Monday, February 3, 2020

కామం ఆత్మకథ

నేను కాముణ్ణి. నేను అత్యంత శక్తమంతుణ్ణి. నేను
గొప్ప ధీరులను కూడా ఓడించగలిగాను. నేను
మనుష్యులకు ఎంతో దగ్గరగా ఉన్నప్పుడు వారి మనస్సుల
లోనే ఉంటున్నప్పటికీ, వాళ్ళు నన్ను కనిపెట్టలేరు.
జ్ఞానవంతులైన వారికి కూడా నేనెక్కడి నుండి పుట్టుకు
వస్తున్నానో తెలియదు. నేను కొన్నిసార్లు వారిని నేరుగా
అటకాయిస్తాను. నన్ను కనిపెట్టాలని ప్రయత్నించినప్పుడు
ఎవ్వరూ ఊహించలేని క్రొత్త త్రోవలో నేను వారిని
పట్టుకుంటాను. వారికి ఏ మాత్రం తెలియకుండా, కరుణ,
జాలి, ప్రేమ మొదలైన ఇతర రూపాలను ధరించి వారికి
ఎదురుపడతాను. తర్వాత నెమ్మదిగా నా అసలు రూవాన్ని

బయట పెడతాను. కొందరు జ్ఞానులు ఆ రూపంలో కూడా
నన్ను కనిపెట్టగలుగుతారు. అప్పుడు నేను వారి
మనస్సులలో నుండి పూర్తిగా వెళ్ళిపోయినట్టు కనిపిస్తాను.
కానీ నేను వెళ్ళిపోయాననుకుని, వాళ్ళు అతి
విశ్వాసం(Over-Confidence)లతో అజాగ్రత్తగా వ్యవహరిస్తే
చాలు, నేను మళ్ళీ వారికి తెలియకుండా వారి మనస్సులలో
ప్రవేశిస్తాను. నాకు జాలి లేదు. నా బాధితులు పరిస్థితి
ఏమవుతుందని నేను లెక్క చేయను. అది నా పని కాదు.
నా పని వీలైనంత మందిని పొట్టనబెట్టుకుని, సజీవంగా
దహించి వెయ్యడమే! నేను రాక్షసుల వంశస్థుణ్జి. మా
దానవుల జాతిలో సంబంధ బాంధవ్యాలకు విలువ లేదు.
నేను మనుష్యుల మనస్సులలో ప్రవేశించినప్పుడు మొట్ట
మొదటిగా వారిని రాక్షసులుగా మార్చివేస్తాను. అన్ని
వావివరసలు మర్చిపోయి, నీచమైన పాపాలకు ఒడిగట్టేలా
చేస్తాను. నా వశంలో ఉన్న ఒక తండ్రి తన కూతురు పట్ల
తనకున్న సంబంధాన్ని కూడా మర్చిపోతాడు. మనుష్యుల
మనస్సులలో సందేహాన్ని, అనుమానాలను పుట్టిస్తాను;
కుటుంబాలను ముక్కచెక్కలు చేస్తాను. పూర్వం
మనుష్యులు భగవంతుణ్ణి మరింతగా నమ్మేవారు కాబట్టి
నా పూర్వీకులు అంత శక్తిమంతులుగా ఉండేవారు కాదు.
కానీ కలియుగంలో నాకు వేటాడడం చాలా సులభం
అయిపోయింది. ఈ రోజులలో దైవశక్తి మీద మనుష్యు
లకు ఏ మాత్రం నమ్మకం లేదు. మనుష్యులు భగవంతుడి
ఆశ్రయంలో రక్షణ పొందినప్పుడు నేను పూర్తిగా

నిస్సహాయుణ్ణి అయిపోయి, వారి దగ్గరికి ఏ మాత్రం
పోలేను. మనుష్యులకు బాగా తెలిసిన భగవన్నామం అనే
ఆయుధం నన్ను బలహీనుణ్ణిగానూ, శక్తిహీనుణ్జిగాను
చేసివేస్తుంది. నేను రావణుణ్జి భ్రమలో పడవేశాను.
అతడు నా జాతికి చెందినవాడే. చాలా పొగరుబోతు,
అధికారం చెలాయించేవాడు. అతడికొక గుణపాఠం
నేర్పాలని సీతాదేవిని చెరపట్టేలా అతణ్ణి ప్రేరేపించి అతణ్ణి
నాశనం చేశాను. మహాపురుషుడైన విశ్వామిత్రుణ్జి నేను
మైమరపించి మేనక యొక్క అందానికి సాగిలపడేలా
చేశాను. కానీ అతడు దృథఢసంకల్పం కలిగినవాడు.
నిజమైన ధీరుడు. చివరికి నేను ఓడిపోక తప్పలేదు.
ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్రుడయ్యాడు. నా మాయలో పడి
గొప్పగొప్ప రాజులు, మంత్రులు వారి రాజ్యాలనే
పోగొట్టుకున్నారు. వారి సుఖలాలసత్వం వారిని బలహీనులు
గానూ, నిర్లక్ష్యంతో వ్యవహరించేలాగానూ చేసి శత్రువుల
చేతిలో ఓడిపోయేలా చేసింది. దేవతలలో ఒకడైన ఇంద్రుణ్ణి
కూడా నేను నాశనం చేశాను. నా మాయలోపడి మహర్షి
గౌతముడి భార్య అయిన అహల్యపట్ల ఇంద్రుడు ఘోరమైన
అపచారం చేశాడు. శూర్చుణఖ రూపంలో ఎదురుపడి
శ్రీరామచంద్ర ప్రభువునే లొంగదీసుకోవాలని ప్రయత్నిం
చాను. కానీ రాముడు శూర్చుణఖ రూపంలో ఉన్న నన్ను
కనిపెట్టడంతో నా పరాజయాన్ని అంగీకరించక తప్పలేదు.
కానీ నా అల్లరివల్ల పాపం ఆ శూర్చణఖ కష్టాలపాలయింది.
గాఢతపస్సులో మునిగివున్న మహాశివుడి మనస్సును

ఆకర్షణలకులోను చెయ్యాలని చూశాను. కానీ ఆయన నా
ఉనికిని కనిపెట్టి తన మూడవ కన్ను అయిన జ్ఞాననేత్రాన్ని
తెరిచి నన్ను కాల్చి బూడిద చేశాడు. నాకు ఆయనను చూస్తే
మహాభయం. సాధారణంగా నా జాతివారిని నాశనం
చెయ్యడం నాకు ఇష్టముండదు. కానీ మహావిష్ణువు ఆదేశం
మేరకు, ఆయనే మోహినీ రూపాన్ని ధరించిన సందర్భంలో
నేను భన్మాసురుణ్ణి నాశనం చెయ్యవలసి వచ్చింది.

నేనొక మనిషి మనస్సును పట్టుకున్నప్పుడు అతణ్జి
గుడ్డివాణ్ణి చేసేస్తాను. అందుకే "ప్రేమ గుడ్డిది!" అని
నానుడి. నేను మనిషి మనస్సులో చేరినప్పుడు ఆ
కామాంధుడైన మనిషికి వికారమైన ముఖం కూడా గొప్ప
అందమైనదిగా కనిపిస్తుంది. నేనెక్కడకు వెళ్లినా
నాతోపాటు నా స్నేహితులు ఉంటారు; వారు నా శక్తిని
మరింతగా పెంచుతారు. నేను అగ్నిలాంటివాణ్ణి అయితే
వారు దాన్ని మరింత మండించే నెయ్యి, వెన్న
లాంటివారు. నా స్నేహితులు - కోపం, అసూయ,
లోభం, ద్వేషం, అహంకారం, భయం, మమత,
అనురాగం మొదలైనవారు.

నేరస్థులలో అధికభాగం నా బాధితులే. ఈ
ప్రపంచమంతా నా గుప్పెట్లో ఉంది. ఈ ప్రపంచం
భగవంతుడి సృష్టి అని, ఆయనే దీనిని పాలిస్తున్నాడని
నేను మర్చిపోయి, అహంకారంతో నేనే ఈ ప్రపంచాన్ని
సృష్టిస్తున్నానని, నేనే ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నానని
భావించినప్పుడు, భగవంతుడు మానవరూవాన్ని ధరించి

ఈ భూమి మీదకు అవతరిస్తాడు; నా అహంకారాన్ని
అణచివేసి అతడే పరిపాలిస్తున్నాడు కానీ, నేను కాదన్న
విషయాన్ని తెలిసేలా చేస్తాడు. ఆ పరమాత్మ అంటే నాకు
భయం. ఎంతవరకూ మనుష్యులు ఆయన బోధనలను
అనుసరిస్తూ, భక్తిని పెంపొందించుకుని ఆయననే
శరణువేడి ఉంటారో, అంతవరకూ నేను వారికి
దూరంగా ఉంటాను. ఎప్పుడైతే వాళ్ళు దేవుడి శక్తిని
మరచిపోయి ఆయన ఉనికినే అనుమానిస్తారో నేను నా
భువనసమ్మోహన రూపంలో కనిపించి వారి మీద
నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తాను. అందుకే యుగావతారుడైన
శ్రీరామకృష్ణులు, "ఓ సాధూ! సావధాన్‌! కామలోభాలపట్ల
అప్రమత్తుడవై ఉండు!" అని ప్రబోధించారు.



This content is captured from book -

యువతా!
లెండి! మేల్కోండి!
మీ శక్తిని తెలుసుకోండి !

ఆంగ్లమూలం :
స్వామి శ్రీకాంతానంద

అనువాదం :
అమిరపు నటరాజ

రామకృష్ణ మఠం
దోమలగూడ, హైదరాబాదు-500 029

Book page Number - 116

No comments:

Post a Comment