నిలకడగా ఉండటం ఉత్తమ లక్షణం అయితే ఎగసెగసిపడటం నీచలక్షణమని పెద్దలమాట. మనిషి బతికినంతకాలం ఉత్తముడిగా ఉండాలి. ఉత్తమ గుణాలను పొందాలంటే అణకువ అవసరం. అడుగడుగునా చిత్తశుద్ధి, అణువణువునా శోధన ఉన్నప్పుడు అణకువ సాధ్యం. ఎగిరిపడేవాళ్లను ఎండుటాకులతో కవులు పోలుస్తారు. ఏమీ లేని వస్తువు ఎగిరెగిరి పడుతుంది. అది ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. అది నేలపై పడి ధూళిలో కలుస్తుందో, నిప్పులో పడి బూడిదగా మారుతుందో ఎవరు ఊహిస్తారు?
తేలికదనం, బరువు అనేవి కేవలం వస్తుగత ధర్మాలు మాత్రమే కాదు- మనిషి గుణగణాలను ప్రతిబింబించే విషయాలు కూడా! ‘అతడు తేలిపోయాడు’ అంటే గుణంలోను, అర్హతలోను, యోగ్యతలోను ఏ మాత్రం గొప్పగా నిలువలేకపోయాడని అర్థం. ‘అతడు గట్టివాడు’ అంటే అతడిలో నిలకడగా ఉండటానికి తగిన అర్హతలున్నాయని, ఉదాత్త గుణాలతో ధైర్యంగా నిలబడగలిగే సామర్థ్యం ఉన్నవాడని తెలిసిపోతుంది. ఏ మనిషిలోనైనా గుణాలు లోపిస్తేనే తేలికదనం ఏర్పడుతుంది. గుణరాహిత్యంవల్ల అందరి ముందూ చులకనైపోతాడు.
మనిషిలో అణకువ లోపించడానికి కారణం అహంకారం. పుష్కలంగా డబ్బు, తిరుగులేని అధికారం, అనుకూలించే కాలం ఉన్నప్పుడు మనిషి గర్వంతో విర్రవీగుతాడు. తనకు తిరుగులేదని భావిస్తాడు. డబ్బుతో అన్నింటినీ వశం చేసుకోవచ్చునని, అధికారంతో అందరినీ లొంగదీయవచ్చునని అనుకొంటాడు. అన్నీఉన్నా అహంకరించకుండా సామాన్యుల్లా ఉండేవాళ్లు లోకంలో అరుదుగా ఉంటారు. అత్యధికులు అధికార ధన మదోన్మత్తులై ఎవరినీ కన్నూమిన్నూకానక తిరస్కరించి, మానవత్వాన్ని విస్మరించేవాళ్లు కనిపిస్తారు. తమ గతాన్ని సైతం విస్మరిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచించరు. ఆత్మీయులను సైతం దూరం చేసుకొని, దుష్టులకు ఆశ్రయం ఇస్తారు. అన్నీ ఉండి అణకువతో ఉండేవాళ్లే గొప్పవాళ్లు.
ఫలపుష్పాలతో ఎంతో సుసంపన్నమై ఉండే చెట్లు వినమ్రంగా వంగి ఉంటాయని, నీటిభారంతో ఆకాశంలో ప్రయాణించే మేఘాలు పరుగులెత్తక నిదానంగా సాగుతాయని, సజ్జనులు తమకు ఎన్ని సంపదలున్నా, ఎంత అధికారం ఉన్నా అణగిమణగి ఉంటారని భర్తృహరి తన నీతిశతకంలో అంటాడు. అణకువ గొప్ప గుణం. దాన్ని మనిషి అలవాటు చేసుకోవాలని ఉపదేశసారం.
మనిషి తన జీవితంలోని అన్ని దశల్లోనూ అణకువతో ఉంటేనే అన్నింటినీ సునాయాసంగా సాధించుకుంటాడు. విద్యార్థి దశలో గురువుల దగ్గర వినయంతో అణకువ కలిగి ఉంటేనేకదా విద్యను సాధించగలుగుతాడు? యౌవనంలో, వృత్తుల్లో, ఉద్యోగాల్లోను అణకువ అనేది అనేక లాభాలను ప్రసాదిస్తుంది. వార్థక్యంలోనూ తొందరపాటు లేకపోవడంవల్లనే ఆయురారోగ్యాలు, ప్రశాంతత సాధ్యం.
అణకువ అనేది మనిషికి గొప్ప వరంలా ఎన్నో లాభాలకు మూలం అవుతుంది. అణకువ లేక, వరగర్వంతో విర్రవీగిన రాక్షసులు ఎలా నశించారో పురాణేతిహాసాలు చెబుతాయి. అణకువ లోపించడంవల్ల విశ్వామిత్రుడి వంటి రాజర్షి సైతం ఎలా అవమానాలకు గురయ్యాడో ప్రాచీన గాథలు వెల్లడిస్తాయి.
మనిషిపై నమ్మకాన్ని పెంచేది అణకువే. జీవితంలో ఆటుపోట్లు సహజం. ఉత్థానపతనాలు సర్వసామాన్యం. సుఖదుఃఖాలు మానవనైజాలు. అయితే ఎన్ని తుపాన్లు వచ్చినా చెక్కు చెదరకుండా నిలిచేది తీరంలోని గడ్డిపోచ. అణకువ దానికి మూలం!
🕉🌞🌎🏵🌼🚩

No comments:
Post a Comment