Friday, July 3, 2026

 *అఖిలాండేశ్వరి ...!!*

🌿తిరువానైక్కావల్ అని పిలవబడే  తిరువానై శైవ క్షేత్రం 
తిరుచిరాపల్లి నగరానికి సమీపమున వున్నది.

🌸అప్పర్ ,  తిరుజ్ఞాన సంబంధర్, తాయుమానవర్, ఐయ్యాడిగళ్, సుందరర్, అరుణగిరినాదర్ , మొదలైన  శైవ భక్త నాయన్మార్లచే   కీర్తించి  పాడబడిన ప్రముఖ ఆలయం యిది.

🌿 ఈ శివాలయం పంచభూత శివాలయాలలో ఒకటి అయిన జల లింగేశ్వరుని ఆలయం. దీనినే జంబుకేశ్వరం అనికూడా అంటారు.

🌸అమ్మవారి శక్తి పీఠాలలో  
ఒకటి  అయినది యీ ఆలయం.  అఖిల జగాలను  సంరక్షించే అమ్మవారిగా
అనుగ్రహిస్తున్నందున
అఖిలాండేశ్వరి గా కొలవ బడుతున్నది.

🌿ఈ ఆలయంలో అఖిలాండేశ్వరి, గంభీరమైన రూపంతో అనుగ్రహిస్తున్నది. 

🌸  తనను శ్రధ్ధతో పూజించ వచ్చిన  భక్తులందరికి అష్టమామణి సిధ్ధులను కూడా అనుగ్రహించే అంబికగా కొనియాడబడుతున్నది.

🌿ఈ ఆలయంలోని అఖిలాండేశ్వరి  జంబుకేశ్వరుని ఉఛ్ఛికాల
సమయంలో వచ్చి స్వయంగా పూజిస్తుందని ఐహీకం. 

🌸మధ్యాహ్న సమయంలో అమ్మవారికి పూజలు చేసే అర్చకుడు, 
అమ్మవారు కట్టుకునే చీర, 
కిరీటం పూలమాల ధరించి, చేతిలో కమండలంతో , మేళతాళాలతో, శివుని సన్నిధికి వెడతారు.  

🌿అక్కడ స్వామికి అభిషేకం చేసి
గోమాతకి పూజ చేసి , అంబాళ్ సన్నిధికి తిరిగి వస్తారు.  ఈ పూజను అంబిక యే స్వయంగా జరుపుతున్నట్లు ఆధ్యాత్మిక భావన.

🌸ఈ సమయంలో  కోవెలలోని ఆ అర్చకుని భక్తులు అమ్మవారిగానే భావిస్తారు. ఇది యీ ఆలయ విశిష్టత.

🌿ఆషాఢమాసములోనే  అంబిక  శివుని గురించి కఠోర తపస్సు చేసినట్లు  చెపుతారు. 

🌸ఈ ఆలయంలో
ఆషాఢమాసములో శుక్రవారమునాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. తెల్లవారుజామున 2  గంటల నుండి  మరునాడు రాత్రి 12 గంటల వరకు  ఆలయం తెరిచే వుంటుంది. 

🌿 అమ్మవారు ప్రాతఃకాలమున లక్ష్మి దేవిగా, ఉఛ్ఛికాలమున పార్వతీ దేవిగా , సాయంకాలము  సరస్వతీ దేవిగా దర్శనము అనుగ్రహిస్తున్నది.

🌸పరమేశ్వరుడు యీ ఆలయంలో అంబికకు గురువు గా   ఉపదేశం
చేస్తూండగా అంబిక విద్యార్ధినిగా నేర్చుకొంటుంది.  

🌿అందువలన   విద్యార్థులు అనేక మంది ఆలయానికి
వచ్చి ప్రార్ధనలు చేస్తారు .
ప్రధమంలో అమ్మవారు 
ఉగ్ర శక్తి గా వుండేది. 

🌸సాధారణంగా అమ్మవారి
ఉగ్ర శక్తిని శాంత పరచడానికి  శ్రీ చక్రం ప్రతిష్టిస్తారు.  కాని యీ ఆలయానికి వచ్చిన ఆదిశంకరాచార్యులవారు

🌿శ్రీ చక్రానికి బదులుగా , 
శ్రీ చక్ర రూపం లో వుండే రెండు
తాటంకాలను కర్ణాభరణాలుగా అమ్మవారికి  అలంకరించారు. 

🌸పిదప అంబిక శాంతస్వరూపిణిగా దర్శనమనుగ్రహించినది.
ఉగ్రంగా వున్న అంబికను శాంత పరిచే విధంగా ,

🌿 అంబికకు ఎదురుగా వినాయకుని, వెనుకగా కుమార స్వామిని  ఆది శంకరాచార్యుల వారు
ప్రతిష్టించారు.

🌸ఈ ఆలయంలో  కళ్యాణోత్సవాలు జరుపరు. పరమశివుని వేడుకుంటూ అంబిక తపమాచరించిన కారణాన  పరమశివుడు ప్రత్యక్ష మైనాడు.  

🌿కాని వివాహం చేసుకోలేదు. 
అందువలన  ఇక్కడ స్వామి కి  కళ్యాణోత్సవాలు, శయన పూజలు  లేవు.

🌸 కవిత్వంలో గొప్ప
ఖ్యాతి సాధించాలని ఆశించిన ఒక పండితుడు అఖిలాండేశ్వరి అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రార్ధించాడు.  

🌿ఆ పండితుని పరీక్షించాలని అమ్మవారు ,తాంబూలం సేవిస్తూ  , పండితుని వద్దకు వచ్చింది. 

🌸" నేను తాంబూలం వేసుకున్నాను ఆలయంలో  ఉమ్మి అపరిశుభ్రం చేయకూడదు. 
నీ నోరు తెరిస్తే కాస్తా ఉమ్మి వేస్తాను." అన్నది. 

🌿 తనంత పండితుని నోట్లో ఉమ్ముతానని అన్నందుకు కోపము వచ్చిన పండితుడు  ఆమె అనుగ్రహమే వద్దని పోయాడు. 

🌸అదే రోజున వరదుడనే  మరో భక్తుడు వచ్చాడు.  అతను ఆలయ పరిసరాలను  శుభ్రంగా వుంచుకోవడంలో అమిత   భక్తి శ్రధ్ధలు కలవాడు. 

🌿"ఆలయం శుభ్రంగా వుండడానికి యేం  చేయడానికైనా సిధ్ధం.. అమ్మా! నేను నా నోరు తెరుస్తాను. మీరు  ఉమ్మి వేయ వచ్చును. "  అని వినయంగాళఅన్నాడు. అంబిక అలాగే చేసింది .

🌸అతను తర్వాత కాలంలో ప్రఖ్యాతి గాంచిన కవిశేఖరుడయ్యాడు.
అతని పేరే   కాళమేఘం.

🌿ఈ సంఘటన ప్రాముఖ్యం తెలుసుకొని అమ్మవారికి
తాంబూలం యిచ్చే ఆచారం  ఆచరణలోకి వచ్చింది. 

🌸 శక్తి పీఠాలలో యీ పీఠం జ్ఞాన పీఠంగా ప్రసిధ్ధి చెందినది.  అఖిలాండేశ్వరి , వారాహి దేవి  అంశగా  పూజించబడుతున్నది. 

🌿ఎత్తైన దీపస్ధభంలోని దీపం కదులుతుండగా విరజిమ్మే వెలుగుల కాంతిలో   చిరు నవ్వుతో   అఖిలాండేశ్వరి
అమ్మవారు  దర్శనం అనుగ్రహిస్తుండగా,

🌸 దర్శించే భక్తుల జీవితాలు
ఉజ్వలంగా  ఉన్నతి చెందుతాయి. 
ఈ  అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసంలో శుక్రవారము నాడు  శ్రీవిద్యా పూజలను   వైదీక విధానంలో శాస్త్రోక్తంగా జరుపుతారు

🌿ఆ ఆషాఢ మాసములో అఖిలాండేశ్వరి  విద్యార్ధినిగా  జంబుకేశ్వరుని గురువుగా భావించి బోధలు పొందుతుందని
ఐహీకం.

🌸ఆనాడు విద్యార్ధులు అనేక మంది వచ్చి తమ ఉన్నత విద్యకోసం దేవిని భక్తితో 
ప్రార్ధిస్తారు...స్వస్తి శ్రీమాత్రేనమః...          *ఆధ్యాత్మిక కుటుంబం*                       

No comments:

Post a Comment