Wednesday, July 29, 2026

How to Deal with a Narcissist-6 powerful solutions-Telugu Motivation

How to Deal with a Narcissist-6 powerful solutions-Telugu Motivation

Author Name: Greeshma’s Guidance

Youtube Channel Url:https://www.youtube.com/@greeshma_guidance

Youtube Video URL:https://www.youtube.com/watch?v=W0ZKE8lLtuE



Transcript:
(00:00) హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఒక నార్సిసిస్ట్ అంటే అహంకారము ఇతరులను మానసికంగా అణచివేసే స్వభావం ఉన్న వ్యక్తితో కలిసి జీవించడం అనేది చాలా నరకప్రాయమైన విషయం. ఇటువంటి వ్యక్తులతో ఒకే ఇంట్లో ఉండడం అంటే ప్రతిరోజు ఒక యుద్ధం చేసినట్లే వారు మిమ్మల్ని మానసికంగా భావోద్వేగపరంగా తీవ్రంగా దెబ్బతీస్తారు.
(00:27) మీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి మిమ్మల్ని పూర్తిగా వాళ్ళపై ఆధారపడేలా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే కొన్ని కుటుంబ లేదా వ్యక్తిగత పరిస్థితుల వల్ల మీరు ఆ బంధం నుండి బయటకు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు ఆ బంధంలో ఉంటూనే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి మీ మానసిక ప్రశాంతతను ఎలా నిలబెట్టుకోవాలి ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నార్సిసిస్ట్ భాగస్వామి వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యలు వాటి ఉదాహరణలు మరియు వాటికి శక్తివంతమైన పరిష్కారాల గురించి వివరంగా తెలుసుకుందాం.
(01:02) వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నార్సిసిస్ట్ భాగస్వామితో ఉన్నప్పుడు మీరు ప్రధానంగా కొన్ని రకాల మానసిక హింసలకు గురవుతారు. వాటిని గుర్తించడం మొదటి అడుగు. మొదటిది గేస్లైటింగ్ మీ ఆలోచనలని అనుమానించేలా చేయడం. నార్సిసిస్ట్లు వాడే అతి పెద్ద ఆయుధం ఈ గేస్ లైటింగ్ నిజంగా జరిగిన విషయాన్ని కూడా అది జరగలేదు నువ్వు ఊహించుకుంటున్నావు నీకు పిచ్చిపట్టింది అని మీతోనే అనిపిస్తారు.
(01:41) చివరికి మీ జ్ఞాపక శక్తిని మీ ఆలోచన విధానాన్ని మీరు అనుమానించే స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ భాగస్వామి మిమ్మల్ని నలుగురిలో అవమానించేలా మాట్లాడతారు. ఇంటికి వచ్చాక మీరు ఆ విషయం గురించి నిలదీస్తే నేను అలా అనలేదు నువ్వు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తావు నీకు అనవసరంగా అనుమానించే అలవాటు ఉంది అని ఎదురుతాడి చేస్తారు.
(02:09) దీనివల్ల మీరు నిజంగానే తప్పు నాదేమో అని భ్రమపడే అవకాశం ఉంది ఫ్రెండ్స్. [గొంతు సవరించుకోవడం] రెండోది బ్లేమ్ సిఫ్టింగ్ నిందలు మీపైకి నెట్టడం వారు ఏ తప్పు చేసినా సరే ఆ తప్పు కారణం మీరే అని చిత్రీకరిస్తారు. తమ బాధ్యత రాహిత్యాన్ని లేదా కోపాన్ని మీ ప్రవర్తనపై నెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ భాగస్వామి ఆఫీస్ కోపాన్ని లేదా బయట ఒత్తడిని వచ్చి మీపై చూపిస్తారు.
(02:39) మీరు ఎందుకు కోపంగా ఉన్నారు అని అడిగితే నువ్వు ఇల్లు సరిగ్గా నిర్వహించడం లేదు కాబట్టే నాకు కోపం వస్తుంది అని నిందిస్తారు. వారు చేసే ఏ తప్పుకు క్షమాపణ చెప్పరు. సరి కదా ఆ తప్పుకు మిమ్మల్నే బాధ్యులను చేస్తారు. మూడోది లవ్ బాంబింగ్ మరియు డీఫాల్యేషన్ ప్రారంభంలో లేదా వారికి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీపై అమితమైన ప్రేమను చూపిస్తారు. దీన్నే లవ్ బాంబింగ్ అంటాం.
(03:11) కానీ ఒక్కసారి వారి అవసరం తీరిపోయాక లేదా మీరు వారి మాట వినకపోతే మిమ్మల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. చిన్నచూపు చూస్తారు. ఫర్ ఎగజాంపుల్ ఏదో ఒక రోజు వారు మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తిగా కోడుతారు. నెక్స్ట్ రోజే మీ రూపం మీ ఉద్యోగం లేదా మీ తెలివితేటలను దారుణంగా కేల్ చేస్తారు. ఈ హటాత్ మార్పు వల్ల మీరు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారు.
(03:43) నాలుగోది ఐసోలేషన్ అంటే బంధువులు స్నేహితులకు దూరం చేయడం మీకు ఎవరి మద్దతు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. మీ తల్లిదండ్రులు స్నేహితులు లేదా సహుద్యోగులతో మాట్లాడటం వారికి నచ్చదు. వారి గురించి మీ మనసులో చెడు అభిప్రాయం కలిగేలా చేస్తారు. ఫర్ ఎగజాంపుల్ మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మీరు ఫోన్ మాట్లాడినా లేదా బయటకు వెళ్ళినా గొడవ పడతారు.
(04:14) వారు నీ మంచి కోరేవారు కాదు నన్ను నీకు దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని ఒంటరిని చేస్తారు. మీరు ఆ ఇంట్లోనే ఉంటూ ఆ భాగస్వామితోనే జీవించాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు మానసికంగా సిద్ధం చేసుకోవాలి. వారి ప్రవర్తనను మార్చడం అసాధ్యం కాబట్టి మీ ప్రతిస్పందనను మార్చుకోవడమే ఏకైక మార్గం. సొల్యూషన్ నెంబర్ వన్ గ్రే రాక్ పద్ధతి ద గ్రే రాక్ మెథడ్ నార్సిసిస్టులకు మీ భావోద్వేగాలే ఆహారం.
(04:52) మీరు కోప్పడినా ఏడ్చినా బాధపడినా వారు గెలిచినట్లుగా భావిస్తారు. గ్రేరా పద్ధతి అంటే ఒక సాధారణ బూడిద రంగు రాయిలా మారడం అంటే ఏ భావోద్వేగాన్ని బయటకు చూపించకపోవడం మీరు చేయాల్సింది వారు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు కోప్పడకండి ఏడవకండి చాలా ప్రశాంతంగా ఒకే మాటతో జవాబు ఇవ్వండి. సపోజ్ వారు నువ్వు దేనికి పనికి రావు అని అన్నప్పుడు అవునా సరే ఓకే ఇలా మాత్రమే అనండి ఎలాంటి సుదీర్ఘ వివరణలు ఇవ్వొద్దు మీరు స్పందించకపోతే వారికి మీతో గొడవ పడాలి అనే ఆసక్తి నశిస్తుంది.
(05:36) రెండో పరిష్కారం స్ట్రాంగ్ బౌండరీస్ ఏర్పాటు చేసుకోవడం మీ జీవితంలోనికి ఎంతవరకు ఎవరిని రానివ్వాలో మీరే నిర్ణయించుకోండి. వారు మీ గౌరవానికి భంగం కలిగించినప్పుడు మౌనంగా భరించవద్దు. అలాగని గొడవపడకండి మీ సరిహద్దును స్పష్టంగా చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటంటే మాటల ద్వారా నొక్కి చెప్పడం. ఉదాహరణకు నువ్వు నాపై కేకలు వేస్తే నేను ఈ సంభాషణను ఇక్కడితో ఆపేస్తున్నాను.
(06:04) ప్రశాంతంగా మాట్లాడినప్పుడు మాత్రమే నేను వింటాను అని చెప్పి ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోండి. మూడో పరిష్కారం ఆశలు వదులుకోవడం. రేపు వారు మారుతారు నా ప్రేమ చూసి మారుతారు అనే భ్రమల నుండి బయటకు రండి నార్సిసిజం [గొంతు సవరించుకోవడం] అనేది ఒక వ్యక్తిత్వ లోపం వైద్య సహాయం లేకుండా వారు మారరు మారడం దాదాపు అసాధ్యం మీరు చేయాల్సింది వారు ఇలాగే ఉంటారని నిజాన్ని పూర్తిగా అంగీకరించండి వారు మిమ్మల్ని మెచ్చుకోవాలని ప్రేమిస్తారని ఆశించడం మానేయండి.
(06:44) ఆశ లేనప్పుడు నిరాశ మరియు బాధ్యత తగ్గుతాయి. నాలుగో పరిష్కారం సమాచారాన్ని దాచడం మీ బలహీనతలను మీ భయాలను మీ భవిష్యత్ ప్రణాళికలను వారికి చెప్పకండి. మీరు చెప్పే ప్రతి చిన్న విషయాన్ని వారు మీపై ఆయు విధంగా ఉపయోగిస్తారు. మీరు చేయాల్సిందల్లా మీ వ్యక్తిగత విషయాలు సంతోషాలు లేదా బాధలను వారితో పంచుకోవడం తగ్గించండి. కేవలం ఇంటికి సంబంధించిన అవసరమైన విషయాలు మాత్రమే వారితో మాట్లాడండి.
(07:23) ఐదవ పరిష్కారం మానసిక మద్దతు వ్యవస్థ అంటే సపోర్ట్ సిస్టం ను నిర్మించుకోవడం భాగస్వామి మిమ్మల్ని ఒంటరిని చేయడానికి ప్రయత్నించిన మీరు బలవంతంగా మీ స్నేహితులు బంధువులతో సంబంధాలను పునరుద్ధరించుకోండి. మీరు చేయాల్సింది మీకు నమ్మకమైన ఒక ఇద్దరు వ్యక్తులనైనా మీ జీవితంలో ఉంచుకోండి. మీ మనసులోని బాధను పంచుకోవడానికి లేదా మిమ్మల్ని మానసికంగా స్థిరంగా ఉంచడానికి వారి సహాయం తీసుకోండి.
(07:57) అవసరమైతే ఒక మానసిక వైద్యుని సలహా తీసుకోండి. ఆరో పరిష్కారం ఆర్థిక స్వాతంత్రం సాధించడం. చాలా మంది నార్సిసిస్టులు తమ భాగస్వాములను ఆర్థికంగా తమపై ఆధారపడేలా చేస్తారు. ఇది మిమ్మల్ని మానసికగా మార్చే ప్రక్రియ. మీరు చేయాల్సింది మీకు వీలైనంతలో చిన్న ఉద్యోగమైనా చేయండి లేదా ఇంటి వద్ద నుండి పని చేయడం నేర్చుకోండి. మీకంటూ సొంతంగా కొంత డబ్బు ఉండడం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
(08:34) మీ డైలీ లైఫ్ లో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఒక పట్టికగా మీకు అందిస్తున్నాను. దాన్ని మార్గదర్శకంగా ఉపయోగించండి. అందులో డూస్ అండ్ డోంట్స్ అన్ని వివరంగా చెప్తున్నాను. వారు మిమ్మల్ని నిందించినప్పుడు ఆ నింద నిజం కాదని నిరూపించుకోవడానికి ప్రయత్నించడం సుదీర్ఘంగా వాదించడం చేయకండి నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది అని ప్రశాంతంగా చెప్పి పక్కకు తప్పుకోవడం మంచిది.
(09:03) వారు కోపంలో అరిచినప్పుడు ఎదురు అరవడం లేదా ఏడుస్తూ వారిని బ్రతిమలాడటం చేయకండి ప్రశాంతంగా ఉండడం అక్కడి నుండి వేరే గదిలోనికి వెళ్ళిపోవడం చేయండి. గేస్ లైటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పిందే నిజమని వారితో వాదనకు దిగి మానసికంగా అలిసిపోవడం చేయకండి.మీ మీ డైరీలో లేదా ఫోన్లో నిజంగా ఏం జరిగిందో రాసి పెట్టుకొని మీ మనసుకు స్పష్టత ఇచ్చుకోవడం మంచిది.
(09:32) మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఆ మాటలను మనసుకు తీసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం ఆపండి. మీ నైపుణ్యాలు మంచి గుణాలను ఒక కాగితంపై రాసుకొని మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం మంచిది. మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి నార్సిసిస్ట్ భాగస్వామితో ఉంటూ బ్రతకాలంటే మీ శక్తిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యం. దానికి కొన్ని మార్గాలు నెంబర్ వన్ ఆధ్యాత్మికత మరియు ధ్యానం ప్రతిరోజు కనీసం 20 నిమిషాలు ధ్యానం చేయండి.
(10:08) ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. భాగస్వామి రెచ్చగొట్టినప్పుడు కోపం రాకుండా నియంత్రిస్తుంది. రెండోది వ్యాపకాలు అంటే హాబీస్ మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం సంగీతం వినడం మొక్కల పెంపకం లేదా పెయింటింగ్ వంటి పనుల్లో నిమగ్నం అవ్వండి. ఇది మీ దృష్టిని ప్రతికూల ఆలోచనలు అంటే నెగిటివ్ థింకింగ్ నుండి మల్లిస్తుంది. మూడోది మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు.
(10:34) నేను ఇంకా బాగా చూసుకుంటే వారు మారేవారేమో అనే ఆలోచన ముమ్మటికి తప్పు ఫ్రెండ్స్ వారి ప్రవర్తనకు వారు మాత్రమే బాధ్యులు మీరు కాదు నాలుగోది ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మంచి ఆహారము నిద్ర మరియు వ్యాయామం చాలా అవసరం. మానసిక ఒత్తిడి శరీర ఆరోగ్యాన్ని తెప్పతీస్తుంది. భాగస్వామితో జీవించడం అనేది ఒక నిరంతర పోరాటం కానీ గుర్తుంచుకోండి మీ జీవితానికి మీ సంతోషానికి మీరే బాధ్యులు అవతలి వ్యక్తి మారుతాడనే ఆశను వదిలేసి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి నేను చెప్పిన పద్ధతులను ఉపయోగించండి. మీ మనసును బలంగా ఉంచుకోండి.
(11:17) నార్సిసిస్ట్ ఆడే నాటకంలో మీరు ఒక పాత్ర కాకూడదు. కేవలం ప్రేక్షకునిగా మాత్రమే ఉండడానికి ప్రయత్నించండి. పరిస్థితి మరీ చెయి దాటితే మీపై భౌతిక దాడులు లేదా తీవ్రమైన మానసిక వేదంపులు జరుగుతుంటే ఆ బంధం నుండి శాశ్వతంగా బయటకి రావడం గురించి లేదా చట్టపరమైన మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం గురించి ఆలోచించడం ఎంతైనా శ్రేయస్కరం.
(11:46) నార్సిసిస్ భాగస్వామి వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని జయించి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే ఇప్పుడే కామెంట్స్ లో ఎస్ అని టైప్ చేయండి. వీడియో నచ్చితే వెంటనే ఓ లైక్ చేయండి ప్లీజ్ మీ లైక్ నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే వెంటనే వారికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం.
(12:14) అందాక బి స్ట్రాంగ్ బి హ్యాపీ అండ్ స్టే ట్యూన్ టు క్రిస్మస్ గైడెన్స్

No comments:

Post a Comment