Tuesday, August 18, 2026

What Does the Soul Carry After Death? | The Hidden Truth of Vasanas

What Does the Soul Carry After Death? | The Hidden Truth of Vasanas

Author Name:Telugu Books

Youtube Channel Url:https://www.youtube.com/@telugubooks1031

Youtube Video URL:https://www.youtube.com/watch?v=fK9vRtFxLT8



Transcript:
(00:00) జీవుడు ఏమి తీసుకెళ్తాడు ధనం కాదు వాసనలే జీవుడు దేహంలోకి ఎలా ప్రవేశిస్తాడు అతని వాసనలు ఎలా ఏర్పడతాయి ఇది వేల సంవత్సరాలుగా వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత పురాణాలు వివరిస్తున్న అత్యంత గంభీరమైన ఆధ్యాత్మిక విషయం వేదాంతం ప్రకారం జీవుడు నాశనం కానివాడు శరీరం మారుతుంది కానీ జీవుడు మారడు జీవుడు తన పూర్వ కర్మల ప్రకారం అన్నం ద్వారా తండ్రి శరీరంలోనికి ప్రవేశించి శుక్రకణం ద్వారా తల్లి గర్భంలో చేరి తొమ్మిది నెలలు పెరిగి ఈ లోకంలో జన్మిస్తాడు.
(00:38) పుట్టిన శిశువుకు ఈ జన్మలోని తల్లిదండ్రులు బంధువులు, ఆస్తులు పరిచయాలు ఏవి తెలియవు అయినప్పటికీ ఆ జీవుడు పూర్తిగా కొత్తవాడు కూడా కాదు. అనేక జన్మల్లో సంపాదించుకున్న సంస్కారాలు, అభిరుచులు, భయాలు, ఆకర్షణలు, ద్వేషాలు, ఆశలు, అలవాట్లు సూక్ష్మ రూపంలో అతనితో పాటు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఒకే ఇంట్లో ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్లో కూడా స్వభావం అభిరుచులు ఆలోచనా విధానం ప్రవర్తన పూర్తిగా వేరువేరుగా కనిపిస్తాయి.
(01:08) సంస్కారం అంటే ఏమిటి మనం చూసే ప్రతి దృశ్యం వినే ప్రతి మాట చేసే ప్రతి పని తినే ప్రతి ఆహారం కలిసే ప్రతి వ్యక్తి అనుభవించే ప్రతి సుఖం దుఃఖం మనసుపై ఒక ముద్రను వేస్తాయి. ఆ ముద్రలనే సంస్కారాలు అంటారు. ఒక ఆలోచనను పదే పదే మనసులో తిరగబెడితే అది ఇష్టంగా మారుతుంది. ఇష్టం పెరిగితే మమకారం అవుతుంది. మమకారం బలపడితే అది వాసనగా మారుతుంది.
(01:38) ఈ వాసనే తరువాత కూడా జీవునితో పాటు ప్రయాణిస్తుంది. భగవద్గీత ఏం చెబుతుంది? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు యంపి స్మరణ్ భావం తేజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః అంటే జీవుడు చివరి క్షణంలో ఏ భావంతో శరీరాన్ని విడిచిపెడతాడో అదే భావానికి సంబంధించిన గతిని పొందుతాడు అంతిమ సమయంలో మనసులో ఏది బలంగా ఉంటుందో అది యాదృచ్చికంగా రాదు జీవితంంతా మనం దేని దేనిపై ఎక్కువగా ద్యాస పెట్టామో అదే చివరికి గుర్తొస్తుంది.
(02:16) అందుకే జీవితం మొత్తం ఎలా గడిపామ అన్నదే చివరి క్షణాన్ని నిర్ణయిస్తుంది. ఒక కుటుంబ ఉదాహరణకు ఒక యువకుడు యువతి ప్రేమతో వివాహం చేసుకున్నాడు. కొంత కాలానికి భార్య గర్భవతి అని తెలిసింది. ఆ క్షణం నుంచే ఇంకా జన్మించని బిడ్డపై ప్రేమ మొదలవుతుంది. నెలలు గడుస్తున్న కొద్దీ ఆ ప్రేమ పెరుగుతుంది బిడ్డ పుట్టిన తర్వాత ఆ ప్రేమ మరింత బలపడుతుంది.
(02:39) మొదటి నవ్వు మొదటి అడుగు మొదటి మాట మొదటి పాఠశాల మొదటి విజయం ప్రతి అనుభవంతో మమకారం గాఢమవుతుంది. ఈ ప్రేమ సహజమైనదే కానీ అది దైవార్పణ భావంతో లేకుండా ఈ బిడ్డేనా ప్రపంచం అనే స్థాయికి చేరితే అదే బలమైన వాసనగా మారుతుంది. ధన విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొంతమంది జీవితమంతా డబ్బు సంపాదించడానికి వెచ్చిస్తారు ధనం అవసరమే కానీ ఇదంతా నాదే అనే భావం పెరిగితే అది ధనాసక్తిగా మారుతుంది.
(03:06) శరీరం విడిచిపెట్టినప్పుడు బ్యాంకు ఖాతాలు రావు బంగారం రాదు బొమ్ములు రావు కానీ ధనం పట్ల ఉన్న మమకారం మాత్రం జీవునితో పాటు వెళ్తుంది. ఆస్తి విషయంలో కూడా ఇదే ఈ ఇల్లు నాది ఈ పొలం నాది ఈ స్థలం నాది ఈ భావన ఎంత బలపడితే అంత బలమైన వాసన ఏర్పడుతుంది. అందుకే వేదాంతం ఉపయోగించు కానీ బంధించుకోకని చెబుతుంది. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది వాసనలే సంగీతం మీద ఆసక్తి ఉన్నవారికి సంగీత వాసన పుస్తకాలు చదివే వారికి జ్ఞాన వాసన ఎప్పుడూ దైవస్మరణ చేసే వారికి భక్తి వాసన ఇతరులకు సహాయం చేసే వారికి సేవాసన కోపాన్ని పెంచుకున్న వారికి కోపవాసన మధ్యానికి బానిసైన వారికి
(03:46) వ్యసనవాసన లోభం పెంచుకున్న వారికి లోభవాసన అందుకే మన అలవాట్లే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఒక గుడ్డలో ఒక గుడ్డలో ఎండు చేపలు నాలుగు రోజులు కట్టి ఉంచండి. తరువాత చేపలను తీసేయండి చేపలు లేవు కానీ వాసన మాత్రం అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు ఉతికినా వెంటనే పోదు మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసినప్పుడు మాత్రమే క్రమంగా తగ్గుతుంది. అలాగే జీవుడు కూడా కోట్లాది జన్మలుగా ఎన్నో వాసనలను మోస్తూ వస్తున్నాడు.
(04:14) అవి ఒక్క రోజులో పోవు మరి వాటిని శుభ్రం చేసే సబ్బు ఏమిటి అది బాహ్య సబ్బు కాదు అది జ్ఞానం భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు రామాయణం మహాభారతం భాగవతం సత్సంగం దైవనామస్మరణ ధ్యానం నిష్కామ కర్మ ఆత్మ విచారం ఇవే మనసును క్రమంగా శుద్ధి చేస్తాయి. మన జీవిత లక్ష్యం ఏమిటి కుటుంబాన్ని ప్రేమించాలి కానీ బంధించుకోకూడదు ధనాన్ని సంపాదించాలి కానీ ధనదాసుడిగా మారకూడదు ఆస్తిని కాపాడాలి కానీ అహంకారానికి కారణం చేయకూడదు పదవిని నిర్వహించాలి కానీ దానితో తన వ్యక్తిత్వాన్ని కొలవకూడదు ప్రేమ ఉండాలి మమకారం తగ్గాలి కర్తవ్యం చేయాలి ఫలితాన్ని భగవంతునికి అర్పించాలి చివరికి మనతో
(04:58) వచ్చేది ఏమిటి శరీరం కాదు ధనం కాదు ఆస్తి కాదు పేరు కాదు పదవి కాదు బంధువులు కాదు మనతో వచ్చే ఒక్కటి మన కర్మలు మన సంస్కారాలు మన వాసనలు అందుకే ప్రతిరోజు ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన రోజే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభం అవుతుంది. వాసనలు క్రమంగా క్షీణించినప్పుడు మనసు నిర్మలం అవుతుంది.
(05:23) నిర్మలమైన మనసులోనే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగిన జీవుడికి జనన మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే శాస్త్రాలు ఒకటే చెబుతున్నాయి. ప్రపంచంలో జీవించు కానీ ప్రపంచం నీ మనసులో నివసించనివ్వకు ఇదే వేదాంతం బోధించే జీవన రహస్యం.

No comments:

Post a Comment