🦚జ్ఞానప్రసూనాలు🚩
1) ఇది అంతయు బ్రహ్మమే కనుక జడము కూడ శుద్ధచైతన్యమే.
2) మనస్సే దేహమునకు బీజము.
3) జ్ఞాని సంపర్కము వలన చుట్టూ ఉన్న గాలి, ధూళికణములు సైతం మోక్షమును పొందును.
4) తండ్రి లేకుండా కొడుకు ఉండనట్లే ద్రష్ట లేకుండా దృశ్యము లేదు.
5) కంకణమునకు బంగారమునకు మధ్య తరంగములకు జలమునకు మధ్య విభాగము లేనట్లే ప్రపంచమునకు అనంతచైతన్యమునకు మధ్య భేదము లేదు.
🦚జ్ఞానప్రసూనాలు🚩
1. 'చిత్' యొక్క చమత్కారమే ప్రపంచముగా భాసించుచున్నది.
2. నిరర్థకమైన ఈ తపస్సులలోను, ఇతర క్రియలలోను నీవు నీ జీవితమును ఎందుకు వ్యర్థము చేయుచున్నావు? మహాత్ముల సాంగత్యమునాశ్రయించుట వలనను నీవాత్మజ్ఞానమును పొందెదవు.
3. చిత్తపరిత్యాగమే సర్వపరిత్యాగము.
4. 'నేను' అను సంకల్పమే బంధమును కలిగించును. 'నేను లేను' అను సంకల్పమే మోక్షమును కలిగించును.
5. బ్రహ్మమే ఈ సమస్తముగా ఇక్కడ అభివ్యక్తమయినది. దానికి వేఱుగా ఏదియు లేదు. అందువలన బంధ-మోక్ష భావనలు గూడ పరిత్యజింపవలయును.
No comments:
Post a Comment