*అఖిలాండేశ్వరి ...!!*
🌿తిరువానైక్కావల్ అని పిలవబడే తిరువానై శైవ క్షేత్రం
తిరుచిరాపల్లి నగరానికి సమీపమున వున్నది.
🌸అప్పర్ , తిరుజ్ఞాన సంబంధర్, తాయుమానవర్, ఐయ్యాడిగళ్, సుందరర్, అరుణగిరినాదర్ , మొదలైన శైవ భక్త నాయన్మార్లచే కీర్తించి పాడబడిన ప్రముఖ ఆలయం యిది.
🌿 ఈ శివాలయం పంచభూత శివాలయాలలో ఒకటి అయిన జల లింగేశ్వరుని ఆలయం. దీనినే జంబుకేశ్వరం అనికూడా అంటారు.
🌸అమ్మవారి శక్తి పీఠాలలో
ఒకటి అయినది యీ ఆలయం. అఖిల జగాలను సంరక్షించే అమ్మవారిగా
అనుగ్రహిస్తున్నందున
అఖిలాండేశ్వరి గా కొలవ బడుతున్నది.
🌿ఈ ఆలయంలో అఖిలాండేశ్వరి, గంభీరమైన రూపంతో అనుగ్రహిస్తున్నది.
🌸 తనను శ్రధ్ధతో పూజించ వచ్చిన భక్తులందరికి అష్టమామణి సిధ్ధులను కూడా అనుగ్రహించే అంబికగా కొనియాడబడుతున్నది.
🌿ఈ ఆలయంలోని అఖిలాండేశ్వరి జంబుకేశ్వరుని ఉఛ్ఛికాల
సమయంలో వచ్చి స్వయంగా పూజిస్తుందని ఐహీకం.
🌸మధ్యాహ్న సమయంలో అమ్మవారికి పూజలు చేసే అర్చకుడు,
అమ్మవారు కట్టుకునే చీర,
కిరీటం పూలమాల ధరించి, చేతిలో కమండలంతో , మేళతాళాలతో, శివుని సన్నిధికి వెడతారు.
🌿అక్కడ స్వామికి అభిషేకం చేసి
గోమాతకి పూజ చేసి , అంబాళ్ సన్నిధికి తిరిగి వస్తారు. ఈ పూజను అంబిక యే స్వయంగా జరుపుతున్నట్లు ఆధ్యాత్మిక భావన.
🌸ఈ సమయంలో కోవెలలోని ఆ అర్చకుని భక్తులు అమ్మవారిగానే భావిస్తారు. ఇది యీ ఆలయ విశిష్టత.
🌿ఆషాఢమాసములోనే అంబిక శివుని గురించి కఠోర తపస్సు చేసినట్లు చెపుతారు.
🌸ఈ ఆలయంలో
ఆషాఢమాసములో శుక్రవారమునాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. తెల్లవారుజామున 2 గంటల నుండి మరునాడు రాత్రి 12 గంటల వరకు ఆలయం తెరిచే వుంటుంది.
🌿 అమ్మవారు ప్రాతఃకాలమున లక్ష్మి దేవిగా, ఉఛ్ఛికాలమున పార్వతీ దేవిగా , సాయంకాలము సరస్వతీ దేవిగా దర్శనము అనుగ్రహిస్తున్నది.
🌸పరమేశ్వరుడు యీ ఆలయంలో అంబికకు గురువు గా ఉపదేశం
చేస్తూండగా అంబిక విద్యార్ధినిగా నేర్చుకొంటుంది.
🌿అందువలన విద్యార్థులు అనేక మంది ఆలయానికి
వచ్చి ప్రార్ధనలు చేస్తారు .
ప్రధమంలో అమ్మవారు
ఉగ్ర శక్తి గా వుండేది.
🌸సాధారణంగా అమ్మవారి
ఉగ్ర శక్తిని శాంత పరచడానికి శ్రీ చక్రం ప్రతిష్టిస్తారు. కాని యీ ఆలయానికి వచ్చిన ఆదిశంకరాచార్యులవారు
🌿శ్రీ చక్రానికి బదులుగా ,
శ్రీ చక్ర రూపం లో వుండే రెండు
తాటంకాలను కర్ణాభరణాలుగా అమ్మవారికి అలంకరించారు.
🌸పిదప అంబిక శాంతస్వరూపిణిగా దర్శనమనుగ్రహించినది.
ఉగ్రంగా వున్న అంబికను శాంత పరిచే విధంగా ,
🌿 అంబికకు ఎదురుగా వినాయకుని, వెనుకగా కుమార స్వామిని ఆది శంకరాచార్యుల వారు
ప్రతిష్టించారు.
🌸ఈ ఆలయంలో కళ్యాణోత్సవాలు జరుపరు. పరమశివుని వేడుకుంటూ అంబిక తపమాచరించిన కారణాన పరమశివుడు ప్రత్యక్ష మైనాడు.
🌿కాని వివాహం చేసుకోలేదు.
అందువలన ఇక్కడ స్వామి కి కళ్యాణోత్సవాలు, శయన పూజలు లేవు.
🌸 కవిత్వంలో గొప్ప
ఖ్యాతి సాధించాలని ఆశించిన ఒక పండితుడు అఖిలాండేశ్వరి అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రార్ధించాడు.
🌿ఆ పండితుని పరీక్షించాలని అమ్మవారు ,తాంబూలం సేవిస్తూ , పండితుని వద్దకు వచ్చింది.
🌸" నేను తాంబూలం వేసుకున్నాను ఆలయంలో ఉమ్మి అపరిశుభ్రం చేయకూడదు.
నీ నోరు తెరిస్తే కాస్తా ఉమ్మి వేస్తాను." అన్నది.
🌿 తనంత పండితుని నోట్లో ఉమ్ముతానని అన్నందుకు కోపము వచ్చిన పండితుడు ఆమె అనుగ్రహమే వద్దని పోయాడు.
🌸అదే రోజున వరదుడనే మరో భక్తుడు వచ్చాడు. అతను ఆలయ పరిసరాలను శుభ్రంగా వుంచుకోవడంలో అమిత భక్తి శ్రధ్ధలు కలవాడు.
🌿"ఆలయం శుభ్రంగా వుండడానికి యేం చేయడానికైనా సిధ్ధం.. అమ్మా! నేను నా నోరు తెరుస్తాను. మీరు ఉమ్మి వేయ వచ్చును. " అని వినయంగాళఅన్నాడు. అంబిక అలాగే చేసింది .
🌸అతను తర్వాత కాలంలో ప్రఖ్యాతి గాంచిన కవిశేఖరుడయ్యాడు.
అతని పేరే కాళమేఘం.
🌿ఈ సంఘటన ప్రాముఖ్యం తెలుసుకొని అమ్మవారికి
తాంబూలం యిచ్చే ఆచారం ఆచరణలోకి వచ్చింది.
🌸 శక్తి పీఠాలలో యీ పీఠం జ్ఞాన పీఠంగా ప్రసిధ్ధి చెందినది. అఖిలాండేశ్వరి , వారాహి దేవి అంశగా పూజించబడుతున్నది.
🌿ఎత్తైన దీపస్ధభంలోని దీపం కదులుతుండగా విరజిమ్మే వెలుగుల కాంతిలో చిరు నవ్వుతో అఖిలాండేశ్వరి
అమ్మవారు దర్శనం అనుగ్రహిస్తుండగా,
🌸 దర్శించే భక్తుల జీవితాలు
ఉజ్వలంగా ఉన్నతి చెందుతాయి.
ఈ అఖిలాండేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసంలో శుక్రవారము నాడు శ్రీవిద్యా పూజలను వైదీక విధానంలో శాస్త్రోక్తంగా జరుపుతారు
🌿ఆ ఆషాఢ మాసములో అఖిలాండేశ్వరి విద్యార్ధినిగా జంబుకేశ్వరుని గురువుగా భావించి బోధలు పొందుతుందని
ఐహీకం.
🌸ఆనాడు విద్యార్ధులు అనేక మంది వచ్చి తమ ఉన్నత విద్యకోసం దేవిని భక్తితో
ప్రార్ధిస్తారు...స్వస్తి శ్రీమాత్రేనమః... *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment