోయారు ఇలాగ నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఎన్ని కేసులు వస్తుంటాయి తెల్లర్లేసి సో మిత్రులారా ఎవరిని కూడా మనము నెప్పించకూడదు మొహమాట మనకి వాళ్ళు ఏమనా అనుకుంటారేమో అన్న భావనలో మనం చెప్పేస్తాం అందుకని నో గాని ఎస్ గాని అసలు చెప్పకండి నిశ్చలత్వంగా ఉంటే క్లారిటీతో ఉంటే స్పష్టంగా ఉంటే చెప్పేయండి.
(13:27) లేదంటే మీరు దాన్ని దాన్ని ఇంకా మరి మామూలుగా ఉండదు దాని కథ చాలా డామేజ్ అవుతాం అన్నమాట ఇన్ని ఆర్థిక సమస్యలు ఇన్ని ఇందులోనే ఇరుక్కున్నాయి చిట్లు వేసిన దగ్గర నుంచి ఫైనాన్స్ కట్టిన దగ్గర నుంచి అటు ఇది తెచ్చిన దగ్గర నుంచి అందుకని నో ఆర్ ఎస్ వెంటనే చెప్పకండి నిశ్చలత ఉన్నప్పుడే చెప్పండి ఇది రూల్ నెంబర్ టూ నో ఆర్ ఎస్ చెప్పడంలో ఫెయిల్ అయిన ఒక వ్యక్తి గురించి చెప్తాను నాకు చాలా ఇష్టం ఈ స్టోరీ సెల్యుడు మీరు వినే ఉంటారు ఈ స్టోరీ సెల్యుడు అతని పేరు సెల్యుడు ఎవరంటే మహాభారతంలో ఆ పంచపా పాండవులకి మామ అవుతాడు తర్వాత దుర్యోధన దుశాలకి మామ అవుతాడు కౌరవులకి
(14:00) పాండవులకి ఇద్దరికీ బంధువులు ఆయన వీళ్ళద్దరూ యుద్ధంలో పాల్గొన్నప్పుడు అందరిని పిలుస్తారు మీరు మా వైపు ఉండండి మా వైపు ఉండండి అని అందరిని పిలుస్తారు అందరిని పిలిచినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సెల్యుడు వస్తున్నాడని దుర్యోధనుకి తెలిసిపోద్ది శకునికి తెలిసిపోద్ది తెలిసిపోయి సెల్యూర్ని ఎలాగైనా క్యాప్చర్ చేయాలి ఎందుకంటే సెల్యుడికి మంచి బలం ఉంది మంచి సైన్యం ఉంది కాబట్టి వీడిని ఎలాగైనా క్యాప్చర్ చేయాలని సెల్యుడు వచ్చే దారి అంతా అతనికి పెద్ద పెద్ద ఫ్లక్సీలు అతనికి కి వెల్కమ్ చెప్తూ పెద్ద పెద్ద డాన్స్ బృందాలు ఏర్పాటు చేస్తాడు. ఇంకా శెల్యుడు ఉప్పు
(14:30) పోతాడు అబ్బో నాకు ఎంత ఏర్పాట్లు చేసాడు ఎంత ఏర్పాట్లు చేశాడు అని ఉత్సాహంతో వస్తాడు. వచ్చిన తర్వాత టెంట్ లోకి వచ్చిన తర్వాత మంచి భోజనం పెడతారు. అప్పటిదాకా ఎవరు పార్టీ కూడా తెలియదు ఆయనకి అంత మత్తులో ఉంటాడు. ఎందుకంటే సెల్ఫ్ ఐడి మొత్త అది. సో భోజనం పెట్టిన తర్వాత శకుని దుర్యోధనుడు పక్కన దాక్కుంటారు దాక్కొని మిగతా వాళ్ళందరూ మామ మామ అని వచ్చిన తర్వాత ఆ నేను నీ వైపే అని సంతకం పెట్టేస్తాడు డాక్యుమెంట్ మీద పెట్టిన తర్వాత అప్పుడు దుర్యోధనుడు వెనక నుంచి వచ్చి థాంక్యూ మామ అంటాడు ఏంటి నువ్వా నేను నీ వైపు వచ్చానా ధర్మరాజు వైపు కాదా
(15:01) అంటాడు అదేంటి మామా నేను నీకు అల్లుడిని కాదా మామా అని దేనంగా మామ పెడతారు వీళ్ళద్దరు అనగానే ఆ ఓకే ఓకే సరే అని చెప్పేసి ఒప్పేసుకుంటాడు. తర్వాత మళ్లా వాళ్ళ దగ్గరికి వెళ్లి అక్కడ చివర్ట్లు తింటాడు ఇంటి తిమంటాడు చివరిగా దారుణంగా చనిపోతాడు కనుక ఒక మొహమాటం మనల్ని ఎలా ఇబ్బంది పెడతదో సెల్యుడే ఎగ్జాంపుల్ కనుక కేర్ఫుల్ ఇక మూడో పాయింట్ లోకి వెళ్ళిపోదాం నిశ్చలత్వ సాధనలో మూడో పాయింట్ కాలం మారిందాక ఎదురు చూడాలి.
(15:26) మీరు ఏమి చేయలేని కాలం ఒకటి ఉంటది. ఆ సరికాని కాలం అది సరికాని కాలం మీరు ఎందుకు ఆవేశపడిపోతున్నారు ఎందుకు మీ నిశ్చలత్వం పోగొట్టుకుంటున్నారు మీ నిత్య చిత్తాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు కాలం మీది కాదు కదా నిశ్చలంగా ఉండండి ఎందుకు తొందర చెప్పండి ఇప్పుడు నీ కాలం కాదు నీ బలం లేదు ఇక్కడ మౌనంగా ఉండు సైలెన్స్ అయిపోయాయి కదా అందుకని ఈ నిశ్చలత్వ సాధనలో ఈ కాలం మారిందాక ఎదురు చూసిన వ్యక్తుల్లో ఇంకొ ఇంకో కథ ఉంది నేను చెప్తున్నది అతని పేరు ఎస్ యూస్ అను అని కూడా అంటారు అతన్ని అతను ఎవరంటే ఆ మహాభారతంలో పంచపాండవులు పక్కన పెడదాం కౌరవులు నూరుగురు ప్లస్ ఒక
(16:06) ఆడపిల్ల 10101 మంది పుడతారు ధృతరాష్ట్రుడికి ఆ పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది ఇటువైపుేమో తన తమ్ముడు ఆ పిల్లల్ని కంటున్నాడు వాళ్ళు రాజ్యాధికారం వస్తుందని భయంతో ధృతరాష్ట్ుడు ఏం చేస్తాడంటే గాంధారి మీద కోపంతో ఒక దాసిని పెట్టుకుంటాడు దాసిని పెట్టుకొని ఆమెతో కాపురం చేసి పిడ్డని కంటాడు అతను అన్నమాట అంటే ఒక మాటలో చెప్పాలి అంటే అతను అకర్మ సంతానం ఎంత అవమానం సెల్యుడికి చూడండి తర్వాత నూరు పుడతారు అది వేరే విషయం పక్కన పెడదాం ఇతనికి చిన్నప్పటి నుంచి అన్ని అవమానాలే చిన్నప్పటి నుంచి సెల్యుడు ఎన్నో బాధలు ఎదుర్కుంటాడు దాసి పుత్రుడు కదా [నవ్వు]
(16:44) దాసి పుత్రుడు అంటే ఏంటి అనుకున్నారు వాల్యూ లేదు వాళ్ళకి అసలు మనుషుల కూడా చూడరు అలాంటి కాలం అది సో మొత్తం మీద వాల్యూ లేని జీవితాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ అనుభవిస్తూంటాడు ఎప్పుడు మాట్లాడరు ఎప్పుడు ధర్మం వైపు ఉంటాడు ఫైనల్ గా యుద్ధం జరిగింది యుద్ధం అయిపోయింది ఎవ్వరి వైపు ఉండడు ధర్మం వైపే నిలబడతాడు ఫైనల్ గా ఏం జరిగిందో తెలుసా మీకు వీళ్ళందరూ వెళ్ళిపోయారండి పంచపాండవులు కైలాసం పోయారు వాళ్ళు స్వర్గారోహణానికి వెళ్ళిపోయారు ఈ నూరుగురు చనిపోయారు ఇంక రాజ్యం ఎవరికి ఇవ్వాలి అని చెక్ చేస్తే ఒకే ఒక్కడు ఉన్నాడు ఎవరా ఒక్కడు ఇదిగో అర్జునుడు వారసుడు అంటే ఈ
(17:21) పంచపాండవులకి ఉన్న ఒకే ఒక్క వారసుడు ఎవరు ఇతను పరీక్షిత్తు అర్జునుడు మనవడు ఒకే ఒకడు మిగిలాడు అతను చిన్న పిల్లడు అతను రాజుని చేయలేరు ఏం చేద్దాం అని తితే వీళ్ళ వంశంలో మిగిలిన ఏకైక ఆఫ్రక్తం ఆఫ్రక్తం అనుకున్నాం కాసేపు దాజీ పుత్రుడైన వాళ్ళకి వేరే దిక్కు లేదు ఆ అతన్నే పెట్టారు అయితే ధర్మరాజు అతనికి వాల్యూ ఇస్తాడు అతనికి వాల్యూ ఇచ్చి అతన్నే రాజుగా చేసి అంటే ఆపద ధర్మ ముఖ్యమంత్రి అంటారు కదా అలాగా అలా పెట్టి అతన్ని గార్డియన్ గా పెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతారు.
(17:53) మొత్తం సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ ఎన్ని అవమానాలు పొంది ఉంటాడు శల్యుడు సారీ యేసు ఎన్ని అవమానాలు పొందాడు ఎన్ని బాధలు పొందాడు ఎన్ని కష్టాలు పొందాడు కానీ చివరికి రాజ్యాన్ని భోగించింది ఎవరు నా రాజ్యం నా రాజ్యం అనుకున్న దృతరాష్ట్ుడు పోయాడు దుర్యోధనుడు పోయాడు దుశాసనుడు పోయాడు అన్నో ఎత్తులు పై ఎత్తులు వేసిన శబును వెళ్ళిపోయాడు ఎవ్వడు మిగలలేదు పంచపాండవులకు రాజ్యం అక్కర్లేదు వాళ్ళు వెకేట్ చేసి వెళ్ళిపోయారు మాకు అవసరం లేదు కంప్లీటెడ్ మై జాబ్ కంప్లీట్ వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలింది ఒకే ఒకడు ఏయస్సు ఏయస్ హాయిగా కూర్చొని రాజ్యాన్ని అనుభవించాడు భోగించాడు చూసారా కాలం ఎంత
(18:29) మారిందో అందుకని మిత్రులారా సరికాని కాలం సరి అయిందాక వెయిట్ చేయండి ఎందుకంటే జీవితం ఇలా వెళ్లి ఒక్కొక్కసారి ఇలా డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళిపోతది. మళ్ల ఇలా లేసి మళ్ళ పైకి వస్తుంది కచ్చితంగా వస్తుంది. ఒక పాట కూడా ఉంది పడిలేచే కడలి తరంగం అంటాడు కడలి తరంగం పడుతది మళ్ళీ లగుస్తది కదా ఏం తొందరా ఈలోపే నీకు అన్ని అయిపోవాలా చెవి నిశ్చలతో సాధన చేయాలంటే సరికాని కాలంలో ఏం చేయాలి నిశ్చలతో సాధన చేయాలి నిశ్చలంగా అయిపోండి ధ్యానంలోకి వెళ్ళిపోండి నేను చేసేది ఏముంది రెండేసి గంటలు మూడేసి గంటలు నాలుగేసు గంటలు ఐదేసి గంటలు నేను మామూలుగా వన్ అవర్ ధ్యానం
(19:05) చేసుకుంటాను రెగ్యులర్ గా ఒక గంట ధ్యానము సత్సంగాలు ఇవన్నీ ఉంటాయి నాకు నా జీవితంలో నేను హైస్ట్ ధ్యానం మహా అయితే గంట రెండు గంటలు చేసిఉంటా కానీ ఒకసారి సరికా సరికాని కాలంలో ఎరుకున్నాను నేను సరికాని కాలం నాకు ఇంక ఏం చేయని పరిస్థితులు అన్నమాట అప్పుడు నేను ఏం చేశనో తెలుసా మా ఇంట్లో పైన పిరమిడ్ ఉంటది అందులోకి వెళ్లి కూర్చునిపోయా 10 గంటలు కూర్చుంటే 11 12 ఒకటి రెండు మూడు నాలుగు గంటలు ఇచ్చేవాడి ఆరుఏడు గంటలు చేశను నేను నేను ఆశ్చర్యపోయాను ఇంతసేపు నేను ఎట్లా కూర్చున్నాను అని అంతే అట్లా నిశ్చలంగా అయిపోవాలి ఇంకా ఏం చేయాలి చేయడానికి ఏమ
(19:35) లేదు మిత్రులారా ఎవరి మీద పోట్లాడాలి ఎవడితో యుద్ధం చేయాలి ఎవడిని ఏం చేయాలి అప్పుడు అప్పుడు సరికాని కాలం మళ్ళ అలైన్మెంట్ అయి మళ్ళా సరి అవుతుంది అద్భుతంగా ఉంటది అప్పుడు ఎందుకంటే జీవితం ఎప్పుడు ఒక్కలా వెళ్లదు ఇదిగో ఇలా వెళ్తుంది ఒకోసారి డౌన్ స్ట్రీమ్ కి వెళ్ళిపోతుంది మళ్ళ పైకి వస్తుంది మళ్ళ అప్పుకి వెళ్ళిపోతది అప్పుకి వెళ్ళినప్పుడు ఓ ఉత్సాహంతో ఇరిగేసి ఇరిగేసి కొరిగేసి నా అంతటోడు లేడు అని అనకూడదు అలాగే డౌన్ కి వెళ్ళినప్పుడు మీరు బాధపడకూడదు రెండు ఉండకూడదు ఈ రెండిటిని బాలెన్స్ చేసేదే నిశ్చలత్వపు సాధన వాయు ప్రసారము లేని చోట దీపము వలె యోగి
(20:11) నిశ్చలంగా ఉండవలెను ఎంత అద్భుతమైన పదం చూడండి అందుకని వాయు ప్రసాద చోట దీపాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఒకసారి దాన్ని వెనక చూసి ఓకే నేను కూడా అలా నిశ్చలంగా ఉండాలి అనుకోండి ఆటోమేటిక్ గా ఉన్న కొన్నాళ్ళకి మీ మైండ్ అలా కంట్రోల్ అవుతుంది కనుక మూడో పాయింట్ కాలం మారిందాకా ఎదురు చూడాలి తర్వాత నాలుగో పాయింట్లోకి వెళ్దాం నాలుగో పాయింట్ మార్చలేని వాటిని అంగీకరించండి.
(20:35) మనం మార్చలేం కదండీ ఇంకెందుకు దాని మీద పోరాటం దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంగీకరించాక మళ్ళ దానికి తగ్గ అలైన్మెంట్ అవుతది అలైన్మెంట్ అవుతది మారదు కానీ అలైన్మెంట్ అవుతది. మార్చలేనిది ఏదైతే మీ జీవితంలో ఉందో దాన్ని ఫస్ట్ అంగీకరించాలి ఎస్ ఇది నేనే తెచ్చుకున్నాను ఈ వాస్తవాన్ని నేనే సృష్టించుకున్నాను నేను దీన్ని అంగీకరిస్తున్నాను ఓ అనంత విశ్వ ఐ యమ యక్సెప్టెడ్ నేను నేను ఓకే నేను తీసుకుంటున్నాను అయితే ఇది నేనే సృష్టించుకున్నాను అన్న అవగాహన కలిగిన మనుషు అది ఇంకో డైమెన్షన్ తీసుకుంటది.
(21:08) కనుక మార్చలేనిది ఏదైతే ఉందో దాన్ని మీరు అంగీకరించాలి. మార్చలేని దాన్ని అంగీకరించిన వాళ్ళ ఒక క్యారెక్టర్ గురించి చెప్పనా కౌసల్య చూసారా కౌసల్యదేవి స్టోరీ మీకు తెలుసు కదా శ్రీరాముడు తల్లి బిడ్డని ఎంత అల్లారి ముద్దుగా పెంచుకున్న ఆమెని 14 సంవత్సరాలు అడవికి వెళ్ళిపోవాలంటే ఏ తల్లి ఎలా బాధపడకుండా ఉంటది చెప్పండి నరకం కదా ఆ పైగా ఆమె భర్త ఆర్డర్ అది అందున ఆయన చిన్న ముద్దుల భార్య కైక కోరిక ఎలా ఉంటదండి ఒక స్త్రీకి సరే ఆయన ఏదో ఆయన పోయాడు ఆమె చిన్న భార్యతో ఉన్నాడు అది పెద్ద బాధ అనిపించదు కొంత అన్నా ఉంటది కానీ అతని కోసమే బతుకు రాముడి కోసమే బతుకుతుంది కౌసల్య రాముణని మనమే
(21:48) వదలలేము ఆమె ఎలా వదిలేసింది చెప్పండి ఎంత కష్టం కౌసల్యదేవికి అయినా ఆమె ఏం చేసిందో తెలుసా సరికాని కాలం మళ్ళా సరైందాక ఎదురు చూసింది 14 సంవత్సరాలు ఇలాగ తిరిగి మళ్ళా రాముడి ఇంటికి వచ్చి మళ్లా ప్రతాప శక్తుడు అయిందాక 5000 సంవత్సరాలు పరిపాలించాడు ఇంక బోల్డ్ టైం ఉంది. అందులో 14 సంవత్సరాలు చాలా చిన్నది.
(22:09) ఆమె ఎదురు చూసింది సరికాని కాలం మారి సరికాని కాలం వచ్చిందాక మళల అలాంటి క్యారెక్టర్ ఇంకోటి అహల్య ఆమె కూడా సరికాని కాలంలో ఎరుక్కుంది కట్టుకున్న భర్త నిందేసి వెళ్ళిపోయాడు సమాజం రాళ్ళ వేసింది ఏం చేసింది సైలెన్స్ సరి అయిన కాలం వస్తది వస్తది మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో ఎవ్వరికీ ఒకేలా ఉండదు క్రికెట్ ఆర్ట్ చూడండి ఎంత భయంకరంగా ఉన్న బ్యాటింగ్ బౌలర్ భయంకరమైన బౌలర్ వస్తాడు ఈ బ్యాట్స్మన్ ఎదుర్కోవాలి కరెక్ట్ గా ఆరు బాల్స్ తర్వాత పోతాడు కదా ఇంకోడు వస్తాడు డోంట్ వరీ వాడు ఆరు బాల్స్ ఏ ఉంటాయి వాడికి వాడు ఎంత పీక్ ఉన్నా ఎంత చింపుకున్నా వాడికి ఇచ్చేది ఆరు బాల్స్ే
(22:44) ఇంకేంటి కనుక అప్పుడు ఏం చేయాలి అసలైన అసలైనది అది నువ్వు అప్పుడు నిశ్చలంగా ఉండాలి డిఫెన్స్ ఆడు సిక్స్ కొట్టొద్దు ఫోర్ కొట్టొద్దు డిఫెన్స్ అవుట్ అవ్వకుండా చూసుకో అలాగే మనం కూడా సరికాని కాలములో ఆత్మహత్య చేసుకోకుండా చూసుకోవాలి హత్య చేసుకోకుండా చేయకుండా చూసుకోవాలి ఎవరిని మనల్ని మనం ఎవరినో కాదు చంపేయ పొడి చేయలే చచ్చిపో అంటది ఈ మనసు దాన్ని నియంత్రిస్తూ నియంత్రిస్తూ శ్వాస మీదకి వెళ్ళాలి శ్వాస అన్న గురువు చెంతకు వెళ్ళాలి ఇంకొక్క మార్గం ఏ మార్గం లేదు మిత్రులారా అన్నమై పాట ఒకటి విన్నారా లేదా మీరు ఆకటి వేళ అలుపైన వేళ ఇంత అద్భుతమైన కీర్తన అంటే
(23:24) ఇది అన్నమయ్యని జైల్లో వేసినప్పుడు రాసిన పాట ఇది మహారాజు పాటలు రాయమంటాడు రాయకపోతే ఆయన జైల్లో వేస్తారు అన్నమాట ఆయన రాసిన పాట అండి అది ఏం పాట రాసాడో తెలుసా ఆకటి వేళ అలుపైన వేళ చేకోను హరినామం ఒక్కటే గతిగాక చంప బెలిసిన వేళ కులము చెడిన వేళ అంకెలగా అప్పులవారాగిన వేళ ఇంతకుముందు అప్పులవాళ్ళందరూ పోగయినప్పుడు చంపడానికి విలిసినప్పుడు సంకెలు లేసేటప్పుడు కులము చెడినప్పుడు కులము కులం అంటే అందరూ పరువు తీసేసి ఊళలోంచి గండేస్తారు అప్పుడు హరినామం ఒక్కటే గతిగాక ఏ యుద్ధాలు అవసరం లేదు ఏ పరుగులు పెట్టద్దు నువ్వు నిశ్చలం అయిపో
(24:07) హరినామం అంటే మనం ధ్యానము ఆయనకు నామం మనకు ధ్యానము శ్వాస అన్న గురువునే పట్టుకోవాలి కళ్ళు మూసుకోండి శ్వాస అన్న గురువే మీ చేయి పట్టుకొని తీసుకెళ్తాడు ఆయన దగ్గర కూర్చోండి చాలు ఆయన చూసుకుంటాడు అబ్బా నీకు ఎందుకు ఇంకా శ్వాస అన్న గురువు నీ లోపల ఉన్నాడు కదా ఇంకేంటి అందుకని సరికాని కాలం సరి అయిందాకా శ్వాస అన్న గురువు చెంతన ఉండండి కాలం మారుతుంది మళ్ళ బయటికి వచ్చేసి పండగ చేసుకోండి అంతే మిత్రులారా అప్పటిదాకా మీరు చంపకూడదు చావకూడదు మాట్లాడకూడదు చూడ చూడకూడదు వేనకూడదు ఆల్ క్లోజ్ షట్ డౌన్ ఈ షట్ డౌన్ టెక్నాలజీ నేర్చుకోవాలి మనం ఓకే సో మళలా ఐదో
(24:44) పాయింట్లోకి వెళ్ళిపోదాం మనసు చేసే మాయలపై సాక్షిగా ఉండండి మనసు కొన్ని మాయలు చేస్తుందండోయ్ మన మనసు ఈమ మన నిశ్చలత్వాన్ని పాడు చేసేది ఎవరో తెలుసా మనసే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు మీకు ఆ పెద్ద టీవీ కనపడింది ఆ మీరు దాన్ని కొనాలనిపిస్తది జస్ట్ పే 1000 టేక్ హోమ్ అంట అంటాడు [నవ్వు] తర్వాత మీరు కట్టలేక చావాల ఒక నెల కట్టకపోతే రెండో నెల దానికి టాక్స్ వేసి 0% ఇంట్రెస్ట్ అంటారు ఇదంతా పెద్ద మాయ మొత్తం మీరు ఒక్క నెల కట్టకపోతే బోళ అంత టాక్స్లు ఇస్తారు క్రెడిట్ కార్డులు ఆ ఈఎంఐలు ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయిన వాళ్ళందరూ దేని
(25:20) నుంచి ఇదిగో మనసు చేసే మాయల పై సాక్షి ఉండక అది అడుగుతది కార్ తీసుకెళ్ళండి ఎంతండి జస్ట్ మీరు ఒక రెండు లక్షలు కట్టేయండి నెల నెల కట్టేయచ్చు అంత పెద్ద విషయం ఏంటి అంటాడు వాడు మీరు మొహటానికి ఇరుక్కోనో దాని మీద మాయతోనో ఆ మనసు చేసే మాయతోన తెచ్చుకుంటారు తర్వాత దాన్ని మెయింటైన్ చేయద్దా చెప్పండి వైట్ ఎలిఫెంట్ కథే ఇంకా కనుక ఏదైనా సరే మనసు చేసే మాయలో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటే మూడుసార్లు వాయిదా వేయండి మూడుసార్లు అవునా ఇది అడుగుతుంది నా మనసు ఓకే ఒకటోసారి రెండోసారి మూడోసారి మూడుసార్లు మూడు సిచువేషన్లు వాయిదా వేయండి నాలుగోసారి
(25:58) కూడా కోరుకుందనుకో అప్పుడు దాన్ని తీసుకోండి. కొనుక్కోండి ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ లో చాలా మంది ఇరుక్కునేది మనసు చేసే మాయల వల్ల తర్వాత ఆకర్షణ ఇవి మీకు ఆకర్షణలో కూడా మనసు చేసే మాయలు వీటి పట్ల సాక్షిగా ఉండాలి అందుకని మీ మనసు ఏదైతే మాయ చేస్తుందో ఏదైతే కోరుకుందో దాని పట్ల సాక్షిగా ఉండాలి సాక్షి అంటే ఇన్వాల్వ్ అవ్వకుండా అలా నిశ్చలంగా చూస్తూ ఉండాలి ఆ మాయల్ని ఎప్పుడైతే నువ్వు సాక్షిగా ఉన్నావో మనసు ఏం చేస్తుందో తెలుసా అండి ఇంకా అది ఆపేస్తది ఇవ్వడం మనసుకి నువ్వు ఇన్వాల్వ్ అయితే ఇస్తది కానీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా అలా
(26:28) నుంచుంటే ఏం చెప్తుంది దానికి చెప్పండి అందుకని ఇన్వాల్మెంట్ అనేది మనసుకి కావాలి నీ ఎమోషన్స్ దానికి ఆహారము నీ మనసు చేసే మాయల పట్ల నువ్వు నిశ్చలంగా ఉన్నావ అనుకో సాక్షిగా ఉన్నావ అనుకో అది ఏం చేయట్లేదు వాడు ఎవడో చేస్తున్నాడు అన్నట్టు అలా చూస్తూ ఉండండి ఆ కోరిక పట్ల ఆ తపన పట్ల కోపం పట్ల మోహం పట్ల ఆ కామం పట్ల ఆ క్రోధం పట్ల అసూయ పట్ల ఉండండి చూస్తూ ఉండండి అది ఆపదో మీరు ఏదో మనసుని కట్టోలు చేయొచ్చు అనుకుంటున్నారు అవ్వదు అలా చూస్తూ ఉండండి సాక్షిగా చూస్తూ ఉండడం ఏంటండి నేను ఎవరండి నువ్వు చైతన్యం వి మరి అది ఎవరండి మనసు చైతన్యము నువ్వు మనసు కాదు చూస్తూ ఉండండి
(27:04) ఆ సాక్షిత్వంలో మనసు ఏం చేస్తది అంటే ఎప్పుడైతే మనం చూస్తూ దానికి రెస్పాండ్ ఇవ్వలేదు అది ఆ సైలెన్స్ అయిపోతది. ఇదిగా మిత్రులారా సో ఐదు పాయింట్లు ఈ ఐదు పాయింట్లు గనుక మీరు మీ జీవితంలో కోరుకుంటే చేసుకుంటే అద్భుతంగా ఉంటది లాస్ట్ బోనస్ గా ఇంకో పాయింట్ చెప్పుక వచ్చేస్తాను ఆ లాస్ట్ పాయింట్ ఏంటంటే గుర్తింపు కోరుకోకండి మన నిశ్చలత్వం చెదిరిపోయే ఫస్ట్ దీని మీద ఏమి గుర్తింపు కోరుకోకండి మాకు ఫస్ట్ అండి ఎంత విచిత్రంగా ఉంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడియో చేస్తున్నామా ఇప్పుడు మీకు చూస్తారు కదా ఇది ఎంతమంది మంది షేర్ చేశారు ఎన్ని లైక్లు అయినాయో చూస్తారండి
(27:43) అందరూ అందర నేను కూడా అదే చూస్తా ఇది ఎంతమంది లైక్ కొట్టారు ఎంతమంది షేర్ [నవ్వు] కొట్టారు అసలు ఎంతమంది చూశారు దీనంతా నరకం ఇంకోటి లేదు తెలుసా ఇప్పుడు ప్రపంచం మొత్తం లైక్లు షేర్లు వీటి మీద బతికేస్తుంది. లైక్ షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దీని మీద బతికేస్తున్నాం. ఏవండీ వాడు ఎవడో లైక్ చేయకపోతే మనక ఎంత దుఃఖం అండి అసలు రీల్స్ చేసే వాళ్ళందరిని నేను చూస్తాను కదా చాలా మంది రీల్స్ చేసి పెడుతుంటారు కదా వీళ్ళందరూ ఎందుకు చేస్తారో తెలుసా మీకు ఎందుకంటే అది వాళ్ళ ఆనందం కోసం చేసుకునేవాళ్ళు ఉంటారు కొంతమంది వీడియోలు తీసుకొని వాళ్ళ ఫోన్లో పెట్టుకొని సరదాగా
(28:19) చూసుకుంటారు కొంతమంది అలా కాదు ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు ఎందుకు ఇతరుల మెప్పు కోసము ఇతరుల మెప్పు కోసం మనం బ్రతికేస్తున్నాం అలా బతకద్దు మిత్రులారా ఇంపార్టెంట్ విషయం ఇంకోళ్ళ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు షేర్ చేయండి మీరు ఎంతగా గుర్తింపు అన్న చక్రం లోపలికి వెళ్ళిపోతారో అది తిరిగేటప్పుడు అంతగా నలిగిపోతారు.
(28:41) అందుకని ఈ భూమి మీద గుర్తింపు అనేది నేచర్ ఇస్తుంది అది ఆటోమేటిక్ దాన్ని ఎవడు ఏం చేయలేడు. ఎప్పుడు ఎలా ఉన్నా ఉండొచ్చు. చాలామంది ఆ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశనంటే ఆ మా తపంలో వర్క్షాప్ అవుతుంది అక్కడ లైన్ మన్ కరెంట్ మన్ రాలేదు. నేను నాకు కరెంట్ పని కూడా వచ్చు నేను పైకి ఎక్కి పోల మీద ఎక్కా లైట్ బిగిస్తా ఉన్నాను వైరింగ్ కట్ చేసి టేప్ వేస్తా లైట్ బిగిస్తుంటే ఎవడో వచ్చాడు వచ్చి గురువుగారే రండి ఎప్పుడు వస్తారండి అన్నాడు నా అసిస్టెంట్ ఉన్నాడు కదా నిచ్చని పట్టుకున్నాడు అదిగో గురువుగారు పైన ఉన్నాడుని [నవ్వు] చెప్పాడు నేను చిన్న ప్ాంట్ వేసుకొని
(29:12) పైనఎక్కి దిగుతున్నాను కదా నాయన చూసాడు ఈయన గురువుగారు అన్నాడు నమస్తే అండి అన్నాడు ఆ అన్నాను సరే నేను వస్తానండి వెళ్ళిపోయాడు రాలేదు డయాస్ మీద ఉన్నప్పుడే నువ్వు గురువువి కింద దిగాక నార్మల్ మనిషివి ప్రత్యేక వేష ేషధారణ ఉండరాదు పత్రికలు ఎంత బాగా చెప్తాడో ఏ పత్రిక గుర్తింపు వద్దు మనకి ప్రత్యేకం వద్దు ఆ టైం లో ఏది వస్తే అది ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను ఒక మాస్టర్ గుర్తింపు అయిపోయింది క్లోజ్ దీన్ని ఎందుకు మోయాల కింద ఉన్నప్పుడు కింద ఉన్నట్లు ఉండాలి పైన ఉన్నప్పుడు పైన ఉన్నట్లు ఉండాలి ఎప్పుడు ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ఉండాలండి వాడు మనల్ని గుర్తించాలి
(29:46) అనుకున్న మరుక్షణం మీకు ఒక సంకెలు పడతదండి అక్కడ నుంచి నరకం స్టార్ట్ అవుతుదండి కర్మణ్యే వాదికారస్తే మాఫలేషు కదాచనా చేయాల్సింది చెయ్ నీకు ఏమ ఇవ్వాలో నేను అది ఇస్తా అది ఒక్క సూత్రాన్ని పాటించండి నిశ్చలత్వం తన్నుకొని వస్తది. ఈ మొత్తం నిశ్చలత్వ సాధనలో చాలా ముఖ్యమైన పాయింట్ ఇప్పుడు నేను చెప్పింది గుర్తింపు అస్సలు కోరుకోవద్దు గుర్తింపు యూనివర్స్ గుర్తింపిస్తది మీరు అస్సలు వద్దన్నా తెచ్చి వళలో ఉపవాస్తది అది దాన్ని యాక్సెప్ట్ చేయండి దాన్ని సంతోషం తీసుకోండి మళ్లా కొంతమంది నాకే ఆడంబరాలు వద్దు నేనే డాంబికాలు వద్దు నాకే సన్మానం
(30:19) వద్దు అంటారు అది కూడా గుర్తింపు కోరుకోవడమే తెలుసా ఇప్పుడు డయాస్ మీద మేము ఉన్నాము నేను పక్కన ఇంకో మాస్టర్ ఇంకో మాస్టర్ ఎవరో పండితుని తీసుకొచ్చారు ఆయనకి వెళ్లి మనోడు షాలు కలుపుతుంటే ఆయన ఏమన్నాడంటే నో నో నో నాకు ఇలాంటి ఆడంబరాలు వద్దండి అంటాడు ఆయనేమో షాలు ఎత్తాడు ఈయనేమో బోకే ఎత్తాడు ఇంకొక ఆయనేమో ఇవన్నీ తోసేస్తున్నాడు ఆయన వేస్తారు తీసేస్తున్నాం నాకు ఇలాంటి ఆడంబరాలు వద్దు నాకు గొప్పలు గుర్తింపులు అక్కర్లేదండి అంటాడు నేను ఏమన్నానో తెలుసా అక్కర్లేదు అంటున్నావు కదా అదే గుర్తింపు పడ్డాయి అని చెప్పా నువ్వు డయాస్ మీద వాళ్ళ ధర్మం ఏంటి వచ్చిన
(30:51) అతిథుని గౌరవిస్తారు షాలు వేస్తారు చేతిలో ఏదో పెడతారు పాలమో తుడమో ఇస్తారు తీసుకో తీసుకొని కింద దిగాక నీకు అక్కర్లేతే ఇంకోడికి ఇచ్చేయ్ అలా కాకుండా ఈ నేనే ఇలాంటి ఇష్టం ఉండదునా అంటే నేను గుర్తింపు కోరుకోను సుమా అని చెప్పడమే గుర్తింపు ఇది ఇంకొక ఐడెంటిటీ క్రైసిస్ భయంకరమైన నరకాలకి ఇవన్నీ దారులు అందుకని తర్వాత హాయిగా ఉండండి పక్షి హాయిగా ఉంది దాన్ని దాన్ని భగవంతుడు గుర్తించి ఏర్పాట్లు చేస్తాడు కదా మనకు కూడా గుర్తిస్తాడు కనుక చేయాల్సింది చేయాలి చేయాల్సింది ఇప్పుడు నేను డయాస్ ఎక్కాను అక్కడ గుర్తింపు ఉండాలి ఒక ఐడి ఉండాలి ఉంటది నీకు అయిపోయింది ఐడి క్లోజ
(31:30) ఎక్కడిది అక్కడే శెనగలు తిన్నామా చేయి కడుక్కున్నాం అన్నట్టు ఉండాలి అందుకని గుర్తింపు కోరుకోకుండా ఉండాలి మనము లై కర్మణ్యే వాధికారస్తే నీ పని నువ్వు చెయ్ నీకు ఏమ ఇవ్వాలో అది ఇస్తాను చెప్పేసారు కదా భగవాన్ ఇంకేంటి మనకి కనుక గుర్తింపు కోరుకోకుండా ఉంటే నిశ్చలత్వం ఉంటుంది సో నేను ఈ ఆరు పాయింట్లు చెప్పాను మరొకసారి ఆరు పాయింట్లు వివరించి క్లోజ్ చేద్దాం అందులో మొట్టమొదటిది ప్రకృతిలో నిశ్చలత్వాన్ని గమనించండి.
(31:57) రెండోది నో ఆర్ ఎస్ నిశ్చలంగా ఉన్నప్పుడే చెప్పండి మూడోది కాలం మారిందాకా సరికాని కాలంలో ఉన్నప్పుడు కాలం మారిందాక ఎదురు చూడండి నాలుగోది మార్చలేని వాటిని అంగీకరించండి ఐదవది మనసు చేసే మాయలపై సాక్షిగా ఉండండి ఆరోది గుర్తింపు కోరుకోకండి నిశ్చలంగా ఉండండి. థాంక్యూ వెరీ మచ్ అందరూ ఇది ప్రాక్టీస్ చేయాల్సిందిగా కోరుచున్నాను మరొక్కసారి మీకు ఆత్మీయ నమస్కారాలు
No comments:
Post a Comment