Monday, September 7, 2026

రోజూ చేసే ఈ 9 చిన్న తప్పులు మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి! | 9 Bad Daily Habits | Dr.Madhuri

రోజూ చేసే ఈ 9 చిన్న తప్పులు మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి! | 9 Bad Daily Habits | Dr.Madhuri

Author Name:Vardhan Ayurveda

Youtube Channel Url:https://www.youtube.com/@Vardhanayurveda

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QuzpjR6qwnk



Transcript:
(00:04) ఈ తొమ్మిది బ్యాడ్ హ్యాబిట్స్ వెంటనే ఆపండి లేకపోతే పెద్ద సమస్యలు తప్పవు. ఏ సమస్య అయినా ఒక్క రోజులో రాదు. మన రోజువారి చిన్న చిన్న అలవాట్ల వల్లే నెమ్మదిగా వస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనలో చాలామంది చేసే కొన్ని తప్పులు నిజానికి అవి తప్పు అని కూడా మనకు తెలియదు. కానీ ఈ వీడియోలో చెప్పబోయే ఒక చిన్న అలవాటు ప్రతిరోజు చాలామంది చేస్తూనే ఉంటారు.
(00:33) ఆయుర్వేదం ప్రకారం ఇలాంటి డైలీ హ్యాబిట్స్ వల్లే చర్మ సమస్యలు, జీర్ణ సమస్యలు హెయిర్ ఫాల్ మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని లోపల నుంచి కూడా దెబ్బతీస్తుంది. అందుకే ఈ వీడియోలో ప్రతి ఒక్కరు తప్పకుండా మార్చుకోవలసిన తొమ్మిది బ్యాడ్ హ్యాబిట్స్ గురించి చెప్పబోతున్నాను. చివర్లో చెప్పే ఒక బ్యాడ్ హ్యాబిట్ కనుక మీరు ఇగ్నోర్ చేస్తే ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఈ వీడియోని చివరివరకు తప్పకుండా చూడండి.
(01:02) నమస్కారం నేను డాక్టర్ మాధురి వర్ధన్ వర్ధన్ ఆయుర్వేద YouTube ఛానల్ కి స్వాగతం. 26 ఏళ్ల అనుభవంతో ఆయుర్వేద విధానం ద్వారా మేము మిలియన్ మందికి పైగా పేషెంట్స్ కి మంచి ఫలితాలు అందిస్తున్నాం. ఆ అనుభవంతో ఒక్క విషయం చాలా స్పష్టంగా తెలిసింది. చాలా ఆరోగ్య సమస్యలు పెద్ద పెద్ద కారణాల వల్ల రావు. మనం రోజు చేసే చిన్న చిన్న తప్పుల వల్లే వస్తాయి.
(01:29) ఆ క్లినికల్ అనుభవంతోనే ప్రజలు ఎక్కువగా పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని నెమ్మది నెమ్మదిగా దెబ్బ తీసే అలవాట్లను మీతో పంచుకుంటున్నాను. మొదటిది నిద్ర లేచిన వెంటనే ముఖాన్ని తాకడం. చాలామంది ఉదయం లేవగానే తెలియకుండా చేసే మొదటి తప్పు ఇదే రాత్రంతా మన చేతులు శుభ్రం చేయం ఆ సమయంలో చేతుల మీద బ్యాక్టీరియా జర్మ్స్ పేరుకుపోతాయి.
(01:56) సైంటిఫిక్ గా చూస్తే మన చేతులు అనేవి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే భాగాల్లో ఒకటి అలాంటి చేతితో లేవగానే ముఖాన్ని తాకితే ఆ [సంగీతం] జర్మ్స్ నేరుగా ముఖ చర్మం పైకి వెళ్తాయి. దీనివల్లే పింపుల్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం కూడా ముఖం చాలా సున్నితమైన భాగం దాన్ని అపరిశుభ్రంగా తాకడం వల్ల పిత్త మరియు కఫ దోషాలు ప్రభావితం అవుతాయి.
(02:24) [సంగీతం] అందుకే ఉదయం లేవగానే ముందు చేతులు కడుక్కోవాలి తర్వాతే ముఖాన్ని తాకాలి. ఇది చిన్న మార్పే కానీ స్కిన్ హెల్త్ కి చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది కావాలంటే ప్రాక్టీస్ చేసి మీరే గమనించండి. ఇక రెండవది పాత టూత్ బ్రష్ వాడడం చాలామంది బ్రష్ పూర్తిగా అరిగిపోయేంతవరకు వాడతారు. మనకు పళ్ళు శుభ్రం అయినట్టే అనిపిస్తుంది కానీ నిజానికి పళ్ళు సరిగ్గా క్లీన్ కావు ఎందుకంటే బ్రష్ బ్రిజిల్స్ వంగిపోయిన తర్వాత అవి పళ్ళ మధ్యలోకి సరిగ్గా వెళ్ళవు.
(02:59) ఇది ప్లేగ్ బిల్డప్ కి కారణం అవుతుంది. దీంతో క్యావిటీస్ గమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయుర్వేదంలో దంత ధావనం అంటే కేవలం బ్రషింగ్ ఒక్కటే కాదు ఓరల్ హైజీన్ మొత్తం కూడా చెరక సంహిత మరియు సుశ్రత సంహితలో ప్రతిరోజు ఉదయం కషాయ కట్టుతిక్త రసాలు ఉన్న దంత ధావన కాష్టాలను ఉపయోగించాలి అని చెప్పబడింది. అంటే రోజు తాజా శుభ్రమైన దంత కాష్టాలతో దంతాలను శుభ్రం చేయడం చాలా ముఖ్యం అని అర్థం.
(03:28) అదే కాన్సెప్ట్ ని మోడర్న్ టర్మ్స్ లో చూస్తే మన బ్రష్ కూడా ఫ్రెష్ మరియు ఎఫెక్టివ్ గా ఉండాలి అందుకే ప్రతి రెండు నుంచి మూడు నెలలకు ఒకసారి బ్రష్ ని మార్చడం తప్పనిసరి ఇప్పుడు చెప్పండి మీరు మీ టూత్ బ్రష్ ని చివరిసారి ఎప్పుడు మార్చారు కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇక మూడవది టూత్ పేస్ట్ మనలో చాలామంది ఒక కామన్ మిస్టేక్ చేస్తారు.
(03:55) ఎక్కువ ఫోమ్ వస్తే అది బాగా క్లీన్ చేస్తుంది అని అనుకుంటాం. కానీ అదిఒక అపోహ చాలా టూత్ పేస్ట్లలో ఫోమ్ కోసం ఒక కెమికల్ వాడతారు దాని పేరే సోడియం లారెల్ సల్ఫేట్ ఇది ఒక డిటర్జెంట్ సైంటిఫిక్ స్టడీస్ సోడియం లారెల్ సల్ఫేట్ వల్ల మౌత్ ఇరిటేషన్ కలిగించవచ్చని చెబుతున్నాయి. ముఖ్యంగా కొంతమందిలో మౌత్ అల్సర్స్ కూడా కారణం అవుతుంది. అదే ఎస్ఎల్ఎస్ లేని టూత్ పేస్ట్ వాడితే అల్సర్స్ గణనీయంగా తగ్గినట్లుగా కూడా గుర్తించారు.
(04:27) ఆయుర్వేదం ప్రకారం కూడా నోరు అనేది జీర్ణ ప్రక్రియ మొదలయ్యే స్థలం. అక్కడ హార్ష్ కెమికల్స్ వాడితే మొత్తం డైజెస్టివ్ సిస్టం పై ప్రభావం పడుతుంది. అందుకే ఎక్కువ ఫోమ్ వస్తుంది కాబట్టి మంచిది అని కాకుండా ఇంగ్రిడియంట్స్ చూసి మైల్డ్ అండ్ సేఫ్ పేస్ట్ చూస్ చేయడం మంచిది. కావాలంటే హెర్బల్ ఆల్టర్నేటివ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇక నాలుగవది ముఖాన్ని బలంగా రుద్దడం చాలామంది చేసే మరొక కామన్ మిస్టేక్ ఏంటంటే ముఖాన్ని గట్టిగా రుద్దితేనే క్లీన్ అవుతుంది అని అనుకుంటారు.
(05:00) కానీ ఇది పూర్తిగా తప్పు మన ముఖ చర్మం చాలా సున్నితమైనది. దాన్ని తరుచుగా గట్టిగా రుద్దడం వల్ల స్కిన్ బ్యారియర్ డామేజ్ అవుతుంది. పైగా స్కిన్ లో ఉండే కొలాజన్ బ్రేక్ డౌన్ కి దారి తీస్తుంది. దీంతో ముఖం మీద ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇక ఆయుర్వేదం ప్రకారం కూడా ముఖం అనేది పిత్త ప్రభావం ఎక్కువగా ఉండే భాగం అందుకే గట్టిగా రుద్దడం వల్ల చర్మం సులభంగా ఇరిటేట్ అవుతుంది.
(05:27) [సంగీతం] అందుకే ముఖాన్ని ఎల్లప్పుడూ సున్నితంగా కడుక్కోవాలి. అవసరమైతే మైల్డ్ స్క్రబ్ మాత్రమే ఉపయోగించాలి. ఇలా తెలియకుండానే మీరు చేసే తప్పుల గురించి మీకు చెప్పడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. మీరు కూడా అలాంటివి ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మనవాట్ప్ కమ్యూనిటీని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది.
(05:52) ఇక ఐదవది ముఖం జుట్టుకి సబ్బు వాడటం. ఇది చాలా కామన్ కానీ ప్రమాదకరమైన అలవాటు. చాలామంది బాడీ సోప్ ని ముఖానికి జుటికి కూడా వాడేస్తారు కానీ సబ్బులో ఉండే కెమికల్స్ ముఖంపై చాలా హార్ష్ గా పనిచేస్తాయి. ఇదే స్టడీస్ కూడా చెప్తున్నాయి. హై పిహెచ్ సోప్ వాడితే స్కిన్ పిహెచ్ పెరిగి ఇరిటేషన్ డ్రైనెస్ బాక్టీరియల్ ఇంబాలెన్స్ వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.
(06:19) ఆయుర్వేదం కూడా శరీరంలోని ప్రతి భాగానికి వేరువేరు సంరక్షణ అవసరం అని చెప్తుంది. శరీరం ముఖం జుట్టు మూడు వేరువేరు స్వభావాలు కలిగి ఉంటాయి. అందుకే ముఖానికి మైల్డ్ ఫేస్ వాష్ జుట్టుకి సూటబుల్ షాంపూ వాడటం మంచిదని చెప్తున్నారు. ముఖ్యంగా ఏ ప్రాడక్ట్ అయినా కొనేటప్పుడు ఇంగ్రిడియంట్స్ లిస్ట్ తప్పకుండా చెక్ చేయాలి.
(06:44) ఒకవేళ మీరు అలాంటి సేఫ్ సోప్ కోసం వెతుకుతున్నట్లయితే ఏ సోప్ బెస్ట్ అనే దానిపై ఒక కంప్లీట్ వీడియో చేయడం జరిగింది. కావాలంటే మీకోసం ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అయ్యాక వెళ్లి చూడండి. ఏ సోప్ వాడాలి అనేది [సంగీతం] మీకే తెలుస్తుంది. ఇక ఆరవది ఒకే టవల్ వాడడం. చాలామంది బాడీ ఫేస్ హెయిర్ మూడు భాగాలకు ఒకే టవల్ వాడతారు.
(07:12) కొంతమంది అయితే ఫ్యామిలీ మొత్తం ఒకే టవల్ షేర్ చేసుకుంటుంటారు. ఇది వారు చేసే చాలా పెద్ద తప్పు మన శరీరంలోని ప్రతి భాగంలో వేరు వేరు బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒకే టవల్ వాడితే ఆ బ్యాక్టీరియా ఒక చోట నుంచి మరొక చోటకి స్ప్రెడ్ అవుతుంది. దీంతో పింపుల్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ హెయిర్ ఫాల్ వంటి సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం కూడా శరీర శుభ్రతకి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
(07:37) అందుకే ఫేస్ బాడీ హెయిర్ కి వేరు వేరు టవల్స్ వాడటం మంచిది. కాబట్టి ఎప్పుడూ మీ టవల్ ని ఇతరులతో షేర్ చేసుకోకండి. ఇంతకీ మీ ఇంట్లో కూడా టవల్స్ షేర్ చేసుకునే అలవాటు ఉంటుందా కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఇక ఏడవది వర్కవుట్ తర్వాత స్నానం చేయకపోవడం. ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే హ్యాబిట్ ప్రత్యేకంగా జిమ్ లేదా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అలసిపోయి అలాగే పడుకుంటి పోతారు.
(08:03) కానీ నిజానికి ఇది చాలా పెద్ద తప్పు. వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి చెమట పడుతుంది. ఆ చెమట శరీరంపై బ్యాక్టీరియా పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. [సంగీతం] కొద్దిసేపటికే చెమట ఆరిపోయిన తర్వాత బ్యాక్టీరియా మాత్రం చర్మంపై అలాగే ఉంటుంది. దీంతో స్కిన్ అలర్జీస్ ఇచ్చింగ్ బాడీ ఆర్డర్ వంటి సమస్యలు వస్తాయి.
(08:29) ఆయుర్వేదం ప్రకారం కూడా వ్యాయామం తర్వాత శరీర శుభ్రత చాలా ముఖ్యం. అందుకే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంతసేపు విశ్రాంతి తీసుకొని తరువాత తప్పకుండా స్నానం చేయండి. అలాగే ఈ వీడియో ని జిమ్ కి వెళ్ళే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక ఎనిమిదవది నూనె రాసే విధానం జుట్టుకి నూనె రాసుకోవడం గురించి చాలామంది రెండు పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు.
(08:56) ఒకవైపు కొందరు అసలు నూనె రాయరు. మరోవైపు కొందరు రాసుకున్న నూనెను రోజుల పాటు అలాగే ఉంచేసుకుంటారు. ఈ రెండు కూడా హానికరమే. ఆయుర్వేదం ప్రకారం నూనె కేవలం హెయిర్ గ్రోత్ కోసం కాదు స్కాల్ప్ ని పోషించడానికి వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నూనె రాయడం మాత్రమే కాదు.
(09:21) దాన్ని సరైన విధంగా మసాజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. మేము ఇంతకుముందు హెడ్ మసాజ్ బెనిఫిట్స్ గురించి ఒక ప్రత్యేక వీడియో చేశం. అందులో ఏ విధంగా మసాజ్ చేయాలి చేస్తే వచ్చే 10 బెనిఫిట్స్ ఏంటి ఎప్పుడు చేయాలి అనేది పూర్తి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశం. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుంది.
(09:45) ఇకపోతే నూనెను ఎక్కువసేపు తలపై ఉంచితే దాన్ని జిగట స్వభావం వల్ల దుమ్ము ధూళ సులభంగా అంటుకుంటాయి. దీనివల్ల ఎక్సెస్ ఆయిల్ బిల్డప్ అయ్యి స్కాల్ప్ పోర్స్ బ్లాక్ అవుతాయి. దీంతో చుండ్రు హెయిర్ ఫాల్ పెరుగుతాయి. అందుకే వారానికి ఒకటి లేదా రెండు సార్లు నూనె రాసుకొని కొన్ని గంటల తర్వాత మరసటి రోజు తలస్నానం చేయడం మంచిది. ఇక తొమ్మిది రాత్రి పళ్ళు తోముకోకుండా పడుకోవడం.
(10:13) ఉదయం బ్రషింగ్ ఎంత ముఖ్యమో రాత్రి బ్రషింగ్ కూడా అంతే ముఖ్యం కానీ చాలామంది దీనిని పూర్తిగా ఇగ్నోర్ చేస్తారు. రోజంతా తిన్న ఆహారం చిన్న చిన్న పార్టికల్స్ గా పళ్ళ మధ్యలో ఇరుక్కుంటుంది. రాత్రంతా అవి అలాగే ఉంటే బ్యాక్టీరియా పెరిగి టూత్ డికే గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సైంటిఫిక్ గా కూడా నైట్ టైం ఓరల్ హైజీన్ చాలా క్రిటికల్ అని చెప్తున్నారు.
(10:38) ఆయుర్వేదం ప్రకారం రాత్రి పడుకునే ముందు శరీర శుభ్రతలో భాగంగా ముఖం నోరు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అందుకే పడుకునే ముందు తప్పకుండా బ్రషింగ్ చేసుకోవాలి. మనలో మన మాట మీరు రోజు నైట్ బ్రషింగ్ చేస్తారా నిజాయితీగా కామెంట్ లో చెప్పండి. ఈరోజు మనం చూసిన ఈ తొమ్మిది చిన్న అలవాట్లు చూడడానికి చిన్నవిగా అనిపించిన మన ఆరోగ్యంపై చాలా పెద్ద ప్రభావాన్నే చూపిస్తాయి.
(11:07) వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే వ్యాధి రాకుండా నివారించడం చాలా మంచిది. మనం రోజువారి అలవాట్లను సరిచేసుకుంటే చాలా సమస్యలను ముందే ఆపేయొచ్చు. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ఈ తొమ్మిది అలవాట్లలో మీరు ప్రస్తుతం ఎన్ని చేస్తున్నారో అవి ఒక్కొక్కటిగా నెమ్మదిగా మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఈ తొమ్మిదిలో మీకున్న అలవాట్లు ఎన్ని కామెంట్ లో నెంబర్ మాత్రమే టైప్ చేయండి.
(11:35) ఇక చివరిగా ఒకవేళ ఏమైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తుంటే వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించండి. [సంగీతం] ఎందుకంటే మేము ఆయుర్వేద చికిత్సతో 27 ఏళ్లగా మిలియన్ మందికి పైగా వెన్ను కీళ్లు క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాం. అంతేకాకుండానాలుగు లక్షల స్పైన్ సర్జరీలు మరియు లక్ష కీళ్ళ సర్జరీలను నివారించాం.
(11:59) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మాకు ఐదు బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృడంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. డిస్క్రిప్షన్ లోవాట్ప్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి.
(12:27) మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం ఉంటుంది. సంతోషంగా ఉండండి మీ రోజువారి అలవాట్లతో జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. [సంగీతం] [సంగీతం]

No comments:

Post a Comment