Monday, September 14, 2026

నీ డెస్టినీ మారే రోజూ మాత్రమె నువ్వూ ఈ వీడియో చూస్తావు| Ganesh Chaturthi behind secrets

నీ డెస్టినీ మారే రోజూ మాత్రమె నువ్వూ ఈ వీడియో చూస్తావు| Ganesh Chaturthi behind secrets

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Tye79ZoEEms





Title: నీ డెస్టినీ మారే రోజూ మాత్రమె నువ్వూ ఈ వీడియో చూస్తావు| Ganesh Chaturthi behind secrets

Author Name: viswam-vishnuhu

Description: ఈ వీడియోను క్లిక్ చేసి మీరు ఇక్కడి వరకు వచ్చారంటే... ఒక విషయం రాసి పెట్టుకోండి, ఈ రోజుతో మీ జీవితం మారడానికి సిద్ధంగా ఉంది! అవును, ఈ వీడియో అందరూ చూడరు. మీ లైఫ్‌లో ఇప్పటివరకు జరిగిన ప్రతి కష్టానికి, ప్రతి నష్టానికి వెనుక ఉన్న అసలు రహస్యం ఈ 4 నిమిషాల్లో మీకు అర్థం కాబోతోంది.ఈ వినాయక చవితి శుభసందర్భంగా, పరమశివుడు వినాయకుని తల ఎందుకు నరికాడు? ఆ నష్టం వెనుక ఉన్న అసలు దైవ రహస్యం ఏంటి? మరియు రాజు-మంత్రి కథ ద్వారా మన జీవితాల్లో జరిగే నష్టాల వెనుక దాగున్న 'భగవంతుడి పెద్ద ప్రణాళిక' (Bigger Picture) ఏంటో ఈ వీడియోలో అత్యంత శక్తివంతంగా వివరించబడింది.నువ్వు కోల్పోయింది ఒక చిన్న నష్టం మాత్రమే కావచ్చు... కానీ నువ్వు గెలవాల్సింది ఈ అనంతమైన ప్రపంచాన్ని! ఈ వీడియో మీ జీవితంలో కొత్త ఆశను, నమ్మకాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను.అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
#VinayakaChavithi #GaneshChaturthi2026 #TeluguMotivation #LifeChangingSpeech #AnthaManaManchike #LordGanesha #GaneshaStories #TeluguMotivationalVideo #Destiny #SuccessMindset

Transcript:
(00:01) తల్లని కోల్పోవడం వెనక ఉన్న రహస్యం ఏంటి? శివుడు వినాయకుడు తల్లని ఎందుకు నరికాడు ఎందుకు కోల్పోతే కానీ కొత్తది మన జీవితంలోకి రాదు దీని వెనకాల రహస్యం ఏంటి? ప్రపంచానికి ఈ సృష్టికి శివుడు ఏం చెప్పాలని ఈ నాటకం ఆడాడు. రాజుగారి బొటనవేలు తెగిపోయిన తర్వాత మంత్రి ఏం జరిగినా మన మంచికే అని ఎందుకు అన్నాడు? తెలుసుకుందామా వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి.
(00:30) ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదామా పార్వతీదేవి తన ఒంటి నలుగుపిండితో ఒక బాలుని తయారు చేసింది. స్నానానికి వెళ్తూ లోపలికి ఎవ్వరిని రానివ్వంకుండా కాపలాగా పెట్టింది ఆ బాలుడే వినాయకుడు. అప్పుడు శివుడు వచ్చాడు శివుడు వచ్చి లోపలికి దారివ్వు అని అడిగాడు. ఆ బాలుడు మాత్రం ససేమిరా కుదరదు అన్నాడు.
(00:57) మాతృభక్తి ఉండటం మంచిదే కానీ లోక నియంత అయినా శివుణని దిక్కరించడం చాలా తప్పు కదా అది అజ్ఞానం అంధకారం అహంకారం సో అలాంటి అహంకారం అజ్ఞానం ఉన్న తలని శివుడు ఖండించాడు. తర్వాత ఏం జరిగింది అక్కడ ఒక తల తెగిపడింది ఒక ప్రాణం పోయింది పార్వతీదేవి విలవిలలాడిపోయింది. ఈ సృష్టి ఒక్క క్షణం స్తంభించిపోయింది ఆ తర్వాత ఏం జరిగింది ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక రహస్యం ఉంది.
(01:32) మన జీవితంలో కూడా అంతే పాతది వదిలేస్తే తప్ప కొత్తది మన జీవితంలోకి రాదు. అలాగే అహంకారం అంధకారం అజ్ఞానం ఉన్న తలని తీసేస్తే తప్ప గజముఖం అమరలేదు. ఎప్పుడైతే ఆ పాతది కోల్పోయాడో వినాయకుడికి అప్పుడే ప్రథమ పూజ స్థానం లభించింది విఘ్నేశ్వరుడయ్యాడు. ఈరోజు మనం వినాయక చౌతి ఫెస్టివల్ జరుపుకుంటున్నాం. కానీ ఇక్కడే మనం ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి.
(01:59) కోల్పోవడం అనేది ముగింపు కాదు అది కొత్త సామ్రాజ్యానికి నాంది పలుకుతుంది. మన జీవితంలో కూడా అంతే ఏదైనా ఒక కోల్పోతే మరొక చోట మనకి ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది పడుతుంది అని అర్థం. మన జీవితంలో చాలా జరుగుతాయి ఎన్నో కోల్పోతాం ఎంతో మంది మోసం చేస్తారు వ్యాపారంలో నష్టపోతాం ఉద్యోగంలో మనల్ని తీసేస్తారు జాబ్ రాకపోవచ్చు అప్పుడు మనం ఏమనుకుంటాం దేవుని నిందిస్తాం మన తలరాతని తిట్టుకుంటాం కానీ ఇక్కడే మనం ఒకటి తెలుసుకోవాలి కోల్పోతున్నాము అంటే ఇంకొక చోట మనకోసం ఏదో ఒక దారి వేచి చూస్తుంది అని అర్థం ఒక కొత్త సామ్రాజ్యం మనకోసం ఎదురు చూస్తుంది అని అర్థం ఎందుకంటే ఎవరి తలరాత ఎవరికి
(02:46) తెలుసు ఎవరి నుదుటిన ఏం రాసిందో ఎవరికి తెలుసు భగవంతుడు మన చేతిలో నుండి ఒకటి లాక్కుంటున్నాడు అంటే ఇంకొకటి అద్భుతమైనది మన జీవితంలోకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఎగజాంపుల్ ఒక కథ చెప్తాను ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి ఒక మంత్రి ఉండేవాడు ఆ మంత్రి ఎప్పుడు ఏం జరిగినా మన మంచికి అని చెప్తూ ఉండేవాడు.
(03:17) కానీ రాజుకు మాత్రం అది నచ్చేది కాదు ఒకసారి యుద్ధంలో సాధన చేస్తున్నప్పుడు రాజుగారి బొటనవేలు అనేది తెగి పడిపోయింది. అప్పుడు అక్కడే ఉన్న మంత్రి ఏం జరిగినా మన మంచికే రాజా అన్నాడు. కానీ రాజు మాత్రంతో రాజు మాత్రం నొప్పితో రక్తం కారుతూ విలవిలలాడుతున్నాడు ఆ కోపంతో అంటే నా బొటనవేలు తెగిపడిపోయింది నేను ఇక్కడ నొప్పి నరకంతో నొప్పి చూస్తున్నాను రక్తం కారుతుంది నువ్వు మాత్రం ఏం జరిగినా మంచికే అంటావా వీన్ని తీసుకెళ్లి కఠిన కారాగార శిక్ష వేయండి అని సైనికులకి చెప్పారు.
(03:54) ఆ మంత్రి వెళ్తూ వెళ్తూ ఏం జరిగినా మన మంచికేలే అనుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఒక వారం రోజుల తర్వాత రాజు వేటకి బయలుదేరాడు. వేటకి అడవిలోకి వెళ్ళగానే అక్కడ ఉన్న నరమాంస భక్షకులు అతన్ని బంధించారు. ఎందుకంటే ఆ రోజు ఒక బలి ఉంది గ్రామదేవతకి బలి ఇవ్వాల్సిన రోజు అన్నమాట అది అక్కడే ఉన్న నరమాంస భక్షకులు అతన్ని బంధించి ఇంకా అక్కడ ఉన్న పూజారి రాజుని చంపాలని కత్తి తీయబోయాడు.
(04:24) అప్పుడు రాజుకి బొట్టనవేలు లేదు కదా ఆ బొటనవేలు లేకపోవడం చూసి అయ్యో ఇతడు అంగవైకల్యం ఉన్నవాడు ఇతడు బలికి పనికిరాడు గ్రామదేవతకి కోపం వస్తుంది అని రాజుని విడిచిపెట్టేసాడు. అప్పుడు రాజు అనుకున్నాడు అవును కదా ఆ రోజు మంత్రి చెప్పాడు కదా ఏం జరిగినా మన మంచిది అని కానీ నేనే అర్థం చేసుకోలేదు. ఒకవేళ ఆ రోజు ఆ పని జరగకుండా ఉంంటే ఈరోజు నేను అమ్మవారికి బలైపోయిఉండే వాడిని నా ప్రాణాలు పోయేవి అని అనుకుంటూ వచ్చి మంత్రిని విడుదల చేశాడు.
(04:57) మిత్రమా నువ్వు చెప్పింది నిజమే ఏం జరిగినా మన మంచికే అన్నాడు. అప్పుడు మంత్రి కూడా నేను కారాగారంలో ఉండేది కూడా మంచిదే రాజా ఎందుకంటే ఒకవేళ కారాగారంలో లేకుండా ఉంంటే నేను కూడా మీతో పాటు వచ్చిండేవాడిని మీరేమో మీ బొటనవేలు లేదు కాబట్టి అంగవైకల్యం ఉంది కాబట్టి మీరు తప్పించుకున్నారు కానీ నాకన్నీ బాగున్నాయి కచ్చితంగా నా ప్రాణాలు వాళ్ళు తీసేసి ఉండారు.
(05:25) అందుకే నేను ఏం జరిగినా మంచికే అని నమ్ముతాను భగవంతుని గట్టిగా నమ్ముతాను అని అంటాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది అదే వినాయకుడి జీవితం పిరూపించింది కూడా అదే మనం ఏదైతే కోల్పోతామో దానికన్నా అద్భుతమైనది మన జీవితంలోకి వస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది ఒక దారి క్లోజ్ అయితే ఇంకొక డోర్ అనేది ఓపెన్ అవుతుంది అని అంటే ఒకటి కోల్పోతున్నాము అంటే ఇంకో అద్భుతమైనది ఏదో మన జీవితంలోకి వస్తుంది అని అర్థం.
(05:56) ఆ చాలామంది మనం కోల్పోతుంటాం కదా కోల్పోయే దాన్ని ఆయుధాలుగా మార్చుకోవాలి మన లక్ష్యాలకి ఎలాగైతే వినాయకుడికి ఒక గంతం అనేది విరిగిపోయింది ఒకసారి కానీ విరిగిపోయింది అని ఆయన ఎప్పుడూ బాధపడలేదు ఆ విరిగిన దాంతోనే మహాభారత గ్రంథం అనేది లికించాడు వినాయకుడు అలాగే మనకి ఏమైనా జరగొచ్చు కానీ దాన్ని ఆయుధంగా మార్చి మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించాలి.
(06:21) సో కోల్పోవడం అనేది తప్పేం కాదు కోల్పోతేనే నీ ఇంకొక చోట నీకోసం ఒక మహా సామ్రాజ్యం వేచి చూస్తుందని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. సో పాస్ట్ ని మర్చిపో కోల్పోయిన దాన్ని వదిలేసేయ్ సో జరగాల్సింది చూడు కచ్చితంగా నీ అంబిషన్ ని నువ్వు రీచ్ అవుతావ్. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చెయ్ షేర్ చెయ్ తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో అండ్ హ్యాపీ వినాయక చౌతి.

No comments:

Post a Comment