Wednesday, July 29, 2026

భగవద్గీత తత్త్వం | Bhagavad Gita Tattvam | BK Inala Trinath With Ravi Sastry @SriSouraviTv

భగవద్గీత తత్త్వం | Bhagavad Gita Tattvam | BK Inala Trinath With Ravi Sastry @SriSouraviTv

Author Name:Sree Souravi Tv

Youtube Channel Url:https://www.youtube.com/@sreesouravitv

Youtube Video URL:https://www.youtube.com/watch?v=foJVAB9o2jE



Transcript:
(00:16) ఓం శ్రీ గురుభ్యో నమః ప్రేక్షకులందరికీ నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐనాల త్రినాథ్ గారు వారు ఎస్బిఐ బ్యాంకులో ఉన్నత ఉద్యోగిగా ఎన్నో పదవులు నిర్వహించినప్పటికిని వారు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి విశేషంగా భగవద్గీత తత్వ ప్రచారాన్ని భగవద్గీతలో ఉన్నటువంటి తత్వాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు.
(00:53) వారు గత 20 20 సంవత్సరాల పైగా దేశ విదేశాల్లో ఎన్నో ప్రసంగాలు ఎన్నో తత్వ భగవద్గీత తత్వం పైన వారు ఉపన్యాసాలు అందించడం అలాగే జూమ ద్వారా కూడా ఎంతో మందికి భగవద్గీత తత్వం పైన అవగాహన కల్పించడం అనేది చేస్తూ ఉన్నారు వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేయడం అనేది మన భాగ్యం నమస్కారం అండి నమస్కారం అండి మీరు ఒక ఎస్బిఐ లో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నారు అనేసి తెలియపరిచారు నాకు ఇంతకుముందర మీరు పరిచయమైనప్పుడు గాని ఉంది.
(01:32) మీరు ఎస్బిఐ లో ఉద్యోగం చేస్తూ ఒక ఉన్నతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్న మీకు అసలుక ఆధ్యాత్మిక రంగ ప్రవేశం కానీ ఆధ్యాత్మిక రంగంలో నుంచి భగవద్గీతలోకి ప్రవేశం కానీ ఎలా జరిగింది? ముందుగా సౌరవి YouTubeూ్ ఛానల్ యాజమాన్యానికి నమస్కారం అండి ముఖ్యంగా మారెల్ల రవిశాస్త్రి గారికి నమస్కారము ఈ అవకాశం ఇచ్చినందుకు అదేవిధంగా ఈ సౌరవి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి.
(02:02) నేను 1975 లో స్టేట్ బ్యాంకు లో జాయిన్ అయ్యానండి క్లర్క్ గా జాయిన్ అయ్యాను. 2015 లో రిటైర్ అయ్యాను. 1996 లో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనకాబల్లి శాఖలో డెప్యూటీ మేనేజర్ పదవి ఫీల్డ్ ఆఫీసర్ అంటారు మామూలుగా బ్యాంకులో ఆ పదవిలో ఉండగా నాకు స్థానిక బ్రహ్మకుమారి సెంటర్ నుండి ప్రజాపితా బ్రహ్మ కుమారీశ్వరి విశ్వవిద్యాలయం అనే ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా కేంద్రం మీకు తెలుసును ఆ ఒక్కడి నుండి నాకు పిలుపు వచ్చింది.
(02:35) అన్నకాపల్లి సేవా కేంద్రానికి కొంత పెద్దవాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుండి ఆ మీరు రండి అని చెప్పి ఒక సహయోగి ద్వారా వచ్చింది బ్రహ్మకుమారీస్ కి వెళ్తున్నానండి నేను మీరు కూడా రండి అని సో ఆ విధంగా నేను వెళ్ళడం జరిగిందండి ఫస్ట్ టైం 23 ఫిబ్రవరి 1996 అప్పటివరకు నాకు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియదు.
(02:58) ఈ విధంగా బ్రహ్మకుమారీస్ పరిచయం కూడా నాకు లేదు. ఆయన తెలిసిన ఆయన ఒక డిజిఎం క్యాడర్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ అఫీషియల్ నన్ను రమ్మంటే వారికి ఇన్విటేషన్ వచ్చింది మీరు కూడా రండి త్రినాథ్ గారు అని చెప్పి మేము ఆయన కలిసి వైజాగ్ నుండి అనకాపల్లికి మేము ట్రావెల్ చేస్తుండేవాళ్ళం డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుండేవాళ్ళం ఇద్దరం కూడా కాపురాలు వైజాగ్ లో ఉండేది అనకాపల్లిలో ఆఫీస్ అన్నమాట ఆఫీస్ పని ఆ విధంగా వెళ్ళినప్పుడు ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూసారా బ్రహ్మకుమారీస్ ప్రాంగణం అనకాపల్లి ఆ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతూనే నాకు కు ఒక అద్భుతమైనటువంటి శాంతి అనుభూతి జరిగిందండి
(03:34) ఆంతరికంగా చాలా శక్తి అనుభూతి అయిందన్నమాట తర్వాత వాళ్ళు ఒక చాంబర్ నుండి ఇంకో చాంబర్ అలా లోనికి తీసుకొని వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకుమారి సిస్టర్స్ పెద్దవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ మా శాంతి సరోవర్ డైరెక్టర్ హైదరాబాద్ కి ఆవిడ వాళ్ళ మదర్ ఇద్దరు మదర్ కుల్దీప్ సిస్టర్ వాళ్ళ మదర్ ఏమో ప్రీతం అని ప్రీతం గారి శరీరం కూడా చాలించారు.
(03:58) వాళ్ళద్దరు అక్కడ ఉన్నారన్నమాట వాళ్ళతో అక్కడ మీరు అన్నట్టు సజ్జన సాంగత్యం అన్నట్టుగా మంచి విషయాలు చెప్పారు సుమారుగా ఒక గంట గడిపాం వాళ్ళతోని చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ప్రశాంతమైనటువంటి వాళ్ళ యొక్క ముఖారవిందము వాళ్ళ మాటలలో మధురత వాళ్ళు మన నుండి ఏమి ఆశించకుండా మనక ఏదో ఇద్దామ అన్నటువంటి ఒక తపనతో అక్కడ కూర్చొని మాతో ముచ్చటించడం జరిగింది.
(04:27) ఆ ఆ ఒక్క విజిట్ లోనే నాకు ఈ యొక్క సంస్థ మంచి సంస్థ మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తే కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అనుకున్నాను అది ఆ విధంగా మనకి 1996 లో జరిగింది. తర్వాత వాళ్ళు ఒకటి ఒక త్రీ స్టార్ హోటల్ వైజాగ్ లో గ్రీన్ పార్క్ అని హోటల్లో ఒక బిపిఎల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇప్పుడు లేదనుకుంటాను ఆ కంపెనీ టీవీ కంపెనీ బిపిఎల్ టీవీస్ అని ఉండేది.
(04:52) అక్కడ వాళ్ళు మేనేజర్ క్యాడర్ ఆఫీషియల్స్ కి బ్రహ్మకుమారీస్ ఒక ఫ్యాకల్టీని పిలిచి హైదరాబాద్ నుండి వైజాగ్ లో ఒక త్రీ డేస్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ప్రోగ్రాం్ ఏర్పాటు చేశారండి అది చాలా టచింగ్ గా ఉండింది అన్నమాట అక్కడికక్కడే నాకు ఇంకా బ్యాంకు జాబ్ అంటే మీకు తెలుసు కదండీ శాస్త్రి గారు చాలా టెన్షన్ తో కూడుకున్న జాబ్ అక్కడ ఇంటర్నల్ గా ఎలాగ మనము పవర్ ని జనరేట్ చేయాలి అనేటువంటి విషయం మీద ఫోకస్ చేస్తూ చెప్పారు త్రీ డేస్ చెప్పారు.
(05:20) తర్వాత మళ్ళీ ఇంకొక త్రీ డేస్ స్థానిక సేవా కేంద్రంలో మీరు రండి అక్కడ ఇంకొక త్రీ డేస్ చెప్తే మొత్తం కోర్స్ అంతా అయిపోతుంది అని చెప్పి అక్కడ స్థానిక ఆ వైజాగ్లో సేవా కేంద్రంలో రమ్మన్నారండి అలాగ మా ప్రయాణం అనకాపల్లిలో ప్రారంభమయి విశాఖపట్నంలో కంటిన్యూ చేసుకుంటూ చేసుకుంటూ అక్కడి నుంచి అలా కనెక్ట్ అయితూ ప్రతిరోజు కూడా బ్రహ్మకుమారి సెంటర్ కి వెళ్తూ అక్కడ వాళ్ళు చెప్పేటువంటి రాజయోగ మెడిటేషన్ అని చెప్తారు ఈశ్వరీయ జ్ఞానము రాజయోగ ధ్యాన అని చెప్తారు అది నేర్చుకుంటూ నేర్చుకుంటూ 2002 లో నాకు కాకినాడ ట్రాన్స్ఫర్ అయిందండి. కాకినాడ
(05:56) వచ్చిన తర్వాత అక్కడ కూడా నా అదృష్టం ఏమో కానీ నేను స్టేట్ బ్యాంక్ మేనేజర్ గా ఉన్నాను అక్కడ కాకినాడ లోకల్ గైగలపాడు అని ఒక బ్రాంచ్ సర్పవరం జంక్షన్ అది అంటారు. [గురకలు] దాని పక్కనే బ్రహ్మకుమారి సెంటర్ ఉంది పెద్ద సెంటర్ అన్నమాట. సో అక్కడికి కూడా రెగ్యులర్ గా వెళ్తుండేవాడిని అక్కడ వాళ్ళు ఏం చేశరంటే ఒక 15 డేస్ క్యాంప్ పెట్టారు ఒకసారి అది ఎందుకంటే బ్రహ్మకుమారిస్ ఫిలాసఫీ ఆధ్యాత్మిక జ్ఞానము శ్రీమద్ భగవద్గీత బేస్ అన్నమాట చాలామంది అడుగుతారు కదా మీ యొక్క సాంప్రదాయం దేని ఆధారంగా అది అడుగుతారు కదా [గొంతు సవరించుకోవడం] సో ఆ విధంగా
(06:32) అక్కడ 15 రోజుల పాటు శ్రీమద్ భగవద్గీత ఆధారంగా మనకి జ్ఞానాన్ని అవగాహన సదస్సులు కల్పించారండి అక్కడి నుంచి నాకు ఆసక్తి పెరిగింది నేను అంచలంచలుగా దాని డెప్త్ లోకి వెళ్లి ఇప్పుడు సుమారుగా నేను ఒక 2000 ఉపన్యాసాలు దాకా ఇచ్చిఉంటాను భారతదేశంలో చాలా కలామూలల్లో మా బ్రహ్మకుమారీస్ వాళ్ళు అఖిల భారతీయ శ్రీమద్ భగవద్గీత కాన్ఫరెన్సెస్ పెడుతుంటారు.
(06:56) అదేవిధంగా అఖిల భారతీయ సాధు సంతుల సమ్మేళనం ఈ రెండు కాన్ఫరెన్స్ సుమారుగా పాతిక 30 కాన్ఫరెన్స్లు పెట్టి ఉంటారు ఇప్పటిదాకా అందులో సుమారు 15 16 కాన్ఫరెన్స్లు నేను అటెండ్ అయ్యానండి బ్రహ్మకుమారి సరపన ఫాకల్టీగా నేను ప్రెసెంట్ చేశాను ఎందుకంటే ఈ యొక్క తత్వం ఏంటంటే ఇది ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చేటువంటి విషయం అండి ఇలాగ నా ప్రవేశం జరిగిందండి ఇప్పుడు భగవద్గీతలోకి వచ్చినప్పుడు భగవద్గీత యొక్క మూల విశిష్టత ఏంటి ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నప్పటికిని ఎన్నో ఎన్నో ధార్మిక గ్రంథాలు ఉన్నప్పటికిని ఆ భగవద్గీత కి ఒక్కదానికే నాకు తెలిసి జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు భగవద్గీత జయంతి
(07:41) అనేసి అసలకి ఈ యొక్క భగవద్గీత విశిష్టత మీరు సింపుల్ గా చెప్పాలి అంటే మీరేం చెప్తారు లేదు భగవద్గీత అండి భగవద్గీత ఏకైక గ్రంథం ఎన్నో విశిష్టతలు ఉన్నాయి దానికి అత్యధికంగా విశ్వవ్యాప్తంగా అత్యధికంగా ప్రపంచంలో అందరూ కూడా తెలిసినటువంటి నోన్ అంటారు చూసారా మోస్ట్ నోన్ అన్నమాట అందరికీ ఏ గ్రంథం చాలామందికి తెలిసినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే భగవద్గీత అండి అదేవిధంగా పఠన అంటే చదవటం పారాయణ అంటే పాడుకోవటం శ్రవణ అంటే ప్రవచనాల రూపంలో వినడం ఇది కాకుండా ప్రచార ప్రసార అత్యధిక సంఖ్యలో ఎంతో మంది వేల సంఖ్యలో ఆ ప్రవచనకారులు భగవద్గీత తత్వాన్ని బోధిస్తూ
(08:24) భగవద్గీత విధానాన్ని ఆ ప్రజానీకానికి ఆ విధంగా బోధిస్తూ ఉండడం కూడా భగవద్గీత యొక్క విశిష్టత ఇది కాకుండానండి సుమారు 80 భాషలలో భగవద్గీతని ఆ విధంగా తర్జుమా చేయబడింది అందులో 60 భాషలు అంతర్జాతీయ భాషలు అండి అర్థమైందా అండి ఈ విధంగా భగవద్గీతని ఎంతోమంది ఆ విధంగా చెప్పడం జరిగింది ఇది కాకుండానండి భగవద్గీత జ్ఞానము బోధించిన జ్ఞానం ఆధారంగా జాతీయ అంతర్జాతీయ అత్యున్నత స్థాయి వ్యక్తులు ఎమినెంట్ పర్సనాలిటీస్ అంటాం చూసారా వాళ్ళందరూ భగవద్గీత జ్ఞానం నుండి మేము ప్రేరణ పొందాము మా జీవితాన్ని ఉన్నతంగా మేము తయారు చేసుకున్నామ అనేది
(09:08) మనఅందరికీ కూడా తెలుసును ఉదాహరణకి స్వామి వివేకానంద గారు అర్థమైంది సర్వేపల్లి రాధాకృష్ణ గారు బాల గంగాధర్ తిలక్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలాగ అనేక మంది మహాత్మా గాంధీ గారు మహాత్మా గాంధీ గారి గురించి ఎప్పుడు ఆయన ఏం చెప్తారంటే రెండో రెండు వస్తువులు ఉండేవి ఆయన దగ్గర ఒక గడియారం ఉండేది తర్వాత భగవద్గీత ఉండేది. భగవద్గీత సర్వ సమస్యలకి సమాధానం అండి ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఎటువంటి భేదం లేకుండా కులము మతము జాతి రంగు రూపు వర్ణము లింగము భాష దేశము ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సమస్యకి కూలంకశమైనటువంటి సమాధానం మనకి దొరికేటువంటి ఏకైక శాస్త్రం
(09:52) మరొక విశిష్టత ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక ఫేమస్ శ్లోకం ఉంది మీ అందరికీ తెలుసుఒమ 28 అది అసతోమా సద్గమయ్య ఈ శ్లోకంలో ఒక సత్యమైన భక్తుడు మూడు ప్రశ్నలు అడుగుతున్నాడు భగవంతుడు అడుగుతున్నాడు అసతోమా సద్గమయ్య అంటే భగవంతుడా నేను అసత్య మార్గంలో ఉన్నాను తండ్రి నాకు సత్యమైన మార్గం చూపించు మొదటి ప్రశ్న రెండవది తమసోమా జ్యోతిర్గమయ నేను అజ్ఞాన అంధకారంలో తిరుగుతూ ఉన్నాను నాకు జ్ఞాన ప్రకాశాన్ని నాలో ప్రవహింపచేసి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు మూడవది మృత్యోర్మ అమృతంగమయ్య ఈ మృత అనేటువంటి దేహములో అమృతత్వము అవినాశి తత్వం ఉన్నది ఆ యొక్క జ్ఞానము
(10:41) నాకు తెలియజేయి అంటూ ఇలాగా ఎన్నో విశిష్టతలు భగవత గీత ఉన్నాయి దీనికి ఏకైక కారణము ఇందులో ప్రపంచంలో రెండవ గ్రంథం లేదండి శ్రీ భగవానువాచ భగవంతుడు ఏ భగవంతుని అయితే మనం అందరం కూడా మన ప్రార్థనలలో త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటున్నాం కొంతమంది హెవెన్లీ గాడ్ ఫాదర్ అంటున్నారు అల్లాహు అక్బర్ అంటున్నారు రకరకాలుగా ఎవరు పిలిచినా ప్రతి ఒక్క ధర్మం వారు భగవంతుడు ఒక్కరే అన్న విషయాన్ని చెప్తున్నారండి సో ఆ ఒక్క భగవంతుడే పలికినట్టు టువంటి డైరెక్ట్ గా పలికిన డైరెక్ట్ స్పోకెన్ వర్డ్స్ ద్వయముగా ఉచ్చరించినటువంటి మహావాక్యాలు రెండవ గ్రంథం ప్రపంచంలో మనకు కనబడుతుందండి ఇది
(11:26) ఒక ముఖ్యమైనటువంటి విషయము అందుకనే 574 శ్లోకాలు శ్రీ భగవానువాచ పేరు మీద ఉన్నాయండి శ్రీ భగవానువాచ అన్న గ్రంథం ఇంకొకటి కనబడుతుందా మనకి కనపడదు ఈ కారణంగానే శ్రీమద్ భగవద్గీతని కేవలం గీతా శాస్త్రం మామూలుగా మనం వ్యక్తుల బర్త్డే జరుపుకుంటాం. వ్యక్తుల జయంతి జరుపుకుంటాం హనుమాన్ జయంతి అంటారు లేకపోతే కృష్ణ జయంతి అంటారు శ్రీరాముని కళ్యాణం అంటారు జయంతిగా అలాగా అందరి జరుపుకుంటాం కానీ ఎక్కడైనా మీరు ఒక గ్రంథానికి జయంతి జరుపుకోవడం విన్నారా మీరు ప్రపంచంలో రెండవ గ్రంథం లేదు శ్రీమద్ భగవద్గీత మాత్రమే నవంబర్ డిసెంబర్ మాసాల్లో వస్తుంది
(12:09) ఒక రోజున గీతా జయంతిగా జరుపుతారు నేను చాలాసార్లు కురుక్షేత్ర వెళ్తుంటాను కురుక్షేత్రంలో ఎందుకంటే శ్రీమద్ భగవద్గీత అక్కడ జరిగింది యుద్ధం అక్కడ జరిగింది అనేటువంటి ఒకటి ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడతారు గీత కాన్ఫరెన్స్ అందులో నాకు ఇన్విటేషన్ వస్తుంది. నేను సుమారు ఐదారు సార్లు వెళ్లి నేను పేపర్ ప్రెసెంటేషన్ కూడా చేశాను దాని మీద నా పేపర్స్ కూడా యక్సెప్ట్ చేశారు వాళ్ళు అర్థమైందా అండి సో ఈ విధంగా భగవద్గీతకు ఉన్నటువంటి విశిష్టత రెండవ గ్రంథానికి లేదండి ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి అయితే
(12:43) భగవంతుడు ఇంత సందేశం భగవద్గీతలో భగవాన్ ఉవాచ పేరుతో అందించారు ఇప్పుడు వర్తమాన ప్రపంచంలో ఉన్నవారికి అసలకి రియల్ ఎస్సెన్స్ ఏంటి రియల్ సందేశం ఏంటి అనేకమంది అనేక రకాలుగా మనకి ఈ యొక్క ఒక్కొక్క ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు కొంతమంది భగవద్గీతని యోగపరంగా చెప్తారు కొంతమంది వారి అర్థాలు చెప్తూ ఉంటారు ఇట్లా కాదు అసలు రియల్ ఎసెన్స్ ఏంటి రియల్ సందేశం ఏంటి చాలా మంచి ప్రశ్న వేశరండి ఎందుకంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక క్లారిటీ కావాలి.
(13:22) భగవద్గీత సందేశం ఏమిటి అన్న విషయాన్ని ఈరోజున ఎవరికీ అర్థం కావడం లేదు. అర్థమైందా అండి భగవద్గీతని ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో భాష్యం ప్రకారంగా వాళ్ళు రాశారు దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరిని గౌరవించవలసిందే భగవద్గీతను ఏ విధంగా ఏ కోణంలో చెప్పినా భగవద్గీత విషయాలు ప్రపంచం ప్రపంచంలో ఉన్న మనుషులని మారుస్తుంది అది చాలా గొప్ప ప్రభావితం ప్రభావం వేస్తుంది దానిలో ఎటువంటి సంశయం లేదు కానీ ముఖ్యంగా భగవద్గీతలో ఉన్నటువంటి సందేశం మనం తెలుసుకో ోవాలి అంటేనండి అందులో మనకు ఉన్నటువంటి ఏవైతే విశ్వాసాలు మనకు ఉన్నాయో ఉదాహరణకి ఇది యుద్ధశాస్త్రం అంటున్నాం
(14:02) అర్థమైందండి సో ఈ యుద్ధశాస్త్రం అన్నది భగవద్గీతలో ఉన్నదా లేదా ముందుగా భగవద్గీతని దేన్ని అంటారు భగవద్గీత అంటే మన విశ్వాసం ఆధారంగా భగవద్గీత అనేది పక్కన పెట్టండి భగవద్గీత అనేది ఏమంటారు ప్రపంచంలో భగవద్గీత అనే పుస్తకం ఎక్కడ లభించినా కూడా 701 శ్లోకాలు ఉంటాయి కొన్ని పుస్తకాల్లో 13వ అధ్యాయంలోని మొదటి శ్లోకం తొలగించడం జరిగింది అర్జున ఉవాచ అదలో 700 అందులో 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ అంటే శ్రీమత్ భగవద్గీత అని మనం అంటున్నాం కదా అందులో మొట్టమొదటి పదం ఏంటండి శ్రీమతం శ్రీమతం అనేది చాలా ముఖ్యం అండి ఈ రోజున మనం శ్రీమతాన్ని మనం పక్కన పెట్టుకున్నాం.
(14:45) శ్రీమతం అంటే ఏంటి శ్రీ అంటే శ్రేష్టమైన మతము అంటే ఒక ఎడ్యుకేషన్ ఒక విద్య ఒక గైడెన్స్ ఒక ఇన్స్ట్రక్షన్ ఒక డైరెక్షన్ ఈ శ్రీమతం ఏం చెప్తుంది శ్రీమతం దేని ఆధారంగా మీకు దొరుకుతుంది శ్రీమతం అనేది 574 శ్రీ భగవాన్ వాచ శ్లోకాల ఆధారంగానే మీకు లభిస్తుంది. ఎందుకంటే దానికంటే ఎక్స్ట్రా ఒక్క శ్లోకం కూడా లేదు 574 శ్లోకాలు సో మీ విశ్వాసం ఏదైతే ఉందో భగవద్గీత గురించి ఇది ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రము గీతలో ఇక్కడ ఉంది.
(15:19) ఇది యుద్ధ యుద్ధానికి యుద్ధరంగంలో కురుక్షేత్ర యుద్ధ మైదానంలో కౌరవ పాండవ సంగ్రాామం మధ్యలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్మ శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంలో రథ సారధిగా వచ్చి అర్జునుడి యొక్క అర్జునుని మోటివేట్ చేయడం కోసం యుద్ధోన్ముఖని చేయడం కొరకు అని చెప్పి భగవద్గీత చెప్పాడు అని ఆ విధంగా మనం అర్థం చేసుకున్నాం దానికి కూడా మనకు ఆధారాలు భగవద్గీతలో ఉన్నాయా లేవా అనేది కొంచెం పరిశీలించుకున్నట్లయితే మనము ఆ తత్వంలోకి మనం వెళ్ వెళ్ళడానికి వీలవుతుందండి అర్థమైందా అండి ముఖ్యంగా విశ్వాసం అనేది ఒకటి విశ్వాసం ప్రకారం ఒకటి యదార్థం అనేది
(15:56) ఒకటి ఎందుకంటే ముఖ్యంగా నేను తత్వాన్ని బోధిస్తూ ఉంటానండి తత్వం అంటేనండి అది రెండు శబ్దాలతో ఉన్నదండి తత్వం తత్ అంటే అది త్వం అంటే నీ కొరకు అది నీ కొరకు అంటే నీ యొక్క జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేయడం కోసం భగవద్గీత ఏం చెప్పింది నీకు అనేటువంటి విషయం అన్నమాట అందుకే ప్రతి ఒక్కరికి నేను ఏమంటున్నాను అంటే ఎవరైతే సత్యంగా సత్యాన్వేషణ అర్థమైందా తత్వాన్ని ఎవరైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ ప్రతి ఒక్క గీతా శ్లోకం మనం అనుకున్నటువంటి విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో అది భగవద్గీతలో ప్రకటించబడిందా పడింది అంటే మీరు కరెక్ట్ మార్గంలో
(16:37) ఉన్నారండి లేకపోతే దాంట్లో కొన్ని కరెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అండి ఇది నా యొక్క అభిప్రాయం అయితే భగవద్గీతని మామూలుగా హిందూ ధర్మానికి అనుసరించే గ్రంథంగా చేస్తారు అలాగే ఈ భగవద్గీతలో విషయాల్ని ఇతర ధర్మాలు పాటించే వాళ్ళు కూడా కొన్ని తీసుకొని వాటిలో చాలా మంచి విషయాలు ఉన్నాయి అనేసి ప్రస్తావిస్తూ ఉంటారు.
(17:02) ఈ భగవద్గీత భగవాన్ వాచ అయితే సర్వమానవాళికి పనికొస్తుంది కదా ఎందుకు మనకి సర్వమానవాళి దీన్ని ఎందుకు అప్లై చేసుకోవటం లేదు సర్వ మానవాళి గ్రంధం కింద ఎందుకు వాడటం లేదు ఎందుకంటే మనం ఎవరైనా చూస్తే భారతదేశ ధర్మంలో సర్వేజనా సుఖినోభవంతు అంటాం. సర్వమానవాళి కోసం సర్వేజన అంటారు దాంట్లో ఓన్లీ ఈ మతం ఆ మతం అని కాదు మొత్తానికి వాడతారు. సో సర్వజనాలకి పనికొచ్చేటటువంటి విషయాలు ప్రస్తావించినప్పుడు అది ఎందుకు అందరూ తీసుకోవటం లేదో అందరికీ ఎందుకు అప్లై చేసుకోవడం లేదు మంచి ప్రశ్న వేశారు ఇక్కడ ముఖ్యంగా మనం అండి తత్వకోణాన్ని మనం
(17:46) విస్మరించాం అండి దీని వలన ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తున్నాయి మామూలుగా మనం గమనించినట్లయితే ఇప్పటికీ కూడా మీకు చాలామంది అంతర్జాతీయ ఎవినెంట్ పర్సనాలిటీస్ అని చెప్పి అనౌన్ చూసారా ఒక్కొక్క దేశంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భగవద్గీత మీద ప్రమాణం చేశడు అని చెప్తున్నారు. కొన్ని కొన్ని స్కూళ్లలో పిల్లలకి భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నారు అని కూడా మనం వింటున్నాం.
(18:10) అంతర్జాతీయంగా రష్యా అండ్ కొన్ని దేశాల్లో జర్మనీ జర్మనీ దేశాల్లో వాళ్ళు పాఠశాలలో కూడా ఈ భగవద్గీత సబ్జెక్ట్ ని బోధిస్తూ ఉన్నారు. ఇలాగ జరుగుతూఉన్నది. కొన్ని యూఏఈ కంట్రీస్ లో కూడా ఆ అందువల్లన ఈ విధంగా జరుగుతోంది అంతర్జాతీయంగా పెద్ద పెద్ద వాళ్ళు కూడా దాని మీద భాష్యాలు రాశారు పుస్తకాలు రాశారు ఇన్స్పైర్ అయ్యారని మనక కూడా తెలుస్తుంది కాబట్టి దాని నుంచి అవుతుంది ఇటువంటి విశిష్టత ఇంకో గ్రంథానికి లేదండి శ్రీమద్ భగవద్గీతని ఇంత విధంగా పాపులర్ గా అయినట్టుగా వేరే ఏ గ్రంథం కూడా అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది ఇతర ధర్మాలకు చెందిన వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని
(18:46) పక్కన పెట్టుకొని భగవద్గీత ఉన్న సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నది ఆ శ్రీమద్ భగవద్గీతకు మాత్రమే దక్కింది. ఇక్కడ ముఖ్యంగానండి మీరు అడిగిన ప్రశ్నలో ఇది ధార్మిక గ్రంథము కింద మనం అనుకుంటున్నాము ఇది ధార్మిక గ్రంథమా విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రంథమా దానికి ఏదైనా ఆధారాలు గీతలో ఉన్నాయా అన్నా ఒక విషయాన్ని గాని మనం ఒకసారి తీసుకున్నట్లయితే నండి శ్రీమద్ భగవద్గీత ఒక ధర్మానికి మాత్రమే చెందిన గ్రంథము అనడానికి మనకు ఆధారాలు లేవండి శ్రీమద్ భగవద్గీతను మనం భగవద్గీత మన హిందూ ధర్మ గ్రంథం అనుకుంటున్నాం అదే అదేవిధంగా
(19:23) ఏ విధంగా క్రైస్తవులు హోలీ బైబిల్ వాళ్ళకి ధర్మ గ్రంథము అదేవిధంగా ఇస్లాం ధర్మం వాళ్ళు హోలీ ఖురాన్ వాళ్ళ ధర్మ గ్రంథము అదేవిధంగా సిక్కు ధర్మం వాళ్ళు ఆ గురు గ్రంథ సాహెబ్ అంటున్నారు ధమ్మపాదాన్ని బౌద్ధులు అంటున్నారు ఆ విధంగా మనం తీసుకున్నాం కానీ భగవద్గీతలో ఇది కేవలము హిందూ ధర్మానికి చెందిన గ్రంథము అని అనడానికి నిర్ధారించడానికి ధ్రువీకరించడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అన్నది మనం పరిశీలించాలండి అది పరిశీలించడం జరగలేదు అది తత్వంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది మనం పరిశీలించగలుగుతాం ఎక్కడా కూడా నేను 574 శ్లోకాలు పరిశీలించాను శ్రీమద్ భగవద్గీతలో
(20:07) శ్రీ భగవాను వాచం ఎక్కడా కూడా ఇది నేను ఒక్క ధర్మానికి చెందిన వాళ్ళకి చెప్తున్నాను అన్నది ఎక్కడ ఎటువంటి సాక్ష్యము రుజువులు ఆధారాలు మనకి లేవండి దీనికి విరుద్ధంగా శ్రీమద్ భగవద్గీత విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ భూమండలం పై ఉన్న 850 కోట్ల మనుషులు 8.5 బిలియన్ పాపులేషన్ అంటారు వీళ్ళందరికీ సంబంధించింది అని చెప్పడానికి పుష్కలంగా ఉన్నాయండి ఆధారాలు ముఖ్యంగా 137 శ్లోకాలలో మొత్తం 574 భగవాన్ వాచ శ్లోకాలలో 137 శ్లోకాలలో ఐదు పదాలు ఉన్నాయి ఒకటి జగత్తు రెండవది విశ్వము మూడవది లోకము నాలుగవది
(20:55) సర్వము ఐదవది ఇహ ఇహ అంటే ఈ లోకం అర్థమైందా అండి అంటే విశ్వాని విశ్వములో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇది సంబంధించినటువంటి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా ప్రతి ఒక్కరి జీవిత జీవితంలో ఎదురయ్యే సమస్యకు సమాధానం ఇస్తుందండి ఇది మనం ప్రాక్టికల్ గా ఆ తత్వంలోకి మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనకి ఈ విషయం విషయం బోధబడుతుంది ఇది హిందూ ధర్మము కాదు హిందూ ధర్మానికి చెందిన గ్రంథము కాదు ఇది విశ్వాత్మలందరికీ చెందినటువంటి గ్రంథం అన్నది అది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చుండి కేవలం ఒకటేనండి దీని కొరకు మనం చేయవలసింది అల్లా ఏంటంటే
(21:37) సత్యత ఆధారంగా తత్వం అంటే సత్యం అండి సత్యత ఆధారంగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి భగవాన్ ఉవాచ 574 శ్లోకాలు అన్నారు ఈ 574 శ్లోకాల్ని సింపుల్ సారంలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు 574 శ్లోకాలు శ్రీ భగవానువాచ అండి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పటివరకు మనము ఈ అధ్యాయం ప్రకారంగా మనం చదువుకుంటున్నామండి దానితో మనకు ఆ యొక్క సారం అర్థం కావట్లే ఈ 574 శ్లోకాలు భగవంతుడు చెప్పిందే కదండీ భగవంతుని మనం తండ్రి అంటున్నాం త్వమేవ మాతాచ పితా త్వమేవ తండ్రులు అనటం లేదండి ప్రతి ఒక్కరు కూడా నీవే తల్లివి తండ్రివి అంటున్నాం తండ్రి భగవంతుడు భగవంతుడు
(22:22) భగవానువాచి 574 శ్లోకాలు తండ్రి 574 శ్లోకాలు చెప్పినప్పుడు 574 శ్లోకాల మొత్తం జ్ఞానం యొక్క సారం తీసుకోవాలా లేకుండా ఉంటే ఏదో ఒక అధ్యాయంలో కొన్ని శ్లోకాలు తీసుకొని ఇది భగవంతుడు చెప్పాడు అని చెప్పి మిగతా శ్లోకాలు విడిచిపెట్టడం ఎంతవరకు సంబంధసం అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలండి. ఇప్పుడు 574 శ్లోకాలు మనం తీసుకున్నట్లయితే కేవలం ఏడు శబ్దాలలో సారాంశం మనకు అర్థంవుతుందండి ఏడే ఏడు ముక్కలు ఏడు ముక్కలు అన్నమాట ఏడు ముక్కలు అందులో తొమ్మిదవ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అంటే 34వ శ్లోకం అదేవిధంగా 18 వ అధ్యాయంలోని 65వ శ్లోకం ఈ రెండు
(23:05) శ్లోకాల్లో ఒకటే వస్తుంది మూడు పంక్తుల వరకు నాలుగో పంతి చిన్న కరెక్షన్ అందులో మొదటి పంక్తి మనం తీసుకుందాం మన్మనాభవ మన్ మన భవ అంటే ఏమిటి నీ మనసు నా యందు లగ్నము చేయి మన్ అంటే మనసు మన అంటే నా యందు భవ అంటే లగ్నము చేయి నీ మనసు నా యందు పెట్టు మన్మనాభవ మూడు శబ్దాలు వచ్చేసాయి తర్వాత 18 66 మామ ఏకం శరణం వ్రజ అన్నాడు సర్వధర్మాను పరిచ ఆ శ్లోకంలో మాం ఏకం శరణం వ్రజ అంటే మామ అంటే నన్ను ఏకం అంటే నా ఒక్క ఒక్కడే నేను ఒక్కడినే భగవంతుడిని శరణం బ్రజ అంటే నా ఒక్కడి శరణ పొందు అంటున్నాడు.
(23:50) అర్థమైందా అండి నీ మనసు నా మీద పెట్టు నేను ఎవరిని తెలుసుకొని నా ఒక్కడి మీద నీవు శరణు పొందు నా ఒక్కడి శరణు కోరుకో ఈ ఇదే భగవద్గీత సారం అండి మనం మనసుని నా మీద ఎలా పెట్టాలి భగవంతుని గుర్తించి ఎలా పెట్టాలి వారి వారి మీద ఎలా వారి శరణ పొందాలి శరణాగతి ఎలా అవ్వాలి ఇది తెలుసుకుంటే మీరు భగవద్గీత సారం మీ గుప్పిట్లో ఉన్నట్టే అర్థమైందా అండి సో ఈ యొక్క ఏడు శ్లోక ఏడు శబ్దాలు ఏవైతే ఉన్నాయో మన్మనాభవ మాం ఏకం శరణం ప్రజా దీన్ని కుదించి ఒకే ఒక్క శబ్దంలో చెప్తానండి ఒకే ఒక్క శబ్దం ఒకే ఒక్క శబ్దం ఏంటంటే మనసుని పరమాత్మ మీద పెట్టాలి మనసుని భగవంతుని పరమాత్మ అంటారు ఈశ్వరుడు
(24:33) అంటారు గీతలో అర్థమైందా అండి సో భగవంతుడి మీద పెట్టాలి అంటే ఏమిటి దాన్ని ఏమన్నాడు సంబంధాన్ని జోడించమన్నాడు మనసుని జోడించాలి మనం శరీరాన్ని జోడిస్తున్నాం మనసుని నా మీద పెట్టమని చెప్పాడు సో మనసు ద్వారా నాతో సంబంధాన్ని జోడించు అన్నాడు దానిని ఏమన్నారంటే ఒకటే ఒక పదం యోగము అంటారండి యోగం అంటే మనం కూడా గూగు లో వెళ్లి యోగ అంటే ఏమిటి అని కొడితే మీకు ఏమవస్తుందంటే ఇండివిడ్యువల్ కాన్షస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షస్నెస్ అని వస్తుందండి అంటే జీవాత్మ పరమాత్మ తో కలయకను యోగం అని వస్తుందండి యోగం అనే శబ్దం భగవద్గీతలో ఎన్ని
(25:11) శ్లోకాల్లో ఉందో తెలుసుండి 93 శ్లోకాల్లో ఉంది. అర్థమైందా అండి అదేవిధంగా ప్రతి అధ్యాయం యొక్క పేరు పేరులో కూడా యోగమ యోగం అనేది వస్తుందండి అర్జున విషాద యోగం నుండి మోక్ష సన్యాస యోగం వరకు యోగం యోగం 18 సార్లు పెట్టారు. ఇప్పుడు చూడండి ఒక పుస్తకం మహాత్మా గాంధీ జీవిత చరిత్ర అనే పుస్తకం ఉందంటే అందులో నెహ్రూ గారి జీవిత చరిత్ర ఉంటుందా చెప్పండి ఉండదు మీరు భగవద్గీతలో నేను యోగమే చెప్తున్నాను అని 18 అధ్యాయాల టైటిల్లో యోగము యోగము యోగము యోగం పెట్టుకొని మళ్ళీ ప్రతి అధ్యాయం చివరిన బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే అని ఉంటది. ప్రతి అధ్యాయం
(25:51) చివరన ఉంటుంది. సో ఈ విధంగా ఇప్పుడు ఈ యోగము అన్న విషయాన్ని ప్రపంచం విస్మరించింది ముఖ్యంగా హిందువుల ధర్మ గ్రంథముగా భావిస్తున్నటువంటి వాళ్ళు హిందువులు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు అందుకే తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల విషయం అన్నమాట. ఇప్పుడు యోగము అని చెప్పారు ఇక్కడ బ్రహ్మ విద్య అనే పదం వాడారు.
(26:16) అసలు బ్రహ్మ విద్య అంటే ఏంటి? బ్రహ్మవిద్య అనే పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి లేదు చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని కాన్సెప్ట్ తెలుసుకోవాలండి బ్రహ్మ విద్య అంటే ఏంటంటే బ్రహ్మ అంటే మూడు అర్థాలు వస్తాయండి దానికి మూడు ఉన్నాయి ఒకటిఏమో బ్రాహ్మి స్థితి అంటాడు ఏష బ్రాహ్మి స్థితిహి పార్ద అంటాడు నీ బ్రాహ్మి స్థితి అంటే ఆత్మిక స్థితిలో ఉండాలి అంటాడు అంటే ఆత్మకి కూడా బ్రహ్మ అంటాం అర్థమైందా అండి రెండు పరబ్రహ్మ స్వరూపం అంటాం భగవంతుని సో భగవంతుని పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మ అంటే ఆత్మ వచ్చింది పరబ్రహ్మ అంటే పరమాత్మ సో భగవంతుడు రెండవది బ్రహ్మ మహా తత్వం అంటాం
(26:53) అంటే భగవంతుడి యొక్క నివాసస్థానం దాన్ని అనేక పేర్లు ఉంటాయి శాంతి ధామము అమరధామము ముక్తి ధామము నిర్వాణ ధామం ఇలా పేర్లు ఉంటాయి అర్థమైందా అండి సో మూడు విషయాలు ఒకటేమో నేను ఎవరిని రెండవది భగవంతుడు అంటే నా తండ్రి ఎవరు నా తల్లి తండ్రి ఎవరు మూడవది నేను నా తల్లి తండ్రి ఉండేటువంటి స్థానం ఏమిటి పరంధామం సో ఈ మూడిటికీ కలిపి ఈ బ్రహ్మ సో ఆ విద్య చెప్పేటువంటిదే భగవద్గీత భగవద్గీతలో ఈ మూడిటి గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన మనకి లభిస్తుందండి తత్వంలోకి అర్థం చేసుకోగలిగి అంటే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏ శ్లోకాల్లోకి ప్రవేశిస్తే కరెక్ట్ గా
(27:33) అర్థంవుతుంది బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అంటే నండి బ్రహ్మజ్ఞానం అంటే యోగాన్ని మీరు చెప్పేది యోగం యోగాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే భగవంతుడు మనకి 84 లక్షల జీవరాశులలో ఒక మనిషికి మాత్రమే ఏమఇచ్చాడండి బుద్ధి నేత్రం ఇచ్చాడు. బుద్ధి అంటే విచక్షణ దాన్ని వివేక శక్తి అంటారు.
(28:02) వివేక శక్తి పరిశీలనా శక్తి అర్థమైందా అండి పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పవర్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటారు. ఆ వివేక శక్తిని మనం వాడటం లేదు. దీని కారణంగా మనం ఏం చేస్తున్నాం అంటే బుద్ధిని వాడకపోయినప్పుడు ఏమవుతుంది ఎవరు ఏమి చెప్పినా వాళ్ళు మనం యక్సెప్ట్ చేయవలసి వస్తుంది. అక్కడ చాలా మంది ఒక విధానంలో ఫాలో చేస్తున్నారు అంటే మనం ఆ విధానానికి ఆకర్షితులు అవుతాం.
(28:23) ఎందుకంటే మనకు స్వతహాగా అండర్స్టాండ్ చేసుకునేయడానికి మనం యక్సెప్ట్ చేసుకోవడం లేదు నేను అర్థం చేసుకోవాలి నాకు కూడా భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు ఇది కరెక్టా ఈ విధానం కరెక్టా లేకపోతే ఎంతో మంది దీన్ని ఫాలో చేస్తున్నారు అంటే అది కరెక్టా అనే విషయాన్న వెళ్ళిపోతున్నాం తప్ప అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు అంటే నీకు నా మీద బలిహార బలిహారమయ్యే బుద్ధి ఉన్నట్లయితే నీకు ఆ శ్రద్ధ ఉన్నట్లయితే నీ బుద్ధి నేత్రాన్ని నేను తెరిపి స్తాను అంటాడండి గీతలో అర్థమైందా అండి తేశాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం దవ్యేనమాముపయాంతితే అంటాడు ఇది 10వ అధ్యాయంలో 10వ శ్లోకంలో
(29:08) వస్తుంది ఇక్కడ ఏమంటున్నాడు రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయమంటున్నాడండి భగవంతుడు ఏమంటున్నాడుఅంటే రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేశమంటే నీ బుద్ధి నేత్రాన్ని నేను తెరిపిస్తాను అంధవిశ్వాసంలో వెళ్ళవలసిన పని లేదు బుద్ధి నేత్రాన్ని తెరవట్లేదుంటే ఏమిటి ఆల్టర్నేటివ్ ఏంటండి అంధవిశ్వాసం అంధవిశ్వాసం అంటే ఏంటి మన బుద్ధి నేత్రం మూసుకున్నాం ఈ రెండు భౌతిక నేత్రాల ద్వారానే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం.
(29:30) అక్కడ ఏమంటున్నాడు రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయమంటున్నాడు ఒకటి ఏమన్నాడు సతత యుక్తానాం అన్నాడు సతతము నన్ను నీవు కోరుకోవాలి. రెండవది ఏమన్నాడు ప్రీతిపూర్వకం అన్నాడు మొక్కుబడిగా వద్దు నాకు కర్మకాండగా వద్దు ఇప్పటివరకు చేశవు ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు నిరంతరము అందుకనే సదా సతతము నిత్యము అన్న పదాలు 26 శ్లోకాల్లో ఉందండి అర్థమైందా అండి ప్రీతిపూర్వకం అని ఎందుకు అన్నాడు ఇప్పుడు మామూలుగా భౌతిక ప్రపంచంలో ఈ లౌకిక ప్రపంచంలో తండ్రి పిల్లలు లేకపోతే తల్లి బిడ్డ ప్రీతిపూర్వకంగా ఉంటుందా వాళ్ళ సంబంధం లేకుంటే ఉంటే మొక్కుబడిగా ఉంటుందో చెప్పండి ప్రీతిపూర్వకంగా
(30:12) మమ్మీ అంటాడు అర్ధరాత్రి అపరాత్రి లేపిన మమ్మీ అంటాడు లేకపోతే ఫలానా పేరు పెట్టి బిడ్డ అంటుంది తల్లి అటువంటి సంబంధం నాతో ఎందుకు పెట్టుకోవట్లేదు నువ్వు ప్రీతిపూర్వక అంటే వేరే అర్థం రాదు కదా ప్రీతిపూర్వం అనేసాడు తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం అన్నాడు భజతాం వేరే విధంగా అనటం లేదు అప్పుడు దదామి బుద్ధి యోగం తంయేన మాముపయాంతితే నన్ను పొందే బుద్ధి యోగాన్ని నీకు నేను ప్రసాదిస్తున్నాను అంటాడు.
(30:41) అంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే అంధవిశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి ప్రోగ్రెస్ మనకి తెలుసుకోలేమండి. అంధవిశ్వాసం ద్వారా కుదరదు అది భౌతికంగా మనం ఏమనా అనుకోవచ్చు కానీ ఆధ్యాత్మిక జగత్తులోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ మూడవ నేత్రం తెలుసుకోవద్దు దాన్నే మనం బుద్ధి నేత్రం అంటాం మనోనేత్రం అంటాం ఆత్మ నేత్రం అంటాం జ్ఞాన నేత్రం అంటాం మూడవ నేత్రం అంటాం థర్డ్ ఐ.
(31:05) థర్డ్ ఐ డివైన్ విస్డం అంటారు కదండీ సో ఇది ముఖ్యంగా భగవద్గీతలోనే భగవంతుడే మనకి ఒక వాగ్దానం చేస్తున్నాడు నీకు నా పట్ల బలిహారి బుద్ధి ఉందా నన్ను పొందాలనే ఉందా భగవంతుడిని నేను సర్వశక్తివంతుడు సర్వోన్నతుడిని దివ్య గుణాల సాగరుడిని సృష్టి యొక్క ఆదిమధ్యాంతర జ్ఞాతుని అంటున్నాడు భగవంతుడు అయితే భగవద్గీత తీయంగానే ఫస్ట్ మూడు అధ్యాయాల్లో కర్మ యోగం అని తర్వాత ఈఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లోకి వెళ్ళినప్పుడు భక్తి యోగం అని తర్వాత 12 13 అధ్యాయాలు రాజయోగం అనే పదాలు తగులుతాయి.
(31:38) భక్తి ఈ మూడు యోగాలు ఎందుకు చెప్పారు ఒకే యోగం చెప్పొచ్చు కదా కర్మయోగాన్ని భక్తి యోగాన్ని రాజయోగాన్ని మూడు రకాలుగా ఎందుకు చెప్పాలి ఈ మూడు ఒకే మార్గాన్ని చూపిస్తున్నాయా మూడు వేరు వేరు మార్గాలను చేరుకోవడానికి చూపిస్తున్నాయా మూడు ఒకట అయినప్పుడు ఒకటే చెప్పొచ్చు కదా కర్మ ఎందుకు భక్తి ఎందుకు రాజయోగం ఎందుకు మూడు ఒకటి అయినప్పుడు డైరెక్ట్ గా రాజయోగమే చెప్పొచ్చు కదా ఇవన్నీ ఎందుకు ప్రస్తావన ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనదండి ఇది చాలామంది ఆ వాళ్ళ మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న దీనికి ఏంటంటే మనము భగవద్గీతని
(32:20) యదాతదంగా మనం ఆ శ్లోకాలు మనం చదువుకుంటున్నాం దానిలో ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే గీతలో అనేక రహస్యాలు ఉన్నాయి. గీతలో అనేక రహస్యాలు ఉన్నాయి. గీతలో రహస్యాలు ఉన్నాయి అన్న సంగతి కూడా భగవంతుడే చెప్తున్నాడు. అర్థమైందా అండి గీతా రహస్యాలు మనం అర్థం చేసుకున్నంతవరకు ఈ కర్మ యోగం అంటే ఏమిటి భక్తి యోగం అంటే ఏమిటి జ్ఞాన యోగం అంటే ఏంటి అసలు రాజయోగం అంటే ఏమిటి అర్థం కాదు ఇప్పుడు ఉదాహరణకి నేను జస్ట్ మీ ముందు కొన్ని చిన్న శ్లోకాలు ప్రస్తావిస్తాను 15వ అధ్యాయంలోని 20వ శ్లోకం ఇతి గుహ్యతమం శాస్త్రం అన్నాడు ఒకే ఒకే పంక్తిని నేను చెప్తున్నాను ఇతి
(33:03) గుహ్యతమం శాస్త్రం అంటే ఏంటి ఈ గీతా శాస్త్రంలో రహస్యాలు ఉన్నాయి గుహ్యత అంటే రహస్యం అర్థమైందండి అదేవిధంగా తొమ్మిదవ అధ్యాయంలో మొదటి శ్లోకం ఇదంతుతేగుహ్యతమం ప్రవక్షాంయనసూయవే సో ఇదంతుతేగుహ్యతమం వచ్చింది అక్కడ కూడా తర్వాత తొమ్మిదవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో రాజవిద్యా రాజగుహ్యం పవిత్రదముత్తం అంటాడు సో రాజగుహ్యం అన్నాడు అక్కడ అక్కడ కూడా గుహ్యం వచ్చింది 18 64 లో సర్వ గుహ్యతమంభూయ శృణవే పరమంబః అంటాడు సో గొప్ప గొప్ప పరమవచం అంటే దానికంటే ఇంకా గొప్ప వచనాలు లేవు ఇంకా సాక్షాత్తు భగవంతుడు ముఖారమందు నుండి వచ్చినటువంటి మహావాక్యాలు సర్వ
(33:46) గుహ్యత్తమం అన్నాడు మొత్తం మొత్తం అంతా రహస్యాలు ఉన్నాయి ఇందులో అర్థమైందా అండి 18 63 లో ఇతితేజ్ఞానమాక్ఖ్యాతం గుహ్యాతి గుహ్యతరమయ్య అంటాడు గుహ్యాతి గుహ్యతరం అన్నాడండి రహస్యాలలోకెల్లా రహస్యం ఉంది ఇందులో అది తెలుసుకోమంటున్నాడు 18 68లో యమం పరమం గుహ్యయం మద్భక్తేశ్వ విదాస్యతి ఈ పరమ రహస్యాలను తెలుసుకొని అర్థం చేసుకొని జీర్ణించుకొని నీ జీవితంలో అనుభవం చేసి అజ్ఞానంలో ఉన్నటువంటి నా భక్తులకు తెలియచేయి నాయన అంటాడు 18 68లో సో ఈ రహస్యాలకి మనం వెళ్ళలేదుగా వెళ్ళనప్పుడు ప్రతిదీ మనకు
(34:30) ప్రశ్నగానే ఉంటుందండి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రహస్యాలను తెలుసుకుంటే మనక ఏం అర్థం అవుతుంది మన్మనా నాభవ అన్నాను నీ మనసు నా యందు పెట్టు ఈ మనసు నా యందు పెట్టు అంటే ఎక్కడ ఎలాగ పెట్టగలుగుతామో దాని గురించి మనకు రెండు విషయాల్లో స్పష్టత ఉండాలి నేను ఎవరిని భగవంతుడు ఎవరు నేను ఎవరిని ఎందుకంటే నీ మనసు పెట్టమన్నాడు కదా మీ శరీరాన్ని పెట్టమని చెప్పలేదు కదా శరీరం అంటే మీరు చెప్తారు కళ్ళు ఇక్కడ ఉన్నాయి ముక్కు ఇక్కడ ఉంది చెవులు ఇక్కడ ఉన్నాయి మోకాళ్ళు ఇక్కడ ఉన్నాయి గుండె ఇక్కడ ఉంది అని చెప్తారు మీ మనసు ఎక్కడఉంది మనసు గురించి మీకు
(35:04) తెలుసునా మనసు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారా చేయలేదు సో ఈ మనసు గురించి తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేయాలంటే కచ్చితంగా ఈ రహస్యాల్లోకి వెళితే భగవంతుడు అనేక శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు అంటే నాయనా నీవు ఈ భౌతికమైన శరీరము కాదు నీవు ఈ భౌతిక శరీరములో ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి ఆత్మవి నీ బృటి మధ్యలో మెరుస్తూ ఎక్కడైతే మనం తిలకం పెట్టుకున్నాం చూసారా ఆడవాళ్ళు తిలకం పెట్టుకుంటారు మగవాళ్ళు కూడా గుడి వెళ్ళినప్పుడు తిలకం పెట్టుకుంటున్నారు మీరు కూడా తిలకం పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారు మృగుకుటి మధ్యలో పెట్టుకున్నారు. ఇక్కడ ఈ శరీరంలో ఇక్కడ
(35:44) ఆత్మ చైతన్య శక్తి ఇక్కడ ఉన్నది నాయనా ఆ చైతన్య శక్తిని అర్థం చేసుకోనంతవరకు నీకు ఈ సూక్ష్మ శక్తులు ఆత్మ సూక్ష్మము ఆత్మ ఈ రెండు భౌతిక చర్మ చక్షువుల ద్వారా నీవు చూడలేవు అదేవిధంగా మనసుని కూడా చూడలేవు ఇది కూడా సూక్ష్మము బుద్ధి సూక్ష్మము దాని ఆధారంగా సంస్కారాలు తయారవుతాయి అది కూడా సూక్ష్మము సో ఈ సూక్ష్మంలోకి నువ్వు వెళ్తే గాని నీవు నీ మనసుని అర్థం అర్థం చేసుకోలేవు నీవు ఎవర అర్థం చేసుకోలేవు అందుకనే చూసారా మనం మామూలుగా ఏం చెప్తాం చెప్పండి నా ఒంట్లో బాగోలేదు అంటాం.
(36:20) అవునా కాదా నా గుండెకి బైపాస్ సర్జరీ అని అంటారు. నా మోకాళ్ళ చిప్పలు అరిగిపోయాయి అంటున్నారు. ఇవి రీప్లేస్మెంట్ చేసుకున్నాను అంటారు. నా తలకి నొప్పి అంటున్నావ్ నా కడుపు నొప్పి అంటున్నాం నా పంటి నొప్పి అంటున్నావ్ నా పంటి నొప్పి అంటే నేను ఎవరిని నా గుండె అంటే నేను ఎవరిని నా మోకాళ్ళు అంటే నేను ఎవరిని నా ఒంట్లో బాగోలేదంటే నేను ఎవరిని సో ఫండమెంటల్ గా ఇది ఇది ఈ భగవద్గీత చెప్పినటువంటి ఆధ్యాత్మిక రహస్యాల్లోకి వెళితేనే మీకు అర్థమవుతుంది మనం మార్పు ఎక్కడ తీసుకొని రావాలి నాలో నేను నేను జడమైనటువంటి శరీరము కాదు ఈ జడమైన శరీరంలో
(36:58) ఉన్నటువంటి ఆత్మని అన్న విషయం అర్థం అవుతుందండి అప్పుడు మనకి మిగతా విషయాలన్నీ చాలా సులభంగా ఎటువంటి ప్రశ్నలు మనకి ఉదయించవన్నమాట కర్మ ఉదయం కర్మ యోగం కర్మ యోగం అంటే ఏంటి యోగం అంటే కలయక నీవు కర్మ చేస్తూ కూడా మనసు నా మీద నాతో సంబంధాన్ని జోడించుకొని కర్మ చేయి కర్మ కర్మ సన్యాసం చెప్పలేదండి భగవద్గీతలో కర్మను విడిచిపెట్టమని చెప్పట్లేదు కర్మ చేయి అంటే కర్మ యోగిగా మారి చేయి అంటే యోగ అంటే కలయక ఆత్మ పరమాత్మతో కలయక జీవాత్మ పరమాత్మతో కలయక అర్థమైందా సో ఆ విధంగా కలయక ధర్మం చేసినట్లయితే భగవంతుని తోడు పెట్టుకొని నీ కర్మ చేస్తే నీ కర్మలు
(37:38) శ్రేష్టమవుతాయి నీ కర్మలో భగవంతుని శక్తి నిండుతుంది. అది అంతకంటే గొప్ప యోగం ఇంకొకటి లేదు సర్వ యోగాలలోకి ఇది అత్యున్నతమైనటువంటి యోగము అందుకనే నేను రాజయోగం అని అన్నారు ఇంకోటి ఏం చెప్పారు భక్తి యోగం అన్నారు ఈరోజున భక్తి మనం యోగం లేకుండా చేస్తున్నాం. భక్తి అనేది చేస్తున్నాం కాబట్టి మన గురించి తెలియదు భగవంతుని గురించి తెలియదు సో యోగం అనేది ఏంటి నేను ఎవరిని పరమాత్మ ఎవరు ఈ జ్ఞానం భగవద్గీతలో చాలా స్పష్టంగా ఉందండి 574 శ్లోకాల్లో చాలా స్పష్టంగా ఉంది నేను అన్ని కవర్ చేసి నేను నా వీడియో నా YouTube లో కూడా వీడియోస్ చాలా పెట్టాను
(38:14) సుమారు ఒక 1000 వీడియోస్ ఉంటాయి నావి అందులో ప్రతి శ్లోకాన్ని నేను అనలైజ్ చేశాను అది మనం ఏం చేయాలి శ్లోకాలని మనం విస్మరిస్తున్నామా ఈరోజున శ్లోకాలతో నాకు పని లేదు భగవద్గీత ప్రకారంగా ఇది ఏమిటి అని అడుగుతున్నాం కానీ భగవంతుడు చెప్పిన మహావాక్యాలు శ్లోకాల్లోనే ఉంది కదండీ అందువల్ల కర్మ ఇప్పుడు భక్తి యోగం అంటే భక్తి అంటే భక్తి అంటే ఏమి లేదండి ప్రేమ పూర్వకమైనటువంటి పరమాత్మని స్మృతి చేయటం భక్తి లవ్ఫుల్ రిమెంబ్రెన్స్ ఆఫ్ గాడ్ డివోషన్ మనం భక్తిని డివోషన్ అంటాం.
(38:46) సో అది కూడా ఏమవుతుంది భక్తి కూడా ఎలా చేయాలి భక్తి యోగం ఎలా చేయాలి ప్రత్యేక అధ్యాయం ఉందండి ప్రత్యేకమైన అధ్యాయం ఉంది 12వ అధ్యాయం భక్తి యోగం అందులో ఏమని చెప్తున్నాడు అక్కడ ఏమన్నాడు యోమత్భక్తసమే ప్రియ అంటూ ఎనిమిది శ్లోకాలు చెప్పాడు లాస్ట్ లో 12వ అధ్యాయంలోని 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు లాస్ట్ లో ఆఖరి పంక్తి ఏముంటుందండి యోమత్భక్తసమే ప్రియః అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైనవాడు మళ్ళీ భగవంతుడు చెప్తున్నాడు కదండీ నువ్వు ఈ విధంగా భక్తి చేసినట్లయితే నువ్వు చాలా దగ్గరగా అవుతావు నాకు నా హృదయానికి టచ్ అవుతావు నేను నీకు
(39:22) పూర్తిగా ఆ కనెక్ట్ అయి ఉంటాను నేను నీ యొక్క బాధ్యతలన్నీ నేను స్వీకరిస్తాను నీకు శక్తిని ఇస్తాను అన్ని పనులు చేసుకోగలుగుతావు సో ఇక్కడ కర్మయోగం మీరు కర్మయోగం చెప్పారు రాజయోగం అంటే సర్వశ్రేష్ట యోగం అని చెప్పాను జ్ఞాన యోగం అంటే ఇది జ్ఞానం యొక్క ఆధారం జ్ఞానం జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి ఇప్పుడు జ్ఞానం అంటే మనం మామూలుగా ఏమనుకుంటున్నాం జ్ఞానం అనగానే మనం శాస్త్రజ్ఞ జ్ఞానం అనుకుంటున్నాము ఇప్పుడు ఏదో ఇప్పుడు ప్రతి ధర్మానికి శాస్త్రాలు ఉన్నాయి హిందూ ధర్మానికి రకరకాల శాస్త్రాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి ఇతిహాసాలు ఉన్నాయి
(39:53) పురాణాలు ఉన్నాయి అర్థమైందా అండి అదే బ్రహ్మ సూత్రాలు ఉన్నాయి ఆ ఈ అంటారు ప్రస్థానత్రయం అంటారు కదా బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు ప్లస్ ఇది గీత ఇవన్నీ ఉన్నాయి మీరు శాస్త్ర జ్ఞానాన్ని పొందినట్లయితే మీరు అదే జ్ఞానం అంటున్నారు. మామూలుగా ఇప్పుడు చలామణిలో అవుతున్నారు అదే కదా జ్ఞాని అనగానే వేద పండితుడు లేకపోతే ఉపనిషత్తులు మీద ఉపన్యాసాలు ఇస్తారుని చెప్తున్నారు.
(40:20) ఇప్పుడు భగవంతుడు గీతలో జ్ఞానం యొక్క నిర్వచనం ఇచ్చాడు. జ్ఞానం అంటే ఏమిటి అని నిర్వచనం ఇచ్చాడు. ఎక్కడిచ 13వ అధ్యాయంలో రెండవ శ్లోకంలో ఇచ్చాడు క్షేత్రజ్ఞం చాభిమా విద్ది సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞ యోహజ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అన్నాడు ఏమన్నాడు అక్కడ క్షేత్రము వేరు క్షేత్రం అంటే ఈ శరీరం అనేది క్షేత్రం అంటే పొలము పొలము పొలము యజమాని వేరు చూసారా 100 ఎకరాల పొలం ఉన్నాయని ఏమంటాడు ఈ 100 ఎకరాలు నాది నాయన 10 ఎకరాలు వరి వేస్తున్నా 10 ఎకరాలు కాటన్ వేస్తున్నా 10 ఎకరాలు కూరగాయలు వేస్తే చెప్తాడు కదా సో పొలం పొలము యజమాని వేరు అన్నట్టుగా క్షేత్రము క్షేత్రము యొక్క
(40:58) యజమాని క్షేత్రజ్ఞుడు వేరు క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అండి అర్థమైందా అండి ఈ రెండిటి యొక్క జ్ఞానం ఎవరికైతే తెలుస్తుందో ఎవరైతే ఈ నేను ఆత్మ ఇది నా శరీరము నేను శరీరం కాదు నేను ఆత్మని ఇది నా శరీరము అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్లే జ్ఞానులు అని ఏమంటున్నాడు ఎత్త జ్ఞాన మతం మమ అంటున్నాడు నా మతం ప్రకారంగా మనం ముందుగానే అనుకున్నాం చూసారా భగవద్గీత ముందు పదం ఏంటి శ్రీమతము సో శ్రీమతం ప్రకారంగా ఎవరైతే ఆత్మ వేరు శరీరం వేరు అనుకుంటారో ఆత్మ అవినాశి శరీరం వినాశి ఈ అవినాశి ఆత్మ వినాశి శరీరం యొక్క యజమాని నడిపిస్తోంది
(41:45) వాళ్ళు జ్ఞానులు అంటున్నాడు భగవద్గీత ప్రకారంగా అందువలన జ్ఞాన యోగం అంటే ఏంటి జ్ఞానము ద్వారా యోగం జ్ఞానం లేకుండా యోగం జరగదండి జ్ఞానం అంటే ఏంటి నేను ఎవరిని నా తండ్రి ఎవరు అంటే భగవంతుడు ఎవరు ఈ రెండు తెలుసుకుంటే ఆ కనెక్షన్ ఎలాగ అందుకని ఆత్మ సంయమ యోగం అంటాడు సెల్ఫ్ కంట్రోల్ అంటాడు ఆత్మ అనే పదం వచ్చింది అక్కడ కూడా ఆత్మ సంయమం అంటే కంట్రోల్ కంట్రోల్ ఎక్కడ వస్తుంది ఆత్మ అనేది ముందు తెలుసుకుంటేనే వస్తుంది. అందువలన అది జ్ఞాన యోగం.
(42:14) సో మీ భక్తి యోగం చెప్పాను, జ్ఞాన యోగం చెప్పాను, కర్మయోగం చెప్పాను, అదేవిధంగా రాజయోగం చెప్పాను. అయితే ఇది నిజ జీవితంలో మనిషి తన ఆచరణలో పెట్టుకోవాలంటే ఏం చేయాలి? కచ్చితంగా నండి వర్తమానంలోని ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక సమస్యతో ఎదుర్కొంటున్నాడు. కానీ ఆ సమస్యకి సమాధానం ఏదో టెంపరరీగా అర్థమైందా అండి ఏదో పొందే ప్రయత్నం చేస్తున్నాడు కానీ దాని మూల సత్యాన్ని గుర్తించి అర్థం చేసుకోలేకపోతున్నాడు.
(42:47) అర్థమైందా అండి గీతను ఏమంటున్నాడుంటే గీత అనేది గీత అనేది పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం చేసుకునే గ్రంథముగానే మనం వర్తమానంలో దాన్ని తీసుకున్నాము కానీ అక్కడ ఒక్క విషయాన్ని మనం మిస్ చేస్తున్నామఅండి ఏమిటండీ ఒక్క విషయం అది పటణ అంటే చదువుతున్నాం పారాయణ అంటే పాడుకుంటున్నాం శ్రవణం అంటే ప్రవచనాల రూపంలో వింటున్నాము నాలుగవది డాష్ పెట్టాను ఐదవది ప్రచార ప్రసారం ఈ నాలుగవది డాష్ అంటే ఏమిటి ఆచరణ గీతలో మూడవ అధ్యాయంలో 21వ శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్తాడు యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే
(43:34) ఇక్కడ ఏమంటున్నాడు యదయ ఆచరతి శ్రేష్టః తత దేవేతరోజన ఇతర జనులు నిన్ను చూసి ఆచరించే విధంగా నీ యొక్క ఆచరణ ఉండాలి నీ యొక్క జీవన ప్రమాణం ఎలా ఉండాలంటే ప్రపంచం అటువంటి ప్రమాణాన్ని తీసుకునే విధంగా నీ ప్రమాణం అటువంటి శ్రేష్టమైన ప్రమాణం నెలకొలపాలి అంటున్నాడండి అంటే ఆచరిస్తే మనకి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి సమస్య వస్తుంది.
(44:05) ఎందుకంటే ఈరోజున వర్తమానంలో నేను ఒక చిన్న సింపుల్ ఉదాహరణ ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కులము మతము జాతి అన్ని పక్కన పెట్టేస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటారంటే మనశశాంతి అంటారు. పీస్ ఆఫ్ మైండ్ అంటారు. మీరు ఏ ధర్మం వాళ్ళని తీసుకోండి క్రిస్టియన్స్ అయినా పీస్ ఆఫ్ మైండ్ అంటున్నారు ముస్లిమ్స్ అయినా పీస్ ఆఫ్ మైండ్ అంటున్నారు మనకి శాంతి అంటారు తెలుగులో మనశశాంతి అంటున్నారు.
(44:24) కానీ మనసు గురించి జ్ఞానం ఉందా లేదు మనశశాంతి ఎక్కడి నుంచి వస్తుందండి అదేవిధంగా ఆత్మ అన్న పదం కూడా మనం పలుకుతున్నాం ఎప్పుడు పలుకుతున్నాం ఎవరైనా మరణించినప్పుడు పలుకుతున్నాం దేహ త్యాగం చేసినప్పుడు వాళ్ళ ఏదో సభ పెట్టుకొని సంతాప సభ పెట్టుకొని మూడు నిమిషాలు ఆత్మ శాంతి కోసం ప్రార్థన చేయండి అంటున్నాం. అంటే ఆత్మ శాంతి గురించే అక్కడ శరీర శాంతి అనడం లేదు బ్రతికుండగా కూడా మనశశాంతి అనడం లేదు.
(44:54) బ్రతికుండగా మనశశాంతి అనడం లేదు చనిపోయిన తర్వాత కూడా అక్కడ మన దేహ శాంతి అనట్లేదు బ్రతికుండగా మన శరీర శాంతి లేదు చనిపోయిన తర్వాత కూడా దేహ శాంతి లేదు ఇక్కడ మనశశాంతి అంటున్నాం అక్కడ ఆత్మ శాంతి అంటున్నాం. అంటే అర్థం ఏమిటి చనిపోయిన వ్యక్తిలో ఆత్మ లేదు బ్రతికున్న వ్యక్తిలో ఆత్మ శరీరము రెండు ఉన్నాయి. చనిపోయిన వ్యక్తిలో ఓన్లీ జడమైనటువంటి శరీరం మాత్రమే ఉన్నది.
(45:22) ఆత్మ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మకు శాంతిని ప్రసాదించేందుగా ప్రార్థన చేద్దాము. ఆ ప్రయాణం సుఖంగా సాగుతుంది ఎందుకంటే ఇదైతే మన ముందే బంధువులకారు అది స్మశాన వాటికి తీసుకొని వెళ్లి అక్కడ అగ్ని సంస్కారం చేస్తారు కదండీ అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అక్కడ చనిపోయిన తర్వాత ఆత్మ గురించి నీ బంధువులు సంపాదన పెట్టుకోవడం కాదు బ్రతికుండగా నీలో ఆత్మ ఉంది కదా బ్రతికుండగా నువ్వు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఆత్మని శుద్ధి చేసుకోవడానికి వేమన శతకంలో ఏ శ్లోకం ఉందండి ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల భాండ శుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ
(45:59) పూజలేలరా విశ్వదా అభిరామ వినురవేమ గీతలో అనేక శ్లోకాలు ఉన్నాయి కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియరపి యోగినః కర్మ కుర్వంతి సంగంతత్వ ఆత్మ శుద్ధయే నువ్వు ఆత్మ శుద్ధి కోసం ఎందుకు పని చేయట్లేదు ఆత్మ శుద్ధి అవుతేనండి ఎందుకంటే ఈరోజున ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. అంటే మనసు ఆత్మ అంటే ఇప్పుడు మనం మామూలుగా మనసు అనుకుందాం పోని మనసు చాలా వ్యర్థ చింతనలో ఉంది. పనికిరాని విషయాలు ఉన్నాయి.
(46:31) నకారాత్మక ఆలోచనలు చేస్తున్నాం అందుకనే మానసిక శక్తి మనుషులలో లేదు ఆలోచన శక్తి అంటాం థాట్ పవర్ అంటాం థాట్ పవర్ అంటే మనసు ఏం చేస్తుంది ఆలోచన చేసే కర్మాగారం మనసు ఆలోచి కర్మాగారం సో ఈ ఆలోచన శక్తి తగ్గిపోతుంది. ఆలోచన తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎదురుకుండా సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతున్నాం ఎందుకంటే ఆంతరికంగా శక్తి లేదు కదా నాకు ఒక సమస్య 10వేల మార్కులతో వచ్చిందండి లెట్ అస్ సే ఒక సమస్య 10వేల మార్కులతో వచ్చింది నాకు ఆంతరికంగా ఒక ఐదు లక్షల శక్తి ఉందనుకోండి ఏం చేస్తాను అక్క దాటేస్తాను అదేవిధంగా 10వేల మార్కులతో వచ్చిన సమస్యకి
(47:10) ఛాలెంజ్ కి నా దగ్గర ఒక 100 మార్కుల శక్తే ఉందనుకోండి టెన్షన్ పడతాను అర్థమైందా ఈరోజు టెన్షన్ కి కారణం ఏంటంటే ప్రతి సమస్యకి శక్తి కావాలి దానికి ఎదురుకొని శక్తి కావాలి. అది బాహ్యంగా దొరకదండి బాహ్యంగా శరీరంలో మనం మూడు పూటల భోజనం చేస్తే దొరకదు లేకపోతే మూడు సార్లు స్నానం చేస్తే శరీరానికి దొరుకుతుంది కానీ శరీరం శుద్ధి అవుతుంది శరీరానికి శక్తి దొరుకుతుంది కానీ ఆత్మకు వెళ్ళటం లేదు.
(47:35) ఆత్మకి వెళ్ళాలి అంటే నువ్వు ఆత్మ రియలైజ్ చేసుకోవాలి మనసు అనేది రియలైజ్ చేసుకోవాలి మనసు బట్టి దాన్ని బట్టి శక్తి నింపుకోవడానికి ఎప్పుడైతే శక్తి వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న వ్యర్థ చింతన పోతుంది నకారాత్మక ఆలోచనలు పోతాయి శుద్ధమైన ఆలోచనలు చేస్తామో దాని నుండి మనక ఏమవుతుందంటే ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. ప్రతి సమస్యని కొంతమంది చూసారా కొండంత సమస్యని తేలికగా వాళ్ళు డీల్ చేస్తారు.
(48:02) గోరంతా అలా ఆ ఏమన్నా ఏమ అంత ఏదో జరిగింది ఏమి లేదయ్యా అంటాడు కొంతమంది ఆవగింజ లాంటి సమస్యను తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు కొండంతా చేసుకుంటారు. అంటే వీళ్ళలో శక్తి ఉంది వాడిలో శక్తి లేదు ఈ శక్తి కానీ లేకపోయినట్లయితే మనకు జరిగేటువంటి అపారమైన నష్టం ఏంటంటే మన ఆరోగ్యం పాడవుతుందండి. ఎందుకంటే డాక్టర్లు ఏం చెప్తున్నారు మెడికల్ సైన్స్ ఏం చెప్తుందండి వర్తమానంలో సైకోసమాటిక్ జబ్బులు అంటున్నాయి.
(48:31) మానసిక ఒత్తిడితో కూడుకున్న జబ్బులేనూికి 70 80 శాతం అంటున్నారు. అందులో కూడా చాలా వరకు ప్రాణాంతకమైన జబ్బులు ఈ మానసిక ఒత్తిడి ద్వారా వస్తుంది దాన్ని ఇంగ్లీష్లో స్ట్రెస్ అంటున్నాం స్ట్రెయిన్ టెస్ట్ డిప్రెషన్ అని ఇంక ప్రెషర్ అని టెన్షన్ అని ఇలాంటి మొదలు వాడుతున్నారు. ముఖ్యంగా మనకి ఏం చెప్తారు ఈ బ్లడ్ ప్రెషర్ షుగర్ ఈ టెన్షన్ తో వస్తాయి మెయిన్ గా రెండు జబ్బులుండి దాని నుండే మనకి గుండెపోటు అంటారు తర్వాత క్యాన్సర్ అంటారు కిడ్నీ ఫెయిల్యూర్ బ్రెయిన్ స్ట్రోక్ డిప్రెషన్ ఇవన్నీ వస్తున్నాయి క్యాన్సర్ ఇవన్నీ వస్తున్నాయి అందుకని భగవంతుడు ఏం
(49:08) చెప్తున్నాడు అన్ని సమస్యలకి ముందుగా నువ్వు సమాధానం దొరకాలి ఎదుర్కోవాలి అంటే ఆంతరిక శక్తి పెంచుకోవడానికి నీవు ప్రయత్నం చేయి నాయన భగవద్గీతలో మంచి విధానం ఏం చెప్తున్నాడో ఆత్మ గురించి అదేవిధంగా పరమాత్మ గురించి స్పష్టమైనటువంటి అవగాహన కల్పించేటువంటి విధంగా 574 శ్లోకాల్లో చాలా అదే విధంగా యోగము గురించి ఉంది.
(49:34) యోగము యోగం అంటే కనెక్షన్ ఒకటేమో నేను ఎవరిని రెండోది భగవంతుడు ఎవరు మూడవది కనెక్షన్ ఈ అందుకనే నేను మామూలుగా మూడు రోజుల క్లాసెస్ చేస్తూ ఉంటాం మేము మా సంస్థలో మూడు రోజు యోగ శిబిరం అంటారు దాన్ని యోగ శిబిరం అంటే ఏంటి ఈ మూడు వస్తే దాంతో ఏమవుతుందంటే ఆంతరికంగా శక్తిని ఎలా పెంచుకోవాలో పెంచుకున్నప్పుడు సార్ ప్రతి సమస్య కూడా మనం డీల్ చేయొచ్చు అండి ఇది స్టూడెంట్ కి వర్తిస్తుందా గృహునికి వర్తిస్తుందా ఉద్యోగి వస్తువు వర్తిస్తుందా బిజినెస్ మ్యాన్ కి వర్తిస్తుందా వీళ్ళ ఫలానా వాడికి వర్తిస్తుందా కాదు ప్రతి ఒక్క మనిషికి వర్తిస్తుంది. ప్రతి ఒక్క మనిషి
(50:06) ఈరోజున టెన్షన్ లో ఉన్నాడు అంటే ఆంతరిక శక్తి తక్కువగా ఉన్నది దాన్ని పెంచుకునే మార్గం తెలియదు అందుకనే భగవద్గీతని మనం తత్వ జ్ఞాన కోణంలో అర్థం చేసుకోవాలి. ఆ మనకి ఆధ్యాత్మిక విద్య అంటారు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనకి ధార్మిక విద్య ఉంది ఈ రెండిటికీ తేడా ఏంటి? ఆధ్యాత్మిక విద్య వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఆధ్యాత్మిక విద్య అంటే ఆత్మవిద్య అందులో నాలుగు విద్యలు వస్తాయండి ఆధ్యాత్మిక విద్యలో ఒకటేమో నేను ఎవరిని ఆత్మవిద్య రెండవది నా తండ్రి ఎవరు ఆత్మ పరంగా తండ్రి పరమాత్మ సో పరమాత్మ విద్య పరమాత్మ అనండి భగవంతుడు అనండి
(50:52) ఈశ్వరుడు అనండి ఏమైనా కాదు భగవంతుడు ఒక్కడే అనుకున్నప్పుడు మనకు పేరుతో మీకు సంబంధం లేదు అర్థమైందా అండి భగవంతుడి విద్య పరమాత్మ విద్య మూడవది ఆత్మ ఆత్మ అవినాశి అన్న విషయాన్ని చాలా స్పష్టంగా భగవద్గీతలో అనేక శ్లోకాల్లో చర్చించడం జరిగింది. ఈ ఆత్మ అవినాశి అన్నప్పుడు శరీరాలు మార్చుకుంటూ ఈ సృష్టి నాటక రంగంలో అది ప్రయాణం చేస్తూ ఉంటుందని భగవద్గీతలో మూడవ అధ్యాయంలోని 16వ శ్లోకంలో చెప్తాడు.
(51:20) ఏవం ప్రవర్తితం చక్రం అంటాడు అక్కడ అంటే సృష్టి చక్రంలో ఈ ఆత్మలు శరీరాలు మార్చుకుంటూ తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పుట్టినవాడు మరణిస్తాడు మరణించినవాడు మళ్ళీ జన్మ తీసుకుంటాడు అని ప్రఖ్యాతమైనటువంటి శ్లోకం ఉంది కదా జాతస్య హిద్రువో మృత్యు ధ్రువం జన్మృతస్యచ తస్మాద అపరిహార్యేర్దేనత్వంశతమరహస్య పుట్టినవాడు మరణిస్తాడు మరణించినవాడు పునా జన్మ తీసుకుంటాడు ఇది అనివార్యము అన్నాడు గీతలో అపరిహార్యేర్దే అంటే అనివార్యము దేనికోసం నువ్వు దుఃఖపడుతున్నావు అర్జున అంటాడు అర్థమైందా అండి ఈ ఒక్క విషయాన్ని మనం కూలంకశంగా తీసుకున్నట్లయితే తే ఈ
(51:57) కాలచక్రం ఆగదండి ఆధ్యాత్మిక విద్య ఇంకొక విషయం ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ శరీరం కాదు ఎందుకంటే ఈ శరీరం అనేది మార్చుకుంటాడు. గీతలో రెండవ అధ్యాయంలో 22వ శ్లోకంలో ఏం చెప్పాడు వాసాంశ జీర్ణ యదావిహాయ అందులో ఏమన్నాడు ఏ విధముగా అయితే ఒక మురికి వస్త్రాన్ని ఒక చిరిగిన వస్త్రాన్ని మార్చుకొని క్రొత్త వస్త్రాన్ని ధరిస్తాడో అదేవిధముగా ప్రతి ఒక్క ఆత్మ ఈ ముసలిది అయిపోయిన తర్వాత శరీరం కూడా బాగా అయిపోతుంది బాల్యము యవ్వనం వృద్ధాప్యం వచ్చిన తర్వాత శరీరం విడిచిపెట్టి క్రొత్త శరీరాన్ని తీసుకుంటుంది సో ఇది ఈ విధంగా కాలచక్రంలో
(52:34) తిరుగుతుంది ఇది ప్రతి ఒక్క వ్యక్తికి అప్లై అవుతుంది. దీనికి కులం మతము జాతి రంగు రూపు లేదండి 850 కోట్ల మంది మనుషులు కూడా వాళ్ళు ఆ విధంగా ఈ శరీరాలు మార్చుకుంటూ సృష్టి చక్రంలో తిరుగుతూ ఉంటారు. సో దీన్ని ఏమంటారు మూడవది సృష్టి చక్ర విద్య సృష్టి చక్ర జ్ఞానం ఆత్మజ్ఞానము పరమాత్మ జ్ఞానం సృష్టి చక్ర జ్ఞానం నాలుగవ జ్ఞానము కర్మ సిద్ధాంతం కర్మల గుహ్యగతి అంటారు దాన్ని అంటే కర్మలు ఈరోజున ఎందుకు శ్రేష్టంగా అవ్వటం లేదు ప్రతి ఒక్కరు శ్రేష్ట కర్మ చేస్తే నాకు కలిగే లాభం ఏమిటి ఈ యొక్క చెడు కర్మలు చేస్తున్నావ్ విషయ వికారాల వలయంలో చిక్కుకొని పాడు కర్మలు
(53:14) చేస్తున్నావ్ కామ క్రోధ లోభము అహంకారాలు ఇవన్నీ పంచవికారాలు ని చెప్పడం జరిగింది కానీ ప్రపంచంలో ఏ ఒక్క శాస్త్రం కూడా ఈ యొక్క గుణాలు మీరు పెట్టుకోండి మీ జీవితాన్ని మీ జీవితం ఉద్ధరింపబడుతుందండి అని ఎక్కడ కూడా లేదే ఇవన్నీ వికారాలు అవగుణాల కిందనే చెప్పారు కదా సో ఈ అవగుణాలని మీరు ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటే కర్మ సిద్ధాంతం తెలియటం లేదు కర్మ సిద్ధాంతం అంటే చాలా లోతైన విషయం అని చెప్తాడు కర్మణోహపి బోధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణస్చ బోద్ధవ్యం గహనా కర్మణోగతి అంటాడు గీతలో నాలుగవ అధ్యాయంలోని 35 శ్లోకంలో అంటాడు గహనా కర్మణోగతి అంటే ఏమిటి చాలా లోతైన విషయం
(53:53) నాయనా నీవు చేసే కర్మకి నీవే బాధ్యుడివి నీవు తప్పుడు కర్మ చేస్తున్నావు అంటే గుర్తుపెట్టుకో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ పరిణామాలు నీవే అనుభవం చేస్తావు ఈ విషయం అన్నమాట కర్మ సిద్ధాంతం మనం చెప్పేది అక్కడ వికర్మం అంటాడు కర్మ వికర్మ అకర్మ అని వచ్చింది అక్కడ వికర్మ అనే పదం ఎందుకు అన్నాడు వికర్మలు అంటే చెడు చెడు కర్మలు చెడు కర్మలు అంటే ఏంటి సాటి మనిషిని ఇబ్బంది పెట్టే కర్మలు సాటి మనిషికి దుఃఖాన్ని కలిగించే కర్మలు సాటి మనిషిని మోసం చేసే కర్మలు ఇప్పుడు ఈరోజున ఎన్నో జరుగుతున్నాయి ఆహారాన్ని కల్తీ చేస్తున్నారు మందులు కల్తీలు చేస్తున్నారు
(54:31) స్మగ్లింగ్ బ్లాక్ మార్టింగ్ లూటింగ్ మర్డర్లు టెర్రరిజం వైలెన్స్ వార్స్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు కర్మ సిద్ధాంతం తెలియదు వాళ్ళకి వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు భగవంతుడు అంటున్నాడు నేను ఎక్కడా ఇంటర్ఫియర్ అవ్వను నేను సత్య కర్మలు మంచి కర్మలు అంటే శ్రేష్ట కర్మలు సాత్విక కర్మలు చేసే మార్గం నేను చెప్తాను. ఆ మార్గంలో నువ్వు వెళ్తావా వెళ్ళు వెళ్ళలేవా నేనేం చేయలేను నా బాధ్యత తండ్రిగా నేనుేం చెప్తున్నాను నువ్వు ఈ పని చేయు ఈ పని చేయొద్దు ఈ మార్గంలో వెళ్ళు ఆత్మ చింతనలో ఉన్నట్లయితే నాతో కనెక్ట్ అవుతావు నువ్వు కర్మ యోగిగా
(55:11) నువ్వు శ్రేష్ట కర్మలు చేస్తావు కర్మ యోగిగా ఎప్పుడైతే కర్మని యోగాన్ని పక్కన పెట్టి నువ్వు కర్మలు చేస్తున్నావ అంటే నేను లేకుండా నువ్వు కర్మ చేస్తున్నావ్ నీ కర్మలు ఆ మనం చూస్తున్నాం కదా నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మలు ఇవన్నీ చెప్తున్నారు కదా ఇటువంటి కర్మలు జరుగుత తున్నా ఇదే కారణం అండి ప్రపంచం వర్తమానంలో దిగజారడానికి కారణం ఇదే ధర్మ సిద్ధాంతం అర్థం కాదు దీనికి భిన్నంగా ఇంకొక పాయింట్ అడిగారు మీరు ధార్మిక విద్య అంటే ఏమిటి ఇంకో విద్య మూడు విద్యలు ఉన్నాయండి మొత్తం ఆధ్యాత్మిక విద్య మీకు చాలా కూలంకృష్టంగా చెప్పాను ధార్మిక విద్య అంటే ప్రతి
(55:43) ధర్మానికి ఒక ధర్మ గ్రంథం ఉంది. అదేవిధంగా బైబిల్ ఖురాన్ ధమ్మపాద ఇంత చెప్పుకున్నాం సో ఆ ధర్మానికి చెందినటువంటి ధర్మ గ్రంథంలో ఉన్నటువంటి విద్య ఆ ధర్మ గ్రంథం బోధిస్తోంది ధర్మ పెద్దలు బోధిస్తారు ప్రవచనాల ద్వారా సో ఆ విద్యని ధర్మ ధార్మిక విద్య అది ఒక్కొక్క ధర్మానికి చెందినటువంటిది అది యూనివర్సల్ కాదు యూనివర్సల్ గా అనుకోవడం లేదు కానీ దురదృష్టకవశాత్తు మనం భగవద్గీతను కూడా ఒక ధర్మ గ్రంధంగా భావిస్తున్నాం సో దానిలో ఉన్నటువంటి ఒక విశ్వవ్యాప్తంగా విశ్వాత్ములందరికీ చెందిన గ్రంథం అన్న విషయాన్ని మనం విస్మరించాం ఎప్పుడైతే ఆ విషయాన్ని మనం తెలుసుకుంటామో అది ఈ
(56:19) భగవద్గీత ధర్మ గ్రంథం కాదు అది ఆధ్యాత్మిక గ్రంథం అన్న సంగతి మనకు అర్థంఅవుతుంది. ఎందుకంటే భగవద్గీతలో నేను చెప్పాను చూసారా విశ్వము జగత్తు లోకము ఇవన్నీ ఎన్నెన్ని శ్లోకాల్లో ఉందని చెప్పి ఇది కాకుండా భౌతిక విద్య మూడవది ఫిజికల్ సైన్సెస్ ఆ ధార్మిక విద్య అంటే రిలీజియస్ సైన్సెస్ అర్థమైందా అండి ఆధ్యాత్మిక సైన్సెస్ అనవండి స్పిరిచువల్ సైన్స్ అంటాం ఒకటే విద్య ఆధ్యాత్మికం అంటే యూనివర్సల్ కదా అందరికీ అప్లై అయ్యేది రిలీజియన్ అంటే సైన్సెస్ ఒక్కొక్క ధర్మానికి ఒక్కో సైన్స్ ఉంది హోలీ బైబిల్ ఖురాను భగవద్గీత ఈ విధంగా దమ్మ పాదాలు ఇలా పెట్టుకున్నారు సో
(56:53) ఈ విధంగా సైన్సెస్ భౌతిక విద్య అంటే ఏం లేదండి ఈ ఒక్క జన్మకి మాత్రం మీ పొట్ట పోషణ చేసుకోవడం కోసం మీ శరీర నిర్వహణం కోసం వచ్చేసి మీరు చేసుకునే విద్య ఏదైతే మీరు మనకు ఉన్నట్టు యూనివర్సిటీస్ ఇస్తున్నారు కదా వివిధ రకరకాల డిగ్రీస్ ఇస్తున్నాయి ఎంబిఏ ఎంసిఏ మెడికల్ ఇంజనీరింగ్ ఈ ఇది అన్నీ కేవలం ఒక్క జన్మకి మాత్రం పనికవచ్చేది ఈ విద్య ఇది భౌతిక విద్య ఒక్కొక్క ధర్మానికి చెందిన వాళ్ళు వాళ్ళు ఆచరించేటువంటి విద్య అది ధార్మిక విద్య విశ్వాత్మలందరికీ విశ్వాత్మల అందరికీ నేను ఆత్మలు అంటున్నా భగవంతుడు కూడా ఆత్మలకే చెప్తున్నాడు భగవంతుడు
(57:27) శరీరాలకు బోధించడం లేదు. శరీరం అనేది కేవలం ఒక వస్త్రము లాంటిది కానీ భగవంతుడు మనకి బోధిస్తున్నాడు నేను ఎవరిని నాకు బోధిస్తున్నాడు నేను ఎవరిని ఆత్మని నేను శరీరం కాదు నా ఒంట్లో బాగోలేదు అంటున్నాను కదా నా ఒళ్ళు గురించి చెప్పడం లేదు భగవంతుడు ఇప్పుడు మీరు నా ఇల్లు అంటున్నారు ఇది నా స్టూడియో అంటున్నారు ఇది నా వాహనం అంటున్నారు నా వాహనం అంటే మీరేమన్నా మీరు ఆ వాహనం టైరు స్టీరింగ్ వీలు ఆ రేకు కాదు కదా మీరు ఇల్లు అంటే మీ ఇటుగా టెర్రస్ ఇది కాదు కదా మీరు ఇంట్లో నివాసించే నివసించే వాళ్ళు కారులో ప్రయాణం చేసే యజమాని మీరు అర్థమైందా అదేవిధంగా
(58:05) ఆత్మజ్ఞానం మనక ఏం చెప్తుందంటే ఈ శరీరం అనేది వినాశి ఆత్మ అనేది అవినాశి ఆత్మ అనేది వజ్రము ఈ శరీరం అనేది పెట్టి మాత్రమే ఆత్మ అనేది కరెంటు ఈ శరీరం అనేది పైన ఉన్న తొడుగు మాత్రమే ఆత్మ ఉన్నది సెల్ ఫోన్ లో ఉన్న సిమ్ ఈ శరీరం అనేది పైన కనబడేటువంటి సెల్ ఫోను ఆత్మ అనేది ఒక పక్షి ఈ శరీరం అనేది పంజర రము ఆత్మ అనేది వజ్రము ఈ శరీరం అనేది పెట్టి ఈ యొక్క స్పష్టత మనకి ఆత్మనే ఆత్మజ్ఞానం మనం అభ్యాసం చేయమంటాడు గీతలో అభ్యాసం చేసినట్లయితే ఏమవుతుంది ఎప్పుడైతే మీరు ఆత్మని అనుభవం చేస్తారో పరమాత్మ నుండి శక్తుల గుణాలు వస్తాయి. సో భౌతిక విద్య
(58:46) శరీర నిర్వహణ కోసం చేసే విద్య ధార్మిక రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధార్మిక విద్య చేసుకుంటారు విశ్వాత్మలందరికీ కూడా ఒకటే ఒక్క విద్య ఆధ్యాత్మిక విద్య ఇది ముఖ్యంగా ఇండియండి ఏడవ అధ్యాయం మూడవ శ్లోకంలో అందుకని ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తాడండి మనుష్యానాం సహస్రేషు కశచిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశచిన్మాం వేతి తత్వతః అంటాడు తత్వము ఆధారముగా నన్ను కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు ఇప్పుడు ఆ శ్లోకాన్ని విశ్లేషణ చేసినట్లయితే వేల కొలది మనుషులలో ఒకానొకడు మాత్రమే జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు అట్లు ప్రయత్నం
(59:29) చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే నన్ను యదార్థంగా తెలుసుకొని నేను నిర్దేశించినటువంటి మార్గంలో నడుస్తాడు. ఇది ముఖ్యంగా ఆ నిర్దేశించిన మార్గంలో నడిచేటువంటి వాళ్ళునూటికినూ శాతం ఆధ్యాత్మిక విద్యని అభ్యసిస్తారు. వాళ్ళు ధార్మిక విద్య భౌతిక విద్య భౌతిక విద్య ఎలాగైనా ప్రతి ఒక్కరికి ఉంటుంది.
(59:54) శరీర నిర్వహణం కోసం ఆధ్యాత్మిక విద్య పనికి రాదు శరీరం నిర్వహణం కోసం మనం ఉద్యోగం వ్యాపారం చేసుకోవాలి సంపాదించుకోవాలి కానీ దానిలో శ్రేష్టంగా ఎలా చేసుకోవాలి విలువలతో కూడినటువంటి జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలి అది మనకి ఆధ్యాత్మిక విద్య ఉన్నట్లయితే ఈ భౌతిక విద్య మనకు తోడై మన యొక్క జీవితం సాఫీగా సాగుతుందండి. చాలా చాలా సంతోషం అండి చాలా అద్భుతమైన విషయాలను మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు.
(1:00:18) నమస్కారం అండి మరొక్కసారి ఈ సౌరవి YouTubeూ్ ఛానల్ యాజమాన్యానికి మీకు మారల రవిశాస్త్రి సోదరులకి నమస్కారం అండి శ్రోతలందరికీ కూడా మరొక్కసారి శుభాభినందనలు నమస్సుమాంజలి [సంగీతం] ఇన్ని యోగాలు ఉన్నాయి కదా వాటి సాధన
(1:01:11) ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అనేది ఎంతమంది మహానుభావులు దీన్ని చెప్పారు భర్తను గమనించడం అయంది ఆ భర్తలో ఉన్న సబ్జెక్ట్ ఉందంటే ఒకసారి చూసి మీ రివ్యూ కూడా ఇవ్వండి ఇప్పటివరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం మరొక్కసారి మరొక విశిష్టాతితో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం

No comments:

Post a Comment