Why Osho Never Allowed Politicians in His Ashram
Author Name:Mr Bhanuprasad
Youtube Channel Url:https://www.youtube.com/@MrBhanuprasadOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AzADJmPxr6U
Transcript:
(00:00) ఒక్కసారి ఊహించండి మీరు ప్రపంచంలోనే అత్యంత ప్రశాంతమైన ఒక ఆశ్రమం గేటు దగ్గరకు వెళ్తారు. అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. పొలిటీషియన్స్ ఆర్ నాట్ అలోడ్ అంటే దొంగలు రావచ్చు, ధనవంతులు రావచ్చు, పేదవారు రావచ్చు, నాస్తికులు రావచ్చు, ఆస్తికులు కూడా రావచ్చు కానీ రాజకీయ నాయకులు మాత్రం రావద్దా? ఎందుకు రాజకీయ నాయకులు మనుషులు కాదా? లేదా ఓషోకి రాజకీయ నాయకులు అంటే ద్వేషమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మన జీవితాన్ని కూడా కొత్త కోణంలో చూడడం స్టార్ట్ చేస్తాం.
(00:31) వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే విషయం మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఆశ్రమం అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆశ్రమం అంటే ప్రపంచం నుండి పారిపోయే స్థలం కాదు. అది మనలో ఉన్న గంధరగోళం నుండి బయటపడే స్థలం. బయట ప్రపంచంలో పోటీ ఉంటుంది, అసూయ ఉంటుంది, అహంకారం ఉంటుంది. అధికారం కోసం పోరాటం ఉంటుంది.
(00:54) కానీ ఆశ్రమంలో నిశశబ్దం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అక్కడ ఎవరు ఎవరికంటే గొప్పవారు కాదు. అందరూ ఒకే స్థాయిలో ఉంటారు. ఓషో చెప్పిన ప్రకారం మనిషి తన అహంకారాన్ని బయట వదిలేసి లోపలికి రావాలి. ఎందుకంటే ధ్యానం అహంకారంతో కలిసి ఉండదు. ఓషో దృష్టిలో రాజకీయ నాయకుడు ఎవరు? ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఓషో రాజకీయ నాయకులను వ్యక్తిగతంగా ద్వేషించలేదు కానీ రాజకీయ మనస్తత్వంను ఆయన తీవ్రంగా విమర్శించారు.
(01:24) ఎందుకంటే రాజకీయాల పునాది అధికారం నియంత్రణ ఇతరులపై ఆధిపత్యం ఒక వ్యక్తి జీవితమంతా ఎలా గెలవాలి? ఎలా ఇతరులను ఓడించాలి, ఎలా అధికారాన్ని సంపాదించాలి అనే ఆలోచనలతో గడిపితే అతను ఆశ్రమంలోకి వచ్చిన వెంటనే మనసు ప్రశాంతంగా మారిపోతుందా? ఓషో ప్రకారం అది అంత సులభం కాదు. అధికార వ్యామోహం ఓషో ఒకసారి ఇలా అన్నారు అధికారాన్ని ప్రేమించే వ్యక్తి ప్రేమను ఎప్పటికీ పూర్తిగా అనుభవించలేడు.
(01:49) ఎందుకంటే ప్రేమలో సమానత్వం ఉంటుంది. అధికారంలో పైచేయి ఉంటుంది. ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది. అధికారంలో నియంత్రణ ఉంటుంది. ధ్యానంలో ఎవ్వరిని మార్చాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో అందరినీ మార్చాలని ప్రయత్నం ఉంటుంది. అందుకే ఓషో ఆశ్రమం అధికార పోరాటానికి వేదిక కాకూడదని భావించారు. ఇక్కడ చాలా మంది ఒక పొరపాటు చేస్తారు.
(02:10) ఓషో రాజకీయ నాయకులను ద్వేషించారని అనుకుంటారు. కాదు ఆయన చెప్పింది రాజకీయ నాయకుడు కూడా తనలోని అధికార దాహాన్ని వదిలేస్తే అతనికి కూడా ఆశ్రమంలో స్థానం ఉందని సమస్య వ్యక్తి కాదు మనస్తత్వం. ఒక సాధారణ మనిషి కూడా ఇతరులను నియంత్రించాలని చూస్తే అతనిలో కూడా రాజకీయ మనసత్వమే ఉంది. అలాగే ఒక రాజకీయ నాయకుడు కూడా అహంకారాన్ని వదిలి ప్రేమతో జీవిస్తే అతను నిజమైన సాధకుడే.
(02:35) ఈ కథ మొత్తం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ఓషో రాజకీయ నాయకులను కాదు మనలోని అధికార వ్యామోహాన్ని బయట వదిలేసి రావాలని చెప్పారు. ఎందుకంటే మనిషి నిజంగా స్వేచ్ఛను పొందేది ఇతరులను గెలిచినప్పుడు కాదు. తన అహంకారాన్ని గెలిచినప్పుడు అందుకే ఆశ్రమం గేటు దగ్గర కనిపించే ఆ బోర్డు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా కాదు మనలో ఉన్న రాజకీయ మైండ్సెట్ కి ఆపోజిట్ గా గుర్తుంచుకోండి ప్రపంచాన్ని మార్చే ముందు మీ మనసును మార్చుకోండి అప్పుడు ప్రపంచమే మారిపోయినట్లు కనిపిస్తుంది.
No comments:
Post a Comment