Tuesday, February 4, 2020

భీష్ముడి నీతి సూత్రాలు

1. "నదీ ప్రవాహం
ఓడ్డును కోసేస్తూ విస్తరించినట్టు
శత్రువుల్ని కూడా క్రమక్రమంగా
బలహీన పరచాలి.
దెబ్బ తెలియకూడదు -
గాయం మానకూడదు"

2. "ధర్మాల్లో కెల్లా
ఉత్తమ ధర్మం - నిజం చెప్పడం
పాపాల్లోకెల్లా మహాపాపం
అబద్ధాలాడటం"

3. "మృదువుగా మాట్లాడాలి.
మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి.
మృదువుగా హెచ్చరించాలి.
మృదుత్వాన్ని మించిన
పదునైన ఆయుధం లేదు."


4. "ఉన్నంతలో నలుగురికి పెట్టి తినేవాడు
ఇహంలోనూ పరంలోనూ
గౌరవం పొందుతాడు"

5. "సంపద - స్నేహ సంపద
రెండింట్లో దెన్ని ఎంచుకుంటారని
అడిగితే - స్నేహమే కావాలంటారు
విజ్ఞులు"

6. "జ్ఞానజ్యోతి చాలా గొప్పది.
మననులోని చీకట్లనూ
అది తొలగిస్తుంది."

7. "జీవితం నముద్రం
చంచలమైన ఇంద్రియాలే నీళ్లు ,
అరిషడ్వర్గాలే మొసళ్లు
ధైర్యమే తెప్ప"

8. "క్రోధమే మనిషి పతనానికి తొలి మెట్టు.
ఆ క్రోధం కారణంగానే
కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో
రావణుడు రాముడి చేతిలో
ఓడిపోయారు"

9. "దేశానికి మంచి జరిగినా - చెడు జరిగినా
అందుకు పాలకుడిదే పూర్తి బాధ్యత"

10. "అహింస - సత్యం - దయ
ఇంద్రియ నిగ్రహం
వీటిని మించిన తపస్సు లేదు"

11. "తీరని అప్పు - ఆరని నిప్పు
ఎప్పుడూ ప్రమాదమే"

12. "నాయకుడనే వాడు
ముఖస్తుతికి లొంగకూడదు
పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని
దూరంగా ఉంచాలి"

No comments:

Post a Comment