Thursday, August 6, 2026

కుండలిని మేలుకుంటే ప్రమాదమా? | Kundalini Activation Process in Telugu | Sanmaarg Thoughts

కుండలిని మేలుకుంటే ప్రమాదమా? | Kundalini Activation Process in Telugu | Sanmaarg Thoughts

Author Name:Sanmaarg Thoughts

Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oGiOiqyvPRc



Transcript:
(00:00) మీ వెన్నుముక అడుగున మూలాధార చక్రంలో ఒక భయంకరమైన శక్తి నిద్రపోతుంది. మన ప్రాచీన ఋషులు దాన్నే కుండలిని అని అన్నారు. వేల సంవత్సరాల క్రితమే వారు దీన్ని కనుగొన్నారు అభ్యాసించారు తర్వాతి తరాలకు అందించారు. ఇదంతా మీరు ఒక కథ అని అనుకుంటున్నారా కానీ సైంటిస్టులు సైతం ఇప్పుడు దీనిని అంగీకరిస్తున్నారు. మన శరీరంలో ఉన్న ఒక శక్తివంతమైన న్యూరల్ నెట్వర్క్ అది.
(00:27) ఒక సూక్ష్మమైన ఎనర్జీ సిస్టం అది. ఒకవేళ ఈ శక్తిని గనుక మీరు తప్పుడు పద్ధతిలో మేలుకొలిపినట్లయితే ఏం జరుగుతుందో తెలుసా అలా మేలుకొన్న వ్యక్తి అకస్మాత్తుగా పిచ్చివాడిలా ప్రవర్తించడం మొదలు పెట్టవచ్చు. శరీరం మొత్తం వణకిపోవడం తీవ్రమైన భయానక కలలు అదుపులేని ఆందోళన రోజులు తరబడి నిద్ర లేకపోవడం లాంటిది జరుగుతాయి.
(00:49) ఇది కేవలం సినిమాల్లో చూసేది కాదు ఇది నిజంగా జరిగే కుండలిని సిండ్రమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ పరిస్థితి బారిన పడ్డారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన రిపోర్ట్లు నార్మల్ గా వచ్చి ఏమి జరుగుతుందో అర్థం కాక సతమతమయ్యారు. కానీ ఇదే శక్తిని సరైన మార్గంలో సరైన టైంలో సరైన గురువు మార్గదర్శకత్వంలో మేలుకొలిపితే మీరు అనుభవించే ఆనందం, జ్ఞానం, శాంతి మీ అనుభవానికి అందనంత అద్భుతంగా ఉంటుంది.
(01:15) ఈ వీడియోలో నేను మీకు నాలుగు విషయాలు చెప్తాను. అసలు కుండలీని అంటే ఏమిటి ఏడు చక్రాల ద్వారా అది ఎలా ప్రయాణిస్తుంది దాన్ని సురక్షితంగా ఎలా మేలుకొలపాలి అండ్ చివరిలో మీరు ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాల్లో చేయగలిగే ఒక చిన్న శ్వాసక్రియను కూడా నేర్పిస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి.
(01:34) ఎందుకంటే చివరిలో నేను చెప్పే ఆ విషయం మీ జీవితాన్ని నిజంగా మార్చవచ్చు. హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ నాని వెల్కమ్ టు సన్మార్గ థాట్స్. చాలామందికి కుండలిని అంటే కేవలం ఒక భ్రమ ఒక మతపరమైన కల్పన అని అనిపిస్తుంది. కానీ అది నిజం కాదు ఇది మన శరీరంలోని అతి పెద్ద శక్తి కేంద్రం. కుండలిని అనే పదం సంస్కృతంలో కుండలా నుంచి వచ్చింది. కుండల అంటే చుట్టబడినది లేదా పాము అని అర్థం.
(02:08) ఎందుకంటే ఈ శక్తి మీ వెన్నుముక అడుగున మూలాధారంలో ఒక నిద్రపోతున్న పాముల మూడు లేదా ఐదు సార్లు చుట్టుకుని ఉంటుంది. మనకు ఏడు చక్రాలు ఉంటాయి. అవి మీ వెన్నుముక వెంబడి ఒక ఎలక్ట్రికల్ గ్రిడ్లా అమరి ఉంటాయి. వీటిని కలిపే మార్గాన్ని సుషుమ్న నాడి అంటారు. ఇది మీ వెన్నుముక లోపల నడిచే ఒక శక్తి ప్రవాహ మార్గం.
(02:31) ప్రతి చక్రం ఒక ప్రత్యేక నాడీ మండలిని ఒక ప్రత్యేక భావోద్వేగ కేంద్రాన్ని నియంత్రిస్తుంది. కుండలిని మేల్కొన్నప్పుడు అది మీ శుషుమ్న నాడి ద్వారా అంటే ఒక వైర్ గుండా కరెంట్ వెళ్ళినట్లు పైకి ప్రయాణిస్తుంది. అది మీ మెదుడు పైన ఉన్న సహస్రారానికి చేరుకున్నప్పుడు ఆ వ్యక్తి అపారమైన జ్ఞానాన్ని అత్యధిక శాంతిని అనుభవిస్తాడు. ఇదే అనుభవాన్ని అనేక మతాలు అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వేరు వేరు పేర్లతో పిలుస్తాయి.
(03:00) అయితే ఈ ప్రయాణంలో ఏడు గేట్లు ఉంటాయి. ఒక్కో గేటు దాటేటప్పుడు మీ శరీరంలో మీ మనసులో ఏం జరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ విషయాన్ని మీకు ఈ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళాక చెప్తాను కాబట్టి మీ అటెన్షన్ ఇక్కడే నిలబెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక నిజమైన కథ చెప్పాలి. ఇదేదో ఒక కల్పిత కథ కాదు. 2019 లో మన ఇండియాలో జరిగిన ఒక యధార్థ గాధ.
(03:23) మన ఇండియాలో ఒక ప్రసిద్ధ యోగ ఆశ్రమంలో ఒక యువకుడు చేరాడు. అతని పేరు రాహుల్ రాహుల్ కి చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక విషయాలలో చాలా ఆసక్తి కలిగి ఉండేవాడు కానీ అతనికి [సంగీతం] సరైన మార్గదర్శకత్వం లేదు అతను ఇంటర్నెట్ లో చాలా వీడియోలు చూశాడు కొన్ని పుస్తకాలు చదివాడు నాకు గురువు అవసరం లేదు నేనే చేసుకుంటానని మొదలు పెట్టాడు. అతను ఒక ప్రముఖ YouTube ఛానల్ లో చూసిన టెక్నిక్ ప్రకారం రోజు మూడు గంటలు అత్యంత తీవ్రమైన ధ్యానాన్ని చేయడం మొదలు పెట్టాడు.
(03:52) అలా కొన్ని వారాలు గడిచిన తర్వాత రాహుల్ శరీరంలో ఏదో ఒక శక్తి ప్రవహిస్తున్నట్లు అతనికి అనిపించడం మొదలైంది. అది గమనించిన రాహుల్ చాలా ఉత్సాహంతో నా కుండలిని మేల్కుంటుంది అని అనుకున్నాడు. కానీ విషయం అలా జరగలేదు. ఒక రోజు రాత్రి రాహుల్ తీవ్రమైన భయానక కలలు కనడం మొదలు పెట్టాడు. అకస్మాత్తుగా హృదయ స్పందన వేగంగా పెరిగింది.
(04:15) శరీరం అదుపు లేకుండా వణుకుతోంది. తనను తాను అదుపు చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన కుటుంబ సభ్యులు ఇదంతా గమనించి అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అతనికి డాక్టర్స్ అన్ని టెస్టులు చేశారు కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే వైద్యపరంగా అతనికి ఏ సమస్య లేదు. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే వచ్చాయి. కానీ అతను రోజుకి 18 గంటల పాటు ఒకే ప్లేస్ లో కూర్చొని వణుకుతూ ఉండేవాడు.
(04:42) చివరికి ఏం చేయలేక అతని తల్లిదండ్రులు ఒక అనుభవజ్ఞుడైన యోగి దగ్గరకు రాహుల్ ని తీసుకెళ్లారు. అప్పుడు ఆ యోగి చెప్పారు. కుండలేని శక్తి ఇతని శరీరంలో మేలుకుంది. ఇతని శరీరం దాన్ని భరించడానికి సిద్ధంగా లేదు అని. తర్వాత రాహుల్ కి కోలుకోవడానికి కొన్ని నెలల చికిత్స అవసరమైంది. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? ఎందుకంటే అతను సరైన పద్ధతిని పాటించలేదు.
(05:06) తన శరీరాన్ని సిద్ధం చేసుకోలేదు. అనుభవజ్ఞుడైన గురువు సలహా కూడా తీసుకోలేదు. కాబట్టి అన్నింటికన్నా ముందు సరైన గురువు సలహా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ ఏడు చక్రాలను వివరంగా చూద్దాం. మొదటి చక్రం మూలాధారం ఇది మీ వెన్నుముక అడుగున ఉంటుంది. ఇది మీ మనుగడకు మీ భద్రతకు భౌతిక అవసరాలకు సంబంధించినది. ఈ చక్రం బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు మీరు సిద్ధంగా ఉంటారు.
(05:31) అనగదొక్కబడినప్పుడు భయంతో బాధపడతారు. రెండవ చక్రం స్వాధిష్టానం. ఇది మీ కింద వెన్నుముక్కలో ఉంటుంది. ఇది మీ సృజనాత్మకత భావోద్వేగాలకు సంబంధించినది. మూడవ చక్రం మణిపూరకం. ఇది మీ బొడ్డు ప్రాంతంలో ఉంటుంది. ఇది మీ ఆత్మవిశ్వాసం శక్తికి సంబంధించినది. నాలుగవ చక్రం అనాహతం ఇది మీ హృదయంలో ఉంటుంది. ప్రేమ కరుణ సంబంధాలకు సంబంధించినది.
(05:58) ఐదవ చక్రం విశుద్ధం ఇది మీ గొంతులో ఉంటుంది. కమ్యూనికేషన్స్ సత్యం వ్యక్తీకరణకు సంబంధించినది. ఆరవ చక్రం ఆజ్ఞ ఈ చక్రం రెండు కళ్ళ మధ్యలో ఉంటుంది. అంతర్ దృష్టి జ్ఞానానికి సంబంధించినది ఏడవ చక్రం సహస్రారం ఇది మీ మెదడు పైన ఉంటుంది. ఇది దైవత్వానికి పూర్తి శాంతికి సంబంధించినది. మీరు కుండలిని మేలుకొలిపే టైంలో ప్రతి చక్రాన్ని దాటేటప్పుడు ఆ చక్రం యొక్క శక్తి మీకు అనుభూతి అవుతుంది.
(06:26) మీరు మూలాధారాన్ని దాటేటప్పుడు మీకు అకస్మాత్తుగా భయం కలుగుతుంది. నేను సురక్షితంగా ఉన్నానా అని మీ మనసు ప్రశ్నిస్తుంది. స్వాధిష్టానాన్ని దాటేటప్పుడు అనవసరమైన కోరికలు తీవ్ర భావోద్వేగాలు కలుగుతాయి. మణిపూరకాన్ని దాటేటప్పుడు కోపం అహం కలుగుతాయి. అనాహతాన్ని దాటేటప్పుడు మీరు చాలా సున్నితంగా మారుతారు.
(06:47) చిన్న చిన్న విషయాలు కూడా కళ్ళు చెమర్చడం హృదయంలో బరువుగా అనిపించడం జరుగుతుంది. విశుద్ధాన్ని దాటేటప్పుడు గొంతులో నొప్పి కమ్యూనికేషన్ లో ఇబ్బంది కలుగుతాయి. ఆజ్ఞను దాటేటప్పుడు తలనొప్పి, కళ్ళ ముందు వెలుగులు అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. చివరికి సహస్రారాన్ని దాటేటప్పుడు మీరు పూర్తి శాంతి ఆనందాన్ని అనుభవిస్తారు కానీ ఇక్కడే అసలు ప్రమాదం ఉంది.
(07:09) శరీరం సిద్ధంగా లేకపోతే ఈ లక్షణాలన్నీ ఒకేసారి చాలా భయానకంగా రావచ్చు అందుకే దీనికి సరైన గురువు దగ్గర శిక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు కొండలేని మేలుకొలిపే తప్పుడు పద్ధతుల గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈ ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి. మొదటిది అత్యంత తీవ్రమైన ధ్యానం. చాలామంది ఏం చేస్తారంటే ప్రారంభం రోజు నుంచే నాలుగు లేదా ఐదు గంటలు ధ్యానం చేయడం మొదలు పెడతారు.
(07:36) ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే మీ శరీరం ఇంతటి శక్తిని భరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి తక్కువ సమయం నుంచే ప్రారంభించండి. రెండవది కుండలిని శక్తిని బలవంతంగా పైకి లాగే పద్ధతులు. అంటే శ్వాసను అదుపు చేసుకుని శక్తిని బలవంతంగా నెట్టడం లాంటివి చేయకండి. మూడవది మందులు లేదా మాదక ద్రవ్యాలు వాడి కుండలిని మేలుకొలపాలని ప్రయత్నించడం లాంటివి చేయకండి.
(07:58) కొన్ని చోట్ల కొన్ని మందులు కొండలిని మేలుకొలుపుతాయని అంటారు కానీ అది పూర్తిగా తప్పు అవన్నీ మీ మనసును మాత్రమే ప్రభావితం చేస్తాయి. నిజమైన కుండలిని కాదు. నాలుగవది అనుభవం లేని వ్యక్తి నుంచి శిక్షణ తీసుకోవడం అంటే తమను తాము కుండలిని మాస్టర్ అని చెప్పుకునే వారి దగ్గర శిక్షణ తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇలాంటి వాటి నుంచి చాలా దూరంగా ఉండండి.
(08:20) ఇప్పుడు ఈ కుండలిని మేలుకొలపడానికి సరైన పద్ధతి ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి. కుండలిని సురక్షితంగా మేలుకొలపడానికి మీరు ముందుగా మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. మొదటిది ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరించాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. రోజు వ్యాయామం మరియు యోగా ఆసనాలు చేయాలి. ఈ ఆసనాలు మీ వెన్నుముకను సున్నితంగా చేసి నాడీ వ్యవస్థను బలపరుస్తాయి.
(08:42) రెండవది ధ్యానం మరియు ప్రాణాయామం చేయాలి. ఇవి మీ మనసుని ప్రశాంతంగా చేసి మీ శరీరాన్ని శక్తిని భరించడానికి సిద్ధం చేస్తాయి. మూడవది ఒక అనుభవజ్ఞుడైన గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి. గురువు మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకొని మీకు అనుగుణంగా శిక్షణ ఇస్తారు. గురువు లేకుండా ఒంటరిగా ఈ ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరం. నాలుగవది ఓపికగా ఉండాలి.
(09:05) కుండలిీని అనేది ఒక రాత్రిలో జరిగే విషయం కాదు. ఇది సంవత్సరాల శ్రమ, అభ్యాసం, ఓపిక చాలా అవసరమయ్యే విషయం. ఈ కుండలీని యోగాలో కేవలం ధ్యానం మాత్రమే కాదు. ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, బంధాలు, మంత్రాలు, ధ్యానం అన్ని కలిపి మీ శరీరాన్ని మీ మనసుని మీ ఆత్మను ఏకకాలంలో సిద్ధం చేస్తాయి. ఈ ప్రక్రియ నెమ్మదిగా క్రమంగా జరగాలి. అస్సలు తొందర పడకూడదు.
(09:33) కుండలిని అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదు. ఆధునిక న్యూరో సైన్స్ కూడా దీన్ని బలపరుస్తుంది. కొన్ని అధ్యయనాలు చూపించాయి. ధ్యానం చేసే వ్యక్తుల మెదడులో నిర్దిష్ట మార్పులు జరుగుతాయి. వారి మెదడులో గామా తరంగాలు పెరుగుతాయి. సుషుమ్న నాడి ప్రాంతంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. నాడి వ్యవస్థలో శక్తి ప్రవాహం పెరుగుతుంది అని మేరీలాండ్ విశ్వవిద్యాలయంలో ఒక అధ్యయనం జరిగింది.
(09:55) 50 మంది వ్యక్తులను తీసుకొని వారిలో 25 మంది రోజు 60 నిమిషాలు ధ్యానం చేశారు. మిగతా 25 మంది ఏమీ చేయలేదు. ఎనిమిది వారాల తర్వాత ధ్యానం చేసిన వారిలో గణనీయమైన మార్పులు గమనించబడ్డాయి. మెదల్లో ఒత్తిడికి సంబంధించిన భాగాలు ప్రశాంతపడ్డాయి. జ్ఞాపక శక్తికి సంబంధించిన హిప్పోకాంపస్ ప్రాంతం బలపడింది.
(10:17) ఇదంతా కుండలేని అభ్యాసం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధారం. ఇందులో కనిపించే లక్షణాలు చాలా విస్తృతంగా ఉంటాయి. శరీరం వణుకుతుంది. తలనొప్పి, ముఖం ఎరుపెక్కడం, చెమట పట్టడం, హృదయ స్పందన వేగంగా పెరగడం, మానసిక లక్షణాలు ఆందోళన, భయం, నిరాశ, అకస్మాత్తుగా ఏడవడం, నిద్రలేమి, భావోద్వేగ లక్షణాలు, కోపం, అహం, అసూయ, ఆధ్యాత్మిక లక్షణాలు, అకస్మాత్తుగా ఆధ్యాత్మిక అనుభవాలు, అద్భుతమైన దృశ్యాలు ఆత్మ నుంచి వేరుపడినట్లుగా అనిపించడం ఈ లక్షణాలన్నీ కూడా ఒకేసారి కనిపించవచ్చు.
(10:51) అలాగే కొన్నిసార్లు నెలల తరబడి సంవత్సరాల తరబడి కూడా ఇవి కొనసాగవచ్చు. అయితే ఇలా గనుక వస్తే ఎవరు భయపడవద్దు. కుండలిని సిండ్రోమ్ నుంచి కోలుకోవడం పూర్తిగా సాధ్యమే. ఒకవేళ ఇలాంటి సిండ్రోమ్స్ అన్ని మీలో ఉంటే ముందుగా మీరు కుండలిని మేలుకొలిపే అన్ని ప్రయత్నాలు వెంటనే ఆపేయాలి. రెండవది ఒక అనుభవజ్ఞుడైన గురువును కలుసుకోవాలి. గురువు మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకొని సరైన చికిత్సను అందిస్తారు.
(11:15) మూడవది సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ మసాలా ఆహారాన్ని మానేయాలి. నాలుగవది తేలికపాటి వ్యాయామాన్ని చేయాలి. తీవ్రమైన వ్యాయామం అస్సలు చేయకూడదు. ఐదవది ప్రకృతిలో సమయాన్ని గడపాలి అంటే పార్కుల్లో ఏదైనా కొండల మీద లేదా నదుల దగ్గర సమయాన్ని గడుపుతూ ఉండాలి. ఆరవది రోజుకిఏడు నుంచిఎనిమిది గంటలు నిద్రపోవాలి.
(11:39) ఈ విధంగా ఓపికగా క్రమంగా అనుసరిస్తే ఈ కుండలేని సిండ్రోమ్ నుంచి పూర్తిగా కోలుకోవచ్చు. అయితే సరైన గురువు శిక్షణలో కుండలిని మేలుకొన్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను జాగ్రత్తగా వినండి. అతనికి అపారమైన శాంతి కలుగుతుంది. అతను ప్రపంచాన్ని పూర్తిగా వేరే కోణంలో చూడడం ప్రారంభిస్తాడు. అతని కళ్ళల్లో ఒక వింత తేజస్సు కనిపిస్తుంది.
(12:01) అతని చుట్టూ ఉన్నవారు కూడా ఏదో తెలియని ప్రశాంతతను అనుభవిస్తారు. మాటలు లేకుండానే అతని సమక్షంలో ఉన్నంతసేపు మీకు ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. అతని ప్రతి మాటకు ఒక బరువు ఉంటుంది. ఎందుకంటే అతను మాట్లాడేది అహంకారం నుంచి కాదు అంతర్ మౌనం నుంచి. అతను ఏ పనిని ప్రారంభించినా తొందరపడడు. కానీ ఒక్కసారి సంకల్పిస్తే చివరి వరకు నిలబడి దానిని పూర్తి చేసే అచంచలమైన స్థిరత్వం అతని బలం అవుతుంది.
(12:27) యోగా సాంప్రదాయం ప్రకారం అలాంటి వ్యక్తి సమక్షంలో చాలా మందికి ధైర్యం కలుగుతుంది. అతని ప్రశాంతతే చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తిగా మారుతుంది. అతనికి అపారమైన ప్రేమ సృజనాత్మకత కలుగుతుంది. కానీ గుర్తుంచుకోండి ఇదంతా సరైన పద్ధతిలో సరైన టైంలో సరైన గురువు దగ్గర మాత్రమే జరుగుతుందని యోగా సాంప్రదాయాలు కూడా చెబుతున్నాయి.
(12:50) కుండలిని అనేది మీ శరీరంలో నిద్రపోతున్న శక్తి దీన్ని సురక్షితంగా మేల్కొలపాలంటే శ్రమ అభ్యాసం ఓపిక చాలా అవసరం. తప్పుడు పద్ధతిలో దీన్ని మేలుకొల్లిపే ప్రయత్నాన్ని అస్సలు చేయకండి. ఇంటర్నెట్ లో వీడియోలు చూసి ఒంటరిగా తీవ్రమైన ధ్యానంతో ప్రయత్నించడం చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి సరైన గురువు సరైన పద్ధతి సరైన ఓపిక. ఇవే మీ నిజమైన మార్గం.
(13:15) ఇప్పుడు మీకు ముందుగా చెప్పిన ఒక చిన్న శ్వాసక్రియను చెప్తాను. దీన్ని ప్రతిరోజు కేవలం ఐదు నిమిషాల పాటు చేయవచ్చు కాబట్టి ప్రతిరోజు ట్రై చేయండి. ముందుగా ప్రశాంతమైన స్థలంలో కూర్చోండి. మీ వెన్నుముఖను నిటారుగా ఉంచండి. మీ భుజాలు రిలాక్స్ గా ఉంచండి. మీ కళ్ళు మెల్లగా మూసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా సహజంగా శ్వాస తీసుకోండి. ఆ శ్వాసను బలవంతంగా అదుపు చేయకండి.
(13:39) కేవలం గమనించండి చాలు. మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ దృష్టిని మూలాధారం దగ్గర ఉంచండి. అంటే మీ వెన్నుముక అడుగున శ్వాస వదులుతున్నప్పుడు ఆ దృష్టిని కొంచెం పైకి కదిలించండి. ఇలా నెమ్మదిగా ఒక్కో శ్వాసతో మీ దృష్టిని మూలాధారం నుంచి సహస్రారం వరకు అంటే వెన్నుముక అడుగు నుంచి మెదడు పై వరకు మెల్లగా కదిలించండి. అసలు తొందరపడకండి. బలవంతంగా అసలు చేయకండి.
(14:03) కేవలం గమనిస్తూ ఉండండి అంతే. ఇలా ఐదు నిమిషాలు పూర్తయ్యాక నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి. ఈ చిన్న అభ్యాసం మీ శరీరాన్ని మీ మనసుని క్రమంగా సిద్ధం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఈ కుండలిని పూర్తిగా మేల్కొలపాలంటే ముందుగా సరైన గురువు యొక్క మార్గదర్శకత్వం తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.
(14:26) మరి మీరు ఇప్పటికే ధ్యానం చేసేవారైతే గురువు ద్వారా శిక్షణ పొంది చేస్తున్నారా లేక YouTube లో వీడియోలు చూసి ఫాలో అవుతున్నారా? అలాగే మీరు ధ్యానం మొదలు పెట్టాలని అనుకుంటూ మొదలు పెట్టలేకపోతున్నారా? మీ స్థితిని తప్పకుండా ఇప్పుడే కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ కి నేను పర్సనల్ గా రిప్లై ఇస్తాను. మీకు ఉపయోగపడే ఒక చిన్న టిప్ కూడా చెప్తాను.
(14:45) ఈ వీడియోకి మీరు ఇప్పటివరకు ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి తప్పకుండా కామెంట్ మాత్రం చేయండి. అలాగే మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో తదుపరి అడుగు కోసం ఈ ఏడు చక్రాల గురించి పూర్తి ప్రాణాయామ ధ్యాన విధానాల గురించి లోతుగా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.
(15:04) నెక్స్ట్ వీడియోలో మళ్లీ కలుద్దాం.

No comments:

Post a Comment