The True Avadhuta: Chivata Amma | The Miracle on the Day She Left Her Body | Allu Bhaskar Reddy
Author Name:Sree Sannidhi TV
Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VE-ayBbcYaQ
Transcript:
(00:02) [సంగీతం] హే మాతా హే ఆచార్యవరియా అధరణి చుంబిత అమృతవర్షిణి మాతృసుేవన హిత గురు రూపిణి సకలం సర్వం విషదం వ్యాప్తం
(00:48) సద్గురు రూపి మాతృస్వరూపి జగద్ధాత్రిశ్వరి శాంకరి మనో హరి సకల జీవ మాతృమూర్తి సద్గురు స్వరూపిణి వాత్సల్యామృత రసచరి ప్రశిక్షణ శుభంకరి మాతా శివసాయి రూప శ్రేయశుభదాయిని [పాడటం] అమ్మతనమున ఎంత కమ్మదనమున్నదో అమృతానికే అది తీపి నేర్పిందిలే అమ్మ గురించి
(01:33) ఎంత చెప్పుకున్నా తక్కువే చెప్పుకోవాల్సింది ఎప్పటికీ మిగిలే ఉంటది. మన ప్రాచీన ఋషి ధర్మంలో పరమాత్ముడైన తండ్రి పితృదేవుడు కనిపించడు మాతృదేవి మాత్రమే కనిపిస్తుంది. కనిపించే సకల సృష్టి కూడా మనకు అమ్మ రూపం అని మన భావం అందుకే పార్వతి పర్వతరాజ పుత్రి అంటే మన ఎదురుగా కనిపించే జగద్రూపము అని ఏది ఏవైనా ఒక అద్భుతమైన ఆవిష్కారం చేసిన మహాత్ములందరికీ నమస్కారం పెట్టుకొని ఈరోజు
(02:20) మహాత్ములలోనే తలమానికంగా చెప్పుకోదగిన అమ్మ శివటం అమ్మగారి గురించి చెప్పుకుందాం. ఒక విశేషం ఏందంటే మన దేశంలో అతి సామాన్యంగా జీవించే జీవన విధానంలో నుంచి కూడా ఒక అద్భుతమైన మహనీయ మూర్తులు ఉద్భవించడం అక్కడక్కడ మనకి తెలుస్తుంటుంది. ఈరోజు మనం అటువంటి ఒక మాతృమూర్తి గురించి అమ్మ గురించి చెప్పుకుందాం. 1973వ సంవత్సరంలో మాస్టర్ గారు సెప్టెంబర్ నెలలో ఏలూరు దగ్గర స్పాట్ వాల్యేషన్ కి వెళ్ళారు ఆయన అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక విషయం
(03:05) చెప్పారు. ఆయన ఏం చేశారంటే అక్కడ చివటం అనే ఒక ఊరు ఉంది తనుకు దగ్గర అక్కడ ఒక అమ్మగారు ఉన్నారు ఆమెను చూడటానికి వెళ్ళాను ఒక ఆదివారం రోజు తీరిక సమయంలో ఇద్దరు మిత్రులతో కలిసి వెళ్ళాను తనుకు నుంచి అక్కడికి చివటని చేరేటప్పటికి ఊరి పొలిమేరల్లోనే అమ్మగారు ఎదురయ్యారు అని ఒక అద్భుతమైన విషయం చెప్పారు అసలు జరిగింది ఏమిటంటే సాధారణంగా చివటం అమ్మగారు చివటంలో ఎక్కడైనా తిరుగుతారు.
(03:40) కానీ ఆ రోజు ఆమె ఊరికి ఇవతలగా ఎవరైనా వచ్చేప్పుడు ఎదురుగా స్వాగతం పలకడానికి వచ్చినట్టు వచ్చారు. ఇంత అమ్మ గురించి మనకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కదా చివటం అనేది తనుకు దగ్గర ఉండే ఒక చిన్న పల్లె సాధారణమైన పల్లె అక్కడ పోయిన శతాబ్దం మధ్యలోంచి ఒక అద్భుతమైన మానవ మూర్తి ఉండేది ఆ ఊరు కూడా నిజంగా మనుషులందరూ స్మరణీయులే ఎలా అంటే అమ్మ ఒక సామాన్య కుటుంబీకుడు ఆమెకు భర్త బిడ్డ ఉన్నారు సంసారి అందులోంచి ఆమె అనన్యంగా శ్రద్ధగా స్మరణ
(04:28) తపస్సు చేస్తూ ఉండేవారు. వాళ్లక ఒక అంగడి ఉండేది. ఆ అంగడిలోంచి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దానవ ధర్మం చేసేది. వాళ్ళ భర్త గారు అది ఇష్టపడేవారు కాదు. ఆయనకు తెలియకుండా అరటి గల మధ్యలో ఉండే కొన్ని కాయలు తుంచేసి ఇచ్చేసేది ఆవిడ. ఎందుకంటే మిగతావి గన అయితే ఆయన వచ్చి ఎక్కడ ఎందుకు ఇచ్చావు అని తవ్వు పెట్టుకుంటారు. అటువంటి దయామయ్య ఆమె ఎన్నో కష్టాల తర్వాత మెల్లగా ఆ భర్త వెళ్ళిపోయారు తర్వాత ఆమెకి స్వతంత్రంగా జీవించే అవకాశం వచ్చినప్పుడు సాధురాం బాబాజీ గారు అనే మహానుభావుడు ఆమెకి గురుతుల్యుడు
(05:13) ఆయన ఏం చేశారంటే ఒకరోజు ఎందుకే ఆ చీరతో అంత ఇబ్బంది పెడతావు అన్నారట అనే అప్పటికీ అంతే ఆ చీర తీసి పడేసింది. ఆ తర్వాత ఇంకా ఏ గుడ్డ కట్టుకొనేలే దిగంబరంగా ఉండటం అనే ఒక సాధన స్ఫూర్తికి గుర్తుగా నిలిచిపోయారు అమ్మ దిగంబరము అంటే ఈ సమస్తము భగవద్రూపంగా భరించి తరించి దాన్ని తలుచుకొని అలా అయిపోవటం దిగంబరత్వాన్ని వహించిన సాధు సత్పురుషులలో అరుదైన వారు ఆ చివటంలో నివసించిన అమ్మ ఆమె అంతే అక్కడి నుంచి అలాగే చిన్న బిడ్డలాగా ఉండేది. అక్కడే
(05:58) అట్లాగే భిక్షక వెళ్ళేవారు కరతల భిక్ష తరుతల వాసన లాగా రామాలయంలో ఉండేవారు ఒక విచిత్రం ఏందంటే అవతల వాళ్ళ అంతరంగం అంతా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆమెకి అక్కడ ఉంటారో ఆమెతో ఎవరో కొంతమంది ఉండేవారు ఒకరిద్దరు ఆమె అక్కడ కూర్చున్న ఆమె ఆ వాడి కళ్ళు మంచివి కావు మాయ నన్ను కమ్ముతోంది అదిగో అది నా కప్పు అంటే వెంటనే ఒక రగ్గు తెచ్చి ఎవరు నాకు కప్పుతారు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో నమస్కారం పెట్టి వెళ్ళిపోగానే అమ్మ మళ్ళీ తీసేసి పసిబిడ్డలాగా ఉంటారు.
(06:35) ఆ విషయం ఏదో చెప్పగానే మాస్టర్ గారు ఏం చేశారు ఒకసారి చూద్దాం అని స్నేహితులతో కలిసి వెళ్ళారు. అప్పుడేమీ టెలిఫోన్లు వర్తమానం చెప్పడం ఏమీ లేదు భగవంతుడే వర్తమానం వాళ్ళు వెళ్ళగానే నడిచి వెళ్ళారు తనుకు నుంచి అక్కడ అమ్మ ఎదురొచ్చారు ఈమె అన్నారు ఆమె ఏం చేశారు ఆమె కూర్చున్నారు. మాస్టర్ గారు అక్కడ దగ్గరికి వెళ్ళగానే ఊహించని రీతిలో ఆమె మాస్టర్ గారి పాదాలకు నమస్కారం పెట్టారు.
(07:07) ఆశ్చర్యపోయారు ఆయన. అప్పుడు మాస్టర్ గారు ఆమె లేవగానే చేతికి పూలు పండ్లు ఇచ్చి ప్రతి నమస్కారం చేశారు. అప్పుడు అమ్మని అడిగారు అమ్మ మీరు ఎవరికీ నమస్కారం పెట్టరు కదా భరద్వాజ మాస్టర్ గారికి ఎందుకు పెట్టారు అని సాయిబాబా అనుకున్నానే అన్నదట ఆమె గోదావరి జిల్లాల పల్లె భాష మాట్లాడతారు. సాయిబాబా అనుకున్నానే అన్నదట. శ్వాసగా శ్వాసకు ఆధారమైన ప్రాణ చలనంగా దానికి ఆధారమైనటువంటి రీతిలో తన గురువును అంతగా స్మరించిన మాస్టారి హృదయము బుద్ధి సమస్తము ఆమెకు సాయి స్వరూపంగా తోచింది
(07:53) అన్నమాట ఎంత గొప్ప పని సరే అంటే అక్కడ అమ్మ అలా ఎందుకు చేసి ఉంటారు సార్ అని సార్ ని అడిగితే అందరిలోనూ పరమాత్మను దర్శించే అవధూతలు ఎందుకు అలా చేస్తారో చెప్పడం కష్టం ఇందులో మన గొప్పతనం ఏమి లేదు వారి ఔన్నత్యమే అందులోనూ ఉంటది అని మాస్టర్ గారు సమాధానంగా చెప్పారు. కానీ అది ఆ ఊర్లోనూ అక్కడ ఆమె చుట్టూ ఉండేవాళ్ళు చాలా విశేషంగా చెప్పుకున్నారు.
(08:27) ఆమె ఎప్పుడూ మాస్టర్ గారిని చిన్నబాబు భరద్వాజ బాబు అనేవారు ఇంకొకసారి 1980 లో నవంబర్లో రెండోసారి మాస్టర్ గారు శివటం వెళ్ళారు. మాస్టర్ గారు వస్తున్నారని తెలిసి కొంచెం ముందుగా వర్తమానం అంది అమ్మ తానుండే రామాలయానికి ఆ కుటీరానికి అన్నిటికీ సున్నం వేసి బిడ్డ వస్తుంటే తల్లి ఎలా చూస్తుందో ఆ విధంగా ఏర్పాట్లు చేయించారు.
(08:56) స్నానానికి వేడినీళ్లుు కాయించి పిండి వంటలతో భోజనం సిద్ధం చేశారు. మాస్టర్ గారు రాగానే ఆయనకు ఒక తల్లి తన బిడ్డకి ఎలా తినిపిస్తుందో అట్లా భోజనం పెట్టారు. ఆ మరురోజు మాస్టర్ గారు అమ్మగారికి సోడసోపచార పూజ చేశారు. అమ్మ అంగీకరించారు. ఆ తర్వాత అమ్మ సాన్నిధ్యంలోనే మాస్టర్ గారు సత్సంగం చేశారు. మూడవ రోజు తనుకులో మాస్టర్ గారి సత్సంగం ఉంటే అమ్మ తన భక్తులందరినీ వెళ్ళండి [గొంతు సవరించుకోవడం] బాబు చెప్పే సత్సంగం వినండి అని పంపారు.
(09:33) అప్పటినుంచి ఎప్పుడు అవకాశం ఉన్నా మాస్టారు అక్కడికి వెళ్ళేవారు చివటం వెళ్ళేవారు తనకు దగ్గర వచ్చిన ప్రతివారిని సందర్భం ఉన్నప్పుడు అమ్మను చూడమని ప్రోత్సహించేవారు అంతేకాకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె చుట్టూ ఉండే వాళ్ళకి ఒక మాట చెప్పేవారు ఆయన అమ్మ గురించిన ప్రతి విషయము రాసి పెట్టండి. అవి ఎంతో అమృతోపమానమైనవి అని ప్రోత్సహించేవారు.
(09:59) అమ్మ మాటల్లో సాయిబాబాను పెదబాబు అని మాస్టర్ గారిని చిన్నబాబు అని చెప్తూ ఉండేవారు. సాయి లీలామృతం ప్రచురణ అయిన తర్వాత ప్రతిరోజు చివటం అమ్మగారు భగవద్గీత పారాయణ ఎలా చేస్తారో అంత శ్రద్ధగా మాస్టర్ రాసిన సాయిలీలామృత పారాయణ కూడా చేయించేవారు ఒక అదృష్టం గురించి చెప్పనా అట్లా ఒకరోజు మనం వెళ్ళినప్పుడు అమ్మగారు తాము సాధన చేసే చోట కూర్చొని మన చేత భగవద్గీత రెండవది మాస్టర్ గారి సాయిలీలామృతంలో తొమ్మిదవ అధ్యాయం చదివించుకొని విన్నారు.
(10:36) ఆ ధన్యత మనది తర్వాత మార్చి 12 1981 లో విద్యానగర్లో మాస్టర్ గారి నేతృత్వంలో వచ్చిన మందిరానికి కుంభాభిషేకం జరిగింది. దానికి అమ్మవారు 116 రూపాయలు అక్కడికి ఆశీర్వాదంతో పంపించడమే కాక విద్యానగర్లో ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూర్చుని అక్కడ ఉండే భక్తులకు ఆ విషయాలన్నీ వివరించి చెప్పారు. నిజంగా ఇక్కడ ఏం జరుగుతుందో అదే విషయం అక్కడ వాళ్ళకి తెలియటం విశేషం సరిగ్గా కుంభాభిషేకం జరిగేటప్పుడు సాయి పటానికి అక్కడ పూజ చేయించారు.
(11:17) మాస్టర్ గారు విద్యానగర సాయిబాబా మందిర ప్రారంభోత్సవం అప్పుడు రెండు పుస్తకాలను రిలీజ్ చేయించారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అందులో ఒకటి సద్గురు దర్శనం అది చదువుతున్నారు అక్కడ చుట్టూ ఉండే భక్తుల అమ్మ కోసం అబ్బా అంటూ దాన్ని చదువుతూ బాబు ఎంత తిరిగాడే ఎంత కష్టపడ్డాడే ఎన్ని విషయాలు సేకరించారే అంటూ ఎంతో మెచ్చుకోలుగా ఆ చదివింది వింటూన్నారమ్మ ఆమె ఏం చేసినా సంపూర్ణంగా క్షుణణంగా చేస్తారు.
(11:51) మన ఇళ్లలో ఉండే మన గుండెకు దగ్గరగా ఉండే అమ్మలాగా ప్రవర్తిస్తారు అన్నమాట. అందులో చోట అమ్మగారి వ్యాసం కూడా ఒకటి ఉంది. ఆ వ్యాసం చదువుతుంటే వెంటనే ఆమెకు దగ్గరగా ఉండే ఆమె అందరినీ ప్రేమగా పిలుస్తారు మర్యాదగా కాకుండా మర్యాద కంటే మించిన ప్రేమగా ఉంటారు. చదువుతుండేప్పుడు ఒసే ఎర్రమంగి ఇవన్నీ నువ్వు మోసావటే అన్నది అంటే ఆవిడ ఎవరో చెప్పారని ఆ సన్నిహితమైన ఆ భక్తురాలితో అన్నారు.
(12:20) బాబు చాలా కష్టపడ్డారు. ఒక్కోసారి ఆమె అట్లా చూస్తా మన సుధీంద్రబాబు భరద్వాజ బాబు ఒక్కటేనమ్మా అన్నారు ఇంతకీ సుధీంద్ర బాబు గారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు సుధీంద్రబాబు గారు అమ్మ ఉండే చివటానికి పక్కనే ఉండే ఉడ్రాజవరం అనే ఊర్లో వెలసిన మహానుభావుడు ఆయనను మాస్టర్ గారు గుర్తించి గౌరవించి అనేకమందిని ఆయన దగ్గర పంపేవారు.
(12:50) ఆయన ఒక ప్రత్యేకమైన మనవోత్తముడు ఆయన చివటమ గారిని తల్లిలాగా భావించేవారు. ఒక విశేషం ఏందంటే చివటం అమ్మవారికి ఆయన రాసినటువంటి కొన్ని ఉత్తరాల ప్రతులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఇంటర్నెట్ లో పెడతాం అమ్మ నీ బిడ్డ సుధి అని రాసేవారు ఆయన సరే ఏదైనా మాట వచ్చినప్పుడు అమ్మ దానికి భర్రాజు మాస్టర్ అది పెట్టారు ఇది ఖర్చు ఖర్చుక ఇచ్చారు అంటే ఆ బాబుకి ఎంత జీతం వచ్చినా ప్రతి పైసా పెట్టు పెట్టు అని ఊరుకులు పరుగులేనే అనేవారు మాస్టర్ గారి యొక్క దాతృత్వాన్ని ఎంతగానో మెచ్చుకునేవారు అమ్మ అమ్మగారు జూన్ 8 1981
(13:35) సోమవారం రోజు రాత్రి 12:05 నిమిషాలకు మహాసమాధి చెందారు. వారం తర్వాత మాస్టర్ గారు అక్కడికి చేరుకొని సమాధిపై ఫోటో ఉంచి పూజించారు. అక్కడున్న వారందరికీ ఆ సందర్భంలో గొప్ప అనుభూతి కలిగిందిట. మాస్టర్ గారు 18వ తేదీ అమ్మ సమాధి మందిరానికి శంకు స్థాపన చేశారు సత్సంగం కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా ఒక మాట అన్నారు మాస్టర్ అమ్మ ఇదివరకు తమకు మనందరికీ ఇచ్చేతో ప్రసాదం పెట్టేవారు ఇప్పుడు అమ్మ ఒడినిండా ప్రసాదమే పెట్టుకొని కూర్చున్నారు.
(14:14) ఎవరం ఎంత కావాలంటే అమ్మ ఒడిలోంచి తీసుకోవచ్చు అని గొప్ప భావంతో చెప్పారు ఆయన. మాస్టర్ గారు ఎప్పుడు ఏమనేవారంటే అవధూత మూర్తి అయిన అమ్మ దేహంతో ఉన్నప్పుడు పరిమితంగా ఉన్నారు ఇప్పుడు అపరిమితంగా సర్వదా సర్వాత్మనా ఉన్నారు అనే మాట పదే పదే చెప్పేవారు ఒక విశేషం ఏందంటే మాస్టర్ గారు ప్రతి వారికి వాళ్ళదైన రీతిలో వాళ్ళ సంస్కారాలకు తగి వచ్చేటట్టు ఇటువంటి మహాత్ముల గురించి చెప్పేవారు.
(14:46) సోదరులారా ప్రపంచాన్ని మన చుట్టూ ఉండే మహనీయులను అందులో ఉండే అనేక గొప్ప విషయాలని తెలుసుకోవడంలో గొప్ప ఆనందం ఉంది. జ్ఞానం అనేది జ్ఞానం నరాణ మధికో విశేషః జ్ఞానేన హీనః పశుహిసమానః అన్నది ఆర్క్ ఒక సందర్భంలో ఎప్పుడైనా హైదరాబాద్ వెళితే అవకాశం ఉన్నప్పుడు ఒక ఆదివారం రోజు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఎందుకంటే ఆ రోజుల్లో పుస్తకాలు కొనడం అనేది బాగా ఎక్కువ ఖరీదుగా ఉండేది మన పరిస్థితికి అందుకని ఆదివారం రోజు పోతే అబిట్స్ ప్రాంతంలో చాలా పాత పుస్తకాలు దొరికేవి తక్కువ రేటుకి వచ్చేవి అందుకని మనం వెళ్ళినప్పుడు మంచి మంచి పుస్తకాలు చాలా కొనుక్కొచ్చుకునే
(15:30) చదువుకునేవాళ్ళం అట్లా ఒకసారి ఒక పాత పుస్తకాల షాప్ లో ఫ్రాయిడ్ అనే మనస్తత్వ శాస్త్ర పితామహుడు రాసిన ది సైకో ఎనాలసిస్ అనే ఒక బుక్ మనకు దొరికింది. అది తీసుకురావడం వెంటనే చదవడం జరిగింది. ఆ ఫ్రాయిడ్ మహాశయుడు ఏం చేస్తాడంటే కొన్ని అభిప్రాయాలు వెలిపూచాడు అందులో ఏమిటంటే మానవ సంబంధాలు అన్నిటిలోనూ అంతర్లీనంగా వచ్చి లైంగిక భావం ఉంటుంది అని ఇట్లా రాశడు ఆయన ఆ మొత్తం చూస్తే అన్ని ఆ యొక్క లెక్చర్స్ అన్నమాట అవి సిరీస్ ఆఫ్ లెక్చర్స్ అప్పుడు నాకుొక సందేహం ఏర్పడింది నా తల్లి నా 16వ ఏట దాటిన తర్వాత చనిపోయారు తల్లి లేని వాడిని
(16:19) అందుకని అమ్మ ప్రేమ కోసం ఎదురు చూసే స్వభావం నాది అప్పుడే కాదు ఇప్పుడు కూడా అందుకని ఏమైందంటే నాకు ఎంతో మంది ఆత్మీయంగా ఉండేవాళ్ళు ఆ రోజు ఉన్నారు ఈరోజు ఉన్నారు ఎప్పటికైనా ఉంటారు. స్త్రీమూర్తులు వాళ్ళలో చాలామంది బాగా దగ్గరగా నన్ను పుట్టని బిడ్డ వలె చూసేవారు కానీ ఎక్కడ కాలుష్యము ఇబ్బంది లేదు మా మానవ సంబంధాల్లో కానీ ఫ్రాయిడ్ గా నిజమైతే మేము తప్పు మేము గాని నిజమైతే ఫ్రాయిడ్ తప్పు ఇప్పుడు నేను ఎలా నిర్ణయించుకోవాలి అందుకని మాస్టర్ గారి దగ్గర పోయి ఆర్తత్రాణ పరాయణుడైన ఆయన్ని ఆర్తిగా ఆయన పద సన్నిధిలో అడిగాను సార్ ఏం చేయమంటారు ఆ ప్రైడ్ రైట్ అంటారా అని
(17:05) అతను చేసింది సైకో ఎనాలసిస్ అంటారు కదా లోకంతా ఒప్పుకున్న విషయం అన్నారు కా సార్ ఇప్పుడు నా స్వభావం నా మనసు నాకు తెలిసినంతవరకు ఆయన అన్నట్టు ఏమీ లేవు ఆయనది నమ్ముకుంటే నేనున్న జీవన విధానం మార్చుకోవాలి. లేదు నేను కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అది నిజం తెలిసేది ఎలాగో తెలుసుకోవాలి ఎలా చేయమంటారు అని అప్పుడు మాస్టర్ కొంచెం సేపు ఆగి నెమ్మదిగా అన్నారు అయితే ఒకసారి చివటమ్మని చూడు అంతేగా అన్నారు సరే సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వెళ్తాను ఒకసారి నేను హైదరాబాద్ పోతుంటే ఏమోయ్ వీలుంటే చివటమ్మ గారిని చూడకూడదా అన్నారు.
(17:43) అంతే విజయవాడలో దిగి తనుకు పోయే రైలుఎక్కి మధ్యాహ్నం దిగాను ఒక 10 గంటల పైన ఉంటదేమో అది కూడా ఆ ప్రాంతం ఉంటది అంతే ఒక రిక్షా ఎక్కాం కొంచెం కమలా పండ్లు తీసుకొని కొంచెం దూరం పోయే కొద్ది రిక్షా టైర్లు కాదు నా మనసు తిరుగుతుంది. ఇప్పుడు అక్కడికి పోవడం ఎందుకు మనం పోయాము అమ్మగారు ఒకవేళ ఆ రగ్గు కప్పుకొని ఉన్నారుఅనుకో మన పరిస్థితి ఏంది ఇంక వెంటనే మనకి ఆత్మీయమైన ప్రతి స్త్రీకి ఉత్తరం రాసి అమ్మ నేను ఇలా పోయాను అక్కడ నాకు ఇలా అనిపించి చెప్పారు అమ్మవారు ఉన్నారు కాబట్టి ఇక మీదట మన ఆత్మీయ బంధం ఏదైతే మనం ఇంతవరకు ఉన్నామో అది సరైంది
(18:30) కాదని ఫ్రాయిడ్ చెప్పిన ప్రకారం అయిపోయింది గనుక అంతర్లీనంగా ఏదో పెట్టుకొని పైకి ఒక రకంగా ఉన్నాం కాబట్టి ఇది వద్దు ఇది ఇక అని నమస్కారం పెట్టాల్సి ఉంటది. వాళ్ళతో ఆ విధంగా ఉండటం కుదరదు. కానీ స్వచ్ఛము పవిత్రము అయినటువంటి మానవ సంబంధాన్ని వదులుకోవడానికి ఇష్టం కాలేదు. మనకు తెలిసిన తలుపులు ఏమీ లేవు సరే ఏం చేయాలి మొత్తం మీద దగ్గరికి వెళ్ళాం వెళ్ళేప్పటికి ఇక్కడ ఆగేసి వెనక్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది అక్కడే ఉంటుందఅమ్మా అంటే ఒకసారి నిర్ణయించుకున్నా వెళ్ళాలి కదా అని దిగిపోతే రామాలయం ఇదే రామాలయం లోపలికి పోండి లోపలికి వెళ్ళేప్పటికీ
(19:13) అమ్మ కూర్చుని ఉన్నారు ఒంటిమీద ఆచ్యాదన ఏమీ లేదు కొంచెం ఓదార్పు వచ్చింది ఏమని గుడ్డలు లేవు సరే అమ్మ నమస్కారం చూశారు ఆమె చూపు మన మీద పడగానే మన లోపల చేతనత్వం అంతా కదలుతది ధ్యానము స్మరణ మాస్టర్ గారి దగ్గర కూర్చుని చేయడం అలవాటు ఉంది కదా ఒకసారి లోపల చాలా కదలిక వస్తుంది. మెల్లగా ఆమె సాన్నిధ్య ప్రభావంలోకి మనం వెళ్ళిపోతాం.
(19:49) మామూలుగా నిశ్చలం కాని మనసు నిశ్చలంగా ఏకాగ్రంగా సంతోషంగా తృప్తిగా ఉంటది ఆయన సాన్నిధ్యం చాలా గొప్పగా ఉంటది. అదే మొదటిసారి చూడటం కదా ఈలోగా ఆ పండ్లెత్తి నారం రంగు పండ్లు అమ్మ చేతిలో పెట్టగానే ఇట్లా గుండె పెట్టుకున్నారు. కొన్ని క్షణాలు ఆగి అందులో ఒకటి తీసి ఒక తొన తీసుకొని సగం తిని సగం చేతిలో పెట్టి తిను అన్నాడు. ఓరి దేవుడా హిమాలయం పైకి ఎక్కినప్పుడు టెన్సింగ్ నార్కాన్ సంతోషపడ్డాడో లేదో నాకు తెలియదు నేను పడ్డాను సంతోషపడ్డాను ఏమని భగవంతుడా అనుగ్రహించావు నాయనా అని ఏమని నాయనా నువ్వు నా బిడ్డవు తిన్న పదార్థము మిగిలింది ఎవరికి
(20:35) ఇస్తారంటే తన వాళ్ళకి తన బిడ్డలక ఇస్తారు. ఆమె అమ్మ బిడ్డగా అంగీకరించారు ఇక చాలు సరే ఇంకా అక్కడి నుంచి మనం తెలుసుకోదగిన విషయం సాధువులు మన దేశంలో ఎటువంటి వర్తనం కలిగి ఉంటారో ప్రవర్తన కలిగి ఉంటారు అని అప్పుడు అమ్మ కొంచెంసేపు ఉన్న తర్వాత లేచారు. గుడ్డలు లేవుగా గుడ్డలు లేవనే ఫీలింగ్ ఏమి కలగడం లేదు ఎందుకనింటే సాధారణంగా మన ఇంట్లో మన వాళ్ళతో అయినా సరే ఒకసారి మనసు హృదయంతో గన ఆత్మీయ సంబంధం ఏర్పడితే మిగతా విషయాలు అంత ప్రధానం కాదు సరే లోపలికి వెళ్లి అమ్మ ఎక్కడ సాధన చేసుకుంటారో ఆ రామాలయంలో అటు లోపల కూర్చొని కూర్చోమన్నారు ఇటు కూర్చోగానే అట్లా ఇంక
(21:20) మనసు ప్రపంచమే కనిపించనంత ఆనందంగా ఉంటది అన్నమాట అప్పుడు ముందు గీతా మకరందం భగవద్గీత వ్యాఖ్యానం అది ఇచ్చి చదవమన్నారు కొంచెం సేపు చదువు ఆ చదవడంలో ఉద్వేగంతో ఒకటి రెండు తప్పులు కూడా చదివానండి అప్పుడు అమ్మ సరిగా చదువు నాయనా అని మళ్ళీ వెనక్కి చదివాను అయిపోయిన తర్వాత బాబా చరిత్ర తీసి ఇచ్చారు అందులో తొమ్మిదవ అధ్యాయం వచ్చింది.
(21:45) ఇంతకుముందు కూడా మనం చాలామంది మహనీయ మూర్తుల దగ్గర పోయినప్పుడు ఆ అధ్యాయమే చదివించుకొని విన్నారు అమ్మ కూడా తొమ్మిదవ అధ్యాయం చదివించుకొని నీవు కూడా ఈ విధంగా గన చేసినట్టయితే ఈ ప్రసాదం లాగే నీ జీవితం కూడా మధురమై సర్వార్థ సిద్ధిని ప్రసాదించగలదు అనేంతవరకు హేమాత్పంతుకు బాబా చెప్పేంతవరకు చదివిన తర్వాత ఇక్కడ వెనక నుంచి ఎవరో వచ్చారు బాబు మీరు భోంచే చేశరా అని అడిగారు.
(22:16) ఇప్పుడు నేను భోం చేశాను అని అబద్ధం చెప్పడం బాలేదు. నేను భోం చేయలేదు అంటే మీరు లేచి రండి అంటారు అమ్మగారి దగ్గర నుంచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మౌనంగా ఉన్నాను నేను ఇంకా అట్ట ఉండగా వెంటనే అమ్మ స్పందించారు. లేదు ఆ బాబు తినలేదు నేను పెడతాను అంతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఓ దేవుడా బతుకుడా అనుకున్నాను. కొంచెం సేపు అయ్యాక అమ్మ లేచారు.
(22:38) అంటే ఇప్పుడు మనం వస్తున్నామని ఆమె స్ఫురించి ఆమె అన్నం ఉండి పెట్టి ఉండాల లేకపోతే ఆమె భిక్షం తెచ్చుకునే ఆమె దగ్గర అన్నం ఎందుకు ఉంటది. చూద్దాం ఏదైనా లేచి పోయిన తర్వాత అక్కడ చిన్న పాకు ఉంది వెనక శుభ్రంగా ఉంది అది పరిశుభ్రంగా ఉంది. అక్కడికి పోయిన తర్వాత చేయి కడుక్కొని అమ్మన్నారు కడుక్కొని లోపలికి రాగానే ఒక పీట వేస్తుంది.
(23:02) దాని ముందు ఒక ఆకు అంతే అమ్మ తెచ్చి రాతి గిన్నెలు చూడటం అదే మొదట మనం రాతి గిన్నెల్లో చాలా గిన్నెలతో పెట్టి ఉన్నారు. పెట్టారు నిండుగా అన్నం ఉంది అమ్మ ఏం చేశారంటే ఆకు కడిగిన తర్వాత ఆమె శుభ్ర కడిగి నీళ్లు తల్లి కొద్దిగా అన్నం వేసి వడ్డిచ్చి అందులో కొంత ఏదో కూర వేసి కలిపి చెయి పెట్టి కొంచెం సేపు ఉండి ఇప్పుడు తిన్న నాయనా అన్నారు.
(23:30) తిన్నా కొంచెం తిన్నాను తిన్న తర్వాత అక్కడ చూస్తే ఎనిమిది గిన్నెలు ఉన్నాయి ఆహారం అన్ని రాతి గిన్నెలు చూడడం ఇదే అయినా కూడా అంత ఆహారం చాలా ఎక్కువ ఆహారం ఉంది. అప్పుడు మనసులో అనుకున్నాను భగవంతుడా ఇటువంటి అరుదైన అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు ఈరోజు లభించింది కనుక పరమాత్మ తినే శక్తినన్నా ఇవ్వు లేదా పెట్టొద్దు అట్లానే అప్పటికి అమ్మ బ్యూటిఫుల్ గా నవ్వారు అందంగా నవ్వారు నవ్వి ఏమన్నారో తెలుసా ఏం మాట్లాడలేదు ఆ పెద్ద గిన్నెలో అంతా వడ్డీ చేసి ఇంకా కూరంతా వేసి కలిచి తినమన్నారు ఇంకేముంది తినడమే మొత్తం ఎనిమిది గిన్నెల్లో ఉండే ఆహారం అంతా తినిపించేశరు.
(24:17) నా పొట్ట పెద్దగా రాలేదు ఇంకేం పెట్టినా తినేంత ఇదిగా ఉంది అయిపోయింది లేచాం లేచిన తర్వాత ఈ మధ్యలో ఒకసారి చూస్తే అమ్మ విసురుతున్నారు ఆమె సాధు సేవ చేస్తారని చెప్పారు ఎవరో కానీ అమ్మ అమ్మ అంటే అన్నారు అయిపోయింది లేచి చెయి కడుక్కొని వచ్చేప్పటికి ఆ పంచలోనే కొంచెం దూరంలో అమ్మ కూర్చున్నారు దగ్గర కూర్చోమన్నారు. ఎట్లా ఉందంటే మాస్టర్ గారి దగ్గర కూర్చుంటే ఎలా పెద్ద పవర్ఫుల్ గా ఉండే ఒక శక్తివంతమైన ప్రసారం పక్కన ఉంటే ఎలా ఉందో అలా ఉంది.
(25:01) అట్లాగే ఇంకా బయట ఉండే ప్రపంచంఅంతా నీడలు నీడలుగా తోస్తుంది. ఎర్రటి ఎండ ఉన్నా కూడా మనం ఆ పంచలో కూర్చున్నాం గనుక ఆ నీడలో ఉన్నాం అంతే అట్లాగే చాలా సేపు గడిచింది. ఈ మధ్యలో ఎవరో వచ్చారు బాబు ఎవరి నుంచి వచ్చారు అంటారు ఆ విద్య బాబు విద్యానగర్ నుంచి వచ్చాడు భరద్వాజ బాబు పంపాడు అంటారు అమ్మ చెప్తారు నేను ఏమ చెప్పనేలే ఇంకొంచెం సేపు అయిన తర్వాత బాబు మీరు ఈరోజు ఉంటారా అంటారు లేదు కొంచెం సేపటికి బాబు బయలుదేరతాడు అంటారు అన్న తర్వాత మీరు దేంట్లో వెళ్తారు రైల్లో వెళ్తారు అట్లా అమ్మ చెప్తున్నారు నాకైతే ఏమి మాట్లాడాలని
(25:47) లేదు. సరే కొంచెం సేపు అయ్యాక నాయనా నీకు తృప్తి అయిందా నీకుేం కావాలి అని అడిగారు. అమ్మ చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మీరు మరొక్కసారి అనుగ్రహించాలా మీ అనుగ్రహాన్ని పొందాలని ఉందమ్మా అని చెప్పుకున్నారు. దానికే అలాగే అన్నారు. ఆ తర్వాత కొంత ప్రసాదం ఇచ్చి నువ్వు సత్సంగం చేస్తావు కదా అక్కడ వాళ్ళకి పంచు అని చెప్పి ప్రసాదం ఏదో ఇచ్చారు.
(26:16) అవతలమ్మ సాగనంపారు. దివంగతురాలైన నా తల్లి తిరిగి వస్తే అంతకంటే గొప్ప ప్రేమతో నన్ను సాగనంపలేదు అంతగా సాగ నంపించారు బయలుదేరామో తనుక్కవచ్చాం అక్కడి నుంచి జీవితం ఎలా ఉంటదింటే ఈ మహాత్ములు ఎవరి దగ్గరికి పోయివచ్చినా నల్లేరు మీద నడకలాగా అయిపోతుంటుంది లోపలికి వస్తాం వెంటనే రైలు వస్తది. మనం ఎక్కాల్సిన కోచ్ వస్తది ఎక్కి దాంట్లో కూర్చోగానే అది ఖాళీగా నీట్ గా సక్రమంగా ఉంటది.
(26:45) అంతే ఒక ఆనందంగా అట్లా వచ్చి సూలూరు పెద్ద వేసి ఇంటికి వెళ్ళిపోయాం. అట్లా ఉంది మళ్ళీ మాస్టర్ గారిని కలిసినప్పుడు ఆయన ఎంతో సంతోషించారు. అప్పటినుంచి మనం మనదైన ధర్మంలో మనకు ఆత్మీయమైన ఎవ్వరి విషయంలో తల్లులు పిల్లలు ఆత్మీయులైన వాళ్ళ పట్ల ఇంక నాకు ఫ్రాయిడ్ పని లేదు. ఫ్రాయిడ్ కంటే మించిన భరద్వాజ మాస్టర్ గారి ధర్మము ఉపదేశం సాయి ప్రబోధం అమ్మవంటి వాళ్ళ ఆత్మీయమైనటువంటి ఆశీస్సులు వీటితో సర్వాన్ని మాతృభావంతో భావించగలిగే అది సరిైనదే అనే రూట్ ఏర్పడింది.
(27:28) కాబట్టి మీరు ఎవరైనా హృదయ శుద్ధితో భావ నైర్మల్యంతో మనం గనుక మనదైన శైలిలో ఉంటే ఈ మిగతా ఏమి పట్టించుకోన అవసరం లేదని అర్థమైంది. కాబట్టి మనకు అమ్మవారి దయ వల్ల మనకు లభించిన మహా అద్భుతమైనటువంటి ఉపదేశంి కొంత కాలానికి 1981 లో సుమారు జూన్ ప్రాంతంలో ఏ అమ్మగారికి బాగుండటం లేదని చెప్పారు చూటం అమ్మగారికి నేనేమనుకుంటున్నాను అంటే ఆమె ఆశీర్వదించి చెప్పారు కదా మనం తిరిగి వెళ్లి వారి దర్శనం చేసుకునేంతవరకు అమ్మగారు ఎట్లాగో దేహధారిగా ఉంటారు ఆమె ఆమె మాట ఒమ్ము కాదు
(28:14) అనుకుంటూ ఉన్నా నేను చివరికి ఆ వెన్నెల రోజు రానే వచ్చింది. నెల్లూరులో ఉన్నాను నేను నెల్లూరులో ఏదో పని ఉండి రాత్రి 10 గంటల దాకా నెల్లూరులో పని చూసుకొని మా పల్లికి వెళ్ళాను. నెల్లూరుకి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే పల్లికి రాత్రి అక్కడ చేరిన వెంటనే గాఢంగా నిద్ర వచ్చింది. పడుకున్న సెకండ్ లోనే రిక్షాలో తణుకు చివటం పోతున్నాను.
(28:48) పోతుంటే అక్కడ కూడా వెన్నెల్లో కలలో కూడా వెన్నెలే ఆ నీడల్లో అలా వెళ్లి అమ్మ దగ్గర పోగా నాయనా రా అంటున్నట్టు చూస్తున్నారు ఆమె ఆ రామాలయం అంచునే ఉన్నారు. వెళ్ళగానే రారా నాయనా అని నమస్కారం పెట్టి అటు ఉండగానే ఆమె తొడపైన తల పెట్టుకొని ఇట్లా వెన్నెల చూస్తూ ఆమె ముఖం పై నుంచి ఒక గొప్ప భావాన్ని పొందుతున్నాను చిన్నప్పుడు నా తల్లితో నేను అలా ఉండేవాడిని అదే భావం అబ్బా పరమాద్భుతంగా ఉంది.
(29:21) నేను కలిసినప్పుడు నేను కలిసినప్పుడు ఎలా ఉందో అంత అద్భుతంగా అను ఉంది లోపల అట్లాగే ఉన్నాను అన్నమాట అంతే మా బంధువు ఒక ఆమె లేపింది నాయనా తెల్లవారింది లేవరా అని లేవగానే అర్థమయింది అమ్మ గెలిచారని నేను ఇక్కడ పడుకుంది సుమారు 11 గంటల ప్రాంతం అనుకోండి అమ్మగారు అక్కడ 12 గంటలఐదు నిమిషాలకు దేహత్యాగం చేశారు దేహ త్యాగము చేసినా కూడా ఆ ముందు ఆ తరువాత కూడా అమ్మ అంతరంగంలో మనని ఆ విధంగా అనుగ్రహించారని తెలిసినప్పుడు గుండె గొంతుకలోకి వచ్చినంత భావస్ఫూర్తిష్టి కలిగింది. ఇక దానికి మాటలే ఉంటాయి మీరే
(30:08) ఊహించుకోండి ప్రస్తుతానికి సెలవు నమస్కారం [బెల్] [సంగీతం]
No comments:
Post a Comment