Wednesday, July 29, 2026

Bhagavad Gita : నా జీవితాన్ని మార్చిన నా గురువులు : Rayala Suneetha Devotional

Bhagavad Gita : నా జీవితాన్ని మార్చిన నా గురువులు : Rayala Suneetha Devotional

Author Name:Rayala Suneetha Devotional

Youtube Channel Url:https://www.youtube.com/@RayalaSuneethaDevotional

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1I2m5TGWONk



Transcript:
(00:00) సాయిరామ్ జై గురుదత్త ఈరోజు నేను ఏ పూజల గురించో పురాణ కథల గురించో మాట్లాడటం లేదు. అంతకంటే పవిత్రమైన మన సమాజంలో నడుస్తున్న ఒక మహోన్నతమైన దివ్య యజ్ఞం గురించి మాట్లాడబోతున్నాను. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతను ఈరోజు మన ఇళ్లకి మన నోటికి చేర్చుతున్న నడిచే దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవాలి.
(00:33) స్వార్థంతో నిండిపోయిన ఈ సమాజంలో తమ పనులన్నీ పక్కన పెట్టి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వేలాది మందికి భగవద్గీత శ్లోకాలను ఉచితంగా నేర్పిస్తున్న భగవద్గీత ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ప్రణామములు అసలు ఈ టీచర్లు ఒక్కొక్క శ్లోకం నేర్పించడానికి పడుతున్న శ్రమ ఎంత మైసూర్ దత్త పీఠం శృంగేరి లాంటి మహా పీఠాల్లో మెడల్స్ సాధించి ఆ జ్ఞానాన్ని మనకు ఎలా పంచుతున్నారు? ఈ వీడియో చివరి వరకు చూడండి.
(01:09) ప్రతి భగవద్గీత టీచర్ పడే కష్టానికి మీ కళ్ళల్లో నీళ్లు తిరగడం కాయం. ఈరోజు మన ముందుకు వచ్చి చాలా తేలికగా ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః జై గురుదత్త అని క్లాస్ స్టార్ట్ చేసే టీచర్ వెనుక ఏళ్ల తరబడి పడిన నిశబ్ద తపస్సు ఉందనే విషయం చాలా మందికి తెలియదు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు 700 శ్లోకాలను ఒక చిన్న అక్షరం కూడా పొల్లుపోకుండా ఉచ్చారణ తప్పు లేకుండా కంఠస్థం చేయడం ఎంత కష్టమో ఆలోచించండి దానికోసం వాళ్ళు రాత్రుల్లో నిద్రలు కాచుకొని తమ కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తారు.
(01:53) మైసూర్ దత్త పీఠం శృంగేరి శారదా పీఠం లాంటి పవిత్ర క్షేత్రాలకు వెళ్తారు. అక్కడ పెద్ద పండితుల ముందు నిలబడి ఏ ఒక్క శ్లోకం కూడా ఆగకుండా తడబడకుండా అప్ప చెప్పాలి. ఆ పరీక్షలలో నెగ్గి మెడల్స్ రివార్డ్స్ సాధించాకే వాళ్ళు ఒక ఉపాధ్యాయుడిగా అర్హత పొందుతారు. అంత కష్టపడి సాధించిన ఆ విద్యను వాళ్ళు బిజినెస్ చేయట్లేదు. రూపాయికి అమ్ముకోవట్లేదు అది ఉచితంగా మనకు ఇస్తున్నారు.
(02:25) వాళ్ళు క్లాస్ మొదలు పెట్టాక అసలైన సవాలు మొదలవుతుంది. ఆ క్లాసుల్లో ఐదేళ్ల చిన్న పిల్లల నుండి 80 ఏళ్ల ముసలివారు వరకు ఉంటారు. చాలామందికి సంస్కృతం చదవటం రాదు అసలు అక్షరాల ఒత్తులు పలకడమే రాదు. అధ్యాయః అన్నా కార్పణ్య దోషోపగహగత స్వభావః అన్నా నాలుక తిరగక అవస్థలు పడతారు. అలాంటి సమయంలో ఆ టీచర్లు ఏనాడైనా విసుక్కున్నారా నీకు రాదులే అమ్మ అని ఏ ఒక్కరినైనా పక్కన పెట్టారా లేదు ఒక్కొక్క పదాన్ని 10 సార్లు 50 సార్లు అవసరమైతే 100 సార్లు ఎంతో ప్రేమగా ఓపికగా నేర్పిస్తారు.
(03:10) వాళ్ళకు ఇంట్లో పనులు ఉండవా వంటలు చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఆరోగ్యం బాగుండకపోవచ్చు కానీ క్లాస్ టైం అయ్యేసరికి తమ బాధలన్నీ పక్కన పెట్టి ముఖంపై చిరునవ్వుతో స్క్రీన్ ముందు కూర్చుంటారు. ఆ ఓపికకు ఏ అవార్డు ఇస్తే సరిపోతుంది చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలకు ఒక చిన్న సబ్జెక్ట్ ట్యూషన్ చెప్పించాలన్నా వేలకు వేలు ఫీజులు గుంజుతున్నారు.
(03:39) అలాంటిది భగవద్గీత లాంటి దివ్య జ్ఞానాన్ని ఉచితంగా పంచడం అనేది సాధారణమైన విషయం కాదు అది నిష్కామ కర్మ. భగవద్గీత 18 వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. య ఇమం పరమం గుహ్యం మద్భక్తేశ్వ భిదాస్యతి నా ఈ పరమ పవిత్రమైన గీతా జ్ఞానాన్ని ఎవరైతే నా భక్తులకు అందజేస్తారో వారికంటే ప్రియమైన వారు నాకు ఈ లోకంలో మరొకరు ఉండరు అని అంటే ఆ శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన పనులలో ఈ టీచర్లు భాగమయ్యారు.
(04:20) వీళ్ళు కేవలం శ్లోకాలు నేర్పించట్లేదు. మన సంస్కృతిని మన భావితరాల మనసుల్లో ధర్మాన్ని నూరిపోస్తున్నారు. మన ఇళ్లల్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి దైవిక కాంతిని నింపుతున్నారు. ఈ పవిత్రమైన సందర్భంలో నేను నా జీవితంలో మరిచిపోలేని నన్ను నడిపిస్తున్న నా ప్రియమైన గురువులకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకోవాలి. నాకు ఎంతో ఓపికగా అమ్మలాంటి ఆప్యాయితతో అక్షరం అక్షరం పొల్లుపోకుండా భగవద్గీత శ్లోకాలను నేర్పించిన నా గురువులు మానసా మేడం గారికి అలాగే శృతి మేడం గారికి నా శతకోటి ప్రణామాలు వారు నాపై చూపించిన
(05:06) వాత్సల్యం ఆ శ్లోక స్వచ్ఛత వెనుక వారు పడ్డ శ్రమ ఎప్పటికీ వెలకట్టలేనిది. ఇక ప్రస్తుతం అమ్మవారి దివ్యమైన సౌందర్య లహరి స్తోత్రాలను ఎంతో ఆత్మీయంగా ఆ భక్తి భావం నా హృదయానికి హత్తుకునేలా నేర్పిస్తున్న నా స్వాతి మేడం గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు వీళ్ళతో పాటు నా ఈ డివోషనల్ ఛానల్ ద్వారా మీ అందరికీ పవిత్రమైన ఆధ్యాత్మిక విషయాలు చేరటానికి వెనుక ఉండి ఎంతో శ్రద్ధతో నాకు శ్లోకాలను అందిస్తూ సాయపడుతున్న నా సరిత మేడం గారికి రజిని గారికి ప్రణీత గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మానస మేడం, శృతి మేడం, స్వాతి మేడం, సరిత
(05:53) మేడం రజిని గారు ప్రణీత గారు మీ అందరి రూపంలో ఆ శ్రీకృష్ణుడే నన్ను నడిపిస్తున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను. నిజం చెప్పాలంటే నా ఈ డివోషనల్ ఛానల్ పుట్టిందే నా గురువులు చేస్తున్న ఈ నిష్కామ సేవ నుండి. వారంతా తమ పనులన్నీ పక్కన పెట్టి సమాజానికి జ్ఞానాన్ని నేర్పిస్తూ డివోషనల్ సర్వీస్ చేస్తుంటే ఆ ప్రేరణతోనే నాలో కూడా ఒక సంకల్పం పుట్టింది.
(06:24) నా గురువులు నేర్పించిన ఆ పవిత్రమైన శ్లోకాల ద్వారా నాకు తెలిసిన మన ఆధ్యాత్మిక పురాణ కథల ద్వారా నేను కూడా సమాజానికి భక్తులకు సేవ చేయాలనే ఒకే ఒక్క దైవిక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ని ప్రారంభించాను. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు నాకు మార్గదర్శకులుగా నిలిచిన నా గురువులకు నేను కృతజ్ఞతలు తెలుపుకున్నట్టే మీకు ఆధ్యాత్మిక విద్యాబుద్ధులు నేర్పించిన మీ గురువుల పేర్లను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి వారిని గౌరవించండి.
(07:05) ఈ వీడియోని మీ భగవద్గీత టీచర్లకు గురువులకు షేర్ చేసి మీ ప్రేమను తెలియజేయండి. మన ధర్మాన్ని కాపాడుతున్న ఈ గురువులందరికీ మరొక్కసారి శతకోటి ప్రణామాలు జై శ్రీకృష్ణ

No comments:

Post a Comment