జన్మ పరంపర:-
శక్తి (Energy), చైతన్యం (conscious), జ్ఞానం (knowledge) ఈ మూడింటి యొక్క కలయిక రూపమే 'ఆత్మ' అంటే.
ఈ ఆత్మ యొక్క లక్ష్యం భౌతిక శరీరంలో ఉండి, అన్ని పాత్రలు ధరించి, ప్రతి ఒక్క పాఠము స్వానుభవముతో నేర్చుకొని 'పరిపూర్ణం' చెందటమే. భూమి అనేది ఒక తరగతి అనుకుంటే ఆ తరగతిలోని అన్ని పాఠాలు నేర్చుకొననిదే తరువాత తరగతికి ఎలా వెళ్ళమో, అలాగే ఈ (భూమి) తరగతిలోని అన్ని పాఠాలు నేర్చుకొననిదే పై తరగతులకు వెళ్ళలేము. భూమి అనే ఈ తరగతిలో ముఖ్యంగా 4 దశలున్నాయి. 'ఆత్మ వృద్ధి' చెందుతూంటే ఒక్కో దశ దాటుకుంటూ వెళ్ళవచ్చు. ఆత్మ వృద్ధి అంటే శక్తి, చైతన్యం, జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉండటమే. ఈ మూడు ఒకే స్థాయిలో వృద్ధి చెందును. అనగా జ్ఞానం ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నది అంటే చైతన్యం, శక్తి అదే స్థాయిలో వృద్ధి చెందును.
మొదటి దశ - ఖనిజాల దశ:-
'కదలకుండా ఉంది' అని మనం అనుకునే పదార్థాల అణువుల్లోను శక్తి, చైతన్యం, జ్ఞానం అనే ఈ మూడు ఉంటాయి. కాకపోతే చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ దశ పరిపూర్ణం అయ్యేవరకు కొన్ని జన్మలు తీసుకోవాల్సిందే.
రెండవ దశ - వృక్షాల దశ:-
ఖనిజాల కన్నా వీటిలో శక్తి చైతన్యం, జ్ఞానం కొద్దిగా వృద్ధి చెంది ఉంటాయి. ఈ దశలోని అన్ని పాఠాలు నేర్చుకొని పరిపూర్ణం అయినచో తరువాత దశకు చేరును. ఆత్మ, వీటిలోనూ కొన్ని జన్మలు ఎత్తవలసినదే.
మూడవ దశ - జంతువుల దశ:-
ఈ దశలో ఆత్మ బాగా వృద్ధి చెంది యుండును. ఈ దశ కూడా పరిపూర్ణం అయ్యే వరకు కొన్ని వందల లేక వేల జన్మలు ఎత్తాల్సిందే.
అంతిమ దశ - మానవ జన్మ:-
భూమి అనే తరగతిలో అంతిమ దశ మానవ జన్మే. అనగా భూమి అనే ఈ పాఠశాలకు, మానవ జన్మలోనే మోక్షం కలుగును.
ఒకసారి పై దశలోకి ప్రవేశించిన ఆత్మ తిరిగి క్రింద దశలోకి వెళ్ళడం జరగదు. (కొన్ని అసాధారణమైన సంఘటనలలో తప్ప)
మానవ జన్మ పరంపర:-
ఎన్నో జన్మల తర్వాత ఆత్మ మానవ జన్మలోకి ప్రవేశించును. ఈ మానవ జన్మలోను ఆత్మ ఎన్నో వందల జన్మలు ఎత్తవలసినదే. ఇక్కడి పాఠాలు నేర్చుకొని, పరిపూర్ణం అయ్యేవరకు.
మానవజన్మలోని కొన్ని ముఖ్యమైన దశలు
1. తమో గుణం:-
మొట్ట మొదటి జన్మల్లో మానవుడు కేవలం శరీరం కోసమే జీవిస్తూ వుంటాడు. వీరికి తినడం, తాగడం, పడుకోవడం, మైధునం, పెళ్ళి, పిల్లలు వంటి సుఖాలను మాత్రమే కోరుకుంటారు. వీరికి బద్ధకం, కామం ఎక్కువ. వీరికి కష్టాలు వస్తే ఆర్తనాదాలు చేస్తారు. వీరు ప్రధానంగా భౌతిక పరమైన సుఖాలను మాత్రమే కోరుకుంటారు. ఈ విధంగా కొన్ని జన్మలు ఎత్తుతారు.
2. రజోగుణం:-
తమోగుణంలో పరిపూర్ణం చెందిన ఆత్మ రజోగుణంలో ప్రవేశిస్తుంది. రజోగుణంలో ప్రవేశించిన ఆత్మ అంతులేని సుఖాలను కోరుతుంది. ఈ దశలో గర్వం మరియు అధికార కాంక్ష ఎక్కువ. వీరు కీర్తికాముకులు. ఎంతటి అధర్మానికైనా వీరు తెగిస్తారు. ప్రధానంగా మానసిక పరమైన సుఖాలను వీరు కోరతారు. ఈ విధంగా కొన్ని జన్మలు ఎత్తుతాడు.
3. సాత్విక గుణం:-
వీరు బుద్ధిపరమైన సుఖాలు కోరతారు. తమోగుణంలోనూ, రజోగుణంలోనూ ఎన్నో బాధలు, కష్టాలు అనుభవించిన ఆత్మ "ఇక బాధలు అనుభవించకుండా ఉండాలి అంటే నేను ఏం చెయ్యాలి ఇప్పుడు?", "ఆనందంగా వుండాలి అంటే ఏం చేయాలి?" అని ఆలోచించడం ప్రారంభిస్తుంది. అక్కడి నుండి జ్ఞానం మెల్లిగా అంకురిస్తుంది. ఇచ్చట నుండి మొదలవుతుంది. ప్రతి మనిషికీ "యోగ పరంపర". సత్యం అంటే ఏమిటి? అనే అన్వేషణ తో మొదలవుతుంది, ఈ యోగ పరంపర.
యోగ పరంపర దశలు:-
కర్మయోగం - 1
జ్ఞాన యోగం - 1
రాజయోగం
జ్ఞానయోగం -2
కర్మయోగం -2
సాత్విక గుణంలో ప్రవేశించిన ఆత్మ, యోగపరంపరలోని ఒక్కో దశ దాటుకుంటు ముందుకు వెళ్లును.
1) కర్మయోగం-1:- ఇందులో 4 దశలున్నాయి.
స్టేజ్-1: 'మంచి చెయ్యకపోతే చెయ్యక పోయావు - చెడు మాత్రం చేయకు', తోటి ప్రాణిని కష్టపెట్టకు, చంపకు అని చెప్పడం, తాను ఆచరించడం.
స్టేజ్ - 2: 'తోటి ప్రాణికి సహాయం చెయ్యడం. నువ్వు ఇతరులకు ఎంత మంచి చేస్తే నీకు అంత మంచి జరుగుతుంది' అని అనుకోవడం. ఈవిధంగా ఇతరులకు ఉపకారం చేస్తారు. ఫలితాలను ఆశిస్తారు.
స్టేజ్ - 3: 'మంచి కర్మలు చేస్తుంటారు'. అయితే ఫలితాలను ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకోరు.
స్టేజ్ - 4: కర్తృత్వ భావన లేకుండా., అంటే 'నేను' అనేది లేకుండా కర్మలు చేస్తూ వుంటారు.
కర్మయోగం - 1 పూర్తి అయిన తర్వాత జ్ఞానయోగం - 1 లోకి ప్రవేశిస్తారు. పై దశలు పూర్తి దాటడానికి కొన్ని జన్మలు
పట్టవచ్చును.
2) జ్ఞాన యోగం - 1:- దీనిలో 4 దశలున్నాయి.
ఎ) శ్రవణం: బాగా వినే దశ. ఎక్కడ మంచి చెప్తున్నారో, అక్కడికి వెళ్ళి వింటారు. పురాణాలు, వేదాంతాలు చెప్తున్నా వెళ్ళి వింటారు. గీతా యజ్ఞాలు హాజరవుతారు. గురువులు, మహాత్ములను కలిసి వారు అందించే జ్ఞానాన్ని వింటారు. విని అక్కడికక్కడే మర్చిపోతారు.
బి) మననం: వినిన దానిని మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొని ఆలోచించటాన్నే మననం అంటారు. కానీ వీరు సాధన చేయరు.
సి) నిధి ధ్యాసన: తాను విన్న దానిని జీవితంలో అభ్యాసం చెయ్యటం మొదలుపెడతాడు. సాధనలో నిమగ్న మవుతాడు.
డి) సాక్షాత్కారం : మీ జీవితానికి మీరే సాక్షిగా అయిపోవడం. అంటే కలిమిలేములలో, జయాపజయాల్లో, చీకటి వెలుగుల్లో, కష్టసుఖాల్లో, జరా మరణాల్లో అన్నింటిలోనూ వీరు 'సాక్షి'గా ఉంటారు. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చచ్చిపోయేవాళ్ళు చస్తూంటారు. పెళ్లిళ్లు జరుగుతుంటాయి, పిల్లలు పుడుతుంటారు. కాని వీరు మాత్రం జ్ఞానంలో సాక్షీభూతమైపోతారు. అదే సాక్షాత్కారం.
పై అన్ని దశలు దాటడానికి కొన్ని వందల జన్మలు తీసుకోవచ్చు లేకపోతే ఒకటే జన్మలో పూర్తి చేసుకోవచ్చు.
3) రాజయోగం : దీనినే 'ధ్యానయోగం' అని పిలుస్తారు. దీనిలోనూ 4 దశలు కలవు. ఈ దశలు మొత్తం బయటి ప్రపంచంతో నిమిత్తం లేకుండా అంతర్ ప్రపంచంలోనే జరుగుతాయి.
ఎ) శ్వాస మీద ధ్యాస: ఈ దశలో ప్రతిరోజు కొంత సమయం సుఖాసనంలో కూర్చుని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతారు.
బి) ఆలోచనా రహిత స్థితి : పై విధంగా కొన్ని రోజులు గడిపినచో మనస్సులోని ఆలోచనలు దూరమయ్యి మైండ్ ఖాళీ అవుతుంది. ఈ స్థితినే ఆలోచనారహిత స్థితి అని అంటారు.
సి) నాడీ మండల శుద్ధి : ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు మనలోకి అపారమైన ప్రాణశక్తి ప్రవహించును. ఇది శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఇది శరీరాన్ని శుభ్రపరిచేటప్పుడు రకరకాల నొప్పులు వస్తుంటాయి. లోపల ఎన్నో మెలికలు తిరుగుతుంది, వేడి లేక చలి లోపల కలగవచ్చు. వీటన్నింటిని 'నాడీమండల శుద్ది' అని అంటారు.
డి) దివ్య చక్షువు యొక్క ఆవిర్భావం : నాడీ మండల శుద్ధిలో కలిగే నొప్పులనూ, బాధలనూ భరిస్తూ ముందుకుపోతూ ఉంటే అప్పుడు మన 'మూడో కన్ను' ఒకటి ఉదయిస్తుంది - మన ఫాల భాగాన. రకరకాల ప్రదేశాలు, కొండలు, కోనలూ, లోయలు, జలపాతాలు, సముద్రాలు, ప్రకృతిలోని అద్భుతమైన దృశ్యాలు మరియు ఎన్నో విచిత్రాలు చూడడం సంభవిస్తుంది. దీనినే 'దివ్యచక్షువు' యొక్క ఆవిర్భావం అని అంటారు.
పై దశలు అన్ని కూడా దాటడానికి కొన్ని జన్మలు లేదా కొన్ని రోజులలోనే దాటవచ్చు.
4) జ్ఞాన యోగం - 2 : దివ్య చక్షువు పరిపక్వం చెందిన తర్వాత జ్ఞానయోగం రెండవ భాగంలోకి ప్రవేశిస్తాం. క్రింది దశలు మొత్తం కూడా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అంతర్ ప్రపంచంలోనే జరుగును.
దీనిలోను 4 దశలు కలవు.
ఎ) శ్రవణం 2 : ఇంతకు ముందు మనం భౌతిక కాయంలో ఉండి ప్రవచనాలు విన్నాం. ఇప్పుడు ఆత్మకాయంతో, అంటే ధ్యానంలోని మన దివ్యచక్షువు ద్వారా మహాత్ములు మరియు గురువుల ప్రవచనాలు వింటాము. ధ్యానం నుండి బయటికి వచ్చిన తర్వాత మర్చిపోతాం.
బి) మననం 2 : ధ్యానంలో మన దివ్యచక్షువు ద్వారా ఏదైతే మనం వింటామో, దానిని ధ్యానం నుండి బయటికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. దీనినే 'మననం' అని పిలుస్తారు.
సి) నిధి ధ్యాసన 2 : ధ్యానంలో మనం ఏదైతే మహాత్ముల ద్వారా వింటామో, దానిని నిజ జీవితంలో ఆచరించడం.
డి) సాక్షాత్కారం 2 : కేవలం మన దేహ యాత్రలకే కాదు, ఆత్మ యాత్రలన్నింటికి కూడా సాక్షీతత్త్వం వస్తుంది. ప్రతి విషయంలోనూ సాక్షిగా నిలుస్తారు.
సాధన తీవ్రంగా చేస్తే, పై అన్ని దశలు రోజులలోనే దాటవచ్చు.
5) కర్మయోగం - 2 : ఈ దశలో, తనకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందికి చెప్పి వాళ్ళచే సాధన చేయిస్తారు. "నువ్వు శరీరం కాదు, ఆత్మవని తెలుసుకో అని; ప్రతి మనిషికి బోధించడమే కాక వారందరిని ధ్యానంలో కూర్చోబెట్టడమే.. కర్మయోగం - 2వ భాగం.
ఈ విధంగా అన్ని దశలను దాటిన అంశాత్మ, పూర్ణాత్మ అవుతుంది. అనగా భూమి అనే ఈ తరగతిలోని అన్ని పాఠాలలో పరిపూర్ణం చెందుతుంది. ఉదా: శ్రీ కృష్ణుడు, గౌతమ బుద్ధుడు మరియు ఎంతో మంది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు 'ఉద్దరేదాత్మానాత్మానం' అని అన్నారు. అనగా ఎవరిని వారే ఉద్దరించుకోవాలి అని అర్ధం. ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు సూచన ఇవ్వగలదు, కానీ తన ఆత్మ శక్తిని ప్రసాదించలేదు. ఎవరి ఆత్మ శక్తిని వారే పెంపొందించుకోవాలి. చెప్పటమే వారి ధర్మం, ఆచరించడం మన కర్తవ్యం. మానవ జన్మలోని ఒక్కొక్క దశ దాటడానికి కొన్ని వందల జన్మల తీసుకోవచ్చు, లేకపోతే ఒకటే జన్మలో పూర్తి చేసుకోవచ్చు - అన్ని దశలు కూడా ఇంతే. ఇది వాళ్ళ వాళ్ళ శక్తియుక్తులు, సాధన మీద ఆధారపడి ఉంటుంది.

No comments:
Post a Comment