Friday, February 7, 2020

కల్మష నిష్కల్మష హృదయులు

🙏సానుకూలమే (positive thinking)
సర్వస్వం-1🙏

🥦మిమ్మల్ని గురించి మీరేమనుకుంటున్నారో మీరు అది కాదు. కానీ మిమ్మల్ని గురించి మీరెలా ఆలోచిస్తున్నారో అది మీరే.

🥦బాహ్య పరిస్దితుల్ని మీరు ప్రతి సారి నియంత్రించ లేరు. కానీ మీ సొంత ఆలోచనల్ని ఎప్పటి కప్పుడు నియంత్రించుకోగలరు.

🌹అందరూ సానుకూల
(positivethinking) దృక్పథంలో చేరండి. అందరూ నేస్తాలని తెలివిగా ఎంచుకోండి. మీ స్నేహాన్ని సమీక్షించండి .
🌹మీ స్నేహాలను కల్మష హృదయులు ,నిష్కల్మష హృదయలు ఉంటారు.

🌹కల్మష హృదయులు ఎల్ల వేళలా మాటల ద్వారా మీ మీద విషాన్ని వెళ్ళగక్కుతూ వుంటారు

🌹నిష్కల్మష హృదయులైన వారు సానుకూలంగా ఎల్ల వేళలా సహాయకారులుగా ఉంటారు

🌹వాళ్లు మీలో ఉత్తేజాన్ని నింపుతారు. వారి సమక్షం అందరికీ ఉల్లాసంగా ఉంటుంది.

🌹 కల్మష హృదయులు మిమ్మల్ని కూడా తమ విషయంలోకి రా లాగాలని నిరంతరం ప్రయత్నిస్తుంటారు.

🌹మీరు చేయలేని పనులను మీకు అసాధ్యమైన వాటిని చెబుతూ వాళ్లు అన్ని వేళలా మిమ్మల్ని భయపడుతూ ఉంటారు

🌹కల్మష హృదయులు మాటలు విన్న తర్వాత మీరు ఉసురు మంటారు .

🌹మిమ్మల్ని నిస్సత్తువ ఆవహిస్తుంది ఎందుకంటే వాళ్ళు మీ శక్తిని మీ శక్తిని హరించి వేస్తారు మాటలతో చేష్టలతో .

🌹కల్మష హృదయాలతో వారి ప్రతి కూల సందేశాలతో కాసేపు గడిపిన మీరు నీరు కారి పోవడం ఖాయం

🌹మరో వైపు
ఉత్సాహవంతులైన సానుకూల వ్యక్తులతో సమయాన్ని గడిపితే మీరు కొత్త శక్తిని పొందుతారు.

🌹మీ ఆరోగ్యానికి శ్రేయోదాయ కులు మంచి స్నేహితులు.

🌹నిష్కల్మష హృదయులైన సాంగత్యం పెంచుకునే కొద్ది మీరు మీ పట్ల మరింత సంతృప్తిని అనుభవిస్తారు

🌹మీ లక్ష్య సాధనకు కొత్త శక్తిని పుంజుకుంటారు ఇలా చేయడం వల్ల మీరు మరింత సానుకూల వ్యక్తిగా ఎదుగుతారు

🌹ఉత్సాహవంతులు అవుతారు .అందరూ మీ సమక్షం కోరుకుంటారు.

🌹సానుకూల వ్యక్తులతో సాంగత్యాన్ని పెంచుకోవడం ప్రతి కూల వ్యక్తులతో ప్రమేయాన్ని తగ్గించుకోవడం చాలా ప్రధానమైన విషయం.

Be always positive
and enjoy the life completely.Thank u*

No comments:

Post a Comment