క్రమశిక్షణ
కొలనులో కమలాలు, వాకిట్లో విరబూసిన పూలమొక్కలు చూపరుల దృష్టిని కొద్ది సేపు కట్టిపడేస్తాయి. పండుగలూ వేడుకల సమయంలో కళాకారులు చేసే నృత్యాలు, జాతీయ పర్వదినాల్లో రక్షణ బలగాల కవాతులు తిలకించడానికి జనం పోగవకుండా ఉండలేరు. క్రమశిక్షణకు, ఐకమత్యానికి పెట్టింది పేరు- చీమలు. అవి చిట్టి జీవులే కానీ పెద్ద పాఠాలు నేర్పుతాయి. కలిసి కదిలితే సాధించలేనిది లేదని లోకానికి చాటుతాయి. ఆకాశంలో పక్షులు బారులు తీరి ప్రత్యేక ఆకారంలో దూసుకెళ్తాయి. నేలమీది నుంచి చూసేవారికి కనువిందు చేస్తాయి. ఏ విద్యాబుద్ధులు లేకున్నా ఒక శాస్త్రీయ సూత్రాన్ని అనుసరిస్తే సునా యాసంగా ముందుకు పోవచ్చని వాటికెవరు చెప్పారు? ఆకాశం ఓ చినుకును జారవిడు స్తుంది. అది అందుకున్న చెరువు ఏ వృత్తలేఖినీ లేకున్నా అనేక వృత్తాలను ఒడ్డును తాకే వరకూ గీస్తుంది. అది చూసి గట్టుపైని మన సులు మంత్రముగ్ధమవుతాయి. ఈ అద్భుతా లకు కారణం- ప్రాకృతిక గమనానికి తగిన ట్లుగా తనకు తానుగా ఆవిష్కృతమయ్యే సజీవ సౌందర్యం.
సహజంగానే విశ్వం అంతా శాస్త్రీయ సూత్రాల ఆధారంగానే పనిచేస్తుంటుంది. దానికి తాత్విక నేపథ్యమూ ఉంటుంది. అందువల్లే 'జ్ఞానం బ్రహ్మ ' అన్నారు. పంచభూతాలూ ప్రాకృతిక నియ మాలు పాటిస్తేనే ఉనికిలో ఉంటాయి. నీరు పల్లానికే ప్రవహిస్తుంది. గాలి ఎప్పుడూ తక్కువ పీడనం వైపు వీస్తుంది. ఏదీ లేని చోటును ఆకాశం పూరిస్తుంది. ఇలా పంచ భూతాలూ ఎల్లవేళలా సమతుల్యత కోసం పనిచేస్తుంటాయి. అదే విధంగా మనిషీ సమ సమాజం కోసం పాటుపడాలి. దాని స్థాపనకు పరితపించాలి. ఆపన్నులను ఆదుకో
'పరిశుభ్రత' దివ్యత్వానికి పర్యాయపదం లాంటిది. అందుకే ఏ మలినం అంటని చోట, ఎలాంటి కల్మషం ఉండనిచోట దేవుడు ఉంటాడని అంటారు. జీవులకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేందుకు పంచభూతాలు ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని పూర్తిస్థాయిలో సద్వినియోగపరచేందుకు మనిషి తాను సంచ రించే ప్రదేశాలను అనుకూలంగా ఉంచుకోవాలి. సూర్యరశ్మి సోకేలా ఇంటిని నిర్మిం చుకోవడం, ఇంట్లో వస్తువులన్నింటినీ ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాని మూలాన స్థలం, సమయం కలిసివస్తాయి. చల్లని స్వచ్ఛమైన గాలి ఇల్లంతా వ్యాపిస్తుంది. వేలాడే బూజులు, చిందరవందరగా సామగ్రి, గుట్టలుగా దుస్తులు... ఉంటే ఆ పరిసరాలు మనశ్శరీరాలపై ప్రతికూల ప్రభావం చూపి అనారోగ్యం పాల్టేస్తాయి. పనుల పట్ల నిరాసక్తతను పెంచి కుంగు బాటుకు దారితీస్తాయి. ఇల్లు శుభ్రంగా ఉంటే మనసు తేలిగ్గా ఉంటుంది. ఉద్యోగ వ్యాపార బాధ్యతలను ప్రశాంతంగా నిర్వహించుకోవచ్చు.
నివాస స్థలం, పరిసరాలు బాగుంటే మనిషీ బాగుంటాడు. మనిషి క్షేమంగా ఉంటే మనసూ స్వచ్ఛంగా ఉండజూస్తుంది. మనసు స్థిరంగా ఉంటే మనిషి లోపలి క్షేత్రజ్ఞుడూ ఆనందపడతాడు. ఎల్లవేళలా తోడూనీడై నిలుస్తాడు.
No comments:
Post a Comment